21)ఆపదలందు మున్గితేలియాడెడు భక్తులకున్ పరీక్ష యో
కోపము నిన్నారతముకొల్చి భజించుట యేమి మాయయో
తోపదు మామనంబులకు తొల్గవు భాదలవొక్క నాటికిన్
మాపయి చూపవే కరుణ మాన్పవె మా పరితాపభారమున్!!
22) కర్మలచేత కల్గునని కష్టము సౌఖ్యము పాపపుణ్యముల్
మర్మమెరింగియున్ నరులు మానకచేతురు ఘోరపాపముల్
దుర్గతులైయఘంబులను దుష్టపు కర్మలచేయనేల స
త్కర్మలపూని జీవితమూ ధన్యత గాంచక వేంకటేశ్వరా!!
23) మున్ను గజెంద్రుడా మొసలి ముష్కర చర్యకు పాల్పడంగ మా
పన్న శరణ్య దీనజన బాంధవ కేశవ కావుమంచునిన్
సన్నుతిజేయగా కరిని చయ్యన కావగ లేద చక్రివై
సన్నుతమూర్తి మోక్షమిడి సత్కృపతోడుత వేంకటేశ్వరా!!
24) పాపులు నీతిబాహ్యులకు భాగ్యముభోగములబ్బుటేలనో
నీపయి భారముంచి కడునిష్టగ నిన్విడనాడకుండగా
నీపద సన్నిధిన్ నిలిచి నిన్ భజియించెడి వారికేలనో
చూపవుయెట్టి యోగ్యతలు చోద్యముకాక మరేమిసత్ప్రభూ!!
25) జూదరి లంచగొండులును చోరులు జారులు తాగుబోతులు
తాతల నాటినుండి నినుదల్పగ మాయిలవేల్పు తండ్రిగా
మాతగ మమ్మునేలు మహిమాన్విత దాయక కల్పకంబుగా
చేతుము పూజలన్ వ్రతముచేతుము నిత్యమఖండ పూజలన్
నేతగనిల్చి మాకిడవే నిత్య శుభంబుల నీప్సితంబులన్.
28) సర్పమునోట జిక్కి తనచావు నెరుంగనికప్ప తానటన్
దర్పముతోడ ఋర్వులను దండి భుజించెడి మాడ్కి కాలమున్
సర్పము నోట జిక్కియును సంపద సౌఖ్యము కేలపుత్తురో
తిర్పతివాస నిన్గొలిచి త్రుప్తిపొందక వేంకటేశ్వరా!!!
29) కోరగలేదు భూములను కోరను భూరియశస్సు భోగముల్
30) ధర్మము గానమెందు కలిదారుణ మారణ దుష్టశక్తులే
మర్మమెరుంగ నేరని యమాయక జీవుల హింసపెట్టెడిన్
కంటికగోచరంబగుచు కామిని కాంచనదూత విర్వురన్
గెంటితినీవు మాకడకు గెలవగా వాటి నిముక్తికోసమై!!
32) కాయము పాంచబౌతికము కర్మలు చేయగ నుద్భవించె నా
కాయములో సమర్చితివి కాననిదొంగల నార్వురన్ సదా
మాయకులో పడంగని మమ్ములన్నేడ్చును బాహ్యదృష్టికే
మాయనుగెల్వగాతరమె మాకును నీకృపలేక యుండియున్!!
33) అంగటనన్నియున్న మరియల్లునినోట శనన్నసామెతన్
అంగట వస్తువుల్ ధరలు ఆకశమంటె సధర్మపాలనన్
బంగరుపండుదేశమున పాపముపండుచునుండెనేడు మా
ముంగట విస్తరుంచి తిన మూతికి బీగమువేయధర్మమే!!

న్మాదులరీతి నిత్యము నమానుష చర్యలు సల్పుచుండగా
కాదనువారులేరు సరికట్టడిసేయగ నీ ఒకండవే
నీదయలేనిచో నిలువనీడయే లేదిక భక్తకోటికిన్.
26వ పద్యం.నీదయలేనిచో నిలువనీడయే లేదిక భక్తకోటికిన్.
తాతల నాటినుండి నినుదల్పగ మాయిలవేల్పు తండ్రిగా
మాతగ మమ్మునేలు మహిమాన్విత దాయక కల్పకంబుగా
చేతుము పూజలన్ వ్రతముచేతుము నిత్యమఖండ పూజలన్
నేతగనిల్చి మాకిడవే నిత్య శుభంబుల నీప్సితంబులన్.
28) సర్పమునోట జిక్కి తనచావు నెరుంగనికప్ప తానటన్
దర్పముతోడ ఋర్వులను దండి భుజించెడి మాడ్కి కాలమున్
సర్పము నోట జిక్కియును సంపద సౌఖ్యము కేలపుత్తురో
తిర్పతివాస నిన్గొలిచి త్రుప్తిపొందక వేంకటేశ్వరా!!!
