Friday, April 24, 2015

వార్థక్యం

                                                               వార్థక్యం

పరుగెడుతున్న కాలంతో
సరిసమానంగా పరుగెత్తే
వయసు నన్ను వ్యధాసాగరంలో
ముంచెత్తు తూ నే వుంది.
వయసు పెరుగుతుంది
ఆయువు తరుగుతుంది
జవసత్వాలుడుగుతున్నాయ్
పరిస్థితులు చేజారుతున్నాయ్.
నేను ఇష్టంగా కట్టించుకున్న
బొమ్మరింటి లో పరాయినయ్యా
నా అనుకున్న పేగు బంధాలకూ
పరాయినౌతున్నా భారాన్నౌతున్నా!
నా ఇంట్లోనే ఓ మూలన నా అస్తిత్వం
నా గూడనుకున్నదే ఇక అన్యాక్రాంతం
నా స్వతంత్ర్యాన్ని కొల్లగొట్టే వారసత్వం
ఇదేంటని అడిగలేని చేతకాని వార్థక్యం.
తినడానికి తినే తిండికీ లేదు ఇచ్ఛ
కునుకొస్తే పడకకూ లేనేలేదు స్వేచ్ఛ
నేను మాటాడబోతేనే వారికో రోత
పైగా నీ కాలం కాదంటూ మరో వాత.
ఎప్పుడు పోతాడా అంటూ
ఎదురు చూస్తాయి వారి కళ్ళూ
పోక పోతాడా చూద్దాం
అనే ఆశావాదంతో వారి మనసు.
నేను ఎత్తుకు పెంచిన పిల్లలె
నా చావుకు ఎదురు చూస్తుంటే
ఈ భారమైన బతుకే పెను భారం!
ఇంకెందుకి అనవసర జీవన యానం!!

అమ్మ

                                                                     అమ్మ
దేవుడు ఎక్కడో లేడు నిన్ను కన్న అమ్మ రూపం లోనే అనుక్షణం నిన్ను కాపాడుకుంటూ వుంటాడుదేవుడు ప్రతిచోటా ఉండలేడు...ప్రతిరూపంగా అమ్మను సృష్టించాడు. అమ్మ అన్న పేరులోనే ఎంతోతియ్యదనం వుంది.మనకి జీవం ఇచ్చిన దైవం అమ్మ. ప్రాణం పోసిన దేవత అమ్మ.తను చేసే ప్రతిపని మన అనందం కోసమే చేస్తూ మన ఆనందంలోనే తన ఆనందం.. సుఖం.. సంతోషం ..అన్నీచూసుకొని ఆనందించేది అమ్మ. అందమైన అనుబంధం...అంతులేని అనురాగం...మరుపురాని జ్ఞాపకం * అమ్మ*. అన్నింటా ముందుండి మనల్ని మంచి మార్గం లో నడిపించేది అమ్మ. అమ్మ గురించి ఎన్ని చెప్పినా..........ఎంత చెప్పినా తక్కువే..దేవుళ్ళు తాగిన అమృతం కంటే గొప్పది అమ్మ ప్రేమ. ప్రపంచం కూడా చిన్నబోతుంది అమ్మ ప్రేమ ముందు.అలాంటి అమ్మను మనం ఎన్ని జన్మలెత్తినా ఋణం తీర్చుకోలేము. మరో జన్మ వుందో లేదో తెలీదు, కనీసం ఈజన్మలోనైన అమ్మను మనస్పూర్తిగా ప్రేమిద్దాం.... గౌరవిద్దాం. మన ముందు తరానికి ఆదర్శంగా నిలుద్దాం. ఏమంటారు మిత్రులారా ?

లలితా సహస్రనామం ఏ రోజు చదివితే ఎంత ఫలితం వస్తుంది?

