ఓం నమో శ్రీ వేంకటేశాయ
మా తాత గారైన కీ. శే . శ్రీ విస్సా వెంకటరావు గారు. వారి భక్తి రసాత్మక, సహకవితా ప్రసూనములు...మిగతా వాటిని ఈ దిగువ లంకె నొక్కి చదవండి! తరించండి!!
ఓం వెంకటేశాయ నమహా :శ్లో!! శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే ! త్సర్వ విఘ్నోప శాంతయే !
శ్లో !! సరస్వతి నమస్తుభ్యం! వరదే కామ రూపిణీ
విధ్యారంభం కరిష్యామి ! సిద్దిర్భవతుమేసదా!
పద్మపత్ర విశాలాక్షి ! పద్మ కేశరవర్ణనీ నిత్యం పద్మాలయం దేవి !
సామంపాతు సరస్వతీభగవతీ, భారతీ నిశ్శేష జాడ్యాపహా :
1వ పద్యం
శ్రీ పురుషోత్తమా , సుగుణ శేఖర, సుందరరూప, మాధవా !
పాపవిదూర, భక్త జన భాంధవ, ఆశ్రిత పారిజాత మా
తాపసవందితా, నిఖిల దానవమర్ధన, లోకపావనా
శ్రీ పరమాత్మ నిన్ పొగడ, సేవకుడెంతట వెంకటేశ్వరా !
2) ఆపద మొక్కులాడనుచు, అచ్యుతుడంచు, ననంతడనుచునిన్
శ్రీపతి, శంకచక్రధరు, శేష గిరీశ , నివాసుడంచుని న్నాపయి,
శ్రీనివాసుడని, యంబుజనాభుడు శేషతల్పుడన్
బాపురే ఎన్నో నామముల భక్తులుకొల్తురు వేంకటేశ్వరా!
3) తాపసి, అబృగోత్తముడు, తన్నగ, నీదగు వక్షమందునన్శ్రీనివాసుడని, యంబుజనాభుడు శేషతల్పుడన్
బాపురే ఎన్నో నామముల భక్తులుకొల్తురు వేంకటేశ్వరా!
సైపుచు నీవు నాయతికి, చల్లగపాదములొత్త లక్ష్మియున్
సైపక, నల్గి , నిన్విడచి , చయ్యనచేరె ధరాతలంబుకున్
తోపగలేక, భారమును తోడనెచేరితి వీపు దాత్రికిన్.
సైపక, నల్గి , నిన్విడచి , చయ్యనచేరె ధరాతలంబుకున్
తోపగలేక, భారమును తోడనెచేరితి వీపు దాత్రికిన్.
4) ఆకసరాజు పుత్రికను, అల్లన పెండిలియాడి, పద్మతో
ప్రాకట వైభవంబొసగ, భక్తుల పాలిటి తోడునీడవై
సాకుచునుంటివీవు, మము చల్లగ తిర్పతి తిర్మలేశ్వరా
నీకెనసాటి దైవమిల నెవ్వరు మాకిక వెంకటేశ్వరా!!
ప్రాకట వైభవంబొసగ, భక్తుల పాలిటి తోడునీడవై
సాకుచునుంటివీవు, మము చల్లగ తిర్పతి తిర్మలేశ్వరా
నీకెనసాటి దైవమిల నెవ్వరు మాకిక వెంకటేశ్వరా!!
5) కలియుగమందు, మానవులు కల్మషచిత్తులు,నీచకర్ములున్
తెలియగలేరు దైవమును, తెల్వినిగోల్పడి యంచునీవిటుల్
శిలవయి, వెల్గినావు, మము, సిగ్గిలజేయగ, వేంకటాద్రిపై
అలుకనువీడి మాకునిక నండగనిల్చి శుభంభులీయవే!
తెలియగలేరు దైవమును, తెల్వినిగోల్పడి యంచునీవిటుల్
శిలవయి, వెల్గినావు, మము, సిగ్గిలజేయగ, వేంకటాద్రిపై
అలుకనువీడి మాకునిక నండగనిల్చి శుభంభులీయవే!
6) పెండిలికోసమై, యలకుభేరుని,యొద్దనుచేసినట్టి యా
మెండగు అప్పు భారమును మోయగజాలక, వడ్డి తీర్పగన్
దండిగ వడ్డికాసులను, ధర్మమ, భక్తులనుండిచండ, నీ
యండనె లక్ష్మియున్న యటులప్పుల భారము తప్పునే ప్రభూ!
మెండగు అప్పు భారమును మోయగజాలక, వడ్డి తీర్పగన్
దండిగ వడ్డికాసులను, ధర్మమ, భక్తులనుండిచండ, నీ
యండనె లక్ష్మియున్న యటులప్పుల భారము తప్పునే ప్రభూ!
7) జ్యోతిగనిల్చి లోకముకు, చూపవె వెల్గును జ్ఞానదాయివై
ద్యోతక మౌనునీమహిమ, దుష్ట జనాళికి , భక్తకోటికిన్ఖ్యాతిని గాంచెడిన్, భరతఖండమ ఖండతపో ధరిత్రిగా
జాతి, కహింసయున్ గరిపి, శాంతిన గూర్చెడి విశ్వదాత్రిగా!
8) సారవిహీనమైన భవసాగర మీదుట దుస్తరంబు, యే
తీరుగ,జూతువోదయను, దీనపయోనిధి, వేంకటేశ్వరా!
దారినిజూపుమయ్యనను దాసునిగాగొని, కావుమయ్య, నా
భారము నీదెసుమ్మీ, ననుపాలనుముంచేదో, నీట ముంచేదో!
తీరుగ,జూతువోదయను, దీనపయోనిధి, వేంకటేశ్వరా!
దారినిజూపుమయ్యనను దాసునిగాగొని, కావుమయ్య, నా
భారము నీదెసుమ్మీ, ననుపాలనుముంచేదో, నీట ముంచేదో!
9) ఆపదలొందువేళ, నినునార్తశరణ్యడవంచు, నాపదల్
బాపెడిదైవమంచు కడుభక్తిగ శక్తి కొలంది మ్రొక్కుచున్దాపుకువచ్చి వేడుకను దర్శన భాగ్యమునొంది నీకడన్
ఆపద ముడ్పులన్నిటిని, యర్పణజేతురు నీకునమ్రులై!
10) ఆకలిదప్పులన్ మరచి, యాస్తికులెందరో, యాత్మశాంతికై
ప్రాకుదు, దొర్లుచున్ శ్రమకు బాల్పడి కొండలనెక్కి వచ్చి నీవాకిట జేరినిల్చెదరు, వాపిరి గొంచును ధర్మనార్ధమై
సాకెదవందరిన్, దయను, సంతసమొప్పగ వెంకటేశ్వరా!
No comments:
Post a Comment