Friday, April 24, 2015

ఆరోగ్యమే మహా భాగ్యం. వేసవి లో సహజ పోషకాల పానీయాలు సేవిద్దాము

                                                  వేసవి లో సహజ పోషకాల పానీయాలు సేవిద్దాము
వేసవి రాగానే చల్లని పానీయాల వైపు మనసు
మళ్ళుతుంది. శీతల పానీయాలు ఆరోగ్యానికి హాని
కలిగిస్తాయి. ఈ క్రింది సహజ పోషకాలు 
పానీయాలను సేవిద్దాము.
1) కొబ్బరినీరు: ఇందులో 5 కీలక electrolights (ఎలెక్ట్రోలైట్స్)
పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, కాల్షియం
లను కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచును.
2) మజ్జిగ: దీనిలోని ల్యాక్టోబాసిల్లస్ అనే మిత్ర
కారక బ్యాక్టీరియా వలన వ్యాధి నిరోధక శక్తి
పెరుగును. ఇందులోని ల్యాక్టి కామ్లం పదార్థాలను
త్వరగా జీర్ణం చేయును. ఇందులో
పొటాషియం, క్యాల్షియం, రైబోఫెవిన్ ,విటమిన్ B-12
లభిస్తాయి.
3) సబ్జా నీరు: మహిళలకు అవసరమయ్యె పాలేట్,
నియాసిన్, చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్ E
అధికంగా కలిగి ఉండటం వలన శరీరంలో పేరుకున్న
వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ది
చేస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
4) పుచ్చకాయ : గుండె జబ్బులు రాకుండా చేసే
పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ A
ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే LYKOPIN (లైకోపినన)
సూర్యరశ్మి లోని U.V కిరణాల నుండి చర్మాన్ని
రక్షిస్తుంది.
5) తాటి ముంజలు : 6 అరటి పండ్లలో ఉండే పొటాషియం
ఒక్క తాటి ముంజలో ఉంటుంది బి.పి ని అదుపులో
ఉంచి కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఎముకలను
బలంగా ఉంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని
పెంచుతుంది.
6) నిమ్మ రసం: సిట్రిక్ ఆసిడ్ మూత్ర పిండాలలోని
రాళ్ళను కరగదీస్తుంది. విటమిన్ సి ఎక్కువ
7) చెరుకు రసం: ఇందులో ఐరన్ ,ఫాస్పరస్ ,
క్యాల్షియం , మెగ్నీషియం పొటాషియం
మూలకాలుంటాయి. ఇవి రొమ్ము , ప్రోస్టేట్ క్యాన్సర్
కారకాలతో పోరాడుతాయి. మూత్ర పిండాలు
గుండె, మెదడుల పనితీరుని మెరుగు పరుస్తాయి
.
8) రాగి జావ: ఇది మధుమేహం, కీళ్ల నొప్పుల,
acidity (ఎసిడిటి) ని తగ్గిస్తుంది
మనకి అందుబాటులో వుండే వీటినన్నిటిని సేవించి చక్కని ఆరోగ్యాన్ని
 పొందుదాము. 
                                                     ఆరోగ్యమే మహా భాగ్యం.

" శ్రీ సూర్యనారాయణ మేలుకో

కవితాత్మకమైన భావాలు జీవితంలో మనం ఇంకా దర్శించని కొన్ని కొన్ని లోతులని మనకి చూపే ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
మామూలుగా చూస్తే ఇదే సూర్యుడు.
రోజూ ఉదయిస్తూ ఉంటాడు,మధ్యాహ్నం విపరీతమైన వేడిని వెదజల్లుతూ "వెధవ ఎండ,భరించలేకపోతున్నాం " అని మనం అనుకునేలా ప్రవర్తిస్తూ ఉంటాడు,మళ్ళీ సాయంత్రం పూట ఏదో పనిఉన్నవాడిలా అస్తమిస్తూ పోతూ ఉంటాడు.ఈ సూర్యోదయ,సూర్యాస్తమయ కాలాల మధ్యలో సూర్యుని తాలూకు సౌందర్యాన్ని ఎప్పుడైనా దర్శించామా?
అన్నమాచార్యులు ఎంత బాగా మనకా సౌందర్యాన్ని దర్శింప చేస్తున్నడోచూడండి ఈకీర్తనలో...
" శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ
పొడుస్తూ భానుడూ పొన్న పువ్వు ఛాయ
పొన్నపువ్వు మీద పొగడపువ్వు ఛాయ
ఉదయిస్తూ భానుడు ఉల్లిపువ్వు ఛాయ
ఉల్లిపువ్వుమీద ఉగ్రంపు పొడిఛాయ
గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ
జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ
జాజిపువ్వుమీద సంపంగీ పూఛాయ
మధ్యాహ్న భానుడు మల్లెపువ్వు ఛాయ
మల్లెపువ్వుమీద మంకెన్న పూఛాయ
మూడుఝాముల భానుడు ములగపువ్వు ఛాయ
ములగపువ్వుమీద ముత్యంపు పొడిఛాయ
అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ
ఆవపువ్వుమీద అద్దంపు పొడిఛాయ
వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ
వంగపువ్వుమీద వజ్రంపు పొడిఛాయ
గుంకుతూ భానుడు గుమ్మడిపూఛాయ
గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ "

అన్ని దానాలలోకి విద్యాదానం గొప్పదా ?

                               అన్ని దానాలలోకి విద్యాదానం గొప్పదా ?    

                  సాధారణంగా అన్నిదానాలలోకి అన్నదానము గొప్పది అంటారు. కానీ  మనువు అన్నీ దానాలలోకి విద్యాదానము  మహోన్నతమైన ఫలమని తెలియ చెప్పాడు. నీరు, అన్నము, గోవులు, భూమి, వస్త్రములు, బంగారము, దినసరి భత్యములు .... వీటి అన్నింటికన్నా  విద్యాదానము గొప్పది. ఎందుకంటె వస్తువులు, ధనము లాంటివి దానంగా ఇస్తే వారికే ఉపయోగపడతాయి. అదే విద్యాదానం చేస్తే వారికీ, వారి కుటుంబ మంతటికి ఉపయోగ పడుతుంది అని మనువు తెలియచేసాడు.

మంచిమాట!!!

                                                               మంచిమాట!!!
పొగడ్తల కంటే సద్విమర్శలు మనిషికి ఎప్పుడూ మేలు చేస్తాయి,
ఉపయోగపడతాయి.మంచి జ్ఞాపకశక్తి మంచిదే, 
కాని ఇతరులు మీకు కలిగించిన హానిని 
మరచిపోయే సామర్ధ్యం అన్నదే 
గొప్పతనపు పరీక్ష అవుతుంది.


తిరుపతిలో శ్రీవెంకటేశ్వరస్వామికి పద్మావతీ అమ్మవారు కుడిప్రక్కన, శ్రీ లక్ష్మీదేవి ఎడమ ప్రక్కన ఎందుకు ఉంటారు?

తిరుపతిలో శ్రీవెంకటేశ్వరస్వామికి పద్మావతీ అమ్మవారు కుడిప్రక్కన, 
శ్రీ లక్ష్మీదేవి ఎడమ ప్రక్కన ఎందుకు ఉంటారు?

                                           తిరుమలపై శ్రీమహావిష్ణువు  మనుష్య రూపము దాల్చడము, ఆ తరువాత ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం చేసుకోవడము అందరికీ తెలిసిందే. శ్రీవేంకటేశ్వరస్వామి , పద్మావతి దేవిల వివాహం గురించి సరిగ్గా లక్ష్మీదేవికి నారదుడు చెబుతాడు. దానితో లక్ష్మీదేవి  శ్రీవేంకటేశ్వరస్వామి , పద్మావతి దేవిలతోను  గొడవకు దిగుతుంది. ఆ సమయంలో శ్రీనివాసుడు పద్మావతి  పూర్వగాధ శ్రీలక్ష్మీదేవికి చెప్పి, కుడి వక్షస్థలముపై పద్మావతిని, శ్రీలక్ష్మీదేవిని ఎడమ వక్షస్థలం పైన ఉండమని కోరుతాడు. భర్త ఆదేశానుసారంగా ఇద్దరు అమ్మవార్లు స్వామికి ఇరువైపులా ఉంటారని పెద్దలు చెపుతారు.