             లలితా సహస్రనామం ఏ రోజు చదివితే ఎంత ఫలితం  వస్తుంది?
   ప్రతిరోజూ లలితా సహస్రనామం చదవటంవల్ల మహా ఫలితం వస్తుంది. ప్రతిరోజూ చదవడం వీలుకానివారు ప్రతి శుక్రవారం లలితాసహస్రం చదవాలి. పుణ్య ఘడియల్లో ఈ స్తోత్రం చదివితే ఎన్నో రెట్లు ఎక్కువగా ఫలితం వుంటుంది.అలాగే కుటుంబ సభ్యుల జన్మ నక్షత్ర సమయాల్లో చదివితే కుటుంబశాంతి కలుగుతుంది. పౌర్ణమి నాడు చంద్రున్ని చూస్తూ చదవటంవల్ల సాక్షాత్తు లలితాదేవి ఎదురుగా  చదివినట్లే. లలితా దేవికి కలువలూ, మారేడు దళాలు, తులసీదళాలు, మల్లపూవులు చాలా ఇష్టం. నైవేద్యంగా, పులగము,పాయసము, చిత్రాన్నము, దానిమ్మ, బూడిద గుమ్మడికాయ, దక్షిణావృత శంఖము  ప్రీతి అని పెద్దలు చెపుతారు.  
                      

