Saturday, December 8, 2018

ఓం నమః శివాయ.... శంభోశంకర హరహర మహాదేవ...

శివపార్వతుల కళ్యాణానికి
వెళ్లిన ఓ ముసలి ముత్తయిదువ
పక్కన కూర్చున్న పేరంటాలిలో
గుసగుసగా  ఓ మాట అంది .......

>>>. ఇదేం విడ్డూరం అమ్మాయ్ః
పార్వతి ఎండకన్నెరుగని పిల్ల ........
పరమేశ్వరుడేమో  ఎండలో  ఎండిపోతూ
వానలో తడిసిపోతూ శ్మశానాల్లో బతికే రకం

ఆమె తనువంతా సుగంధ లేపనాలు ....
అతడి శరీరమంతా బూడిద గీతలు .....
ఆమె చేతులకు పంకీలు  ......
అతడి చేతులకు పాము పిల్లలు ......
  ఎక్కడా పొంతనే లేదు
      చూస్తూ ఉండూ   నాలుగు రోజులైతే
               పెళ్ళి పెటాకులవుతుంది

నాలుగు రోజులు కాదు ........
నాలుగు యుగాలు గడిచిపోయాయి .......
    ఆదిప్రేమికులు ఆదిదంపతులుగా
           వర్ధిల్లుతూనే ఉన్నారు 
....     ....      ....

బయటికి కనిపించే రూపాన్ని కాదు
శివుడి అంతః సౌందర్యాన్ని చూసింది పార్వతి

      అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ
          కాలంబు గతి రత్నగర్భ పథము 
                 దర్శించుకుందా తల్లి
         కాబట్టే ఆ ప్రేమ అజరామరమైంది

       అతడు విష్ణువు అయితే   ఆమె లక్ష్మీ
           అతడు సూర్యడైతే  ఆమె నీడ
         అతడు పదం అయితే ఆమె అర్థం
   
           అలా అని ఆ దంపతుల మధ్య
        విభేదాలు రాలేదా అంటే వచ్చాయి
 ఆ కాపురంలో సమస్యలు తలెత్తలేదా అంటే
     తలెత్తాయి    ప్రతి సమస్య తర్వాత
         ఆ బంధం మరింత బలపడింది
              ప్రతి సంక్షోభం ముగిశాక
       ఒకరికి ఒకరు బాగా అర్థమయ్యారు

ఏ ఆలుమగలైనా పట్టువిడుల పాఠాల్ని
   శివపార్వతుల నుంచే నేర్చుకోవాలి

     ఒకసారి శివుడు మాట చెల్లించుకుంటే
మరోసారి పార్వతి పంతం నెగ్గించుకుంటుంది

         మధురలో అమ్మవారిదే పెత్తనం
 సుందరేశ్వరుడు కేవలం మీనాక్షమ్మకు మొగుడే
       నైవేద్యాలు కూడా దొరసానమ్మకు
              నివేదించాకే  దొరవారికి 
                అదే చిదంబరం లో
           నటరాజస్వామి మాటే శాసనం 
    శివకామసుందరి తలుపుచాటు ఇల్లాలు...
 
ఒక్క మధురై ఏంటి ఒక్క చిదంబరం  ఏంటి
     ఇలా ఎన్నో చోట్ల భార్య పెత్తనం కొన్ని చోట్ల
అలానే భర్త పెత్తనం మరి కొన్ని చోట్ల
     అందుకే వారు ఇద్దరూ జగత్తును ఏలే
అది దంపతులు ఆయిన్నారు పార్వతీపరమేశ్వరులు

  ఓం నమః శివాయ....
 శంభోశంకర  హరహర మహాదేవ...

Wednesday, December 5, 2018

పోలిస్వర్గం కథ

పోలి స్వర్గం కథ ఇదీ
కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ.
Related image
Image result for పోలి స్వర్గంఅనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు.  కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది.
Related imageఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.
Related imageఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి... టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.... మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంరు.
_తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.....Image result for పోలి స్వర్గం
ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ... పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.

శివాభిషేక, జప మంత్రాలు.

