కుశలమా? నీకు కుశలమేనా?
https://www.youtube.com/watch?v=jDqfA9nuVKQ
https://www.youtube.com/watch?v=G04pGPnUNQE
భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
కుశలమా? నీకు కుశలమేనా?
"నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి"
ప్రేమికుడు అన్నవాడు తప్పకుండా విని తీరవలసిన పాట1978 విడుదలైన ఇంద్ర ధనుస్సు చిత్రం కోసంమనసుకవి మన సుకవి ఆచార్య ఆత్రేయ రాసినఈ అధ్బుత భావుక ప్రేమ గీతం కె.వి. మహదేవన్‌గారి స్వరకల్పనలో బాలు గారు ఒలికించినఆ ప్రేమ తన్మయత్వానికి లోనవ్వని ప్రేమికుడువుండడేమో ఒక వేళ వుంటే వాడు ప్రేమికుడు కాడేమోఆ పల్లవి లోనే ఎత్తుగడనేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివినా దాహం తీరనిది నీ హృదయం కదలనిదినేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివినా దాహం తీరనిది నీ హృదయం కదలనిదినేనొక ప్రేమ పిపాసిని....ఆ మొదటి చరణం లో "తలుపు మూసిన తలవాకిటిలో పగలు రేయి నిలుచున్నా""తలవాకిలి" ఒక చక్కని అభివ్యక్తికి ఎంచక్కని పదంఇంత చక్కని పదాలను, పదబంధాలను నేడు మనంఎంత దూరం చేసుకుంటున్నాం? ఎంత చక్కని తెలుగును కోల్పోతున్నాం?కనీసం ఇటువంటి మాటలు విని అర్ధం చేసుకుందుకైనాతెలుగు నెర్చుకోవాలి, భావి తెలుగు నేర్పించాలిఅయ్యో ఇంకా మొదటి చరణంలోనే ఉండిపోయాం"పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా"ఒక భగ్న ప్రేమికుని హృదయ స్థితిని అర్థం చేసుకుంటేప్రేమోన్మాదం, యాసిడ్ దాడులు ఉండవు"తలుపు మూసిన తలవాకిటిలో పగలు రేయి నిలుచున్నాపిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా"నా దాహం తీరనిది నీ హృదయం కరగనిదినేనొక ప్రేమ పిపాసిని...ఇక రెండో చరణంలోపూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చానుప్రేమ భిక్షనూ పెట్టగలవని దోసిలి ఒగ్గానునీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచానునీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయానునేనొక ప్రేమ పిపాసిని...దోసిలి ఒగ్గాను, ఎడదను పరిచాను ఎదలో సవ్వడి లేపే పదాలుఇక మూడో చరణంలోపగటికి రేయి .. రేయికి పగలు.. పలికే వీడ్కోలురోజులు గడచి పొతూనే ఉన్నాయి అనిచెప్పడంలో ఎంత అమాయకత, ఎంత భావుకతసెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలుననినీ జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావునను వలచావని తెలిపేలోగా నివురైపోతానునివురైపోతాను అన్న దానికి అర్ధం నివురుగప్పిన నిప్పు అంటారే బూడిద అన్నమాట
ఈ యూట్యూబ్ లింకుల్లో
పంచుకున్న జ్నాపకాలు చూసి ఆనందించండి.
సినిమాలో పాట చూసి ఆనందించండి.
ఒక మహనీయుని మహాభినిష్క్రమణం తర్వాత కేవలం జయంతులకు, వర్ధంతులకు పరిమితం కాకుండా వారి జ్నాపకాలను వారి ఘనకార్యాలను ప్రతినిత్యం ఇలా గుర్తుచేసుకుందాం అదే నిజమైన నివాళి! సత్యసాయి విస్సా ఫౌండేషన్
మరాం-అల్-మస్రీ సిరియాకి చెందిన కవయిత్రి. ఆమె తన ఇంటినీ, కుటుంబాన్నీ, దేశాన్నీ వదిలిపెట్టి ఒక ప్రవాసిగా ఫ్రాన్సులో జీవిస్తున్నది. 'సిరియాకి చెందిన ప్రతి ఒక్కటీ వదిలిపెట్టేసాను, చివరికి ఆ భాష, ఆ ఆహారంతో సహా ' అని చెప్పుకుందామె ఒక ఇంటర్వ్యూలో. కాని, ఆమె కవిత్వం చదివితే, సిరియా ఆమెని వదిలిపెట్టలేదనీ, ఆమె ఊపిరిలో ఊపిరిగా మారిపోయిందనీ అర్థమవుతుంది. నాకోసం తెలుగు చేసుకోకుండా ఉండలేని ఆమె కొన్ని కవితలు కొన్ని, మీ కోసం.
మిత్రమా కుశలమా!
జీవితంలో ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా
ఎక్కడో ఉన్న బాల్య స్నేహితుడి ఫోన్ నంబరు సంపాదించి...
పలకరించిన ఆనంద సంపద ముందు అవన్నీ దిగదుడుపే
అలాంటి చిన్ననాటి చందమామ బాలమిత్రులలో నువ్వొకరు మిత్రమా
నీలాంటి వారికి ఈ చిరు కవితాచందన అభివందనం
జీవితపు తీపి సంతకం! మరువని జ్ఞాపక సంకేతం!
