Tuesday, October 7, 2014

ఈ రోజు చంద్రగ్రహణం: ఈ రోజు మధ్యాహ్నం 13:47 నిమిషములకు భూమి నీడ చంద్రునిపై పడుతుంది... అనగా భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే రేఖపై రావడం వలన సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి ఉండడం వలన భూమి నీడ చంద్రునిపై పడి మనకు కనిపించడు... దీనినే చంద్ర గ్రహణం అంటాము.. ఇది సంవత్సరంలో ఒక సారి సంభవించవచ్చు... అయితే ఈ గ్రహణ సమయంలోనూ అటు చంద్రుడు ఇటు భూమి పరిభ్రమిస్తూ ఉంటాయి... అందుకే మనము సంపూర్ణ చంద్రగ్రహణం ఒక్కొక్కసారి చూడలేము... ఈ రోజు కూడా సంపూర్ణ చంద్రగ్రహణం 16:52 సమయంలో వచ్చింది... అందుకే మనం చూడలేము... మనకు పాక్షిక గ్రహణాన్ని అది కూడా 18:02 ని. నుండి మొదలై 19:02 కు ముగుస్తుంది... ఈ గ్రహణ సమయంలో భూమి మీదకు కొన్ని రకాల ప్రమాదకర కిరణాలు(అతినీలలోహిత కిరణాలలాంటివి)ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది... అందుకే ఈ సమయంలో ఏ పనీ చేయకూడదని, చివరికి ఆహార పదార్థాలతో సహా ఏదీ ముట్ట కూడదని మన పెద్దలు ఆచార సాంప్రదాయాలలో ఉంచారు... దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు... తర్వాత ఆలయాలన్నీ/గృహాలు సంప్రోక్షణ చేయడానికి గల కారణాలు కూడా ఆ కిరణాల విషప్రభావం తొలగించడానికే... ఈ విషయాలు సామాన్య జనబాహుళ్యానికి కూడా అర్థమయ్యే విధంగా గ్రహణకాలనిబంధనలను చాలా ఖచ్చితంగా అమలుచేసేవారు మన పెద్దలు.... గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలు కలిగి ఉన్నది.. అందుకే మన ఇంటిలో అన్ని పాత్రలపై మరియు నీటి ట్యాంకులపై వీటిని ఉంచడం వలన రేడియేషన్ ప్రభావాన్ని కొంచెం తప్పించుకోవచ్చని... గరికను ఎక్కువగా ఉపయోగించమన్నారు పెద్దలు... ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోతే మంచిది... అన్ని ఆలయాలలోకి శ్రీ కాళహస్తి ఆలయం కొంచెం విభిన్నమైనది.. ఇది పంచ భూత క్షేత్రాలలోని వాయులింగం ఉన్నది ఇక్కడే.. ఇక్కడి ఆలయం రాహు, కేతు సమేత నవగ్రహాలను కలిగిన మండపం శివలింగం ఉండడం చేత కేవలం ఈ ఆలయం మాత్రం గ్రహణసమయంలో ప్రత్యేక అభిషేకాలు జరుపుతుంది...అందుకే ఈ రోజు ఈ ఆలయానికి ఇది ఒక ప్రత్యేకత.. ఈ ఆలయంలో రాహుకేతు /సర్ప దోష నివారణకై సంవత్సరంలో అన్నిరోజులలోని పూజలు నిర్వహిస్తారు... ఇది మన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి అత్యంత సమీపంలో ఉంది... ఈ సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనపడడం ప్రత్యేకత... సేకరణ: శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి నుంచి.


No comments:

Post a Comment

Total Pageviews