Tuesday, September 7, 2021

 కరణీకము - 6 


అక్కన్న మాదన్న సోదరులు 


                   వంశపారంపర్య కరణీకాలు రద్దు కాకముందు గ్రామ కరణాలుగా  పనిచేసిన వారిలో నియోగులలోని  మరొక శాఖ గోల్కొండ వ్యాపారులు అనే పేరుతో ప్రసిద్ధులు. ఈ భాగంలో మనం ఆ శాఖకు చెందిన అక్కన్న మాదన్నల  వివరాలు తెలుసుకుందాం. సాధారణ కరణములుగానే జీవనం ప్రారంభించినప్పటికీ,  గోల్కొండ కుతుబ్ షాహి ప్రభువులు పాలించిన కాలంలో ఉన్నత రాజోద్యోగులుగా ఒక వెలుగు వెలిగిన అక్కన్న, మాదన్న సోదరుల   అజరామరమైన చరిత్రకు నేటికీ నిలిచివున్న వారు కట్టించిన  నిర్మాణాలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ పాత నగరంతో కాస్తో కూస్తో పరిచయం ఉన్నవారికి శాలిబండ ( షా ఆలీ బండ) సమీపంలోని హరి బౌలి బంగారు మైసమ్మ (మహంకాళి)  ఆలయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. జంటనగరాలలో ఏటా  ఆషాఢమాసంలో వైభవంగా జరిగే బోనాల పండుగ సందర్భంగా సుప్రసిద్ధమైన  ‘ఘటం ఊరేగింపు’  ప్రారంభం అయ్యేది అక్కడినుంచే. డెబ్భై ఏళ్ల క్రితం వరకూ ఒక పెద్ద మట్టిదిబ్బ కింద పూడిపోయి ఉన్న ఈ ఆలయాన్ని పరిశోధకులు అప్పుడే  కనుగొని వెలుగులోకి తెచ్చారు. క్రీ.శ. 17 వ శతాబ్దిలో దీనిని నిర్మించిన ఆ సోదరుల పేరుమీదుగానే  నేటికీ దీనిని అక్కన్న మాదన్నల  ఆలయం అనే స్థానికులు వ్యవహరిస్తున్నారు. బోనాల పండుగ సందర్భంగా జరిగే ఘటం ఊరేగింపును   అక్కన్న మాదన్నల ఆలయంలోని ఘటాన్ని  అగ్రభాగంలో ఒక ఏనుగు అంబారీ మీద నిలిపి, అటూ ఇటూ గుర్రాలమీద పూన్చిన అక్కన్న మాదన్నల బొమ్మలు వెంటరాగా  వైభవోపేతంగా నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా  సాగే ఘటం ఊరేగింపు నయా పుల్ వద్ద మూసీ నది నీటిలో ఘటాన్ని నిమజ్జనం చేయడంతో ముగుస్తుంది. 1998 లో కొందరు ముష్కరులు విచక్షణారహితంగా చేసిన దాడిలో ఈ  హరిబౌలి  ఆలయంలో కొంతభాగం దెబ్బతిన్నది. ఒకప్పుడు ఈ  అక్కన్న మాదన్న సోదరులకు విజయవాడ ప్రాంతంలోనూ మంచి ప్రఖ్యాతి  ఉండేది. విజయవాడ ప్రాంతంలో ఇంద్రకీలాద్రి, మొగల్రాజు పురం  తదితర పర్వతాలలో అతి ప్రాచీనకాలంలో తొలిచిన గుహాలయాలు, సమీపంలోని గుంటూరు జిల్లా  ఉండవల్లి గుహాలయాలు సుప్రసిద్దాలు. కనకదుర్గ ఆలయం ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంలో క్రీ. పూ. రెండవ శతాబ్దిలో తొలిచిన ఒక గుహాలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలున్నాయి. ఆ పర్వతపాదంలోని   కొన్ని గుహలు క్రీ. శ. 6, 7 శతాబ్దాలలో తొలిచినట్టివి. అలాంటి ఒక గుహలో 

క్రీ. శ. 17 వ శతాబ్దంలో అక్కన్న మాదన్న సోదరులు నిర్మించినదిగా ప్రసిద్ధమైన ఒక ఆలయం ఉంది. కొందరు ఆ గుహ విష్ణుకుండిన వంశ పాలకులు  తొలిపించగా,  ఆలయం మాత్రం  అక్కన్న మాదన్నలచేత తరువాత కాలంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. కొందరేమో ఆ సోదరులు ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయం సందర్శించిన సందర్భాలలో అక్కడే అధికారులతో  కచేరీ నిర్వహిస్తూ ఉండే  కారణంగా అక్కడి గుహలు అన్నిటినీ అక్కన్న మాదన్న గుహలు అంటున్నారనీ,  వాస్తవానికి అవన్నీ విష్ణుకుండినుల నిర్మాణాలేననీ  భావిస్తున్నారు. 


                     ఇక ఆ సంగతి అలా ఉంచి, అసలీ అక్కన్న మాదన్నలు ఎవరో చూద్దాం. కరణీకం వృత్తిగా కలిగిన కొందరు నియోగులు ‘ ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్ర’మన్నట్లు  రాజోద్యోగాలలో - మంత్రులు, సేనానులు, దుర్గాధ్యక్షులు, దుబాసీలు గా - కూడా నియమించబడటం మనకి తెలుసు. మహామంత్రి తిమ్మరుసు, మరాఠా సేనాని హరి పంత్, ఝాన్సీ లక్ష్మీబాయి తండ్రి మోరోపంత్ తాంబే మొదలైన వారిని గురించి మనం ముందే తెలుసుకున్నాం. మహారాష్ట్ర మూలాలు కలిగిన నియోగి బ్రాహ్మణులలో కొందరిని గోల్కొండ వ్యాపారులు అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. వీరిలో ముందుగా చెప్పుకోవలసినది పింగళి మాదన్న, అక్కన్న సోదరుల గురించే. వీరిది భారద్వాజ గోత్రం. ఆ కారణంగా గౌతమ గోత్రుడు అయినట్టి  ‘ కళా పూర్ణోదయము’ 


కావ్యకర్త పింగళి సూరనకూ వీరికీ ఎలాంటి సంబంధమూ లేదు. గోల్కొండ వ్యాపారులు ఋగ్వేదులు. ఐదు బహమనీ రాజ్యాలలో ఒకటైన  గోల్కొండను కుతుబ్ షాహీ వంశస్థులు పాలించారనే విషయం అందరికీ తెలిసినదే. గోల్కొండ నవాబులలో తానీషా (లేక తానాషా) అనే మరోపేరు కలిగిన అబుల్ హసన్ కుతుబ్ షా ( క్రీ. శ. 1658 - 1687 ) చిట్టచివరి వాడు. తానాషా అంటే మంచిరాజు అని అర్థం. ఆ తానీషా కొలువులో మాదన్న ముఖ్యమంత్రిగానూ, అక్కన్న సేనాధిపతిగానూ పనిచేశారు. తానీషా ఇస్లాం మతంలోని షియా తెగకు సంబంధించినవాడు. అందుకే ఆయనలో పరమత సహనం ఎక్కువ. హిందూ ముస్లింలను సమభావంతో చూస్తూ హిందువులకు కూడా ముస్లిం లతో పాటు ఉన్నత పదవులిచ్చి గౌరవించాడు. హిందూ ఆలయాలకు కూడా భూరి విరాళాలు ఇచ్చేవాడు. చిన్న ఉద్యోగులుగా తన కొలువులో చేరిన అక్కన్న మాదన్నలకు వారి సేవలకు మెచ్చి తానీషా పెద్ద పదవులిచ్చి గౌరవించాడు. వారు కూడా సమయానుకూలంగా వ్యవహరిస్తూ, నవాబు మనసు గెలుచుకోవటమే కాక, అవసరమైన సందర్భాలలో రాజనీతితోపాటు కౌటిల్యాన్నీప్రదర్శిస్తూ ఒక్కొక్క మెట్టూ క్రమంగా ఎగబాకుతూ అంతటి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. 


            అందరూ అనుకునే విధంగా అక్కన్న కు  మాదన్న  స్వంత తమ్ముడు కాదు. ముఖ్యమంత్రిగా పనిచేసిన పింగళి మాదన్నకు, గోల్కొండ రాజ్యపు  సేనాధిపతిగా  పనిచేసిన అక్కన్న తన తల్లి తరఫు దూరపు బంధువు. వారిద్దరూ  వరుసకు అక్కచెల్లెళ్ళ పిల్లలట. అయినా వారిద్దరూ స్వంత అన్నదమ్ములలాగే కలిసి మెలిసి ఉండేవారు. వయస్సులో తనకన్నా పెద్దవాడు కనుక  అక్కన్నగారిని మాదన్నగారు  ‘ అన్నగారూ ! ‘ అని సంబోధించేవారట. ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరూ కలిసే తీసుకునేవారట. ప్రజలు కూడా వారిరువురినీ వేరువేరని  కాక, ఒక్కటిగానే భావించి ‘ అక్కన్న మాదన్నలు’ అంటూ వ్యవహరించేవారట. చెన్న పట్టణం ( మదరాసు) లోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా  అవసరమైన సందర్భాలలో ‘అక్కన్న మాదన్న గార్లకు’ అంటూ ఇరువురినీ ఒకటిగానే సంబోధిస్తూ లేఖలు రాయడం చూస్తే వారిరువురూ ఎంత ఏకగ్రీవంగా పనిచేసేవారో గ్రహించగలం. అప్పట్లో కుంఫిణీ (కంపెనీ) వారి  చెన్నపట్టణం ఫాక్టరీ, ఓడ రేవు గోల్కొండ నవాబు రాజ్యంలో  అంతర్భాగంగానే ఉండేవి. నవాబు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే ఇంగ్లిష్ వారు అక్కడ సరకుల ఎగుమతి దిగుమతుల వంటి నౌకా వాణిజ్య  కార్యకలాపాలు నిర్వహించుకునేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఎప్పటికప్పుడు తమ కార్యకలాపాలను అక్కన్న మాదన్నలకు లేఖలద్వారా నివేదించేవారు. ఇందుకోసం వారు కంపెనీ ప్రతినిధిగా గోలకొండలో ఈ సోదరులకు అనుకూలుడైన వీరరాఘవులు అనే తెలుగు కరణాన్ని గుమాస్తాగా నియమించి, అతని ద్వారా అక్కన్న మాదన్నలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ వారితో సత్సంబంధాలు నెరపుతూ ఉండేవారట. వీరరాఘవులు అటు కంపెనీ వారికి, ఇటు అక్కన్న మాదన్నలకూ అప్పట్లో రాసిన లేఖల కారణంగా నాటి చారిత్రక విశేషాలతో పాటు, అక్కన్న మాదన్నల గురించిన పలు విశేషాలు మనకు తెలుస్తున్నాయి. 