ఇరుగింట్లో, పొరుగింట్లో, బడిలో, గుడిలో
శ్రీరామ నవమి, చవితి పందిట్లో నాలుగుస్తంభాలాట
నేలా-బండా ... మాష్టారింట్లో కోడిగుడ్డు దీపం వెలుతుర్లో
సవర్ణదీర్ఘాది సంధులు, పైథాగరస్ సూత్రాల వల్లెల్లో సందుల్లో గొందుల్లో గోలీ బొంగరాల ఆటలు
పుస్తకాల్లో నెమలీక పంపకాలు అలకలు ఆనందాలు
గుడి మైకులో గీతాలు కొమ్మల్లో కోతికొమ్మచ్చి, తొక్కుడు బిళ్ళాటలో
వయ్యారి బొమ్మల్లో, ఒప్పులకుప్పల్లో, చెమ్మచెక్కల్లో
అమ్మ ఇచ్చిన పప్పుచెక్కల్లో పంచుకున్న కాకెంగిలి
శివరాత్రి జాగరణలో, అట్లతద్ది దాగుడుమూతలాటల్లో
నెల పట్టిన సంక్రాంతి ముగ్గుల్లో, గొబ్బి తట్టే వేళల్లో
వినాయకుడికి పత్రి కోసే వేళల్లో
అమ్మ పూజకి నందివర్ధనాల్ని ఎంచే వేళల్లో
పరీక్ష ముందు భయంలో పరీక్షలయిపోయిన సంబరంలో
వేసవి శలవుల్లో దొంగా-పోలీసు అయిన వైనాల్లో
మల్లెపూల జడల మురిపాల్లో, మొగలిరేకుల్లో
యవ్వనపు తొలిరోజుల చిరు రహస్యాలలో
మలి నాళ్ల భావోద్రేకాల్లో
ఎండల్లో, వానల్లో, చలిలో
మబ్బులు ముసురు పట్టిన వేళల్లో
రాత్రి లో, పగటిలో, కష్టం లో, సుఖం లో
ఎప్పుడూ నాతోనే వుండే చిరుజ్ఞాపకం సంకేతం!
జీవితపు తీపి సంతకం!!
తెలుగోడి గోడు!! ( SekaraNa )
అమ్మయ్యా...
ఇక భాష గురించి వెంటబడే వారు లేరులెండి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. మాటని పాటని చింపి పోగులు పెట్టుకోవచ్చు.
'నోరు తిరిగాలి', 'గొంతులో ప్రతీ అక్షరం పలకాలి'.. అంటూ సలహాలు ఉండవు. 'ఈ మాటకి అర్ధం తెలుసా', 'ఈ పదం ఎంత బావుందో', 'ఇంకో కవి రాయగలడా', ఎక్కడ్నుంచి తెస్తారండీ భావుకత' .. అంటూ మాట్లాడే గొంతుక వినబడదు. 'పదహారణాల తెలుగు పిల్లలా ముచ్చటగా ఉన్నావు. 'తెలుగుదనం ఉట్టిపడింది.. నీ గోంతులా' అంటూ వంద కేజీల అభిమానాన్ని ఒలకబోసే అప్యాయత మాటలు పిల్లలకి ఉండవు.
అసలు.. ఏ ఇంట్లో చూసిన.. ఎదో మాట, పాట టివిలోనో, రేడియోలోనో, ట్యూపుల్లో, అరచేతుల్లోనో వినబడుతూ ఉండొచ్చు. వింటూ ఉండొచ్చు. కాని అచ్చంగా మన వెంటా, అదృశ్యంగా తిరిగే నిత్యనూతన నవయవ్వన గందర్వుడు కనపబడడు. 'అబ్బా.. ఇవాళ మిస్ అయ్యాను' అనే మాట ఇక శాశ్వతమై పోయింది.
'మేం తెలుగు వాళ్లమని' (ఆయన అన్నట్టు) ఘ..ర్వ..ం గా చెప్పడానికి ఓ గొంతు ఉండేదని మనం చరిత్రలో రాసుకోవచ్చు. ఒకటా.. రెండా..ఎన్ని వ్యసనాలు అలవాటు చేసిసారండి బాబు! పాటలు వినడం, మాటలు వినడం, ఆయన ఉర్లోకొస్తే.. టై కట్టుకున్న వాడి దగ్గర్నుంచి, ఆటో నడిపేవాడి వరకు ఎగేసుకుని ఆయన్ని చూడ్డానికి, వినడానికి వెళ్లడం, చెవులు సాగదిసుకుని మరీ మైమరచిపోవడం, భళ్లున నవ్వి చేతులు చరుచుకోవాడం.. ఇలా అడ్డమైన అలవాట్లు చేసేసి, మన కొంప కొల్లేరు చేసి వెళ్లిపోయాడు. పైపెచ్చు మన ఇంట్లో, వంట్లో తిష్ఠ వేసేసి 'నేను త్యరగా వస్తాను లెండి! ఫోన్లు చేయకండి!' అంటూ అందరికి 'చెయ్యి' ఇచ్చి, పారిపోయాడు.
