ముందుగా శ్రీ గణేష్ ప్రార్థన, సరస్వతి ప్రార్ధన
అంశాలు : సమయపాలన, ఆరోగ్య జాగ్రత్తలు, వేదిక్ మాథ్స్ పరిచయం, వ్యక్తిత్వ వికాసం, ఆటలు, పాటలు, పద్యాలు, కవితలు, హాస్యం, వినోదం
సామెతలు, జాతీయాలు, చందమామ, బాలమిత్రుల ఆసక్తికర అంశాలు, వారికి ఇష్టమైన కష్టమైన అంశాల వివరణ ఇలా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రతి వారం మన బాలానందం!
నోరు
మంచిదయితే ఊరు మంచిదవుతుంది అని ఓ సామెత
మనం
ఎవరితో మాట్లాడినా మాట్లాడే తీరు ముఖ్యం.
దానిలోనే
సభ్యత, సంస్కారం, వ్యక్తిత్వం తెలుస్తాయి మాటలతో అందరి ప్రశంసలు పొందాలంటే మాటలు కాదు
శ్రీ
రాముణ్ణి స్మిత పూర్వాభి భాషి అంటారు మాట్లాడే ముందు చిరునవ్వు నవ్వుతాడు
ఆత్మీయులతో
మాట్లాడినా, అపరిచితులతో మాట్లాడినా ఎదుటివాళ్ళ ముఖాన్ని అప్పుడప్పుడు పరిశీలిస్తూ
వుండాలి.
ఇందువల్ల
మనం చెప్పేది జాగ్రత్తగా వింటున్నారా లేదా అని గమనించగలుగుతాం. వింటున్నారనుకుంటే మనం
సంభాషణ సాగించాలి. లేదా ఎదుటి వాళ్ళ ఆసక్తిని కనిపెట్టి విషయాన్ని మార్చాలి.
నిర్భయంగా,
నిజాయితీగా మాట్లాడాలి "ఉచ్చారయతి కల్యాణీ వాచ్యం హృదయ హర్షిణీం"
ఎదుటివాళ్ళు
కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేకపోతే సంభాషణ విసుగెత్తి పోతుంది. ఎక్కువమంది మన చుట్టూ
వుంటే సాధ్యమైనంత వరకు అందరికీ పరిచయమైన విషయాలు అర్థమయ్యే విషయాలు మాట్లాడటం అలవాటు
చేసుకోవాలి. తల్లిదండ్రులతో, గురువులతో, పెద్దలతో సంభాషించే తీరు వేరుగా వుండాలి. సమ
వయస్సు గల వారితో మాట్లాడే సంభాషణ తీరు వేరుగా వుండాలి. మాట్లాడేటప్పుడు మన ఆరోగ్యం,
మన కష్టాలు, మన తాపత్రయాలు, ఇంటి గొడవలు వంటి వ్యక్తిగత విషయాలు ఏకరువు పెట్టకూడదు.
మన గురించే, మన అనుభవాలనే ఏకరువు పెడుతుంటే సంభాషణ రక్తికట్టదు. కాదనడం, అపనమ్మకం,
ఎత్తిపొడుపు మాటలు, ఆపేక్షణ వంటివి సంభాషణ చెడిపోవడానికి దారితీస్తాయి.
సంభాషణ అనేది ఎదుటి వారు మనకు మిత్రులుగా మిగిలిపోవడానికో,
శత్రువులుగా విడిపోవడానికో దారితీస్తుందని గుర్తుంచుకోవాలి. ఏమి మాట్లాడుతున్నామో తూచి
తూచి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ సంతోషకరమైన విషయాలు మాట్లాడుకోవాలి. నిస్పృహ
ధ్వనించే మాటలు నాలుక చివరికి వస్తే దానిని ఆపుకొని సరదాగా మాట్లాడడానికి ప్రయత్నిచాలి.
