Wednesday, January 28, 2015

మా తాత గారైన కీ. శే . శ్రీ విస్సా వేంకటరావు గారు. వారి భక్తి రసాత్మక, సహకవితా ప్రసూనములు:- 11 - 21వ పద్యం

11)వ పద్యం
కొండనుజేర, బస్సులను, కూర్చిరి, భక్తుల మేలుకోసమై
ఎండకు వానకున్ వెరవ కెందరో భక్తులు పాదచరులై
కొండకు వత్తురయ్య, తమ కోర్కెలు, తీరిన కారణంబునన్
వెండియు, నీక్రుపారాసము వేడ్కను చిల్కవె భక్తకోటిపై!
12) కొండల నేడు నెక్కి యటకొల్వునుదీర్చుట కోపమాప్రభూ
గుండెలచేతబట్టుకొని గుప్పిట జీవములుంచి, నీపయిన్
మెండగు భక్తితోజనులు మెల్లగవత్తురు కొండలెక్కి, నీ
వండగనుండ, నేమిభయ, మార్త శరణ్యుడ వేంకటేశ్వరా!
13) బాధలనొందువేళ కడుభాగ్యులు పేదలు నొక్కటేగదా
వేదనజెందుచున్ మదిని వేయివిధంబుల నిన్ను వేడగా 
బాధలబాపి వారలకు భద్రత కూర్చవె  పిల్చినంతలో
సాదరమొప్ప భక్తులను సాకెడు మా యిలవేల్పునీవేగా!!
14) అల్పుడ నర్భకుండ నిను నర్చన జేయగ జాలనిష్టతో
నిల్పితి నీదురూపమును నిర్మలనాహృది పీటమందు నే
సల్పెడ నామమంత్రమును సన్నుతి జేతును నీదు కీర్తనల్ 
కొల్చెద భక్తి పుష్పముల కోమల భావసుమంబులన్ ప్రభూ !!  
15) 18వ పద్యం
పాపులు దుష్టవర్తనులు పాతకులైనను నిన్ను కొల్వగా
కోపంబూనకందరకు కూర్తువు నిశ్చల శాంతిభద్రతల్
బాపురే నీదయారస మపారమనూహ్యము  తెల్పశక్యమే
పాపులనుద్దరించి కడుపావనమూర్తుల జేతువందరిన్.
 20వ పద్యం.
పంకజనాభ నిన్ను మది భావనచేసి నుతింతు నెప్డు నా
వంకకు జూడవేల విధివర్తనమో మరి భక్తిలోపమో
వంకరులున్న చెర్కుగడ వాటముగా రుచినంద జేయదా
శంకనుమాని నీ చరణసన్నిధి నిల్వ శరణ్య మీయవే !! 
21వ పద్యం.
ఆపదలందు మున్గితేలియాడెడు భక్తులకున్ పరీక్ష యో
కోపము నిన్నారతముకొల్చి  భజించుట యేమి మాయయో
తోపదు మామనంబులకు తొల్గవు భాదలవొక్క నాటికిన్
మాపయి చూపవే కరుణ మాన్పవె మా పరితాపభారమున్!!  

No comments:

Post a Comment

Total Pageviews