" ఓ ! తెలుగు తల్లీ .....దిగి రావమ్మా .....మావాళ్ళు తెలుగు మరచారు ; మాటలు మరచారు ; ఏంటేంటో మాటాడుతున్నారు ! భాష మరచారు , పండగలు మరచారు, పధ్ధతులు మార్చారు , అలవాట్లు మార్చారు , తిండ్లు మరచారు ! అసలు నాకు అయోమయంగా వుంది తల్లీ ! ఏం చేయాలి .......నువ్వే చూసుకో... నే వ్రాస్తున్నా ......
అమ్మా -- నాన్నలు పోయి .........మమ్మీ -- డ్యాడీలయ్యారు ......
అన్నయ్య - అక్కా చెల్లెళ్ళు పోయి -- బ్రో - సిస్ లు అయ్యారు ...
మామయ్య - అత్తయ్యలు - అంకుల్ ఆంటీ లయ్యారు .....
స్నేహితులు --- ఏరా, పోరా, ఏమిటే , ఒసేయ్ పోయి .....
హాయ్ -- హల్లోలు -- డ్యూడ్లు , యార్ లు అయ్యాయి ......
వుదయం -- ఫలహారం పోయి -- బ్రేక్ ఫాస్ట్ అంటారు ......
మధ్యాన్నం భోజనం పోయి -- లంచ్ అంటారు ....
సాయంత్రం వేళ తిండిని -- స్నాక్స్ అంటారు .....
రాత్రి భోజనాన్ని -- డిన్నర్ అంటారు ....
'భోజనం అయ్యిందాండీ ' అన్న పదంలో వున్న
ఆప్యాయత " హ్యాడ్ లంచ్ " లో వుందా ? అనుకోరు ........
పండగలు , పబ్బాలు గొప్ప కోసం చేసుకుంటారు .......
పధ్ధతులు లేవు - పాడూ లేదు .......
ఉప్ప్మాలు , దోశెలు , పెసరట్టులు పోయి -- పిజ్జాలు , బర్గర్లు , నూడుల్స్ వచ్చాయి ......
పండగలు పేరంటాలు పోయాయి -- పాట్ లక్ లు , కిట్టి పార్టీలు వచ్చాయి .....
బొమ్మల కొలువుల్లేవు ........పేరంటానికెళ్ళి వాయనాలు తెచ్చుకోవడం , ఇవ్వడం లేదు.... రేడియోలు ఎక్కడా కనపడవు ..... ల్యాండ్ ఫోన్లు లేనే లేవు ......
అంతా " స్మార్ట్ " ఫోన్ల మయం అయ్యింది .......
ఎంత పెద్ద ఫోన్ వుంటే అంత గొప్ప స్టేటస్ !
ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే - అంతమందికి అన్ని బెడ్ రూములుంటే అంత గొప్ప !
ఉమ్మడి కుటుంబాలంటే పడదు ...
వేరు కుంపట్లే ధ్యేయం .......
మాటకు మాట జవాబిస్తారు .........
అదేంటంటే ..ఆత్మాభిమానం అంటారు .......
వేవ్ లెంగ్త్స్ కుదరలేదంటారు .......
ఇంకాస్తా ఎక్కువయితే ......
విడాకులంటరు ...వివాహ వ్యవస్థ అస్తవ్యస్త మైపోయింది ......
పెద్ద బాలశిక్ష అంటే ఏమిటంటారు ? అది ఏ వూరు అనడుగుతారు ....తెలుగు వారాలస్సలే తెలియవు .......
తెలుగు నెలలు , వత్సరాలు , రాశులు , నక్షత్రాలు తెలియనే
తెలియవు ...అ, ఆ లు రానే రావు గుణింతాలు తెలియవు .....
పిల్లలకు , గోడం బిళ్ళ , నాలుగురాళ్ళాట, దాగుడుమూతలు,అష్టా చమ్మ , తొక్కుడు బిళ్ళ
అంటే , " వాట్ ఇస్ దట్ మమ్మీ " అంటారు ! వాళ్ళకి తెలిసింది , ' క్రికెట్ , సాకర్ర్ ..ఇలా ...........
లంగా వోణీలంటే చీదరించుకుంటారు ........
చీరలు బరువంటారు ......జీన్స్ - టాప్స్ వేసుకుంటారు ......
అదేంటంటే ...." కన్వీనియంట్ " అంటారు ........
కమాన్ మామ్ ! " జనరేషన్ గ్యాప్ అంటారు .......
తెలుగు మాటాడ్డం అవమానంగా భావిస్తారు .......
మాతృభాషనే మరచిపోయారు ............
చెప్పబోతే , " కంట్రీ బ్రూట్స్ " ..కంట్రీ బుధ్ధులు "అంటారు ....
అన్ని రాష్ట్రాల వారు వారి సంస్కృతికి ......
ప్రాధాన్యమిస్తే , మనం " ఎంగిలి " పధ్ధతినే అనుసరిస్తున్నాం !
మన తెలుగు వాళ్ళకీ " తెగులు " ఎందుకు చెప్పు తల్లీ !
నీ తెలుగు బిడ్డల్ని నువ్వే కాపాడుకో ! "
---నీ ఒక తెలుగు బిడ్డ ....... (సేకరించినది )

No comments:
Post a Comment