ఇందువల్ల సాటివారికి మరింత ఇష్టులవుతాము. ఆ వ్యక్తితో ఇతర విషయాలతో పాటు సినిమా విషయాలు
చెపితే మనం చెప్పే విషయాలు జాగ్రత్తగా వింటాడు. మనకు చేరువవుతాడు. సంభాషణా చాతుర్యం
అనేది నలుగురి చేత ఆనందిపజేయగల విందులాంటిది.
వినదగు
నెవ్వరు చెప్పిన
వినినంతనె
వేగపడక వివరింపదగున్
గనికల్ల
నిజము దెలిసిన
మనుజుడెపో
నీతిపరుడు మహిలో సుమతీ
ఎవరు చెప్పినా వినాలి.
వినగానే తొందర పడక నిజమో,
అబద్దమో... తెలుకోవాలి. ఇది బద్దెన గారి
సూక్తి. మరి ఎంత మంది
ఇలా మంచి చెడ్డలు పరిశీలించి
న్యాయ పరమైన నిర్ణయాలు తీసుకొంటున్నారు.
అందువల్లే .. చాడీలు చెప్పే వారి మాటలే చెల్లుబాటు
అవుతున్నాయి. నిజానిజాలు గమనించక... తొందర నిర్ణయాలు తీసుకొని...
అపార్ధాలతో.... ఆవేశపడి, ఆతర్వాత ఎంత బాధపడితే.... ఎమి
ప్రయోజనం...! చెప్పుడు మాటలు విని శతృత్వం
తెచ్చుకొంటే.. ఆ తర్వాత సర్దుకుపోవడానికి
నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఒకవేళ చెప్పుడు మాటలతో
బలమైన వ్యక్తులను ఢీ కొట్టాల్సివస్తే.. మొదటికే
మోసం రావచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకోన్నట్లవుతుంది.
' మంత్రం' - అంటే, వేదమంత్రాలే కానవసరంలేదు.
ఎదుటి వారిని మంత్ర ముగ్ధుల్ని చేసే మాటలే మంత్రాలు.
' స్వరాజ్యం నా జన్మ హక్కు ' - అన్న బాలగంగాధర తిలక్; ' స్వాతంత్ర్య సమరంలో
పంచాక్షరీ మంత్రంలాగా పనిచేసిన ' వందేమాతరం ' నినాదం; పాకిస్తాన్ తో యుద్ధ సమయంలో
లాల్ బహదూర్ శాస్త్రి యిచ్చిన ' జైజవాన్ - జై కిసాన్' నినాదం; - యిలా ఎన్నో
ఉదాహరణలు మాటకున్న మంత్ర శక్తిని మనకు స్పష్టంగా తెలియజేస్తాయి.
' నీకు దేశం ఏమిచ్చిందని అడగొద్దు - నువ్వేం చేయగలవో ఆలోచించు ' - అని అప్పటి
అమెరికా అధ్యక్షుడు 'కెన్నెడి' అన్నప్పుడు ప్రజలు నిజంగా ఆలోచించడం మొదలు
పెట్టారు. ' దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా - దేశమంటే మట్టికాదోయ్,
దేశమంటే మనుషులోయ్ ' - అని గురజాడ కవి దేశభక్తిని మంత్రాల్లాంటి మాటలతో
నూరిపోసారు. వందేళ్ళ క్రితం రాసిన ఆ పదాలు నేటికీ మార్మోగుతున్నాయి. ' దేశానికి
రాజు నైనా - తల్లికి బిడ్డనే ' - అన్న తెలుగు ఠీవి పి.వి. మాటలు మన మనస్సులలో
యింకా మెదులుతూనే ఉన్నాయి. ఇలాంటి మాటలు మంత్రాల్లా పనిచేసాయి. అవి ఎందరినో
ప్రభావితం చేసాయి. ఇంకా చేస్తున్నాయి.
మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? - అని కొందరు ప్రశ్నించవచ్చు. రాలక పోవచ్చు. కానీ,
మాటల మంత్రాలతో ప్రపంచాన్నే జయించవచ్చు. ఈ కాలంలో ఏ రంగంలోనైనా ' కమ్యూనికేషన్
స్కిల్స్ ' అత్యవసరం. బంగారంల్లాంటి పలుకులతో జీవితానికి బంగారు బాట వేసుకోవాలి.
అట్లా మాట్లాడ లేకపోవడం వలన మనుష్యుల మధ్య అగాధం ఏర్పడుతుంది. పిల్లలు కలిగున్న
భార్యాభర్తలు గూడా విడిపోతున్నారు. కస్టమర్స్ తో సరిగా మాట్లాడ లేకపోవడం వలన
వ్యాపారం దెబ్బ తింటుంది. సాటి ఉద్యోగులతో సహనం కోల్పోయి మాట్లాడడం వలన సఖ్యత
లోపిస్తుంది.
' నోరే రసభరితమైన నుడువులకెల్లన్ ' - అని సుమతీ శతకకారుడు ఏ నాడో చెప్పాడు.
రసవంతమైన మాటలన్నింటికీ నోరే ఆధారమనడంలో కవి ఉద్దేశ్య మేమిటి? రసభరితములైన మాటే
ఏమిటి, ఏ మాటలైనా నోటినుండి వస్తాయి గదా! నోరు అంటే, అందులో ఉండే నాలుక, మాటాడే ఒక
అవయం. ఒక సాధనం. దానంతట అది పనిచేయదు. దాని నుపయోగించేవారు ఏది చేయిస్తే అది, ఎలా
చేయిస్తే అలా చేస్తుంది. ' నోరు ' ఒక కత్తిలాంటిదో, కట్టెలాంటిదో కాదు. శరీరంలో ఒక
భాగం, అవయం. సజీవ సాధనం. మనిషే కాదు, మనిషి అవయవాలూ అలవాటు చేయడాన్ని బట్టి ప్రవర్తిస్తాయి.
ఎడమచేతి వాటం మొదలైనవి ఇలా అలవాటుని బట్టి స్థిర పడినవే. నడవడం, పనిచేయడం, చూడడం,
పలకడం గూడా అలవాటునిబట్టే ఉంటాయి. ' ఏ గూటి చిలుక ఆ గూటి పలుకు పలుకుతుం'దంటారు.
అలాగే నోరూ. పరుషంగానైనా, మృదువుగానైనా, అనుచితంగానైనా, సముచితంగానైనా,
అసందర్భంగానైనా, సమయోచితంగానైనా మాటాడడం అలవరుచుకున్న దానిని బట్టి ఉంటుంది.
" ఒక బోయవాడు రెండు చిలుకల్ని పట్టి, రెండు వేర్వేరు పంజరాలలో బంధించి
అమ్మకానికి పెట్టాడు. ఓ పంజరాన్ని ఓ కటికవాడు (మాంసాహార విక్రేత), మరొక పంజరాన్ని
ఓ బ్రాహ్మణుడు కొన్నారు. ఇద్దరూ ఆ చిలుకలకు మాటలు నేర్పడం మొదలు పెట్టారు. కటిక
వాడు తన చిలుకకు - ' మనం దీన్ని చంపుదాం -దాన్ని కోద్దాం - అక్కడి దాన్ని
చీలుద్దాం - నరుకుదాం - కైమా చేద్దాం'- ఇట్లాంటి తన దైనందిన వ్యాపారవ్యవహారాల
పలుకులను నేర్పాడు. కటికవాడు తన అంగడిలో దాన్ని ఉంచాడు. అంగడికి వచ్చిన వారందరిలో
చిలుక తన యజమాని నేర్పిన పలుకులన్నీ తు.చ. తప్పక వల్లే వేస్తూండడంవల్ల - ముందుగా
వారు ఆశ్చర్యం చెందినా, ఆ తరువాత కర్ణ కఠోరమైన ఆ మాటలు వినాలంటే వారికి ఓ రకమైన
జుగుప్స, భయం కలిగి అంగడికి రావడమే మానేసారు. వ్యాపారం గూడా మందగించింది.