శివాభిషేక, జప మంత్రాలు.
నమక చమకాలతో శివాభిషేకానికి సమయం లేనప్పుడు కనీసం ఈ 8 మంత్రాలతో నిత్యం శివాభిషేకం చేసుకోవచ్చు.
Image result for శివాభిషేక, జప మంత్రాలు*
ఓం నమస్తే అస్తు భగవన్  విశ్వేశ్వరాయ,
మహాదేవాయ, త్ర్యంబకాయ  త్రిపురాంతకాయ
త్రికాగ్నికాలాయ  కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ  మృత్యుంజయాయ  సర్వేశ్వరాయ
సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ : || .1
*
ఓం సద్యోజాతం  ప్రపద్యామి  సద్యోజాతాయ వై  నమో నమః |
భవే భవే నాతిభవే  భవస్వ మామ్  భవోద్భవాయ నమః || -2
*
ఓం వామదేవాయ నమో,  జ్యేష్ఠాయ నమ:  శ్రేష్ఠాయ నమో  రుద్రాయ నమః
కాలాయ నమః  కలవికరణాయ నమో  బలవికరణాయ నమో
బలాయ నమో  బలప్రమథనాయ నమ:  స్సర్వభూతదమనాయ నమో
మనోన్మనాయ నమః || .3
Related image*
ఓం  అఘోరే భ్యో థ ఘోరే భ్యో  ఘోర ఘోరతరేభ్య:
సర్వే భ్య :  స్సర్వశర్వేభ్యో  నమస్తే అస్తు రుద్రరూపేభ్యః || -4
*
ఓం తత్పురుషాయ  విద్మహే  మహాదేవాయ ధీమహి
తన్నో రుద్ర : ప్రచోదయా త్ || .5
*
ఓం ఈశాన : సర్వ విద్యానా మీశ్వర  స్సర్వ భూతానాం
బ్రహ్మా ధిపతి ర్బ్రహ్మణో ధిపతి ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ || .6
*
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ! -7
Image result for శివాభిషేక, జప మంత్రాలు*
ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ : శివాయ || .8
*
మంత్రం.7, మంత్రం.8, .. ఒక్కొక్కటి 108 సార్లు  చొప్పున  ప్రతి నిత్యం  జపించ వచ్చును.

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి .


మనం మరొక్కసారి మనం చేసుకుంటూ....మన పిల్లలకి నేర్పిద్దాం
 దిక్కులు :-
""""""""""""""
(1) తూర్పు,
(2) పడమర,
(3) ఉత్తరం,
(4) దక్షిణం

మూలలు :-
""""""""""""""""
(1) ఆగ్నేయం,
(2) నైరుతి,
(3) వాయువ్యం,
(4) ఈశాన్యం

 వేదాలు :-
"""""""""""""
(1) ఋగ్వే దం,
(2) యజుర్వేదం,
(3) సామవేదం,
(4) అదర్వణ వేదం

 పురుషార్ధాలు :-
"""""""""""""""""""""
(1) ధర్మ,
(2) అర్థ,
(3) కామ,
(4) మోక్షా

 పంచభూతాలు :-
"""""""""""""""""""""""
(1) గాలి,
(2) నీరు,
(3) భూమి,
(4) ఆకాశం,
(5) అగ్ని.

  పంచేంద్రియాలు :-
""""""""""""""""""""""""""
(1) కన్ను,
(2) ముక్కు,
(3) చెవి,
(4) నాలుక,
(5) చర్మం.


 లలిత కళలు :-
""""""""""""'"'"""""""
(1) కవిత్వం,
(2) చిత్రలేఖనం,
(3) నాట్యం,
(4) సంగీతం,
(5) శిల్పం.


  పంచగంగలు :-
"""""""""""""""""""""
(1) గంగ,
(2)  కృష్ణ,
(3) గోదావరి,
(4) కావేరి,
(5) తుంగభద్ర.

  దేవతావృక్షాలు :-
""""""""""""""""""""""""
(1) మందారం,
(2) పారిజాతం,
(3) కల్పవృక్షం,
(4) సంతానం,
(5) హరిచందనం.

  పంచోపచారాలు :-
"""""""""""""""""""""""""
(1) స్నానం,
(2) పూజ,
(3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం,
(5) నమస్కారం.

  పంచామృతాలు :-
"""""""""""""""""""""""""
(1) ఆవుపాలు,
(2) పెరుగు,
(3) నెయ్యి,
(4) చక్కెర,
(5) తేనె.

 పంచలోహాలు :-
"""""""""""""""""""""
(1) బంగారం,
(2) వెండి,
(3) రాగి,
(4) సీసం,
(5) తగరం.

 పంచారామాలు :-
""""""""""""""""""""""""
(1) అమరావతి,
(2) భీమవరం,
(3) పాలకొల్లు,
(4) సామర్లకోట,
(5) ద్రాక్షారామం

 షడ్రుచులు :-
"""""""""""""""""
(1) తీపి,
(2) పులుపు,
(3) చేదు,
(4) వగరు,
(5) కారం,
(6) ఉప్పు.

  అరిషడ్వర్గాలు (షడ్గుణాలు) :-
"""""""""""""""""""""""""""""""""""""""
(1) కామం,
(2) క్రోధం,
(3) లోభం,
(4) మోహం,
(5) మదం,
(6) మత్సరం.

  ఋతువులు :-
""""""""""""""""""""
(1) వసంత,
(2) గ్రీష్మ,
(3) వర్ష,
(4) శరద్ఋతువు,
(5) హేమంత,
(6) శిశిర

  సప్త ఋషులు :-
""""""""""""""""""""""""
(1) కాశ్యపుడు,
(2) గౌతముడు,
(3) అత్రి,
(4) విశ్వామిత్రుడు,
(5) భరద్వాజ,
(6) జమదగ్ని,
(7) వశిష్ఠుడు.

  తిరుపతి సప్తగిరులు :-
"""""""""""""""""""""""""""""""
(1) శేషాద్రి,
(2) నీలాద్రి,
(3) గరుడాద్రి,
(4) అంజనాద్రి,
(5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి,
(7) వేంకటాద్రి.