మార్టిన్ సన్ మూడు కవితలు

మొన్న ఇంటికి వచ్చేటప్పటికి ఎక్కడో దూరదేశాన్నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రియబంధువులాగా హేరీ మార్టిన్సన్ కవితాసంపుటి The Procession of Memories, Selected Poems 1929-1945 నా కోసం ఎదురుచూస్తూ ఉంది.
కొన్నాళ్ళకిందట Chickweed Wintergreen, Selected Poems చదివినప్పణ్ణుంచీ మార్టిన్ సన్ కవిత్వం పట్ల గొప్ప ఇష్టం పెంచుకున్నాను. అందులో ఉన్న కవితలు కొన్ని ఈ పుస్తకంలో కూడా ఉన్నప్పటికీ, అనువాదకులు వేరు కావడంతో మళ్ళా కొత్త కవితలు చదివినట్టే ఉంది. Chickweed Wintergreen రాబిన్ ఫుల్టన్ అనువాదాలు, The Procession of Memories కి లార్స్ నోర్డ్ స్ట్రోం అనువాదకుడు.
హేరీ మార్టిన్ సన్ (1904-1978) స్వీడిష్ రచయిత, కవి, యాత్రాచరిత్రకారుడు. 1974 లో మరొక స్వీడిష్ నవలాకారుడితో కలిసి సాహిత్యానికి గాను నోబెల్ బహుమతి అందుకున్నాడు.
మార్టిన్ సన్ జీవితం కథ కన్నా విచిత్రమైంది.ఆరేళ్ళ వయసులోనే కుటుంబం ముక్కలైంది. తండ్రి క్షయవ్యాథితో మరణించాడు. అఏడుగురు పిల్లల్ని సాకలేక తల్లి అమెరికా పారిపోయింది. పిల్లలంతా తలోదిక్కూ అయిపోయారు. మార్టిన్ సన్ కూడా తర్వాత పదేళ్ళ పాటు రరకాల ఇళ్ళల్లో,పొలాల్లో బతుకుతెరువు వెతుక్కోవలసి వచ్చింది. పదహారో ఏట నావికుడిగా మారాడు. ఆ ప్రయాణాల్లో అమెరికా వెళ్ళవచ్చుననీ, తల్ల్ని చూడొచ్చనీ కోరిక. 1922 లో అమెరికా వెళ్ళడమైతే వెళ్ళాడుగానీ,తల్లిని చూడలేకపోయాడు. 1927 లో మలేరియా బారినపడి క్షయవ్యాధి సూచనలు కనిపించడంతో సముద్రాన్ని వదిలి మళ్ళా స్వీడన్ చేరుకున్నాడు. నిరాశ్రయుడిగా, నిర్భాగ్యుడిగా జీవిస్తుండగా హెల్గా జొహన్సన్ అనే ఒక వామపక్షస్త్రీవాది పరిచయమైంది. ఆమె అతడికన్నా పధ్నాలుగేళ్ళు పెద్దది. ముగ్గురు పిల్లలతల్లి. ఆమె స్టాక్ హోం శివార్లలో ఉన్న తన వ్యవసాయక్షేత్రానికి వచ్చి కొన్నాళ్ళు ఉండమని మార్టిన్ సన్ ని ఆహ్వానించింది. ఆ పరిచయం ప్రణయంగా మారి ఆ మరుసటి ఏడాది వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత 1940 లో వాళ్ళిద్దరూ విడిపోయేదాకా ఆ కాలమంతా మార్టిన్ సన్ జీవితంలో అత్యున్నతమైన, సృజనాత్మకంగా సుసంపన్నమైన కాలం. ఒకదానివెనక ఒకటి అతడు కవిత్వం, నవలలు, వ్యాసాలు, నాటకాలు,రేడియో నాటకాలు రాస్తూనే ఉన్నాడు. కాని అతడికి రాజకీయ నిబద్ధత లేదని అతణ్ణి హెల్గా వదిలిపెట్టేసాక, ఇంగ్రిడ్ లిండ్ క్రాంజ్ అనే ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. 1949 నుంచీ స్వీడిష్ అకాడెమీ సభ్యుడిగా ఉన్నాడు. 74 లో అతడి కవిత్వానికి నోబెల్ బహుమతి వచ్చిందిగాని, ఆ ఎంపిక కమిటీలో అతడు కూడా ఉన్నందువల్ల తీవ్ర విమర్శను ఎదుర్కోవలసి వచ్చింది. దాంతో అతడు రాయడం, ప్రచురించడం మానేసాడు. ఆ విమర్శ మానసికంగా కలిగించిన ఒత్తిడి తట్టుకోలేక నాలుగేళ్ళు తిరక్కుండానే ఒకరోజు హాస్పటల్లో తన పేగులు కత్తిరించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మార్టిన్ సన్ చక్కటి పాఠశాల చదువుకు నోచుకున్నవాడు కాడు. కాని చదువుని ప్రేమించాడు, సాహిత్యాన్ని ప్రేమించాడు. ప్రకృతిని ఆరాధించాడు. భూగోళ,ఖగోళ శాస్త్రాలు అతణ్ణి సమ్మోహితుణ్ణి చేసాయి. నిరాశ్రయంగా గడిచిన బాల్యం, ప్రపంచసముద్రాలన్నిటిమీదా పయనించిన యవ్వనం, ఏళ్ళ తరబడి ఆకాశాన్ని మాత్రమే చూస్తూ ఖండాంతరాల మీద సాగిన జీవితం అతడి దృష్టిని అసీమితం చేసేసాయి.. 'ఒక తుహినకణంలో విశ్వాన్ని దర్శించగల కవిత్వం 'అతడిదని నోబెల్ కమిటీ ప్రస్తుతించింది.
ఒక దిమ్మరిగా,కూలీగా, నిర్భాగుడిగా జీవించినప్పటికీ మార్టిన్ సన్ కవిత్వం సోషలిస్టు తరహా ప్రసంగాలకు పూనుకోదు, నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోదు. ఎంతో ఆరోగ్యవంతంగా, నవనవలాడే పండులాగా, అప్పుడే వికసించిన అడవిపువ్వులాగా, దూరంగా కనవచ్చే దీవి మీద వినవచ్చే తొలిపక్షి కూజితంలాగా కొత్తగా తాజాగా ఉంటుంది. ఏ కవిత చదివినా ప్రాణం లేచివచ్చినట్టుంటుంది.
మార్టిన్ సన్ లానే నేను కూడా తొమ్మిదో ఏటనే ఇల్లు వదిలిపెట్టాను. అతడు తనవికాని దారుల్లో సంచరించినట్టే నేను కూడ నావి కాని దారుల్లో, తీరాల్లో ప్రయాణిస్తూనే ఉన్నాను. అతడిలానే నేను కూడా తల్లి కోసం వెతుక్కుంటూనే ఉన్నాను. అతడిలానే నాకు కూడా పూలూ, ముళ్ళూ అనే తేడా లేకుండా ప్రకృతి మొత్తం ప్రాణప్రదం. బహుశా అందుకేనేమో ఆ కవిత్వం చదువుతుంటే ఒక ఫిన్నిష్ విమర్శకురాలు రాసినట్టుగా Reading poetry is human nearness అని అనిపిస్తుంది.
మార్టిన్ సన్ కవితలు మూడు మీకోసం:
కవిత
ఇప్పుడు మనమీ భూమ్మీద ఒక తాళం వాయిద్దాం
ఆ తాళం మరేదో కాదు, ఒకప్పటి నీ చందమామనే.
వానాకాలపు అడవుల్ని కొమ్ముతో గోరాడినంతకాలం గోరాడి
ఇప్పుడు ఏడు సత్రాలపాటి ప్రమాణానికి పెరిగిపోయాడు
చిత్తడినేలలలోతుల్లోంచో,ఆకాశమంత ఎత్తుల్లోంచో
నువ్వు ఊహించగలిగిన మాటల్లోనే మేం మాట్లాడతాం
వికసించినవో, వాడిపోయినవో నక్షత్రాలకుమళ్ళా ప్రాణంపోసి
నీ చేతుల్లో ఉన్న పువ్వులో కొత్త పరిమళం ఊపిరూదుతాం
తమ్ముడూ, తమ్ముడూ, ఏమైనా రానివ్వు-
దవానలం, బీభత్సం, నేల నాలుగు చెరగులా విప్లవం,
కాని గుర్తుపెట్టుకో,ఎప్పటికీ, ఈ రెండుమాటలూ:
పువ్వుకి పరిమళాలూదు.
స్వగ్రామం
నీ స్వగ్రామంలో వానపాములు గుల్లబరిచిన తోటలో
కాశీరత్నం తీగె ఇంకా పూస్తూనే ఉంది.
ఇళ్ళల్లో పాతాకాలపు పొడవాటి గోడగడియారాలు టిక్కుటిక్కుమంటూనే ఉన్నాయి.
ఇళ్ళ కప్పుల్లోంచి యూపస్తంభాల్లాగా పొగపైకి లేస్తోనే ఉంది.
ఎన్నో సముద్రాల మీద ఎంతో కఠినాతికఠిన జీవితం ముగించుకుని
క్రూరాతిక్రూరమైన తావులన్నీ చూసి వచ్చినవాడికి
ఈ శాంతిమయ గ్రామం ఒక ప్రశాంత అసత్యంగా గోచరిస్తుంది.
కాని ఈ అసత్యానికే జీవితమంతా చుట్టుకుపోవాలనిపిస్తుంది.
ఈ ఒక్క అసత్యం కోసం
ఎన్ని దుష్టసత్యాల్నైనా కాళ్ళతో మట్టేసి రావాలనిపిస్తుంది.
శ్రోతలు
వినడమొక్కటే తెలిసిన ఆ రోజుల్లో
నెగడిచుట్టూ చేరి పెద్దవాళ్ళంతా
అంతిమదినందాకా, ఒక రక్షకుడెవరో
వాళ్ళని శుభ్రపరిచే క్షణంకోసం వేచిచూస్తూ
తమ పాపమయదేహాల్ని చలిగాచుకుంటూ ఉండేవాళ్ళు.
ఎక్కణ్ణుంచో ఒక పిల్లి మావుమనేది, నెగడి రగుల్తుండేది,
పొగగొట్టాలు కూతపెట్టేవి.
కాలుజారిన ఒక పిల్లను తలుచుకుంటూ
ఎవరో శోకభరితంగా గొంతెత్తేవారు.
పళ్ళూడి పొద్దువాటారినవాళ్ళు
పొల్లుపోయిన ధాన్యంగురించో
పురుగుపట్టినపంటగురించో మాట్లాడుకునేవాళ్ళు.
ఆ చిన్నప్పటి నెగడిదగ్గరే నేనిప్పటికీ గడ్డకట్టుకుపోయాను.