                     గోల్కొండ నవాబు తానీషాకూ,  మరాఠా సార్వభౌముడైన శివాజీకీ  ఉమ్మడి శత్రువైన ఢిల్లీ మొఘల్ పాదుషా ఔరంగజేబ్ నుంచి  గోల్కొండ రాజ్యానికి ప్రమాదం పొంచివున్నదని ముందుగానే గ్రహించిన గోల్కొండ ముఖ్యమంత్రి మాదన్న పంతులు ప్రత్యేకమైన చొరవ ప్రదర్శించి శివాజీకి, తానీషాకూ  మైత్రి కుదిర్చాడు. క్రీ. శ. 1674 లో పట్టాభిషిక్తుడు అయ్యాక  శివాజీ కర్ణాటక, ద్రావిడ దేశాలపై దండయాత్రకు వెళ్ళే సమయంలో ఆయన్ని  మాదన్న గోల్కొండ కోటకు తన అతిథిగా ఆహ్వానించాడు. అప్పుడు గోల్కొండ కోటలో 


శివాజీకి మాదన్న, మాదన్నకు శివాజీ విందులిచ్చుకున్నారని ‘ శివ దిగ్విజయము’ అనే గ్రంథం పేర్కొంది. క్రీ. శ. 1680 లో శివాజీ మరణించిన తరువాత ఆయన కుమారుడు శంభాజీకి, 

తానీషాకూ మైత్రి కుదర్చటంలోనూ, వారిరువురినీ ఔరంగజేబ్ పైకి దాడికి ప్రేరేపించటంలోనూ మంత్రి మాదన్న నిర్వర్తించిన పాత్ర ప్రశంసాపాత్రం. ‘మన శత్రువుకు శత్రువు ఎల్లప్పుడూ  

మనకు మిత్రుడే’ అనే ప్రాథమిక సూత్రం మీదనే ఈ విషయంలో మాదన్న మంత్రి రాజనీతి ఆధారపడింది.  తనకు వ్యతిరేకంగా శంభాజీ గోల్కొండ నవాబుతో మైత్రి కుదుర్చుకోవటం రుచించని ఔరంగజేబ్ 1685 జూలైలో తన కుమారుడు ముఅజ్జం నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని గోల్కొండ రాజ్యం మీదికి దండయాత్రకు పంపాడు. మొఘల్ సైన్యం గోల్కొండ కోటను పట్టుకునే ప్రయత్నం చెయ్యకుండా ముందుగా హైదరాబాద్ నగరాన్ని దోచుకున్నారు. ఆ దోపిడీలో లభించిన సంపదతో మరింతగా సైన్యాన్ని, ఆయుధాలనూ సమకూర్చుకుని గోల్కొండ కోటపై దాడికి సిద్ధం కాసాగాడు ముఅజ్జం. మాదన్న మంత్రి ముందుచూపుతో మేల్కొనటం వల్ల  ముఅజ్జంతో తానీషా సంధిచేసుకున్న కారణంగా గోల్కొండ రాజ్యానికి అప్పటికి పెను ప్రమాదం తప్పింది. తాము యుద్ధానికి సిద్ధంగా లేని సమయంలో ఊహించని రీతిలో ముంచుకు వచ్చిన మొఘల్ దండయాత్ర ప్రమాదం ఆ సంధి షరతుల ప్రకారం గోల్కొండ నవాబు సాధారణ కప్పం కాక అదనంగా కోటి ఇరవై లక్షల రూపాయలు చెల్లించి మొఘల్ సార్వభౌమత్వాన్ని గుర్తించటంతో తాత్కాలికంగా నివారించబడింది. కానీ సంధి షరతుల ప్రకారం చెల్లించిన కప్పం ఔరంగజేబ్ కి ఎంతమాత్రం తృప్తి కలిగించలేదు. గోల్కొండ రాజ్యపు సంపద గురించి - ముఖ్యంగా అక్కడి వజ్రవైడూర్యాలను  గురించి వినివున్న ఔరంగజేబ్ గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో కలిపేసుకోవాలని ఉబలాటపడ్డాడు. అపారమైన సంపద దోచుకోవాలంటే గోల్కొండనే కొల్లగొట్టాలని భావించాడు ఔరంగజేబు. ‘కొడితే గోల్కొండనే కొట్టాలి అనే నానుడి’  అప్పటికే సుప్రసిద్ధం. అందుకే  మొఘల్ సైన్యం 1687 ఫిబ్రవరిలో మరొకసారి గోల్కొండపై పెద్దఎత్తున దాడి చేసింది. సంధి చేసుకున్న తరువాత లభించిన ఏడాదిన్నర విరామ కాలంలో అక్కన్న మాదన్నలు గోల్కొండ కోటను పటిష్టపరిచే కార్యక్రమం పెద్దఎత్తున చేపట్టారు. అందుకే ఆ రెండవ దాడి ఎనిమిది నెలల పాటు సాగినా కోటను పట్టుకోవటం ఔరంగజేబు వల్ల కాలేదు. మాదన్న యుక్తులు, ఎత్తుగడలు, అక్కన్న యుద్ధ వ్యూహనైపుణ్యం, అబ్దుల్ రజాక్ లారీ వంటి స్వామిభక్తిపరులైన వీర సైనికుల శౌర్య ప్రతాపాల కారణంగా కోట శత్రు సైన్యానికి అంతకాలం పాటు వశం కాలేదు. దానికితోడు దండయాత్ర కాలంలో మొఘల్ సైన్యాలు  తీవ్ర ఆహార  కొరతను ఎదుర్కొన్నాయి. మరోపక్క కుంభవృష్టిగా కురిసిన వానలు మొఘల్ సైన్యాన్ని చీకాకు పెట్టాయి. వానలు తగ్గుముఖం పట్టాక ఔరంగజేబు తిరిగి దాడులు ముమ్మరం చేశాడు. ఈసారి కుట్రలకూ, మోసానికీ తెగబడింది మొఘల్ సైన్యం. అగ్నికి ఆజ్యం పోసినట్లు గోల్కొండ కోటలోని కొందరు సైనికాధికారులు శత్రు పక్షానికి సహకరించారు. ఆ విద్రోహకర పరిస్థితి ఏర్పడటానికి దారితీసిన కారణాలు తెలుసుకోవాలంటే గత చరిత్ర కొంత తెలుసుకోవాలి. 


                           తన సేవలతో, పరాక్రమంతో అంతకుముందు సాధారణ ‘ఫౌజ్ దారు’  స్థాయి  చిన్న సైనికోద్యోగిగా పనిచేస్తున్న అక్కన్న  క్రమంగా తానీషాకు దగ్గరయ్యాడు. తానీషాకు అక్కన్న శక్తిసామర్థ్యాలు, నిజాయతీపై నమ్మకం కుదిరింది. అందుకే ఆయన గతంలో తన దగ్గర సేనానిగా పనిచేస్తుండిన మహమ్మద్ ఇబ్రాహీం అనేవాడిని క్రీ.శ. 1682 లో తొలగించి, ఆ స్థానంలో  అక్కన్నను గోల్కొండ రాజ్యానికి  ‘షాహ లష్కర్ ‘ (సేనాధిపతి) గా నియమించాడు. ఇక అక్కడినుంచి సైన్యంలోని ముస్లిం వర్గాలలో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. అదనుచూసుకుని  సైన్యంలోని సున్నీ వర్గీయులు ( దాడి చేసిన ఔరంగజేబ్ కూడా సున్నీ 


అయిన కారణంగా ) శత్రు పక్షంలో చేరిపోయారు. ఒక ముస్లిం ప్రభువు దగ్గర హిందూ ఉద్యోగులైన అక్కన్న మాదన్నలు ప్రాపకం సంపాదించటమే కాక తమ గోల్కొండ ముస్లిం రాజ్య నిర్వహణలో వారే కీలకమై  చక్రం తిప్పుతూ ఉండటం చూసి  మతోన్మాదులు  సహించలేకపోయారు. అందుకే అక్కన్న మాదన్నల పట్ల వారు అకారణ శత్రుత్వాన్ని పెంచుకున్నారు.  వారు అక్కన్న మాదన్నలను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు. అక్కన్న మీద పగబూనిన ఒకప్పటి గోల్కొండ సేనాని మహమ్మద్ ఇబ్రాహీం  వర్గీయులు చేసిన కుట్ర కారణంగానే క్రీ. శ. 1685 లో గోల్కొండపై జరిపిన మొదటి దాడిలో మొఘలులకు హైదరాబాద్ నగరంలో వారి విచ్చలవిడి దోపిడీకి ఎలాంటి  ప్రతిఘటన లేకుండా పోయింది. తిరుగుబాటుదారులైన  సైనిక సర్దారులు తమ నవాబు  హిందువులను ముఖ్యమంత్రిగా, సేనాధిపతిగా నియమించుకుని హిందూ అనుకూల పాలన సాగిస్తున్నాడనీ, హిందూ దేవాలయాలకు భూరి విరాళాలు ఇస్తున్నాడనీ  తానీషాకి వ్యతిరేకంగా  ఔరంగజేబ్ కి నూరిపోశారు. మతసహనం పొడ గిట్టని ఔరంగజేబు ఆ కారణంగా తానీషా మీద పగ పెంచుకుని గోల్కొండ కోట మీద దాడికి మొదటి పర్యాయం తన కుమారుడు ముఅజ్జంను, ఖాన్ జహాన్ అనే సేనానిని అశేషమైన సైన్యాన్ని ఇచ్చి పంపాడు. మహమ్మదీయ సర్దారులకు  అక్కన్న మాదన్నలపై ఏర్పడిన శత్రుభావం మరింతగా పెరిగి, అగ్నికి ఆజ్యంపోసినట్లైన ఒక ఘటనను  ఇక్కడ పేర్కొనాలి. మాదన్న మంత్రి రోజూ స్నానం చేస్తూ సంధ్యావందనం చేసుకునే ఒక వ్యక్తిగత కొలనులో దిగి ఒకరోజు  మహమ్మద్ ఇబ్రాహీం మాదన్న చూస్తూ ఉండగానే ఆయన్ని కవ్వించే ఉద్దేశంతో కావాలనే స్నానం చేశాడట. దీనిని తనకు జరిగిన అవమానంగా భావించిన మాదన్న వెంటనే ఇబ్రాహీంని కొరడాలతో కొట్టించాడట. కోటలో ఇదొక సంచలన వార్తగా మారి, ముస్లింలు - ప్రత్యేకించి ముస్లిం మహిళలు - అందరికీ అక్కన్న మాదన్నలపై పగ పెరిగిపోయింది. ముస్లిం సర్దారులు ఈ విషయాన్ని ఔరంగజేబ్ కుమారుడు ముఅజ్జం దృష్టికి తెచ్చి ఎలాగైనా సరే వారిరువురినీ ఖతం చేస్తేనేగానీ కోటను జయించటం సాధ్యపడదని ఆయనకు చెవినిల్లు కట్టుకుని నూరిపోశారు. వారంతా అక్కన్న మాదన్నల అంతానికి ఒక పక్కా ప్రణాళికను రచించారు. క్రీ. శ. 1687  అక్టోబర్ మాసంలో ఒకరోజు అక్కన్న మాదన్నలు కొలువునుంచి ఇంటికి వెళుతూ ఉండగా ముస్లిం స్త్రీలు వారిరువురినీ మోసపూరితంగా సంహరించారు. వారి ఇరువురి తలలూ ఔరంగజేబ్ కుమారుడు ముఅజ్జం కి పంపారు. ఆ రోజే గోల్కొండ రాజ్యంలో బ్రాహ్మణులను అసంఖ్యాకంగా చంపేశారు. అక్కన్న మాదన్నలను అడ్డు తొలగించటంతో ఇక నవాబు తానీషాకు,  గోల్కొండ కోటకు కుట్రదారులనుండి  రక్షణ కరవైంది. తానీషా కొలువులోని అబ్దుల్లా పెయిన్ అనే ఆఫ్ఘన్ దేశీయుడైన ఉన్నత సైనికోద్యోగిని పెద్ద మొత్తంలో లంచం ఇవ్వజూపి లోబరచుకున్నారు. లంచపు  సొమ్ముకు ఆశపడి పెయిన్ అర్దరాత్రి వేళ కోట తూర్పు ద్వారం తెరిపించి, మొఘల్ సైన్యానికి లోనికి మార్గం చూపాడు.మొఘలులు తానీషాని మోసపూరితంగా ఖైదుచేసి దౌలతాబాద్ ( దేవగిరి) లోని చెరసాలకు తరలించారు.అక్కడ అప్పటికే బీజాపూర్ సుల్తాన్ సికిందర్ ఆదిల్ షా బందీగా ఉన్నాడు. ఏడు కోట్ల రూపాయల భారీ మొత్తాన్నీ, కోట్లాది రూపాయల విలువచేసే వజ్ర వైడూర్యాలనూ, బంగారు, వెండి నగలనూ మొఘలులు గోల్కొండ కోట నుంచి దోచుకుపోయారు. చెరసాలలోని తానీషా కి యాభై వేల రూపాయల వార్షిక పింఛను మంజూరుచేసిన మొఘలులు గోల్కొండ రాజ్యాన్ని తమ సామ్రాజ్యంలో విలీనం చేసేసుకున్నారు. 


