Friday, July 6, 2018

యదార్థ కథ.(కధ కాదు జరిగినది)

"సందేశాత్మకమైన ఆకరి ప్రయాణం"
యదార్థ కథ.(కధ కాదు జరిగినది)
ఖుదాఫీజ్ - అలి బనాత్!!
===================
అలీ బనాత్ - ఆస్ట్రేలియాలోని, సిడ్నీ లో స్థిరపడిన పాలస్తీనా దంపతులకు జన్మించాడు.
20 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికే రెండు కంపెనీల్ని స్థాపించి కోటీశ్వరుడయ్యాడు. సొంతంగా తన తల్లిందండుల ఇంటి పక్కనే ఓ అధునాతన సౌకర్యాలతో ఓ పెద్ద భవంతిని నిర్మించుకున్నాడు.
అతను వాడే కారు ఖరీదు - ఫేరారీ - 4 కోట్లు.
ఖరీదైన ఇంటర్నేషనల్ బూట్లు, చలవ కల్లజోల్లు( కూలింగ్ కల్లద్దాలు) కలెక్ట్ చేయడం అతని హాబీ. ఇంటినిండా అవే ఉండేవి.
కొత్తగా పెళ్ళి కూడా చేసుకున్నాడు. జీవితం సాఫీగా గడిచిపోతున్న సమయంలో....
ఓ రోజు నోట్లో ఏదో కణతలాంటిది ఉన్నట్లు అనిపించడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. బయాప్సీ, ఇంకా ఇతర టెస్ట్లు చేసిన డాక్టర్లు దానిని స్టేజ్ 4 నోటి క్యాన్సర్ గా అభివర్ణించారు.
మహా అంటే ఏడు నెలలు బతుకుతావని తేల్చేశారు.
అప్పుడు మీకు ఏమనిపించింది? అతనిచ్చిన అనేక ఇంటర్యూల్లో అతన్ని అనేక సార్లు అడిగిన ప్రశ్న.
"ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రజియూం"( అల్లా నుండి వచ్చాము - మల్లీ అల్లా చెంతకే వెల్తాము")-
నాకు నేను ఇది చెప్పుకున్నాను.
ప్రతి ఇంటర్వ్యూ లోనూ అతనిచ్చిన సమాధానం ఇది.
ఇక ఆ తర్వాత, అధునాతన వైద్యం కోసం అతని రక్త నమూనాల్ని జెర్మనీ,అమెరికా,యూకే లాంటి అనేక చోట్లకు పంపారు. అందరి నుండీ ఒకటే సమాధానం..."చాలా లేటైపోయింది"
ఇక ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే లాభం లేదని అతనికి అర్థమైంది.
తన కారు,విలువైన వస్తువులు అన్నీ అమ్మేసి ఆ డబ్బుతో ఆఫ్రికాకు పయనమయ్యాడు.
అక్కడి గ్రామాల్లో, స్కూల్లు, ఆస్పత్రులు, మసీదులు, అనాధ శరణాలయాలు కట్టించడం మొదలు పెట్టాడు.
అక్కడి పేదల పరిస్థితుల్ని మార్చడానికి తన మొత్తం ఆస్తికూడా చాలదని అర్థమై, తన పరిస్తితిని,తను చేసున్న పనుల్ని వివరిస్తూ యూటూబ్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు.
