Wednesday, January 28, 2015

మా తాత గారైన కీ. శే . శ్రీ విస్సా వేంకటరావు గారు. వారి భక్తి రసాత్మక, సహకవితా ప్రసూనములు:- 11 - 21వ పద్యం

11)వ పద్యం
కొండనుజేర, బస్సులను, కూర్చిరి, భక్తుల మేలుకోసమై
ఎండకు వానకున్ వెరవ కెందరో భక్తులు పాదచరులై
కొండకు వత్తురయ్య, తమ కోర్కెలు, తీరిన కారణంబునన్
వెండియు, నీక్రుపారాసము వేడ్కను చిల్కవె భక్తకోటిపై!
12) కొండల నేడు నెక్కి యటకొల్వునుదీర్చుట కోపమాప్రభూ
గుండెలచేతబట్టుకొని గుప్పిట జీవములుంచి, నీపయిన్
మెండగు భక్తితోజనులు మెల్లగవత్తురు కొండలెక్కి, నీ
వండగనుండ, నేమిభయ, మార్త శరణ్యుడ వేంకటేశ్వరా!
13) బాధలనొందువేళ కడుభాగ్యులు పేదలు నొక్కటేగదా
వేదనజెందుచున్ మదిని వేయివిధంబుల నిన్ను వేడగా 
బాధలబాపి వారలకు భద్రత కూర్చవె  పిల్చినంతలో
సాదరమొప్ప భక్తులను సాకెడు మా యిలవేల్పునీవేగా!!
14) అల్పుడ నర్భకుండ నిను నర్చన జేయగ జాలనిష్టతో
నిల్పితి నీదురూపమును నిర్మలనాహృది పీటమందు నే
సల్పెడ నామమంత్రమును సన్నుతి జేతును నీదు కీర్తనల్ 
కొల్చెద భక్తి పుష్పముల కోమల భావసుమంబులన్ ప్రభూ !!  
15) 18వ పద్యం
పాపులు దుష్టవర్తనులు పాతకులైనను నిన్ను కొల్వగా
కోపంబూనకందరకు కూర్తువు నిశ్చల శాంతిభద్రతల్
బాపురే నీదయారస మపారమనూహ్యము  తెల్పశక్యమే
పాపులనుద్దరించి కడుపావనమూర్తుల జేతువందరిన్.
 20వ పద్యం.
పంకజనాభ నిన్ను మది భావనచేసి నుతింతు నెప్డు నా
వంకకు జూడవేల విధివర్తనమో మరి భక్తిలోపమో
వంకరులున్న చెర్కుగడ వాటముగా రుచినంద జేయదా
శంకనుమాని నీ చరణసన్నిధి నిల్వ శరణ్య మీయవే !! 
21వ పద్యం.
ఆపదలందు మున్గితేలియాడెడు భక్తులకున్ పరీక్ష యో
కోపము నిన్నారతముకొల్చి  భజించుట యేమి మాయయో
తోపదు మామనంబులకు తొల్గవు భాదలవొక్క నాటికిన్
మాపయి చూపవే కరుణ మాన్పవె మా పరితాపభారమున్!!  

Monday, January 26, 2015

చిన్ననాటి కథలు.

చిన్ననాటి కథలు.                              
                                            నిజాయితీ

                    అనగనగా ఒక ఊరిలో మల్లన్న అనే ఒకతను ఉండేవాడు. అతడు రోజూ కట్టెలు కొట్టుకొని అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఆ ఊరి చివర ఒక చిన్న నది ఒకటి పారేది.ఒకసారి ఆ నది ఒడ్డున వుండే చెట్టు ఎక్కి తన గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు. చేతిలో ఉన్న గొడ్డలి జారి నదిలో పడిపోయింది. మల్లన్నకి ఈతరాదు. ఏం చేయాలో తెలియక చాలా దిగులతో ఆ నదివైపే చూస్తూ కూర్చున్నాడు.
                   
