Monday, April 17, 2017

ఎన్నో పనులు, ఎన్నో కర్తవ్యాలు, ఎన్నో వ్యాపకాల మధ్య మన రోజువారీ జీవితం VADREVU CHINAVEERABHADRUDU

ఎన్నో పనులు, ఎన్నో కర్తవ్యాలు, ఎన్నో వ్యాపకాల మధ్య మన రోజువారీ జీవితం గడుస్తూ ఉండవచ్చుగాక, కాని,మనల్ని సతమతం చేసే ఎన్నో ఆలోచనల మధ్య, ఆలోచనకీ, ఆలోచనకీ మధ్య విరామంలో,మన ప్రమేయం లేకుండానే మన మనసుని ఏదో ఒక తలపు ఆక్రమిస్తూ ఉంటుంది. ఏదో ఒక స్నేహమో, ఒక దృశ్యమో, ఒక హృదయమో మనని లోబరుచుకుంటూ ఉంటాయి.అట్లా మనని ఏ తలపు లోబరుచుకుంటుందో దానికే మన హృదయం నిజంగా అంకితమయినట్టు.
నా మటుకు నాకు మా ఊరూ, ఆ కొండలూ, ఆ అడవీ, ఆ నీడలూ, కొండలమీంచి ఉదయించే ప్రభాతాలూ, ఆ ఇళ్ళమీంచి పరుచుకునే సాయంకాలపు ఎండా-ఈ దృశ్యాలే నా అంతరంగ గర్భాలయంలో ప్రతిష్టితమయిపోయాయి. మధ్యలో కొన్నాళ్ళపాటో, కొన్నేళ్ళపాటో కొన్ని స్నేహాలో, కొన్ని కలలో,కొన్ని వైఫల్యాలో నా అంతరంగాన్ని మసకబరిచి ఉండవచ్చుగాక,కొన్ని ప్రేమలో, కొన్ని శరాఘాతాలో పొగలాగా కమ్ముకుని ఉండవచ్చుగాక,కాని, మళ్ళా నెమ్మదిగా, ఆ వెన్నెలరాత్రులో,ఆ వర్షాకాలాలో నా తలపుల్లో కుదురుకోగానే నాకేదో గొప్ప స్వస్థత చేకూరినట్టుగానూ, నేను మళ్ళా మనిషినయినట్టుగానూ అనిపిస్తుంది.
మరీ ముఖ్యంగా మాఘఫాల్గుణాల్లో మొదలై, ఈ తొలివసంతవేళలదాకా నా మనసంతా ఆ అడవిదారుల్లోనే సంచరిస్తూ ఉంటుంది. ఆ నల్లజీడిచెట్లు, ఆ తపసిచెట్లు,ఆకులన్నీ రాలిపోయిన బూడిదరంగు అడవిలో అన్నిటికన్నా ముందు చిత్రకారుడి లేతాకుపచ్చరంగు చిలకరించినట్టు చిగురించే నెమలిచెట్లు, ఆ కొండదారుల్లోనే నేను తిరుగుతూ ఉంటాను. ఇక ఇప్పుడు ఆ కొండవార,అ అడవిపల్లెలో, లేతపసుపు వెలుతురు ధారాపాతంగా కురుస్తున్నట్టు ఉంటుంది. ఆ వెలుగుని ఒక కవితగా పిండి వడగట్టాలని నాలోనేనే ఎన్నో వాక్యాలు దారంలాగా పేనుకుంటూ ఉంటాను. కాని స్వరకల్పనకు ట్యూన్ దొరకని సంగీతకారుడిలాగా ఒకటే కొట్టుమిట్టాడుతుంటాను.