అది కొన్ని రోజుల వ్యవధిలోనే, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది దృష్టిని ఆకర్షించింది. వాటితోపాటే విరాళాలు వెల్లువెత్తాయి. ఆ విరాళాలతో ఇతని కార్యక్రమాలు యుద్దప్రాతిపదికన విస్తరించాయి. అక్కడి ప్రభుత్వం కూడా ఇతనితో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చింది.
అనేక గ్రామాలలో రక్షిత తాగునీటి వసతులు, స్కూల్లు, ఆసుపత్రులు వందల సంఖ్యలో నిర్మించడం జరిగింది.
కేవలం ఏడు నెలలే అనుకున్నది - మూడేల్ల వరకూ బతికాడు.
ఓ వైపు జబ్బుతో బాధపడుతూనే, ఆఫ్రికాలో అన్ని ఊర్లకూ వెళ్ళి పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించేవాడు. ఎందుకిలా అంటే - "నన్ను నమ్మి చాలా మంది విరాళాలు ఇచ్చారు. దానిలో ప్రతిపైసా వినియోగమవ్వాలి, ఎలాంటి వృధాఖర్చులూ ఉండకూడదు, అందుకే ప్రతి పనీ దగ్గరుండి నేనే చూసుకున్నా" ననేవాడు.
మొత్తానికి తన మూడేల్ల ప్రయాణం - మొన్నటి మంగళవారంతో ( మే 30) ముగిసింది. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అతన్ని సిడ్నీలో ఖననం చేశారు.
అన్నట్లు - అత్యంత పాపులర్ అయి, అతన్ని ప్రపంచానికి పరిచయం చేసిన యూటూబ్ వీడియోకి అతను పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా?
"గిఫ్ట్ ఆఫ్ క్యాన్సర్"
ఎందుకు ఆ టైటిల్?
క్యాన్సర్ గిఫ్ట్ ఏమిటి? అని అడిగిన ప్రశ్నలకు అతనిచ్చిన సమాధానం.
"జీవితమంతా కార్లు,బంగళాలు, సంపాదన, సక్సెస్ అంటూ పరిగెడుతుంటాం! చివరికి ఏదో ఒక రోజు - 'నీ సమయం ఐపోయింది, ఇంక వచ్చేయమనే' సృష్టికర్త పిలుపు వినబడగానే అప్పటి వరకూ మనం సంపాదించిన ఆస్తులు,వస్తువులూ ఎందుకూ పనికిరానివని మనకు అర్థమవుతుంది. కానీ, అప్పుడు చాలామంది చేయగలేది ఏమీ ఉండదు. కానీ, నా విషయం అలా కాదు. నాకు సృష్టికర్త 7 నెలలు గడువు ఇచ్చాడు. ఇది గిఫ్ట్ కాక మరేమిటి? "
వెల్ డన్ అలీ బనాత్. - అల్లా హఫీజ్.
ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రజియూం
ఈ మెసేజ్ నాకు చాలా నచ్చింది. మిత్రులతో షేర్ చేసుకుంటే ఆనందం ఇనుమడిస్తుందని..... ఈ పోస్ట్.

