తోటకూర నాడే...
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పేదరాలు వుండేది. ఆమెకు ఒక్కడే కొడుకు. ఒక రోజు వాడు ఒకరితోటలో పెరిగిన తోటకూర మొక్కల్ని దొంగతనంగా పెళ్లగించుకొని వచ్చి తల్లికి ఇచ్చాడు. తల్లి కూరకు పనికివస్తుంది కదా అనుకొని సంతోషించింది. కానీ ఈ మొక్కలు ఎక్కడివి? ఎవరైనా దయతో ఇచ్చారా? లేక దొంగతనంగా తెచ్చావా అని కొడుకుని ప్రశ్నించలేదు.
అప్పటి నుంచి వాడు దొంగతనాలకు అలవాటు పడ్డాడు.దురలవాట్లకు లోనయ్యాడు. క్రమంగా పెద్ద దొంగగా మరి దొంగతనాలు, దోపిడీలు చేసేవాడు. ఆ గొడవల్లో అనేకసార్లు దెబ్బలు తినేవాడు. ఆ దొంగతనాలు, దోపిడీలు చేసే సందర్భాలలో ఎదురు తిరిగిన కొందరిని చంపాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు నేరాలు రుజువైనాయి న్యాయమూర్తి అతనికి ఉరి శిక్ష విధించాడు.
ఉరి తీసేముందు " నీ కడసారి కోర్కె కోరుకోమని " తలరి చెప్పాడు "మా అమ్మతో ఒక్కసారి మాట్లాడనివ్వండి" అన్నాడు. కొడుకు ఏం చేబుతాడోనని తల్లి ఏడుస్తూ వచ్చింది. నీకు ఒక రహస్యం చెబుతా చెవిలో అన్నాడు. ఏమి రహస్యం చేబుతాడోనని ముందుకు వంగింది.అంటే కసుక్కున ఆమె చెవి కోరికేసాడు.ఆమె అమ్మో అని ఏడుస్తుండగా....నేను తోటకూర తెచ్చిననాడే నాకు బుద్ధి చెప్పివుంటే నాకు ఈరోజు ఈగతి పట్టేది కాదుగా అని భాధగా అంటాడు దొంగ.
No comments:
Post a Comment