ఆంధ్ర ప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలో నేను ఇంటర్మీడియెట్ 1978-80

AP Residential Junior College, Vijayapuri South, Nagarjuna Sagar is going to celebrate Ruby Jubilee on 31st and and 1st at Sagar. On this occasion, a memoir:
ఆంధ్ర ప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలో నేను ఇంటర్మీడియెట్ 1978-80 లో చదువుకున్నాను. ఆ కళాశాల నా జీవితాన్ని ఊహించని విధంగా మలుపుతిప్పింది.
నేను 1972 నుంచి 78 దాకా తాడికొండ గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. తాడికొండ పాఠశాలలో నేను మొదటి బాచ్ స్టూడెంటుని. 78 లో పదవతరగతిలో నాకు రాష్ట్రంలో పదవరాంకు వచ్చింది. అప్పట్లో మొదటి పదిరాంకులు తెచ్చుకున్నవాళ్ళకి సాగర్ కి ఎంట్రన్సు టెస్టు రాయనక్కర్లేకుండానే ప్రవేశం దొరికేది. పైగా కోరుకున్న బ్రాంచిలో కూడా సీటు దొరికేది. ఆ రోజుల్లో రాంకులు తెచ్చుకున్న విద్యార్థులంతా అయితే ఎం.పి.సి నో లేదా బి.పి.సి నో తీసుకునేవాళ్ళు. కాని నేను సి.యి.సి తీసుకున్నాను. ఆ రోజుల్లో అదొక పెద్ద సంచలనం. నేను సి.యి.సి కోరుకుంటున్నాని ఎలా తెలిసిందో గాని, నేను కాలేజికి వెళ్ళేటప్పటికే ఒక సెలబ్రిటిగా మారిపోయాను. కొన్నాళ్ళ పాటు ప్రతి ఒక్కరికీ నన్ను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది.
మొదటిసంవత్సరంలో సాగర్ నాలో మానసికంగా చాలా కలవరం కలిగించింది. ఆ కలవరానికి చాలానే కారణాలున్నాయి.
మొదటిది, తాడికొండలో ఉన్నప్పుడు మేమంతా తీరప్రాంత జిల్లాలకు చెందినవాళ్ళం కావడంతో అదంతా ఒక పరిమిత ప్రపంచంకిందనే లెక్క. కాని సాగర్ లో మొదటిసారి మేం రాష్ట్రం నలుమూలలనుంచీ వచ్చిన విద్యార్థుల్ని చూడవలసివచ్చింది. ముఖ్యంగా హైదరాబాదులో రకరకాల ఇంగ్లీషు మీడియం స్కూళ్ళల్లో చదువుకుని వచ్చిన విద్యార్థుల్ని చూడగానే చాలా బెరుగ్గానూ,సిగ్గుగానూ ఉండేది. వాళ్ళు ఇంగ్లీషు చాలా సహజంగా మాట్లాడేవాళ్ళు. మేం పదవతరగతి దాకా తెలుగుమీడియం లో చదువుకున్నాం. ఇంగ్లీషులో మాట్లాడటం అలవాటులేకపోగా, మా హైస్కూల్లో ఒక ఉపాధ్యాయుడు ఇంగ్లీషులో మాట్లాడటం అపరాధమనే భావనకూడా మాలో కలిగించినందువల్ల మాకు, ముఖ్యంగా నాకు ఇంగ్లీషులో ఒక్క ముక్కకూడా నోరు తిరిగేది కాదు. పైగా ఇంగ్లీషు క్లాసు కామన్ గా ఉండటంతో అన్ని గ్రూపులవాళ్ళూ కలిసేవారు. వాళ్ళందరిమధ్య నోరుతెరవాలంటే చాలా సంకోచంగా ఉండేది. కాని మా ఇంగ్లీషు లెక్చెరర్ బి.ఎల్. నరసింహంగారు నేను రెండవ సంవత్సరం చివరిలో ఉండగా నేను ఇంగ్లీషులో బాగా పట్టు సాధించానని మెచ్చుకున్నారు. అది నా జీవితంలో నేను పొందిన గొప్ప ప్రశంసల్లో ఒకటి.
ఇక కలవరం కలిగించిన కారణాల్లో రెండవది, తాడికొండలో మాకూ, మా ఉపాధ్యాయులకీ మధ్య మానసికంగా ఎంతో గాడానుబంధం ఉండేది. మేం వాళ్ళను ప్రేమించేవాళ్ళం, మా తల్లిదండ్రులతో సమానంగా చూసుకునేవాళ్ళం. కాని సాగర్ జూనియర్ కళాశాల అయినందువల్ల,తాడికొండ స్థాయిలో మానసికానుబంధం బలపడలేదు. చాలాకాలం పాటు ఆ వెలితి అట్లానే ఉండేది. కాని ఆ శూన్యాన్ని పూరించిన మనిషి అప్పటి మా లోకోపేరెంట్ భద్రయ్యగారు. ఆయన మా ఇకనమిక్స్ లెక్చెరర్. నన్ను చాలా అభిమానించారు. నేను రెసిడెన్షియల్ పాటర్న్ నుంచి వచ్చిన విద్యార్థిననీ తక్కినవాళ్ళకి ఒక మోడల్ గా ఉండాలనీ అనేవారు. ఆ కళాశాలలో నేను రెండేళ్ళపాటు చదవగలిగానంటే అందుకు ఆయన చూపించిన వాత్స్లల్యమే కారణం.