*స్నేహమంటే నమ్మకం*(పిల్లలకు చెప్పే కధ )

 ఒక అడవిలో కుందేలు ఒకరోజు ఒక ఏనుగుని చూసింది. దాని భారీ శరీరం చూసి బిత్తరపోయింది. దాని చేటంత చెవులు, స్తంభాల్లాంటి కాళ్లు చూసి దాని ఆశ్చర్యానికి అంతేలేదు.
పొదల చాటుకెళ్లి దాక్కోవడం కూడా మరిచిపోయి నోరు తెరిచి చూస్తున్న ఆ బుజ్జి కుందేలును ఏనుగు గమనించింది. చూపులకే మెత్తగా ఉన్న ఆ తెల్లని రూపాన్ని ఏనుగు కూడా ముచ్చటగా అలా చూస్తూ ఉండిపోయింది. రెండిటి చూపులూ కలుసుకున్నాయి. ఆ చూపుల్లో స్నేహం నిండి ఉంది. కుందేలు ధైర్యంగా ముందుకు వచ్చింది. సుతిమెత్తగా ఉన్న ఆ కుందేలును ఏనుగు సుతారంగా తొండంతో ఎత్తి తన వీపుపై ఉంచుకుంది. ఆ చుట్టుపక్కలంతా షికారు తిప్పింది.
రోజూ తనకి కొండమీదున్నట్లు ఎత్తుగా కనిపించే చెట్ల మీద కోతులు తన ఎత్తులో ఉండటంతో కుందేలు కేరింతలు కొట్టింది. అంత ఎత్తు నుంచి కిందికి చూడటం దానికి భలే వింతగా, గమ్మత్తుగా ఉంది. ఏనుగు ప్రోత్సాహంతో అది కొమ్మనున్న కాయకోసి తింది. తర్వాత కుందేలును బొరియ వద్ద దింపి ఏనుగు వెళ్లిపోయింది.
అది మొదలు వాటి స్నేహం కొనసాగింది. రోజూ కలిసి ఆడుకునేవి. ఒక రోజు కుందేలు దాగుడుమూతలు ఆడదామని సరదాపడింది. ఏనుగుని కళ్లుమూసుకోమని ఒక పొదలో దాగింది.
ఏనుగు ఒక్కోపొదని మెల్లిగా ఒత్తిగిస్తూ కుందేలుని కనుక్కుంది. అప్పుడు కుందేలు ఏనుగుని దాక్కోమంది. పాపం ఏనుగు తెల్ల మొహం వేసింది. తను దాక్కోగల ప్రదేశమేదీ దానికి తోచలేదు. కాదని కుందేలును బాధపెట్టడం దానికిష్టం లేకపోయింది. వెళ్లి ఒక చెట్టు వెనక నుంచుంది. కళ్లు తెరిచిన కుందేలు ఏనుగు ఒళ్లు సగం బయటకే కనబడుతుండటంతో పకపకా నవ్వింది. దాని ఆనందం చూసి ఏనుగు సంతోషించింది. మంచి చోటు వెతుక్కోమని కుందేలు పోరడంతో ఏనుగు దూరంగా వెళ్లింది. ఒక గుహ చూసింది. బాగుంది కానీ అందులో సింహం ఉండొచ్చని అనుమానించింది. ఇంతలో వెదురుపొదలు కనిపిస్తే వాటి వెనుక దాగింది.
ఏనుగును వెతుకుతూ వచ్చిన కుందేలు కూడా గుహని చూసింది. అందులో దాక్కుందేమోనని అటుగా వెళ్లబోయింది. దానిని ఏనుగు వారించేలోపే నక్క ఆపింది. ‘అందులో సింహం ఉంది. వెళ్లకు’ అంది. పైగా మెల్లిగా ‘ఆ మాయదారి ఏనుగు తను గుహలో దాక్కున్నానని నీకు చెప్పమంది. తెలుసా?’ అంది.
‘ఎందుకు?’ అంది కుందేలు అమాయకంగా.
‘ఓసి పిచ్చిదానా! నీ ముత్తాత ఇంకో సింహాన్ని చూపిస్తానని ఈ సింహం ముత్తాతను నూతిలో పడేలా చేశాడుట. అందుకే సింహం నీపై పగబట్టింది. నీతో స్నేహం నటించి నిన్ను తనకి అప్పగిస్తే అరటి తోటలు, వెలగ చెట్లు చూపిస్తానని ఏనుగుని ఆశపెట్టింది. అందుకే ఏనుగు ఇలా చేసింది. నన్ను నమ్ము’ అంది.
కుందేలు ఎంతో స్థిరమైన గొంతుతో ‘ఏం కాదు. నా మిత్రుడు అలా ఎన్నటికీ చేయడు. *స్నేహం అంటే నమ్మకం*. నాకది నా స్నేహితుడిపై పూర్తిగా ఉంది. మా చెలిమి చూసి ఓర్వలేక అసూయతో నువ్విలా అంటున్నావు.’ అంది.
వెదురు పొదలచాటు నుంచి ఈ మాటలు విన్న ఏనుగు ఆనందంతో కంటనీరు కార్చింది. కోపంతో ఘీంకరిస్తూ నక్కను చంపబోయింది. దానిని కుందేలు వారించింది. రెండూ కలిసి నక్క కుటిల బుద్ధిని, ఓర్వలేని తనాన్ని అడవంతా చాటాయి. ‘అప్పటి నుంచి నక్కకు గుంటనక్క అనే పేరు స్థిరపడింది’.

