Saturday, August 8, 2020

హరి జయ ప్రియ ప్రాణేష తల్లీ నా అభిమాన నీరాజనం!

అమ్మా చక్కని నీ అభినయానికి నా అభిమాన నీరాజనం  

హరి జయ ప్రియ ప్రాణేష తల్లీ  https://www.youtube.com/channel/UCF74NeHr_Y5HrKQqSk5oFYA

ఆ రసమయ కాంతిధారలొ కరిగి 

మంజుల మధుకర సుధారస ధారలో పొంగి 

ఆ నయన చంద్రోదయ కలువల సోయగాల వలలో 

మధుమాస దరహాస సుమశరాలలొ చిక్కి 

ఇలా నాట్య కళాకారిణుల కాలి మువ్వగా మారి 

ఆ చరణ మంజీరాల రవంలో చేరితే నా జన్మ ధన్యం! 

Tuesday, August 4, 2020

వంగపండు

చాలా ఏళ్ళ కిందటి సంగతి. నేను రాజమండ్రిలో పనిచేస్తున్నప్పటి రోజులు. అప్పట్లో బెంగాల్ నుంచి ఒక విప్లవరచయితల బృందమొకటి ఏ కారణం చాతనో రాజమండ్రిలో కొన్నాళ్ళున్నారు. బహుశా తలదాచుకున్నారేమో, తెలీదు, కాని అట్లాంటి బృందమొకటి అక్కడికి వచ్చినట్టు మా మిత్రులకి ఎట్లా తెలిసిందో ఏమోగానీ, వాళ్ళని పోయి కలిసారు. ఆ తర్వాత చాలా రోజులు రాత్రిపూట సాహిత్య చర్చలు జరుగుతుండేవి. ఒకసారి అట్లాంటి గోష్టికి నన్ను కూడా తీసుకెళ్ళారు. నేను వాళ్ళని చూడగానే వాళ్ళతో ఎట్లా మాటలు కలపాలా అని ఆలోచించి, వాళ్ళు విప్లకవులు కాబట్టి, టాగోర్ గురించి ప్రస్తావించి లాభం లేదనుకుని, నజ్రుల్ ఇస్లాం గురించి నాకు తెలిసిందేదో చెప్పబోయాను. ఊరు కాని ఊళ్ళో, తమ భాష కాని భాషమాట్లాడేవాళ్ళ మధ్య తమ కవి గురించిన ప్రస్తావన వచ్చినందుకు వాళ్ళల్లో ఆశ్చర్యంగాని, సంతోషంగానీ ఏమీ కనిపించలేదు. నేను చెప్పాలనుకున్న నాలుగు మాటలూ చెప్పేదాకా ఆగి, ఆ బృందనాయకుడు అన్నాడు కదా ' నజ్రుల్ ఏనాటి మాట! ఈ మధ్య మేమొక గీతం విన్నాం. ఆ కవి ఎవ్వరో తెలీదు, ఏ భాషకి చెందిన కవినో తెలీదు, కాని ఎట్లాంటి కవిత! కవిత రాస్తే అలా ఉండాలి! అట్లాంటి కవిత బెంగాలీలో పుట్టాలంటే ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో ' అంటో ఒక కవిత బెంగాలీలో వినిపించాడు. ఆ కవిత వింటోనే నాలో ముందేదో జ్ఞప్తిలో కదలాడి, ఆ పైన తెలియని ఒక ఉద్విగ్నత ఒళ్ళంతా విద్యుచ్ఛక్తిలాగా కదలాడింది. 

'కష్ట జీవులం, మేం కమ్యూనిష్టులం
ఎవరన్నా ఏమన్నా అదే ఇష్టులం.'

అనిసెట్టి సుబ్బారావు గేయం. 

తెలుగులో ఆ గీతాన్ని చాలామంది చదివి ఉండవచ్చుగానీ, నజ్రుల్ ఇస్లాం ని కూడా మరిపించేతంటటి సముజ్జ్వల గీతంగా దాన్ని కీర్తించే వారుంటారని ఊహించి ఉండరు.

బహుశా నేడు అనేక భారతీయ భాషా సాహిత్యాల్లో, పీడిత ప్రజలు పోరు బాట పట్టక తప్పని ప్రతి చోటా, వంగపండు ప్రసాద రావు అటువంటి కవిగా గుర్తింపబడుతూ ఉండవచ్చు. మనిషి ఒక పాటగా మారే అత్యంత అపురూపమైన సామాజిక సందర్భం మన కళ్ళముందే సంభవిస్తున్నా కూడా వంగపండుని ఒక ప్రజాగాయకుడని పేర్కోడాన్ని మించి మనం  అతడికీ, అతడి పాటకీ ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వకుండానే ఇన్నాళ్ళూ గడిపేసాం.