Thursday, April 23, 2015

దిక్కులు మూలలు తెలుసుకోవడం ఎలా?



మది శారదా దేవి మందిరమే చిన్నారి పాటను మరియు సినిమా పాటల లింకులు

మహా గాయకులు సైతం సాహసించని 'మది శారదా దేవి మందిరమే' పాటను ఈ చిన్నారి గమకాలను అలవోకగా గిరికీలు కొట్టిస్తూ ఎలా పాడుతూ మన మదిని దోచు కుంటున్నాడో, పిల్లలు నేర్వగ రాని విద్యకలదె ముద్దార నేర్పింపగన్...మన పిల్లలకీ ఇటువంటి పాటలు పరిచయం చేసి పాడిద్దామా 
ఈ దిగువ ఆ చిన్నారి పాటను మరియు సినిమా పాటల లింకులు  
మీ మది ఆనందం కోసం  వెంటనే ఈ రెండు యు ట్యూబ్ లింక్ లు నొక్కి ఆస్వాదించండి.  అలాగే ఈ దిగువన ఈ పాట సాహిత్యం కూడా అందిస్తున్నాము. పిల్లలచే అభ్యాసం చేయించండి.      
చిన్నారి పాట: https://www.youtube.com/watch?v=bLiz6364eGc
సినిమా పాట : https://www.youtube.com/watch?v=ZpgcmWqwX5U  అలాగే  ఈ పాట సాహిత్యం కూడా అందిస్తున్నాము. పిల్లలచే అభ్యాసం చేయించండి.    