                  అతడి బాధ చూసి నదీ దేవతకు జాలి వేసింది. ఆ దేవత మల్లన్నకు ఎదురుగా కనిపించి "ఎందుకు బాధ పడుతున్నావు " అని అడిగింది. అందుకు అతడు జరిగినదంతా ఆ దేవతకు చెప్పి ఆ గొడ్డలే నాకు ఆధారం అని, అది లేకపోతె తనకు జీవించడం కష్టమని చెప్పాడు.
                     
                           అది విని ఆ దేవత నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలి తీసి మల్లన్నకు చూపించి " ఇది నీదేనా " అని అడిగింది. మల్లన్న అది నది కాదు అని చెపుతాడు. మళ్లీ నీళ్ళల్లోంచిఒక వెండి గొడ్డలి తీసి చూపించి " ఇది నీదేనా?" అని అడిగింది. అదికూడా నాదికాదని చెప్పాడు. ఆ దేవత నీళ్ళల్లోంచి అతని గొడ్డలే  తీసి చూపించింది.అది చూసి మల్లన్న చాలా సంతోషంతో " అదే అదే నా గొడ్డలి" అని చెపుతాడు. అతని నిజాయితీకి దేవత సంతోషించి బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కుడా అతనికి ఇచ్చి వెళ్ళిపోయింది.అప్పటినుండి మల్లన్న సంతోషంతో జీవనం సాగించాడు.                              
                                            నిజాయితీ

                    అనగనగా ఒక ఊరిలో మల్లన్న అనే ఒకతను ఉండేవాడు. అతడు రోజూ కట్టెలు కొట్టుకొని అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఆ ఊరి చివర ఒక చిన్న నది ఒకటి పారేది.ఒకసారి ఆ నది ఒడ్డున వుండే చెట్టు ఎక్కి తన గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు. చేతిలో ఉన్న గొడ్డలి జారి నదిలో పడిపోయింది. మల్లన్నకి ఈతరాదు. ఏం చేయాలో తెలియక చాలా దిగులతో ఆ నదివైపే చూస్తూ కూర్చున్నాడు.
                   
                  అతడి బాధ చూసి నదీ దేవతకు జాలి వేసింది. ఆ దేవత మల్లన్నకు ఎదురుగా కనిపించి "ఎందుకు బాధ పడుతున్నావు " అని అడిగింది. అందుకు అతడు జరిగినదంతా ఆ దేవతకు చెప్పి ఆ గొడ్డలే నాకు ఆధారం అని, అది లేకపోతె తనకు జీవించడం కష్టమని చెప్పాడు.
                     
                           అది విని ఆ దేవత నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలి తీసి మల్లన్నకు చూపించి " ఇది నీదేనా " అని అడిగింది. మల్లన్న అది నది కాదు అని చెపుతాడు. మళ్లీ నీళ్ళల్లోంచిఒక వెండి గొడ్డలి తీసి చూపించి " ఇది నీదేనా?" అని అడిగింది. అదికూడా నాదికాదని చెప్పాడు. ఆ దేవత నీళ్ళల్లోంచి అతని గొడ్డలే  తీసి చూపించింది.అది చూసి మల్లన్న చాలా సంతోషంతో " అదే అదే నా గొడ్డలి" అని చెపుతాడు. అతని నిజాయితీకి దేవత సంతోషించి బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కుడా అతనికి ఇచ్చి వెళ్ళిపోయింది.అప్పటినుండి మల్లన్న సంతోషంతో జీవనం సాగించాడు.  

Sunday, January 25, 2015

ఈరోజు (26.01.2015) రథసప్తమి. చాలా విశిష్టమైన రోజు.సూర్యుడు మాఘ శుద్ధ సప్తమి నాడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.ఇదేరోజున సూర్య భగవానుడు తన రథాన్ని ఉత్తరం వైపుకు మరలించినట్లు చెప్పబడింది.ఆ దేవదేవుని అనుగ్రహం మన అందరిపైనా కలగాలని కోరుకొంటూ రథ సప్తమి శుభాకాంక్షలు.