                        


             ఇక అక్కన్న మాదన్నలపై గోల్కొండ రాజ్యంలోని ముస్లింలలో  తీవ్రమైన  వ్యతిరేకత రావటానికి ఒక ముస్లిం రాజ్యంలో ఆ హిందూ సోదరులిరువురూ తామే సర్వస్వమై రాజ్య నిర్వహణలో చక్రం తిప్పటం  ఒక్కటే  కాక  పలు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటో కూడా ఒకసారి పరిశీలిద్దాం. మహమ్మద్ ఇబ్రాహీం అనే అతనిని సేనాని పదవి నుంచి 

తొలగించి, తానీషా క్రీ. శ. 1682 లో ఒక సామాన్య సైనికోద్యోగి అయిన అక్కన్నను ఆ పదవిలో నియమించటాన్ని రాజ్యంలోని సాధారణ ముస్లింలు  - ప్రత్యేకించి సున్నీ శాఖ అనుయాయులు-  సహించలేకపోయారు. షియా శాఖీయుడైన తానీషా హిందూ సోదరులైన అక్కన్న మాదన్నలను 

పూర్తిగా నమ్మి, వారిపైనే మొత్తం రాజ్యభారాన్ని మోపడం రుచించని సున్నీ శాఖీయులు ఔరంగజేబ్ దండయాత్రల సందర్భంగా అక్కన్న, మాదన్నలకు వ్యతిరేకంగా  ప్రజాభిప్రాయాన్ని రెచ్చగొట్టి, బహిరంగ  తిరుగుబాటుకు సిద్ధపడ్డారు. ఇక తన వ్యక్తిగత కొలనులో స్నానం చేసిన చిన్నపాటి  నేరానికి మహమ్మద్ ఇబ్రాహీంను  మాదన్న (అది తనకు జరిగిన అవమానంగా భావించి)  తీవ్రంగా శిక్షించడాన్ని రాజ్యంలోని సామాన్య ముస్లింలు - ప్రత్యేకించి ముస్లిం మహిళలు - సహించలేకపోయారు. ఒక ముస్లిం రాజ్యంలో ముస్లింలే రెండవ తరగతి పౌరులుగా జీవించవలసి రావటం అంటే అది  తానీషా ఇచ్చిన అలుసు చూసుకుని అక్కన్న మాదన్నలు కండకావరంతో రెచ్చిపోవటంగా వారు భావించారు. ఈ హిందూ సోదరుల ప్రోత్సాహంతో తానీషా హిందూ ఆలయాలకు భూరి ఆస్తులు, విరాళాలు ఇవ్వటం, వారు  తానీషా అండ చూసుకుని హరి బౌలిలో  బంగారు మైసమ్మ  ఆలయం నిర్మించటమే కాక, గోల్కొండ కోటలోపలే జగదంబికా మహంకాళి  అమ్మవారి ఆలయం నిర్మించి, ఏటేటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉండటం సామాన్య ముస్లిం కూడా జీర్ణించుకోలేకపోయాడు. ఇదికాక ఈ సోదరులు గోల్కొండ రాజ్యంలో తమ పర్యటనల సందర్భంగా హిందూ ఆలయాలకు తరచుగా వెళ్లి  భూరి విరాళాలు ఇస్తూ ఉండటం కూడా ముస్లిం మత పెద్దలకు కంటగింపు అయింది.   సున్నీ మతపెద్దలు ఈ విషయాన్ని దండయాత్రకు వచ్చిన ఔరంగజేబ్, అతని కుమారుడు ముఅజ్జం లకు నివేదించగా గోల్కొండ రాజ్యంలో  అక్కన్న, మాదన్నల ప్రాబల్యం ఎలాగైనా తగ్గించి తీరాలని, హిందూ మత విజృంభణకు ఎలాగైనా అడ్డుకట్ట వేసి తీరాలని, ఇందుకోసం ముందుగా ఈ సోదరుల అడ్డు తొలగించుకోవాలని ఔరంగజేబ్ భావించాడు. మతరీత్యా తానీషా షియా ముస్లిం కావటం, ఆయన పరమత సహనం పాటించటం, పరమతస్థులైన అక్కన్న, మాదన్నలకు పెద్ద పదవులిచ్చి గౌరవించటం, మాదన్న ముందుగా శివాజీకి, తానీషాకి, ఆ తరువాత శివాజీ కుమారుడు శంభాజీకీ, తానీషాకీ మధ్య మైత్రి కుదర్చటం ఔరంగజేబ్ కి ఆగ్రహం కలిగించింది. అందుకే  క్రీ. శ. 1685 లో జరిపిన  మొదటి దండయాత్రలో భారీగా కప్పం తీసుకుని వెనక్కి తగ్గినా, తానీషా మీద, గోల్కొండ షియా రాజ్యం మీద, ప్రత్యేకించి అక్కన్న, మాదన్న సోదరుల మీద పగతో రగిలిపోయిన ఔరంగజేబ్ తిరిగి క్రీ.శ. 1687 ఫిబ్రవరిలో పెద్దపెట్టున గోల్కొండపై విరుచుకుపడ్డాడు. ఇదే అదనుగా  అక్కన్న, మాదన్నల మీద, తానీషా మీద గతంలో పగబట్టిన  గోల్కొండ రాజ్య మాజీ సేనాని మహమ్మద్ ఇబ్రాహీం మొఘలులతో కలిసిపోయి, మొఘల్ సైన్యం హైదరాబాద్ నగరాన్ని దోచుకోవటంలో వారికి సహకరించటం గోల్కొండ రాజ్యానికి పెనుశాపంగా మారింది. అక్కన్న మాదన్నలు నిత్యం చేసే ధర్మకార్యాల కారణంగా గోల్కొండ రాజ్యంలోని హిందువులలోని కొందరు - ప్రత్యేకించి బ్రాహ్మణులు, శైవులు  వారిని అభిమానించినా మిగిలిన హిందువులు ఈ సోదరుల పట్ల సానుభూతితో  ఏమీ లేరు.  సాధారణ ముస్లింలు అక్కన్న మాదన్నలను  ద్వేషించటానికి మరికొన్ని కారణాలు తోడయ్యాయి. 


                      


                  అక్కన్న మాదన్నలు హిందూ దేవాలయాలకు ఉదారంగా విరాళాలు ఇవ్వటం, సత్రములు నిర్మించి,  బ్రాహ్మణులకు ఉచిత భోజన సదుపాయాలను ఏర్పాటు చేయటం వంటి  ధర్మకార్యాలు చేసి హిందువులు - ముఖ్యంగా బ్రాహ్మణుల దృష్టిలో ధర్మాత్ములని పేరొందారు. 

వారు ప్రతిరోజూ ప్రాతః కాలంలో శివపూజలు చేస్తూ, ఆ సమయమున తమను సందర్శించిన కవి పండితులను - ప్రత్యేకించి శివకవుల పాండిత్యాన్ని పరిశీలించి వారికి తగిన బహుమతులిచ్చి 

సత్కరించి పంపేవారు. ఈ సోదరులను వక్తృ శ్రోతలుగా చేసి త్రిపురాంతకం నుంచి వచ్చిన తెనాలి రామలింగము అనే శైవకవి తాను రచించిన ‘ ధీరజన మనో విరాజితము’ అనే ఏకాశ్వాస ప్రబంధాన్ని వారికి వినిపించి, వారిచే సత్కరించబడటం గురించి మనం ముందే చెప్పుకున్నాం. అక్కన్న మాదన్నలు గోల్కొండ రాజ్యంలో తమకున్న ఎదురులేని అధికారాల కారణంగా నిరంకుశులై ఆనాటి అనుకూల  పరిస్థితులను తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా మలచుకోవటం కూడా ఇక్కడ  గమనార్హం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీపట్టణం, చెన్నపట్టణం లలో నాడు నిర్వహిస్తున్న నౌకా వాణిజ్య  కార్యకలాపాలు, వారి గిడ్డంగుల వ్యవహారాలను గోల్కొండ రాజ్యం తరఫున  వీరరాఘవులు  అనే ఒక తెలుగు కరణాన్ని గుమాస్తాగా నియమించి, అతని ద్వారా నియంత్రిస్తూ తమ పదవులను వ్యక్తిగత ప్రయోజనం కోసం కంపెనీ వారినుంచి వీలైనంత పెద్ద మొత్తాలలో సొమ్ము రాబట్టడానికి వినియోగించటం కూడా గమనార్హం. కంపెనీ వారి గిడ్డంగులు, రేవులు గోల్కొండ రాజ్య అధికార పరిధిలోనివైన కారణంగా ఎంత మొత్తం ఇవ్వమని కోరినా, ఎన్ని షరతులు విధించినా గత్యంతరంలేని స్థితిలో వాటన్నిటికీ అంగీకరించి కంపెనీ వారు ఆ మొత్తాలను అక్కన్న మాదన్నలకు చెల్లించేవారు. అప్పట్లో అక్కన్నకు స్వంతంగా కొన్ని ఓడలు కూడా ఉండేవి. ఆయన నౌకా వ్యాపారం నిర్వహించేవాడు. క్రీ. శ. 1679 ఫిబ్రవరి నెలలో కంపెనీ వారు తమ వ్యాపార అవసరాల నిమిత్తం తమకు శాంతోం, ఎగ్మూర్ ప్రాంతాలు కౌలుకు ఇప్పించమని  కోరినప్పుడు, తిరిగి క్రీ. శ. 1682 జూలై నెలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యాపారం చేసుకొనటానికి అనుమతులు మంజూరు చేయమని కోరినప్పుడు గోల్కొండ రాజ్యానికి కంపెనీవారు చెల్లించాల్సిన వార్షిక  పన్నుమొత్తం నిర్ణయించటంతో పాటు   ఈ సోదరుల వ్యక్తిగత ప్రయోజనాలూ నెరవేరాయి. అక్కన్న గారి స్వంత ఓడలకు కంపెనీవారు పలు వెసులుబాట్లు కల్పించారు. అలాగే క్రీ. శ. 1682 సెప్టెంబర్ నెలలో కంపెనీవారు విశాఖపట్టణం మొదలైన ప్రదేశాలలో తమకు వర్తకం విషయంలో కొన్ని వీళ్ళు కలగజేయమని అక్కన్న, మాదన్నలకు ఒక లేఖరాసి, అనేక బహుమానాలతో సహా ఆ లేఖను వారికి పంపారు. ఆ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన అక్కన్న కి, కంపెనీ వారికి దుబాష్ ( దుబాసీ) గా వ్యవహరించిన వెంకటాద్రి అనే ఒక కరణానికి - ఈ ఇరువురికీ  ఎన్నో విలువైన బహుమతులు  కంపెనీ వారినుంచి ముట్టినట్లు లేఖాధారాలు ఉన్నాయి. క్రీ. శ. 1682 నవంబర్ నెలలో మాదన్న కుమారుడు మల్లప్ప వివాహం సందర్భంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వీసెడు బంగారపు గొలుసు తయారు చేయించి పెళ్లి కానుకగా పంపారు.( అప్పట్లో రూపాయి ఎత్తును తులము అనేవారు. తులమునే కొందరు నవటాకు అనీ, ఇంకొందరు పలము అనీ కూడా అనేవారు. ఒక తులం బంగారం సాధారణంగా బరువులో పదహారు రూపాయలకు సమానంగా భావించేవారు. అలాంటి 120 తులాలు ఒక వీసె. అంటే అప్పట్లో వీసెడు బంగారం విలువ 1,920 రూపాయలన్నమాట. అప్పట్లో వెండి రూపాయిలో ఉండే వెండి విలువ రూపాయే ఉండేది)   క్రీ. శ. 1683 జనవరి నెల ఒకటో తేదీన ఆంగ్ల నూతన సంవత్సర కానుకగా     కంపెనీ వారు 400 వరహాలు మాదన్న గారికి  పంపారు. ఆ సందర్భంగా పంపిన లేఖలో మాదన్న గారి అనుగ్రహమును కోరి ఆ కానుకలను పంపినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.( వరహా అనేది వరాహ ముద్ర కలిగిన బంగారు నాణెం. దీనినే పగోడా అనికూడా అంటారు. ఒక పగోడా మూడున్నర రూపాయలకు సమానం. అంటే మాదన్న గారికి క్రీ.శ. 1683 జనవరిలో నూతన సంవత్సర కానుకగా ముట్టిన మొత్తం 400 x 3.5 అంటే 1400 