మరి, బ్రాహ్మణుడు తన చిలుకకు మంచికి, మర్యాదకు, మన్ననకు ఆలవాలమైన పదాలన్నింటిని
నేర్పాడు. ' మీకు నమస్కారం - బాగున్నారా - మన వారందరూ క్షేమమేగా - మీ రాక మాకు
చాలా సంతోషం కలిగిస్తోంది - ఎండలో చాలా దూరంనుండి వచ్చినట్టున్నారు - కాస్త దాహం
తీసుకుంటారా? - ఇప్పుడు మీకు నేను ఏ సహాయం చేయగలను?- సెలవియ్యండి'- వంటి మధురమైన
పలుకులతో ఆ చిలుక సందర్శకులను ఆకర్షించడం మొదలు పెట్టింది. దీనిని గమనించిన
గ్రామస్థులు, పొరుగువారు ఆ బ్రాహ్మణుని యింటిని తండోపతండాలుగా సందర్శించి ఆ చిలుక
పలుకులను వేనోళ్ళ మెచ్చుకోవడం జరిగింది.
నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాంత రంగ, నా దేశం సంస్కార గంగ, ~సినారే
‘ఓటమిని ఒప్పుకోను.. పోరుకు వెనుకాడను.. కాలం నుదిటిపై పాతను చెరిపేస్తా.. కొత్త రాతను లిఖిస్తా.. నూతన గీతాన్ని ఆలపిస్తా..’
జీవితంపై వాజపేయ్ గారు సమరశంఖారావం ఇది. జీవితంలో
పైకెదగాలనుకునే ప్రతి ఒక్కరికీ అన్వయించే స్ఫూర్తిమంత్రం. వాజపేయ్ గారు అన్నట్లుగా "భారత్ కోయి భూమి కా తుక్దా నహి హై, జీతా జాగ్తా రాష్ట్ర పురుష్ హై."
"యే వందన్ కి ధర్తీ హై, అభినందన్ కి ధర్తీ హై .... యే అర్పన్ కి భూమి హై, దర్పన్ కి భూమి హై."
"యహాన్ కి నదీ నదీ హమారే లియే గంగా హై, ఇస్కా కంకర్ కంకర్ హమారే లియే శంకర్ హై."
"హమ్ జియాంగే తో ఇస్ భారత్ కే లియే, మరేంగే తొ ఇస్ భారత్ కే లియే."
ఔర్ మరనేకే బాద్ భీ అగర్ కోయీ హమారీ అస్థియోం కో గంగా మే బహతే హూయే సున్తాహైతో
ఎక్ హీ ఆవాజ్ ఆతీహై భారత్ మాతా కీ జై. వాజపేయ్
భారత్
అంటే భూమి ముక్క కాదు ఒక సజీవ చైతన్య స్వరూపం
ఇది వందనీయ భూమి ,,,, అభినందనీయ భూమి
ఇక్కడ
ప్రవహించే ప్రతీ నదీ మాకు గంగనదీ సమానం
కంకర కంకర కూడా మాకు శంకరునితొ సమానం
మేము మరణించిన తర్వాత కూడా ఎవరైనా గంగానదిలో ప్రవహించే మా బూడిదను ఎవరైనా వింటే, ఒకే ఒక్క స్వరం వస్తుంది - భారత్ మాతా కీ జై. "
ఒంటి కాలితో
ఎవరెస్ట్ ఎక్కిన బాలిక అరుణిమా సింహా Arunima Sinha: On top of the world
https://www.youtube.com/watch?v=Wx9v_J34Fyo
https://www.youtube.com/watch?v=58ag-EYsOF0&t=189s
నిజమైన రత్నాలు
"పృథివ్యాం
త్రీణి రత్నాని జలమన్నం సుభాషితం
మూఢైః పాషాణ ఖండేషు రత్న సంజ్ఞా విధీయతే"
"ఈ లోకంలో జలం, అన్నం, సుభాషితం అనే
మూడు మాత్రమే నిజమైన రత్నాలు. కానీ మూర్ఖులు మాత్రం కేవలం రాళ్ళనే రత్నాలని వ్యవహరిస్తారు"
అని ఈ శ్లోకానికి భావం
రత్నాలు అంటే వజ్ర, వైడూర్యాదులు. ఇవి
విలువైన రాళ్ళు. వ్యవహారంలో "రత్నము" అనే పదాన్ని శ్రేష్ఠతా వాచకంగా కూడా
ప్రయోగిస్తారు.ఆ దృష్టితో ఆలోచిస్తే పృథివిలో మూడు శ్రేష్ఠ వస్తువులున్నాయి. అవి –
నీరు, అన్నము, ఒక మంచిమాట. వీనిలో మొదటి రెండూ మానవులకు జీవశక్తిని ఇచ్చేవికాగా, మూడవది
మానవులు మానవులుగా జీవించటానికి అవసరమైన సంస్కారాన్ని ఇస్తుంది.