మూడవదీ, బహుశా నా జీవితాన్ని సమూలంగా మార్చివేసిందీ ఒక విషయముంది. అదేమంటే నా మొదటిసంవత్సరం పరీక్షా ఫలితాలు రాగానే అందులో నాకు తెలుగులో 36, ఇకనమిక్స్ లో 36 మార్కులు రావడం. ఆ రెండు సబ్జెక్టులూ నాకెంతో ఇష్టమైనవి. అయినా నాకంత తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయో అర్థం కాలేదు. భద్రయ్యగారు రీకౌంటింగ్ పెట్టిద్దామన్నారుగానీ ఎందుకు పెట్టించలేదో ఇప్పుడు గుర్తు రావడం లేదు.
కాని ఆ సంఘటనతో నాకు చదువుమీదనే ఆసక్తి పోయింది. ఏమైతేనేం, సివిల్ సర్వీసుకి వెళ్ళాలన్న ఉద్దేశ్యంతో సి.ఇ.సి తీసుకున్న నేను నా మొదటిసంవత్సరం ఫలితాల వల్ల మొత్తం కెరీర్ మీదనే దృష్టి వదిలేసాను. నా ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక నేను సిల్వర్ జూబిలీ కాలేజికి వెళ్ళకపోవడానికీ, ఎక్కడో నామమాత్రంగా బి.ఏ లో చేరడానికీ, ఆ తర్వాత ఆ చదువు కూడా మధ్యలో ఆపేసి టెలిపోన్స్ డిపార్ట్మెంట్ లోఉద్యోగంలో చేరిపోవడానికీ ఆ మొదటిసంవత్సరం అనుభవమే కారణం.
సాగర్ జీవితం నాలో కలిగించిన మరొక కలవరం, సాధారణంగా ఆ వయసు కలిగించే కలవరం. పదహారు, పదిహేడేళ్ళ అడాలసెంటు పిల్లవాడి మనసు చాలా లేతగా ఉంటుంది. ఎవరితోనైనా స్నేహం చెయ్యాలనిపిస్తుంది, ఎవరినైనా ప్రేమించాలనిపిస్తుంది. ప్రేమించినవాళ్ళకోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది. తాడికొండ జీవితం నుంచి సాగర్ జీవితానికి వచ్చేటప్పటికి నాకు తెలీకుండానే నా మనసులో వికసించిన కొత్త కలవరాన్ని నేనొక పట్టాన అర్థం చేసుకోలేకపోయాను. ఆ కలవరంలో అక్కడ నా మొదటిసంవత్సరంలో నాకు తోడుగా ఒకరిద్దరు సీనియర్లు నిలబడకపోలేదు.
కాని ఆ కాలమంతటా నన్ను నిజంగా ఆదరించిందీ, అక్కునచేర్చుకున్నదీ సాహిత్యమేనని చెప్పాలి. రైట్ బాంకు బ్రాంచి లైబ్రరీలో అందుబాటులో ఉన్న తెలుగుసాహిత్యమంతా చదివినాప్పుడు. చలం, బుచ్చిబాబు, శరత్ ల కథలు, నవలలతో పాటు సంజీవదేవ్, ఆచంట జానకిరాం వంటివారి రచనలు కూడా నాకు తోడుగా నిలబడ్డాయి.
ముఖ్యంగా ఆ రోజుల్లో నాలో రేకెత్తిన ఎన్నో ప్రశ్నలు మా అక్కకి ఉత్తరాలు రాసేను. ఆమె ఎంతో ఓపిగ్గా, ప్రేమగా నాకు జవాబులు రాసేది. ఆమె రాసిన ఉత్తరాలే లేకపోయుంటే ఆ అయోమయంలో నేనెటుజారిపోయిఉండేవాణ్ణో నాకే తెలియదు.
బహుశా నా రెండవసంవత్సరమంతా నేను చదువు మీంచి దృష్టి సాహిత్యం మీదకు తిప్పిఉంటానని ఇప్పుడు అర్థమవుతున్నది. నా సాహిత్యజీవితానికి నిజమైన పునాదులు అప్పుడే పడ్డాయనుకుంటాను. నేను రెండవసంవత్సరంలో ఉండగానే ఆంధ్రజ్యోతి వారపత్రిక నిర్వహించిన సంక్రాంతి కథలపోటీకి ఒక కథ రాసిపంపించాను. దానికి రాష్ట్రస్థాయిలో మొదటిబహుమతి వచ్చింది. ఆ కథ మా అన్నయ్య పేరుమీద ప్రచురితమయ్యింది. కాని ఆ సంఘటన నా జీవితాన్ని సమూలంగా మార్చేసింది. నా కర్తవ్యం సివిల్ సెర్వంట్ గా గడపడం కాదనీ, ఒక కవిని కావడమనీ,రచయితని కావడమనీ నాలోపల్లోపల నేను బలంగా నమ్మడం మొదలుపెట్టాను.
సాగర్ జీవితం నాలో కలిగించిన కలవరంతో పాటు నాకొక కొత్త జీవితానికి కూడా దారిచూపించిందని చెప్పాను కదా. ఆ జీవితం నాలో కలిగించిన కొత్త చైతన్యం గురించి కూడా రెండుమూడు మాటలు చెప్పాలి.
