ఒక మంచి కవి, రచయిత, విమర్శకుడు, తత్వవేత్త నిత్య సాహిత్యాన్వేషి, వక్త, నిరాడంబరుడు ఇలా ఎన్నెన్నో సుగుణాల గని శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారి రచనలు మీకోసం.
ఒక మంచి కవి, రచయిత, విమర్శకుడు, తత్వవేత్త నిత్య సాహిత్యాన్వేషి, వక్త, నిరాడంబరుడు ఇలా ఎన్నెన్నో సుగుణాల గని శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారి రచనలు మీకోసం.
మీరు ప్రేమలో పడ్డప్పుడు కొంతదూరం పోయాక
మీరిద్దరే ఉన్నట్టు గ్రహిస్తారు, చుట్టూ కెరటాలు
చిన్న తెప్ప, తీరం సుదూరం. మీకొక ఏకాంతం
దొరికిందని పులకిస్తూనే పునరాలోచనలో పడతారు
మీరిద్దరే ఉన్నట్టు గ్రహిస్తారు, చుట్టూ కెరటాలు
చిన్న తెప్ప, తీరం సుదూరం. మీకొక ఏకాంతం
దొరికిందని పులకిస్తూనే పునరాలోచనలో పడతారు
చలితహృదయాల చప్పుడు తప్ప మరేదీ వినబడని
నిశ్సబ్దంలో మీలో ఎవరో ఒకరిలా అంటారు:'గుండె
చేతుల్లోపెట్టుకుని ఈదుతున్నట్టుంది. పగిలిపోకుండా
కాపాడుకోడానికి,ఇది ప్రేమ,గాజుసామానుకాదు.'
నిశ్సబ్దంలో మీలో ఎవరో ఒకరిలా అంటారు:'గుండె
చేతుల్లోపెట్టుకుని ఈదుతున్నట్టుంది. పగిలిపోకుండా
కాపాడుకోడానికి,ఇది ప్రేమ,గాజుసామానుకాదు.'
కాని గ్రహించాలి మీరు, అప్పుడప్పుడు ప్రేమ కూడా
జ్వరపడుతుంది. నిలబడలేకపోతుంది,నిస్సత్తువ
ఆవహిస్తుంది,అప్పుడు రాత్రంతా కళ్ళల్లో ఒత్తులు
వేసుకుని మీరిద్దరే కనిపెట్టుకు చూసుకోక తప్పదు
జ్వరపడుతుంది. నిలబడలేకపోతుంది,నిస్సత్తువ
ఆవహిస్తుంది,అప్పుడు రాత్రంతా కళ్ళల్లో ఒత్తులు
వేసుకుని మీరిద్దరే కనిపెట్టుకు చూసుకోక తప్పదు
ఒక భాషలో కవిత్వం మరో భాషలోకి అనువాదమయ్యేటప్పుడు అన్నిటికన్నా ముందు నష్టపోయేది సంగీతమనేది అందరూ అంగీకరించిన విషయమే. ఆ మాట నేనింతకు ముందు రాసాను కూడా. భాషల పరిమితుల్ని దాటి ప్రవహించేవి మెటఫర్, మూడ్,భావజాలం మాత్రమే అని కూడా రాసాను.
మెటఫర్ గురించి గతంలో నా ఆలోచనలు కొన్ని పంచుకున్నాను. మూడ్ గురించి కూడా రాస్తూ అల్లసాని పెద్దన పద్యం గుర్తు చేసుకున్నాను. కవిత్వంలో మూడ్ ని నిజంగా నిలబెట్టేది కవిత్వసంగీతమే. ఆ మాటే మరింత స్పష్టంగా, రాజీలేకుండా చెప్తున్నాడు జాన్ ఫ్రెడెరిక్ నిమ్స్ అనే భావుకుడు.
‘పొయెమ్స్ ఇన్ ట్రాన్సలేషన్: శాఫొ టు వేలెరీ’ (1990) అనే తన అత్యద్భుతమైన పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో అతడిలా రాస్తున్నాడు:
'ప్రాధాన్యత గురించి తేల్చుకోవలసివస్తే, కవిత్వ రూపం కవిత్వ విషయాన్ని నిర్దేశిస్తుంది తప్ప, విషయం రూపాన్ని కాదు.'
అతడనేది చిరకాలంగా భారతీయ సాంప్రదాయిక లాక్షణికులు చెప్తున్నదే. కవిత్వ భాష, ఛందస్సు, లయ, కాకువు-ఇవి కవిత్వానికి సంతరించే సౌందర్యం అనువాదం సంగతలావుంచి, ప్రతిపదార్థానికి కూడా లొంగేది కాదు.
'గుండె గొంతుకలోన కొట్లాడతాది
కూకుండనీదురా కూసింత సేపు.'
కూకుండనీదురా కూసింత సేపు.'