పల్లవి:

...దిననన తానా...
........రి..నన...

మది శారదా దేవి మందిరమే...
మది శారదా దేవి మందిరమే...
కుదురైన నీమమున కొలిచేవారి...
మది శారదా దేవి మందిరమే... ... ..

చరణం 1:

రాగ భావమమరే గమకముల...
... ... .. ... .....
రాగ భావమమరే గమకముల...
రాగ భావమమరే గమకముల...
రాగ భావమమరే గమకముల...

నాద సాధనలే దేవికి పూజా..
... ... ..
నాద సాధనలే దేవికి పూజా..
నాద సాధనలే దేవికి పూజా..
నాద సాధనలే....
... ... .. ... .....
నాద సాధనలే...
... ... .. ... .....
నాద సాధనలే..
... ... ... .. ... .....
నాద సాధనలే దేవికి పూజా..
... ... .. ... .... ..
... ... .. ... .... ..
నాద సాధనలే దేవికి పూజా..

తరళతానములే హారములౌ...... ...
తరళతానములే హారములౌ....
తరళతానములే హారములౌ...
తరళతానములే హారములౌ...

సరిస రిసరిస నిసనిస గరిగ సనిదనిరిగ రిగ
మగమనిదని రిగ రిగ గమగ మగమనిదని
రిగ రిగ సమగదమనిదని రిగ రిగ
రిగ రిమగదపనిస రిగ రిగ
సరిసని నిసనిద పమగరిస
నిసనిదప మగరిస రిప
గరినిదప గరిససద..
గరిగగరిని గరిగ నిరిని
నిగనిరిని నిగనిరిని
నిగనిరిని నిగనిగనిరిని
మగ మమగ దపమగ నిదపమపగ
సనిదపమగ గరిసనిస నిసనిదప సనిదపమగ

తరళతానములే హారములౌ...
వరదాయిని కని గురుతెరిగిన
మన మది శారదా దేవి మందిరమే...
కుదురైన నీమమున కొలిచేవారి...
మది శారదా దేవి మందిరమే... ... ..

1959 లో విడుదలైన జయభేరి చిత్రంలో నాగేశ్వర రావు బృందం ఎంతో తన్మయత్వంతో అభినయించారు. మల్లాది గారు రాసిన ఈ పాటకి నేపధ్య సంగీతం  పెండ్యాల గారు అందిస్తే, ఘంటశాల, పి. బి. శ్రీనివాస్, రఘునాథ పాణీ గార్లు నేపధ్య గానం అందించి ఈ పాటకి ప్రాణ ప్రతిష్ట చేసి, అమృతత్వంతో  అజరామరం చేసారు. --- సత్యసాయి విస్సా ఫౌండేషన్

భధ్రుడు గారి ఒక అనువాద అనుభూతి కవిత


"నీ చూపు చాలమ్మా ఎందుకు వెన్నెలలు నీ నవ్వు చాలమ్మా ఎందుకు వేకువలు" ఒక కవి అన్నాడు. మా విశ్వ కవి మిత్రుడు భద్రుడు రాసిన ఒక పదం చాలు. మన మనోపధంలో నిలిచి పోవడానికి ఒక వాక్యమైనా మహా కావ్యం! ప్రపంచ సాహిత్యానికి మహా భాష్యం చెప్పే భావకవి... అనుభవకవి!  అనుభూతి కవి! ఆ భవభూతి కవి!! మిత్రమా వెయ్యేళ్ళు వర్దిల్లుమా!!!  