మామూలుగా ఒక కవి మన మధ్యనుంచి నిష్క్రమించిన తర్వాతనే మనం మన రాగద్వేషాల్నీ, ఉదాసీనతనీ విడిచిపెట్టి, అతడి కవిత్వ మూల్యాంకనం మొదలుపెడతాం కాబట్టి, బహుశా ఇవాల్టినుంచీ వంగపండు కవిత్వం గురించిన నిజమైన అంచనా మొదలవుతుందని ఆశిద్దాం. ఉదాహరణకి, అతడి పేరు తలవగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే, 'ఏం పిల్లో ఎల్దమొస్తవా, ఏం పిల్లడో ఎళ్దుమొస్తవా 'అన్న పాటనే తీసుకోండి. దేశంలోనూ, ప్రపంచంలోనూ సంభవిస్తున్న అన్నిరకాల  పోరాటాల్నీ ఒక్కచోట, ఒక్కసారిగా తలుచుకోవడం కోసం తానా గీతం కూర్చానని చెప్పుకున్నాడాయన. అంటే ఒక విధంగా 1950 ల తర్వాతి దేశ చరిత్ర అంతా ఆ పాటలో ఉంది. కాని ఆ పాట మీద ఒక సవివరమైన విశ్లేషణ, వ్యాఖ్యానం ఏదీ కూడా ఇప్పటిదాకా ఎక్కడా ఎవరూ రాసినట్టు నేను చూడలేదు. 

ఉత్తరాంధ్రలో వినవచ్చే ఒక జానపద బాణీని ఆధునీకరిస్తూ తానా గీతం కట్టానని ఆయన చెప్పాడు. ఆ జానపద గీతాన్ని ఆయన ఏ విధంగా ఆధునీకరించాడు, దాని జానపద, ప్రజారంజక లక్షణాల్ని ఏ మేరకు నిలిపాడు, ఏ మేరకు ఆ రంజకత్వంలోని వైయక్తిక, గ్రామీణ అంశాల స్థానంలో సామూహిక, చారిత్రిక అంశాల్ని చొప్పించాడు, అందుకు ఆయన ఎటువంటి నిర్మాణ వ్యూహాలు అనుసరించాడు, గాయకుడిగా సరే, జననాట్యమండలి కళాకారుడిగా సరే, అసలు ఒక కవిగా, శిల్పిగా ఆయన ఆ గీతరచనలో కనపరిచిన మౌలికమైన ప్రజ్ఞ ఏమిటి అన్నదాని మీద ఎంత చర్చ జరిగి ఉండాలి ఇప్పటిదాకా!

బహుశా ప్రపంచంలోని మరేదో భూభాగం నుంచి, ఒక సైప్రస్ నుంచో, ఒక క్రొయేషియో నుంచో, ఒక కాంగో నుంచో, ఒక శ్రీలంకనుంచో ఎవరో ఒక సాహిత్య విద్యార్థి ఈ అంశం మీద సమగ్రంగా పరిశోధన చేసి మనకి చెప్పేదాకా మనం ఈ పాటని కూడా చాలా సినిమా పాటల్లో ఒకటిగా వింటో విన్నంతసేపూ పులకిస్తో, విన్నాక పక్కన పెట్టేస్తో ఉంటాం.

వంగపండు రాసిన ప్రతి పాట మీదా, ఆ మాటకొస్తే గద్దర్ రాసిన ప్రతి పాట మీదా కూడా ఇట్లాంటి విశ్లేషణా, విమర్శా రావాలని కోరుకుంటాను. వారు రాసిన కొన్ని పాటల పల్లవులు విన్నప్పుడు, మహనీయులైన పూర్వ వాగ్గేయకారుల పల్లవులు విన్నప్పటిలానే నిశ్చేష్టుణ్ణవుతూ ఉంటాను. పాటకి పల్లవి ప్రాణం అని ఊరికే అనలేదు. పల్లవి అంటే ఒక కవి గుండె తెరుచుకునే చప్పుడు. కొన్నిసార్లు అతడి గుండె బద్దలయ్యే చప్పుడు కూడా.

'నిధి చాలా సుఖమా, రాముని స
న్నిధి సుఖమా '

అనే పల్లవి త్యాగరాజాత్ములైనవారి ని ఎట్లా సంభ్రమపరుస్తుందో

'నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన ఋణం తీర్చుకుంటనే చెల్లెమ్మా'

'కొండలు పగలేసినం, బండలను పిండినం
మా నెత్తురె కంకరగా ప్రాజెక్టులు కట్టినం
శ్రమ ఎవడిదిరో
సిరి ఎవడిదిరో

అనే పల్లవులు ఎంత విద్యుత్తును సృష్టిస్తాయో

'యంత్రమెట్లా నడుస్తు ఉందంటే ఓరన్నో లమ్మీ రైలూ లారీ కారూ బస్సూ  మిల్లూ మిషనూ, మోటారు సైకిలు
యంత్రమెట్లా నడుస్తు ఉందంటే ..'

అనే పాట మొదలుకాగానే నా వళ్ళంతా విద్యున్మయం కాకుండా ఉండలేదు. అయితే, ఆ పల్లవి ఆయనకెట్లా స్ఫురించిందో ఆ ఆల్కెమీనీ మనం వివరించలేకపోవచ్చుగానీ, ఆ పల్లవిని ఆయన నిర్మించిన తీరు నిస్సందేహంగా మనం మరింత మరింత అధయనం చెయ్యవలసిన అంశం కాదా.

