ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు. అతడు తెచ్చుకున్న నీళ్లు రెండు రోజుల తర్వాత అయిపోయాయి. నడుస్తున్నాడు. నీరు ఎక్కడా కనబడటం లేదు. తన జీవితపు ఆఖరు దశకు చేరానని అతడికి తెలిసిపోయింది. ఈ రాత్రి గడవదు. రేపు ఉదయం చూడను అని అనుకుంటున్న దశలో ప్రయత్నం చెయ్యడమా? అలాగే నిరాశతో కూలబడి పోవడమా ఎటూ నిశ్చయించుకోలేకపోతున్నాడు.
💧దూరంగా ఒక గుడిసెలాంటిది కనబడింది. అది నిజమా? తన భ్రమా? ఏమో! నిజమేమో! అక్కడ తనకు నీరు దొరకవచ్చునేమో! 💧చనిపోయేముందు ఆఖరు ప్రయత్నం చెయ్యాలనుకున్నాడు. శక్తిని కూడదీసుకున్నాడు. తడబడిపోతున్న అడుగులతో ముందుకు నడుస్తున్నాడు. గుడిసెలోకి వెళ్లాడు. అక్కడ ఒక నీటి పంపు (బోరింగ్) కనబడింది.
💧దానిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. దాని దగ్గరకి వెళ్లి కొట్టాడు. నీరు రావడం లేదు. శక్తినంతా ఉపయోగించి కొట్టాడు. అయినా ప్రయోజనం లేదు. నిరాశ నిస్పృహ ఆవరించాయి. ఒంట్లో ఉన్న కొద్ది నీరూ అయిపోయింది. కళ్లు మూసుకుపోతున్నాయి.
💧ఒక మూలన సీసా కనిపించింది. దానిలో నీరు ఉంది. మూత గట్టిగా బిగించి ఉంది. మూత విప్పి దాన్ని ఎత్తిపట్టి తాగుదామని పైకి ఎత్తాడు. 💧దానికి ఒక కాగితం కట్టి ఉంది. దాని మీద ఇలా ఉంది. ఈ బాటిల్లో నీరు బోరింగ్ పంపులో పోయండి. పంపు కొట్టండి.. నీరు వస్తుంది. మీరు మళ్లీ ఈ బాటిల్ నింపి పెట్టండి.
💧అతడికి సందేహం కలిగింది. ఈ నీరు తాగెయ్యడమా? బోరింగ్ పంపులో పొయ్యడమా? ఎంత కొట్టినా రాని నీరు.. ఈ బాటిల్లో నీరు పోస్తే వస్తుందా? ఉన్న ఈ నీరు కాస్తా పోసేస్తే తర్వాత రాకపోతే తన గతి ఏమి కాను? చేతిలో ఉన్న నీరు తాగితే కనీసం ఇంకో రెండు రోజులు బతకొచ్చు. అందులో పోసేస్తే మరణం ఖాయం.
💧ఏమి చేయాలి? ఎంతకూ ఆలోచనలు తెగడం లేదు. 💧ఒక నిశ్చయానికి వచ్చాడు. నీళ్లను పంపులో పోశాడు. బోరింగ్ పంపు కొట్టడం మొదలుపెట్టాడు. *ఆశ్చర్యం!!!!!* 💧పాతాళ గంగ పైకి తన్నుకు వచ్చింది. నీళ్లు తాగి బాటిల్ నింపాడు. మూలన పెట్టాడు. తను తెచ్చుకున్న బాటిల్ నింపుకున్నాడు. గుడిసెలో ఎడారి మ్యాప్ కనబడింది. తను ఎటు వెళ్లాలో చూసి బయలుదేరాడు.
💧 _ఏదైనా పొందాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం వల్ల మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి. కృషి చెయ్యకుండా ఫలితంఆశించకూడదు_ _చావు బతుకుల మధ్య_ *ఇక్కడ తర్కం* 🚰 ఎంత కొట్టినా పంపు నుండి రాని నీళ్ళు కొద్ది పోస్తే ఎలా వస్తాయి ? 🚰 రిస్క్ తీసుకోకుండా బాటిల్లో నీళ్ళు తాగేస్తే.... మహా అంటే మరి కొన్ని గంటలు ప్రాణం నిలుపుకోవచ్చు. తరువాతా...??
🚰 అసలు బాటిల్లో నీళ్ళు ఎలా వచ్చాయి. తన కన్నా ముందు ఎవరికో ఇలాంటి సమస్యే ఎదురై వుండొచ్చు. వాళ్ళు పంపులో పోసి ఆ తరువాత తిరిగి బాటిల్ లో నింపి వుండొచ్చు. ✅ కాబట్టి రిస్క్ అనుకున్నా గానీ బాటిల్ లో నీళ్ళు పంపులో పోయడమే కరెక్ట్. ✅ గత్యంతరం లేని క్లిష్ట పరిస్థితుల్లో *నమ్మకం* ముఖ్యం!!! 💧💧 _*నువ్వు ఇవ్వకుండా*__*దేనినీ పొందలేవు

No comments:
Post a Comment