"భాషాసు
ముఖ్యా మధురా దివ్యా గీర్వాణ భారతీ
తస్మాద్ధి
కావ్యం మధురం తస్మాదపి సుభాషితమ్"
(భాషలలో సంస్కృత భాష ముఖ్యం, మధురం, దివ్యం.దానిలో
కావ్యం మధురం, ఆ కావ్యములోకూడా సుభాషితం మరింత మధురం) అని ఆర్యోక్తి. అందుకే వీటిని
అమూల్య వస్తువులుగా భావించి ఆదరించాలి.
"Thousands have lived without
love, not one without water" అంటుందొక ఆంగ్ల సూక్తి. అంటే, ప్రేమ రాహిత్య స్థితి
ఉన్నా ఫరవాలేదని కాదు. తమ ప్రాణాలు నిలుపుకోవటానికి ప్రాథమికంగా జీవకోటి- జలాన్ని,
ఆహారాన్ని ఆశ్రయించాలి. అందుకే నీటికి "జీవము" అనే పేరుకూడా ఉంది. అన్నాన్ని
పరబ్రహ్మస్వరూపంగా భావించటం సర్వవిదితం. అసలు జీవం ఉంటేనే కదా - ప్రేమాదులు!.
దేహధారణ ఫలితం-జ్ఞానసాధన. ఇది పశు, పక్ష్యాదులకు
సాధ్యం కాదు. మానవులకే సాధ్యం. జ్ఞానం - వివిధ సాహిత్య ప్రక్రియలలో నిక్షిప్తమై ఉంది.
"విశ్వ శ్రేయః కావ్యమ్" అన్నారు పెద్దలు. జ్ఞాన పరమావధి విశ్వ శ్రేయమే.
అల్పాక్షరాల్లో, సూత్రప్రాయంగా, సుబోధకంగా
హితవు చెప్పే సుభాషితాన్ని మించిన రత్న మేముంది?"బాలాదపి సుభాషితమ్" (బాలునినుంచియైనా
మంచిమాటను స్వీక రించాలి) అనేది మన పెద్దల విశాలదృక్పథం.
"సుభాషిత రసస్యాగ్రే సుధా భీతా దివంగతా"
(సుభాషిత రస మాధుర్యంతో పోటీ పడలేక అమృతం స్వర్గానికి వెళ్ళిపోయింది) అన్నాడొక కవి.సుభాషిత
ధారణ, తద్భావాచరణ మానవులను అమృత స్థితికి చేరుస్తాయనటంలో ఈషణ్మాత్రం సందేహం లేదు. స్వస్తి!
తెలుగు భాష ను మన ఇళ్ల లోనే వాడటం మానేశామా
?
డోర్ లాక్ చెయ్యకండి, నేను వెళ్తున్నా
డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ ?
’ఇందులో ‘కీస్’ కు అచ్చ తెలుగు పదం వాడొచ్చు. కానీ మనం వాడం. ఎందుకు ?
ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, తలుపు తాళం వేసుకో, గడియ పెట్టుకో అనే వాళ్ళం.
ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి
వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం
?
మన తెలుగులో మాటలు లేవా ? "ఏ భాష చేణుకైన ఏ యాస చినుకైన తనలోన కలుపుకుని
తరలింది తెలుగు" అన్నారు సినారె; ఎందుకు
లేవు, భేషుగ్గా ఉన్నాయి ! కానీ మనం పలకం.
వంటింటిని......కిచెన్ చేసాం. వసారా.....వరండాగా మారింది. ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి,
నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం. మన ఇళ్ళ కు
చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్ లే వస్తారు.
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు.
ఏ లంచో, డిన్నరో చేస్తారు. భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు
పెడుతున్నాం. అందులో వడ్డించే వన్నీ....... రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే.
అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి
అంటే, ఇంకేమన్నా ఉందా, వాళ్ళేమనుకుంటారో అని
భయం. అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం.
బ్యాగ్ పట్టుకుని షాప్ కు వెళ్తున్నాము.
అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి. ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య
ఓ పెద్దావిడను అడిగా. ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి
? అని ఎదురు ప్రశ్న వేసింది. బిత్తరపోవడం నావంతయింది.
టీ.వీ లో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు, వంటా - వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళ కు
అలవోకగా ఆంగ్ల పదాలు పట్టుబడతాయి మరి. అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు. టీ.వీ వంటల కార్యక్రమం లో ఒకావిడ మన కు వంటకం
ఎలా చెయ్యాలో చెబుతుంది. అది ఏ భాషో మీరే
చెప్పండి.
‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్,
జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, స్టౌవ్ ఆఫ్ చేసి మసాలా
పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలాసాగుతుంది. మరి మన కూరల కు అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల
రుచులు ఎలా తగుల్తాయి? నిన్న మా పక్కింటాయన
వచ్చి
‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, ఊరికి
వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ అని చెప్పి వెళ్ళాడు.
మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం
ఉంటుంది ? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం ? అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. అత్త,
మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న
అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు
వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు. పిల్లల్ని
బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్ కు పంపిస్తాం.
సరే బడికి వెళ్ళాక వాళ్ళకు ఎలాగూ ఇంగ్లీషు
లో మాట్లాడక తప్పదు. ఇంటి దగ్గరన్నా తెలుగు
మాటలు మాట్లాడాలని అనుకోము. మనం ఎందుకు నిన్నటి
వరకు వాడిన తెలుగు మాటలను వదిలేస్తున్నాం ? ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకు సమాజంలో
గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా ? తెలుగు మాటలు మనకు మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి
? ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు, నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు
అని మనకి మనం చెప్పుకోవడం, ఇతరులు అనుకోవాలన్న
భావన.
ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు
దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ
ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.
అలాగని వాడుకలో ఉన్నమాటలను వదిలేసి పరభాషా
పదాలు వాడటం వల్ల భాష క్షీణించి పోతుంది. బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా, కనీసం
ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు
మాటలకు తలుపులు తెరుద్దాం.
వేదములు
మరియు ఉపనిషత్తులు ఎవరూ మానవులు రచించినవో లేక వ్రాసినవి కాదు. మానవ సృష్టి మరియు మనుగడకు
దేవలోకంలో ఆవిర్భవించినవి.
వేదములు
మరియు ఉపనిషత్తులు ఎవరూ మానవులు రచించినవో లేక వ్రాసినవి కాదు.
మానవ
సృష్టి మరియు మనుగడకు దేవలోకంలో ఆవిర్భవించినవి.
