Saturday, July 3, 2021

మా వైభవం! 3

 Please click the link to watch the video

https://www.facebook.com/saitj45/videos/1229433093835743

ఇన్ని నాళ్ళ బంధాన్ని అకస్మాత్తుగా

వదిలి వెళ్లిపోయిన ఓ ప్రాణ స్నేహితుణ్ని
అనుక్షణం తలుచుకుంటూ
నిన్ను వదులుకున్నా
నీ స్నేహాన్ని నేను వదులుకొను
వదులుకోలేను అన్న ఒక మిత్రుని
మౌన హృదయ స్పందన ఈ దృశ్యమాలిక
ఎప్పుడు చూసినా
ఎన్నిసార్లు చూసినా
అస్పష్టంగానే కనిపిస్తుంది
అశ్రువులతో రూపొందించినది కావడం వల్ల
తన జీవితంలో పెనవేసికొన్న స్నేహ బంధాన్ని
ప్రతీ దృశ్యంలోనూ తన హృదయాన్ని ఆవిష్కరించిన
చిరంజీవి గోపిశెట్టి సాయి తేజ ఈ సృజన
ఘనీభవించిన గండశిలను సైతం కరిగిస్తుంది
చిన్నారి సాయి తేజ నీవు రూపొందించిన
ఈ దృశ్య మాలిక చూసిన మా
హృదయం ఆర్ద్రమై... భావం అనంతమై
మనసు మూగ బోయిన వేళ
గొంతు పెగలని ఈ క్షణంలో
మాటలు రాని ఈ స్థితిలో ....
నీ మిత్రుని శుభాకాంక్షల తోడుగా
మా శుభాశీస్సులతో
నీ కన్నవారి కలలు సాకారం చేస్తూ
నీవు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి!
--------------వైభవ్ అమ్మా నాన్న తమ్ముడు

No comments:

Post a Comment

Total Pageviews