నిన్న Ramarao Kanneganti ఫేస్ బుక్ లో ఇన్నిస్ ఫ్రీ చెరువు
చెరువుదగ్గరికి వెళ్ళి ఫొటో తీసి 'భద్రుడూ, ఇది మీ శరభవరం ' అని రాసి నన్ను సంతోష సంభ్రమానికి గురిచేసాడు.
ఆ వాక్యం చూసినప్పుడు కలిగిన ఆ పులకింత రోజంతా అట్లానే ఉంది. రాత్రి భోజనాలప్పుడు విజ్జికీ, పిల్లలకీ చెప్పాను కూడా. ఎక్కడి శరభవరం, ఎక్కడి ఇన్నిస్ ఫ్రీ సరోవరం!
సాహిత్యమే కదా ఒక సేతువు కట్టింది.
ఆ వాక్యం మళ్ళా మళ్ళా గుర్తొస్తున్నప్పుడల్లా నాకు మరెన్నో స్థలాలు కాలాలూ మదిలో మెదుల్తూ ఉన్నాయి. చీనాలో ఒకప్పుడు తాంగ్ రాజవంశానికి రాజధానిగా ఉన్న చాంగాన్ ( ఇప్పటి క్సియాన్ ) లో దు-ఫూ, లి బాయ్ లు కవిత్వం చెప్పిన రోజులు, ఉత్తర జపాన్ లో సైగ్యొ కవీంద్రుడు నడిచిన దారుల్లో బషొ కూడా వర్ణించిన శిరాకవా సరిహద్దు, అక్కడి విల్లో చెట్టూ, గొగోల్, డాస్టవస్కీ, టాల్ స్టాయి ల మొదలుగా ప్రతి రష్యన్ మహారచయితా వర్ణించిన సెంట్ పీటర్స్ బర్గ్ వీథులు, బ్యునోస్ ఎయిర్స్ నేషనల్ లైబ్రరీ నేలమాళిగలో బోర్హెస్ తడుములాడిన పుస్తకాల అల్మైరాలు, - ఇలాంటివే ఎన్నో మదిలో మెదిలాయి.
రామారావు కన్నెగంటి వీటన్నిటినీ నా కళ్ళతో చూడాలి,చూసిన ప్రతి తావునుంచీ నాకో సందేశం పంపాలి.
అదీ కాక, వసంతంలో తోలివసంతం నుంచి మలివసంతానికి మలుపు తిరిగే ఈ చైత్రవైశాఖాల సరిహద్దులో నిలబడినప్పుడు నాకు బ్రౌనింగ్ కవి వాక్యాలే పదేపదే గుర్తొస్తూన్నాయి:
O to be in England
Now that April's there
And whoever wakes in England
Sees, some morning unaware
That the lowest boughs and the brushwood sheaf
Round the elm tree bole are in tiny leaf,
While the chaffinch sings on the orchard bough
In England -now!
And after April, when May follows,
And the whitethroat builds and all the swallows!...
ఆ వాక్యాలు నాలో ఈ వాక్యాల్ని కదిలిస్తూన్నాయి.
వైశాఖం ప్రవేశించినప్పుడు
ఉండవలసింది నువ్వా కొండల్లో
ఇక్కడ నగరవీథుల్లో
దట్టంగా పరుచుకున్న చెట్టునీడలు
నీకు తూర్పుకనుమలుగానే గోచరిస్తాయి.
వేసవిరాత్రుల్లో మీ ఊళ్ళో నాటకాలు వేసేవాళ్ళు
రాత్రి పదిగంటలెప్పుడవుతుందా అని రోజంతా చూసేవాడివి
అప్పుడు మాసిన కోరారంగు తెరవెనక
వాళ్ళు హారతిపట్టి 'పరబ్రహ్మ పరమేశ్వర 'అనగానే
నీలో ఒక నిండారు జలపాతం.
ఇప్పుడు తురాయి చెట్లగుబుర్లలో
తొలి ఎరుపురేకలట్లా హారతివెలిగించాయి.
ఇప్పుడు నువ్వు ప్రాచీన చీనానగరం చాంగాన్ లోనే ఉన్నావు
వీథుల్లో రాలుతున్న పసుపు పూలమధ్య నడుస్తూ
ప్రాచీన చీనాకవిలా నువ్వు కూడా
కొండమీద అతిథి ఇంకా నిద్రలేవలేదనుకుంటావు.
రోజులెంత నిర్దయగా,
నిస్సారంగానైనా గడవనివ్వు,
కాని ప్రతి వైశాఖం నీకోసం
గుప్పెడు శనగల్లాగా
వేసవి సోమరిక్షణాల్ని
పట్టుకొస్తూనే ఉంటుంది.

Total Pageviews