Saturday, January 23, 2021

 🙏🏼కొన ఊపిరితో చావు బతుకుల్లో ఉన్న మన సనాతన హిందూ ధర్మానికి ఊపిరి పోసి బతికించిన మహానుభావుడు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ...బ్రాహ్మణుడు.


ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించి బ్రిటీష్ వారిని గడగడలాడించి తెల్ల కుక్కలకు పగలే చుక్కలు చూపిన ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ....బ్రాహ్మణుడు.


హిందూ పద బాదషాహీ , హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీని నడిపించి ఆది శంకరుల తర్వాత మళ్ళీ హిందూ ధర్మానికి జవసత్వాలు తీసుకువచ్చిన ధర్మప్రభువు సమర్థ రామదాసు ...బ్రాహ్మణుడు.


హిందూ ధర్మాన్ని , మన సనాతన గురుశిష్య పరంపరను , మన జ్ఞాన కేంద్రాలైన గురుకులాలను విధర్మీయులు కుట్రపన్ని క్రమేపి నాశనం చేయప్రయత్నిస్తూన్న తరుణంలో , అతి సామాన్యుడైన చంద్రగుప్తుడిని తన రాజనీతితో రాజుగా చేసి,హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి పునఃధర్మ స్థాపన చేసిన మేధోధీరుడు చాణక్యుడు...బ్రాహ్మణుడు.


పసికందును వెనక కట్టుకుని అరివీర భయంకర రణరంగంలో బ్రిటీషులను గడగడలాడించి,భారత మాతను బానిస సంకెళ్ళ నుండి విడిపించుటకు సింహగర్జన చేసిన ఆడ సింహం రాణి ఝాన్సీ లక్ష్మీబాయి....బ్రాహ్మణురాలు.


ఐక్యతారాగాన్ని ఆలాపించి,చెల్లా చెదరుగా విడిన హిందూ సమాజాన్ని ఏకం చేసి భారత స్వాతంత్ర సమరనాదాన్ని పూరించి , వాడవాడలా వినాయకుడిని స్థాపించి..తద్వారా భారత స్వాతంత్ర్యానికి పూనాదులు వేసి,మన సనాతన ధర్మ రక్షణకు ప్రాణాలు త్యాగం చేసిన భారత మాతా భక్తుడు బాల గంగాధర తిలక్ ...బ్రాహ్మణుడు.


నలంద , తక్షశిల లాంటి మన భారత దేశ జ్ఞాన కేంద్రాలను ఆక్రమణదారులు మట్టుబెట్టి భస్మీకృతం చేస్తే...అలాంటి జ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి , భారత మాతకు పూర్వ జ్ఞాన వైభవమును తేవాలని , జోలేపట్టి ఆఖరికి శవాలపై వేసిన డబ్బును ఏరుకోవడానికి వెనకాడక , భిక్షాటన చేసి బనారస్ హిందూ విశ్వవిద్యాలయము ( BHU ) ను స్థాపించి దేశములో విద్యావెలుగులను నింపిన అసమాన కీర్తిమంతుడు మదన మోహన మాలవీయ ...బ్రాహ్మణుడు.


కశ్మీరును స్వతంత్రం చేయాలని , భారతమాత శిరస్సు ఖండించబడకూడదని ఆరాటపడి పోరాటం చేసిన త్యాగధనుడు, జనసంఘ్ ను స్థాపించి భారత భవిష్యత్తుకు పునాదివేసి , ప్రాణాలు అర్పించిన డా॥ శ్యామా ప్రసాద్ ముఖర్జీ....బ్రాహ్మణుడు.


ఈ రోజు నేను హిందువుని అని ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛా భిక్షను అనుగ్రహించిన,రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ( RSS ) ను స్థాపించిన డా॥ హెడ్గేవార్ ...బ్రాహ్మణుడు.


నేడు నరేంద్ర మోడీని చూసి యావత్ ప్రపంచం గర్విస్తూన్నది.ఆ నరేంద్ర మోదీ గారిని తీర్చిదిద్దిన భారతీయ జనతా పార్టీకి పురుడుపోసిన దీనదయాల్ ఉపాధ్యాయ...బ్రాహ్మణుడు.


