Monday, November 13, 2017

కార్తిక పురాణము -25వ అధ్యాయము

Image result for కార్తిక పురాణము -25వ అధ్యాయము
కార్తిక పురాణము - ఇరవై అయిదవ అధ్యాయము
Image may contain: flower and plantబ్రాహ్మణులిట్లు చెప్పిరి. అంబరీష మహారాజా! నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి ఉరితాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వ పాతకము వలన సంభవించినది. ఈవిషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము గాము. పారణను ఆపితిమా హరిభక్తికి లోపము కలుగును. పారణ చేయించితిమా దూర్వాసుడు శాపమిచ్చును. కనుక ఎట్లైనను కీడు రాక తప్పదు. అందులకు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పెను. ఓ బ్రాహ్మణులారా! హరిభక్తిని విడుచుటకంటే బ్రాహ్మణ శాపము కొంచెం మంచిది. నేనిపుడు కొంచెము జలము చేత పారణ చేసెదను. ఈ జల పానము భక్షణమగును. అది భక్షణమగునని పెద్దలు చెప్పియున్నారు. ఇచ్చట సృత్యర్థబోధక ప్రమాణము "కర్తుంసాధ్యం యదానాలం ద్వాదశ్యద్భిస్తు పారయేత్! కృతాపః ప్రాశనా త్పశ్చాద్భుంజీత్యేత్యపరేజగురితి!!" కాబట్టి జల పారణము చేత ద్వాదశ్యతిక్రమణ దోషము రాదు. బ్రాహ్మణ తిరస్కారమున్నూ ఉండదు. ఇట్లు చేసిన యెడల దుర్వాసుడు శపించడు. నా జన్మాంతర పాతకము నశించును. రాజిట్లు నిశ్చయించి జలముచేత పారణ చేసెను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించు వాడు వలె అంబరీష మహారాజును జూచి చెవులకు వినశక్యము గాని కఠినమైన వాక్యములను ఈవిధముగా పల్కెను. ఒరాజా! అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగ కారిణియైన దుర్భుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానమాచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించిన వాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించిన వాడు అందరికంటే అధముడు. వాడు ఆశుద్ధములో ఉండు పురుగు వలె మలాశియగును. ఆత్మార్థము వంట చేసికొన్న వాడు పాపమును భుజించును. అతిథి కొరకై వండించి తానే భుజించిన వాడు పాపముల పరంపరను భుజించుచున్న వాడగును. అగ్ని పక్వమైనది గాని, పక్వము గానిది గాని, ఆకు గాని, పుష్పము గాని, ఫలము గాని, పాలు గాని, అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడనయిన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడవై అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడవగుదువు? ఓరి మందుడా! ఎప్పుడైననూ బ్రాహ్మణులను తిరస్కారము చేయవచ్చునా? నీకు హరి దేవుడెట్లగును? అతనియందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును, హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడనైన నన్ను వదిలి భుజించితివి గాని బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారము తోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని గూడ తిరస్కరించినవాడవైతివి. రాజా! ఇప్పడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరీ! నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకొని ధర్మ మార్గమునను నశింపజేయుచున్నావు. ఓరీ పాపాత్మా! ఈ భూమియందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్నాశ్రయించ వత్తురు. నీవు దుర్మార్గుడవు. గనుక వారిని బాధించెదవు. నీవు ధర్మ కంటకుడఅగుదవు.Image may contain: flower and plant
దూర్వాసుడు ఇట్లు పలుకగా విని అంబరీషుడు నమస్కరించి ఇట్లని ప్రార్థించెను. అయ్యా! నేను పాపుడను. పాపకర్ముడను. పాప మానసుడను. నిన్ను శరణు వేడెదను. నన్ను రక్షించుమని కోరెను. నేను ధర్మ మార్గమును దెలియక పాపమను బురదయందు పది దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను రక్షించుము. నేను క్షత్రియుడను. పాపములను జేసితిని. నీవు బ్రాహ్మణుడవు, శాంతి రూపుడవు. కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందురు. మీవంటి మహా బుద్ధిమంతులు దయావంతులై మావంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరించవలయును. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసుడు తన ఎడమ కాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి యిట్లనియె. రాజా! నేను దయ గలవాడను గాను. నాకు శాంతి లేదు. ఓర్పు లేనివారికి ఆలయమైతిని. గనుక దుర్వాసుడు శాంతి లేనివాడని తెలిసికొనుము. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన యెడల శాంతులగుదురు. గానీ నేను కోపితుడనైతినేని కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించు వాడను గాను. ఇట్లని పలికి అంబరీషునుద్దేశించి శాపమిచ్చెను. ౧. మత్స్యము ౨. కూర్మము ౩. వరాహము 4. వామనుడు ౫. వికృత ముఖుడు ౬. బ్రాహ్మణుడై క్రూరుడు ౭. క్షత్రియుడై జ్ఞాన శూన్యుడు ౮. క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు ౯. దురాచారుడు - పాషండ మార్గవేడియు, 10. బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు. నేను శాస్త్రార్థ వేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటె ముందు చేస్తినను గర్వముతో నున్న నీకు ఈ పదిజన్మలూ వచ్చును.అనగా పదింటియందును గర్వమును పొందదగినది ఒక్కటియూ లేదు. కనుక గర్వించిన వానికి గర్వ భంగకరములైన జన్మలను యిచ్చితిననెను. ఇట్లు పది శాపములు ఇచ్చి నన్ను అవమాన పరచిన వానికి ఇంకా శాపమివ్వలయునని తలంచి దుర్వాసుడు నోరు తెరుచునంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును, భక్తి ప్రియుడును, శరణాగత వత్సలుడునగు హరి తన భక్తుని కాపాడు తలంపుతోను, బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేయవలయునను తలంపుతోనూ దుర్వాసుడు ఇచ్చిన పది శాపములనూ తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలయునని తలంచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రము కోటి సూర్య కాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చెను. దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొను తలంపుతో పరుగెత్తెను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో మునివెంట బడెను. ముని ఆత్మ రక్షణమునకై భూమినంతయు తిరిగెను. దుర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింప బడెను గానీ చక్ర భయము చేత మునిని రక్షించు వాడు లేకపోయెను. ఇంద్రాది దిక్పాలకులును, వసిస్టాది మునీశ్వరులు, బ్రహ్మాది దేవతలు, దుర్వాసుని రక్షింపలేరైరి. ఇట్లు తపస్సు చేసుకొను మునీశ్వరుని అతి కోపముచేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానము చేయుట చేత దుర్వాసునకు ప్రాణ సంకటము తటస్థించెను.
ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే పంచవింశాధ్యాయ సమాప్తః!!