రూపాయలు).  గోల్కొండ రాజ్య పరిధిలో  వ్యాపారం చేసుకునేందుకు కంపెనీ వారు తానీషా ప్రభుత్వానికి చెల్లించవలసిన వార్షిక  పన్ను మొత్తం  1,200 వరహాలుగా క్రీ. శ. 1682 జూలైలో  నిర్ణయించబడింది. ప్రభుత్వానికి జమ అయ్యే  మొత్తం 1,200 వరహాలు కాగా దానిలో మూడవ వంతు అంటే 400 వరహాలు మాదన్న మంత్రికి లాంఛనంగా ( లంచంగా ) ముందుగానే ముట్టిందన్నమాట. గోల్కొండ రాజ్య సేనాధిపతి అక్కన్న గారికి ఇంగ్లిష్ వ్యాపారులను అనుగ్రహించటానికి, ఇతరదేశాల వ్యాపారులను గోల్కొండ రాజ్యం నుంచి తరిమివేయటానికి ఎన్నో పుట్ల రాగి, కావలసినంత ధనం ఇస్తామని చెన్నపట్నంలోని కంపెనీవారు క్రీ.శ. 1683 ఆగస్టు 14 వ తేదీ ఒక లేఖ రాశారు. ఇంతేనా ?  వైభవోపేతంగా జరిపిన   మాదన్న కుమారుడి ఉపనయనానికి, పెళ్ళికి, మాదన్న గారి పేష్కార్ ( Secretary) కి, ఆయన బిడ్డకీ, పినతండ్రికి కూడా ఇలాగే కంపెనీ వారినుంచి తరచు భారీగానే నజరానాలు ముట్టేవి. తమ స్వంత మనుషులైన వీరరాఘవులు, వెంకటాద్రి వంటి వారిని గుమాస్తాలుగా నియమించుకుని వారి ద్వారా లోపాయకారీగా జరిపిన ఈ కరణీకంలో అక్కన్న మాదన్నలే కాదు. వారి అనుచరవర్గం భారీగా లాభపడినట్లు,దశలవారీగా ప్రతి దశలోనూ లంచం చేతిలో పడకుండా ఎక్కడా ఏ పనీ కూడా  ఈ సోదరుల దగ్గర సానుకూలపడేది కాదని ఈ సోదరులు కంపెనీవారితో సాగించిన నాటి ఉత్తర ప్రత్యుత్తరాలు తిరుగులేని విధంగా చాటుతున్నాయి. కంపెనీ వారు ఆశిస్తున్న ఏ పని జరగాలన్నా వారి నుండి తమకు దక్కాల్సిన లాంఛనాలు, కానుకలు వగైరాలను ముందుగానే తమ మనుషుల ద్వారా  ఈ సోదరులు కంపెనీవారికి తెలిపేవారు. గోల్కొండ రాజ్యంలో ఈ అన్నదమ్ములకు దొరికిన బంగారు అవకాశం అలాంటిది. తానీషా అభిమానాన్ని పొందిన ఈ సోదరులమీద రాజ్యంలో చాపకింద నీరులా  ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వారిని  ఎవ్వరూ ఏమీ చేయలేని స్థితే ఉండింది.     ఆనాటి నిరంకుశ పాలన కారణంగా వీరి మాటకు అడ్డులేకుండా పోయింది. క్రీ.శ. 1672 లో తానీషా మామగారు అబ్దుల్లా కుతుబ్ షా (1626 - 72)  చనిపోయిన సందర్భంలో అక్కన్న మాదన్నలు చేసిన కరణీకం, కుట్రల 

కారణంగానే  మృతిచెందిన సుల్తాన్  అల్లుడైన తానీషా తేలిగ్గా అధికారాన్ని చేజిక్కించుకోగలిగాడనీ, ఆ కారణంగానే ఆ సోదరుల పట్ల ఆయన కృతజ్ఞతాభావంతో వారు ఏమిచేసినా ఉదాసీనంగా ఉండేవాడని అంటారు. తానీషా రాజ్యపాలనా భారం మొత్తాన్ని ఈ సోదరుల మీదనే వదిలేసి వారిపై పూర్తి విశ్వాసం కలిగివుండటం కారణంగా వారికి తమ పాలనా వ్యవహారాలలో ఇంతటి  నిరంకుశత్వం చెలాయించటం సాధ్యపడింది. ఈ సోదరులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నకొద్దీ వారిపై ముస్లిం ప్రజలలో వ్యతిరేకత తీవ్రతరం కావటం, అందరి మనసులలో గూడు కట్టుకున్న ఆ వ్యతిరేకతే  క్రమంగా  మరింత  తీవ్రమై,  కొందరు ముస్లిం స్త్రీల సహకారంతో  ఈ సోదరులను ప్రత్యర్థులు హత్యచేయటానికి దారితీసిందని మనం ముందుగానే చెప్పుకున్నాం.  గోల్కొండ రాజ్యంలోని హిందువులలోని అత్యధికులు  కూడా అక్కన్న మాదన్నల పట్ల సానుకూలంగా ఏమీ లేరు. ఈ సోదరుల వలన ప్రయోజనాలు పొందిన బ్రాహ్మణులు - ముఖ్యంగా శైవులు - వీరిని ధర్మాత్ములుగా కీర్తించినా  ఈ సోదరులు  చేసిన తప్పులలో అన్నింటికంటే క్షమించరాని  తప్పు ఒకటుంది. పరమ కిరాతకునిగా, దురాశాపరునిగా పేరొందిన పొదిలి లింగన్న అనే కరణం వజ్రాల వ్యాపారంలో ప్రవేశించి రాజ్యంలో పలు దోపిడీలు, అరాచకాలు చేస్తూ ఉంటే, అక్కన్న మాదన్నలు అలాంటి వాడిని చేరదీసి, క్రీ.శ. 1682 లో ‘ దొంగ చేతికే తాళం చెవులు ఇచ్చినట్లు’  ఆ లింగన్ననే కృష్ణానదికి దక్షిణంగా ఉన్న గోల్కొండ రాజ్యానికంతటికీ  తమ తరఫున సుబేదార్ ( గవర్నర్) గా నియమించారు. పొదిలి లింగన్న  అప్పటికే కుట్రదారునిగా, చాడీకోరుగా  ఆంధ్రదేశమంతా దుష్కీర్తిని మూటకట్టుకున్నాడు. నేటి ఆరు జిల్లాలలోని  భూభాగాన్ని గండికోట కేంద్రంగా దాదాపు రెండువందల ఏళ్ళ పాటు (ముందు  హంపి విజయనగర ప్రభువులకు సామంతపాలకులుగా, ఆ తరువాత క్రీ. శ. 1652 వరకు   స్వతంత్రంగానే ) పాలించిన  పెమ్మసాని ప్రభువులపై అసూయాద్వేషాలతో  పగబూనాడు లింగన్న.  గోల్కొండ  పంచన చేరి, అబ్దుల్లా కుతుబ్ షా కొలువులోని కుటిలుడు, స్వామిద్రోహి అయిన మీర్ జుమ్లా అనే మంత్రి ( వజీరు) తో  కలిసి కుతంత్రాలు పన్ని అబ్దుల్లా కుతుబ్ షాను గండికోటపై దాడికి పురికొలిపింది  వంచకుడైన ఈ లింగన్నే. ఆ కుట్ర ఫలితమే క్రీ.శ. 1652 లో జరిగిన గండికోట యుద్ధంలో  కుతంత్రంతో, మోసంతో గోల్కొండ సైన్యానికి లభించిన విజయం. పొదిలి లింగన్న అరాచక చరిత్ర గురించి, అతడి కుట్రపూరిత స్వభావాన్ని గురించి, తరువాత భాగంలో వివరిస్తాను. అక్కన్న మాదన్నలు  తమ స్వీయ ఆర్ధిక ప్రయోజనాల సాధనకోసం ఈ లింగన్నను తమ ప్రతినిధిగా నియమించుకుని  చేసిన పనుల కారణంగా ఈ సోదరులు ఎంతో ప్రజా వ్యతిరేకతను కొనితెచ్చుకున్నారు. హంపి విజయనగర వారసత్వాన్ని నిలబెట్టిన బలమైన  హిందూ రాజ్యమైన గండికోట విధ్వంసం  పట్ల కలత చెందిన ఆంధ్రులు అందుకు మూల కారకుడైన లింగన్నతో   అక్కన్న మాదన్నల దోస్తీని ఎలా సహిస్తారు ? అందుకే హిందువులలో అత్యధికులకు  అక్కన్న మాదన్నల పట్ల సానుకూల వైఖరి లేకపోవటం. 


