ప్రతీ వ్యక్తి గొప్పవాడు కావడానికి ప్రయత్నించవచ్చు
తప్పులేదు కాని అది ఇంకొకరి పతనానికి దారితియ్యకూడదు.
మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో వివేకమూ అంతే ముఖ్యం.
వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి.
శాస్త్రాలు,పురాణాలు,ఇతిహాసాలు విన్నంత మాత్రాన వివేకం రాదు.
విన్న విషయాలను స్వానుభవంలోకి మళ్ళించుకోవాలి ఇదే వివేకం అంటే.
విలువలనే కాదు..
నీ పక్కన విలువలతో నడుచుకునే
వ్యక్తిని వదులుకున్నా
జీవితం వేదన పాలే అని తెలుసుకో.
మనం సరిగ్గా చదవగలిగితే ప్రతి వ్యక్తీ ఒక పుస్తకమే.
పుస్తకంలోని మంచి సారాన్ని ఎలా గ్రహిస్తామో,
అలాగే మనుషులలోని మంచి గుణాలను గ్రహించి ఆచరణలో పెట్టగలగాలి.
ఒక్క సారి నవ్వుతూ చూడు
ప్రపంచంలో ఉండే అందాలన్ని
నీ సొంతమవ్వుతాయి కానీ
తడిసిన కనురెప్పలతో
చూస్తే అద్దం కూడా
మసక బారి పోతుంది
No comments:
Post a Comment