ఈరోజు (26.01.2015) రథసప్తమి. చాలా విశిష్టమైన రోజు.సూర్యుడు మాఘ శుద్ధ సప్తమి నాడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.ఇదేరోజున సూర్య భగవానుడు తన రథాన్ని ఉత్తరం వైపుకు మరలించినట్లు చెప్పబడింది.ఆ దేవదేవుని అనుగ్రహం మన అందరిపైనా కలగాలని కోరుకొంటూ రథ సప్తమి శుభాకాంక్షలు.
                                      సూర్యాష్టకం

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ||
సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మావిష్ణుమహేశ్వరమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
బృంహితం తేజఃపుంజం చ వాయురాకాశమేవ చ |
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితమ్ |
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ |
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ ||
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా ||
స్త్రీతైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి ||

మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' అనంత పురం 'మణిసాయి సాహితీ యుగళ గీతిక'



ఈ రోజు శ్రీ పంచమి శుభవేళ లో  మా విస్సా పీఠం అధ్వర్యంలో  'రేడియో కేక' అనంత పురం నుంచి ఉదయం 9 గంటల నుంచి 10 గంటలవరకు ప్రత్యక్ష ప్రసారంలో మేము నిర్వహించిన సాహితీ కార్యక్రమం ఈ లంకె నొక్కి https://www.youtube.com/watch?v=KsjLvOrqQeo  మీరు కూడా వినండి. మీ అమూల్య అభిప్రాయాలు తెలియచెయ్యండి...ప్రతి ఆదివారం రేడియో కేక లో 'మణిసాయి సాహితీ యుగళ గీతిక' లో మీరు కూడా  పాల్గొనవచ్చు మీ ప్రతిభను ప్రదర్శించవచ్చు. మా విశ్వ వ్యాప్త ముఖపుస్తక బంధు మిత్రులందరికీ మా హృదయపూర్వక సాదర ఆహ్వానం!!
ఈ లంకె నొక్కి వినండి!
https://www.youtube.com/watch?v=KsjLvOrqQeo

Saturday, January 24, 2015

అపజయం నుంచి గుణపాటం విజయం నుంచి వినయం మనం తప్పక నేర్చుకోవాలి. మణిసాయి - విస్సా ఫౌండేషన్.


తోటకూర నాడే.

తోటకూర నాడే...
 అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పేదరాలు వుండేది. ఆమెకు ఒక్కడే కొడుకు. ఒక రోజు వాడు ఒకరితోటలో పెరిగిన తోటకూర మొక్కల్ని దొంగతనంగా పెళ్లగించుకొని వచ్చి తల్లికి ఇచ్చాడు. తల్లి కూరకు  పనికివస్తుంది కదా అనుకొని సంతోషించింది.  కానీ ఈ మొక్కలు ఎక్కడివి? ఎవరైనా దయతో ఇచ్చారా? లేక దొంగతనంగా తెచ్చావా అని కొడుకుని ప్రశ్నించలేదు.
 అప్పటి నుంచి వాడు దొంగతనాలకు అలవాటు పడ్డాడు.దురలవాట్లకు లోనయ్యాడు. క్రమంగా పెద్ద దొంగగా మరి దొంగతనాలు, దోపిడీలు చేసేవాడు. ఆ గొడవల్లో అనేకసార్లు దెబ్బలు తినేవాడు. ఆ దొంగతనాలు, దోపిడీలు చేసే సందర్భాలలో ఎదురు తిరిగిన కొందరిని చంపాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు నేరాలు రుజువైనాయి  న్యాయమూర్తి అతనికి ఉరి శిక్ష విధించాడు.
ఉరి తీసేముందు " నీ కడసారి కోర్కె కోరుకోమని " తలరి చెప్పాడు "మా అమ్మతో ఒక్కసారి మాట్లాడనివ్వండి" అన్నాడు. కొడుకు ఏం చేబుతాడోనని తల్లి ఏడుస్తూ వచ్చింది. నీకు ఒక రహస్యం చెబుతా చెవిలో అన్నాడు. ఏమి రహస్యం చేబుతాడోనని ముందుకు వంగింది.అంటే కసుక్కున ఆమె చెవి కోరికేసాడు.ఆమె అమ్మో అని ఏడుస్తుండగా....నేను తోటకూర తెచ్చిననాడే  నాకు బుద్ధి చెప్పివుంటే  నాకు ఈరోజు ఈగతి పట్టేది కాదుగా అని భాధగా అంటాడు దొంగ.