అసూయ.

అసూయ,  నీ  చేత  అబద్ధాలు  , ప్రచారం చేయాలని  ప్రేరేసిస్తుంది. ఎదుట వారిని  హేళన చేయాలని సలహాలు  ఇసుంది,  ,  నిన్ను  frank గా ఉండనీయదు , ఆ పై  క్రమంగా  నీ  bones,   పై దాడి  చేస్తుంది,  నీ  bones బలహీనంగా  తయారు  అగును, , తర్వాత  నీ  కంటి నరాల పై దీని ప్రభావం వల్ల  కంటి చూపు ను కోల్పోయే పరిస్థితి వుంది, , మీ మనసును ప్రేమ భావాలతో,  క్షమాపణ మనసు తో  నింపుకోండి,  అసూయ  ను దగ్గరకు రానియ్యవద్దు. ఎదుట వారి  అభివృద్ధి,  వారి  టాలెంట్  అన్ని  భగవంతుడు ప్రసాదించిన అనుగ్రహం అని గుర్తించండి.  మనుషులు,  టాలెంట్ ను,  మనం  కించపరిస్తే ,  అసూయ పడినా,  డైరెక్టర్ గా నిన్ను  సృష్టించిన  ఆ భగవంతుడు మీదనే  నీవు అసూయ పడుతున్నావు అని గ్రహించు. ఈ రోజు నుంచి  నిష్కపట, మాటలను అరవర్చుకో,  నీవు మాట్లాడే సమయంలో  నీ మనసు  హృదయం , నోరు  మూడు  ఏకీభవించి,  మాట్లడాటం అలవర్చుకో. పైకి  ఒక మాట  లోపలి  ఒక మాట,  ఇలా   మధ్యలో  నలిగిపోవద్దు.అలాంటి పరిస్థితులను క్రియేట్ చేసుకోవద్దు.  మాటలు  పొదుపుగా వుండనీయండి. విస్తారమైన  సంభాషణలు,  మాటలు,  తగవు. మీ ప్రశాంత త , మీ చేతుల్లోనే ఉంది.