29) కోరగలేదు భూములను కోరను భూరియశస్సు భోగముల్
కోరలేదు సౌఖ్యమును కోరను భౌతికతుచ్ఛసంపదల్
తేరగనిత్తువంచు నిను తెల్సియు కోరనవేవియున్ ప్రభూ
కూరిమి ని కృపామ్రుతము కూర్చినచాలు భవాబ్ది దాటగన్!
30) ధర్మము గానమెందు కలిదారుణ మారణ దుష్టశక్తులే
మర్మమెరుంగ నేరని యమాయక జీవుల హింసపెట్టెడిన్
నిర్మలచిత్తులన్ పరమనీచులకు న్నెరగాక యుండగా
ధర్మమునుద్ధరించి మము ధన్యులజేయవే వేంకటేశ్వరా!
31) కంటికి యింపుగా జగతికల్పనజేసి ముదంబుమీరగా
నంటియునంటనట్లుగను ఆవలలోపల నుంటివంటతన్కంటికగోచరంబగుచు కామిని కాంచనదూత విర్వురన్
గెంటితినీవు మాకడకు గెలవగా వాటి నిముక్తికోసమై!!
32) కాయము పాంచబౌతికము కర్మలు చేయగ నుద్భవించె నా
కాయములో సమర్చితివి కాననిదొంగల నార్వురన్ సదా
మాయకులో పడంగని మమ్ములన్నేడ్చును బాహ్యదృష్టికే
మాయనుగెల్వగాతరమె మాకును నీకృపలేక యుండియున్!!
33) అంగటనన్నియున్న మరియల్లునినోట శనన్నసామెతన్
అంగట వస్తువుల్ ధరలు ఆకశమంటె సధర్మపాలనన్
బంగరుపండుదేశమున పాపముపండుచునుండెనేడు మా
ముంగట విస్తరుంచి తిన మూతికి బీగమువేయధర్మమే!!
34) ఇంటను బైట తస్కరులు నీగతిమమ్ముల దోచుచుండగా కంటికినిద్రదోచకను కాయలు కాచెను శాంతికోసమై
కంటిని ముక్కును మూసుకొని కాంచనియట్టుల మౌనమూనక
తుంటరిమూకలన్ దునిమి తోడుగా నీడగ నిల్వుమో ప్రభూ!!
35) సంపదలున్నచో కలుగుసంకటముల్ పలు రోగభాధలన్
పెంపును జేయు పాపముల పెంచును దుఃఖము కష్టనష్టముల్
సంపదలెన్నియున్న యవి శాంతినిగూర్పగజాల వెన్నడున్
సంపదకోసమై నెరపుసంధ్యలు పూజలు నిష్ఫలంబులే !
36) పుట్టుచుచచ్చుచున్ మరల పుట్టుచు గిట్టుట కంటె మానవుల్
పుట్టుకలేకపోవుటది పుణ్యము మోక్షము కావునన్ ప్రభూ
పుట్టినదాది కష్టములపోరును బాధల నొందకుండ ఏ
పుట్టుకలేని భాగ్యమును పొందుగా గూర్చుము వేంకటేశ్వరా!
37) ప్రభువులు పండితుల్ పరమభాగావతో త్తములైనగాని తా
విభవముతోడ సంపదల వేడుకమీర సుఖింత్రుగాక నీ
యభయముకోరుకున్న నవియన్నియు కల్లలు కల్పితంబులే
శుభములు నీపదార్చవలె సూరిజనావళికి ముక్తి మార్గముల్.
38) భక్తియెలేని పూజలవి పత్రికిచేటనిచెప్పు సామెతన్
భక్తులు కామ్యసిద్ధికయి ప్రార్ధనపూజలు సల్పుచుందు రా
యుక్తిని నీవెరింగి పరమోన్నతిగూర్తువు వాంచితంబులన్
ముక్తిని గోరకుండుతది మూర్ఖతకయేయగు వేంకటేశ్వరా!!
39) నీటను నానినట్టి యొకనిప్పులపెట్టెను యగ్గిపుల్లతో
ధాటిగా గీసినన్ వెలిగి దర్శనమీయదు నిప్పురవ్వయున్
కోటులజన్మలెత్తి తగ కూడగబెట్టిన దుష్టకర్మల
న్నీటనుమున్గి భక్తి మెయి నిన్ను తలంచిన మోక్షమబ్బునే !
40) ముక్తియు మోక్షమంచు తగముక్కునుమూసి జపించినంతనే
40) ముక్తియు మోక్షమంచు తగముక్కునుమూసి జపించినంతనే
దక్కునే ముక్తి మోక్షములు దక్కునె శాంతియొకింత యేని ఆ
శక్తిని వీడగావలయు సంపద సౌఖ్యములందు యన్నిటన్
ముక్తి యనంగ నర్దమది మోహమువీడుట లోకవాంఛలన్!!!
No comments:
Post a Comment