Friday, April 10, 2015

జ్జానపీఠ కమిటీ కి తెలుగురచయితల జాబితా



రెండేళ్ళ కిందట కన్నడ రచయిత చంద్రశేఖర కంబార కి జ్జానపీఠ వచ్చినప్పుడు ( నా దృష్టిలో) ఆయన స్థాయి కన్నా మించిన తెలుగురచయితల జాబితా ఒకటి నాకై నేను తయారు చేసుకున్నాను. వారి గురించి వివరంగా రాసి జ్జానపీఠ కమిటీ కి పంపాలనుకున్నాను. కానీ నా సోమరితనంతో నేను చేయలేకపోయిన మంచిపనుల్లో అదీ ఒకటి. అయినా ప్రస్తావన ఇప్పుడు వచ్చింది కాబట్టి, ప్రాధాన్యతా క్రమంలో నేను తయారు చేసుకున్న జాబితా ఇది:
1. దాశరథి రంగాచార్య (జీవనయానం,2000): 
2. కాళీపట్నం రామారావు: (కాళీపట్నం రామారావుకథలు,1999)
3. ఆవంత్స సోమసుందర్: వజ్రాయుధం
4.బాలాంత్రపు రజనీకాంతరావు ( రజనీకాంతరావు గీతాలు)
5.మునిపల్లె రాజు ( అస్తిత్వనదం ఆవలితీరాన కథలు)
6.సామలసదాశివ (యాది)(ఇప్పుడీయన కీర్తిశేషులు)
7.అబ్బూరి ఛాయాదేవి ( ఛాయాదేవి కథలు)
8.ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (సుపర్ణ: దీర్ఘకావ్యం)
9. డా.పి.కేశవరెడ్డి (మూగవాని పిల్లంగోవి,1995)
10. శీలావీర్రాజు (పడుగుపేకల మధ్య జీవితం)
11. నగ్నముని ( కొయ్యగుర్రం)
12. కె.శివారెడ్డి ( సమగ్రకవిత్వం)
13. పెద్దిభొట్ల సుబ్బరామయ్య (కథలు)
14. పి.సత్యవతి (పి.సత్యవతి కథలు)
15. కొలకలూరి ఇనాక్ (మునివాహనుడు)
కొందరు విప్లవరచయితలు వరవరరావు, గద్దర్, కల్యాణరావు వంటివారి కృషి కూడా గొప్పదేగాని వారు అవార్డులకి విముఖులు కాబట్టి వారి పేర్లు ఎంపికచేసుకోలేదు.
ఇప్పటికైనా నలుగురైదుగురు ఔత్సాహికులు కూర్చుని ఇటువంటి జాబితా ఒకటి తయారు చేసి దేశవ్యాప్త ప్రచారంలో పెడితే బాగుంటుందేమో చూడండి.

No comments:

Post a Comment

Total Pageviews