పల్లెటూర్లలో పంటలు ఇంటికొచ్చినప్పుడు జంగాలు ఇంటింటికీ తిరిగీ పాడుకునే ఒక జంగం పాట బాణీలో షిప్ యార్డు కార్మికుల కోసం రాసిన ఆ పాటలో ఒక ఫిట్టరుగా వంగపండు కార్మికానుభవం మాత్రమే కాదు, శిల్పిగా ఆయన కనపరిచిన అసామాన్యమైన నిర్మాణ కౌశల్యం గురించి కూడా మనం గురించవలసి ఉంటుంది. ఇంతకీ శిల్పి అంటే ఏమిటి?  Fitter of words మాత్రమే కదా. గాయకుడంటే ఎవరు?  Fitter of sounds  నే కదా.

కవిత్వం వసంతం లాంటిది, అది అన్ని వేళలా అందరిమీదా వాలదు. శ్రీ శ్రీకి ఈ రహస్యం తెలుసు. ఆయన కవిత్వం రాయడం మొదలుపెట్టినప్పుడు అది చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిమీదా, కృష్ణశాస్త్రిమీదా, విశ్వనాథమీదా వికసిస్తుండటం చూసాడు. తన జీవిత చరమదినాల్లో అది చెరబండురాజులోనూ, వంగపండులోనూ వికసిస్తున్నదని గుర్తుపట్టాడు. 'జంగమదేవర్ల గంటల చప్పుళ్ళల్లో నేను నా కవిత్వాన్ని వెతుక్కున్నాను 'అని ఆయనొక చోట రాసుకున్నాడుగాని, అది ఆయనకి ఒక కల మాత్రమే. నిజంగా జంగం దేవర్ల పాటల్లోంచి కవిత్వం తెచ్చుకోవడమెలా ఉంటుందో వంగపండుని చూసాకే ఆయనకి అర్థమయింది.

బహుశా ప్రపంచంలోని ఏ భాషలోనూ లేనంతమంది శక్తిమంతులైన ప్రజాగాయకులు నేడు తెలుగు భాషలో మాత్రమే కనవస్తున్నారు. నా మాటమీద అనుమానం ఉన్నవాళ్ళు, protest song గురించిన సమాచారం నెట్ లో శోధించి చూడవచ్చు. తక్కిన నేల కన్నా తెలుగు నేల మరిన్ని పోరాటాల పురిటిగడ్డ అని నేను చెప్పలేనుగానీ, పోరాటాన్ని పాటగా మార్చగలిగే ఒక సౌలభ్యం, ఒక వేగం, ఒక సంప్రదాయం తెలుగు సాహిత్యంలో పుష్కలంగా ఉంది. తెలుగులో ఒక కవి ప్రయత్నం మీద పద్యకవికాగలడు, చాలా కష్టపడితే మంచి వచనకవి కాగలడు, కాని అప్రయత్నంగా ఒక గీతకారుడు కాగలడు. కావలసిందల్లా కొంత తడి గుండె. అటువంటి గుండె కనుక ఉంటే , నండూరి సుబ్బారావులాంటి వకీలుకి కూడా ఒక సాయంకాలం ట్రాము బండిలో ఇంటికొస్తున్నప్పుడు 'గుండె గొంతుకలోన కొట్లాడటం 'అప్రయత్నంగా అనుభవంలోకి వస్తుంది. ఇక అతడు వంగపండు ప్రసాద రావే అయితే, అతడి పార్వతీపురం నేపథ్యం, శ్రీకాకుళం పురిటినొప్పులు అతణ్ణొక అసమాన కవిగాయకుడిగా మార్చేస్తాయనడంలో ఆశ్చర్యమేముంది!

పార్వతీపురం  గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అదృష్టానికి నోచుకున్నవాడిగా, వంగపండు గీతాలు అక్కడి నేల మీద నేనెన్నోసార్లు విన్నాను. పాఠశాలల్లో పిల్లలు మొదలుకుని, గ్రామాల్లో కళాకారులదాకా భూమిబాగోతం ప్రదర్శించగా చూసాను. బహుశా భూషణంగారో మరెవరో పరిచయం చేయగా వంగపండుని ఒకసారి కలుసుకోగలిగాను. కాని, ఆయన కవిత్వాన్ని అధ్యయనం చేయవలసినంతగా అధ్యయనం చేయలేదని మాత్రం ఇప్పుడు గ్రహిస్తున్నాను.

పాట చాలా చిత్రమైనది. ఒకరికి అది జయమాల, మరొకరికి ఉరితాడు. ఒకరినది అందలమెక్కిస్తుంది. పద్మశ్రీ, పద్మవిభూషణుల్ని చేస్తుంది. మరొకరిని ప్రవాసానికీ, కారాగారానికీ పంపిస్తుంది. కాని, శ్రోతల్ని మాత్రం ఒక్కలానే పరవశింపచేస్తుంది. గీతకారుడికి పాటనుంచి ఏమి దక్కుతుందనేది అతడి సామాజిక-రాజకీయ సందర్భాన్ని బట్టి ఆధారపడుతుంది. కానీ, జాతికి మాత్రం ఆ పాట మిగులుతుంది. గీతకారుడి సుఖసంతోషాలూ, కష్టనష్టాలూ పాటగా మారి ఆ పాట విన్న ప్రతి ఒక్క గుండెలోనూ గూడుకట్టుకోవడం మొదలుపెడతాయి.