Friday, January 23, 2015

చిన్నప్పుడు విన్న కథ మరొక్కసారి గుర్తుచేసుకొందాం!!!

చిన్నప్పుడు విన్న కథ మరొక్కసారి గుర్తుచేసుకొందాం!!!
                       * అత్యాశ పనికిరాదు *
                     అనగనగా  ఒక ఊర్లో వెంకన్న అనే అతను చేపలు పట్టి జీవనం సాగించేవాడు. అతడు చేపలు పట్టి జీవనం సాగించలేక ఒక తపస్సు చేసాడు. అతని తపస్సుకు మత్స్య దేవత సంతోషించి " వారం కోరుకో " అంటే అతడు ఆనందంతో ఏమి అడగాలో తెలియక ఇంటికివెళ్ళి నా భార్యను అడిగివస్తాను అని ఇంటికివెళ్ళి వస్తాడు.
                         ఏమి కావాలి అని మత్స్యదేవత అడగగా " నా భార్యకి ఒంటినిండా నగలు, పట్టుచీరలు కావాలని అడిగింది." అని చెపుతాడు. అదివిన్న దేవత '' తధాస్తు " అని నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నన్ను తలచుకో అని మాయమైపోతుంది.అయితే అంతరితో వెంకన్న భార్య  తృప్తి చెందక "మన ఇల్లు మేడకావాలి, ఇంటినిండా నౌకర్లు ఉండాలి, ఏ లోటు లేకుండా కాలం గడిచిపోవాలి " అని దేవతను మల్లి అడిగిరమ్మని భర్తను పంపింది. వెంకన్న దేవతను తలచుకొంటే ప్రత్యక్షమై అతడు కోరిన వరం కుడా ఇచ్చింది.
                         కానీ అప్పటికీ తృప్తి చెందని వెంకన్న భార్య "ఈ దేశపు రాజు - రాణి మన ఇంట్లో ఊడిగం చెయ్యాలని దేవతను అడిగిరమ్మని మూడోసారి భర్తను దేవత వద్దకు పంపించింది. ఆ మాటలు విన్న దేవత కోపగించి " ఇలాంటి కోరిక కోరినందుకు మీ మేడ మళ్లీ గుడిసె అవుతుంది. నౌకర్లు,నగలు, చీరలు మాయమౌతాయి అన్నది.దేవత అన్నట్లే జరిగింది.
                               నీతి:- అత్యాశ పనికిరాదు.  
                 

శుభోదయం చీమనుంచి క్రమశిక్షణ భూమినుంచి ఓర్పు చెట్టునుంచి ఎదుగుదల మనచుట్టూ వున్నవారినుంచి సుగుణాలు మనం నేర్చుకోవాలేగాని...జీవితం.. ప్రతిక్షణం ఎన్నో అవకాశాలను కల్పించిది!!! మణిసాయి - విస్సా ఫౌండేషన్.


Wednesday, January 21, 2015

కూరగాయలతో కథ!!!!

కూరగాయలతో కథ 
    ఉల్లిపాయంత ఊరిలో ఆనపకాయంత అచ్చమ్మ ఉంది. ఆ అచ్చమ్మకు  క్యాబేజి అంత కూతురుంది.ఆ కూతురికి ఒక రోజున వంకయంత వజ్రం దొరికింది. దానిని బీరకాయంత  బీరువాలో పెట్టి, తాటికాయంత తాళం వేసిందంట. దానిని దోసకాయంత దొంగవాడు దొంగిలించుకు పోతూవుంటే మునగాకాడ అంత ముసలమ్మా చూసి పొట్లకాయంత పోలీసుకు చెప్పింది.
               ఆ పోలీసు  లవంగామంతా లాటీ  తీసుకొని, బొప్పాయికాయంత బూట్లు వేసుకొని, జీడిగింజంత జీపులో వచ్చి దోసకాయంత దొంగను పట్టుకొని, జామకాయంత జైలులో వేసి, తాటికాయంత తాళం వేసాడట. అంత ఆ దొంగ కాకరయాయంత కన్నం వేసి టమాటాలాంటి  టౌనులో ప్రవేశించాలని చూస్తే...అది గమనించిన ఏలక్కాయలాంటి  ఎస్.ఐ. గారు దోసకాయంత దొంగను పట్టి,  కొట్టి చిక్కుడుకాయంత చీకటి కొట్లో పడవేసాడట!!!!  

