కూరగాయలతో కథ
ఉల్లిపాయంత ఊరిలో ఆనపకాయంత అచ్చమ్మ ఉంది. ఆ అచ్చమ్మకు క్యాబేజి అంత కూతురుంది.ఆ కూతురికి ఒక రోజున వంకయంత వజ్రం దొరికింది. దానిని బీరకాయంత బీరువాలో పెట్టి, తాటికాయంత తాళం వేసిందంట. దానిని దోసకాయంత దొంగవాడు దొంగిలించుకు పోతూవుంటే మునగాకాడ అంత ముసలమ్మా చూసి పొట్లకాయంత పోలీసుకు చెప్పింది.
ఆ పోలీసు లవంగామంతా లాటీ తీసుకొని, బొప్పాయికాయంత బూట్లు వేసుకొని, జీడిగింజంత జీపులో వచ్చి దోసకాయంత దొంగను పట్టుకొని, జామకాయంత జైలులో వేసి, తాటికాయంత తాళం వేసాడట. అంత ఆ దొంగ కాకరయాయంత కన్నం వేసి టమాటాలాంటి టౌనులో ప్రవేశించాలని చూస్తే...అది గమనించిన ఏలక్కాయలాంటి ఎస్.ఐ. గారు దోసకాయంత దొంగను పట్టి, కొట్టి చిక్కుడుకాయంత చీకటి కొట్లో పడవేసాడట!!!!
No comments:
Post a Comment