సరిగ్గా అట్లాంటి వేళల్లోనే ప్రాచీన చైనా కవులవైపూ, ప్రాచీన చీనాచిత్రలేఖనాల వైపూ చూస్తూంటాను. ఆకాశాన్నీ, భూమినీ పట్టుదారాలతో కలిపికుట్టడమెట్లానో వాళ్ళకే తెలుసు. ఆ కవితల్లో వాళ్ళీ లోకాన్నే చిత్రించారుగానీ, వాటిని చదువుతుంటే, అలౌకికమయిన స్ఫూర్తి ఒకటి మనల్ని ఆవహిస్తూ ఉంటుంది. ఆ బొమ్మల్లో,ఆ నల్లటి గీతల్లో వాళ్ళు కొండలు, అడవులు, నదులు, పడవలు, ఒంటరి బాటసారులు, కలయికలు, వియోగాలు అన్నిట్నీ చిత్రించిపెట్టారు.
ఆ బొమ్మల్నట్లా తదేకంగా చూస్తూంటాను. చిన్నపిల్లలు, ఇంకా చదవడం రానివాళ్ళు, బొమ్మల పుస్తకాలు చూస్తారే అట్లా. ఆ బొమ్మల్ని చూస్తూ ఆ అక్షరాల్లో ఏముందో ఊహిస్తూంటారే అట్లా. ఆ చైనా కవితల్ని బట్టి వాళ్ళ బొమ్మల్నీ, ఆ బొమ్మల్ని బట్టి ఆ కవితల్నీ పోల్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఉదాహరణకి,
చిత్రకారుడూ, కవీ కూడా అయిన వాంగ్ వీ రాసిన ఏ నాలుగు వాక్యాలు చదివినా మనసంతా ఖాళీ అయిపోతుంది. ఆ విస్తారమైన మనోక్షేత్రం మీద సూర్యరశ్మినో, చంద్రకాంతినో వర్షించడం మొదలుపెడుతుంది. ఈ కవిత చూడండి:
నిర్జనపర్వతశ్రేణి,
కనుచూపు మేర ఎవరూ లేరు
ప్రతిధ్వనులుమటుకే వినబడుతున్నవి
అడవిలోతట్టున నీల-హరితశాద్వలం పైన
మెత్తటి లోవెలుగు.
ఈ నిశ్శబ్దం ఒక విమానంలాంటిది. దీన్లో అడుగుపెట్టి నేనా ప్రాచీన శైలశ్రేణిమీంచి,ఆ విస్మృతకాననాలగుండా కొన్ని క్షణాల్లోనే ఎన్నో భ్రమణాలు పూర్తిచేస్తూ ఉంటాను.
అక్కడొక కొండ మీద ఒక పూరిల్లు ఉంటుంది, ఆ వాలులోంచి ఆ కొండమీదకి సన్నని కాలిబాట ఉంటుంది. ఆ బాట పక్క మాఘమాసంలో మంకెనలూ, వైశాఖమాసంలో తురాయిలూ పూస్తూ ఉంటాయి. రాత్రి ఒక వసంత వాన రహస్యంగా కురిసి ఉంటుంది. తెల్లవారగానే తడిసిన ఆ బాట మీద పూలు రాలి ఉంటాయి. ఆ కొండమీద కుటీరంలో నాకోసం ఒక అతిథి వచ్చి ఉంటాడనీ, కాని ఆ అథితి ఇంకా నిద్రలేచి ఉండడనీ అనిపిస్తూంటుంది. ఈ మనోజ్ఞచిత్రాన్ని నా మనసులో పచ్చబొట్టు పొడిచింది వాంగ్ వీ రాసిన ఈ కవితనే కదా:
ఎర్రటి మంకెన పూత మీదరాత్రికురిసిన వాన
వసంతవనాలలేతాకుపచ్చమీద తొలగని పొగమంచు
రాలిన పూలనింకా ఎవరూ తుడిచిపెట్టలేదు
పక్షుల కిలకిల, కొండమీద అతిథి ఇంకా నిద్రలేవలేదు.
