Friday, April 24, 2015

వార్థక్యం

                                                               వార్థక్యం

పరుగెడుతున్న కాలంతో
సరిసమానంగా పరుగెత్తే
వయసు నన్ను వ్యధాసాగరంలో
ముంచెత్తు తూ నే వుంది.
వయసు పెరుగుతుంది
ఆయువు తరుగుతుంది
జవసత్వాలుడుగుతున్నాయ్
పరిస్థితులు చేజారుతున్నాయ్.
నేను ఇష్టంగా కట్టించుకున్న
బొమ్మరింటి లో పరాయినయ్యా
నా అనుకున్న పేగు బంధాలకూ
పరాయినౌతున్నా భారాన్నౌతున్నా!
నా ఇంట్లోనే ఓ మూలన నా అస్తిత్వం
నా గూడనుకున్నదే ఇక అన్యాక్రాంతం
నా స్వతంత్ర్యాన్ని కొల్లగొట్టే వారసత్వం
ఇదేంటని అడిగలేని చేతకాని వార్థక్యం.
తినడానికి తినే తిండికీ లేదు ఇచ్ఛ
కునుకొస్తే పడకకూ లేనేలేదు స్వేచ్ఛ
నేను మాటాడబోతేనే వారికో రోత
పైగా నీ కాలం కాదంటూ మరో వాత.
ఎప్పుడు పోతాడా అంటూ
ఎదురు చూస్తాయి వారి కళ్ళూ
పోక పోతాడా చూద్దాం
అనే ఆశావాదంతో వారి మనసు.
నేను ఎత్తుకు పెంచిన పిల్లలె
నా చావుకు ఎదురు చూస్తుంటే
ఈ భారమైన బతుకే పెను భారం!
ఇంకెందుకి అనవసర జీవన యానం!!

No comments:

Post a Comment

Total Pageviews