  సప్త వ్యసనాలు :-
""""""""""""""""""""""""
(1) జూదం,
(2) మద్యం,
(3) దొంగతనం,
(4) వేట,
(5) వ్యబిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

    సప్త నదులు :-
""""""""""""""""""""""
(1) గంగ,
(2) యమునా,
(3) సరస్వతి,
(4) గోదావరి,
(5) సింధు,
(6) నర్మద,
(7) కావేరి.
           
 నవధాన్యాలు :-
""""""""""""""""""""""""
(1) గోధుమ,
(2) వడ్లు,
(3) పెసలు,
(4) శనగలు,
(5) కందులు,
(6) నువ్వులు,
(7) మినుములు,
(8) ఉలవలు,
(9) అలసందలు.

  నవరత్నాలు :-
"""''''""""""""""""""""
(1) ముత్యం,
(2) పగడం,
(3) గోమేధికం,
(4) వజ్రం,
(5) కెంపు,
(6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).

   నవధాతువులు :-
""""""""""""""""""""""""
(1) బంగారం,
(2) వెండి,
(3) ఇత్తడి,
(4) రాగి,
(5) ఇనుము,
(6) కంచు,
(7) సీసం,
(8) తగరం,
(9) కాంతలోహం.

  నవరసాలు :-
"""""""""""""""""""
(1) హాస్యం,
(2) శృంగార,
(3) కరుణ,
(4) శాంత,
(5) రౌద్ర,
(6) భయానక,
(7) బీభత్స,
(8) అద్భుత,
(9) వీర

  నవదుర్గలు :-
"""""""""""""""""""
(1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి,
(3) చంద్రఘంట,
(4) కూష్మాండ,
(5) స్కందమాత,
(6) కాత్యాయని,
(7) కాళరాత్రి,
(8) మహాగౌరి,
(9) సిద్ధిధాత్రి.

  దశ సంస్కారాలు :-
""""""""""""""""""""""""""
( 1 ) వివాహం,
( 2 ) గర్భాదానం,
( 3 ) పుంసవనం ,
( 4 ) సీమంతం,
( 5 ) జాతకకర్మ,
( 6 ) నామకరణం,
( 7 ) అన్నప్రాశనం,
( 8 ) చూడకర్మ,
( 9 ) ఉపనయనం,
(10) సమవర్తనం

   దశావతారాలు :-
"""""""""""""""""""""""""
( 1 ) మత్స్య,
( 2 ) కూర్మ,
( 3 ) వరాహ,
( 4 ) నరసింహ,
( 5 ) వామన,
( 6 ) పరశురామ,
( 7 ) శ్రీరామ,
( 8 ) శ్రీకృష్ణ,
( 9 ) బుద్ధ,
(10) కల్కి.

  జ్యోతిర్లింగాలు :-
""""""""""""""""""""""""
హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

తమిళనాడు ~ రామలింగేశ్వరం

 తెలుగు వారాలు :-
"""""""""""""""""""""""""
(1) ఆది,
(2) సోమ,
(3) మంగళ,
(4) బుధ,
(5) గురు,
(6) శుక్ర,
(7) శని.

  తెలుగు నెలలు :-
"""""""""""""""""""""""""
( 1 ) చైత్రం,
( 2 ) వైశాఖం,
( 3 ) జ్యేష్ఠం,
( 4 ) ఆషాఢం,
( 5 ) శ్రావణం,
( 6 ) భాద్రపదం,
( 7 ) ఆశ్వీయుజం,
( 8 ) కార్తీకం,
( 9 ) మార్గశిరం,
(10) పుష్యం,
(11) మాఘం,
(12) ఫాల్గుణం.

  రాశులు :-
""""""""""""""
( 1 ) మేషం,
( 2 ) వృషభం,
( 3 ) మిథునం,
( 4 ) కర్కాటకం,
( 5 ) సింహం,
( 6 ) కన్య,
( 7 ) తుల,
( 8 ) వృశ్చికం,
( 9 ) ధనస్సు,
(10) మకరం,
(11) కుంభం,
(12) మీనం.

  తిథులు :-
""""""""""""""""
( 1 ) పాఢ్యమి,
( 2 ) విధియ,
( 3 ) తదియ,
( 4 ) చవితి,
( 5 ) పంచమి,
( 6 ) షష్ఠి,
( 7 ) సప్తమి,
( 8 ) అష్టమి,
( 9 ) నవమి,
(10) దశమి,
(11) ఏకాదశి,
(12) ద్వాదశి,
(13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.

  నక్షత్రాలు :-
"""""""""""""""""
( 1 ) అశ్విని,
( 2 ) భరణి,
( 3 ) కృత్తిక,
( 4 ) రోహిణి,
( 5 ) మృగశిర,
( 6 ) ఆరుద్ర,
( 7 ) పునర్వసు,
( 8 ) పుష్యమి,
( 9 ) ఆశ్లేష,
(10) మఖ,
(11) పుబ్బ,
(12) ఉత్తర,
(13) హస్త,
(14) చిత్త,
(15) స్వాతి,
(16) విశాఖ,
(17) అనురాధ,
(18) జ్యేష్ఠ,
(19) మూల,
(20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ,
(22) శ్రావణం,
(23) ధనిష్ఠ,
(24) శతభిషం,
(25) పూర్వాబాద్ర,
(26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.