నాలో రెండు పొరలున్నాయనిపిస్తుంది. లోపల ఒక ప్రవాహం, దాని మీద మరొక ప్రవాహం. సంఘానికీ, రాజ్యానికీ, ధర్మానికీ సంబంధించినదంతా ఆ పై పై ఉరవడి మాత్రమే. ఆ విషయాలు ఎవరు మాట్లాడినా, నేను మాట్లాడినా అదంతా ఎందుకో నాలోపల్లోపలకి ఇంకదు. వరదనీళ్ళలాగా అది ఎంత ఉధృతంగా ప్రవహించినా, కళ్ళముందే కొట్టుకుపోతుంది. కాని ఆ లోపలి ప్రవాహం, అది యుగాల కాలమానం ప్రకారం అత్యంత మందంగా, అత్యంత గోప్యంగా ప్రవహిస్తూంటుంది. ఆ ప్రవాహం ఒడ్డునో లేదా, ఆ ప్రవాహమధ్యంలోనో ఏ నావ మీదనో పూర్వకవులు కనిపిస్తూంటారు. బహుశా నా అసలైన జీవితానుభవం అది. ఒక కాలానికో, ఒక దేశానికో, ఒక భాషకో పరిమితమయింది కాదది. అందుకనే 1200 వందల ఏళ్ళ కిందటి ప్రాచీన చైనా కవి లి-బాయి రాసిన ఈ కవిత చదివితే, నా సమకాలికులందరికన్న ఎంతో సన్నిహితుణ్ణి కలుసుకున్నట్టు ఉంటుంది:
నువ్వెందుకింకా ఆ పచ్చటికొండలకే
అంటిపెట్టుకున్నావని
అడుగుతారు వాళ్ళు.
నేను చిరునవ్వి ఊరుకుంటాను.
నా మనసు తేలికపడుతుంది.
అడవి సంపెంగలు
ఏటిబాటన కిందకు ప్రవహిస్తూంటాయి
వాటి జాడ కూడా మిగలదు.
మనకి కనిపిస్తున్నవాటికన్నా ఆవల
మరెన్నో భూములున్నాయి,
మరెన్నో ఆకాశాలున్నాయి.
నా కంటిముందు కనిపిస్తున్నదొక్కటే ఆకాశం కాదనేదే నాకు గొప్ప ఊరట. ఇక్కడ నగరంలో నేనుంటున్న వీథిలో రాలుతున్న పసుపు పూలని చూడగానే నేను తిరిగిన పూర్వపుదారులన్నీ నా తలపుల్లో ప్రత్యక్షమవుతాయి. హృదయాన్ని గాయపరచడానికి ఒక పూలరేకు చాలు. ఇక రాలుతున్న అన్ని పూలరేకల్ని చూస్తే చెప్పేదేముంది?
దు-ఫు ఇలా అన్నాడని విక్రమ సేథ్ గుర్తుచేస్తున్నాడు:
The pain of death's farewells grows dim.
The pain of life's farewells stays new
అలాగని ఒక అతిథి కోసం చూడకుండా ఉండలేను. ఎవరో ఒక కొత్తస్నేహితుడో, స్నేహితురాలో ఆ బాటమ్మట, చివరి మలుపు తిరిగి, ఏ తెల్లవారు జామునో మొదటి ఆటో పట్టుకుని నా ఇంటికొస్తున్నారన్నట్టే ఎప్పుడూ ఒక ఊహ. జీవితమంతా ప్రవాసిగానే గడిపిన దు-ఫు మటుకే ఇట్లాంటి కవిత రాయగలడు:
నా ఇంటిచుట్టూ వసంతకాలపు సెలయేరు
రోజూ కొంగలు మటుకే వచ్చిపోతుంటాయి
రాలిన ఆ పూలనింకా ఎవరూ తుడిచిపెట్టలేదు
అతిథుల్లేరు.తలుపు తెరిచే ఉంది.
ఈ దారిన అడుగుపెట్టిన మొదటిమనిషివి నువ్వే.
నువ్వు వెళ్ళవెలసిన వూరింకా దూరం.
నా ఆతిథ్యమేమంత గొప్పదికాదు,
పేదవాణ్ణి,ఉన్నది కొద్ది పానీయం .
