Tuesday, December 26, 2017

శుభ సాయంత్రం.


జ్ఞానాన్ని మించిన సంపద లేదు 
సహనాన్ని మించిన ఆయుధం లేదు 
విశ్వాసాన్ని మించిన భధ్రత లేదు 
నవ్వును మించిన ఔషధం లేదు 
ఆశ్ఛర్యం ఏంటంటే ఇవన్నీ ఉచితమే..... 

పిల్లలకు ఆస్తిని బహుమతిగా  ఇవ్వకండి 
పిల్లలు మేధావులైతే మాకెందుకు మీ ఆస్థి అంటారు 
పిల్లలు వెధవలైతే  మీ ఆస్థిని తగలేస్తారు
అందుకే చదువును ఆస్థిగా....
సంస్కారాన్ని బహుమతిగా  ఇవ్వండి.

ఆశ మనిషిని బ్రతికిస్తుంది 
ఇష్టం మనిషిచేత ఏదైనా చేయిస్తుంది 
కానీ... అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది.

విలువలనే కాదు,...నీ పక్కన విలువలతో
 నడుచుకునే వ్యక్తిని వదులుకున్నా 
జీవితం వేదన పాలే అని తెలుసుకో.

మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో వివేకమూ అంతే ముఖ్యం.
వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి.
శాస్త్రాలు,పురాణాలు,ఇతిహాసాలు విన్నంత మాత్రాన వివేకం రాదు.
విన్న విషయాలను స్వానుభవంలోకి మళ్ళించుకోవాలి ఇదే వివేకం అంటే.


No comments:

Post a Comment

Total Pageviews