ఎంత ఇబ్బంది పెట్టిసారండి బాబు.
లేకపోతే ఏఁవిటండి..
.. ఆయనకి మన భాష అంటే అంత ఇదా..! ఉండొచ్చు! అరే.. పాటలు పాడుకోవచ్చుగా.. కబుర్లు చెప్పొచ్చుగా.. ! అబ్బే అలా ఊరుకుంటే ఆయన బాలు ఎలా అయ్యాడు. పాటలో మాటల్నుంచి, మాటల్లో పాటల వరకు ఒహటే వర్రి అయిపోయాడు. పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు గోరుముద్దలు తినిపించినట్టు ఆ నేర్పడాలు, పదిసార్లు వల్ల వేయించడాలు, టీకా తాత్పర్యాలతో ఆ పాఠాలు ఎందుకు చెప్పండి! మన ఇంట్లో మనతో మాట్లాడినట్టు ఆ హితబోధలు, మంచి చెడ్డా, పాత కొత్త విషయాలు, అనుభవాలు, ఆత్మీయపలుకులు.. ఇవాన్ని అలవాటు చేసేసి, ఇప్పుడు చెప్పా చేయకుండా అలా నిష్కరమిస్తే, ఈ తెలుగుజాతి ఎక్కడికి పోతుంది చెప్పండి!
ఇప్పటికే.. మన భాషలోని పాట, మాటల్ని చిలక్కోట్లు కొట్టిసి, పట్టుకు పోతున్నారు. అలాంటి టైములో, టా ఠ్ వీల్లేదు అని అడ్డం పడి బెత్తం పట్టుకునే ఆ మనిషి, చేసింది ఏఁవైనా బావుందా చెప్పండి!
ఏఁవిటో ఆయన పిచ్చి గాని, పాటల్లో, మాటల్లో కూడా భాషని గురించి ఒహెటే వర్రీ.. మరీ అంతలా పట్టించుకోవాలా?
'బాస కాదు.. భాష అనాలి' అని అక్షరాలన్ని బతికించారు.
'అది విసయం కాదమ్మా.. విషయం అని పలకాలి' అంటూ అసలు విషయాలు చెప్పారు.
'పెల్లి కాదయ్యా.. పెళ్ళి.. ళి..ళి.. అనాలి. తెలుగులో ల కి ళ కి తేడా ఉంది.' అంటూ లక్షణంగా పాఠాలు చెప్పారు.
'శృతి, లయ, గమకాలు, చమకాలు.. అన్నీ పస్ట్ క్లాస్ గా ఉన్నాయి. కాని పాట అర్ధం తెలుసుకుని అది అనుభవించి పాడితే ఇంకా బావుంటుంది' అంటూ చూరకలు వేసి, పాటల భావాలకి పెద్దపీట వేసారు.
"సరే బండి ఱ ని అటకెక్కించిసారు. కనీసం ఉన్న 'ర' ని రాసి రంపాన పెట్టకండి." అంటూ తెలుగు మాష్టారిలా అక్షరాలకి ఆయువు పోసారు.
పిల్లల్ని, పెద్దల్ని, తోటి వారిని, పక్కవాళ్లని, ఎక్కడో ఉన్నవాళ్లని, అక్కడే ఉన్నవాళ్లని, రాసిన వారిని, రాస్తున్న వారిని, వాయించిన వారిని, వాయిస్తున్న వారిని.. అలా పాటకి మాటకి పట్టం కట్టిన ప్రతి ఒక్కరిని మెచ్చుకున్నారు.
ఎదుటివారికి నమస్కారం పెట్టే సంస్కారం, తనని మొసిన బోయిలా పాదాలకు నమస్కారం పెట్టి బుణం తీర్చుకున్నాడు.
పెద్దాయనలా నాలుగు పాటలు పాడి వెళ్లొచ్చుగా.. అబ్బే అలా చేయకుండా పాటలు, మాటలు, నటనలు...ఒకటేమిటి, ఇలా అన్ని చిందులూ వేసి డెబ్బై ఏళ్ల వయసులో లో కూడా ఇరవై ఏళ్ల 'బాలుడి'గా కోట్లాది కొంపల్లో కూర్చుని, ఒక్కసారిగా లేచి వెళ్లిపోవడం అస్సలు బాలేదు.
పాట ఉన్నంత వరకు ఆయన మనతో ఉంటారని సరిపెట్టుకోవడం.. జీవితంలో రాజీ పడటమే!
అసలు రాజీ పడలేని విషయం ఏఁవిటో తెల్సా..
తెలుగు మాటకి, పాటకి.. చివరికి ఒంటరి ఆక్షరానికి కూడా పెద్ద దిక్కు.. అర్దంతరంగా వలస వెళ్లిపోయింది.
తెలుగు పలుకలకు జీవం పోసే నాధుడు.. వెంటుండి కాపాల కాసే కాపరి .. కాటికి చేరిపోయాడు.
ఆనాధిగా మిగిలిపోయిందనే వేదన అక్షరానికి మిగిలిపోయింది!
చివరిగా ఒక్కమాట..