సాగర్ చుట్టూ ఉండే లాండ్ స్కేప్ లో ఏదో ఒక గంభీరసౌందర్యం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అ రిజర్వాయర్. దూరంగా ఆనకట్ట, సాయంకాలం కాగానే ఆ జలాశయంలో ప్రతిఫలించే దీపాలవెలుతురు. తంగెడు పూలూ, పొద్దున్నే రిజర్వాయర్ మీచి వీచే శుభ్రపవనాలూ నాలో కవిని తట్టిలేపాయి. ఆ రోజులంతటా నేను డైరీలు రాయడం మొదలుపెట్టాను. ప్రతి రోజూ నాలో కలిగే భావాల్ని 'భావవీచిక 'పేరిట రాసుకుంటూ ఉండేవాణ్ణి. ఆ రాతలు నన్ను నాకు చాలా సన్నిహితుణ్ణి చేసాయి. తాడికొండలో నాకు లభించి సాగర్ లో శూన్యంగా మారిన చోటేదో దాన్ని నా భావాలతో నింపుకోవడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో నాకు తెలియకుండానే నేనొక రొమాంటిసిస్టుగా మారడం మొదలుపెట్టాను.
జీవితానికి దూరంగా, కలలప్రపంచంలో మాత్రమే జీవించేవాడు రొమాంటిసిస్టు. అందుకే ఆ రోజుల్లో నాకు చాల ఇష్టమైన కవిత వేదుల రాసిన 'దీపావళినాడు '. 'దినములు పరస్పర ప్రతిధ్వనులుకాగ,ఇరువదైదేండ్లు నా బతుకిట్టె గడిచె, ఈ రహోదు:ఖ వీధులందు నేనెరుగ సఖుల అడుగుజాడలీసరికి కూడ ' ఎన్ని సార్లు చదివి ఉంటానీ వాక్యాన్ని!
ఆ రోజుల్లోనే ఒకసారి సెలవులనుంచి కాలేజీకి తిరిగివస్తూ గుంటూరు బస్ స్టాండ్లో 'అసమర్థుని జీవయాత్ర ' కొని చదివాను. ఆ పుస్తకం నన్ను పూర్తిగా నిశ్చేష్టుణ్ణి చేసింది.
కాని ఆ అగమ్యంలో మళ్ళా మా అక్క ఉత్తరాలే నాకు దారిచూపించాయి. ఆమె రాసిందికదా: కళ జీవితం కాదు, జీవితం కళగా మారాలని. గొప్ప కళాకారుడు తన శక్తినంతా కళగా మార్చుకుని తన జీవితాన్ని అశాంతితో నింపుకుంటాడనీ, అలాకాక తాను జీవించవలసిన రోజువారీజీవితాన్ని కూడా ఎంతో సౌందర్యవంతంగా జీవించగలగడమే నిజమైన కళ అనీ ఆమె రాసింది. అక్కడితో ఆగకుండా నాకు 'సౌందర్య ' అనే కలం పేరు కూడా పెట్టింది.
ఈ ప్రపంచంనుంచి దూరంగా పోవాలనే కలలొకవైపూ, ఈ ప్రపంచంలోనే బాధ్యతో జీవించాలనే ఆమె మాటలు మరొకవైపూ నాలో గొప్ప సంఘర్షణ రేకెత్తించాయి.
ఆ రోజుల్లోనే మా కాలేజీకి శ్రీనివాసరెడ్డిగారు ప్రిన్సిపాలుగా వచ్చారు. అత్యంత నిజాయితీపరుడు, సత్యసంధుడు. పూర్తిగాంధేయవాది. ఆయనవల్లా, ఆయనమాటలవల్లా నాలో గాంధీజీ పట్ల కొత్త కుతూహలం రేకెత్తింది. ఒకసారి ఆయన కాలేజీలో గాంధీక్విజ్ నిర్వహించాలనుకుని ఆ బాధ్యత నాకప్పగించారు. నిజాయితీగా ఆలోచించడం, నిజాయితీగా బతకడం అనే రెండు గొప్ప విలువల్ని ఆయన చాలా సరైన సమయంలో నాకు నూరిపోసారని చెప్పాలి. బహుశా సాగర్ జీవితం నాకు అందించిన అతి గొప్ప ఉపాదానమదే.
చాలా రోజుల తర్వాత చుక్కారామయ్యగారూ, నేనూ ఒకేవేదిక మీద మాట్లాడుతున్నప్పుడు రామయ్యగారు గురుకుల విద్యావ్యవస్థ గురించి చెప్తూ 'గురుకులాల్లో చదువుకున్న విద్యార్థుల గురించి ఏం చెప్పుకోగలిగినా చెప్పుకోలేకపోయినా వాళ్ళు విలువలకోసం బతుకుతారని మాత్రం చెప్పగలం 'అంటూ, 'అందుకు ఉదాహరణ ఇదిగో మా వీరభద్రుడే ' అన్నారు. ఆ మాటలు విన్నప్పుడు నాకు శ్రీనివాసరెడ్డిగారే మదిలో మెదిలారు.
ఇన్నాళ్ళ తరువాత సాగర్ కళాశాల గురించి తలుచుకున్నప్పుడు నాకు రెండు విరుద్ధాంశాలు గుర్తొస్తూ ఉన్నాయి. నా చదువుకీ, ఉద్యోగానికీ సంబంధించిన కెరీర్ కి ఆ కళాశాల నాకేమీ సహకరించలేకపోయింది. కాని అక్కడ నాకెదురైన ఆ అనుభవాలే తటస్థించకపోయిఉంటే నేనొక రచయితగా మారిఉండేవాణ్ణా, జీవితంలో విలువలకి కట్టుబడి ఉండటం అన్నిటికన్నా ముఖ్యమని నమ్మి ఉండేవాణ్ణా అన్నది చెప్పలేను.