                    తమ మేనల్లుడు, నేటి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడైన కంచెర్ల గోపన్న 

(1620 - 88) అనే భద్రాచల రామదాసును వీరు క్రీ.శ. 1672 తరువాత కాలంలో గ్రామ కరణం స్థాయినుంచి పదోన్నతి కల్పించి తమ సిఫారసుతో పాలవంచ తహసీల్దారుగా నియమింపజేయగా, ఆ తరువాత ఆయన ప్రభుత్వ బొక్కసానికి చేరవలసిన నిధులను దారి మళ్ళించి, భద్రాచల రామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికో, లేక పునర్నిర్మాణానికో  వెచ్చించినందున, ఆ నేరం తాలూకు అపకీర్తిని అక్కన్న మాదన్నలు కూడా మోయాల్సివచ్చింది. ఆ నేరానికిగాను శిక్షగా రామదాసు గోల్కొండ చెరసాలలో         పన్నెండేళ్ళు కారాగారవాసం చేస్తూ ‘ దాశరధీ కరుణా పయోనిధీ’ అనే మకుటంతో 108 పద్యాలతో దాశరధీ శతకాన్నీ, పలు కీర్తనలనూ రాశాడు. ఈ ఘటన కారణంగా రామదాసు ఆర్థిక అక్రమాల వెనుక  అక్కన్న మాదన్నల హస్తం కూడా ఉందని అక్కన్న మాదన్నల ప్రత్యర్థులతో సహా సామాన్య ముస్లింలంతా ఈ ఇరువురు సోదరులపై విమర్శనాస్త్రాలు సంధించారు. 


                      ఇక వచ్ఛే భాగంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు భక్త రామదాసు, ‘ ఆంధ్ర వాల్మీకి’ గా పేరొందిన కవి వావిలికొలను సుబ్బారావు ( వాసుదాసు)ల సాహిత్య, సామాజిక సేవతో పాటు, కిరాతకునిగా పేరొందిన పొదిలి లింగన్న కుట్రలు, కుహకాల గురించి కూడా విపులంగా వివరిస్తాను. 


                            -- మీ.. రవీంద్రనాథ్.

అద్భుతమైన లైఫ్ ఖచ్చితంగా ఇలా సాధ్యం!*

 *అద్భుతమైన లైఫ్ ఖచ్చితంగా ఇలా సాధ్యం!*


ఈ క్షణం మీరెలా ఫీలవుతున్నారు? అద్భుతంగానా, 

డిజప్పాయింటెడ్‌ గానా, 

బోర్‌గానా, 

చిరాకుగానా…? 

ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్‌ని డిసైడ్ చేసే అతి పెద్ద ఫేక్టర్ ఇది.


బ్రెయిన్‌కి పంపించబడాల్సిన instructions చాలాసార్లు తప్పుగా హైజాక్ అవుతుంటాయి. అందుకే మనం ఫెయిల్యూర్డ్ పీపుల్‌గా మిగిలిపోతున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే *“నెగిటివ్ ప్రోగ్రామింగ్”* చేయబడుతోంది బ్రెయిన్.


*బ్రెయిన్‌కి మంచీ చెడూకి మధ్య తేడా తెలీదు. మనం ఏది చెయ్యమంటే అది గుడ్డిగా చేస్తుంది.*


చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మీరు *“ఈ మధ్య జనాల పేర్లు మర్చిపోతున్నాం” అని రిపీటెడ్‌గా అనుకుంటూ ఉన్నారనుకోండి.. బ్రెయిన్ అలాగే ప్రోగ్రామింగ్ చెయ్యబడుతుంది.* మీరు గుర్తుంచుకోవాలని ట్రై చేసిన ప్రతీసారీ గుర్తుంచుకోవలసిన పేరుని డెఫినెట్‌గా మర్చిపోయి… మన నెగిటివ్ ప్రోగ్రామింగ్‌ని విజయవంతంగా ప్రాసెస్ చేసి పారేస్తుంది బ్రెయిన్.


మీకు హెల్త్ బాలేదని అనుకుంటూ ఉండండి…. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది. *“బాలేదు బాలేదు” అనుకుంటున్న క్షణం నుండి బ్రెయిన్ వివిధ organsకి ఆదేశాలు జారీచేసి, బాడీ మెటబాలిజాన్ని తారుమారు చేసి ఏదో ఒక discomfort తలెత్తేలా చేసి తీరుతుంది.*


 దానికి మనం అప్పజెప్పిన task ఏదైతే ఉందో… “మన హెల్త్ బాలేదని” దాన్ని కంప్లీట్ చెయ్యడమే దాని లక్ష్యం.

————

చాలామంది ఉద్యోగాలు రావట్లేదనో, లైఫ్‌లో తాము ఎందుకూ పనికిరామనో, సంతోషం అంటే ఏమిటో తెలీదనో.. *రకరకాల మెంటల్ ట్రాప్‌లలో ఇరుక్కుపోతుంటారు.* ఇవి రిపీటెడ్ సజెషన్లని బ్రెయిన్‌కి పంపిస్తుంటాయి. దాంతో ఉద్యోగం కోసం ట్రై చేసే ప్రతీప్రయత్నంలోనూ ఏదో ఒక లోపం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది, సంతోషంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా చిరాకుగానే ఉండిపోతుంటాం.

————–

ప్రతీ క్షణం మన ఆలోచనల ద్వారానో, నోటితో మాటల ద్వారానో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఆ ఆలోచనలు ప్రోగ్రామింగ్ లాంటివి. *ఈ ప్రోగ్రామింగ్‌లో పాజిటివ్ ఏటిట్యూడ్ సాధించగలిగితే ఖచ్చితంగా ప్రతీ క్షణం చాలా అద్భుతంగా ఉంటుంది.*


అంటే *మనల్ని మనం blame చేసుకోవడం తగ్గించాలి, ఇతరులు మనల్ని చులకన చేస్తూ మాట్లాడే వాటిని బ్రెయిన్‌కి తీసుకుని కుంగిపోవడం తగ్గించాలి.*  


*ఎంత నెగిటివ్ ఎనర్జీ మనం లోపలకు పంప్ చేస్తే అంత నెగిటివ్ output వస్తుంది. సరిగ్గా అలాగే ఎంత పాజిటివ్ ఎనర్జీ పంప్ చేస్తే అంత పాజిటివ్ output వస్తుంది.*


ఇక్కడా మరో చిన్న ఉదాహరణ తీసుకుంటే… ఓ పబ్లిక్ గేదరింగ్‌లో అందరితో కలవలేక ఓ మూలన ఇరుక్కుంటే అందరూ సంతోషంగా ఉన్నట్లు కన్పిస్తారు. మనం ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అరమరికలు మర్చిపోయి మనుషుల మధ్య దూసుకుపోతే మన సంతోషం ముందూ, కలివిడితనం ముందూ అందరూ సరెండర్ అయిపోతారు.


సో *లైఫ్‌లో ప్రతీ క్షణం ఏ సిట్యుయేషన్‌ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది. సో ఎలాంటి ఛాయిస్ తీసుకుంటే లైఫ్ అలా ఉంటుంది.*


*ప్రోగ్రామింగ్ ట్రాప్ అని మరొకటి ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే దానికి సంబంధించిన పాత జ్ఞాపకాలూ, అనుభవాలూ ఏమైనా మన బ్రెయిన్ డేటాబేస్‌లో ఉన్నాయేమో బ్రెయిన్ చకాచకా స్కాన్ చేస్తుంది.*


ఉదా.కు.. రోజూ మీకు టీ తాగే అలవాటు ఉంటే గతంలో ఎప్పుడో ఓరోజు సాయంత్రం టీ తాగలేదనుకుందాం. బాగా తలనొప్పి వచ్చి ఉంటుంది.


సో ఈరోజు మీరు మళ్లీ టీ తాగలేదనుకుందాం. వాస్తవానికి తలనొప్పి వచ్చే అవకాశం లేకపోయినా.. *బ్రెయిన్ ఒక కండిషన్‌కి ఓ రిజల్ట్‌ని match చేసుకుని ఆ outcome ఎలాగైనా సాధించి పెడుతుంది.*


ఇక్కడ కండిషన్ ఏంటంటే.. టీ తాగలేదు.


రిజల్ట్స్ ఏమిటంటే తలనొప్పి రావాలి. 


సో తలనొప్పి వచ్చే ఛాన్స్ లేకపోయినా డేటాబేస్‌లోని పాత రికార్డుల ప్రకారం శరీరంలో బయలాజికల్ మార్పులను సృష్టించి మొత్తానికి తలనొప్పి తెప్పించేస్తుంది.

————

*సో ప్రతీ కండిషన్‌నీ, ప్రతీ అనుభవాన్నీ, ప్రతీ రోజునీ, ప్రతీ క్షణాన్నీ కొత్తగా చూస్తే, కొత్తగా రెస్పాండ్ అవుతూ పోతే బ్రెయిన్ డేటాబేస్‌లోని పాత రికార్డులూ, పనికిమాలిన చేదు జ్ఞాపకాలూ అన్నీ కొట్టుకుపోతాయి. లైఫ్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది.. ఇప్పుడే లైఫ్ మొదలెట్టినంత తాజాగా ఉంటాం.*


జీవితం అందమైనది...అనంతమైంది

ఆనందంగా జీవించుదాం. 👍


Thursday, July 29, 2021

తెలుగు వైభవం 1 01.08.2021

  01.08.2021 చందమామ బాలమిత్ర బాలానందం విస్సా ఫౌండేషన్‌ 
ముందుగా శ్రీ గణేష్ ప్రార్థన, సరస్వతి ప్రార్ధన
 అంశాలు :   సమయపాలన,  ఆరోగ్య జాగ్రత్తలు,  వేదిక్ మాథ్స్ పరిచయం,   వ్యక్తిత్వ వికాసం,  ఆటలు, పాటలు, పద్యాలు, కవితలు, హాస్యం, వినోదం 
 సామెతలు, జాతీయాలు,  చందమామ,  బాలమిత్రుల  ఆసక్తికర అంశాలు,  వారికి ఇష్టమైన కష్టమైన అంశాల వివరణ ఇలా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రతి వారం మన బాలానందం!

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అని ఓ సామెత  
మనం ఎవరితో మాట్లాడినా మాట్లాడే తీరు ముఖ్యం. 
దానిలోనే సభ్యత, సంస్కారం, వ్యక్తిత్వం తెలుస్తాయి మాటలతో అందరి ప్రశంసలు పొందాలంటే మాటలు కాదు 

శ్రీ రాముణ్ణి స్మిత పూర్వాభి భాషి అంటారు మాట్లాడే ముందు చిరునవ్వు నవ్వుతాడు   
ఆత్మీయులతో మాట్లాడినా, అపరిచితులతో మాట్లాడినా ఎదుటివాళ్ళ ముఖాన్ని అప్పుడప్పుడు పరిశీలిస్తూ వుండాలి. 
ఇందువల్ల మనం చెప్పేది జాగ్రత్తగా వింటున్నారా లేదా అని గమనించగలుగుతాం. వింటున్నారనుకుంటే మనం సంభాషణ సాగించాలి. లేదా ఎదుటి వాళ్ళ ఆసక్తిని కనిపెట్టి విషయాన్ని మార్చాలి. 
నిర్భయంగా, నిజాయితీగా మాట్లాడాలి "ఉచ్చారయతి కల్యాణీ వాచ్యం హృదయ హర్షిణీం" 
ఎదుటివాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేకపోతే సంభాషణ విసుగెత్తి పోతుంది. ఎక్కువమంది మన చుట్టూ వుంటే సాధ్యమైనంత వరకు అందరికీ పరిచయమైన విషయాలు అర్థమయ్యే విషయాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులతో, గురువులతో, పెద్దలతో సంభాషించే తీరు వేరుగా వుండాలి. సమ వయస్సు గల వారితో మాట్లాడే సంభాషణ తీరు వేరుగా వుండాలి. మాట్లాడేటప్పుడు మన ఆరోగ్యం, మన కష్టాలు, మన తాపత్రయాలు, ఇంటి గొడవలు వంటి వ్యక్తిగత విషయాలు ఏకరువు పెట్టకూడదు. మన గురించే, మన అనుభవాలనే ఏకరువు పెడుతుంటే సంభాషణ రక్తికట్టదు. కాదనడం, అపనమ్మకం, ఎత్తిపొడుపు మాటలు, ఆపేక్షణ వంటివి సంభాషణ చెడిపోవడానికి దారితీస్తాయి.
 సంభాషణ అనేది ఎదుటి వారు మనకు మిత్రులుగా మిగిలిపోవడానికో, శత్రువులుగా విడిపోవడానికో దారితీస్తుందని గుర్తుంచుకోవాలి. ఏమి మాట్లాడుతున్నామో తూచి తూచి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ సంతోషకరమైన విషయాలు మాట్లాడుకోవాలి. నిస్పృహ ధ్వనించే మాటలు నాలుక చివరికి వస్తే దానిని ఆపుకొని సరదాగా మాట్లాడడానికి ప్రయత్నిచాలి. ఇందువల్ల సాటివారికి మరింత ఇష్టులవుతాము. ఆ వ్యక్తితో ఇతర విషయాలతో పాటు సినిమా విషయాలు చెపితే మనం చెప్పే విషయాలు జాగ్రత్తగా వింటాడు. మనకు చేరువవుతాడు. సంభాషణా చాతుర్యం అనేది నలుగురి చేత ఆనందిపజేయగల విందులాంటిది. 