ఎదుటివారికి నమస్కారం పెట్టే సంస్కారంతో పాటు, తనని మోసిన బోయిలకి సైతం.. పాదాలు తాకి బుణం తీర్చుకున్నారు. కాని తనని మోసిన ఈ ఐదు తరాల బోయిలకు మాత్రం.. చెప్పా చేయకుండా శెలవుచీటి పంపిసారు!
ఇదేం.. బావులేదయ్యా!
ఇది తెలుగోడి గోడు!!
... జయంతి ప్రకాశ శర్మ
మానవులుగా బతకటం కాదు.. మానవత్వంతో బతకాలి
_ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి !_
_ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు !_
_దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనేవున్నాడు._
_సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు._
_కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో !_
_జ్ఞానం.. ఆలోచించి మాట్లాడుతుంది. అజ్ఞానం.. మాట జారాక ఆలోచిస్తుంది. అమాంతం అజ్ఞానం పోయి జ్ఞానంరాదు._
_కొబ్బరిచెట్టు పెరిగేకొద్దీ పాతమట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగేకొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి._
_పుండు మానితే పొలుసు అదేపోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది ! జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభంలేదు !_
_సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి._
_నీపై నమ్మకం నీకుబలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీబలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !_
_మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసినవారు వదిలిపెట్టలేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణంపోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది !_
_నీపరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో._
_వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ?_
_నిజాయితీపరులు సింహంలాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !_
_ముని-మహర్షి-తపస్వి-యోగి.. వీరు వేరువేరు._
_మౌనంగావుండేవాడు ముని._
_నియమనిష్టలతో తపింపచేసుకునే వాడు తపస్వి._
_అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి._
_ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి._
_పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !_
_ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నావాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు._
_వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మవుందో లేదో తెలీదు._
_నువ్వు 'నావాళ్ళు నావాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళవాళ్ళకోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !_
_అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈమాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !_
_మరణం దగ్గరపడితేనే మహాసత్యాలు బోధపడ్తాయ్._
_పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది. వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగమొస్తే నీబదులు భరించటానికి ఎవరూ దొరకరు._
_వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు తెరపడేరోజు ఏంతెలిసినా ప్రయోజనమేంటి ?_
_పక్కనెంతమందున్నా,ఎంత సంపదున్నా ఏంటి ?_
_30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే.. పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా వదిలేసే పోవాలి !_
_జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు !_
_మానవులుగా బతకటం కాదు.._
_మానవత్వంతో బతకాలి !
ఒరేయ్ పిల్లలూ ఏడవకండర్రా! అంతల్లా గుక్క పెడితే గొంతు పాడవుతుందిరా. అదిగో మళ్ళీ! నేను చెబుతున్నా అలానే ఉంటే ఏలా? బాధ ఉంటుందిరా బంగారాలూ; ఉండదని నేను అనను. కానీ ఒక్కసారి ఆలోచించండి! ఈరోజు కాకపోతే, రేపు. పోనీ పదేళ్ళ తరువాత. ఎప్పటికైనా ఇది తప్పదు కదా. అయినా, నేనంటే అభిమానం ఉంటుందని తెలుసుకానీ.. మరీ ఇంత వెర్రిప్రేమ ఏమిట్రా మీకు. నా భార్యాపిల్లల్ని, భారతీరాజా, ఇళయరాజా, జానకి గారు, రామోజీరావు గారు, మా అన్నయ్య విశ్వనాథ్, తమ్ముడు కమల్‌హాసన్ వంటి ఆత్మీయుల్ని, మరీ ముఖ్యంగా, లక్షల సంఖ్యలో ఉన్న మిమ్మల్మి, లక్షలు కాదేమో కోట్లే అయ్యుండొచ్చు కదా? ఇలా మీ అందరినీ విడిచిపెట్టి వచ్చేస్తుంటే.. నాకూ దుఃఖం తన్నుకొచ్చిందిరా పిల్లలూ. నాకు 75 యేళ్ళు వచ్చినా నేను బాలుడినే కదా. మీ బాలూనే కదా. అందుకే దుఃఖం ఆపుకోలేక పోయాను. ఇక్కడకు వచ్చే వరకూ మీ అందరి కోసం ఏడుస్తూనే ఉన్నాను. ,
కానీ ఇక్కడకు వచ్చిన క్షణం నుండి నా దుఃఖమంతా ఆవిరైపోయింది. నా కోసం స్వయంగా మా అమ్మానాన్న, మా గురువుగారు కోదండపాణి గారు ఎదురొచ్చారు. ఒక్కసారి ఊహించండి, అలాంటి క్షణంలో నా మనఃస్థితి ఎలా ఉంటుదో? అలా వాళ్ళ ముగ్గురికీ సాష్టాంగ నమస్కారం చేసి, ఈ లోకంలో ప్రవేశించాను. ఇక్కడంతా చాలా బావుందిరా. మరీ ముఖ్యంగా ఇక్కడ ఏడుపన్నదే లేదు. లోపలికి వచ్చిన దగ్గర నుండి నా పెదాలు నవ్వుతూనే ఉన్నాయి. నా గుండె ఆనందంతో పొంగుతూనే ఉంది. అసలు ఏ ఏడుపు లేకపోవడమే స్వర్గంరా నాన్నా! అంతకుమించేమీ కాదు. మీరు కూడా అక్కడ అలా ఉండడానికి ప్రయత్నించి చూడండి. అప్పుడు అదే స్వర్గమవుతుంది.
