Monday, April 20, 2015

నాకు నచ్చిన కొత్త కవికోకిల కవితా కూజితాలు

 మానస,,మగువ
. .... .... .......
.
ముకుళము విచ్చిన"ముగ్ధ"సౌందర్యమా
ముత్యాల చిరునవ్వు నిత్యవిలసితమా.!
మరాలి జవరాలు"మణిగణ"శోభితమా
మాతంగినోర్పుల మల్లెమాలల లలితమా.!
శాంతగుణతేజస్సు దవళవర్ణ"చేతనమా
మందార అందాలు"మెడనేయ"నవ్యమా!
సొగసరి గడసరి చిలుకల "ఆడతనమా"
సఖల,సుఖభోగాల,తావి నిజ దేహమా.!
రజనికాంతుని రజిత మోహనవదనమా
గారాలకోయిలతీపి రాగాల మాధుర్యమా!
నిత్యసుందర క్రొంగొత్త కోమలి అందలమా
హత్తుకోవాలనే మనసారాటాల వరమా.!
తరగణి మగ మొగసాల భాండారమా
నవయవ్వన శిరోమణి నవ్వులపూబోణి!
.
. రాజేందర్ గణపురం
. 23/ 09/ 2015
. 00973 39029472


నా ప్రియ మిత్రులు శ్రీ రాజారామ్ తూముచర్ల గారికి సుకుమార ఎద స్పర్శతో ఈ కవితా రస సాంత్వన : Rajaram Thumucharla
తుషార చుంబనం !!
విరబోసి ఆరబెట్టుకుంటున్న కురులను 
నేను తనకేసి రావడం చూసి
చిన్నగా కుడివైపుకు తల విసురుతూ
వెనక్కు పంపబోయింది ...

అప్పటి వరకూ కొసలో వేలాడిన
ఓ చిట్టి నీటి మూట ఎగిరి వచ్చి
నా కింది పెదవి మీద పడింది.

ఆమె ఏటవాలు చూపు
నా కళ్ళల్లోంచి నా అంతరంగం
లోలోపలికి చూస్తోంది.
జేబుగుడ్డతో తుడిచేసుకోవచ్చు
దాన్ని జారనీయకుండా
నేను నా పై పెదవితో పొదవి పట్టేసాను.
ఆమెలో వేయి జలపాతాల పారవశ్యం
నాలో గోరువవెచ్చని ప్రేమానుబంధం.


 నీ వెవరో
. .........
.
పుట్టకొమ్మకు పెట్టిన
తేనేపట్టుకు తోబుట్టువువో...!

వెన్నెల రెమ్మకు బూసిన
సన్నజాజి కుసుమానివో...!

అమరులు గ్రోలు అమృతానికి
ఇష్టమైన చుట్టానివో...!

మందార మకరంద గందములచే
మర్యాదనందుకొను నిచ్చెలివో...!
సుజల విమల మలయ మారుతానికి
గౌరవ స్వాగత అథితివో...!
జలతరంగ భంగిమ అందాలకు
దగ్గరి మంజు మంజుభాషినివో...!
సుగందానీవో..! సురుచిరానివో..!
సురులకు జిక్కని ..! చక్కని
స్త్రీ జాతిలో మేటివో..!
నీ "వెవరో" కదా చెలీ...!!!!
.
.
. రాజేందర్ గణపురం
. 21/ 04/ 2015


ఓయమ్మా.....................
చిరు నవ్వుల పందిరివమ్మా 

సిరిమవ్వపు మాటల బొమ్మా
కమ కమ్మని పాటల కొమ్మా
కనికట్టులు చేసేవమ్మా

నలువరాణి చలువ వెన్నెల
నీమోమున విరిసినేమో
చిత్తరువును చూసిన క్షణమే
కవిత కలువ పూచేనమ్మా
విరబోసిన కురుల రాత్రిలో
దరహాసపు విద్యుద్వల్లరి
తడియారిన ఎడద బీడుపై
స్వరసుధలను చల్లేవమ్మా
తెలుగుపాట పూలతోటలో
విహరించే శుకపిక స్వరమా
తెలుగు వీట రస వేదుల పై
సమ్మోహన స్వరఝరివమ్మా

No comments:

Post a Comment

Total Pageviews