 అపర మేధావి , కవి , రచయిత...భారత యశస్వీ ప్రధానిగా కీర్తి గడించిన మన భారత రత్న అటల్ బిహారీ వాజపేయ్ ...బ్రాహ్మణుడు.


ప్రపంచ క్రికెట్ లో భారత దేశానికి అగ్ర స్థానాన్ని కల్పించి క్రికెట్ దేవుడిగా కీర్తింపబడే భారత రత్న సచిన్ టెండూల్కర్ ...బ్రాహ్మణుడు.


ఇలా చెబుతూ పోతే సంవత్సరాలు గడిచినా విషయం పూర్తవ్వదు.ఇది భారత జాతి కొరకు , భారత దేశం కొరకు , సనాతన హిందూ ధర్మం కొరకు తమ సర్వస్వాన్ని ధారపోసి , సంపూర్ణ జీవితాలను త్యాగం చేసిన త్యాగధనులైన బ్రాహ్మణుల చరిత్ర....ఎంత చెప్పినా తరగదు.


భారత మాత కొరకు కేవలం బ్రాహ్మణులే త్యాగం చేశారు...మిగితా వారు చేయలేదు...మిగితా వారు పాటుపడలేదు అనేది మా ఉద్దేశ్యం కాదు.దేశ నిర్మాణంలో అందరి పాత్ర ఉందీ...అన్నీ వర్గాల సమిష్టి పోరాటమే భారత రూపం.అందులో బ్రాహ్మణులు కూడా ఉన్నారనేది సమాజం గుర్తించాలి.


ఇంతటి త్యాగాలను చేసి దేశ వైభవాన్ని నిలిపిన , నిలుపుతూన్న బ్రాహ్మణుల గురించి చలన చిత్రాలలో వ్యంగ్యంగా చిత్రీకరించడం శోచనీయం...దానిని మిగితా హిందూ  సమాజం ఖండించకపోవడం దౌర్భాగ్యం.


సినిమాలలో బ్రాహ్మణులపై వెధవ జోకులేయడం

బ్రాహ్మణులను కాలితో తన్నడం

బ్రాహ్మణులను రౌడీలకు సలహాదారుగా చూయించడం...ఇలా ఒకటా రెండా....ఏ చిన్న అవకాశాన్ని చిత్ర పరిశ్రమ వదలదు..బ్రాహ్మణులను కించపరుస్తూనే ఉంటుంది.


ఇకనైనా ఇటువంటి వెకిలి చేష్టలు మానాలి.

బ్రాహ్మణులు దేశ నిర్మాణంలో చేసిన సేవలను గుర్తించాలి.

వారికి తగిన గౌరవాన్ని కల్పించాలి.


బ్రాహ్మణత్వం నాశనమైన రోజు హిందూ ధర్మం నిలవదు.హిందూ ధర్మం నాశనమైన రోజు దేశం మిగలదు.


ఈ దేశ పునాది బ్రాహ్మణత్వంలో ఉంది అనేది యావత్ సమాజం విస్మరించకూడదు.


॥ శ్రీమాత్రే నమః ॥


Tuesday, January 19, 2021

మన ప్రాంతంలో పురాతన ఆలయాల విశిష్టత తెలుసుకుందాం! ఏకాదశ రుద్రులలో రెండవ రుద్రుడు "మహాదేవరుద్రుడు"

 https://www.youtube.com/watch?v=nheX7aXZ_us



మన ప్రాంతంలో పురాతన ఆలయాల విశిష్టత తెలుసుకుందాం! 

ఏకాదశ రుద్రులలో  రెండవ రుద్రుడు "మహాదేవరుద్రుడు"

శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి వారి దేవాలయం. (కృష్ణా రాయుడు పెదపూడి) 

కే.పెదపూడి. అంబాజీపేట మండలం. తూ.గో.జిల్లా.

