ఒక మంచి కవి, రచయిత, విమర్శకుడు, తత్వవేత్త నిత్య సాహిత్యాన్వేషి, వక్త, నిరాడంబరుడు ఇలా ఎన్నెన్నో సుగుణాల గనిని మిత్రుడుగా పొందడం నా పూర్వజన్మ సుకృతం.
విశ్వ సాహితీ సాగర తీరం వెంబడి దేశ దేశాల లంగరు వేసి ఓడలలో విజ్ఞానాన్ని తరలించ దానికి సహజ సిద్దముగా ఏర్పడిన ఓడరేవు మా వాడ్రేవు! పేరుకి చినవీరభద్రుడు వాగర్ధాల వివరింపగా ఆనందతాండవమాడు ఆ వీరభద్రుడు!!
1
వసంతంలో పూచిన పదివేల పుష్పాలు
వసంతంలో పూచిన పదివేల పుష్పాలు, శారదకౌముది
వేసవిసాయంకాలాల గాలి, మాఘమాసపుమంచు.
వ్యర్థాలోచనల్తో నీ మనసుమీద ఎప్పుడు మబ్బుపట్టదో
అదే నీ జీవితంలోకెల్లా అన్నిటికన్నా గొప్ప ఋతువు.
వేసవిసాయంకాలాల గాలి, మాఘమాసపుమంచు.
వ్యర్థాలోచనల్తో నీ మనసుమీద ఎప్పుడు మబ్బుపట్టదో
అదే నీ జీవితంలోకెల్లా అన్నిటికన్నా గొప్ప ఋతువు.
-వూ మెన్,చీనా కవి (1183-1260)
2
గొల్లభామా,చిమ్మెటా
పుడమి పాడే పాటకి ఎప్పటికీ మృతి లేదు
వేసవి సూర్యతాపానికి పక్షులన్నీ చల్లని చెట్లలో కునుకుతీసేవేళ
కోతకోసిన కొత్తధాన్యసుగంధం గురించి ఈ మూలనుంచి
ఆ మూలకో పిలుపు పోతుంది
అది గొల్లభామది- వేసవిసంతోషంలో ఆమెదే ముందడుగు
ఆమె ఆహ్లాదకోశానికి తరుగులేదు
ఆడిపాడి అలిసిపోయినప్పుడు
ఏ గడ్డిదుబ్బులోనో ఒద్దిగ్గా ముడుచుకుంటుంది

పుడమి పాడే పాటకి అంతం లేదు
శీతాకాలపు ఒక ఒంటరి సాయంకాలం
మంచు పరిచిన నిశ్శబ్దం నడుమ
నెగడి పక్కనుంచి వినవస్తుంది
చిమ్మెట కూజితం, క్షణక్షణానికీ మరింత వెచ్చనవుతూ.
మత్తెక్కి కనులరమోడ్చినవేళ
అదెక్కడో గడ్డికొండల్లోంచి గొల్లభామ పాటలాగా వినవస్తుంది.

-జాన్ కీట్స్ (1795-1821)
3
కొత్తసంవత్సర వేళ ,1981
నా దగ్గరొక సంతోషలవలేశం
పారదర్శకపు రంగులీనే
చిన్ని స్ఫటికం.
పారదర్శకపు రంగులీనే
చిన్ని స్ఫటికం.
అంతకన్నా మరేమీకోరను
దాన్నింత తుంపి
నీకు పంపిస్తాను
నీకు పంపిస్తాను
ఆ ఆశాలవలేశాన్నందుకో
అప్పుడు నా సంతోషలవలేశం కుంచించుకుపోదు.
అప్పుడు నా సంతోషలవలేశం కుంచించుకుపోదు.
నీ చిన్ని ఆశని నాతో పంచుకో
అది మరింత పెద్దదవుతుంది.
అది మరింత పెద్దదవుతుంది.
చూడు, పంచుకుంటేనే
ఆశ రెట్టింపవుతుంది.
ఆశ రెట్టింపవుతుంది.
నీలిగడ్డిపూలమొక్కలాగా
పంచుకోకపోతే పుయ్యడం మానేస్తుంది
అల్లిబిల్లిగా అల్లుకుపోయిన వేళ్ళు
మట్టిచుట్టిన గడ్డిదుబ్బు
ఊహించలేనంత అనుగ్రహం.
పంచుకోకపోతే పుయ్యడం మానేస్తుంది
అల్లిబిల్లిగా అల్లుకుపోయిన వేళ్ళు
మట్టిచుట్టిన గడ్డిదుబ్బు
ఊహించలేనంత అనుగ్రహం.
-డెనిస్ లెవర్టవ్ ( జ.1923)
4
గొప్ప పనులు జరిగేది
గొప్ప పనులు జరిగేది మనుషులూ, కొండలూ కలిసినప్పుడు.
అది వీథుల్లోపడి ఒకరినొకరు తోసుకుంటే కాదు.
అది వీథుల్లోపడి ఒకరినొకరు తోసుకుంటే కాదు.
-విలియం బ్లేక్ (1757-1827)
No comments:
Post a Comment