Saturday, July 3, 2021

మా వైభవం! 4 స్నేహ హారతి! 2

 స్నేహ హారతి! 2 https://www.facebook.com/100004148147509/videos/856147231200207

ఒక రాత్రివేళ భయంకర తుఫాను
తగ్గిన తెల్లవారుఝామున
చెల్లా చెదురైన తమ గూడుని
తమ తోటి నేస్తాలను వెతుక్కుంటూ
గువ్వల కలకలం లా
అకస్మాత్తుగా కనిపించకుండా వదిలి వెళ్లిపోయిన
ఓ ప్రాణ స్నేహితుణ్ని అనుక్షణం తలుచుకుంటూ
నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లినా
మేము నిన్ను మరచిపోలేము
అంటూ ఉదయం నుంచి ఎన్నో గువ్వలు
గోరింకలు తమ జీవన వనంలో
ఆ నేస్తంతో గడిపిన ఎన్నో జ్ఞాపకాల సుమాల
మాలలు ఏర్చి కూర్చి తీర్చి దిద్దిన
మౌన హృదయ స్పందనల దృశ్యమాలికలతో
నేస్తానికి శుభాకాంక్షలు అందిస్తూ
మమ్మల్ని కన్నీటి జడివానలో తడిపేస్తున్నాయి
ఆ దృశ్య మాలికలు
ఎప్పుడు చూసినా
ఎన్నిసార్లు చూసినా
అస్పష్టంగానే కనిపిస్తున్నాయి
కన్నీటి జడులలో తడిసిన దయా పారావతాల
అశ్రువులతో రూపొందించినది కావడం వల్ల
ప్రతీ దృశ్యంలోనూ తన హృదయాన్ని ఆవిష్కరించిన
చిరంజీవి నంద కుమారి ఈ సృజన
ఘనీభవించిన గండశిలను సైతం కరిగిస్తుంది
చిన్నారి నందూ నీవు రూపొందించిన
ఈ దృశ్య మాలిక చూసిన మా
హృదయం ఆర్ద్రమై... భావం అనంతమై
మనసు మూగ బోయిన వేళ
గొంతు పెగలని ఈ క్షణంలో
మాటలు రాని ఈ స్థితిలో ....
నీ మిత్రుని శుభాకాంక్షల తోడుగా
మా శుభాశీస్సులతో
నీ కన్నవారి కలలు సాకారం చేస్తూ
నీవు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి!
వైభవ్ మిత్రబృందానికి పేరుపేరునా కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు
మీరందరూ మీరు కోరుకున్నట్లు గా
మీ కన్నవారి కలలు సాకారమయ్యేలా
మీ జీవితాలలో ఉన్నత శిఖరాలు అందుకోవాలి
అదే మన వైభవ్ ఆకాంక్ష మా శుభాకాంక్షలు
--------------వైభవ్ అమ్మా నాన్న తమ్ముడు
CLICK THE BELOW LINK FOR THE VIDEO
<iframe src="https://www.facebook.com/plugins/video.php..." width="560" height="315" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allowFullScreen="true"></iframe>

No comments:

Post a Comment

Total Pageviews