Saturday, January 2, 2021

చిన్నారి శిష్టా శ్రీజ భరతనాట్యం

 

చిన్నారి శిష్టా శ్రీజ భరతనాట్యం 

 https://www.youtube.com/watch?v=T3d6E


9bJR1Y

"ముదితల్ నేర్వగరాని విద్యకలదే ముద్దార నేర్పింపగన్" అన్నారు 

పిల్లల పెంపకం అన్నది అత్యంత ముఖ్యమైన, అత్యంత నిర్లక్ష్యం చేయబడుతున్న అంశం 

చిన్నప్పటినుంచి పిల్లలని టి.విలకి, కంప్యూటర్లకి, సెల్ల్ ఫోన్స్ కి బందీలుగా చేసి కొద్దిగా ఎదగగానే ప్లే స్కూల్ నుంచి ఐఐటీ చదువుల మత్తులో వారిలో సృజనాత్మకత, మానవీయత లేకుండా చేస్తున్నాం. అంతేకాక మన సంస్కృతికి దూరం చేస్తున్నాం, "దూరమైన కొలదీ పెరుగును అనురాగం" అన్న ఓ సినీ కవి పలుకులు నిజం అనిపిస్తూ మన ప్రవాస తెలుగు వారు మన సంస్కృతిని చక్కగా కాపాడుకుంటున్నారు మరి మన తెలుగు నేలల్లో మనం????? కానీ అప్పుడప్పుడు మా చిన్నారి శ్రీజ లాంటి వారు మనల్ని ఇలా కనువిందు చేస్తున్నారు. చిన్నారికి శుభాశీస్సులు! ముఖ్యంగా తల్లితండ్రులు విశాలీశశిధర్‌ దంపతులకు మా హృదయపూర్వక శుభాభినందనలు! మంచి అన్నది పెంచాలి  పదిమందికీ పంచాలి. లైక్‌, షేర్‌ చెయ్యండి. మా ఛానల్‌ సబ్‌ స్క్రైబ్‌ చెయ్యండి.  

ఈ సందర్భంగా 1910 లో రచించబడి 09/ 08 /1913 లో కృష్ణాపత్రికలో ప్రచురించబడిన గురజాడ వారి "దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయ్" ఈ పలుకులు ఎప్పటికీ విశ్వజాతి నిర్మాణానికి పునాది రాయి. సత్యసాయి - విస్సా ఫౌండేషన్

దేశమును ప్రేమించుమన్నా

1.దేశమును ప్రేమించుమన్నా

మంచి అన్నది పెంచుమన్నా!

వొట్టి మాటలు కట్టిపెట్టోయి

గట్టి మేల్‌ తలపెట్టవోయి.

2.పాడిపంటలు పొంగిపొర్లే

దారిలో నువు పాటుపడవోయి;

తిండి కలిగితె కండ కలదోయి;

కండ కలవాడేను మనిషోయి!

3.యీసురోమని మనుషులుంటే

దేశమే గతి బాగుపడునోయి?

జల్దుకొని కళలెల్ల నేర్చుకు

దేశి సరకులు నింపవోయి.

4.అన్ని దేశాల్ క్రమ్మవలె నోయి

దేశి సరుకుల నమ్మవలెనోయి !

డబ్బు తేలేనట్టి నరులకు

కీర్తి సంపద లబ్బవోయి.

5.వెనక చూసిన కార్యమేమోయి?

మంచి గతమున కొంచెమేనోయి

మందగించక ముందు అడుగేయి

వెనుకపడితే వెనకే నోయి!

6.పూను స్పర్థను విద్యలందే

వైరములు వాణిజ్యమందే,

వ్యర్థ కలహం పెంచబోకోయి

కత్తి వైరం కాల్చవోయి

7.దేశాభిమానం నాకు కద్దని

వొట్టి గొప్పలు చెప్పుకోకోయి

పూని ఏదైనాను వొకమేల్‌

కూర్చి జనులకు చూపవోయి

8.ఓర్వలేమిపిశాచి దేశం

మూలుగులు పీల్చేసెనోయ్,

ఒరుల మేలుకు సంతసిస్తూ

ఐకమత్యం నేర్చవోయి

9.పరుల కలిమికి పొర్లి యేడ్చే

పాపి కెక్కడ సుఖం కద్దోయి?

ఒకరి మేల్ తన మేలనెంచే

నేర్పరికి మేల్ కొల్లలోయి!

10.స్వంత లాభం కొంత మానుకు

పొరుగు వాడికి తోడుపడవోయి

దేశమంటే మట్టి కాదోయి

దేశమంటే మనుషులోయి!

11.చెట్టపట్టాల్‌ పట్టుకొని

దేశస్థులంతా నడువవలెనోయి

అన్నదమ్ముల వలెను జాతులు

మతములన్నియు మెలగవలెనోయి

12.మతం వేరైతేను యేమోయి?

మనసు లొకటై మనుషులుంటే

జాతమన్నది లేచి పెరిగి

లోకమున రాణించునోయి!

13.దేశమనియెడి దొడ్డవృక్షం

ప్రేమలను పూలెత్తవలెనోయి,

నరుల చమటను తడిసి మూలం,

ధనం పంటలు పండవలెనోయి!

14.ఆకులందున అణగిమణగీ

కవిత కోయిల పలకవలెనోయి;

పలుకులను విని దేశమందభి

మానములు మొలకెత్తవలెనోయి!

No comments:

Post a Comment

Total Pageviews