ఈ క్రింద
ఇవ్వబడిన ఆశీర్వాద శాంతి మంత్రములు, మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని నేటి కాలంలో
పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో
గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి విశ్వం శాంతి, శుభం
మరియు క్షేమం కొరకు పఠించేవారు. వేదపండితులు మరియు బ్రాహ్మణుల ద్వారా పఠించబడే ఈ ఆశీర్వాద
శాంతి మంత్రములు సమాజంలో, శ్రేయస్సును, శాంతిని, శుభాన్ని పెంచడానికి ఖచ్చితంగా దోహదం
చేస్తాయి. వీటి అర్ధం తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఆవశ్యకత వుంది
👉ఓం
సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా
వధీతమస్తు మావిద్విషావహై
ఓం
శాంతి: శాంతి: శాంతి:..!
తాత్పర్యం:
సర్వ
జీవులు రక్షింపబడుదురు గాక.! సర్వ జీవులు పోషింపబడుదురు గాక.!
అందరూ
కలిసి పని చేయుగాక.!
(అందరూ
సమాజ శ్రేయస్సు కోసం)
మన
మేధస్సు వృద్ది చెందు గాక.!
మన
మధ్య విద్వేషాలు రాకుండుగాక..!
ఆత్మా
(వ్యక్తిగత) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక.!
*****************************
👉ఓం
సర్వేషాం స్వస్తిర్భవతు..!
ఓం
సర్వేషాం శాంతిర్భవతు..!
ఓం
సర్వేషాం పూర్ణం భవతు..!
ఓం
సర్వేషాం మంగళం భవతు..!
తాత్పర్యం:
అందరికి
ఆయురారోగ్య సుఖసంతోషములు కలుగుగాక..!
అందరికి
శాంతి కలుగు గాక..!
అందరికి
పూర్ణ స్థితి కలుగుగాక..! సర్వులకు శుభము కలుగుగాక..!
*****************************
👉ఓం
సర్వేత్ర సుఖిన: సంతు,
సర్వే
సంతు నిరామయా,
సర్వే
భద్రాణి పశ్యన్తు మాకశ్చి: దుఃఖ:మాప్నుయాత్...
తాత్పర్యం:
అందరూ
సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక..!
అందరూ
ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండు గాక..!
అందరికీ
ఉన్నత స్థితి కలుగు గాక..!
ఎవరికీ
ఏ బాధలు లేకుండు గాక..!
*****************************
👉కాలే
వర్షతు పర్జన్య: పృథివీ సస్య శాలినీ
దేశోయం
క్షోభ రహితో, బ్రహ్మణా సంతు నిర్భయ:
తాత్పర్యం:
మేఘాలు
సకాలములో కురియు గాక. భూమి సస్యశ్యామలమై పండు గాక. దేశములో ఎవరికీ ఏ బాధలు లేకుండు
గాక. బ్రాహ్మణులూ, వారి సంతతి నిర్భయులై జీవింతురు
గాక.
*****************************
👉ఓం
అసతోమా సద్గమయ..!
తమసోమా
జ్యోతిర్గమయ..!మృత్యోర్మా అమృతంగమయ..!
ఓం
శాంతి: శాంతి: శాంతి:
తాత్పర్యం:
సర్వవ్యాపి,
నిరాకారుడైన భగవంతుడా, మమ్ములను అందరినీ, అన్యాయము, అధర్మం మరియు అసత్యము నుంచి న్యాయం,
ధర్మం మరియు సత్యము వైపునకు గొనిపొమ్ము. అజ్ఞానమనే అంధకారము నుండి సజ్ఞానస్వరూపమైన
వెలుగునకు దారి చూపుము. మృత్యు భయము నుండి శాశ్వతమైన అమృతత్వము దిశగా మమ్ము నడిపించుము.
*****************************
👉స్వస్తి
ప్రజాభ్య: పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహీం మహీశా,
గో
బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం, లోకా: సమస్తా సుఖినో భవంతు..!
తాత్పర్యం:
ప్రజలకు
శుభము కలుగు గాక..!
ఈ భూమిని
పాలించే ప్రభువులందరూ ధర్మం మరియు న్యాయ మార్గంలో పాలింతురు గాక..!