A poem for today:


5) 
A poem for today:
అంతా ఆదమరిచినిద్రపోయే అర్థరాత్రి
బయటకివచ్చిచూడు
మామిడిచెట్ల కొమ్మలమధ్య మాఘమాసపుగాలి
ఊయెల్లో పసిపాపలాగా
కనులరమోడ్చి తనలోతనే
నవ్వుకుంటూ కనిపిస్తుంది.

ఎవరూ సొంతంచేసుకోని ఆ చివరిజాము రాత్రి
చంద్రుడొక్కడూ నాకోసం వేచిఉంటాడు
ఒక అనార్ద్ర లోహశకలంలాంటినన్ను
అయస్కాంతశిలలాగా అతడు తాకగానే
చేతుల్లాగా ప్రాణాలు చాపి
రాత్రంతా ఆకాశాన్ని పట్టుకు వేలాడుతుంటాను.
లోయలో సెలయేటివద్ద
రాత్రి చిరుతపులులు నీళ్ళుతాగేటప్పుడు
ఈ చంద్రుడే కదా ఒక కంటకనిపెట్టి ఉంటాడు
అందుకని నా మనోకాననంలో కూడా
ఒక దివ్వెనట్లా
ఎప్పటికీ వెలిగించిపెట్టుకుంటాను.
రైల్లో ప్రయాణీకురాలు
తెల్లవారుతూనే అన్నిటికన్నాముందు
జుత్తు దువ్వుకుని జడవేసుకున్నట్టు
నేను కూడా వేకువకాగానే
రాత్రంతా చిక్కుముళ్ళు పడ్డ నా తలపుల్నిట్లా
ఒద్దిగ్గా ఒక పక్కకు అల్లుకుంటాను.
6) 
A poem for today:
మాఘమాసపు అడవి ఎదట నేను మళ్ళా
పదేళ్ళ బాలుణ్ణి కావాలని ఉంది.
పాతికేళ్ళ యువకుణ్ణి కూడా.
చెట్లు ఆకులు రాలుస్తుండే దృశ్యం
చూస్తూనే ఒక జీవితకాలం గడిచిపోయింది.
కృష్ణదేవిపేట ఏడొంపులఘాటి
కాకరపాడునుంచి బోయపాడువెళ్ళే డొంకదారి
గుమ్మలక్ష్మిపురం, కెరమెరి,నల్లమలకొండల్లో
ప్రతి ఒక్కచోటా మాఘమాసం
నా చిన్నప్పటి నల్లజీడిచెట్లతమకంతో
నన్ను హత్తుకుంటూనే ఉంది
ప్రేమించాను,పోరాటం చేసాను
ఊడిగంచేసాను, ఉమ్ములు మోసాను
జీవితవాంఛ కొడిగట్టినప్పుడల్లా
ఒత్తి కత్తిరించి నన్ను సరిచేసే
దివ్యమానుషహస్తాలెక్కడని పరితపించాను.
ప్రపంచంతో రాజీపడలేను
అలాగని ఒదులుకోలేను
ఎప్పటికప్పుడు చిక్కుముడి పడుతున్న
నా మనోపాశాన్ని సరిదిద్దే
ఒక కేశపాశం కోసం
కలలుకనకుండా ఉండలేను.
ఇప్పుడిక్కడ నా ఇంటివాకిట
రోజంతా రాలుతున్న మామిడిపువ్వు
గతించిన జీవితం తీపినిచ్చిందో, చేదువిరిగిందో
రేపు తెలుస్తుందని నమ్ముతూ
నిద్రలేని ప్రతిరాత్రినీ ఈదుకొస్తున్నాను.
విస్ఫారితనేత్రాలతో ఒక అడవినో, కడలినో
తొలిసారిచూసినట్టు
ఈ ప్రపంచాన్ని చూడాలని సాధన చేస్తున్నాను.
బహుశా నన్ను నన్నుగా అంగీకరించే
కాలం, దేశం, నేస్తం కనిపించినప్పుడే
నా చిన్నప్పటి మాఘసూర్యకాంతి
మళ్ళా నా చేతికి చిక్కుతుందనుకుంటాను.
7) 
A poem for today:
రాజు మిళిందుడు నాగసేనుణ్ణి అడిగాడు: 'మనసు లక్షణమేమిటి, ప్రజ్ఞ లక్షణమేమిటి?'
'పట్టుకోవడం మనసు స్వభావం, తెంచుకోవడం ప్రజ్ఞ స్వభావం ' అన్నాడు నాగసేనుడు.
'పట్టుకోవడం మనసు స్వభావమెట్లా అయ్యింది, తెంచుకోవడం ప్రజ్ఞ స్వభావమెట్లా అయ్యింది?, 'అని అడిగాడు రాజు. 'ఒక ఉదాహరణ చెప్పు 'అన్నాడు:
'రాజా మీరెప్పుడైనా గోధుమపంట కోతలు కొయ్యడం చూసారా?'
'చూసాను.'
'ఆ పంటపొలాలు ఎట్లా కోత కోస్తారు?