 

 

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అని ఓ సామెత 

మనం ఎవరితో మాట్లాడినా మాట్లాడే తీరు ముఖ్యం.

దానిలోనే సభ్యత, సంస్కారం, వ్యక్తిత్వం తెలుస్తాయి మాటలతో అందరి ప్రశంసలు పొందాలంటే మాటలు కాదు

శ్రీ రాముణ్ణి స్మిత పూర్వాభి భాషి అంటారు మాట్లాడే ముందు చిరునవ్వు నవ్వుతాడు  

ఆత్మీయులతో మాట్లాడినా, అపరిచితులతో మాట్లాడినా ఎదుటివాళ్ళ ముఖాన్ని అప్పుడప్పుడు పరిశీలిస్తూ వుండాలి.

ఇందువల్ల మనం చెప్పేది జాగ్రత్తగా వింటున్నారా లేదా అని గమనించగలుగుతాం. వింటున్నారనుకుంటే మనం సంభాషణ సాగించాలి. లేదా ఎదుటి వాళ్ళ ఆసక్తిని కనిపెట్టి విషయాన్ని మార్చాలి.

నిర్భయంగా, నిజాయితీగా మాట్లాడాలి "ఉచ్చారయతి కల్యాణీ వాచ్యం హృదయ హర్షిణీం"

ఎదుటివాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేకపోతే సంభాషణ విసుగెత్తి పోతుంది. ఎక్కువమంది మన చుట్టూ వుంటే సాధ్యమైనంత వరకు అందరికీ పరిచయమైన విషయాలు అర్థమయ్యే విషయాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులతో, గురువులతో, పెద్దలతో సంభాషించే తీరు వేరుగా వుండాలి. సమ వయస్సు గల వారితో మాట్లాడే సంభాషణ తీరు వేరుగా వుండాలి. మాట్లాడేటప్పుడు మన ఆరోగ్యం, మన కష్టాలు, మన తాపత్రయాలు, ఇంటి గొడవలు వంటి వ్యక్తిగత విషయాలు ఏకరువు పెట్టకూడదు. మన గురించే, మన అనుభవాలనే ఏకరువు పెడుతుంటే సంభాషణ రక్తికట్టదు. కాదనడం, అపనమ్మకం, ఎత్తిపొడుపు మాటలు, ఆపేక్షణ వంటివి సంభాషణ చెడిపోవడానికి దారితీస్తాయి.

 సంభాషణ అనేది ఎదుటి వారు మనకు మిత్రులుగా మిగిలిపోవడానికో, శత్రువులుగా విడిపోవడానికో దారితీస్తుందని గుర్తుంచుకోవాలి. ఏమి మాట్లాడుతున్నామో తూచి తూచి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ సంతోషకరమైన విషయాలు మాట్లాడుకోవాలి. నిస్పృహ ధ్వనించే మాటలు నాలుక చివరికి వస్తే దానిని ఆపుకొని సరదాగా మాట్లాడడానికి ప్రయత్నిచాలి. ఇందువల్ల సాటివారికి మరింత ఇష్టులవుతాము. ఆ వ్యక్తితో ఇతర విషయాలతో పాటు సినిమా విషయాలు చెపితే మనం చెప్పే విషయాలు జాగ్రత్తగా వింటాడు. మనకు చేరువవుతాడు. సంభాషణా చాతుర్యం అనేది నలుగురి చేత ఆనందిపజేయగల విందులాంటిది.

వినదగు నెవ్వరు చెప్పిన

వినినంతనె వేగపడక వివరింపదగున్

గనికల్ల నిజము దెలిసిన

మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ

        ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందర పడక నిజమో, అబద్దమో... తెలుకోవాలి. ఇది బద్దెన గారి సూక్తి. మరి ఎంత మంది ఇలా మంచి చెడ్డలు పరిశీలించి న్యాయ పరమైన నిర్ణయాలు తీసుకొంటున్నారు. అందువల్లే .. చాడీలు చెప్పే వారి మాటలే చెల్లుబాటు అవుతున్నాయి. నిజానిజాలు గమనించక... తొందర నిర్ణయాలు తీసుకొని... అపార్ధాలతో.... ఆవేశపడి, ఆతర్వాత ఎంత బాధపడితే.... ఎమి ప్రయోజనం...! చెప్పుడు మాటలు విని శతృత్వం తెచ్చుకొంటే.. తర్వాత సర్దుకుపోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఒకవేళ చెప్పుడు మాటలతో బలమైన వ్యక్తులను ఢీ కొట్టాల్సివస్తే.. మొదటికే మోసం రావచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకోన్నట్లవుతుంది.

 

' మంత్రం' - అంటే, వేదమంత్రాలే కానవసరంలేదు. ఎదుటి వారిని మంత్ర ముగ్ధుల్ని చేసే మాటలే మంత్రాలు. 
' స్వరాజ్యం నా జన్మ హక్కు ' - అన్న బాలగంగాధర తిలక్; ' స్వాతంత్ర్య సమరంలో పంచాక్షరీ మంత్రంలాగా పనిచేసిన ' వందేమాతరం ' నినాదం; పాకిస్తాన్ తో యుద్ధ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి యిచ్చిన ' జైజవాన్ - జై కిసాన్' నినాదం; - యిలా ఎన్నో ఉదాహరణలు మాటకున్న మంత్ర శక్తిని మనకు స్పష్టంగా తెలియజేస్తాయి.
 
' నీకు దేశం ఏమిచ్చిందని అడగొద్దు - నువ్వేం చేయగలవో ఆలోచించు ' - అని అప్పటి అమెరికా అధ్యక్షుడు 'కెన్నెడి' అన్నప్పుడు ప్రజలు నిజంగా ఆలోచించడం మొదలు పెట్టారు. ' దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా - దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ ' - అని గురజాడ కవి దేశభక్తిని మంత్రాల్లాంటి మాటలతో నూరిపోసారు. వందేళ్ళ క్రితం రాసిన ఆ పదాలు నేటికీ మార్మోగుతున్నాయి. ' దేశానికి రాజు నైనా - తల్లికి బిడ్డనే ' - అన్న తెలుగు ఠీవి పి.వి. మాటలు మన మనస్సులలో యింకా మెదులుతూనే ఉన్నాయి. ఇలాంటి మాటలు మంత్రాల్లా పనిచేసాయి. అవి ఎందరినో ప్రభావితం చేసాయి. ఇంకా చేస్తున్నాయి.
 
మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? - అని కొందరు ప్రశ్నించవచ్చు. రాలక పోవచ్చు. కానీ, మాటల మంత్రాలతో ప్రపంచాన్నే జయించవచ్చు. ఈ కాలంలో ఏ రంగంలోనైనా ' కమ్యూనికేషన్ స్కిల్స్ ' అత్యవసరం. బంగారంల్లాంటి పలుకులతో జీవితానికి బంగారు బాట వేసుకోవాలి. అట్లా మాట్లాడ లేకపోవడం వలన మనుష్యుల మధ్య అగాధం ఏర్పడుతుంది. పిల్లలు కలిగున్న భార్యాభర్తలు గూడా విడిపోతున్నారు. కస్టమర్స్ తో సరిగా మాట్లాడ లేకపోవడం వలన వ్యాపారం దెబ్బ తింటుంది. సాటి ఉద్యోగులతో సహనం కోల్పోయి మాట్లాడడం వలన సఖ్యత లోపిస్తుంది.
 
' నోరే రసభరితమైన నుడువులకెల్లన్ ' - అని సుమతీ శతకకారుడు ఏ నాడో చెప్పాడు. రసవంతమైన మాటలన్నింటికీ నోరే ఆధారమనడంలో కవి ఉద్దేశ్య మేమిటి? రసభరితములైన మాటే ఏమిటి, ఏ మాటలైనా నోటినుండి వస్తాయి గదా! నోరు అంటే, అందులో ఉండే నాలుక, మాటాడే ఒక అవయం. ఒక సాధనం. దానంతట అది పనిచేయదు. దాని నుపయోగించేవారు ఏది చేయిస్తే అది, ఎలా చేయిస్తే అలా చేస్తుంది. ' నోరు ' ఒక కత్తిలాంటిదో, కట్టెలాంటిదో కాదు. శరీరంలో ఒక భాగం, అవయం. సజీవ సాధనం. మనిషే కాదు, మనిషి అవయవాలూ అలవాటు చేయడాన్ని బట్టి ప్రవర్తిస్తాయి. ఎడమచేతి వాటం మొదలైనవి ఇలా అలవాటుని బట్టి స్థిర పడినవే. నడవడం, పనిచేయడం, చూడడం, పలకడం గూడా అలవాటునిబట్టే ఉంటాయి. ' ఏ గూటి చిలుక ఆ గూటి పలుకు పలుకుతుం'దంటారు. అలాగే నోరూ. పరుషంగానైనా, మృదువుగానైనా, అనుచితంగానైనా, సముచితంగానైనా, అసందర్భంగానైనా, సమయోచితంగానైనా మాటాడడం అలవరుచుకున్న దానిని బట్టి ఉంటుంది.
 
" ఒక బోయవాడు రెండు చిలుకల్ని పట్టి, రెండు వేర్వేరు పంజరాలలో బంధించి అమ్మకానికి పెట్టాడు. ఓ పంజరాన్ని ఓ కటికవాడు (మాంసాహార విక్రేత), మరొక పంజరాన్ని ఓ బ్రాహ్మణుడు కొన్నారు. ఇద్దరూ ఆ చిలుకలకు మాటలు నేర్పడం మొదలు పెట్టారు. కటిక వాడు తన చిలుకకు - ' మనం దీన్ని చంపుదాం -దాన్ని కోద్దాం - అక్కడి దాన్ని చీలుద్దాం - నరుకుదాం - కైమా చేద్దాం'- ఇట్లాంటి తన దైనందిన వ్యాపారవ్యవహారాల పలుకులను నేర్పాడు. కటికవాడు తన అంగడిలో దాన్ని ఉంచాడు. అంగడికి వచ్చిన వారందరిలో చిలుక తన యజమాని నేర్పిన పలుకులన్నీ తు.చ. తప్పక వల్లే వేస్తూండడంవల్ల - ముందుగా వారు ఆశ్చర్యం చెందినా, ఆ తరువాత కర్ణ కఠోరమైన ఆ మాటలు వినాలంటే వారికి ఓ రకమైన జుగుప్స, భయం కలిగి అంగడికి రావడమే మానేసారు. వ్యాపారం గూడా మందగించింది.
 