  తెలుగు సంవత్సరాల పేర్లు :-
""""""""""""""""""""""""""""""""""""""
( 1 ) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

( 2 ) విభవ :-
1928, 1988, 2048, 2108

( 3 ) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. -
1934, 1994, 2054, 2114

9యువ.  -
1935, 1995, 2055, 2115

10.ధాత.  -
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. -
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. -
1939, 1999, 2059, 2119

14.విక్రమ. -
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. -
1942, 2002, 2062, 2122

17.స్వభాను. -
1943, 2003, 2063, 2123

18.తారణ. -
1944, 2004, 2064, 2124

19.పార్థివ. -
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. -
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. -
1948, 2008, 2068, 2128

23.విరోధి. -
1949, 2009, 2069, 2129

24.వికృతి. -
1950, 2010, 2070, 2130

25.ఖర.
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ.
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136

31.హేవళంబి.
1957, 2017, 2077, 2137

32.విళంబి.
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి.
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్.
1962, 2022, 2082, 2142

37.శోభకృత్.
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144,

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147

42.కీలక.
1968, 2028, 2088, 2148

43.సౌమ్య.
1969, 2029, 2089, 2149

44.సాధారణ .
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151

46.పరీదావి.
1972, 2032, 2092, 2152

47.ప్రమాది.
1973, 2033, 2093, 2153

48.ఆనంద.
1974, 2034, 2094, 2154

49.రాక్షస.
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156,

51.పింగళ               
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి       
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి             
1979, 2039, 2099, 2159

54.రౌద్రి               
1980, 2040, 2100, 2160

55.దుర్మతి             
1981, 2041, 2101, 2161

56.దుందుభి           
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి       
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి               
1984, 2044, 2104, 2164

59.క్రోదన                 
1985, 2045, 2105, 216

60.అక్షయ             
1986, 2046, 2106, 2166.

మనిషి జీవితం విచిత్రమైంది

మనిషి జీవితం విచిత్రమైంది
"యవ్వనంలో సమయం,
శక్తి  రెండూ...ఉంటాయి..
కానీ డబ్బు ఉండదు..?

మధ్య వయసులో డబ్బు,
శక్తి  రెండూఉంటాయి.
కానీ సమయం ఉండదు..??

వృద్ధాప్యంలో సమయం,
డబ్బు రెండూఉంటాయి.
కానీ శక్తి మాత్రం ఉండదు..

తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు...
జీవితం ముగిసిపోతుంది.

మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు..

మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు...

కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్లను మనసారా ప్రేమించండి

ఆప్యాయత అనురాగలను పంచండి..
మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి. 

మమ్మీ డాడి కల్చరు

” మమ్మీ డాడి ” చదువులొచ్చాక ‘తల్లీ నిన్ను దలంచి పుస్తకము’ ఎగిరిపోయింది.నన్నడిగితే ‘వేయి పడగలు’ విలువ పెరిగిందంటాను.కాన్వెంట్ చదువులొచ్చాక,అన్ని పడగలూ పోయి ఉన్న ఆ ఒక్క పడగ కూడా ఎగిరిపోయింది.తెలుగు ‘మమ్మీల’ వ్యామోహం పుణ్యాన విశ్వనాథ వారు వేయిపడగల్లో తిట్టినదానికన్నా ఎక్కువ తిట్టాలి,’మమ్మీ డాడి కల్చరు’ కోసం తెలుగుతనాన్నీ, తెలుగు ఆత్మాభిమానాన్నీ,తెలుగు పౌరుషాన్నీ మంట కలిపేస్తున్న తెలుగు ‘మమ్మీల్ని’.

భాగవతంలో శ్రీ కృష్ణుడు మన్ను తిన్నాడని యశోద నోరు తెరవమన్నప్పుడు ఆ చిన్ని కృష్ణుడు ‘మమ్మీ మన్నుతినగం నేశిశువునో ఆకొంటినో వెర్రినో’ అని చదవాల్సిన పరిస్థితి ఇప్పుడొచ్చింది.నోరారా ఇంటికి రాగానే పిల్లలు ‘అమ్మా’ అనకుండా ఈ ‘మమ్మీ’గోల ఎక్కడినించొచ్చిందిరా అని మా మేనత్తగారు ‘మమ్మీ-డాడీ’ గాళ్ళని తిట్టిన తిట్టు తిట్టకుండా దులిపేస్తూంటారు.’మమ్మీ డాడీ’గాళ్ళకు ‘డింగ్డాంగ్ బెల్లు’ తెలిసినట్లుగా కృష్ణ శతకం, సుమతీ శతకం తెలవ్వు కదా;
అంచేత విశ్వనాథ వారు ఇంకా రెండు పడగలున్నాయని ఆ నవల్లో పొంగిపోయారు,కానీ కాన్వెంట్ల పిచ్చి గురించి వారు కాసుకోలేకపోయారు.ఆ రెండు పడగలనీ కూడా తెలుగు మమ్మీలు ఊడగొట్టేశారు.

శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’ కావ్యంలో’మాలదాసరి’ కథలో మాలదాసరి చేత రాక్షసునికి జ్ఞానోపదేశం చేయిస్తారు. అంత గొప్ప కథ చదువుకునే అదృష్టం మనవాళ్ళకి ఉండొద్దూ?దసరా వచ్చిందంటే దసరా ఊరేగింపుల్లేవు. చిన్నపిల్లలు ఇంటింటికీ వెళ్ళి నిలబడి చదివే పద్యాలు విని ఆనందించని తెలుగు తల్లి ఉండేదా?
ఇంగ్లీషు గ్రామర్ సరీగ్గా రాకపోయినా’ఫాక్స్ టైల్ కాన్వెంటనో” ఆక్స్ఫొర్డ్ లిటిల్ కాన్వెంటనో’ పేరు కనబడ్డంతో శ్వేతవస్త్రాంభరధారులైన మలయాళీ రోమన్ కథొలిక్ నన్నమ్మలు, రుసరుసమంటూ,విసుక్కుంటూ తిరుగుతూ కనిపిస్తే చాలు,మన వాళ్ళకి ‘స్క్రూ’ లూజై వాళ్ళకి పాదాభివందనలు చేస్తారు. చిత్రం ఏమిటంటే విదేశాలలో ఉన్న తెలుగు వారు మన మతం,సంస్కృతి,ఆచారవ్యవహారాలూ అంటే పడి చస్తారు.పద్యం ఎలా తెలుగు వాడి సొత్తో, పచ్చడి అలాగ తెలుగువాడికి ప్రియాతి ప్రియమైనది.

పోతన్న గారు ‘అమ్మల గన్న యమ్మ’ అని భక్తితో అన్నారు కానీ,’మమ్మీల గన్న మమ్మీలు’ అనలేదుకదా. నాన్నా అని పిలిపించుకోవడంలో ఉన్న ఆప్యాయత దాడి,చాడి లాగ డాడీ అంటే వస్తుందా? ఈ చదువులు మన జీవితం నుంచి మనల్ని వేరు చేస్తున్నాయి.మన పిల్లల్ని జ్ఞానశూన్యులుగా చేస్తున్నాయి.తెలుగు భాష ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కుటుంబాల్లోని ఆడవాళ్ళతో మాట్లాడితే తెలుస్తుందనేవారు ఒకప్పుడు. మరి ఇప్పుడో?.
లండన్ లో ఉద్యోగం చేస్తున్న ఓ కుర్రాడు గోంగూర పచ్చడి వడ్డిస్తే దాన్నేవంటారు, గుర్తు లేదన్నాడుట.అలాటి వెధవల్ని నాలిక చీరేసి గొతిలో కప్పేయాలంటారు డాక్టర్ గూటాల కృష్ణమూర్తి గారు.విశ్వనాథ వారిచేత ఇంకా తిట్లు తినదగిన స్థాయిలోనే ఉంది మన సమాజం–వేయి పడగలూ జిందాబాద్. “

    ఈ వ్యాసాన్ని పురాణం వారు 70 ల్లోనే వ్రాశారు. తల్లితండ్రులకి తమ బిడ్డ తెలుగులోనే మాట్లాడి తగలడిపోతున్నాడేమో అన్న భావం ఉన్నంతవరకూ ఈ సమస్యకి అంతులేదు.మన దేశం లో ‘లంచగొండి’ తనం ఎలాగ పాతిపెట్తుకుపోయింది,
దానిని నిర్మూలించకలమా, అలాగే మన పిల్లలకి తెలుగు నేర్పించడమూనూ.’లంచం’ ఆపకలిగితే తెలుగు కూడా నేర్పగలము.