'ఎడమచేత్తో నాలుగైదు వెన్నులు పట్టుకుంటారు, కుడిచేత్తో కొడవలి తీసుకుంటారు, దాంతో పంటకోస్తారు.'
'సరిగ్గా అలానే ప్రభూ, మనసుతో పట్టుకోవాలి, ప్రజ్ఞతో తెంచుకోవాలి 'అన్నాడు నాగసేనుడు.
-మిళిందపన్హ 2.1.8 (32-33)
పట్టుకున్నంతకాలం పట్టుకునే ఉండిపోయాను
తెంచుకోవాలనుకున్నప్పుడు పరపరా తెంపేసాను
రెండింటిలోనూ శాంతిలేదు,
దట్టంగా అల్లుకున్న పొగ తప్ప.
నువ్వు పట్టుకున్నప్పుడల్లా
ఒక సీతాకోకచిలుక నీ వేళ్ళ మధ్య
గిలగిలకొట్టుకుంటూనే ఉంది
ఒక తూనీగ విలవిల్లాడుతూనే ఉంది.
నువ్వు వదిలిపెట్టేసినప్పుడల్లా
ఒక కుక్కపిల్ల ముణగదీసుకుని
చలిలో వణుకుతూనే ఉంది.
పంజరం తలుపులు తెరిచినా
పావురం బయటికి పోలేకుంది.
నువ్వెవరినైనా ప్రేమించడమంటే
నీకు నిష్కారణంగా దయకలగడం
కాని ప్రేమ కొనసాగాలంటే
నువ్వు నిర్దయకూడా నేర్చుకోవాలి.
8) 
An Afternoon in Agra…
A poem by Vadrevu Chinaveerabhadrudu
(Translated by Sri Nauduri Murty)
That was an afternoon in Agra
As the late sagittal sun
Prevailed up to the welkin.
Like the tang of tart of a fruit,
There was a mild bite in it.
That ageless dream… Taj Mahal … looked as if
Somebody had set it over this earth only yesterday.
The marmoreal Minars were
Splendid in the hoary afternoon sun.
Another generation of admirers
Lie in front of her spellbound.
In the lawn in front of me there was a flower
And a Bumble Bee was hovering over its antheral centre.
The bee for the flower
And the flower for the bee…
My eyes were feasting on
The essay of their meetings and partings.
Endlessly … people were flocking around
The delectable monument with cameras in hand.
There was an invincible flower
In front of me this afternoon.
That might wither by the end of the day.
But here was a Bumble bee
Tipsier with love than Shah Jahan.
.
ఆగ్రాలో ఒక మధ్యాహ్నం
.
ఆకాశమంతటా ఆవరించిన
మలిహేమంతపు ఎండలో
ఆగ్రాలో ఒక మధ్యాహ్నం
పండులో పుల్లదనంలాగా చలి.
పురాతన స్వప్నం తాజమహల్ ఎవరో
నిన్నరాత్రే భూమ్మీద ప్రతిష్ఠించినట్టుంది.
మెరిసిపోతున్న పాలరాతి గుమ్మటాలు
ధవళ అపరాహ్ణశోభలో.
సాగిలబడుతున్నారు దాని ఎదట
కొత్త ఆరాధకులు మరికొందరు.
నా ఎదట పచ్చికలో పుష్పం
దాని పరాగకేంద్రంలో ఒక భ్రమరం
పుష్పంకోసం భ్రమరం
భ్రమరంకోసం పుష్పం
వాటి మిలన పునర్మిలనాలతో
నా కళ్ళు పండుగ చేసుకున్నాయి.
మూగుతూనే ఉన్నారు మనుషులు
కెమేరాల్తో ఆ రమ్యమహల్ చుట్టూ
ఈ మధ్యాహ్నం నా ఎదట
దినాంతానికి రాలిపోయే
అజేయ పుష్పం. షాజహాన్ కన్నా
ప్రేమోన్మత్త భ్రమరం.