కార్తిక పురాణము - ఇరవై నాలుగవ అధ్యాయము

Related image
అత్రి ఇట్లు పల్కెను. అగస్త్య మునీంద్రా! నీకు కార్తిక వ్రతమందును, హరిభక్తి యందును ఆసక్తి ఉన్నది. కాన కార్తిక మహాత్మ్యమును చెప్పెద వినుము. సావధానముగా విన్న ఎడల పాపములు నశించును. కార్తిక మాసమందు శుక్ల ద్వాదశి హరి బోధిని, ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమును ఇచ్చును. అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చునది. సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని యగు ద్వాదశి యిచ్చును. ఇది కాక ఈ ద్వాదశి హరియందును, ఏకాదశియందును, భక్తినిచ్చును. కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది. ద్వాదశి సూర్య చంద్ర గ్రహణముల కంటె అధిక పుణ్యప్రదము. ఏకాదశి కంటె నూరు రెట్లు ఎక్కువది. సమస్త పుణ్యమును ఇచ్చునది. ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లగును. ద్వాదశి పుణ్యదినము గనుక కొంచెముగా ఉన్నను పారణకు ఉపయోగించవలెను. కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు. ఇతర నియమములన్నింటిని విడిచి ద్వాదశి స్వల్ప కాలమందు పారణ చేయవలెను. కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడువ కూడదు.
Image result for కార్తిక పురాణము - ఇరవై నాలుగవ అధ్యాయము
ఏకాదశియందు ఉపవాస మాచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలెను. ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును. ఈ విషయము తెలిసియె పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడువలేదు. ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నం భుజించుట పారణ అనబడును. అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమను వంక చేత భోజనమును యాచించెను. అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు దుర్వాసుని రమ్మనెను. దుర్వాసుడు పారణకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళెను. ఆనాడు ద్వాదశి అతిస్వల్పముగా ఉండెను. దుర్వాసుడు రాకపోయెను. ద్వాదశి పోవుచున్నది. ఇట్టి సంకటము సంభవించినది. అపుడు హరిభక్తుడైన అంబరీషుడు విచార పడసాగెను. ఈ దుర్వాసుడు ముని శ్రేష్ఠుడు. పారణ కొరకు అంగీకరింపబడినాడు. ఇంతవరకు రాలేదు. ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును. బ్రాహ్మణుని కంటె ముందు భుజించిన యెడల కోపించి అగ్నితో సమానుడై ముని శాపమిచ్చును గనుక ఇప్పుడు ఏది కుశలము? ఉపవాసమందెట్లు ఏకాదశిని విడువరాదో అట్లే పారణయందును ద్వాదశిని విడువరాదు. ద్వాదశిని విడిచిన యెడల హరిభక్తిని విడిచిన వాడనగుదును. ఏకాదశినాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రుడనగుదునో ద్వాదశిని విడిచినయెడల అట్టి దోషమే సంభవించును. ఇదిగాక ద్వాదశీ పారణాతిక్రమణము పన్నెండు ఉపవాసముల ఫలమును బోగొట్టును. కాన ద్వాదశిని విద్వాంసుడు విడువకూడదు. హరివాసరము పుణ్యదినము గాన విద్వాంసుడు విడువరాదు. దానిని విడిచెనేని పురుషునకు పుణ్యసంచయము చేకూరదు. అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన యెడల నశించును. అందువలన గలిగెడి పాతకమునకు నివృత్తి లేదు. ఒక్క ద్వాదశి అయినను విడువకూడదు. దీనికి ప్రతీకారము లేదు. అనేక వాక్యాలతో పనియేమున్నది. ఇది నిజాము. హరి వాసరమును విడిచిన యెడల హరిభక్తి యుండదు. హరిభక్తిని విడుచుట యందు నాకు మహా భయమున్నది. కాబట్టి యట్టి సంకటమందు హరిభక్తిని విడుచుట కంటే పారణమే ముఖ్యము. బ్రాహ్మణ శాపమువలన నాకేమియు భయములేదు. శాపము వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము. ద్వాదశిని విడిచినచో హరివాసరము (ఏకాదశులు) 10 విడువబడినవియగును. హరివాసరమును విడిచిన యెడల హరిభక్తి లోపించును. గనుక హరిభక్తిని విడుచుట కంటె బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది. కాబట్టి హరిభాక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్ద్వారా హరిభక్తిని నిలుపుకొనుట మంచిది. అట్లయిన యెడల హరియే కష్టాలు రాకుండా కాపాడును. అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లని అడిగెను. 
Image result for కార్తిక పురాణము - ఇరవై నాలుగవ అధ్యాయము
Image result for కార్తిక పురాణము - ఇరవై నాలుగవ అధ్యాయముఓ బ్రాహ్మణోత్తములారా! వినుడు.దుర్వాసుడు భోజమునకు వచ్చెదననెను. నేనట్లంగీకరించితిని. ఇప్పటికినీ రాలేదు. ద్వాదశి పోవుచున్నది. గనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున భ్రాహ్మణాతిక్రమణము, ద్వాదాశిలో పారణము చేయకపోతే ద్వాదశ్యతిక్రమణము గలుగును. గనుక మీరు బలాబలమును విచారించి రెండింట్లో ఏది యుక్తమో చెప్పుడు అని అడిగెను. ఆమాట విని ఆ బ్రాహ్మణులు ధర్మ బుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ లాఘవములను విచారించి యిట్లనిరి. సమస్త భూతములయందును అగ్ని రూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు. ప్రాణ వాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు అన్నమును గోరెడి ఆకలి కలుగుచుండును. ప్రాణ వాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేయుటకే క్షుత్పిపాసలనబడును. కాబట్టి ప్రాణ సహితముగా అగ్ని సర్వ సుర పూజితుడగుచున్నాడు. కాబట్టి సర్వ భూతములయందున్న అగ్నిని నిత్యమూ పూజించవలెను. కాబట్టి తన ఇంటికి వచ్చిన శూద్రుని గానీ, చండాలుని గానీ విడిచి భుజించ రాదు. సాక్షాత్ ప్రథమ వర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసినది ఏమున్నది? గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథికంటే ముందుగా తాను భుజించిన యెడల బ్రాహ్మణావమానమగును. బ్రాహ్మణావమానము చేత ఆయువు, ఐశ్వర్యము, కీర్తి, ధర్మము, ఇవన్నియూ నశించును. ఇది ఏమి, అది ఏమి మనస్సులో ఉండే కోరికై అనగా సంకల్పితమంతయూ నశించును. బ్రాహ్మణులందరూ స్వర్గమందుండెడి దేవతలే అని చెప్పబడుడురు. దేవతలను తిరస్కరించుట చేత అంతయూ నశించును. జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు. ఈ దుర్వాసుడు తపోవంతుడు. ఇతని Image result for కార్తిక పురాణము - ఇరవై నాలుగవ అధ్యాయమువిషయమందు చెప్పునదేమున్నది? ఓ రాజా! ఈ బ్రాహ్మణుడు కోపము చేయక పోయిననూ బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు. ఈ బ్రాహ్మణునకును ద్వాదశి పారణకు వచ్చెదనని చెప్పి సమయానికి రాకుండుట అన్యాయమై ఉన్నది. ద్వాదశీ పారణను విడిచి పెట్టిన ఏకాదశ్యుపవాసమునకు భంగము వచ్చును. ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు. బ్రాహ్మణాజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి ఈ రెండునూ సమానములుగా నున్నవి. ఇందు గురుత్వము, లఘుత్వము మాకు కనిపించుట లేదు. ద్వాదశి కాలమందు పారణ చేయని యెడల హరి భక్తి లోపించును. పారణ చేసిన దుర్వాసుడు శపించును. ఎట్లైనను అనర్థము రాక తప్పదు. అదియు కొద్దిది కాదు. గొప్ప కీడు కలుగును. బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యదార్థమును ఆలోచించి రాజుతో యిట్లనిరి.
ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే చతుర్వింశాధ్యాయ సమాప్తః