ఈ ఊరిలో పుట్టి పెరిగి, జీవితంలో ఎంతో ఎదిగినవారిలో ఒకరు "ధార్మిక రత్న" శ్రీ కొండా సత్యనారాయణ గారు. వైమానిక దళ ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంబించి రక్షణ శాఖలో  దేశం నలుమూలలా ఉత్తమ ఉన్నతాధికారిగా విధి నిర్వహణలో తలమునకలుగా ఉంటూనే ఆధ్యాత్మిక ధార్మిక జీవితాన్ని గడిపిన వీరికి మా విస్సా ఫౌండేషన్ "ధార్మిక రత్న" బిరుదు ప్రదానం చేసి ఘన సన్మానం చేసింది. ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగి వుండే వ్యక్తి, ఇటీవలే పదవీ విరమణ చేసి ఉన్నవారిలో బంధుమిత్రులతో, ఆధ్యాత్మిక, ధార్మిక శేష జీవితం గడపాలనే వారి సంకల్పం నెరవేరాలని ఎందరో తమ ప్రాంతాల్లో ఇటువంటి ఆశయాలు నెరవేర్చేందుగు స్ఫూర్తివంత మవుతుందని ఆశిస్తూ మీ సత్యసాయి విస్సా ఫౌండేషన్  కొండా వారి మాటల్లో ఈ మహిమాన్విత శివ కేశవ  గురించి విందాం! 

పూర్వము  ఈ గ్రామ సమీపాన తపోవరం అనే ప్రాంతంలో విశ్వామిత్ర మహర్షి ఘోర తపస్సు చేస్తుండగా దానిని భగ్నం చేయడానికి ఇంద్రుడు మేనకను భూలోకమునకు పంపగా, ఆమె విశ్వామిత్రుని తపోభంగము గావించి, ఆడ బిడ్డకు (శకుంతల)  జన్మనిచ్చి తాను తిరిగి ఇంద్ర లోకము పోవ ప్రయత్నించగా, ఈ దుశ్చర్య కారణంగా ఆకాశంలోకి ఎగురలేక క్రింద పడిపోయినదట. అశరీర వాణి పలికిన సూచన మేరకు అక్కడ శివలింగ ప్రతిష్ట చేసిన తరువాత పైకి ఎగుర గలిగినా, ఈ గ్రామ ప్రాంతానికి వచ్చేసరికి  శక్తి చాలక నేలపై పడి పోగా మరలా ఈ ప్రాంతంలో తపస్సు చేసి, ఈ గ్రామంలో శివలింగ ప్రతిష్ట చేసిన తరువాత మేనక తన పూర్వశక్తిని తిరిగి పొంది ఇంద్ర సభను చేరుకోగలిగినదని స్థల పురాణము వలన తెలియుచున్నది. దేవకాంత మేనక చే ప్రతిష్టించబడిన కారణంగా ఈ దేవునికి శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామీ అని పేరు వచ్చినది.

ఒక పని సంకల్పించి శక్తి చాలక అపజయం కలిగే వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ మేనకేశ్వర స్వామికి అభిషేకాదులతో అర్చించుట వలన కార్యసిద్ది కలుగునని భక్తుల విశ్వాసము. ఈ ఆలయ గోడపై ప్రాచీన లిపిలో రాగి రేకు పై శాసనము కలదు ఈ గ్రామము కౌశికా తీరమున కలదు.

శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి ఆలయము ప్రక్కనే శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత  వేణుగోపాల స్వామి ఆలయము కలదు. ఈ ఆలయమును కృష్ణారాయుని ఆలయం అని అంటారు. స్వర్గీయ యర్రా క్రిష్ణారాయుడు అనే ఈ గ్రామవాసి పెద్దాపుర రాజాస్థానములో పనిచేసి వృద్దాప్యములో ఈ గ్రామములో నివసించి అనేక ప్రజాహిత కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి పేరు తెచ్చుకొనుటవలన ఈ పెదపూడి గ్రామమును కృష్ణారాయుడు పెదపూడిగా వ్యవహరించ బడుతున్నదని తెలిసినది. వీరు వేణుగోపాల స్వామి ఆలయంలో ఎక్కువ సమయం గడుపుతూ శ్రీ వేణుగోపాలుని పై శతక రచన చేసినారట ఈ కారణం గానే ఈ ఆలయమును శ్రీ కృష్ణారాయుని దేవాలయముగా పిలవ బడుతున్నట్లు చెప్పబడుతున్నది. స్వర్గీయ యర్రా క్రిష్ణారాయుని ఔనత్యము కారణము గా ఈ గ్రామం పేరు, ఆలయం పేరు ఆయన పేరున పిలువబడుతున్నట్లు స్థానికులు అంటారు.

