బంధాలను చిన్నచూపు చూడవద్దు!
ఇంటిలోంచి ఒక పెద్ద దిక్కు వెళ్ళి పొతే కొన్నితరాలను చూసిన అనుభవ జ్నానం దూరమైనట్లు
"ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం కానీ మన కోసం కన్నీళ్లు కార్చే మనిషిని మాత్రం కొనలేం" అని యాపిల్ కంపినీ సృష్టి కర్త స్టీవ్ జాబ్స్ తన ఆఖరి రోజులలో డైరీలో రాసుకున్న మాటలివి.
బంధాలు, అనుబంధాలు, అప్యాయతలు, అనురాగాలు మన భారతీయ కుటుంబ వ్యవస్థలో మూలస్తంభాలు
మనుషుల బదులుగా వస్తువులను ప్రేమించే కాల క్రమంలో మనం చాలా దూరం వచ్చేసాం
"చందమామ వుంది వెన్నెల రాత్రులున్నాయి
కానీ వెన్నెలలో ఆడుకునే పిల్లలు కరువవుతున్నారు
ఆ వెన్నెల రాత్రిలో ఆరుబయట చందమామ కధలు చెప్పే పెద్దవారు కరువవుతున్నారు
ఎండా కాలంలో వేసవి సెలవులు వున్నాయి
కానీ ఆ వేసవి సెలవుల్లో అమ్మమ్మ నానమ్మల ఇంటికి వెళ్ళేవారు కరువవుతున్నారు
నేటి తరానికి వృత్తిలో రాణించడానికి ప్రతీ అంశంలోనూ క్రాష్ కోర్సులు, వ్యక్తిత్వ వికాస కోర్సులు ఎన్నొ వున్నాయి.
కానీ నైతిక విలువలు, సాంప్రదాయాలు, ప్రేమాభిమానాలు బంధాలు అనుబంధాలు చెప్పే పెద్దవారు ఒక్కొక్కరూ కనుమరుగవుతున్నారు
“ప్రాణం ఉన్నదేది తన కోసం జీవించదు.. అలాగే ఒంటరిగా జీవించదు” అని విలియం బ్లేక్ అన్న మాటల్ని మననం చేసుకోవాలి, మన జీవితంలో ప్రతీ బంధాన్ని నిలబెట్టుకోవాలి, ఎందుకంటే "
"Relationships never dies with natural death, but these relationships are always murdered with EGO, IGNORANCE and SELFISHNESS".
అందుకే
When you say sorry to someone, It means that you are not wrong and other one is right. But it means that you have given importance to relationship more than 'EGO'
Let's have a smooth relationships.
ఈ నాలుగు మాటలు, అటు నాలుగు తరాలు ఇటు నాలుగు తరాలు చూసిన కీ.శే చెల్లాయమ్మ (పెద్ద అత్తయ్య గారు) గారికి అంకితం
No comments:
Post a Comment