Tuesday, April 11, 2017

Yandamuri ="డేగ రెక్కల చప్పుడు" పుస్తకంలో మీరు 'బట్టర్ ఫ్లై ఎఫెక్ట్', ‘ఒంటె పై ఆఖరి గడ్డి పరక’

Yandamoori Veerendranath
10 hrs
లక్ష్మీ నారయణ, కాంచీపురం.
"డేగ రెక్కల చప్పుడు" పుస్తకంలో మీరు 'బట్టర్ ఫ్లై ఎఫెక్ట్', ‘ఒంటె పై ఆఖరి గడ్డి పరక’ అన్న పదాలు వాడారు. పూర్తి వివరణ ఇవ్వలేదు. అంటే ఏమిటి? రెండిటికి సంబంధం ఉందా?
ఒక కుర్రవాడు ఇంటర్వూకి వెళ్తూంటే బస్సు మిస్ అవుతుంది. నడుస్తూoటే దారిలో ఒక పర్సు కనపడుతుంది. అందులో నెంబరు చూసి ఫోన్ చేస్తాడు. అతడి నిజాయితీకి మెచ్చి యజమాని తన దగ్గర మొదట్లో ఉద్యోగమూ, ఆ పై భాగస్వామ్యమూ ఇస్తాడు. కుర్రవాడు కోటీశ్వరుడువుతాడు. ఏదో మీటింగ్ లో ఓ అమ్మాయి
పరిచయం అవుతుంది. ఇంట్లో వప్పుకోరు. ఈ లోపులో ఆమె మరొకర్ని వివాహం చేసుకుంటుంది. అతడు తాగుడుకి అలవాటు పడి నాశనం అయిపోతున్న సమయoలో ఒక స్వామి తటస్థపడతాడు. అతడి ప్రభావం వల్ల, ఆ యువకుడు అన్ని త్యజించి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఆ రోజు బస్సు మిస్సవకుండా ఉంటే, ఈ రోజు అతడు హిమాలయాలలో ఉండేవాడు కాదు కదా. 'బట్టర్ ఫ్లై ఎఫెక్ట్' అంటే అది. ఎప్పుడో జరిగిన ‘చిన్న’ సంఘటన, తరువాత ఒక పెద్ద మార్పుకి దోహదపడటం ఈ చాటువు అర్థం. మన అందరి జీవితాల్లో ఇలాంటి చిన్న చిన్న సంఘటనల ప్రభావం ఉండే ఉంటుంద. ఇక మీ రెండో సందేహం. ఒక వ్యక్తికి ఆర్ధికంగా ఎన్నో కష్టాలు. క్రమక్రమంగా కృంగిపోయాడు. అయిన పళ్ళ బిగువున అదిమిపెట్టి బ్రతుకుతున్నాడు. ఒక రోజు కొడుకు ఫెయిల్ అయ్యాడని తెలిసింది. లేదా కూతురు ఎవరితోనో వెళ్ళిపోయిందని తెలిసింది. ఆ రాత్రి ఆత్మహత్య చేసు కున్నాడు. ఆఖరి గడ్డి పరక మొయ్యలేక ఒంటె క్రుంగి నేలకు కూలి పోవటం అంటే అది. అప్పటి వరకూ కొండ శిఖరం పై నిలబడిన మంచు, అడుగున చిన్న ముక్క కదలటంతో ‘అవలంచి’ గా మారటం కూడా దీనికి ఉదాహరణే.బట్టర్-ఫ్లై -ఎఫెక్ట్ కి నూరు శాతం సరిపోయే భారత దేశచరిత్రకి సంబంధించి ఒక సంఘటన, డామేనిక్ లాపెర్రి వ్రాసిన ‘ఫ్రీడం ఎట్ మిడ్ నైట్’ అన్న పుస్తకంలో ఉన్నది. ప్రేమ్ జి భాయ్ అనే వ్యక్తి, గుజరాత్ లో చేపల వ్యాపారస్తుడు. అందువల్ల అతడు (శాకాహార) కులo నుంచి వేలివేయ బడ్డాడు. వ్యాపారం మానేసి తిరిగి కులoలో చేరతానన్నా కులపెద్దలు వప్పుకోలేదు. దాంతో కోపగించిన ప్రేమ్ జి భాయ్ కొడుకు ఇస్లాం మతం పుచ్చుకున్నాడు. అతడి కొడుకే భారత విభజనకి కారణమైన మహమ్మద్ అలీ జిన్నా. నెహ్రు, జిన్నా సిద్దాంత రీత్యా బద్ధ శత్రువులు. ముస్లింలకి ప్రత్యేక దేశం కోసం పట్టు బట్టిన జిన్నా, భార్య మరణంతో లౌకిక విషయాలపై విరక్తి చెంది లండన్ వెళ్ళిపోయి దాదాపు ఒంటరి జీవితం గడపసాగాడు. ఆ సమయoలో ఒక ప్రైవేట్ డిన్నర్ పార్టిలో జవహర్ లాల్ నెహ్రు “జిన్నా ఫినిష్ అయి పోయాడు” అంటూ చేసిన కామెంట్ గురిచి తెలిసి అగ్గి మీద గుగ్గిలమై ఇండియా తిరిగి వచ్చి ముస్లిం లీగ్ పార్టీని పునరుద్ధరించాడు. అది అనూహ్యంగా పెరిగి ఇండియా పార్టిషన్ కి దారి తీసింది. విభజన మరో ఏడాదిలో జరుగుతుందనగా జిన్నాకి ఆ రోజుల్లో ప్రాణాంతకమైన టి.బి. వచ్చింది. అయన మరణం అంచున ఉన్నాడని తెలిసిన పటేల్ అనే హిందూ ఫ్యామిలి డాక్టరు, వృత్తి విలువలకి కట్టుబడి, ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. చెప్పి ఉంటే విభజన (పార్టిషన్) విషయం ఏదో రకంగా వాయిదా వేసేవారు గాంధీ, నెహ్రులు. ఆ తరువాత ఉద్యమం దానంతట అదే చల్లారి పోయి ఉండేది.
జిన్నా తాతని హిందూ కుల పెద్దలు తిరిగి తమ కులంలో చేరటానికి ఒప్పుకున్నా, ఆ రోజు పార్టీలో నెహ్రూ ఆ మాట అనకపోయినా, జిన్నా ఆరోగ్యం సంగతి డాక్టరు ముందే వెల్లడి చేసినా, పాకిస్తాన్ ఉద్భవించేది కాదు. కొన్ని లక్షల మంది శరణార్ధులు మరణించి ఉండేవారు కాదు. కాశ్మీరు సమస్య ఉండేది కాదు. బట్టర్-ఫ్లై –ఎఫెక్ట్ కి దిన్ని గొప్ప ఉదాహరణగా చరిత్రకారులు చెపుతారు.
ాయి పరిచయం అవుతుంది. ఇంట్లో వప్పుకోరు. ఈ లోపులో ఆమె మరొకర్ని వివాహం చేసుకుంటుంది. అతడు తాగుడుకి అలవాటు పడి నాశనం అయిపోతున్న సమయoలో ఒక స్వామి తటస్థపడతాడు. అతడి ప్రభావం వల్ల, ఆ యువకుడు అన్ని త్యజించి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఆ రోజు బస్సు మిస్సవకుండా ఉంటే, ఈ రోజు అతడు హిమాలయాలలో ఉండేవాడు కాదు కదా. 'బట్టర్ ఫ్లై ఎఫెక్ట్' అంటే అది. ఎప్పుడో జరిగిన ‘చిన్న’ సంఘటన, తరువాత ఒక పెద్ద మార్పుకి దోహదపడటం ఈ చాటువు అర్థం. మన అందరి జీవితాల్లో ఇలాంటి చిన్న చిన్న సంఘటనల ప్రభావం ఉండే ఉంటుంద. ఇక మీ రెండో సందేహం. ఒక వ్యక్తికి ఆర్ధికంగా ఎన్నో కష్టాలు. క్రమక్రమంగా కృంగిపోయాడు. అయిన పళ్ళ బిగువున అదిమిపెట్టి బ్రతుకుతున్నాడు. ఒక రోజు కొడుకు ఫెయిల్ అయ్యాడని తెలిసింది. లేదా కూతురు ఎవరితోనో వెళ్ళిపోయిందని తెలిసింది. ఆ రాత్రి ఆత్మహత్య చేసు కున్నాడు. ఆఖరి గడ్డి పరక మొయ్యలేక ఒంటె క్రుంగి నేలకు కూలి పోవటం అంటే అది. అప్పటి వరకూ కొండ శిఖరం పై నిలబడిన మంచు, అడుగున చిన్న ముక్క కదలటంతో ‘అవలంచి’ గా మారటం కూడా దీనికి ఉదాహరణే.