ఈపాటికి మీరు ఊహించే ఉంటారు, తరువాత నేనెక్కడకి వెళ్ళానో! మహ్మద్ రఫీ గారి దగ్గరకురా. మామూలుగా వెళ్ళలేదు. చిన్నపిల్లాడిలా పరిగెత్తుకు వెళ్ళాను. బడే గులాం అలీ ఖాన్, మెహదీహసన్ కూడా అక్కడే ఉన్నారు. దానితో నా ఆనందం అంతకు పది రెట్లు పెరిగింది. వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుతుండగా అక్కడకు బాపూ గారూ, రమణగారు వచ్చారు. మరి బాపూ గారికి వీళ్ళ సంగీతం అంటే ఎంత అభిమానమో తెలుసు కదా. “ఏమిటి బాలూగారు, అప్పుడే వచ్చేశారు?” అని ఆశ్చర్యంగా అడిగారు రమణగారు. మన “కొత్త సినిమాకి సంగీతం చేద్దామని” అని చిన్నగా నవ్వారు బాపు గారు. “ఏంటి ఇక్కడ కూడా సినిమాలు ఉంటాయా?” అని ఆశ్చర్యంగా అడిగాన్నేను. “ఇక్కడ లేనిదీ, దొరకనిదీ అంటూ ఏదీ లేదు బాలూ గారు; ఒక్క ఏడుపు తప్ప. అందుకే పాపం మన బాలచందర్ గారు ఎంతటి ప్రతిభావంతుడైనా, ఎన్నెన్ని మంచి కళాఖండాలు తీస్తున్నా, జనం రావట్లేదు. భూలోకంలో ఆయన మార్కెట్ ఎంత ఫుల్లో.. ఇక్కడంత నిల్” అన్నారు రమణగారు.
“మరి ఇక్కడ మార్కెట్ ఎవరికుంది?” అన్నాన్నేను. “మాకైతే బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ అప్సరసలతోటే మాకు తలనొప్పిగా ఉంది. ఈ బాపూ ఎవరో ఒక భూలోకంనుండి వచ్చినమ్మాయినో, పాతాళం నుండి వచ్చినమ్మాయినో హీరోయిన్‌గా తీసుకుంటాడు. ఇతడి తీతకి ఆ అమ్మాయిలు ఈ రంభా ఊర్వశులకంటే మాచెడ్డ అందంగా కనబడతారు. దానితో దేవతలలో ఆ అప్సరసల ప్రభ కొంచెం తగ్గింది. అందుకే మామీద ఆ కినుక. ఇక్కడ అందరికంటే మంచి మార్కెట్ మాత్రం మన జంధ్యాలదే, సర్లే మీరొచ్చేశారు కదా, ఇంక మనకు బోలెడంత కాలక్షేపం. ముందు కాసేపు అలా ఈ స్వర్గం అంతా తిరిగిరండి, తరువాత తాపీగా మాట్లాడుకుందాం” అని నా భుజం మీద చిన్నగా తట్టి అన్నారు మన రమణ గారు.
నేనలా సరదాగా తిరుగుతుండగా, ఒకచోట ఐరావతం ఎక్కి వస్తున్న ఇంద్రుడు కనబడ్డాడు. “బాలుగారూ బావున్నారా!” అన్నాడు. నేనెంత ఆశ్చర్యపోయానో చెప్పలేను. “నేను మీకు తెలుసా” అని అడిగా. మీరు తెలియని లోకం ఏదుందండి అసలు. నేనూ, మా శచీ రోజూ మీ పాటలతోనే నిద్రలేస్తాం. ఇదిగో ఇప్పుడు ఇలా విహరిస్తూ కూడా మీ పాటలే వింటున్నా, అంటూ ఆ ఐరావతం మీద ఉన్న చిన్నపాటి స్వరమంజూషలో ఉన్న మీటను పైకి జరిపాడు. “రా దిగిరా దివినుండి భువికి దిగిరా” అనే పాట వస్తోందప్పుడు. ఇంద్రుడు పెద్దగా నవ్వుతూ.. మొన్న దేవతల సమావేశంలో పెట్టిన విభావరిలో ఈ పాట రాగానే.. తన్మయత్వంలో ఉన్న మా అధినేతలైన ఆ పరమశివుడు, మహావిష్ణువు భూలోకాని బయల్దేరబోయారు. మేం కాళ్ళావేళ్ళా పడి వాళ్ళను ఆపాల్సివచ్చింది.