తెలుగు భాష, తెలుగు పాట, తెలుగు శ్రోత ఉన్నంతకాలం వంగపండు చిరంజీవి.

Monday, August 3, 2020

బ్రాహ్మణులు ఇకనైనా తమ పంథాను మార్చుకోవాలి..

బ్రాహ్మణులు ఇకనైనా తమ పంథాను మార్చుకోవాలి..
కాలానుగుణంగా మనమూ మారి "తీరవలసిందే.."

"శాస్త్రాన్ని - ఆధునికతను" ఈ రెండిటిని
సరైన స్థాయిలో సమన్వయ మొనర్చినప్పుడే
మనకు నిజమైన పురోగతి, "ఆశయాభివృద్ధీ కూడా.."

కారణం: కుడిచెంప మీద కొడితే ఎడమచెంప
చూపటానికి ఇదేమి గాంధీగారి కాలమూ కాదు..
ధర్మం నాల్గుపాదాల నడిచిన రామరాజ్యమూ కాదు..

నీచ నికృష్టాదుల చేతుల్లో..
పరమ పవిత్రమైన వేదధర్మం, సనాతన సాంప్రదాయం..
అడుగడుగునా అవమానింప బడుతున్న కలికాలం..
దుర్భరమైన "మధాందుల కాలమిది.."

మహోన్నతమైనట్టి వేదదర్మం అణగారిపోతున్నా..
అర్చకుల ఆత్మాభిమానాలు మంటగలసి పోతున్నా..

ఇంకా నేను శాంతి మంత్రాలనే పఠిస్తాను..
ఓ మూల కూర్చొని వేదపనసలనే "వల్లెవేస్తానంటే.."

ప్రియమైన వేదపండితుడా..
తస్మాత్ జాగర్త..!!

యావత్ "జాతీ.." నిర్వీర్యమైపోవలిసిందే..
మీలోని నిర్లక్ష్యతకు, హేయమైన మీ నిర్లిప్తతకు..

"ఇదం బ్రాహ్మ్యం - ఇదం క్షాత్రం.."

ధర్మం తప్పిననాడు తుదకది స్త్రీయైనాసరే..
నిట్టనిలువునా సంహరించవలసిందే నిర్దాక్షిణ్యంగా..

ఇదే విషయాన్ని గూర్చి మరింత లోతుగా
"నిర్మొహమాటంగా.." ప్రస్తావించవలసివస్తే..

ఇకనైనా మనం మారకుంటే, సంఘటితం కాకుంటే..
కాలానుగుణంగా వ్యవహరించకుంటే..

2040 నాటికి "బ్రాహ్మణత్వం.." పరిపూర్తిగా
తన ఉనికిని కోల్పోవలసి వస్తుంది "నిస్సందేహంగా.."

Let me explain point by point..

చాపకింద నీరులా చుట్టుముడుతున్న అన్యమతస్తులు..
రాజకీయ నాయకులను సినీపరిశ్రమను వశపర్చుకోని..

తమతమ మాధ్యమాల ద్వారా..
అధికార దుర్వినియోగత ద్వారా..
సద్బ్రాహ్మణులను వేదపండితులను.. సంఘద్రోహులుగా "వెధవలుగా.." చిత్రీకరించి..

మనవారిని మనవారిపైనే ఉసిగొలిపి..
బ్రాహ్మణుడికి సాటి బ్రాహ్మణుడినే శత్రువుగా మలచి..

మనలోని అనైక్యతనే మనపై
ఓ "బ్రహ్మాస్త్రంగా.." ప్రయోగిస్తూ..

బ్రాహ్మణేతర అర్చకులు..
బ్రాహ్మణేతర పీఠాధిపతులు..
బ్రాహ్మణేతర ఆలయ విధులు..
బ్రాహ్మణేతర యజ్ఞ యాగాదులు..

ఇలా ఒక్కొక్కటిగా పావులు కదుపుతూ..
వ్యూహలను రచిస్తూ సామాన్య ప్రజాబాహుళ్యంలో..
ఓ తిరుగుబాటుకై, ఏర్పాటు వాదానికై నినాదాలిస్తూ..

వేదాల్లో బూతులున్నాయి..
ఉపనిషత్తుల్లో హింసాకాండలున్నాయి..

మనుస్మృతిలో యిలా చెప్పబడింది..
అధర్వణ వేదంలో యిలా ఉదహరించబడిందంటూ..

క్రిందిస్థాయిల వారిని, అమాయక ప్రజలను..
అడుగడుగునా మనపైకి రెచ్చగొడుతూ, ఉసిగొల్పుతూ

ఫైనల్గా బ్రాహ్మణత్వాన్ని బ్రాహ్మణుడినే "ఓ బఫూన్గా.."
మార్చబోతుంది ఈ "మతాంతర దుష్టచతుష్టయం.."

"ఆచార్య గౌతముడు.." ఓ ద్రష్టయై
తెలియజేస్తున్న పరమ "యదార్ధమిది.."

ఎవడు విశ్వసించినా విశ్వసించకున్నా..
ఇదే! సత్యం, సత్యం, సత్యం, "పునఃసత్యం.."