10) 
కవిత
ఫిబ్రవరి రాగానే మంకెనలు పూస్తాయనుకునేవాణ్ణి,కాదు, మంకెనలు మొగ్గతొడుగుతూనే
ఒక మాఘమాసాన్ని సృష్టిస్తాయి.
నిండుగా పూసినమంకెనలచుట్టూ
నీలిపొరలు,ఊదారంగుధూళి-
నా బాల్యంలో పూర్తిగా వినలేకపోయిన
పాటలన్నీ మళ్ళా అక్కడ ప్రత్యక్షమవుతాయి.
నేను తిరిగిన కొండలదారుల్లో
రాలిన ఇప్పపూలు,నల్లజీడిచెట్లు,తపసిమాకులు-సంతనుంచి ఆవును పల్లెకు తీసుకుపోతున్న రైతులా
మాఘమాసం నన్ను నగరంనుంచి అడివికి తీసుకుపోతుంది.
ఇన్నేళ్ళుగా ఎంతో ప్రయత్నించాను
మరొక కొత్త దృశ్యమేదన్నా నన్ను ప్రలోభపరుస్తుందని వేచి చూసాను
నన్ను మైమరిపించగల ఒక మనిషి ఉనికికోసం
నా జీవితం సర్వం సమర్పించడానికి సిద్ధపడ్డాను
పూసినమంకెనచెట్లు కనబడగానే
ప్రపంచంనాకు నేర్పిన పాఠాలన్నీమర్చిపోతాను
రంగులెట్లా కలపాలో ఎంతసాధనచేసినా
రంగులపళ్ళెం ముందు నిలబడ్డప్పుడు తొట్రుపడ్డట్టే
మాఘమాసం ఎదట నేను మూగబోతాను.
వందేళ్ళ తరువాత ఒక పిపాసి
ఇప్పటి మనుషులు ద్వేషించుకోడం, దూషించుకోడంకాకుండా
మరేమన్నా చేసారా అని అనుకున్నప్పుడు
చినవీరభద్రుడు మంకెనల ఎదట 
మూర్ఛపోయాడని ఈ కవిత గుసగుసలాడుతుంది.

Total Pageviews