బట్టర్-ఫ్లై -ఎఫెక్ట్ కి నూరు శాతం సరిపోయే భారత దేశచరిత్రకి సంబంధించి ఒక సంఘటన, డామేనిక్ లాపెర్రి వ్రాసిన ‘ఫ్రీడం ఎట్ మిడ్ నైట్’ అన్న పుస్తకంలో ఉన్నది. ప్రేమ్ జి భాయ్ అనే వ్యక్తి, గుజరాత్ లో చేపల వ్యాపారస్తుడు. అందువల్ల అతడు (శాకాహార) కులo నుంచి వేలివేయ బడ్డాడు. వ్యాపారం మానేసి తిరిగి కులoలో చేరతానన్నా కులపెద్దలు వప్పుకోలేదు. దాంతో కోపగించిన ప్రేమ్ జి భాయ్ కొడుకు ఇస్లాం మతం పుచ్చుకున్నాడు. అతడి కొడుకే భారత విభజనకి కారణమైన మహమ్మద్ అలీ జిన్నా. నెహ్రు, జిన్నా సిద్దాంత రీత్యా బద్ధ శత్రువులు. ముస్లింలకి ప్రత్యేక దేశం కోసం పట్టు బట్టిన జిన్నా, భార్య మరణంతో లౌకిక విషయాలపై విరక్తి చెంది లండన్ వెళ్ళిపోయి దాదాపు ఒంటరి జీవితం గడపసాగాడు. ఆ సమయoలో ఒక ప్రైవేట్ డిన్నర్ పార్టిలో జవహర్ లాల్ నెహ్రు “జిన్నా ఫినిష్ అయి పోయాడు” అంటూ చేసిన కామెంట్ గురిచి తెలిసి అగ్గి మీద గుగ్గిలమై ఇండియా తిరిగి వచ్చి ముస్లిం లీగ్ పార్టీని పునరుద్ధరించాడు. అది అనూహ్యంగా పెరిగి ఇండియా పార్టిషన్ కి దారి తీసింది. విభజన మరో ఏడాదిలో జరుగుతుందనగా జిన్నాకి ఆ రోజుల్లో ప్రాణాంతకమైన టి.బి. వచ్చింది. అయన మరణం అంచున ఉన్నాడని తెలిసిన పటేల్ అనే హిందూ ఫ్యామిలి డాక్టరు, వృత్తి విలువలకి కట్టుబడి, ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. చెప్పి ఉంటే విభజన (పార్టిషన్) విషయం ఏదో రకంగా వాయిదా వేసేవారు గాంధీ, నెహ్రులు. ఆ తరువాత ఉద్యమం దానంతట అదే చల్లారి పోయి ఉండేది.
జిన్నా తాతని హిందూ కుల పెద్దలు తిరిగి తమ కులంలో చేరటానికి ఒప్పుకున్నా, ఆ రోజు పార్టీలో నెహ్రూ ఆ మాట అనకపోయినా, జిన్నా ఆరోగ్యం సంగతి డాక్టరు ముందే వెల్లడి చేసినా, పాకిస్తాన్ ఉద్భవించేది కాదు. కొన్ని లక్షల మంది శరణార్ధులు మరణించి ఉండేవారు కాదు. కాశ్మీరు సమస్య ఉండేది కాదు. బట్టర్-ఫ్లై –ఎఫెక్ట్ కి దిన్ని గొప్ప ఉదాహరణగా చరిత్రకారులు చెపుతారు.

No comments:

Post a Comment

Total Pageviews