కనుకనే! ఓ సద్బ్రాహ్మణుడి ఆలోచనా శైలిలో
వ్యవహార శైలిలో, యికనైనా ఓ స్పష్టమైన మార్పు రావాలి.. ఆ మార్పు! "మీనుండే మొదలవ్వాలి.."

అందుకై..! మీరేమీ "కత్తులూ.." పట్టనవసరంలేదు..
ఊరూరా "కుస్తీపోటీలూ.." నిర్వహించనవసరంలేదు..

కేవలం ఈ సమాజంపట్ల మీలో నెలకొన్న భయాల్నీ..
అనవసరమైన "చాదస్తాలని.." విడనాడితే చాలు..

1. ఎవడైనా మనల్ని విమర్శించినప్పుడు..
క్రిందిస్థాయి వారిలా "లం..కొడకా" అనవసరంలేదు..

కనీసం అందులో సగం!
"నోరుముయ్యరా జారపుత్రుడా.."
అని అవతలివాడి "నోరును.." నిట్టనిలువునా..
మూయించగల్గితేచాలు, నిర్భయంగా, సభాముఖంగా..

2. "సినీపరిశ్రమను.." ద్వేషించనవసరంలేదు..

కనీసం, నుదుటిపై త్రిపుండ్రాలను! మేనిపై యజ్ఞోపవీతాన్నీ దాల్చామన్న ఇంగిత జ్ఞానం
కూడా లేకుండా, నాలుగు చిల్లర డబ్బుల కోసం, శ్రావణమాసం సినిమాలో పూజ్యులు తనికెళ్ళభరణి గారిలా, "హరికృష్ణ కాళ్ళదగ్గర పాకే.." పనికిమాలిన "క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను.." వారి దిగజారిన భావజాలాన్నీ ఖండించి, వీలైనంత "దూరంగా ఉంచితే చాలు.."

3. "ఓటు హక్కును.." విస్మరించనవసరం లేదు..

కానీ, సోమిరెడ్డి లాంటి అంట్లవెధవలను..
బజారు మనుషులను, మరోసారి తిరిగి ఎన్నుకోకుండా, ఎన్నుకొని అవమానింపబడకుండా "సంఘటితంగా - సమూలంగా" ఉద్వాసన "చెప్పగల్గితే చాలు.."

4. ఉత్సాహంతో "డాన్సులెయ్యనవసరంలేదు.."

కానీ, అనవసరమైన జోక్యాలతో, అహంకారంతో,
సాటి బ్రాహ్మణులను, అర్చక వ్యవస్థని, వేదధర్మాన్నీ, అవమానిస్తుంటే, చీమూనెత్తురూ లేనివారిలా, బృహన్నల వారసుల్లా, హా! మనల్ని కాదులే..!! మనదాకా రాబోదులేయన్న, స్వార్ధబుద్ధితో, నిర్లక్ష్యతతో, నిమ్మకు నీరెత్తినట్లు, వ్యవహరించక, చూసీచూడనట్లు నటించక, గాలిలో దీపంపెట్టి శాంతిమంత్రాలను పఠింపక, శక్తివంచనలేకుండా సర్వులూ ఏకమై, మీవంతు "పోరాడగల్గితే చాలు.."

5. మడినీ ఆచారాలను "వదులుకోనవసరం లేదు.."

కానీ, మనంకూడా మనుషులమేనని మర్చిపోకుండా!
ఎప్పుడైనా బ్రాహ్మణుడనేవాడు, అర్చకుడనేవాడు, తినాలనిపించో, లేక తప్పకో.. బయటికివెళ్లి,
ఏ బజ్జీలో, న్యూడిల్సో, పానీపూరీనో భుజిస్తే,
లేకో జీన్స్ ప్యాంట్ ను ధరిస్తే, అదేదో పెద్దనేరంలా, మానభంగంలా, వందమందిని చంపిన హత్యాకాండలా చిత్రీకరించి..!! నీ వారినే నువ్వు తప్పుపడుతూ, నడిరోడ్డుపైకి ఈడుస్తూ, అక్కడికి నువ్వేదో పెద్దఉత్తముడిలా, గురిగింజలా, సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడిలా! స్టేజీపైకెక్కి
"వెధవ ఉపన్యాసాలు.." ఇవ్వకుండా ఉంటే చాలు.. 

6. విరగబడి లోకాన్నేం "ఉద్ధరించనవసరంలేదు.."

కనీసం, 30 యేండ్లు దాటినా, నలభై యేండ్లు వచ్చినా..
అర్చకవ్యవస్థలో ఉన్నవారు పెళ్లీపెటాకులు కాక..
దేబ్యపు ముఖాలేసుకొని మగ్గిపోకుండా, మీ కూతుర్లకు, మేనకోడళ్లకు, IT సంబంధాల కోసమై, విదేశీ సంబంధాల కోసమై ప్రాకులాడకుండా, కోట్లు పోసినా దొరకని, ఓ భగ్వద్ సేవకునికి, "అర్చకునికీ యిచ్చి.." గౌరవప్రదంగా వివాహం "చెయ్యగల్గితే చాలు.."