చూడు,నీకిష్టమయితే ఆ పాతకాలపు
పెద్దమనిషి, నా పొరుగింటాయన్ని పిలుస్తాను
ఒక్క గుక్క కలిసి తాగుదాం.
తన కవిత్వమంతా పేదవాళ్ళ గురించీ, కఠోరవాస్తవాల గురించీ మాత్రమే రాస్తూ వచ్చిన బై-జుయికి కూడా వసంతకాలమంటే తన ఊరే గుర్తొస్తుంది. అతడి కవిత:
చియాంగ్ నాన్ లో నా పాతగ్రామంలో
నది ఒడ్డున నేనో మొక్క నాటాను.
రెండేళ్ళయింది
ఇంటికి దూరమై ఎక్కడెక్కడో
తిరుగుతున్నాను
అయినా ఆ నది ఒడ్డున ఆ పచ్చదనం
కల్లోకొస్తూనే ఉంటుంది
చియాంగ్ నాన్ లో నది ఒడ్డున
ఆ చెట్టుకింద ఇప్పుడెవరు చేరిఉంటారా
అని తలపు తొలుస్తూనే ఉంటుంది.
రోజువారీ జీవితం సణుగుతూనే ఉంటుంది. నగరం రణగొణధ్వని ఆగదు. క్రీస్తు చెప్పినట్టు సీజర్ వి సీజర్ కీ, దేవుడివి దేవుడికీ విడివిడిగా చెల్లించడమెట్లానో, ఆ విద్య ఇప్పటికి పూర్తిగా పట్టుబడింది.
లోకంలో నెరవేర్చవలసిన బాధ్యతలు నెరవేరుస్తూనే, ఇప్పుడా ఆ అడవిపల్లెలో ఆ చిగురించిన చింతతోపులో ఆ కొండసంపెంగ చెట్టుదగ్గర ఎవరు జమకూడేరా అని నా తలపుల్లో తొంగిచూస్తుంటాను.
LikeShow More Reactions
Comment
88 comments
Comments
Chaya Pradeepa Pv ప్రకృతి లోని ప్రతి అంశంపట్ల మీదైన రీతిలోచూస్తూ..స్పృశిస్తూ...స్పందిస్తూ...వాటికీ అందమైనమాటలతో రూపమిచ్చి మమ్మల్ని ఆలోకంలోకి తొంగిచూసేలా చేస్తారు.యాంత్రిక జీవితానికి కాసేపు విరామం...మనసుకు దొరికే ఒకింత విశ్రాంతి సర్! ధన్యవాదాలు💐💐💐💐
LikeReply130 March at 21:28
Mallesham Muppa అద్భుతమైన పోస్ట్ సర్.ధన్యవాదాలు.
LikeReply130 March at 21:38
Satyanarayana Dyavanapalli Idi vasanthamaa sir...
LikeReply130 March at 21:53
Bsmkumar Surya Nishabda spardha manalni gayam chesinapudu ..Pata tagilinchukonna calender prefix dairy lo chinnanadu naku tanichina kanti muchhata cheerala Madatha kinda eppudu dorukutundi . Na eduruga kurchunna o business man tella juttu lonunchi eppatido ma tataia...See more
LikeReply130 March at 21:53
Venkata Krishnamoorthy Pulipaka ధన్యవాదాలు మీ ప్రకృతి సౌందర్య పిపాసకు.
Madugula Narayanamurthy యేల పూత తోక రేలా రేల
LikeReply130 March at 21:57
Usha Rani Akella అద్భుతంగా ఉందండీ.. 👌👌🙏🙏
LikeReply130 March at 22:08
Kommi Pyaraiah I followingsir
LikeReply130 March at 22:33
Satyanarayana Thamma Excellent Sir
LikeReply130 March at 23:12
Sasi Thanneeru మనలో రెండు పొరలు నిజం. పై ది చుట్టు వాళ్లకి , లోన ఉండే పసితనం మనం ,విశ్వ ప్రేమే దాని నైజం . బాగా వ్రాసారు
LikeReply130 March at 23:36
Krishnamurthy Punna మెత్తని వెలుతురు రంగులు 😊
Ghv Prasad Sir, Mee rachanalu fb chadivina taruvata nenu vaatini print teesikoni file chestunna. Endukante fb lo chadivina daani Kanna print lo chadivite aa kicke veru kadaa?