   తెలుగు గోల” అనే శీర్షిక క్రింద వ్రాశారు…రైళ్ళలొ కానీ,బస్సులలో కానీ మనకి ఒక రకమైన మాటలు వద్దన్నా వినిపిస్తూంటాయి.అరటిపళ్ళని అలా పిలవకుండా “కేళా కేళా” అని అరుస్తూంటాడు. అరటిపళ్ళని అరటిపళ్ళని పిలవడానికి సిగ్గు పడే జాతి మనది.శుభ్రమైన మామిడితాండ్రని –తాండ్ర తాండ్ర అని తాండ్ర పాపారయుళ్ళా గర్వంగా అరవక ఆంగ్లో ఇండియన్ లాగ ” మాంగో జెల్లీ మాంగో జెల్లీ ” అని అరుస్తాడు, అదీ తాండ్ర తయారుచేసే గోదావరి జిల్లాల్లో,
తాండ్ర అని పిలవడానికి నామోషీయేమో. జెల్లీ అని అరిచినవాడిని పిలిచి పూచి పుచ్చుకొని ఓ జెల్ల కొట్టాలి దిమ్మ తిరిగేలా. జీడిపప్పు అమ్మేవాడు “కాజూ కాజూ” అంటాడు. జీడిపప్పు అంటే వాడి హోదా ఏమిటో పోయినట్లు.
ఇంక రైల్లో భోజనం తెచ్చేవాడైతే “మీల్స్ మీల్స్” అని చెవి కోసిన మేకలా అరుస్తాడు కానీ, భోజనం అనడు. “పల్లీ పల్లీ ” అంటాడు కానీ హాయిగా వేరుశనగ పప్పూ అనడు.ఇడ్లీ వడా అంటాడు కానీ శుభ్రంగా గారె అనడు.ఎప్పుడైనా ఉడకపెట్టిన కోడి గుడ్లు తెస్తే ” అండా” అంటాడు. అండా ఏమిటీ వాడి పిండాకూడు !! ఆవడ అంటే హోటల్లో వాడికి అర్ధం అవదు, దహీవడా అనాలి.
ఇక మనవాళ్ళు భోజనాల దగ్గిర ” మీల్స్ ” తో ప్రారంభించి అరటికాయ కూర, వంకాయకూరా అని రామనామం జపించినట్లనలేరు, బేంగన్ అంటాడు, చట్నీ అంటాడు కానీ పచ్చడి అనడు. వంకాయ కూర అంటే వీడి పరువేమైనా గంగలో కలుస్తుందా,వీడి పిల్లనెవరూ చేసుకోరా, వీడి పెళ్ళాం వీడితో కాపురం చెయ్యనందా? ఈ తెలుగూస్ కి నోటిమీద వాతలు పెట్టించండి, తల్లి భాషలో మాట్లాడ్డానికి సిగ్గిల్లే దుర్మదాంధుల్ని. పులుసన్రా అంటే గ్రేవీ అంటాడు,పులుసులో ముక్కలు వేయడానికి కొంచెం సాఫ్ట్ పీసెస్ వేయండంటాడు.
ముష్టివాడు కొంచెం రైస్ వేయండనడు, అన్నం పెట్టు తల్లీ అంటాడు నోరారా.మన ఇంటి హీరో గారు ” రైస్ ఇలా అందుకో, కర్రీ ఇలా జరుపు,చట్నీ కాస్త రుబ్బూ,ఘీ ఉందా, పాప్పడ్ మరోటి వడ్డించమనూ” ఇలా సాగిస్తాడు కానీ
“తేనె పోక నోరు తీయన యగు రీతి” అన్నం అందుకోమనడు, కూర ఏమిటీ అనడు. మేంగోస్ అంటాడు కానీ మామిడిపండు అనలేడు.పెరుగంటే గుర్తొచ్చింది కర్డ్ అంటాడు.కారం ఎక్కువైతే చిల్లీస్ ఎక్కువ అని అఘోరిస్తాడు. భోజనం దగ్గర ఇంగ్లీష్ మాట్లాడేవాడి మూతిపళ్ళు రాలగొట్టాలని ఓ బిల్లు అసెంబ్లీ లో పాస్ చేయండి.
పట్టుచీరని సిల్క్ శారీ అనీ, రవికల గుడ్డని బ్లౌజ్పీస్ అనే స్థితికి దిగజారిపోయాము.మరి ఈ దేశాన్ని బాగుచేయలేం అని ఆత్మహత్య చేసికుంటారా లేక హత్యలు చేస్తారా, మీరే నిర్ణయించుకోవాలి. ”

    ఇదండీ ఆయన ఆత్మఘోషా.ఆయన చెప్పినట్లుగా ఈ పైత్యం అంటే మాతృభాషలో మాట్లాడడానికి నామోషీ అనుకోవడం మనవారికే చెల్లింది.మా చిన్నతనంలో మేమేమీ కాన్వెంటులకు వెళ్ళలేదు, తెలుగు లోనే నేర్చుకున్నాము, దానితో పాటు ఇంగ్లీష్ నేర్పారు.ఇప్పుడు దానికి వ్యతిరేకం–ఇంగ్లీషుతో పాటు వీలుంటేనే మాతృభాష. మిగిలిన రాష్ట్రాల్లో మరీ ఇంత అన్యాయం కాదు.మహరాష్ట్రలో మరాఠీ స్కూల్లో నేర్చుకోవాల్సిందే.