*లంఖణం పరమౌషధం*

*లంఖణం పరమౌషధం*
అని చెప్పిన మన పూర్వీకులు.
నిన్న మొన్నటి వరకు మన పెద్దలు,
వైద్యులు చెప్పిన ఉపవాసం గురించి లంఖణం గురించి నేటి వైద్యవిధానం అనుసరించిన ఎందరో వైద్యులు, అభ్యుదయవాదులు ఇదంతా కేవలం అనాగరికం అని, మూర్ఖత్వం అని ఎద్దేవా చేసేవారు.
పూర్వం మనకు జ్వరాలు కానీ,
పెద్ద రుగ్మతలు వచ్చినప్పుడు
*లంఖణాలు చేయించే వారు*
దానివల్ల ఎలాగూ నీరస పడేవారు.
*అసలది అవసరం లేదని,
కేవలం ఆంటి బయోటిక్స్ మాత్రమే మందులని మనకు బాగా
తలకెక్కించారు.
ఈ మధ్య వైద్యంలో ప్రకటించిన నోబెల్ బహుమతి గురించి తెలుసుకుంటే ఒకసారి మనం ఆశ్చర్యపోతాము.
*జపాన్ సైంటిస్ట్
యోశినోరి ఒహ్సుమి కి
ఈ సంవత్సరం నోబెల్ బహుమతి ఆటోఫాగి (AUTOPHAGY) మీద ఆయన చేసిన పరిశోధనకు గాను ఇచ్చారు.
ఆటోఫాగి అంటే కణాల రీసైక్లింగ్ పద్ధతి అంటే? “స్వయం భక్షం”.
ఒక శరీరం ఆహారం తీసుకోకుండా వదిలేసినప్పుడు ఆ శరీరం తన లోపలి కణాలు, ఉపయోగించని ప్రోటీన్లను తిని తన అస్తిత్వం నిలుపు కుంటుంది.
ఈ ఆటోఫాగి పద్ధతిని శరీరం కోల్పోతే శరీరం రోగగ్రస్తం అవుతుంది.
మనకు వారానికి ఒక రోజు, ఏకాదశి, శివరాత్రి , కార్తీక సోమవారం లాంటి ఎన్నో పర్వదినాలలొ శరీరానికి ఉపవాసం చేయించే పద్ధతి ఉంది.
*ప్రతీ 15 రోజులకు వచ్చే ఏకాదశి నాడు. పూర్తిగా నిరాహారంగా వుండడం అనేది మనవారు ఎప్పటి నుండో అనుసరిస్తూ వస్తున్న పద్ధతి.
దైవచింతనతో, ఉపవాసం చెయ్యడం మన ఆధ్యాత్మిక పురోగతికి చెప్పిన ఒక పద్ధతి.
*ఈ పద్ధతి ద్వారా ఆటోఫాగి అన్న ప్రక్రియను మనం ఉపయోగించుకుని తద్వారా శారీరక సౌఖ్యాన్ని పొందుతూ వచ్చారు మన పూర్వీకులు.
దీని ద్వారా హానికర కణాలను ప్రక్షాళన చేసుకుని,శారీరక సౌఖ్యాన్ని పెంచి,
ఉపయోగించని ప్రోటీన్స్ ను
కొవ్వును కరిగించుకుని శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచుకునేవారు.
నేటి సైన్సు కొత్త విషయం అంటూ కనుగొన్నాము అంటే, దానికి మన పూర్వపు పద్ధతులకు ఒక లంకె కనబడుతుంది.
మన పూర్వీకులు పక్షంలో ఒక్క రోజు దేవుని స్మరిస్తూ,ఆయన గురించి చింతిస్తూ,ఉపవాసం చేస్తూ,ఆధ్యాత్మిక, శారీరక ఉన్నతిని పొందేవారు.
👇నోబెల్ లింక్:-
https://www.nobelprize.org/…/medi…/laureates/2016/press.html
*వరుసగా మూడు రోజులు నిరాహారంగా ఉండడం వలన శరీరం కొత్త స్టెమ్ సెల్స్ తయారు చేసి, తద్వారా తెల్ల కణాలను సృష్టించి
రోగనిరోధకశక్తిని అమితంగా పెంచు తుంది. అని సథరన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
మనకు పూర్వం మూడు రోజుల లంఖణాలు చేయించేవారు.
శరీరం నీరసబడ్డా రోగం,
రోగానికి కారణం అయిన
ఆ రోగ సెల్స్ సగమై,
తెల్లకణాలు ఇతోధికంగా పెరగడం వలను ఆ రోగం నయంఅవుతుంది.
👇దాని లింక్
http://www.telegraph.co.uk/…/fasting-for-three-days-can-re…/
కేవలం ఉపవాసం చేస్తే ఎప్పుడూ ఆహారం మీద దృష్టి ఉంటుంది.
కాబట్టి మనస్సుకు ఆలంబనగా భక్తి అనే పరమఔషధాన్ని జతచేసి మనస్సు దేవుని మీద లగ్నం చేయించి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించారు.
నిస్సందేహంగా మన పూర్వీకులు,
ఋషులు మానసిక, ఆధ్యాత్మిక,
శారీరక సంపూర్ణ వైద్యాన్ని నిర్దేశించడానికి ఇటువంటి పద్ధతులను
అనుసరించేవారు.
మనకు పూర్తి అవగాహన లేక ఇలా చాలావాటిని కోల్పోయాము.
వారికి త్రికరణ శుద్ధిగా తలవంచి,
పాదాభివందనం చేసి,
వారు చూపిన బాటలో పయనించడం మన తక్షణకర్తవ్యంగా భావించాలి.
సమస్త లోకాస్సుఖినో భవంతు!