LikeReply131 March at 01:34
Nanda Kishore As soon as I finish to read you, I always end up in spring.
LikeReply331 March at 01:47
Mallikarjuna Adusumalli లలిత మనోహరమైనమీ చిత్రాలతోపాటు , విశ్వ సాహిత్యాన్ని అందిస్తున్నారు.అభివందనాలు.
LikeReply131 March at 02:14
Kantharao Siramsetty మనిషికి రెండు రకాల నయనాలుంటాయి. అవి (1) భౌతిక వస్తుసంచయాన్ని,సమస్త ప్రకృతిని చూడగల సహజనేత్రాలు. ఇక (2) ఉపనయనాలు అంటే మనకంటికి కనిపించే నయనాలు కాకుండా మానసికమైన అంతర్నయనాలు. భౌతిక నయనాలకంటే ఈ ఉపనయనాలు ఎంతో శక్తివంతమైనవి. ఇవి చూడడానికి కంటికి కన్పించవు...See more
Sasikala Volety మీ అనుభూతులతో ప్రయాణం చేయించారు. ఇన్నాళ్ళు నా కళ్ళు యధాలాపంగా చూసిన ఋుతువులు, కాలాలు, మాసాలు, కొండా, కోన, కానలాలు, కాసారాలు, చెట్టు కొత్తగా కనిపిస్తన్నాయి. మీ ప్రాచీన చీనీ కవులు ఇప్పుడు కొంచెం అర్ధమవుతున్నారు. అంతర్వాహినిని ఒడిసి పట్టే ప్రయత్నమయితే చెయ్యాలనే ఉంది. జీవమోడే అద్భుత కళాఖండాలకు ధన్యవాదాలు.
LikeReply131 March at 02:43
Vakkalanka Vaseera Mammalnee konda daari pattinchAaru
LikeReply131 March at 04:09
Kamaladevi Devi Ranihttps://www.facebook.com/GauthamKashyapShridharKavuri/posts/1155349617944081
Gautham Kashyap
అనంతంగా వున్న అంధకారాన్ని
అంతమొందించడానికి అవిశ్రాంతపోరాటం
చేస్తున్నవాడు, ఈ లోకంలో నాకు తెలిసిన
నిస్వార్ధమైన తొలి కామ్రేడ్ ఆ ఆదిత్యుడే .! - గౌతమ్ కశ్యప్
LikeReply231 March at 05:00
Kamaladevi Devi Rani chinnaveerabhadrudugaru meeru oka rasamaya chitraanni kallamundara 
aavishkarimpa chasaru. manotantrulanu
rasamaya jagattulo munchi',Prakruti
...See more
LikeReply131 March at 05:14
Tulasi Mummidi Sir when I was reading not reading mechanically with heart I was reading at that time I thought about rabindranadh geetanjali.sir I did not read literature but I like it.some words have taken me to inner.basically I am trying to see spirituality in ur poems and in u also.again and again I will read the above.thank u sir for ur great works.thank u
LikeReply131 March at 05:21
Venkat Reddy Ganta కొండలు, అడవులు,నదులేకాదు అరేబియా ఎడారుల్లోఇసుక తుఫాన్లని, ఈదురుగాలిని కూడా ఆస్వాదించగల కవితాహృదయం మీది.
LikeReply431 March at 05:57
Ram Bhaskar Raju E Anubhavam punaadhigaaa jaaluvaarina padavinyasam.... abhinandanalu sir.
LikeReply131 March at 08:34
Kommana Radhakrishna Rao బాల్యంలోకి వెళ్ళి రావడం భగవంతుడి సన్నిధిలో కొన్ని క్షణాలు గడిపినట్లు ఉంటుంది. కాలం గడుస్తున్నకొద్దీ సేకరించిన జ్ఞానం, ఆజ్ఞానం బాల్య స్మృతులకు అన్వయించుకోవడం మనల్ని మనం పరామర్శించుకోవడం గదా.