రచన :- భమిడిపాటి ఫణిబాబు 

Saturday, December 1, 2018

భవభూతి మహాకవి ''ఉత్తరరామచరిత్రమ్ కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్

భవభూతి మహాకవి ''ఉత్తరరామచరిత్రమ్ " నాటకం వ్రాయటం పూర్తిచేసిన తర్వాత, దాన్ని
ఆ కాలంలో అతిప్రసిద్ధుడైన కాళిదాస మహాకవికి చూపించి ఆయన అభిప్రాయం
తెలుసుకోవాలని కొన్నాళ్ళు తహతహలాడాడు బాణభట్టులాగే.
తీరా నాటకం చదివి నచ్చకపోతే మహాకవి ఏమంటాడో అని (బాణుడిలాగే ) ఒక శంక.
అందువల్ల తను స్వయంగా కాళిదాసుకు నాటకం చూపించటానికి సంశయించి, తన
కుమారుడికి తన కుమారుడికి తన తాళపత్రగ్రంథం యిచ్చి కాళిదాసు యింటికి పంపాడు.
కాళిదాసు యింట్లో కూచుని చదరంగం ఆడుకుంటున్నాడు. భవభూతి కుమారుడు కాళిదాసుతో మీరు కొంచెం సమయమిస్తే, మా నాన్నగారి నాటకం మీకు వినిపించి మీ
అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను. అన్నాడు.
వేరే సమయమెందుకు?వచ్చావుగదా!యిప్పుడే చదివి వినిపించు. ఒక చెవి పడేసి వినేస్తాను. అన్నాడు చదరంగం బల్లమీది నుంచి దృష్టి కూడా మరల్చకుండా.
భవభూతి కుమారుడికి మనసు చివుక్కుమంది. తన తండ్రి వ్రాసిన మహాకావ్యం, శ్రద్ధపెట్టి వినేందుకు కూడా యిష్టం లేని ఈ అహంభావికి నాటకమంతా వినిపించటం చెవిటివాడి
ముందు శంఖమూది నట్టు గదా! అనిపించింది. కానీ ఏంచేస్తాడు?తన తండ్రికి కాళిదాసు గురుతుల్యుడు, అంతకంటే ఎక్కువే. ఈయన అభిప్రాయం తెలుసుకుంటే తప్ప
ఆయనకు మనః శాంతి లేదు. చేసేది లేక నాటకమంతా చదివి వినిపించాడు.
చదివాడు కానీ కాళిదాసు ఒక్క ముక్కైనా విన్నాడని అతనికి నమ్మకం లేదు. ఆయన మానాన ఆయన చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇటుపక్కకు తిరిగి చూడనైనా
చూడలేదు. అంతా చదివాక మాత్రం,నోటినిండా తాంబూలం తో అస్పష్టన్గా సున్నా ఎక్కువైంది అని మాత్రం వినిపించింది. భవభూతి కుమారుడికి 'ఓహో! ఈ వ్యసనపరుడైన అహంభావికి తాంబూలంలో సున్నం ఎక్కువైనట్లుంది. దానిమీద వున్న
ఆసక్తి గూడా ఈయనకు యితరులు వ్రాసిన కావ్యాల మీద లేదు.అనుకొన్నాడు. ఆ
నిర్లక్ష్యం, అనాసక్తి అతన్ని బాగా నొప్పించాయి.
ఒకనమస్కారం పెట్టి యింటికివెళ్ళి తండ్రితో జరిగినదంతా చెప్పాడు. విని ఆయనకూడా చిన్నబుచ్చుకున్నాడు.
తండ్రీ కొడుకులిద్దరూ యిలా దిగాలుగా కూర్చొని వుండగా, కాళిదాసేభవభూతి యింటికి వచ్చాడు. వస్తూనే భవభూతిని కౌగలించుకొని ఎంత గొప్పగా వ్రాశావయ్యా! గ్రంథం'
అని మెచ్చుకున్నాడు. భవభూతి ఆయనను కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశాడు.
మాటల మధ్యలో భవభూతి,కాళిదాసుతో మహాకవీ, నా కుమారుడు మీకీ నాటకం చదివి వినిపించినప్పుడు మీరు మరేదో పనిలో వుండి, అంత శ్రద్ధగా వినలేక పోయారనీ చెప్పాడు. అంతా విన్న తర్వాత కూడా మీరు నాటకం విషయం ప్రస్తావించకుండా, మీ
తాంబూలంలో సున్నం ఎక్కువవడం గురించి మాత్రం ఏది అన్నారని చెప్పాడు. మీరేమో
యిప్పుడు నా నాటకాన్ని ఇంతగా ప్రశంసిస్తున్నారు. ఏదో సాటి కవినని మర్యాదతో
మీరిలా అంటున్నారనని అనుకుంటున్నాను. మీరేమీ అనుకోకపోతే, మరోసారి నాటకమంతా నేనే స్వయంగా మీకు చదివి వినిపిస్తాను. ఈసారైనా విని మీ సూచనలూ,
అభిప్రాయమూ నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తాను. అన్నాడు.
కాళిదాసు నవ్వాడు; 'కవిరాజా, నాకు కావ్యరచనలో, కావ్య పఠనంలో, శ్రవణంలో వున్న