Tuesday, January 20, 2015

మాఘమాస విశిష్టత!!!

 మాఘమాస విశిష్టత!!!
ఈ మాసం అంతా తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం. ఆ తరువాత సూర్య భగవానుడికి పూజ విశేషం.
మాఘస్నానం చేసేటప్పుడు చదవవలసిన శ్లోకం!!!
" దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం "
అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ, నదులలోగాని, చెరువులలో గాని ,బావులవద్దగాని, స్నానం చెయ్యడం విశేషం.
పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే ,కనీసం ఇంట్లో స్నానం చేస్తునప్పుడు, గంగ,గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను.
స్నానాంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది.
ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించవలెను.
ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి. అసలు మాఘ మాసం లో ప్రతి వారు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి.
కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో స్తుతించడం వల్ల, అన్ని అనారోగ్యాలు నశించి, ఆయురారోగ్యాలను కలుగ చేస్తాడు సూర్య భగవానుడు. ఇది శాస్త్ర వచనం.
ఈ మాసంలోని శుక్లపక్ష తదియనాడు బెల్లము,పప్పులను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం చాలా మంచిది.
రథసప్తమి రోజున మరియు ప్రతి ఆదివారము ఆవుపాలు,బియ్యం, బెల్లం తో చేసిన పరవాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి.
ఈ మాసంలో వచ్చే పండుగలు!!
 ఈ మాసంలో రథ సప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి...శ్రీ పంచమి, వరచతుర్డశి , వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ.

Saturday, January 3, 2015

మా తాత గారి సహకవితా ప్రసూనములు.1-10

ఓం నమో శ్రీ వేంకటేశాయ

కవిత్వము పరమేశ్వరుని అనుగ్రహ ఫలము. ఛందో లక్షణములెన్నితెలిసినను ఒక పద్యము ముందుకు సాగాలంటే ఆ శారదా దేవి కృప, పూర్వజన్మ సుకృతం కలిగి వుండాలి. ఆ రెండూ కలిగిన మా తాత గారైన కీ. శే . శ్రీ విస్సా వెంకటరావు గారు. వారి భక్తి రసాత్మక, సహకవితా ప్రసూనములు శ్రీ వెంకటేశ్వర స్వామి మూలంగా తయారైనవి. వారు స్వామిని తలచినపుడు వారిలో కలిగిన సద్భావములను పద్యములతో ఒక హారము గా కూర్చి * శ్రీ వెంకటేశ్వర స్తుతి * మరియు * మల్లమ్మ కధ * అని పుస్తక రూపంలో ప్రచురించినారు. వాటిలో కొన్ని పద్యాలు మన అందరికోసం :-
ఓం వెంకటేశాయ నమహా :శ్లో!! శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే ! త్సర్వ విఘ్నోప శాంతయే !
శ్లో !! సరస్వతి నమస్తుభ్యం! వరదే కామ రూపిణీ
విధ్యారంభం కరిష్యామి ! సిద్దిర్భవతుమేసదా!
పద్మపత్ర విశాలాక్షి ! పద్మ కేశరవర్ణనీ నిత్యం పద్మాలయం దేవి !
సామంపాతు సరస్వతీభగవతీ, భారతీ నిశ్శేష జాడ్యాపహా :
1
వ పద్యం
శ్రీ పురుషోత్తమా , సుగుణ శేఖర, సుందరరూప, మాధవా !
పాపవిదూర, భక్త జన భాంధవ, ఆశ్రిత పారిజాత మా
తాపసవందితా, నిఖిల దానవమర్ధన, లోకపావనా
శ్రీ పరమాత్మ నిన్ పొగడ, సేవకుడెంతట వెంకటేశ్వరా !