7. సమాజంపై "విరుచుకుపడనవసరం లేదు.."

ఎదుటివారి జాలి కూతలకు, గాలి కూతలకు లొంగకుండా, ప్రతీ ఒక్కరిలోనూ తగు అంతర్గత భయాన్నీ వణుకునూ కలిగించేలా, కమ్యూనిటీ
గురించి "ఏ ఒక్కడూ, ఏ రాజకీయ నాయకుడు
తప్పుగా మాట్లాడకుండా.." వేలెత్తి చూపకుండా,
ఎవడిని ఎలా వంచాలో, ఎవరి నోరును ఎలా
మూయించాలో, తగు సరైన స్థాయిలో గుర్తెరిగి,
సామ, దాన, భేద, దండోపాయాలను
ప్రయోగించానా సరే, మనలో మనం
కీచులాడుకోకుండా, దుర్భాషలాడుకోకుండా,
"మనవారిని మనం.." సర్వేసర్వత్రా పొదివిపట్టి
"సంరక్షించుకోగల్గితే చాలు.."

Last but not the least..

8. చంద్రమండలానికి "దూసుకెళ్లనవసరంలేదు.."

కానీ, ఎప్పుడూ, శాంతి, సహనం, అర్చకత్వం,
మడీ దడీ.. అని బిగుసుకుపోకుండా, కాలానుగుణంగా నడుచుకుంటూ, చిన్నవారిని సైతం తగు సహృదయంతో ప్రోత్సహిస్తూ, మారుతున్న టెక్నాలజీకి తగ్గట్లు, తగు Updated గా వ్యవహరిస్తూ, కేవలం అర్చకవ్యవస్థలోనే కాక, రాజకీయం, విద్యా, వైద్యం, వ్యాపారరంగం, జర్నలిజం ఇలా ప్రతీ విభాగంలోనూ, మనదైన శైలిలో చొచ్చుకుపోతూ, "శాఖలు - తోకలూ అంటూ వెఱ్ఱి కూతలు కుయ్యకుండా.." శృతిమించిన పైత్యాన్ని ప్రదర్శించకుండా, ప్రతీ ఒక్కరితోనూ,
తగు స్నేహభావంతో సచ్ఛీలతతో నడుచుకుంటూ, తగు దృఢ సంకల్పంతో, "ధీరత్వంతో విలసిల్లగలిగితే చాలు.."

జగత్పూజ్యమగు వేదధర్మం సనాతన సాంప్రదాయం..
సర్వేసర్వత్రా దిగ్విజయంగా సుశోభితంగా వర్ధిల్లాలని..

మహోత్కృష్టమైనట్టి సద్బ్రాహ్మణ "విజయపరంపరకై"
ప్రతీ వేదపండితుడూ, ఓ "సైనికుడై పోరాడాలని.."

మనసా, వాచా, కర్మణా..
త్రికరణ శుద్ధిగా ఆశిస్తూ..

సర్వేజనా సుఖినోభవంతు..
గో బ్రాహ్మణేభ్యః శుభంభవతు..

స్వస్తి... 

అరటికాయ బజ్జీలు. బంగాళాదుంప, కాకర, వాము ఆకు

అంతరించిపోతున్న బజ్జీసాంప్రదాయం

బాధపడుతున్నవారు: కాలనాధభట్తవీరభద్రశాస్త్రి

**  **  **

ఎంతసేపూ మిరిపకాయబజ్జీలే తప్ప ఇంకేవీ గుర్తుకురావా?

అసలు బజ్జీలకు పితామహ ప్రపితామహులు అరటికాయ బజ్జీలు. బంగాళాదుంప, కాకర, వాము ఆకు, వంకాయ దర్మిలా ఉల్లిపాయకూడా

అవతలహోరున వాన. మండువాలోగిల్లో మధ్యవున్న చతురస్య కుండిలో ధారాపాతంగా పైన పెంకులకప్పునుంచి

వాన నయాగరా జలపాతంలా జాలువారుతూవుంటే చాపమీదకూర్చుని మగరాయుళ్ళు చతుర్ముఖ పారాయణ చేస్తూ మధ్యమధ్య నారీమణుల హస్తపాకచాతుర్య సంభవమైన వేడివేడి బజ్జీలు తింటూవుంటే, మరికొందరు డిటెక్టివ్ నవలో వార పక్షమాసపత్రికలో చదువుతూ పేజీలు తిప్పుతూ ఆసమయంలొ వేడివేడి బజ్జీలు తింటూఆస్వాదిస్తూవుంటే. కన్నెపిల్లలు చింతగింజలతో వామనగుంట ఆడుతూ మధ్య మధ్య వేడివేడి బజ్జీలుతింటూవుంటే, నవదంపతులు గదిలో మంచంమీదకూర్చుని భార్య బజ్జీని భర్తనోట పెట్టి తానొకటి భర్త తననొటపెట్టగా తింటూవుంటే 

చెప్పలేను ఆహాయి ఎంతోగొప్పగవుంటుందోయి

మారోజుల్లో మిరపకాయబజ్జీలు ఎరగం అంటే సత్యదూరంకాదు

పచ్చిమిర్పకాయ నూరిన మెత్తని ఉప్పులో అద్దుకొని పప్పు అన్నం తినడం అలవాటు. 

