Sunday, April 26, 2015

జీర్ణము...జీర్ణము వాతాపి జీర్ణము అని ఎందుకు అంటారు?

                       జీర్ణము...జీర్ణము వాతాపి జీర్ణము  అని ఎందుకు అంటారు?

                             దండకారణ్యంలో ఇల్వలుడు, వాతాపి  అనే రాక్షస సోదరులు ఉండేవారు. వారిరువురూ అరణ్యం లోకి వచ్చే పోయేవారిని మాయమాటలతో పిలుచుకు వచ్చి వాతాపి మేకలా మారిపోతాడు. ఇల్వలుడు మేకను కోసి వండి వడ్డిస్తాడు. భోక్త తిన్నతరవాత ఇల్వలుడు వాతాపి బయటకురా అని పిలిస్తే వాతాపి భోక్త కడుపు చీల్చుకుని బయటకి వస్తాడు. అప్పుడు వారిద్దరూ కలసి ఆ భోక్తను భుజిస్తారు.

                           అగస్త్యుడికి ఈ విషయం తెలిసి భోక్తలా వెడతాడు. ఎప్పటిలానే ఇల్వలుడు వాతాపిని వండి వడ్డిస్తాడు. అగస్త్యుడు భుజించిన తర్వాత " వాతాపి బయటకిరా " అంటాడు. అప్పుడు అగస్త్యుడు ఇంకెక్కడి వాతాపి ....ఎప్పుడో  జీర్ణమయిపోయాడు. " జీర్ణము ,జీర్ణము వాతాపి జీర్ణము " అంటూ పొట్టను రుద్దుకుంటాడు. ఆ విధంగా అగస్త్యుడు వాతాపిని జీర్ణం చేసుకుని ఇల్వలుడ్ని బూడిద చేస్తాడు. 

                                     ఎంత చెడుప్రభావం కలదైనా, అరగానిది అయినా  " జీర్ణము ,జీర్ణము వాతాపి జీర్ణము "  అంటే అరుగుతుంది. అందుకనే ప్రతి తల్లి  పిల్లలకి భోజనం పెట్టి పూర్తయిన తర్వాత పిల్లల   పొట్ట మీద చేత్తో రాస్తూ  " జీర్ణము ,జీర్ణము వాతాపి జీర్ణము, ఏనుగు తిన్న వెలగకాయలు జీర్ణము, గుర్రం తిన్న గుగ్గిళ్ళు జీర్ణం,  మాబాబు ( మా పాప) తిన్న అన్నం జీర్ణం అని అంటూ వుంటుంది. 

No comments:

Post a Comment

Total Pageviews