LikeReply231 March at 08:42
Venkateswar Lu G Okka pulareku chaalu...chaala adbhutamgaa anubhutistaaru..Meeru..Haayigaa undi chadivaaka.. Thanks sir..
LikeReply131 March at 08:44
Sravya Vattikuti Nice read Vadrevu Ch Veerabhadrudu గారూ, and it did remind me, Stephen Owen's translation for an old Chinese poem. (According to his mentions it belongs to Tang dynasty period. I am pretty sure you know very well about Tang Dynasty,, I am just me...See more
LikeReply131 March at 09:09
Ramanjaneyulu Paidipati If i say amazing, wonderful or something like that certainly it's my biggest mistake.As per me these are from your intellectual heart . Immortal.
LikeReply131 March at 09:57
Palamaner Balaji nice sir namaste
LikeReply131 March at 10:22
Vishwanatham Kamtala సాహితీమూర్తికి వందనాలు. 
ఎక్కడ మొదలు పెట్టాలొ ఎలా మొదలిడాలో తెలియక చాలా సమయంతీసుకొన్నాను.మీ గర్భాలయం లో ప్రతిష్ఠితమై ఊరి చుట్టూ పెనవేసుకున్న ఆ కొండలు ,అడవి,నీడలు,కొండలలో నుండి క్రమక్రమంగా ఉదయించే సూర్య దేవుని అరుణారుణ కాంతులు ఆ అందచందాలు అన్నీ కలగలిసి 
...See more
LikeReply31 April at 06:38Edited
Padmaja Manchiraju wonderfully written......great
LikeReply131 March at 12:45
Bp Padala Your write ups are both elating and depressing at the same time , reminding us the hollowness in our life and the hope that what it could be .
LikeReply231 March at 16:07
Ramarao Dayana Viswantaryamiki vandanaalu
LikeReply131 March at 18:41
Palavali Vijayalakshmipandit ప్రకృతి పిపాసి , ఉపాసి మీ అంతరంగ వీక్షణ అక్షర ధార ఆ.. అనుభూతిని పంచింది . 
పసుపు పచ్హ పూల తోరణాలు తీర్చిన తరువుల చిత్రం అందంగా ఉంది.
Very absorbing write up
LikeReply231 March at 18:50Edited
RajaSekhar Chandram "లోపలి ప్రవాహం"
LikeReply231 March at 19:46
Shrutha Keerthi 'వనవాసి' చదివుతూ ప్రకృతి తో అడవి తో ఎంత ప్రేమలో పడ్డానో మీ మాటలు చదువుతూ అంతే అందమైన అనుభూతికి లోనయ్యాను.ప్రాచీన చైనా కవులవైపు మీరెలా చూస్తారో మీ పోస్టులవైపు మేమూ అలాగే చూస్తూ వుంటాము..థ్యాంక్యూ వెరీ మచ్ సర్ ..!!
LikeReply231 March at 21:55
Bhanu Bhavani Yalavarthy You are lucky even now you are feeling past memories in a. Joyful stag
LikeReply131 March at 22:05
Prasad Rao Gvsv Fortune to share your posts
LikeReply231 March at 23:38
Suraparaju Radhakrishnamoorthy వసంతాన్ని స్మరిస్తూ వాడ్రేవుగారి రెండు పోస్టులు చూసినవారికి ఏమనిపిస్తుంది? మొదటిదానిలో శ్రద్ధ కనిపిస్తుంది.కవిఋణం తీర్చుకునే శ్రద్ధాంజలి క్రతువు.
రెండవది ఋతుఘోషకాదు.అది ఆత్మభాష.ఆయనలో అరణ్యాలు వానప్రస్థం చేస్తాయి. కొందరంతే,మనసొకచోట మనువొకచోట. 'జీవితమంత
...See more
LikeReply71 April at 05:09
Vishwanatham Kamtala అద్భుతమైన విశ్లేషణ."మరో మరింత
విశాలమైన ఆకాశం కోసం అన్వేషణ." 