అంతేగాని పచ్చిమిరపకాయలోని (అహం) కారమ్ నూనేలోవేగితే అబ్బే హుళక్కేకదా!

మరోవిషయం

పులిహారలో చింతపండు రసం ఆరసంతోబాటు వుడికిన ఎండుమిరపకాయలు 

ఎప్పుడన్నా విడిగా ఆఎండుమిరపకాయలు నమిలారా? పుల్లపుల్లగా కారంకారంగా..అబ్బో పులిహారకి అనుపానంకదండీ

అసలు మారోజుల్లొవివాహాలలొ మధ్యాహ్నం స్నాక్సు తీపి బూందీ, వేడివెడి అరటి, బంగాళాదుంపబజ్జీలే. నో ఉల్లిపాయ

ఉదయం ఫలహారం ఉప్మాయే. 

బడా వివాహాలలో ఉదయం పెసరట్టు ఉప్మా

2009 నవంబరు ఒకటవతేదీన అమెరికా హ్యూస్తన్ నగరంలో మాద్వితీయపుత్రుని ప్రధమపుత్రిక వివాహానికి ఉప్మాయే ఉదయం ఫలహారం

దర్మిలా కాలంతోమార్పులువచ్చి ఏవేవో చేస్తున్నారు

వెళ్ళండి   ఏభైసంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆరోజుల్లోని  వంటలు ఆస్వాదించండి

**  **  **

కొసమెరుపు: నాకు మిరపకాయ అంటే మహా చెడ్డభయం. నాశ్రీమతికి మహాయిష్టం. 

కనుక తనని తల్చుకుంటూ ఈ రచన తనకే అంకితం

Friday, July 31, 2020

దీపావళి

ఏమైపోయాయండి ఆ రోజులు

దీపావళి వస్తుంది అంటే 3 నెలలు ముందు నుండే పిల్లలలో ఒకటే సందడి , అరేయ్ ఇంకా 3 నెలలే ఉంది దీపావళి రేపు వెళ్లి సిసింద్రీ మందు, పటాస్ మందు తెచ్చుకుందాం అని మొదలుపెట్టిన మాటల నుండి అనుకోవడం ఆలస్యం వెంటనే వెళ్ళి వాటిని కొని ఊరిలో ఎక్కడ తాటాకులు ఉంటాయా అని నెత్తుక్కొని అవసరమైతే పొలాలకు వెళ్లి తెచ్చుకొని వాటిని ఎండబెట్టి అలాగే సోవియట్ పేపరు కోసం ఎక్కడ ఉన్నదా అని షాప్ ల చుట్టూ తిరిగి ఆ సోవియట్ పేపర్ కొని, పేకలు కొని వాటన్నింటినీ ఒకచోట చేర్చి ఎండబెట్టడం దగ్గరనుండి వాటిని తయారు చేసేవరకు ఒకటే ఆత్రం ఉండేది. ఆ ఆత్రంలోనే తయారుచేసినవి అసలు ఎలా పేలుతున్నాయి అని ఒక్కొక్కటిగా వేస్తూ చివరికి మొత్తం అన్ని అవగొట్టేవాళ్ళం తిరిగి మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ అవన్నీ కొని తయారు చేసేవాళ్ళం ...

పండగ దగ్గరకి వచ్చేసరికి పేక పెటేబులు, తాటాకు పెటేబులు, సిచ్చిబుడ్డులు, సిసింద్రీలు, జువ్వలు ఇలా ఎన్నో రకాలు సొంతంగా తయారు చేయడం ఉండేది...

పండగ దగ్గరకి వచ్చేసరికి నాన్న ఎప్పుడు మందుగుండు సామాను కొంటార అని ఎదురుచూసిన చూపులు ఎన్నో , వాటిని కొని తీసుకొచ్చాక నాన్న హీరో నుండి సూపర్ హీరో అయ్యేవారు మన దృష్టిలో వాటిని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అన్నాచెల్లెళ్ళు ఇలా వాటాలు వేసుకొని పంచుకుంటే వచ్చే ఆనందం, పండగకి కొత్త బట్టలు కొంటే కలిగిన ఆనందం, అయిదు రోజుల దీపావళి కి అయిదు రోజులు వచ్చేలా ఆ మందుగుండు సామాను రోజుకి ఇన్ని అన్ని పక్కన పెట్టుకొని వాటిని కాలుస్తున్నప్పుడు పొందిన  ఆనందం, నేను అన్ని కాల్చాను మా నాన్న ఆ మందులు  తెచ్చారు, ఇవి తెచ్చారు అని మన స్నేహితులకు గొప్పగా చెప్పుకున్నప్పుడు వచ్చిన ఆనందం ,,, పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోయి మనతో పాటు వాటిని కాల్చుతున్నప్పుడు మనం చూసిన ఆనందం ఎక్కడికి పోయాయి ఇవన్నీ ...

మనమే ఇవన్నీ అనుభవించాము అనుకుంటే మనపెద్దవారు ఇంతకు రెండింతలు సంతోషాన్ని పొందారు ...