'దేశమనియెడు దొడ్డవృక్షము
ప్రేమలను పూలెత్తవలనోయ్'
ప్రేమలను పూలెత్తవలనోయ్'
'ప్రళయజీమూతోరు గళఘోరగంభీర
ఫెళఫెళార్భటులలో మెరపేలా'
ఫెళఫెళార్భటులలో మెరపేలా'
'సలసల కాగే చమురా
కాదది ఉష్ణరక్త కాసారం'
కాదది ఉష్ణరక్త కాసారం'
నిజమే ఈ వాక్యాల్ని మామూలుగా వివరించి రాసినా కూడా వాటి ప్రభావం తొంభైతొమ్మిది శాతం నష్టమైపోతుంది.
నిమ్స్ ఇలా రాస్తున్నాడు:
‘పదేపదే మనకు కవులు మనకి చెప్తున్న సాక్ష్యమేమంటే (ఒక కవితలో) పడుతున్న పదాలు కేవలం భావం వల్ల మాత్రమే కాక ఛందస్సు వల్ల కూడా పడుతున్నాయి. గొథే సంగతే చూడండి. ఆయన కవితలు నేరుగా ఆయన జీవితానుభవాల నుంచే పుట్టుకొచ్చినట్టు కనిపిస్తాయి. కాని ఆయన కూడా ఛందస్సు గురించి చింతించకపోలేదు. 'రకరకాల ఛందోరీతుల్ని ఉపయోగించడం వల్ల గాఢమైన, అనూహ్యమైన ఫలితాలని (mysterious and great effects) రాబట్టవచ్చు ' అనిరాసాడాయన.’
అందుకని నిమ్స్ అనేదేమంటే అనువాదకులు కవితల్లోని భావం మీద మాత్రమే కాక, ఆ శబ్దసంగీతం మీద కూడా దృష్టిపెట్టకతప్పదని. తను నిర్దేశిస్తున్న ఈ సూత్రానికి అనుగుణంగా తనే శాఫో నుండి వాలెరీ దాకా 30 మందికి పైగా యూరోపియన్ కవుల్ని అనువదించి చూపించాడు. కాని మూలకవితలోని సంగీతాన్ని ఇంగ్లీషులోకి అనువదించడంలో ఉండే నిర్మాణపరమైన, భాషాపరమైన పరిమితుల గురించి అతడికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ఉదాహరణకి డాంటే డివైన్ కామెడిలోంచి కొన్ని భాగాలు అనువదిస్తూ అతడు చెప్పిందేమంటే, డాంటే వాడిన ఛందస్సులో ప్రతి పాదం 11 గురులఘువులతో కూడిఉంటుందనీ, ఇటాలియన్ లో పదజాలం దాదాపుగా రెండు లేదా అంతకంటే ఎక్కువ గురులఘువులతో కూడిఉన్నందున ఆ అమరిక సరిపోతుందని అంటాడు.
కాని ఇంగ్లీషులో చాలా పదజాలం ఏకమాత్ర గురులఘువులతోనే ఏర్పడుతుంది కాబట్టి పదకొండుపాదాల ఇటాలియన్ పద్యపాదానికి ఎనిమిది గురులఘువుల ఇంగ్లీషు వాక్యం సరిపోతుందంటాడు. కాని మామూలుగా డాంటే ని ఇంగ్లీషు ఛందస్సులోకి అనువదించేవాళ్ళు అయాంబిక్ పెంటామీటర్ లోకి తీసుకురాకతప్పదు కాబట్టి ప్రతివాక్యంలోనూ అనవసరంగా మరికొన్ని అక్షరాల్ని చేర్చకతప్పని పరిస్థితి ఎదురవుతుందటాడు. దాంతో మూలవాక్యంలోని mysterious and great effects అనువాదంలో అదృశ్యం కాక తప్పదంటాడు.
కాని ఇంగ్లీషులో చాలా పదజాలం ఏకమాత్ర గురులఘువులతోనే ఏర్పడుతుంది కాబట్టి పదకొండుపాదాల ఇటాలియన్ పద్యపాదానికి ఎనిమిది గురులఘువుల ఇంగ్లీషు వాక్యం సరిపోతుందంటాడు. కాని మామూలుగా డాంటే ని ఇంగ్లీషు ఛందస్సులోకి అనువదించేవాళ్ళు అయాంబిక్ పెంటామీటర్ లోకి తీసుకురాకతప్పదు కాబట్టి ప్రతివాక్యంలోనూ అనవసరంగా మరికొన్ని అక్షరాల్ని చేర్చకతప్పని పరిస్థితి ఎదురవుతుందటాడు. దాంతో మూలవాక్యంలోని mysterious and great effects అనువాదంలో అదృశ్యం కాక తప్పదంటాడు.