మానవసేవ-మాధవసేవ

ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు.

చనిపోయిన మనిషికీ-భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.

 దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.

మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.

మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను

దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి

మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?

దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి

మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?

దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి

మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!

దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు

మనిషి: నా స్నేహితులున్నారా అందులో?

దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే

మనిషి: ఊ..నా భార్య, బిడ్డలునా?

దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు

మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!

దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.

మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?

దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.

మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.

మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.

మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?

దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.

అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి.
పశ్చాతాపులను క్షమించాలి.
 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.

కార్తీక పురాణం -- 23 వ అధ్యాయం.

Image result for karthika puranam 23 va adhyayam
అగస్త్య ముని పల్కెను. అత్రి మునీంద్రా! పురంజయుడు యుద్దమందు జయమొందిన తర్వాత ఏమి చేసెనో నాకు దెలియజెప్పుము. అత్రి పల్కెను. శత్రు బాధారహితమైన అయోధ్యా పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు, సదాశుచియు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమిత కాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడును, సూర్యుడు వలె చూడ శక్యముగాని వాడును, శత్రువులను శిక్షించు వాడును, హరిభక్తి పరాయణుడును, బలయుతుడును, కామక్రోధలోభ మోహ మద మాత్సర్యములను జయించిన వాడును, కార్తిక వ్రతము చేత పాపములన్నియు నశింపజేసి కొనిన వాడై యుండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లారాధింతును? ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును? ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి యిట్లనియె. ఓ పురంజయా! శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్రమున్నది. అచ్చట శ్రీరంగనాథుడు వసించి యున్నాడు. కాబట్టి సంసారచ్చేదమును జేయువాడగు శ్రీరంగ నిలయుని సేవిన్చుమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్యా పట్టణమును విడిచి తన చతురంగ బలములతోను అనేక క్షేత్రములను తీర్థములను జూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరెను. కార్తికమాసమంతయు అచ్చట ఉంది కావేరీ మధ్యము, నివాసముగా గలవాడిన శేష శాయియయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తిక వ్రతమును శాస్త్రోక్తముగా జేసెను. కృష్ణా, కృష్ణాయని గానము చేయుచు గోవిందా, వాసుదేవా యని నిరంతరమూ కీర్తించుచు, విష్ణు పూజా పరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషశాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశములను జూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్యా పట్టణమును జూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోను, పుష్టితోను గూడిన జనులు గలిగినదియు, దృఢముగా నున్న యంత్రములు గడియలు గలిగినదియు అగడ్తలు గలిగినదియు, గుర్రములతోను, ఏనుగులతోను, రథములతోను నిండియున్నదియు, గృహ గోపురముల వెంట వీధులు గలిగినదియు, అనేక వర్ణములు గల పతాకములు గలదియు, వాయువుచేత చలింప జేయబడుచున్న పతాకములు గలదియు, అనేక భటులు కలదియు అనేక దేశ వాసులతో గూడినదై యుండెను. అచ్చట స్త్రీలు సుందరులును, హంసల వలే, ఏనుగుల వలె నడుచు వారును, చెవుల వరకునుండు విశాల నేత్రములు గలవారును, గొప్ప పిరుదులు గలవారును, సన్నని నడుము గలవారును, బలిసిలావుగా వున్న కుచములు గలవారును, మంచి వస్త్రములు గలవారును, సమస్త భూషణ భూషితలుగా నుండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు, నృత్యమందు నిపుణులును, సౌందర్యముతోను, లావణ్యముతోను గూడియున్న వారును, నిత్యమానంద యుక్తులు, మదోన్మత్తులును సమస్త స్త్రీ గుణ భూషితలై చూచుటలోను, మాట్లాడుట లోను బహు నేర్పరులై సభలలోను రాజమార్గముల లోను రచ్చలలోను ఆటలాడుచుండువారి యుండిరి.Image result for karthika puranam 23 va adhyayam
అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితలై పాతివ్రత్య పరాయణలై యుండిరి. ఓ అగస్త్య మునీంద్రా అచ్చటి మనుజులందరు తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడిట్లున్న పట్టణమును జూచి సంతోషించెను. "యధారాజా తథా ప్రజా" అను న్యాయమును బట్టి రాజు న్యాయ వర్తనుడైన ప్రజలును న్యాయమందే యుందురు గదా! పురజనులందరును రాజు వచ్చుటను విని వేలవేలు గూడి ఎదుర్కొనిరి. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును బ్రవేశించి తన యింటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మ యుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములననుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమమవలంబించి కార్తి వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దానిచేత వైకుంఠ లోక వాసియై సుఖముగా నుండెను. అగస్త్య మునీంద్రా! కార్తిక వ్రతము మహా మహిమ గలది. ఈ కార్తిక ధర్మము హరికి ప్రియకరము. కార్తిక వ్రతమును జేయువాడు పరమ పదమును బొందును. అవశమై చేసినను ఉత్తమగతి పొందును. సమస్త సౌఖ్యములను యిచ్చునదియు, కలికల్మష నాశకారియు నైన కార్తిక వ్రతమును జేయని మనుష్యుడు దుఃఖమును బొందును. హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసికొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును.
Image result for karthika puranam 23 va adhyayam
ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మాహాత్మ్యే త్రయోవింశాధ్యాయ సమాప్తః!!