మనతో మనం


మనిషి తన భావాలను ఇతరులకు చెప్పటానికి పడే ఆరాటంవల్ల తన గురించి తాను మరిచిపోతాడు. ఇతరులు తన గురించి గొప్పగా అనుకోవాలని, తనను అదే పనిగా మెచ్చుకోవాలని ఆశపడతాడు.
*ప్రజ్ఞ అనేది ప్రదర్శించి చూపడానికి కాదు. సహజంగా అందరూ అభినందించేదిగా ఉండాలి.
అది లోకోపకారిగా ఉండాలి.
అప్పుడే ప్రశంసార్హమవుతుంది.*
అభినందించడం అవతలివారి అభీష్టం. అభినందనలు పొందడం మన హక్కు కాదు.
*మనం పుట్టినప్పటి నుండి మరణం వరకు భగవంతుడు ఎన్నో ఇస్తున్నాడు*.
కానీ, ఏనాడూ దాన్ని మనం సరిగ్గా గుర్తించడం లేదు. భగవంతుడి గురించి సరైన నిర్వచనం మనకు తెలియదు.
ఎవరి నిర్వచనాలు వారివి. *అడుగడుగునా కనురెప్పకన్నా గొప్పగా మనల్ని ఆదుకుంటూ, హృదయానికి హత్తుకుంటున్నది భగవంతుడేనని మనకు తెలియనే తెలియదు*.
ఇన్ని చేస్తున్నా భగవంతుడు మన అభినందనల కోసం ఎప్పుడూ ఎదురుచూడడు.
*తల్లి బిడ్డలకు చేసే సేవలు,
*తండ్రి తన సంతానానికి కల్పించే రక్షణ,
*మిత్రుడు ఆపదలో ఆదుకోవడం, *గురువు జ్ఞానమార్గాన్ని చూపడం....
ఇన్ని పాత్రల్లో ఉంటూ మనతో నిత్య సన్నిహితుడిగా ఉంటున్నది పరమాత్మే. అది చాలదన్నట్లు *అంతర్యామి* గా మనలోనే కొలువున్నాడు
*సాధారణంగా మనచర్యలన్నీ స్వార్థభరితాలే. ఇతరుల నుంచీ ఎన్నో ఆశిస్తాం. వాటిలో ఒక్కటి కూడా ఇతరులకు చెయ్యం.
అందరూ మనల్ని మెచ్చుకోవాలి. మనం ఎవరికన్నా ఉపకారం చేస్తే, వాళ్ళు కుక్కలా శ్వాస ఉన్నంతవరకూ విశ్వాసంగా ఉండాలి అనుకుంటాం! మరి మనం అలా ఉంటున్నామా? *తల్లిదండ్రుల్ని , అత్తమామల్ని వార్ధక్యంలో పట్టించుకుంటున్నామా? ఏతల్లి, ఏతండ్రి తమ సేవలకు పిల్లల ప్రశంసలు,అభినందనలు ఆశిస్తున్నారు?
కేవలం కాస్త ప్రేమ కోరుతున్నారు. భగవంతుడూ అంతే
ఆయనకేమి తక్కువని మన నివేదనలు, భజనలు, స్తోత్రాలు కోరతాడు?
ఆయన మనలోని లోపాలన్నింటినీ సానుభూతితో గమనిస్తుంటాడు. ఎప్పటికైనా తమను తాము తెలుసుకుంటారన్న ఆశతో నిరీక్షిస్తుంటాడు.
*మనం ఇతరుల్ని గమనించినంతగా మనల్ని మనం గమనించం!
వాళ్ల గురించి చాలా విషయాలు చెబుతాం. వారిలోని మంచికంటే, చెడు గురించే మనం ఎక్కువ చెబుతాం.
మన తప్పులు సమర్థించుకుంటూ ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపుతాం! ఈ లక్షణాలు అంతరాలయ ‘అంతర్యామి’ ద్వారాలను గట్టిగా మూసివేస్తాయి. మనల్ని మనం సంస్కరించుకునే వరకూ అవి తెరుచుకోవు.
 మనతో మనం రోజూ కనీసం రెండుసార్లయినా ఏకాంతంగా మాట్లాడుకోవాలి.
ఉదయం నిద్ర లేవగానే,
*ఓ అంతర్యామీ! నేను ఈ రోజంతా మంచిపనులు చేసేలా ప్రోత్సహించు! నిద్రపోయే ముందు స్వామీ!
ఈ రోజు నేను చేసిన చెడ్డ పనులేమిటో నాకు చెప్పు. రేపు మళ్ళీ అవి చెయ్యకుండా నిరోధించు!
ఈ రెండు ప్రార్థనలూ నిజాయతీగా, మనస్ఫూర్తిగా చేస్తే, మనం అంతర్యామి వాణిని వినగలుగుతాం!
మనం చేసే చెడ్డపనులకు అనుకోని విఘ్నాలు కలుగుతాయి.
ఇవన్నీ అంతర్యామి అనుగ్రహమేనని విశ్వసిస్తే, నిత్యం మనం అంతర్యామితో మాట్లాడగలుగుతాం!
అంతర్యామి అధీనంలో ఉంటాం కనుక మనం ఎలాంటి అకృత్యాలూ చెయ్యలేం. సాధనలో ఇదే అత్యుత్తమమని మహాత్ములు చెబుతారు.
*మన దృష్టి బయటినుంచి లోపలికి తిరగాలి. మన సంభాషణ అంతర్యామితో జరగాలి.