ఈ సమస్యని ఎదుర్కోవడమెట్లా? ఈ ప్రశ్న మీద అతడు చేసిన ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది. అతడిట్లా రాస్తున్నాడు:
'..అనువాదకుడు మనముందుకు తీసుకువచ్చే సమ్మోహనశీలకృతి అంతిమంగా కొన్ని నిర్ణయాల మీద ఆధారపడిందే. నిర్ణయాలు: దేన్ని సాధించడానికి దేన్ని వదిలిపెట్టాలి? అన్నిటికన్నా ముఖ్యమైన కవితా 'సమగ్రత ' ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అనువాదం కూడా మూలకృతిలాగా ఉండక తప్పదు.అటువంటప్పుడు మనం ఒక కవితని అనువదించడంటే ఆ కవితని మళ్ళా పునర్నిర్మిస్తున్నామని అనుకోవాలి. లేదా మరో రకంగా కూడా చెప్పుకోవచ్చు. వైద్యశాస్త్రంలో లోలాగా రక్తమార్పిడి చేయడం. అంటే, మూలకవితలోని మొత్తం రక్తం బయటకు తీసేసి అనువాదకుడు కొత్త రక్తం ఎక్కించడం. కాని అటువంటి పరిస్థితుల్లో ఆ కవిత బతకాలంటే ఆ కవితలో నింపడానికి ఆ అనువాదకుడికి తనదంటూ రక్తముండాలి. చాలాసార్లు అటువంటి రక్తం ప్రసరించదు కాబట్టే ఎన్నో అనువాదాలు పాలిపోయిన కళేబరాల్లా కనిపిస్తాయి. ఈ సమయంలో మనం మళ్ళా వాలెరీ కేసి చూడక తప్పదు. సెయింట్ జాన్ ఆఫ్ క్రాస్ ని ఫ్రెంచి లోకి అనువదిస్తూ వాలెరీ ఇలా అన్నాడు: 'ఇక్కడ అనువాదం చెయ్యడమంటే, ఒక భాష, అంటే ఒక స్పానిష్ కృతి అనే కారణం ఇవ్వగల ఫలితానికి సమానమైన ఫలితాన్ని మరొక భాషాకృతి అంటే ఫ్రెంచి అనువాదం ద్వారా రాబట్టాలని చూడటమన్నమాట.' కాబట్టి ఏదైనా కవితానువాదం చూసినప్పుడు మనం అడగవలసిన ప్రశ్న ఈ అనువాదం మూలవిధేయంగా ఉందా లేదా అని కాదు, ఇది మూలకృతి చూపుతున్న ప్రభావానికి సమానమైన ప్రభావాన్ని (equivalent effect)చూపుతున్నదా లేదా అని మాత్రమే. ఇంకా చెప్పాలంటే, మూలకృతి చూపుతున్న ప్రభావానికి దాదాపుగా సమానమైన ప్రభావాన్ని (reasonably equivalent effect) చూపిస్తున్నదా లేదా అని మాత్రమే.'
ఈ అంతర్దృష్టి అద్భుతంగా ఉంది. టాగోర్ కి ఇంగ్లీషు ఛందస్సుల గురించి అవగాహన లేదనీ, అందువల్లనే గీతాంజల్ని ఇంగ్లీషులో వచనంగా మార్చాడనీ, అలా కాక ఆ కవితల్ని ఇంగ్లీషు ఛందస్సుల్లోకి అనువదించి ఉండిఉంటే అవి మరింత రాణించి ఉండేవని శ్రీ శ్రీ ఒక చోట రాసాడు. కాని అదే శ్రీశ్రీ తన కవితల ఇంగ్లీషు అనువాదాలతో ఇంగ్లీషు, అమెరికన్ పాఠకుల్ని ఆకట్టుకోలేకపోయాడు. కాని కాలం టాగోర్ నిర్ణయాన్నే సమర్థించిందని నేడు మనకు తెలుస్తోంది. ఎందుకంటే తన బెంగాలీ గీతాల్ని ఇంగ్లీషులోకి అనువదిస్తున్నప్పుడు టాగోర్, వాటిని తెలుగు చేస్తున్నప్పుడు చలం దృష్టి పెట్టింది ఆ reasonably equivalent effectమీదనే.
చివరగా నిమ్స్ మరొకసారి వాలెరీని గుర్తు చేస్తాడు. 'మనం ఏ కవితనీ నిజంగా ముగించలేం. మనం చెసేదల్లా దాని నిస్పృహతో వదిలిపెట్టెయ్యడమే ' అని వాలెరీ అన్నాడట (A poem is never finished. It is abandoned in despair). ఆ వాక్యాన్నే గుర్తుచేస్తూ నిమ్స్ కూడా మనం నిజంగా ఏ అనువాదాన్నీ జయప్రదంగా పూర్తిచేయలేమనీ, ఏదో ఒక క్షణాన్న దాన్ని అశక్తతతో వదిలిపెట్టక తప్పదనీ అంటాడు.
ఈ వాక్యం సత్యమే అయిఉండవచ్చుగానీ,. అత్యంత నిరాశాపూరితంగానూ, నిరుత్సాహకరంగానూ ఉన్నమాట కూడా కాదనలేం. కాని తనకు తెలియకుండానే నిమ్స్ ఇంతకన్నా గొప్పవాక్యమొకటి రాసాడు:
'కవితలకి ఏదో ఒక అర్థం, సందేశం కన్నా ముందు తమకంటూ ఒక అస్తిత్వముంది. అనువాదకుడు మనకి చూపడానికి ప్రయత్నిస్తున్నది, అన్నిటికన్నా ముందు, ఆ అస్తిత్వాన్నే.' (Poems have, we know, not only meaning, but being. It is this very being of the poems that a translator is trying to give us.)
No comments:
Post a Comment