కే. పెదపూడి గ్రామము రాజమండ్రి – అమలాపురం రహదారి లో అమలాపురంనకు 13 కి.మీ. దూరములోను రాజమండ్రి కి 60 కి.మీ. దూరములోనూ ఉన్నది. బస్సులో ఈ గ్రామము చేరుకోవచ్చును 

భక్తులు తప్పక శ్రీపార్వతీ సమేత మేనకేశ్వరుని ఆలయము సందర్శించి ఈ స్వామిని దర్శించి, అర్చించి, తరించండి.

మనిషి ఇరుక్కున్నాడు... గ్లోబలైజేషన్ లో...🤔

 🤔మనిషి ఇరుక్కున్నాడు...

గ్లోబలైజేషన్ లో...🤔


👉డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు.!


👉పీలికబట్టల్ని 

వస్త్ర ధారణ అంటున్నారు.!


👉భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.!


👉సహజీవనాన్ని సంసారమంటున్నారు.!


👉గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు.!


👉డూప్ ల పోరాటాన్ని

హీరోయిజం అంటున్నారు.!


👉పదవుల పోరాటాన్ని

ప్రజాస్వామ్యమంటున్నారు


👉అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు.!


👉ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు.!


👉సరదాలను సంస్కృతి అంటున్నారు.!


👉భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు.!


👉కోరిన కోర్కెలు తీరిస్తేనే... దేవుడంటున్నారు.!


👉ఆస్తి ఉంటేనే... గొప్పవాడు అంటున్నారు.!


👉మందు పోయిస్తేనే...

మిత్రుడు అంటున్నారు.!


👉కట్నం తెస్తేనే...

భార్య అంటున్నారు.!


👉సొమ్ములు తెస్తేనే...

సంసారం అంటున్నారు.!


👉కాసులు తెస్తేనే...

కాపురం అంటున్నారు.!


👉 నిజాయితీగా ఉంటే... అసమర్ధుడంటున్నారు.!


👉 సక్రమంగా ఉంటే... అమాయకుడంటున్నారు.!


👉అసత్యాలు మాట్లాడితే... 

బ్రతక నేర్చిన వాడంటున్నారు.!


👉నిజం పలికితే...

బ్రతక నేర్వని వాడంటున్నారు.!


👉న్యాయబద్ధంగా ఉంటే... 

ఎలా బ్రతుకుతాడో అంటున్నారు.!


👉అన్యాయంగా బ్రతికినా...

ఎంచక్కా ఉన్నాడంటున్నారు.!


👉అన్యాయాన్ని ఎదిరిస్తే...

అతనికెందుకు అంటున్నారు.!


👉నిజాయితీగా బ్రతికితే... కూడుపెడుతుందా అంటున్నారు.!


👉మాయకమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు.!


👉మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.!


👉 పరిస్థితులకు అనుగుణంగా. పాత అర్ధం చెరిగిపోయి,

ప్రయోజనాలకు అండగా...

పరమార్ధం ఆవిర్భవిస్తోంది.!


🤔స్వార్ధ కాంక్షాణుగుణంగా... విపరీతార్ధం ఆవిష్కృతమవుతోంది.!🤔


*ఇదే గ్లోబలైజేషన్ మహిమ అంటే*


🔥 టెక్నాలజీ పెరిగింది...

🔥 సౌకర్యం పెరిగింది...

🔥 విలాసం పెరిగింది...

🔥 విజ్ఞానం పెరిగింది...

🔥 కాలుష్యం పెరుగింది...

🔥 ఖర్చు పెరిగింది...

🔥 కల్తీ పెరిగింది...

🔥 రసాయన బంధం పెరిగింది...

🔥 అన్నీ పెరిగాయి...


కానీ! *పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు*  

*మన ఆయుష్ ప్రమాణం మాత్రం 50% పైగా తగ్గింది*


*సర్వే జనా సుఖినోభవంతు* 🙏

G Stone

Monday, January 18, 2021

 #పండుగ అయిపోయింది..