ఆసక్తి మరే విషయంపైనా లేదు. మీ చిరంజీవి చదువుతున్నప్పుడు, నేను మీ కావ్యం
క్షుణ్ణ౦గా, శ్రద్ధగా విన్నాను. పూర్తిగా ఏకాగ్రతతో. మీరు కావాలంటే నేను ఆ నాటకం
ఆమూలాగ్రం ఇప్పటికిప్పుడు తిరిగి చెప్పగలను. నాటకం నాకెంతో నచ్చింది కనుకే
నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని అభినందించటం నాధర్మం అని భావించి వచ్చాను.నేను అన్నమాటలు పై పై మర్యాదకోసం చెప్పినవి కావు.' అన్నాడు.
ఇక సున్నం విషయమా? మీ అబ్బాయి నేనన్నది సరిగా వినలేదు. నేనన్నది సున్నం గురించికాదు. 'సున్న' గురించి , నాటకం లో ఒకే ఒకచోట ఒక్క సున్నాఎక్కువైందేమో
ఆ సున్నా తీసేస్తే ఆ శ్లోకం మరింత రమ్యంగా వుంటుందేమో ననిపించింది. అందుకే సున్న ఎక్కువైందేమో నాని చిన్న సూచన చేశాను తప్ప మీ అద్భుతమైన నాటకం లో
ఏ చిన్న మార్పూ అవసరం లేదు.
ఆ మాటలువిని భవభూతి ఉప్పొంగి పోయాడు. ఉత్సాహంగా సున్న ఎక్కువైంది ఏ శ్లోకం లో స్వామీ?నాటకంలో శ్లోకాలన్నీ గబ గబ మీకు వినిపిస్తాను.దయచేసి చెప్పండి. అన్నాడు.
ఆ అవసరం లేదు. నీ కావ్యంలో ఏ శ్లోకమైనా నేను మరిచిపోతే కదా నువ్వు నాకు గుర్తు చేసేది? మొదటి అంకం లోనే, రాముడు తను అరణ్యవాసంలో సీతతో గడిపిన తొలిరోజులు గుర్తు చేసుకుంటూ వుండే సందర్భంలో ఒక మనోహరమైన శ్లోకం చెప్పావు.
కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్
అవిరళిత కపోలం జల్పతోర క్రమేణ
అశిధిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణో
అవిదిత గతయామా రాత్రి రేవం వ్యరంసీత్
(అశిధిల పరిరంభ -వ్యాపృత-ఏక - ఏక - దోష్ణో: = అతి సన్నిహితంగా ఒకరి బాహువులలో
ఒకరుగా ఒదిగి ;
అవిరళిత కపోలం - చెక్కిలికీ చెక్కిలికీ మధ్యస్థలం లేకుండా
ఆసక్తి యోగాత్ - అక్రమేణ - కిమపి కిమపి - మందం మందం - జల్పతో: = ఆసక్తి బట్టే తప్ప - మారె వారసలేకుండా - ఏవేవో ముచ్చట్లు - గుసగుసలుగా చెప్పుకుంటున్న
(మనకు)
అవిదిత గతమయామా - రాత్రి: - ఏవం - వ్యరంసీత్ = తెలియకుండా దొర్లిపోయిన
జాములు గల రాత్రి యిలా గడిచిపోయింది.
అవునవును అన్నాడు భవభూతి.
అందులో రాత్రిరేవం వ్యరంసీత్ (రాత్రి యిలా గడిచిపోయింది.) అనే బదులు
రాత్రి రేవ వ్యరంసీత్ (రాత్రిగడిచి పోయింది, మాటలు యింకా మిగిలే వున్నాయి)
అని చెప్తే మరీ బాగుంటుంది.
పరస్పరం అనురక్తులైన దంపతుల మాటలు ఎడతెగనివి.అలా ఉంటూనే ఉంటాయి.
రాత్రి జాములు మాత్రం దొర్లిపోతూంటాయి. అని అందమైన భావం వస్తుంది.అన్నాడు
కాళిదాసు.
అవశ్యం మహాకవి! ఎంత అద్భుతమైనమార్పు సూచించారు! అందుకే తమరు కవికుల
గురువులు అన్నాడు ఆనంద భాష్పాలతో భవభూతి.
అదేమీలేదు మీ అంతటివారు మీరు, మహాకవులు.
నాటకేషు చ కావ్యేషు వయం వా వయమేవ వా
ఉత్తరే రామచరితే భవభూతి: విశిష్యతే
నాటక రచనలో, కావ్య రచనలో మాకు మేమె సాటి. ఉత్తరరామచరిత్ర లో మాత్రం
భవభూతి మమ్మల్ని మించి పోయాడు. అని చెప్పక తప్పదు. అన్నాడు కాళిదాసు.
భవభూతి కవిగానే కాక గొప్ప దార్శనికుడిగా కూడా ప్రసిద్ధి పొందినవాడంటారు.
కన్యాకుబ్జ౦ రాజు యశోవర్మ ఆస్థాన కవిగా ఉండేవాడు. ఈయన విదర్భ దేశం వాడని కొందరూ, గ్వాలియర్ ప్రాంతం వాడని కొందరూ,ఆంద్రుడని కొందరూ వాదించారు.
భవభూతి రచనలు మూడూ నాటకాలే.'ఉత్తరరామచరితం' 'మాలతీమాధవం'
'మహావీరచరితం' భవభూతి కరుణరసాన్ని ఎక్కువ అభిమానించాడు.
-----------------------------శుభరాత్రి-------------------------------- 

Total Pageviews