నువ్వెందుకింకా ఆ పచ్చటి కొండలకే 
...See more
LikeReply41 April at 07:07Edited
Kaladhar Kakarla ఈ మధ్య మీరు చిన్నప్పుడు మీ మాష్టారు చెప్పిన పద్యాలగురించి చెప్పినపుడు ,నేను మిమ్మల్ని ఆ మాష్టారి పేరు తెలియజేయ్యమని అని అడిగెను, అది మీరు చూసినట్టులేదు; ఇప్పుడైనా చెప్తారా?.
LikeReply11 April at 07:11
Radha Pala Oka manasulo nundi inkoka hridayamloki vompina gaadhathaa parimalam......
LikeReply11 April at 08:23
Padma Padmapv Sweetmemorries.sir
LikeReply11 April at 10:24
Janaswamy Vachaspati ఏతలపు లోబరుచు కుంటుందో దానికే
మన హ్రుదయము నిజంగా అంకితమైనట్లు. 
మీలో రెండు పొరలు. అది నిజమే కదా సర్.ఏమి మాట్లాడినా లోపల దాకా వెళ్శదు
...See more
LikeReply21 April at 10:30
Padmaja Suraparaju మీ నిజ స్వరూపం చూపించారు.సాకు దొరికితే అడవులు,వాగులూ,కుటీరాల్లోకి పోయి దాక్కుంటారు.మానవుల కంటే వనాలు ఎక్కువిష్టం కూడాకాదు అసలదే నా నివాసం అంటున్నారు.తప్పించుకుపోయి అడవుల్లో సంతోషంగా తప్పిపోగలగడం అందరికీ దొరికేది కాదు.మీ ఇక్కడిత్రోవ మీద ఓపూరేకు మిమ్మల్ని అంతదూరం లాక్కెళ్ళి మీస్వస్థానంలో పడేస్తుంది.మీ కన్ను ఏది చూసినా నయము,విస్మయము ధ్యానము.
LikeReply51 April at 12:03
Narayana Murty Neralla Excellent Sir GOOD MORNING jaibaba!
LikeReply11 April at 17:50
Sunitha Pothuri చటుక్కున రైలు దిగి ఆ దారిలో వెళ్తున్న బలమైన ఊహ.!
LikeReply11 April at 19:28
Muralikrishna Palteru జీవితమంతా ప్రవాసిగానే గడిపిన దు-ఫు గురించిన మీ ప్రస్తావన 1989 లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైన మీ కవిత " వలసపోనని పక్షి వాగ్ధానం చేయదు " ని గుర్తుకు తెచ్చింది సర్...thank you very much sir...వీలైతే ఆ కవితను మీ next post లో పెట్టండి సర్.
LikeReply23 April at 05:19
Subbareddy Medapati excellant expression ... hats off sir...
LikeReply24 April at 09:05
సరళ మోహన్ "మనని ఏ తలపు లోబరచుకుంటుందో..దానికే మన హృదయం నిజంగా అంకితమైనట్లు..."అంతరంగ గర్భాలయం!హృదయాన్ని గాయపరచడానికి ఒక్క పూలరేకు చాలు..లోపల ప్రవాహం! పచ్చని అడవిలో పసుపుపూల చెట్లు తమ నీడవంగి చూసుకుని దోబూచులాడే సెలయేటి పాట...మీ ఈ రచన!వీరభద్ర గారు
LikeReply16 April at 09:10
Savitri Ramanarao ఒక పూల రేకు చాలు..ఎద రెక్కతోడిగి ఎటో ఎగిరి పోవటానికి....పదేపదే..మనసు..మహాదానందం గా..విహారించ గలిగే ఆ సీమలలో..మీతో పాటు మేము..మీ post chadavatam..ఒక అనిర్వచనీయ అనుభూతి..regards సర్

No comments:

Post a Comment

Total Pageviews