#పందెం కోళ్ల బరులు సర్దేశారు..


#రధం ముగ్గులు వేసి పండుగను పంపేసారు


#హరిదాసులు చెదిరిపోయారు..


డూ.. డూ.. #బసవన్నలు సంవత్సరం దాకా రారు..


పిల్లల ఆటపాటలతో కళకళలాడిన

 #పొలం గట్లు దీనం గా చూస్తున్నాయి..


సందడి అంతా నాదే అని గల గల లాడిన 

#గోదారమ్మ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర డీలా పడి పోయింది..


ఇన్నాళ్లు #పిండివంటలతో నోరు ఊరించిన వంటిల్లు నీరసం అయిపోయింది..


ఆనందం తో వెల్లివిరిసిన 

#అమ్మ మొహం వీధి చివర టాటా చెపుతూ ఆగిపోయింది..


ఇన్ని బాధలు ఉన్నా మళ్ళీ ఏడాది 

#పండుగ వస్తుంది కదా అని ఆనందం లో ఇవన్నీ మీకోసం ఎదురుచూస్తూ ఉంటాయి..


పట్టలేని బాధ తో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి.. 


గడిపిన అల్లర్లు ఆటపాటలు మదిలో సంవత్సరమంతా దాచుకుని జాగ్రత్తగా వెళ్లి మళ్ళీ వచ్చే సంవత్సరం రా !!!....


 నీ కోసం వేచి చూస్తూ....నీ #పల్లెటూరు..💗💗💕


Sunday, January 10, 2021

 ఆదిత్యునికీ 

ఆవడలిష్ఠం !

ఆంజనేయునికి 

అప్పాలిష్ఠం  !


పుండరీకునికి 

పులిహోరా ,

పరంధామునికి 

పరమాన్నం !


ఉగ్ర రుద్రునికి 

ఉల్లి గారెలూ ,

చక్రధారుడికి 

చక్కెరపొంగలి !


అపర కాళికి 

అరిసెల మాలా ,

కోదండపాణికి 

కోవా బిళ్ళలు !!


వినాయకుడికీ 

కుడుముల పోగు ,

కుమార స్వామికి 

చలిమిడి , చిమిలీ !


ముద్దుల మగనికి దద్దోజనమూ  ,

చాల్లే కాంతం 

ఇంకేమొద్దు !


పండగ రోజుల 

పసందు వంటలు ,

నైవేద్య మిస్తే 

నై ...... వైద్య మట !


ఓపిక చేసుకు వండి పెడితివా ,

సాఫీగా నే సాయం పడతా !

కాఫీ మాత్రం మరవకు భామా !

లోటా లోటా త్రాగుతు ఉంటా !

లొట్టలు వేస్తూ తోడుగ ఉంటా !.........


.................. పండగ రోజులు .. మరి మీఇష్టం ............. :) ................. డా. పొన్నాడ . 10/01/2020


Saturday, January 9, 2021

 ఉప్మా , పెసరట్


ఉల్లి గారెలూ ,


పూరీ కూర్మా .


రవ్వదోసెలూ ..


మరిచానర్రా


కరోన ధ్యాసతొ !


ఆవడలన్నవి


ఎట్టుంటాయో ,


' ఆ ' ..... ' వడ ' లన్నవి


ఏమయ్యాయో .....!!


ధ్యానం చేసినా


గుర్తుకు రావు !


పెసర పప్పులో


అన్నం కలుపుకు ,


నేతిలొ వేగిన


మిరియాలదిమీ ,


అదే పొంగలని


ఆనందిస్తూ


ఊపిరి సలపని


ఉద్యోగం తో


ఉరుకులు తీస్తూ


పరుగులు పెడుతూ ,


తీపి గురుతుల


పూత రేకులను


ఆనందంతో ఆస్వాదిస్తూ ...,


రోగుల సేవే


మోక్ష మార్గమని


ఆహ్లాదంతో


అడుగులు వేస్తే


కడుపు నిండుగా ..


కామేశం !!


