Friday, July 1, 2016

శుభోదయం../I\..


* హనుమాన్ చాలీసా * ను ముందుగా విన్నది ఎవరు?

హనుమాన్ చాలీసాను మొట్టమొదటిగా విన్నది స్వయంగా శ్రీ ఆంజనేయస్వామియే...... అది ఎలాగంటే శ్రీ రామచరిత మానస్ వ్రాసిన శ్రీరామభాక్తాగ్ర గణ్యుడు తులసీదాస గోస్వామి. తులసీదాసు శ్రీ రామచరిత మానస్ గానం చేస్తే స్వయంగా హనుమంతుడే వచ్చేవాడు. ఎక్కడ శ్రీ రామ సంకీర్తన జరిగినా అక్కడికి హనుమాన్ వెంచేసేవాడు. ఒకసారి తులసీదాస్ శ్రీరామచరిత గానం చేసాక, అందరూ లేచి వెళ్ళిపోయారు. ఒక్క వృద్దమూర్తి మాత్రం తన్మయంతో అలాగే ఉండిపోగా, తులసీదాసు ఆయన పాదాలకి నమస్కరించాడు. ఆ వృద్ధ రూపంలో వున్న హనుమ తులసీదాసుకు తన దివ్య దర్శనాన్ని ఇచ్చాడు.
తులసీదాసు పరమానంద భరితుడై 40 పద్యములతో కూడిన స్త్రోత్రాన్ని చెప్పాడు. అదే హనుమాన్ చాలీసాగా రూపాంతరం చెందినది అని పెద్దలు చెపుతారు.

No comments:

Post a Comment

Total Pageviews