మరి, బ్రాహ్మణుడు తన చిలుకకు మంచికి, మర్యాదకు, మన్ననకు ఆలవాలమైన పదాలన్నింటిని నేర్పాడు. ' మీకు నమస్కారం - బాగున్నారా - మన వారందరూ క్షేమమేగా - మీ రాక మాకు చాలా సంతోషం కలిగిస్తోంది - ఎండలో చాలా దూరంనుండి వచ్చినట్టున్నారు - కాస్త దాహం తీసుకుంటారా? - ఇప్పుడు మీకు నేను ఏ సహాయం చేయగలను?- సెలవియ్యండి'- వంటి మధురమైన పలుకులతో ఆ చిలుక సందర్శకులను ఆకర్షించడం మొదలు పెట్టింది. దీనిని గమనించిన గ్రామస్థులు, పొరుగువారు ఆ బ్రాహ్మణుని యింటిని తండోపతండాలుగా సందర్శించి ఆ చిలుక పలుకులను వేనోళ్ళ మెచ్చుకోవడం జరిగింది.

నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాంత రంగ, నా దేశం సంస్కార గంగ, ~సినారే

ఓటమిని ఒప్పుకోను.. పోరుకు వెనుకాడను..  కాలం నుదిటిపై పాతను చెరిపేస్తా..  కొత్త రాతను లిఖిస్తా.. నూతన గీతాన్ని ఆలపిస్తా..’

జీవితంపై వాజపేయ్గారు  సమరశంఖారావం ఇది.   జీవితంలో పైకెదగాలనుకునే ప్రతి ఒక్కరికీ అన్వయించే స్ఫూర్తిమంత్రంవాజపేయ్గారు అన్నట్లుగా   "భారత్ కోయి భూమి కా తుక్దా నహి హై, జీతా జాగ్తా రాష్ట్ర పురుష్ హై."

"యే వందన్ కి ధర్తీ హై, అభినందన్ కి ధర్తీ హై .... యే అర్పన్ కి భూమి హై, దర్పన్ కి భూమి హై."

"యహాన్ కి నదీ నదీ హమారే లియే గంగా హై, ఇస్కా కంకర్ కంకర్ హమారే లియే శంకర్ హై."

"హమ్ జియాంగే తో ఇస్ భారత్ కే లియే, మరేంగే తొ ఇస్ భారత్ కే లియే."

ఔర్మరనేకే బాద్భీ అగర్కోయీ హమారీ అస్థియోం కో గంగా మే బహతే హూయే సున్తాహైతో

ఎక్హీ ఆవాజ్ఆతీహై భారత్ మాతా కీ జై. వాజపేయ్

భారత్అంటే భూమి ముక్క కాదు ఒక సజీవ చైతన్య స్వరూపం

ఇది వందనీయ భూమి ,,,, అభినందనీయ భూమి

ఇక్కడ ప్రవహించే ప్రతీ నదీ మాకు గంగనదీ సమానం

కంకర కంకర కూడా మాకు శంకరునితొ సమానం

మేము మరణించిన తర్వాత కూడా ఎవరైనా గంగానదిలో ప్రవహించే మా బూడిదను ఎవరైనా వింటే, ఒకే ఒక్క స్వరం వస్తుంది - భారత్ మాతా కీ జై. "

ఒంటి కాలితో ఎవరెస్ట్‌ ఎక్కిన బాలిక అరుణిమా సింహా Arunima Sinha: On top of the world
 
https://www.youtube.com/watch?v=Wx9v_J34Fyo

https://www.youtube.com/watch?v=58ag-EYsOF0&t=189s

నిజమైన రత్నాలు

"పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితం

మూఢైః పాషాణ ఖండేషు రత్న సంజ్ఞా విధీయతే"

"ఈ లోకంలో జలం, అన్నం, సుభాషితం అనే మూడు మాత్రమే నిజమైన రత్నాలు. కానీ మూర్ఖులు మాత్రం కేవలం రాళ్ళనే రత్నాలని వ్యవహరిస్తారు" అని ఈ శ్లోకానికి భావం

రత్నాలు అంటే వజ్ర, వైడూర్యాదులు. ఇవి విలువైన రాళ్ళు. వ్యవహారంలో "రత్నము" అనే పదాన్ని శ్రేష్ఠతా వాచకంగా కూడా ప్రయోగిస్తారు.ఆ దృష్టితో ఆలోచిస్తే పృథివిలో మూడు శ్రేష్ఠ వస్తువులున్నాయి. అవి – నీరు, అన్నము, ఒక మంచిమాట. వీనిలో మొదటి రెండూ మానవులకు జీవశక్తిని ఇచ్చేవికాగా, మూడవది మానవులు మానవులుగా జీవించటానికి అవసరమైన సంస్కారాన్ని ఇస్తుంది.

"భాషాసు ముఖ్యా మధురా దివ్యా గీర్వాణ భారతీ

తస్మాద్ధి కావ్యం మధురం తస్మాదపి సుభాషితమ్"

(భాషలలో సంస్కృత భాష ముఖ్యం, మధురం, దివ్యం.దానిలో కావ్యం మధురం, ఆ కావ్యములోకూడా సుభాషితం మరింత మధురం) అని ఆర్యోక్తి. అందుకే వీటిని అమూల్య వస్తువులుగా భావించి ఆదరించాలి.

"Thousands have lived without love, not one without water" అంటుందొక ఆంగ్ల సూక్తి. అంటే, ప్రేమ రాహిత్య స్థితి ఉన్నా ఫరవాలేదని కాదు. తమ ప్రాణాలు నిలుపుకోవటానికి ప్రాథమికంగా జీవకోటి- జలాన్ని, ఆహారాన్ని ఆశ్రయించాలి. అందుకే నీటికి "జీవము" అనే పేరుకూడా ఉంది. అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావించటం సర్వవిదితం. అసలు జీవం ఉంటేనే కదా - ప్రేమాదులు!.

దేహధారణ ఫలితం-జ్ఞానసాధన. ఇది పశు, పక్ష్యాదులకు సాధ్యం కాదు. మానవులకే సాధ్యం. జ్ఞానం - వివిధ సాహిత్య ప్రక్రియలలో నిక్షిప్తమై ఉంది. "విశ్వ శ్రేయః కావ్యమ్" అన్నారు పెద్దలు. జ్ఞాన పరమావధి విశ్వ శ్రేయమే.

అల్పాక్షరాల్లో, సూత్రప్రాయంగా, సుబోధకంగా హితవు చెప్పే సుభాషితాన్ని మించిన రత్న మేముంది?"బాలాదపి సుభాషితమ్" (బాలునినుంచియైనా మంచిమాటను స్వీక రించాలి) అనేది మన పెద్దల విశాలదృక్పథం.

"సుభాషిత రసస్యాగ్రే సుధా భీతా దివంగతా" (సుభాషిత రస మాధుర్యంతో పోటీ పడలేక అమృతం స్వర్గానికి వెళ్ళిపోయింది) అన్నాడొక కవి.సుభాషిత ధారణ, తద్భావాచరణ మానవులను అమృత స్థితికి చేరుస్తాయనటంలో ఈషణ్మాత్రం సందేహం లేదు.   స్వస్తి! 

తెలుగు భాష ను మన ఇళ్ల లోనే వాడటం మానేశామా ?

డోర్ లాక్ చెయ్యకండి, నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ  ? ’ఇందులో ‘కీస్’ కు అచ్చ తెలుగు పదం వాడొచ్చు. కానీ మనం వాడం.  ఎందుకు ?

ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే,   తలుపు తాళం వేసుకో, గడియ పెట్టుకో అనే వాళ్ళం. ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?

మన తెలుగులో మాటలు లేవా ?  "ఏ భాష చేణుకైన ఏ యాస చినుకైన తనలోన కలుపుకుని తరలింది తెలుగు" అన్నారు సినారె;  ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !  కానీ మనం పలకం.

వంటింటిని......కిచెన్ చేసాం.    వసారా.....వరండాగా మారింది.  ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.   మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు.

ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో,  డిన్నరో చేస్తారు.  భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం.    అందులో వడ్డించే వన్నీ.......  రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే.  

అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి అంటే, ఇంకేమన్నా ఉందా,  వాళ్ళేమనుకుంటారో అని భయం. అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం.

బ్యాగ్ పట్టుకుని షాప్‍ కు వెళ్తున్నాము. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.     ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడను అడిగా. ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి ? అని ఎదురు ప్రశ్న వేసింది. బిత్తరపోవడం నావంతయింది.

టీ.వీ లో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు,   వంటా - వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళ కు అలవోకగా ఆంగ్ల పదాలు పట్టుబడతాయి మరి.    అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు.    టీ.వీ వంటల కార్యక్రమం లో ఒకావిడ మన కు వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది.     అది ఏ భాషో మీరే చెప్పండి.

 

‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, స్టౌవ్ ఆఫ్‍ చేసి మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలాసాగుతుంది.    మరి మన కూరల కు అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?  నిన్న మా పక్కింటాయన వచ్చి

‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ అని చెప్పి వెళ్ళాడు.

మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది ? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం ?   అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న    అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.    పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్‍ కు పంపిస్తాం.

సరే బడికి వెళ్ళాక వాళ్ళకు ఎలాగూ ఇంగ్లీషు లో మాట్లాడక తప్పదు.   ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము.   మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలను వదిలేస్తున్నాం ? ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకు సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా ? తెలుగు మాటలు మనకు మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి ? ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు, నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం,    ఇతరులు అనుకోవాలన్న భావన.

ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.

అలాగని వాడుకలో ఉన్నమాటలను వదిలేసి పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించి పోతుంది. బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా, కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం.

వేదములు మరియు ఉపనిషత్తులు ఎవరూ మానవులు రచించినవో లేక వ్రాసినవి కాదు. మానవ సృష్టి మరియు మనుగడకు దేవలోకంలో ఆవిర్భవించినవి.

 

వేదములు మరియు ఉపనిషత్తులు ఎవరూ మానవులు రచించినవో లేక వ్రాసినవి కాదు.

మానవ సృష్టి మరియు మనుగడకు దేవలోకంలో ఆవిర్భవించినవి.

ఈ క్రింద ఇవ్వబడిన ఆశీర్వాద శాంతి మంత్రములు, మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని నేటి కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి విశ్వం శాంతి, శుభం మరియు క్షేమం కొరకు పఠించేవారు. వేదపండితులు మరియు బ్రాహ్మణుల ద్వారా పఠించబడే ఈ ఆశీర్వాద శాంతి మంత్రములు సమాజంలో, శ్రేయస్సును, శాంతిని, శుభాన్ని పెంచడానికి ఖచ్చితంగా దోహదం చేస్తాయి. వీటి అర్ధం తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఆవశ్యకత వుంది 

👉ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై

తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై

ఓం శాంతి: శాంతి: శాంతి:..!

తాత్పర్యం:

సర్వ జీవులు రక్షింపబడుదురు గాక.! సర్వ జీవులు పోషింపబడుదురు గాక.!

అందరూ కలిసి పని చేయుగాక.!

(అందరూ సమాజ శ్రేయస్సు కోసం)

మన మేధస్సు వృద్ది చెందు గాక.!