బ్రతుకు పండుగా


పరమేశం !!...................................  డా. పొన్నాడ . 🙂 30 / 08 / 2020.ఉప్మా , పెసరట్


ఉల్లి గారెలూ ,


పూరీ కూర్మా .


రవ్వదోసెలూ ..


మరిచానర్రా


కరోన ధ్యాసతొ !


ఆవడలన్నవి


ఎట్టుంటాయో ,


' ఆ ' ..... ' వడ ' లన్నవి


ఏమయ్యాయో .....!!


ధ్యానం చేసినా


గుర్తుకు రావు !


పెసర పప్పులో


అన్నం కలుపుకు ,


నేతిలొ వేగిన


మిరియాలదిమీ ,


అదే పొంగలని


ఆనందిస్తూ


ఊపిరి సలపని


ఉద్యోగం తో


ఉరుకులు తీస్తూ


పరుగులు పెడుతూ ,


తీపి గురుతుల


పూత రేకులను


ఆనందంతో ఆస్వాదిస్తూ ...,


రోగుల సేవే


మోక్ష మార్గమని


ఆహ్లాదంతో


అడుగులు వేస్తే


కడుపు నిండుగా ..


కామేశం !!


బ్రతుకు పండుగా


పరమేశం !!...................................  డా. పొన్నాడ . 🙂 30 / 08 / 2020.


Thursday, January 7, 2021

పూర్వం విజయనగర ప్రాంతంలో వైదిక బ్రాహ్మణ స్త్రీలు మాటాడే భాష!

 పూర్వం విజయనగర ప్రాంతంలో వైదిక బ్రాహ్మణ స్త్రీలు మాటాడే భాష 

అట్లాంటి చాటు పద్యం ఇది. శార్దూల పద్యం.

“ అస్సే! చూస్తివషే! వొసే చెముడషే! అష్లాగషే యేమిషే? 

విస్సా వజ్ఝుల వారి బుఱ్ఱినష ఆ విస్సాయి కిస్సారషే ! 

విస్సండెంతటివాడె ? యేండ్లు పదిషే! విన్నావషే ! యెంత వ 

ర్చస్సే!’ యందురు శ్రోత్రియోత్తమపద స్త్రీ లాంధ్ర దేశమ్మునన్!”

.

చెరువుకి నీళ్ళ కోసం వెళ్లి ( అప్పట్లో కొళాయిలు లేవు) బిందెలు తోముకొంటూ జరిపిన సభాషణ,పై చాటు పద్యం. భావం వివరిస్తాను.

.

“ అవునే చూసావా! (అంటే ప్రక్కావిడ పలకలేదు.) ఏమే నీకుచేముడా!(రెండో ఆమె) అయ్యో అలాగా ఏమిటి? (అని అడిగింది) విస్సా వఝలవారి అమ్మాయిని (బుఱ్ఱి అంటే అమ్మాయి) మన విస్సాయికి (కుర్రవాడికి) ఇచ్చి పెళ్లి చేస్తారట! వాడికి పదేళ్ళ వయసు. వింటున్నావా ? వాడు ఎంత కళగా ఉంటాడో” అని శ్రోత్రియ బ్రాహ్మణ స్త్రీలు 

Tuesday, January 5, 2021

 నిజమైన రత్నాలు

"పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితం

మూఢైః పాషాణ ఖండేషు రత్న సంజ్ఞా విధీయతే"


"ఈ లోకంలో జలం, అన్నం, సుభాషితం అనే మూడు మాత్రమే నిజమైన రత్నాలు. కానీ మూర్ఖులు మాత్రం కేవలం రాళ్ళనే రత్నాలని వ్యవహరిస్తారు" అని ఈ శ్లోకానికి భావం

.

రత్నాలు అంటే వజ్ర, వైడూర్యాదులు. ఇవి విలువైన రాళ్ళు. వ్యవహారంలో "రత్నము" అనే పదాన్ని శ్రేష్ఠతా వాచకంగా కూడా ప్రయోగిస్తారు.ఆ దృష్టితో ఆలోచిస్తే పృథివిలో మూడు శ్రేష్ఠ వస్తువులున్నాయి. అవి – నీరు, అన్నము, ఒక మంచిమాట. వీనిలో మొదటి రెండూ మానవులకు జీవశక్తిని ఇచ్చేవికాగా, మూడవది మానవులు మానవులుగా జీవించటానికి అవసరమైన సంస్కారాన్ని ఇస్తుంది.