ఎవ్వరినీ ఎగతాళి చేయకూడదు.

ఒక లెక్కల టీచరు బోర్డుమీద 9 వ గుణింతం ఇలా వ్రాసింది.
9×1=7
9×2=18
9×3=27
9×4=36
9×5=45
9×6=54
9×7=63
9×8=72
9×9=81
9×10=90
ఇది వ్రాసిన టీచరును చూసి పిల్లలందరూ నవ్వసాగారు.....టీచరు పిల్లల్ని
ఎందుకు నవ్వుతున్నారని అడిగారు. అప్పుడు పిల్లలు ఇలా అన్నారు.
" టీచర్ ! మీరు 9x1=7 అని వ్రాసారు....అది తప్పుకదా! "
టీచరు నవ్వుతూ ఇలా చెప్పింది.
" నిజమే అది తప్పే!.... కానీ నేను కావాలనే అలా వ్రాసాను. దానికి ఒక కారణం
ఉంది. నేను ఆ ఒక్కటి తప్పుగా వ్రాసానని మీరు నవ్వుతున్నారు కదా!
మిగిలినవన్నీ కరెక్టుగా వ్రాసాను కదా! మిగిలినవన్నీ కరెక్టుగా వ్రాసాను
అని మీరు నన్ను మెచ్చుకోలేదుగా! ఒక్కటి తప్పుగా వ్రాసినందుకు
ఎగతాళి చేస్తున్నారు కదా! ఇదే జీవితం.
మీరు ఎన్ని మంచిపనులు చేసినా గుర్తించని జనాలు మీరు ఒక చిన్న
తప్పు చేయగానే ఎగతాళి చేస్తారు. మంచిని మాత్రమే చేయాలని
అనుకోవడం ముఖ్యమైతే తప్పు చేయకుండా మంచిని చేయాలనుకోవడం
అంతకంటే ముఖ్యం.....అర్థం అయిందా పిల్లలూ! మీరు ఎప్పుడు
ఎవ్వరినీ చూసి ఎగతాళి చేయకూడదు.మంచిని చేస్తున్నప్పుడు
ఏదైనా పొరపాటు జరిగితే ఆ తప్పును వారి దృష్టికి మర్యాదగా
తీసుకునివెళ్ళాలే తప్ప ఎగతాళి చేయకూడదు...సరేనా! "
ఎదుటివారిని ఎగతాళి చేసే ముందు మనమేంటో ఆలో చించుకోవాలి.
తప్పును సున్నితంగా సరిచేయాలి తప్ప ఎవ్వరినీ ఎగతాళి చేయకూడదు.🤘🏻

