Sunday, July 4, 2021

 నిన్న జూమ్ క్లాస్ లో నేను చెప్పిన ఒకటి రెండు అంశాలు ..


1 . సర్ మా ఫ్రెండ్స్ నన్ను తప్పుడు పనులు చేయమని ఎప్పుడూ బలవంతపెడుతుంటారు .. ఏమి చెయ్యాలి ? . ఒక విద్యార్ధి ప్రశ్న . 


గాలి ఎటు వీస్తే అటు ఎగిరి పోతుంది చెత్త . అదే ఇనుము, పర్వతము లాంటి బరువైన వస్తువులు అదే చోటున స్థిరం గా ఉంటాయి . వినదగు చెప్పిన .. ఎవరు చెప్పినా ఆలకించు . ఆలోచించు . నీదైన నిర్ణయం తీసుకో . ఒక్క సారి తప్పు చేయమంటూ స్నేహితులు ప్రోత్సహిస్తారు . ఒక్క సారి.... కేవలం..... ఒక్క సారి ఎత్తైన భవనం పై నుండి వారిని దూకమను . వారు ఆలా చేస్తారా ? మరి నువ్వెందుకు ఒక్క సారి వారి కోసం సిగరెట్ తాగడం లాంటి పనులు చేస్తావు ? జీవితం లో చెత్తలాగా మిగిలి పోవాలంటే ఎవరేమి చెప్పినా చేస్తూ పో . ఆలా కాకుండా నీకంటూ వ్యక్తిత్వం ఉంటే నీ సొంత ఆలోచన , విచక్షణ మేరకు వ్యవహరించు . 


 2 రాష్ట్రపతి కావడం , మిస్సైల్ మాన్ గా పేరు తెచ్చుకోవడం .. ఇవి కావు అబ్దుల్ కలాం తన జీవిత కాలం లో సాధించిన గొప్ప విషయాలు . అయన మరణం .. అది నలభై దాటిన ప్రతి ఒక్కరి స్వప్నం . మంచాన పడి లేవలేక కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగిస్తూ తనపై తనకే అసహ్యం , జాలి కలుగుతూ చివరి రోజులు గడపడం నరకం . ఆయన రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసాడు . ప్రభుత్వం ఆయనకు కావలసిన అన్ని వసతులు కల్పిస్తుంది . మరెందుకు అయన చెన్నై నుండి విమానం లో అటుపైన కార్ లో అంత దూరం లో వున్నా ఈశాన్య రాష్ట్రాల్లో వున్నా ఆ నగరానికి వెళ్ళాడు ? డబ్బు కోసమా ? కాదు . పని కోసం . డబ్బు కోసం పని చెయ్యాలి అనుకొంటారు చాల మంది . డబ్బు వెంట మనం పడితే అది మనకు అందకుండా పరుగెడుతూనే ఉంటుంది . పని వెంట పడండి. ఆరోగ్యం , ఆనందం, పేరు , డబ్బు మీ వెంట పడుతాయి . కలాం తనకు ఇస్టమైన పని.... అదే బోధన.... వెంట పడ్డాడు . రిటైర్మెంట్ అనేది కేవలం సాంకేతిక అంశం . అరవై ఏళ్లకు రిటైర్మెంట్ రాదు . రాకూడదు . అప్పటిదాకా బిజీగా ఉండి ఒక్క సారిగా " ఇక నాదేముంది? అంతా అయిపొయింది" అనుకొంటే నిజంగానే అయిపోతుంది . ఆరోగ్యం దెబ్బ తింటుంది . చివరి రోజులు భారంగా, ఘోరంగా తయారు అయిపోతాయి . ఏదో పని ని ఎంచుకోండి . చివరి శ్వాస దాక పని చేస్తూనే వుండండి . కాదు పని చేస్తూనే చని పోవాలి . తనకిష్టమైన పని అదే టీచింగ్ చేస్తూ ముప్పై సెకండ్స్ లో చనిపోయాడు కలాం. అదీ మరణం అంటే . 


ఆరేళ్ళ పిల్లల నుండి అరవై ఏళ్ళ వ్యక్తుల జీవితాలను సృజిస్తూ సాగింది నా క్లాస్ ..

No comments:

Post a Comment

Total Pageviews