"భాషాసు ముఖ్యా మధురా దివ్యా గీర్వాణ భారతీ

తస్మాద్ధి కావ్యం మధురం తస్మాదపి సుభాషితమ్"


(భాషలలో సంస్కృత భాష ముఖ్యం, మధురం, దివ్యం.దానిలో కావ్యం మధురం, ఆ కావ్యములోకూడా సుభాషితం మరింత మధురం) అని ఆర్యోక్తి. అందుకే వీటిని అమూల్య వస్తువులుగా భావించి ఆదరించాలి.

"Thousands have lived without love, not one without water" అంటుందొక ఆంగ్ల సూక్తి. అంటే, ప్రేమ రాహిత్య స్థితి ఉన్నా ఫరవాలేదని కాదు. తమ ప్రాణాలు నిలుపుకోవటానికి ప్రాథమికంగా జీవకోటి- జలాన్ని, ఆహారాన్ని ఆశ్రయించాలి. అందుకే నీటికి "జీవము" అనే పేరుకూడా ఉంది. అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావించటం సర్వవిదితం. అసలు జీవం ఉంటేనే కదా - ప్రేమాదులు!.


దేహధారణ ఫలితం-జ్ఞానసాధన. ఇది పశు, పక్ష్యాదులకు సాధ్యం కాదు. మానవులకే సాధ్యం. జ్ఞానం - వివిధ సాహిత్య ప్రక్రియలలో నిక్షిప్తమై ఉంది. "విశ్వ శ్రేయః కావ్యమ్" అన్నారు పెద్దలు. జ్ఞాన పరమావధి విశ్వ శ్రేయమే.

అల్పాక్షరాల్లో, సూత్రప్రాయంగా, సుబోధకంగా హితవు చెప్పే సుభాషితాన్ని మించిన రత్న మేముంది?"బాలాదపి సుభాషితమ్" (బాలునినుంచియైనా మంచిమాటను స్వీక రించాలి) అనేది మన పెద్దల విశాలదృక్పథం.


"సుభాషిత రసస్యాగ్రే సుధా భీతా దివంగతా" (సుభాషిత రస మాధుర్యంతో పోటీ పడలేక అమృతం స్వర్గానికి వెళ్ళిపోయింది) అన్నాడొక కవి.సుభాషిత ధారణ, తద్భావాచరణ మానవులను అమృత స్థితికి చేరుస్తాయనటంలో ఈషణ్మాత్రం సందేహం లేదు.

స్వస్తి!       (శ్రీ సత్యనారాయణ చొప్పకట్లగారి సౌజన్యముతో) 

------------------------శుభసాయంత్రం--------------


Saturday, January 2, 2021

చిన్నారి శిష్టా శ్రీజ భరతనాట్యం

 