అంతా మన మంచికే

*జీవితంలోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు అనుకోవాలి*
*ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి*
*శక్తిని అడిగాను, భగవంతుడు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.
*సంపదను అడిగాను,
భగవంతుడు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.
*ధైర్యాన్ని అడిగాను,
భగవంతుడు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.
*వరాలు అడిగాను,
భగవంతుడు అవకాశాలు ఇచ్చాడు.
*ఆయన ప్రేమను అడిగాను,
భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు పంపించాడు.
*జ్ఞానాన్ని అడిగాను,
భగవంతుడు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.
*పురోగతి అడిగాను,
భగవంతుడు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.
*లోకానికి మంచి చెయ్యాలని అడిగాను, భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.
*ఆయన్ను మరువకూడదు అని అడిగాను,
భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.
*పాపాలు క్షమించమని అడిగాను,
భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.
అలా జీవితంలో కోరుకున్నదేదీ పొందలేదు,
కావలసిందే పొందాను.
ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటన నుండి అవసరమైనది పొందటం నేర్చుకున్నాను.
చివరకు ఏది జరిగినా మంచికే అని అర్ధం చేసుకున్నాను.
*జరిగేది అంతా మన మంచికే కధా!*

జీవితంలో నుంచి కొన్ని వస్తువులు తీసేస్తే ...

జీవితంలోంచి దువ్వెన అనే వస్తువును తీసేయ్.....
అపుడు ఏం జరుగుతుంది?నువ్వు జడలు కట్టిన జుట్టుతో భయంకరంగా ఉంటావు. 
 
నీ జీవితంలోంచి అద్దం అనే వస్తువును తీసేయ్.....తర్వాత నిన్ను నువ్వే చూసుకోలేనంత అసహ్యం గా ఉంటావు.

ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే నిద్ర రాక....మరుసటి దినం ఏపనీ సక్రమంగా చెయ్యలేవు...

నీ జీవితాన్నే అందంగా, సౌఖ్యం గా చేస్తూన్న ఇలాంటి చిన్న చిన్న వస్తువులకు నువ్వెప్పుడైనా థాంక్స్ చెప్పావా????

3 పూటలా నీకు సకాలంలో తిండి ఏర్పాటు చేస్తున్న నీ తల్లికో లేక నీ భార్యకో....ఒక్క రోజైనా థాంక్స్ చెప్పావా....

ఒక్క 3 నిముషాలు చెట్లు     స్ట్రైక్ చేస్తే....భూమండలం అంతా శవాల దిబ్బ ఐపోతుంది.....చెట్టు యొక్క దయా దాక్షిణ్యాలపై బతుకుతున్న  నీవు ఒక్క రోజైనా చెట్టును ప్రేమగా స్పర్శిస్తూ థాంక్స్ చెప్పావా....

ఎండకూ, వానకూ, అమ్మకూ ,నాన్నకూ....నిన్ను ఆనందంగా ఉంచుతున్న ఈ ప్రకృతికీ.....గురువుకు....నువ్వు తినే తిండికి..
ఎప్పుడైనా, ఎలాగైనా థాంక్స్ చెప్పావా...

అంటే నీకు తీసుకోడమే తప్ప ......ఇవ్వడం రాదన్నమాట...
ఇస్తేనే ...తిరిగి లభిస్తుంది.

నిజానికి పై వస్తువులేవీ...నీ దగ్గరనుండీ ఏమీ ఆశించకుండా... నిస్వార్థంగా....ఎన్నో యుగాలుగా సేవ చేస్తున్నాయి.

నీకు సౌఖ్యాన్ని ఇచ్చిన ప్రతీ ఒక్క వస్తువుకు మనసులో కృతజ్ఞత సమర్పించి చూడు......నీ మనసు పవిత్రతతో కడిగివేయబడి నిష్కల్మషం ఐపోతుంది.
ఇదే అంతః శుద్ధి....ఇదే పవిత్రత...ఇదే దైవత్వం.
ఇలాగే స్వచ్ఛతను సాధించాలి.

సృష్టిలో స్వచ్ఛమైన ప్రతిదీ....అత్యంత శక్తి కల్గివుంటుంది.

ప్రతీ రోజూ....నీకు సహాయం చేస్తున్న ప్రతీ వస్తువూ, మనిషి,జంతువు,...ఇలా అన్నిటికీ హృదయంలో నిండుగా కృతజ్ఞత ప్రకటించడం సాధన చేయాలి. ఇది నీకు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది...

సంగీత కళా సరస్వతి మంగళంపల్లి బాలమురళిగారి జయంతి

గానగంధర్వుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారి జయంతి.  తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో 1930 జూలై 06న పట్టాభిరామయ్య, సూర్యకాంతం దంపతులకు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ జన్మించారు. ఆరు నెలలు కూడా నిండకుండానే తల్లి సూర్యకాంతం చనిపోయారు.  దాంతో అన్నీ తానై పెంచారు తండ్రిపట్టాభిరామయ్య. ఆరేళ్ల వయసులోనే సంగీతం నేర్చుకోవడం  ఆరంభించారు బాలమురళి.

ఎనిమిదేళ్ల ప్రాయంలోనే 1938లో తొలికచేరీ చేశారు. పదకొండేళ్లకే మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుండి కచేరీ నిర్వహించారు బాల మురళీ కృష్ణ.

పండిట్ భీమసేన్ జోషి వంటివారితో కలిసి ఆయన కచేరీలు నిర్వహించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా,  కిశోర్ అమోన్కర్ మొదలైన వారితో జుగల్ బందీ చేశారు.

ముత్తుస్వామి దీక్షితర్, త్యాగరాజ  కీర్తనలకు తన గానంతో జీవం పోశారు. భద్రాచల రామదాసు కీర్తనలకు, అన్నమాచార్య కీర్తనలకు గాత్రం అందించారు. స్వరరాగ సుధలో ఓలలాడించడమే కాకుండా వాద్యకారుడిగానూ ప్రసిద్ధుడయ్యారు.  వయోలిన్, వీణ, మృదంగం మొదలైన వాయిద్యాలలో నిష్ణాతుడు మంగళంపల్లి.