2) ఆపద మొక్కులాడనుచు, అచ్యుతుడంచు, ననంతడనుచునిన్
శ్రీపతి, శంకచక్రధరు, శేష గిరీశ , నివాసుడంచుని న్నాపయి, 
శ్రీనివాసుడని, యంబుజనాభుడు  శేషతల్పుడన్
బాపురే  ఎన్నో నామముల భక్తులుకొల్తురు వేంకటేశ్వరా!
3) తాపసి, అబృగోత్తముడు, తన్నగ, నీదగు వక్షమందునన్
సైపుచు నీవు నాయతికి, చల్లగపాదములొత్త లక్ష్మియున్
సైపక, నల్గి , నిన్విడచి , చయ్యనచేరె ధరాతలంబుకున్
తోపగలేక, భారమును తోడనెచేరితి వీపు దాత్రికిన్.
4) ఆకసరాజు పుత్రికను, అల్లన పెండిలియాడి, పద్మతో
ప్రాకట  వైభవంబొసగ, భక్తుల పాలిటి తోడునీడవై
సాకుచునుంటివీవు, మము చల్లగ తిర్పతి తిర్మలేశ్వరా
నీకెనసాటి దైవమిల నెవ్వరు మాకిక వెంకటేశ్వరా!! 
5) కలియుగమందు, మానవులు కల్మషచిత్తులు,నీచకర్ములున్
తెలియగలేరు దైవమును, తెల్వినిగోల్పడి యంచునీవిటుల్
శిలవయి, వెల్గినావు, మము, సిగ్గిలజేయగ, వేంకటాద్రిపై
అలుకనువీడి మాకునిక నండగనిల్చి శుభంభులీయవే!
6) పెండిలికోసమై, యలకుభేరుని,యొద్దనుచేసినట్టి యా 
మెండగు అప్పు భారమును మోయగజాలక, వడ్డి తీర్పగన్
దండిగ వడ్డికాసులను, ధర్మమ, భక్తులనుండిచండ, నీ
యండనె లక్ష్మియున్న యటులప్పుల భారము తప్పునే ప్రభూ!
7) జ్యోతిగనిల్చి లోకముకు, చూపవె  వెల్గును జ్ఞానదాయివై
ద్యోతక మౌనునీమహిమ, దుష్ట జనాళికి , భక్తకోటికిన్
ఖ్యాతిని గాంచెడిన్, భరతఖండమ ఖండతపో ధరిత్రిగా
జాతి, కహింసయున్ గరిపి, శాంతిన గూర్చెడి విశ్వదాత్రిగా!
8) సారవిహీనమైన భవసాగర మీదుట దుస్తరంబు, యే 
తీరుగ,జూతువోదయను, దీనపయోనిధి, వేంకటేశ్వరా!
దారినిజూపుమయ్యనను దాసునిగాగొని, కావుమయ్య, నా
భారము నీదెసుమ్మీ, ననుపాలనుముంచేదో, నీట ముంచేదో!
9) ఆపదలొందువేళ, నినునార్తశరణ్యడవంచు, నాపదల్
బాపెడిదైవమంచు కడుభక్తిగ శక్తి కొలంది మ్రొక్కుచున్
దాపుకువచ్చి వేడుకను దర్శన  భాగ్యమునొంది నీకడన్
ఆపద ముడ్పులన్నిటిని, యర్పణజేతురు నీకునమ్రులై!  
10) ఆకలిదప్పులన్ మరచి, యాస్తికులెందరో, యాత్మశాంతికై
ప్రాకుదు, దొర్లుచున్ శ్రమకు బాల్పడి  కొండలనెక్కి వచ్చి నీ
వాకిట జేరినిల్చెదరు, వాపిరి గొంచును ధర్మనార్ధమై
సాకెదవందరిన్, దయను, సంతసమొప్పగ వెంకటేశ్వరా!


Total Pageviews