చిన్నారి శిష్టా శ్రీజ భరతనాట్యం 

 https://www.youtube.com/watch?v=T3d6E


9bJR1Y

"ముదితల్ నేర్వగరాని విద్యకలదే ముద్దార నేర్పింపగన్" అన్నారు 

పిల్లల పెంపకం అన్నది అత్యంత ముఖ్యమైన, అత్యంత నిర్లక్ష్యం చేయబడుతున్న అంశం 

చిన్నప్పటినుంచి పిల్లలని టి.విలకి, కంప్యూటర్లకి, సెల్ల్ ఫోన్స్ కి బందీలుగా చేసి కొద్దిగా ఎదగగానే ప్లే స్కూల్ నుంచి ఐఐటీ చదువుల మత్తులో వారిలో సృజనాత్మకత, మానవీయత లేకుండా చేస్తున్నాం. అంతేకాక మన సంస్కృతికి దూరం చేస్తున్నాం, "దూరమైన కొలదీ పెరుగును అనురాగం" అన్న ఓ సినీ కవి పలుకులు నిజం అనిపిస్తూ మన ప్రవాస తెలుగు వారు మన సంస్కృతిని చక్కగా కాపాడుకుంటున్నారు మరి మన తెలుగు నేలల్లో మనం????? కానీ అప్పుడప్పుడు మా చిన్నారి శ్రీజ లాంటి వారు మనల్ని ఇలా కనువిందు చేస్తున్నారు. చిన్నారికి శుభాశీస్సులు! ముఖ్యంగా తల్లితండ్రులు విశాలీశశిధర్‌ దంపతులకు మా హృదయపూర్వక శుభాభినందనలు! మంచి అన్నది పెంచాలి  పదిమందికీ పంచాలి. లైక్‌, షేర్‌ చెయ్యండి. మా ఛానల్‌ సబ్‌ స్క్రైబ్‌ చెయ్యండి.  

ఈ సందర్భంగా 1910 లో రచించబడి 09/ 08 /1913 లో కృష్ణాపత్రికలో ప్రచురించబడిన గురజాడ వారి "దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయ్" ఈ పలుకులు ఎప్పటికీ విశ్వజాతి నిర్మాణానికి పునాది రాయి. సత్యసాయి - విస్సా ఫౌండేషన్

దేశమును ప్రేమించుమన్నా

1.దేశమును ప్రేమించుమన్నా

మంచి అన్నది పెంచుమన్నా!

వొట్టి మాటలు కట్టిపెట్టోయి

గట్టి మేల్‌ తలపెట్టవోయి.

2.పాడిపంటలు పొంగిపొర్లే

దారిలో నువు పాటుపడవోయి;

తిండి కలిగితె కండ కలదోయి;

కండ కలవాడేను మనిషోయి!

3.యీసురోమని మనుషులుంటే

దేశమే గతి బాగుపడునోయి?

జల్దుకొని కళలెల్ల నేర్చుకు

దేశి సరకులు నింపవోయి.

4.అన్ని దేశాల్ క్రమ్మవలె నోయి

దేశి సరుకుల నమ్మవలెనోయి !

డబ్బు తేలేనట్టి నరులకు

కీర్తి సంపద లబ్బవోయి.

5.వెనక చూసిన కార్యమేమోయి?

మంచి గతమున కొంచెమేనోయి

మందగించక ముందు అడుగేయి

వెనుకపడితే వెనకే నోయి!

6.పూను స్పర్థను విద్యలందే

వైరములు వాణిజ్యమందే,

వ్యర్థ కలహం పెంచబోకోయి

కత్తి వైరం కాల్చవోయి

7.దేశాభిమానం నాకు కద్దని

వొట్టి గొప్పలు చెప్పుకోకోయి

పూని ఏదైనాను వొకమేల్‌

కూర్చి జనులకు చూపవోయి

8.ఓర్వలేమిపిశాచి దేశం

మూలుగులు పీల్చేసెనోయ్,

ఒరుల మేలుకు సంతసిస్తూ

ఐకమత్యం నేర్చవోయి

9.పరుల కలిమికి పొర్లి యేడ్చే

పాపి కెక్కడ సుఖం కద్దోయి?

ఒకరి మేల్ తన మేలనెంచే

నేర్పరికి మేల్ కొల్లలోయి!

10.స్వంత లాభం కొంత మానుకు

పొరుగు వాడికి తోడుపడవోయి

దేశమంటే మట్టి కాదోయి

దేశమంటే మనుషులోయి!

11.చెట్టపట్టాల్‌ పట్టుకొని

దేశస్థులంతా నడువవలెనోయి

అన్నదమ్ముల వలెను జాతులు

మతములన్నియు మెలగవలెనోయి

12.మతం వేరైతేను యేమోయి?

మనసు లొకటై మనుషులుంటే

జాతమన్నది లేచి పెరిగి

లోకమున రాణించునోయి!

13.దేశమనియెడి దొడ్డవృక్షం

ప్రేమలను పూలెత్తవలెనోయి,

నరుల చమటను తడిసి మూలం,

ధనం పంటలు పండవలెనోయి!

14.ఆకులందున అణగిమణగీ

కవిత కోయిల పలకవలెనోయి;

పలుకులను విని దేశమందభి

మానములు మొలకెత్తవలెనోయి!

Total Pageviews