వారితో పోల్చుకుంటే మనం తక్కువే కానీ మనతో పోల్చుకుంటే ఇప్పటివారు ఆ విషయాలలో పిసరంత ఆనందమైన పొందడం లేదు అనే చెప్పాలి

అప్పుడు అన్ని చాలా తక్కువ కాలుష్యరహితంగా ఉండేవి ఎందుకంటే ఎవరికి వారు సొంతతయారు చేసుకునేవారు , ఉన్నవాటిలో సంతోషంగా గడిపేవారు ... ఇప్పుడన్ని కాలుష్యాన్ని పదింతలు పెంచేలా ఉంటున్నాయి అయిన కానీ మనుషుల్లో సంతోషాలు ఉండటం లేదు

మా నాన్నగారు వంద రూపాయలు పెట్టి దీపావళి సామానం కొంటె ఇంట్లో అందరం కాల్చుకునేవాళ్ళం , ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టి కొన్నా సరే అప్పటి ఆనందంలో ఒక్కశాతం కూడా ఉండటం లేదు

కాలం మారింది అనడానికి ఇలాంటివి మరెన్నో ఉదాహరణలు ఉన్నాయి

కాస్త నిజమైన ఆనందంగా,  ఉండేలా నేర్పండయ్యా పిల్లలకి మీ ఫణి కందాళ

Monday, July 27, 2020

ఏ ఘట్టంబున నైన కోపమను మాటే లేని శాంతమ్ము వా చాఘర్షస్థితినైన .....

నేను ఫోర్త్ ఫాం లో ఉన్నప్పుడు యం యల్ నరసింహారావు గారని మా స్కూల్లో ఒక సెకండరీ గ్రేడ్ మాస్టారు వచ్చారు. ఆయన లోయర్ ఫాంస్- అంటే ఫస్ట్, సెకండ్, ధర్డ్ ఫాంస్ కి మాత్రమే పాఠాలు చెప్పాలి. హయ్యర్ ఫాంస్ - అంటే ఫోర్త్, ఫిఫ్త్, యస్ యస్ యల్ సి లకి చెప్పరాదు.కాని ఆయన ఫోర్త్ ఫాం స్పెషల్ తెలుగు, కాంపోజిట్ మ్యాథ్స్ గూడా చెప్పేవారు. ఆ సబ్జెక్ట్స్ లో అంత పట్టు ఉండేది ఆయనకి. పొట్టిగా ఉండేవారు. స్పోర్ట్స్ ఆక పోయినా స్పోర్ట్స్ ఇన్ ఛార్జ్ గా ఉండేవారు.
మేమంతా బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం.
ఓ రోజు ఒకాయన వచ్చి బైటివాళ్ళు ఆడుకోడానికి నెట్టూ, బాల్సూ అడిగారు. స్కూల్ ప్రాపర్టీ బైటికి యివ్వడం మాష్టారికి యిష్టంలేదు. నెట్ లేదనిచెప్పారు. ఆ సంగతి తెలీని మేము ఉందని చెప్పాం. ఆయన యిరుకున బడ్డారు. చేసేది లేక నెట్, బాల్స్ యిచ్చి పంపించి ఆయన వెళ్ళాక మామీద బాగా కోప్పడ్డారు. వెంటనే యీపద్యం బోర్డ్ మీద రాసి వెళ్ళి పోయారు. ఆ పద్యం యిది.

ఏ ఘట్టంబున నైన కోపమను మాటే లేని శాంతమ్ము వా
చాఘర్షస్థితినైన .....

ఇంతవరకే గుర్తుంది.
ఎందుకో ఇన్నేళ్ళ తరవాత అది గుర్తొచ్చి ఆపద్యం మిగతాది పూరించి ఆయనకే అంకితం ఇస్తున్నాను.

శార్దూలం
ఏ ఘట్టంబున నైన కోపమను మాటేలేని శాంతంబు వా
చాఘర్షస్థితి నైన నోటను నవాచ్యం బైన వాక్యంబు నై
దాఘౌష్ణ్యమ్ము మనస్సునందు బొడమం దావీక యుష్మన్మహా
మోఘాశీర్వచనమ్మునన్ మనుచు మమ్మున్ నారసింహా గురూ!

భావం: ఎప్పుడూ కోపంలేని శాంతం, ఏదైనా గొడవ పడేటప్పుడు గూడా అనరాని మాటలు నోట రానీక, వేసవికాలపువేడి( అంత ఔద్ధత్యం) మనసులో ప్రవేశించకుండా , ఓ గురువు గారూ! మమ్మల్ని ఆశీర్వదించండి

కోయంది కోయిల (బులుసు

కోయంది కోయిల (బులుసు)
***************
 నా రాణి పిలుపులా
 కోయంది కోయిల
 నందనోద్యానాల
 ఊగె మది ఊయెల !!
          కొమ్మకొమ్మన చిగురు
          చిగురు చిగురున ఒగరు
           వగల కొమ్మావిపై
           రాగాల - గారాల!!
 తలపువిరిసే వేళ
కలలు పండే లీల
రసవాయులీనాల
రవళించు నాదాల  !!
          పాటలే బ్రతుకైన
           ఓ కోయిలా
           నిలువవే సిరికోన
            కొక నీడలా!!
********************************

Total Pageviews