“సరే సరే ఇకనుండి మనం రోజూ కలుస్తూనే ఉంటాం కదా! అలా తిరిగిరండి కాసేపు” అని అలా ముందుకు వెళ్ళిపోయాడు. తరువాత నేను నందనవనంలోకి వెళ్ళాను. అక్కడ ఉన్న కల్పవృక్షానికి, కామధేనువుకి నమస్కరించుకున్నాను. ఇంతలో మా వేటూరి సుందరరామ్మూర్తి ఎదురొచ్చాడు. నన్ను చూడగానే ఆశ్చర్యపోయాడు. “దిక్కుమాలింది అప్పుడే వచ్చేసావేమిట్రా?” అని అలా నోరుతెరచే నిలబడిపోయాడు. “మీకు తెలుసు కదా! దిక్కుమాలింది అన్నది ఆయన ఊతపదం.” నేను వెంటనే వెళ్ళి మా సుందర్రాముడిని గట్టిగా కౌగిలించేసుకున్నాను. అక్కడనుండి ఆయన నన్ను ఆ స్వర్గమంతా తిప్పుతూనే ఉన్నాడు. నాకంటే పదేళ్ళు ముందొచ్చాడుగా మరి.
ముందుగా త్యాగరాజస్వామి వద్దకు తీసుకువెళ్ళాడు. అంతటి మాహానుభావుడిని చూడగానే నా ఒళ్ళంతా ఆనందంతో పులకరించిపోయింది. అక్కడెవరో పెద్దాయన త్యాగరాజస్వామికి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఆయన వెనుకభాగం మాత్రమే కనబడుతోంది. కానీ, ఎవరో తెలిసినవారే అన్నట్టు అనిపించడంతో, మెల్లిగా ముందుకు వెళ్ళి చూశాను. ఆయన, ఎవరొచ్చారా అన్నట్టు తలత్రిప్పి చూశారు. ఆశ్చర్యం.. మన మంగళంపల్లివారు. ఆయన నన్ను చూడగానే “ఓయ్ బాలూ నువ్వూ వచ్చేశావా” అన్నారు పెకి లేస్తూ. నేను ఆ త్యాగరాజస్వామి పాదాలకూ, బాలమురళిగారి పాదాలకు నమస్కరించాను. మంగళంపల్లివారు నన్ను లేవనెత్తి కావలించుకొని, త్యాగరాజస్వామికి నన్ను చూపిస్తూ.. “స్వామీ! మా బాలూ” అన్నారు. అప్పుడు ఆయన కళ్లల్లో ఎంత సంతోషం కనబడిందో చెప్పలేను. అప్పుడా త్యాగరాజస్వామి చిన్నగా ఆశీఃపూర్వకంగా నవ్వుతూ.. “తెలుసు” అన్నారు. నేను మరోసారి శిరస్సువంచి ఆయనకు నమస్కరించాను.
మళ్ళీ కలుస్తామని వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని నేనూ, వేటూరి అక్కడనుండి బయలుదేరాం. నిన్న రాత్రి వరకూ అలా కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూనే ఉన్నాం. మధ్యలో మాకు జంధ్యాల కలిశాడు. ఇంక చెప్పేదేముంది. నవ్వులే నవ్వులు. కాసేపటికి మా దగ్గరకు ఇద్దరు దూతలు వచ్చి, “మిమ్మల్ని దేవేంద్రులవారు స్వరస్థలికి సగౌరవంగా తీసుకురమ్మన్నారు మహాశయా” అన్నారు. సరే పదమంటూ వాళ్ళ వెనుక బయలుదేరా. వేటూరీ, జంధ్యాల కూడా మా వెంటే వచ్చారు. అక్కడ సభంతా గంధర్వులతో నిండిపోయి ఉంది. తుంబురుడు, నారదుడు కూడా కనిపించారక్కడ. అధ్యక్షపీఠంలో సాక్షాత్ సరస్వతీదేవి కూర్చుని ఉంది. నన్ను చూడగానే “రా నాయనా!” అంది. నేను గభాలున వెళ్ళి అమ్మ పాదాల మీద పడ్డాను. “నువ్వు పెట్టిన భిక్షతోనే 54 సంవత్సరాలపాటు భూలోకంలో గానగంధర్వుడన్న కీర్తి సంపాదించానమ్మ” అంటూ, ఆనందంతో ఉబికి వచ్చే కన్నీళ్ళతో అమ్మ పాదాలను తడిపివేశాను. అమ్మ ఆనందంగా.. “లే నాయనా, లే!. ఇక్కడ కూడా నీ ప్రతిభ అసాధారణ స్థాయిలో వెల్లడి కాగలదు. నీ కీర్తి ఆ చంద్రతారార్కం ఉంటుంది.”
పైనున్న ఏడులోకాలలోనూ ఏ సంగీత విభావరి అయినా, జంటగానం చేయాలన్నప్పుడు ఈ తుంబుర నారదులే వెళ్ళవలసి వస్తోంది. ప్రతీచోటకీ వారే అంటే కష్టం కదా నాయనా. అందుకే ఇకనుండి ఆ బాధ్యతలో కొంత నువ్వు కూడా తీసుకోవాలి. ఇదివరకే వచ్చి వేచి ఉన్న ఆ మహాపురుషునితో కలసి నువ్వు జంటగానం చేయాలి అంటూ తన కూడిచేతి చూపుడు వ్రేలితో సభలో ఉన్నతాసనంపై కూర్చున్న ఉన్న ఒకవ్యక్తిని చూపించింది. నేను అటుగా చూశాను. “మాష్టారు. మన ఘంటసాల మాస్టారు” నేను చేతులెత్తి నమస్కరించాను. ఆయన కళ్ళతోనే ఆశీర్వదించారు.