గోవులకు,
బ్రాహ్మణులకు సర్వదా క్షేమము, సంతోషము మరియు శుభము ప్రతిరోజూ కలుగునట్లుగా పాలింపబడుదురుగాక..!
జగతి
లోని సర్వ జనులందరూ సదా సుఖ సంతోషాలతో వర్దిల్లెదరు గాక..!
*****************************
👉ఓం
శం నో మిత్ర: శం నో వరుణ:
ఓం
శం నో భవత్వర్యమా:
శం
నో ఇంద్రో బృహస్పతి:
శం
నో విష్ణు రురుక్రమ:
నమో
బ్రాహ్మణః
నమో
వాయు:
త్వమేవ
ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వమేవ
ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి
ఋతం
వదిష్యామి, సత్యం వదిష్యామి
తన్మామవతు
తద్వక్తారమవతు
అవతు
మాం, అవతు మక్తారం
ఓం
శాంతి: శాంతి: శాంతి:..!
తాత్పర్యం:
సూర్యుడు,
వరుణుడు, యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు వీరందరూ మన యెడల ప్రసన్నం అగుదురు గాక..!
బ్రాహ్మణులకు
వందనం. వాయుదేవునకు వందనం.
నీవే
ప్రత్యక్ష బ్రహ్మవు.
నేను
బ్రహ్మమునే పలికెదను. సత్యమునే పలికెదను.
సత్యము
మరియు బ్రహ్మము నన్ను రక్షించు గాక..!
నా
గురువులను, సంరక్షకులను రక్షించు గాక..!
*****************************
👉ఓం
ద్యౌ శాంతి:..!
అంతరిక్షం
శాంతి:..!
పృథివీ
శాంతి:..!
ఆపా
శాంతి:..!
ఔషదయ
శాంతి:..!
వనస్పతయ:
శాంతి:..!
విశ్వే
దేవా: శాంతి:..!
బ్రహ్మ
శాంతి:..!
సర్వం
శాంతి:..!
శాంతి
రేవా: శాంతి:..!
సామా:
శాంతిరేది :..!
ఓం
శాంతి: శాంతి: శాంతి:..!
తాత్పర్యం:
స్వర్గము
నందు, దేవలోకము నందు, ఆకాశము నందు, అంతరిక్షము నందు, భూమి పైన, జలము నందు, భూమి పై
ఉన్న ఓషధులు మరియు వనమూలికలు,
అన్ని
లోకము లందలి దేవతలయందు, బ్రహ్మ యందు, సర్వ జనులయందు, శాంతి నెలకొను గాక..!
పంచభూతముల
ప్రకృతి వలన కాని, బ్రహ్మ మొదలగు దేవతల వలన
కాని, అపాయములు కలుగకుండును గాక..! శాంతి యందె శాంతి నెలకొను గాక..! నాయందు శాంతి నెలకొను
గాక..!
పైన
చెప్పిన ఆశీర్వాద శాంతి మంత్రములు అందరూ తప్పక చదివి అర్ధం చేసుకోండి. మన భారతీయ సంస్కృతీ
ఎంత గొప్పదో తెలుస్తుంది. మన కోసమే కాక, అందరి క్షేమం కోసం, సర్వ ప్రాణుల సుఖ సంతోషాల
కోసం పఠింపబడుతున్నవి.
ధర్మో
రక్షతి రక్షితః...!
ధర్మో
రక్షతి రక్షితః...!
ధర్మో
రక్షతి రక్షితః...!
అనగా,
అందరూ వారి వారికి నిర్దేశించిన ధర్మమార్గములో జీవనం కొనసాగిస్తూ వుంటే, ఆ ధర్మమే,
ఎలాంటి దుష్టాంతరాలు రాకుండా, మొత్తం ప్రపంచాన్ని అన్ని విధాలా తప్పక కాపాడుతుంది అని..!
*
* * సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు * * *
No comments:
Post a Comment