ప్రపంచ వ్యాప్తంగా భారత దేశంతో సహా  అమెరికా, బ్రిటన్, సింగపూర్, శ్రీలంక, మలేషియా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా వంటి అనేక దేశాలలో 25,000 సంగీత కచేరీలు చేశారు. అనేక భారతీయ బాషలలో సంస్కృతం, తెలుగు తో సహా, కన్నడం, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ బాషలలో కూడా పాటలు పాడిన ఘనత ఆయనది.

సంగీత ప్రపంచానికి బాలమురళీ కృష్ణ అనేక రాగాలను అందజేశారు. తన తల్లి పేరుతో సూర్యకాంత రాగాన్ని సృజించారు. మహతి, లవంగి, ఓంకారి, సుముఖం, సర్వశ్రీ, ప్రతి మధ్యమావతి, గణపతి సిద్ధి మొదలైన కొత్త రాగాలను సంగీత సరస్వతికి బహుమతిగా సమర్పించారు.

ప్రపంచ స్థాయిలో ఆయనకు ఫ్రెంచ్ చెవాలియర్ పురస్కారం లభించింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి మూడు జాతీయ అత్యున్నత పురస్కారాలు పొందిన ఏకైక సంగీత చక్రవర్తి. అనేక విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్ పొందిన సంగీత సరస్వతి. ఉత్తమ సినీ గాయకునిగా జాతీయ సినిమా పురస్కారాలు పొందారు.

22 నవంబర్ 2016న  దేవతలను తన గానామృతంతో మురిపించడానికి దివికేగిన బాలమురళి మనమధ్య లేకపోయినా ఆయన అందించిన సంగీతం ఎప్పటికీ మన మధ్య ఉంటుంది.  మరి సంగీత కళా సరస్వతి మంగళంపల్లి బాలమురళిగారి జయంతి సందర్భంగా ఆయన అమృతవర్షిణి రాగంలో ఆలపించిన దీక్షితర్ వారి ఆనందామృతాకర్షిణి కృతిని విందాం..(ఆడియో ఎటాచ్ చేయబడినది)
 🙏🎸🎸🎧🎸🎸🙏
ఆనందామృతాకర్షిణి - రాగం అమృత వర్షిణి - తాళం ఆది

పల్లవి
ఆనందామృతాకర్షిణి అమృత వర్షిణి
హరాది పూజితే శివే భవాని
O one who attracts the nectar of bliss!  O one who creates a  shower of  nectar! - O one worshipped by Shiva and others! O auspicious one! O wife of Shiva!

చరణమ్
శ్రీ నందనాది సంరక్షిణి
శ్రీ గురుగుహ జనని చిద్రూపిణి
O one who protects Vishnu (the joy of Lakshmi) and others!  O mother of Guruguha!  O embodiment of consciousness!

సానంద హృదయ నిలయే సదయే
సద్యస్సువృష్టి హేతవే త్వాం
సంతతం చింతయే అమృతేశ్వరి
సలిలం వర్షయ వర్షయ వర్షయ
O one dwelling in the blissful hearts (of sages)!  O merciful one! For the sake of immediate good rains,  I always think of you.  O ambrosial goddess!  Shower, shower, shower water (rains)!
〰〰🌷〰〰
గమనిక: ముత్తుస్వామి దీక్షితర్ వర్షం కోసం ఈ కృతి ని ఆలపించినపుడు అతిపెద్ద వర్షం కురిసిందిట.. మళ్ళీ ఆ వర్షాన్ని స్తంభించడానికి స్తంభయ స్తంభయ అని గానం చేసారుట.. మరి మన గానగంధర్వుడి ఈ గానం వింటుంటే కూడా మీ చుట్టుపక్కల వర్షం కురిసే అవకాశం వుంది.. కావాలంటే ప్రయత్నించి చూడండి..
🙏👇🎧👇🙏

Total Pageviews