తరువాత ఆ సరస్వతీదేవి.. “నాయనా! నువ్వు మొదలు పెట్టవలసిన ఇంకొక ముఖ్యమైన పని కూడా ఉంది. భూలోకంలో నువ్వు నిర్వహించే “పాడుతా తీయగా” వంటి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ప్రారంభించాలి. మా ముగ్గురమ్మలం న్యాయనిర్ణేతలగా వ్యవహరిస్తాం. గణపతి, కుమారస్వామి కూడా ఆ కార్యక్రమంలో చిన్నపిల్లల విభాగంలో పోటీపడతారు. కార్యాచరణమను సిద్ధంచేసుకో నాయనా. వచ్చే విజయదశమిని ఈ కార్యక్రమానికి శుభమూహూర్తం నిర్ణయించాం. ఇది పరమేశ్వరాజ్ఞ” అని చెప్పి సభ ముగించింది.
ఆ తరువాత నేను, వేటూరీ, జంధ్యాల మా బసకు వచ్చేశాం. రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. ఒకరిమీద ఒకరం చెణుకులు విసురుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నాం. పొద్దున్న లేవగానే.. ఈ విషయాలన్నీ మీకు ఎలా అయినా చేరవేయాలన్న తహతహ మొదలయ్యింది. ఆ మాటే వేటూరికి చెప్పాను. నిన్నటి నీ అనుభవాలు, అనుభూతులూ ఒక ఉత్తరంలో వ్రాసి ఇవ్వమన్నాడు. అలానే వ్రాసి ఇచ్చాను. దానిని భూలోకానికి పంపే మార్గం కావాలి కనుక, మా వేటూరి ఫొటో ఫ్రేము కట్టించి పెట్టుకున్న Rajan PTSK ను ఈ ఉత్తరం చేరవేసే మాధ్యమంగా ఎంచుకున్నాము. పాపం అతడు కూడా నిన్నటి నుండి నాకోసం ఏడుస్తూనే ఉన్నాడు. అతడి ఇంటిలో ఉన్న మా వేటూరి ఫొటో ద్వారా ఈ ఉత్తరాన్ని జారవిడిచాము. అదే మీరిప్పుడు చదువుతున్నారు. ఇకపై మీరెవ్వరూ ఏడవవద్దు. నేనిక్కడ చాలా ఆనందంగా ఉన్నాను. ఇక ఉంటానురా బంగారాలు. జాగ్రత్తగా ఉండండీ!
సర్వేజనా సుజనా భవంతు! సర్వే సుజనా సుఖినో భవంతు! స్వస్తి!
- మీ బాలు
యుద్ధం ముగిసింది ..అర్జనుడు హుందాగా కూర్చోగా రధం నగరాని వచ్చింది...కృష్ణుడు అర్జనుడిని ఓరకంట చూస్తూ " దిగు పార్ధా" అన్నాడు.
పార్ధుడు మొహం చిట్లించాడు ..చికాకుపడ్డాడు..
ఆనవాయితి ప్రకారం ముందుగా సారధి దిగి రధం యొక్క తలుపు తీసాక వీరుడు దిగుతాడు........
దానికి విరుద్ధంగా ముందు సారధి దిగకుండా తనను దిగమనడంతో అర్జనుడి ఇగో హర్ట్ అయింది...
ఐనా ఆ మహనుభావుడిని ఏమీ అనలేక...రధం దిగాడు..
అర్జనుడు దిగి కొంతదూరం పోయాక అప్పుడు దిగాడు కృష్ణుడు ..
మరునిముషం రధం భగ్గున మండి బూడిద అయింది...
అదిరిపడ్డాడు అర్జనుడు...
యుద్ధం లో ఎన్నో దివ్యస్త్రాలు ప్రయోగించబడినవి వాటిని తన శక్తిద్వారా అదిమిపట్టి ఉంచాడు కృష్ణుడు ఆయన దిగగానే శక్తి విడుదలై రధం మండిపోయింది... అదే ముందు కృష్ణుడు రధం దిగిఉంటె.....?
అలానే కొన్ని నిజాలు చేదుగా ఉంటాయ్
తప్పదు...
చెప్పడం ధర్మం...మాకన్ని తెలుసనుకుంటె మన ఖర్మం....
" ఓం నమో భగవతే వాసుదేవాయ".
🙏🏻జై శ్రీ కృష్ణ 🙏🏻
నీవు లేవు నీ పాటవుంది
నీవు పరచిన వేలాది పాటల బాట వుంది.
🕉️జంబుద్వీపే భరతవర్షే భరతఖండే🕉️
సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.
అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?
జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:
1) కేతుముల వర్ష
2) హరి వర్ష
3) ఇలవ్రిత వర్ష
4) కురు వర్ష
5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష
7) కింపురుష వర్ష
8 ) భద్రస్వ వర్ష
(స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి. Check the picture for clear idea.)
పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.
ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.
మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.
దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !
మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.
మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?
ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.