మన మధ్య విద్వేషాలు రాకుండుగాక..!

ఆత్మా (వ్యక్తిగత) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక.!

*****************************

 

👉ఓం సర్వేషాం స్వస్తిర్భవతు..!

ఓం సర్వేషాం శాంతిర్భవతు..!

ఓం సర్వేషాం పూర్ణం భవతు..!

ఓం సర్వేషాం మంగళం భవతు..!

 

తాత్పర్యం:

అందరికి ఆయురారోగ్య సుఖసంతోషములు కలుగుగాక..!

అందరికి శాంతి కలుగు గాక..!

అందరికి పూర్ణ స్థితి కలుగుగాక..! సర్వులకు శుభము కలుగుగాక..!

*****************************

 

👉ఓం సర్వేత్ర సుఖిన: సంతు,

సర్వే సంతు నిరామయా,

సర్వే భద్రాణి పశ్యన్తు మాకశ్చి: దుఃఖ:మాప్నుయాత్...

 

తాత్పర్యం:

అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక..!

అందరూ ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండు గాక..!

అందరికీ ఉన్నత స్థితి కలుగు గాక..!

ఎవరికీ ఏ బాధలు లేకుండు గాక..!

*****************************

 

👉కాలే వర్షతు పర్జన్య: పృథివీ సస్య శాలినీ

దేశోయం క్షోభ రహితో, బ్రహ్మణా సంతు నిర్భయ:

 

తాత్పర్యం:

మేఘాలు సకాలములో కురియు గాక. భూమి సస్యశ్యామలమై పండు గాక. దేశములో ఎవరికీ ఏ బాధలు లేకుండు గాక. బ్రాహ్మణులూ, వారి సంతతి  నిర్భయులై జీవింతురు గాక.

*****************************

 

👉ఓం అసతోమా సద్గమయ..!

తమసోమా జ్యోతిర్గమయ..!మృత్యోర్మా అమృతంగమయ..!

ఓం శాంతి: శాంతి: శాంతి:

 

తాత్పర్యం:

సర్వవ్యాపి, నిరాకారుడైన భగవంతుడా, మమ్ములను అందరినీ, అన్యాయము, అధర్మం మరియు అసత్యము నుంచి న్యాయం, ధర్మం మరియు సత్యము వైపునకు గొనిపొమ్ము. అజ్ఞానమనే అంధకారము నుండి సజ్ఞానస్వరూపమైన వెలుగునకు దారి చూపుము. మృత్యు భయము నుండి శాశ్వతమైన అమృతత్వము దిశగా మమ్ము నడిపించుము.

*****************************

 

👉స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహీం మహీశా,

గో బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం, లోకా: సమస్తా సుఖినో భవంతు..!

 

తాత్పర్యం:

ప్రజలకు శుభము కలుగు గాక..!

ఈ భూమిని పాలించే ప్రభువులందరూ ధర్మం మరియు న్యాయ మార్గంలో పాలింతురు గాక..!

గోవులకు, బ్రాహ్మణులకు సర్వదా క్షేమము, సంతోషము మరియు శుభము ప్రతిరోజూ కలుగునట్లుగా పాలింపబడుదురుగాక..!

జగతి లోని సర్వ జనులందరూ సదా సుఖ సంతోషాలతో వర్దిల్లెదరు గాక..!

*****************************

 

👉ఓం శం నో మిత్ర: శం నో వరుణ:

ఓం శం నో భవత్వర్యమా:

శం నో ఇంద్రో బృహస్పతి:

శం నో విష్ణు రురుక్రమ:

నమో బ్రాహ్మణః

నమో వాయు:

త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి

త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి

ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి

తన్మామవతు తద్వక్తారమవతు

అవతు మాం, అవతు మక్తారం

ఓం శాంతి: శాంతి: శాంతి:..!

 

తాత్పర్యం:

సూర్యుడు, వరుణుడు, యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు వీరందరూ మన యెడల ప్రసన్నం అగుదురు గాక..!

బ్రాహ్మణులకు వందనం. వాయుదేవునకు వందనం.

నీవే ప్రత్యక్ష బ్రహ్మవు.

నేను బ్రహ్మమునే పలికెదను. సత్యమునే పలికెదను.

సత్యము మరియు బ్రహ్మము నన్ను రక్షించు గాక..!

నా గురువులను, సంరక్షకులను రక్షించు గాక..!

*****************************

 

👉ఓం ద్యౌ శాంతి:..!

అంతరిక్షం శాంతి:..!

పృథివీ శాంతి:..!

ఆపా శాంతి:..!

ఔషదయ శాంతి:..!

వనస్పతయ: శాంతి:‌..!

విశ్వే దేవా: శాంతి:..!

బ్రహ్మ శాంతి:..!

సర్వం శాంతి:..!

శాంతి రేవా: శాంతి:..!

సామా: శాంతిరేది :..!

ఓం శాంతి: శాంతి: శాంతి:..!

 

తాత్పర్యం:

స్వర్గము నందు, దేవలోకము నందు, ఆకాశము నందు, అంతరిక్షము నందు, భూమి పైన, జలము నందు, భూమి పై ఉన్న ఓషధులు మరియు వనమూలికలు,

అన్ని లోకము లందలి దేవతలయందు, బ్రహ్మ యందు, సర్వ జనులయందు, శాంతి నెలకొను గాక..!

పంచభూతముల ప్రకృతి వలన కాని,  బ్రహ్మ మొదలగు దేవతల వలన కాని, అపాయములు కలుగకుండును గాక..! శాంతి యందె శాంతి నెలకొను గాక..! నాయందు శాంతి నెలకొను గాక..!

 

పైన చెప్పిన ఆశీర్వాద శాంతి మంత్రములు అందరూ తప్పక చదివి అర్ధం చేసుకోండి. మన భారతీయ సంస్కృతీ ఎంత గొప్పదో తెలుస్తుంది. మన కోసమే కాక, అందరి క్షేమం కోసం, సర్వ ప్రాణుల సుఖ సంతోషాల కోసం పఠింపబడుతున్నవి.

 

ధర్మో రక్షతి రక్షితః...!

ధర్మో రక్షతి రక్షితః...!

ధర్మో రక్షతి రక్షితః...!

 

అనగా, అందరూ వారి వారికి నిర్దేశించిన ధర్మమార్గములో జీవనం కొనసాగిస్తూ వుంటే, ఆ ధర్మమే, ఎలాంటి దుష్టాంతరాలు రాకుండా, మొత్తం ప్రపంచాన్ని అన్ని విధాలా తప్పక కాపాడుతుంది అని..!

 

 

* * * సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు * * *





Sunday, July 11, 2021

అషాఢ ఆరంభ శుభ సాయంకాలం!

అషాఢ ఆరంభ శుభ సాయంకాలం! 

ఈ సాయత్రం మబ్బుపట్టి కొంత వింతగా వుంది. 

అచ్చంగా వో షాం కుచ అజీబ్‌ థీ అన్న గుల్జార్‌ కలల భావన కలంలోంచి జాలువారి

కిషోర్‌ కుమార్‌ గళంలోంచి పలుకుతూ వింతగా వుంది 

ఈ లింక్‌ లో ఆ పాట వినండి 

                           https://www.youtube.com/watch?v=MDXFi3avqo0



Saturday, July 10, 2021

చిరంజీవి వైభవ్‌ ఇంటర్వూ ఈ టీవీ యువ కార్యక్రమం లో ప్రసారం మరియు చిత్రీకరణ భాగాలు

 చిరంజీవి వైభవ్‌ ఇంటర్వూ ఈ టీవీ యువ కార్యక్రమం లో ప్రసారం 

https://www.youtube.com/watch?v=wEjjl-Zeka0

చిరంజీవి వైభవ్‌ ఇంటర్వూ ఈ టీవీ యువ చిత్రీకరణ భాగం 1

https://www.youtube.com/watch?v=Rk925Cd9ahg

చిరంజీవి వైభవ్‌ ఇంటర్వూ ఈ టీవీ యువ చిత్రీకరణ భాగం 2

https://www.youtube.com/watch?v=GCUu7tHs3Oc

చిరంజీవి వైభవ్‌ ఇంటర్వూ ఈ టీవీ యువ చిత్రీకరణ భాగం 3

https://www.youtube.com/watch?v=pwOkRGjsHR0

చిరంజీవి వైభవ్‌ ఇంటర్వూ ఈ టీవీ యువ చిత్రీకరణ భాగం 4

https://www.youtube.com/watch?v=pvF9P6I1Am0

చిరంజీవి వైభవ్‌ ఇంటర్వూ ఈ టీవీ యువ చిత్రీకరణ భాగం 5

https://www.youtube.com/watch?v=v9DkXbrZXvg

చిరంజీవి వైభవ్‌ ఇంటర్వూ ఈ టీవీ యువ చిత్రీకరణ భాగం 6

https://www.youtube.com/watch?v=t8ZK1rnQirA

చిరంజీవి వైభవ్‌ ఇంటర్వూ ఈ టీవీ యువ చిత్రీకరణ భాగం 7

https://www.youtube.com/watch?v=Xc-x2wjPt1c

Sunday, July 4, 2021

మా వైభవం KLK Rao. Uncle, Padma అంటీ

 *వైభవ్* జన్మదిన సందర్భంగా! 

*మనిషి గొప్పతనం* నమ్మడము లోనో, నమ్మించడం లోనో ఉండదు.

*నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోవడంలో ఉంటుది*.

 *అ నమ్మకమే చి. వైభవ్*.  

నేను ODF లో ఉన్నప్పుడు మా ఇంట్లో బిల్వపత్రం చేట్టు ఉండెది. బిల్వపత్రం గూర్చి అప్పుడప్పుడు వచ్చే వాడు. ఇంట్లోకి రమ్మంటే సిగ్గుతో వచ్చి, చెప్పండి అంకుల్ అని, ఆత్మీయతతో నాలుగు మంచి మాటలు మాట్లాడి వెళ్లెవాడు. ఆ మాటల్లో మాధుర్యం తీపిదనం ఉండెది. 

నేను ఒకసారి ఊరు వెళ్లడం జరిగింది. ఇంట్లో అంటీ ఒకరే ఉన్నారు. ఆ సమయంలో మా ఇంట్లో త్రాగడానికి నీరు లెవు. Jr క్లబ్ కి వెళ్ళి తీసుకురావడం ఇబ్బందికరం ఉంది అని పోన్ వచ్చింది.ఇంతలో ఆ క్షణంలో వైభవ్ గుర్తుకు వచ్చి ఫోన్ చెసాను. వెంటనే ok అని కేవలం 10 నిమిషాలో క్లబ్ నుండి త్రాగు నీరు ఇంటికి తీసుకు రావడం జరిగింది. 

తరువాత పద్మ అంటీ కీ ఫోన్ చేస్తూ నేను Odf వచ్చే వరకు మంగళవారం, శనివారం బండి మీద గుడికి కూడా తీసుకెళ్తూ, ఎది కావలన్న సహాయం చేసిన మనసున్న మహారాజు. ఇవన్నీ వారి అమ్మ నాన్న కు తెలియకుండానే సహాయం చేసే మహోన్నత వ్యక్తి వైభవ్. 

అందరికి గౌరవం ఇచ్చే చి. వైభవ్ విస్సా, అందరి మదిలో ఉన్నాడని తెలియజేస్తూ..

KLK Rao. Uncle, Padma అంటీ

Total Pageviews