ఒక అర్చకుని వ్యధ,

అర్చకత్వం ఒక నరకo;కొన్ని రోజులుకు ఇలా చేస్తే అర్చకులు గా చేయ్యలేరు...
తెల్లవారజామున  నిద్ర లేచిన అర్చకుడు కాలకృత్యాలు నెరవేర్చుకుని దేవలయం ద్వారాలు తెరచి విగ్రహం దగ్గరనుండీ అంతా శుభ్రం చేసుకొని , అభిషేకం , అర్చనా పూర్తి అయ్యే సరికి నీరసం నిస్సత్తువ తో ఉండి ఎవరైనా వస్తే ఇంటికి పోయి కాఫీ తాగుదామని చూస్తూ ఎవరైనా భక్తులు పూజచేయమని అడగంగానే వీలు కుదిరితే ఇప్పుడే వస్తా అని ఇంటికి వెళ్ళి కాఫీ తదితర పనులు చేసుకోవటం లేకపోతే పూజ చేస్తూనే తీర్ధం, చటారం పెడుతూ వేస్తున్న ఆకలిని చంపుతూ పూజని పూర్తిచేసి బడలిక తీర్చుకున్న అర్చకుడు ఎవరినో ఒకరిని అక్కడ పెట్టి అవసరాలను తీర్చుకొని దేముడికి భొంగము పెట్టి వచ్చిన వారి గోత్ర నామాలను చెప్పి అర్చన మొదలు పెట్టిన తరువాత ఎవరో ఒకరు తమకు కూడా అర్చన మొదలు పెట్టమని మొదటి భక్తుడు ఉరిమి చూస్తూ ఉండగా రెండవ భక్తుడి గోత్రనామాలను చెపితే మొదటి భక్తుడు తన ముని మనవారళ్ళ పేర్లతో సహా చెప్పమని వత్తిడి చేస్తే కంఠం నెప్పి వచ్చినా మారు మాట్లాడకుండా అన్నీ చెప్పి పూజ చేసి తీర్ధ మంత్రంతో మూడుసార్లు వేయకుండా ఒకసారి వేసినందులకు కోపంగా చూసే కళ్ళను తప్పుంచుకుంటూ ప్రసాదం ఇచ్చి సంభావన ని చూసి నిరాసక్తంగాను ఒక్కొక్కప్పుడు ఆనందంగానూ చూసే లోపు కమిటీ మెంబర్లు వస్తే వాళ్ళ పేర్లమీద పూజచేసి ఒక కంట వాళ్ళ ప్రవర్తనను గమనిస్తూ మధ్యలో వాళ్ళు వేసే అడ్డదిడ్డమైన ప్రశ్నలకు మాట్లాడకుండా అర్చన చేసి ప్రసాదం ఇచ్చిన తరువాత వారు తిట్టినా కోప పడక వారి సలహాలను పాటిస్తాను అని వాళ్ళని తృప్తి పరచి హమ్మయ్యా అని కూర్చునే లోపల భక్తుల వస్తే పూజ లేదా తీర్ధం ఇచ్చి వాళ్ళ సమస్యలను వనిి సలహాలు ఇచ్చే సరికి ఆకలి నకనకలాడతూ ఇంత ప్రసాదమో లేక ఫలమో తందామటే ఉండొచ్చూ ఉండొక పోవచ్చు అనుకుంటూ ఉన్నదాంట్లో తృప్తి పడే లోపు కమిటీ లేదా పంపిన గుఢచారికి సరైన సమాధానమచ్చే సరికి తలప్రాణం తోకకి వస్తుంది అప్పటికి సమయం మధ్యాహ్నం 12:00 ఇక గుడిని కట్టేద్దామనుకునే లోపల భక్తులు వస్తే వారికి ప్రసాదం పెట్టి నీరసంగా గుడి తలుపులు వేసి ఇంటికి పోయి మహా నైవేద్యం తెచ్చి స్వామికి నైవేద్యం పెట్టి తాను తినేసరికి మధ్యాహ్నం2:00 కాస్తంత నిద్రపోయి సాయంత్రానికల్లా ఇంటి కోసం, గుడి కోసం సరుకులను అప్పుతెచ్చే సరికి గుడితీసే సమయం ప్రారంభం , ఆరాత్రి 9:00 గంటలకి గుడి మూసి ఇంటికి వచ్చి నిద్రపోయే సరికి రాత్రి 11:00 గంటలు ఇదీ ఒక గుళ్ళోని అర్చకుని రోజువారీ వ్యవహారం, ఇంకొటి సెలవులు అవేమీ ఉండవు, పైగా అదనంగా తిట్లు రాజకీయాలు భరించాలీ, తన కుటుంబం కోసం తాను నమ్మిన దేవత కోసం. పొరపాటున బయట టిఫిన్ తిన్నాడా ఇక పని ఐపోయి నట్టే ఇదీ ఒక సాధారణ అర్చకుని కధ కాదు కాదు ఇది ఒక అర్చకుని వ్యధ, గత కొన్ని రోజులుగ అర్చకత్వం మీద పోస్టులు కామెంట్లూ చూసిన తరువాత ఈ పోస్టుని పెడుతున్నాను.
from.....whatsapp

Total Pageviews