🌷🙏శ్రీ మాత్రే నమః🙏🌷
✍అన్ని రోగాలకూ విరుగుడు మనసే!✍
జపాన్ శాస్త్రవేత్తలు చేసిన వివిధ ప్రయోగాలలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఇంతకాలం మనం గుడ్డిగా నమ్ముతున్న అనేక ఆరోగ్యసమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారంలో లేవని మన జీవించే విధానంలోనే ఉన్నాయని, మనసును హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు రావని వారు తేల్చిచెబుతున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసుబాగున్న వారు ఎక్కువకాలం జీవిస్తున్నారని తేల్చారు. మనసు కలతబారితే లేనిపోని ఆలోచనలు చోటుచేసుకుని వాటి నుంచి బైటపడడానికి బలహీనతలు పెంచుకోవడం, వాటికి బానిసలై దురలవాట్ల పాలైపోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు. ఇటీవలకాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి జీవన శైలిని సరిదిద్దే పనిలో పడ్డారు.
అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇచ్చే పద్ధతి మార్చుకున్నారు. ఇది వరకు తినకూడదు అన్న అన్ని రకాల ఆహారాన్ని నిరభ్యంతరంగా తినమంటున్నారు. పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందుకోసం నచ్చిన పాటలు వినమంటున్నారు.
ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారు. కొందరు వాకింగ్ ఇష్టపడితే మరికొందరు జిమ్‌కు వెళ్ళాలనుకుంటారు. ఇంకొందరు బ్రిస్క్‌వాక్ చేయాలనుకుంటే, ఇంకొందరు స్టురైకేస్ వాక్ చేయాలనుకుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచిపెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని సూచిస్తున్నారు. ఒక్కసారిగా వీరి వైఖరి ఇలా మారిపోడానికి కారణం సరికొత్త అధ్యయనాలలో వెలుగుచూస్తున్న అంశాలే కారణం. ఇలా వెల్లడైన అనేక పరిశోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది. దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం.
మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్: కడుపులో గ్యాస్ సమస్యను వాయువు అంటారు. ఇది రావడానికి, ముదరడానికి కారణం ఆహార లోపాల వల్ల కాదట. మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ వస్తుందట !
ఆవేశ కావేశాల వల్లే అధికరక్తపోటు: ఉప్పు ఎక్కువగా తినే వారికంటే ఆవేశ కావేశాలను అదుపులో పెట్టుకోని వారిలోనే అధికరక్తపోటు ఎక్కువట !
అతిబద్ధకం వల్ల చెడుకోలెస్టరాల్: కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడుకోలెస్టరాల్ ఎక్కువట!
మధుమేహం సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే, అధికస్వార్ధం, మొండి తనం ఉన్నవారిలో నే ఎక్కువట !
అతివిచారం వల్ల ఆస్త్మా: ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే, అతివిచారం వల్లనే ఊపిరితిత్తులలో మార్పులు వచ్చి ఆస్తా వస్తుందట.
ప్రశాంతత లేక గుండెజబ్బులు: ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయట. అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట. మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్ల వల్లకాదని లైఫ్‌స్టయిల్ సంబంధమైనవేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు. వారి అధ్యయనం ప్రకారం
50% ఆధ్యాత్మికత లోపంవల్ల
25% మానసిక కారణాల వల్ల
15% సామాజిక, స్నేహబాంధవ్యాల లోపం వల్ల
10% శారీరక కారణాల వల్ల
రోగాలు వస్తున్నాయి. అందువల్ల కడుపుమాడ్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా జీవన శైలిని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు. వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే
స్వార్ధం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం, వంటి వ్యతిరేక భావాలను వదిలించుకోవాలి
కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్ధం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, హాస్య ప్రియత్వం, సంతోషం , సానుకుల దృక్పథం పెంచుకోవాలి.
Very nice information pleace forward
*ఈ పదములు చూడండి. తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు.*
మనం చాలా పదప్రయోగాలు పుస్తకాలు చదివే అలవాటు తప్పిపోతూ మర్చిపోతున్నాం.
1.కలకల 2.కిలకిల 3.గలగల. 4.విలవిల. 5.వలవల. 6.మలమల. 7.వెలవెల. 8.తళతళ.
9.గణగణ. 10.గునగున
11.ధనధన. 12.ఝణఝణ. 13.కణకణ. 14.గడగడ. 15.గుడగుడ. 16.దడదడ. 17.కిటకిట. 18.గటగట. 19.కటకట. 20.పటపట. 21. కితకిత
22.గిలి గిలి. 23.కిచకిచ. 24.జిబ జిబ. 25.చక చక. 26.పక పక.
27.మెక మెక 28.బెక బెక. 29.నకనక. 30.చురచుర. 31.చిరచిర. 32.బిరబిర. 33.బుర బుర. 34.పరపర. 35.జరజర. 36.కర కర. 37.బరబర. 38.చర చర. 39.గజగజ. 40.తపతప. 41.టపటప. 42.పదపద. 43.గబగబ. 44.గుసగుస.. 45.కువకువ..
46.ఠవఠవ 47.చిమచిమ. 48.గురగుర. 49.కొరకొర.
50.భుగభుగ.
51.భగభగ. 52.ఘుమఘుమ. 53.ఢమఢమ. 54.దబదబ. 55.కుహుకుహు.
అందుకే.......
దేశ భాషలందు తెలుగులెస్స..
మంజీరమ్మ పాద మంజీర జీవభావం!