Wednesday, December 6, 2017

సత్య నాదెళ్ల గొప్ప తండ్రి

ప్రపంచంలో ప్రతీ తల్లితండ్రి తమకి ఆరోగ్యకరమైన శిశువు పుడుతుంది అనే expect చేస్తారు.. అలానే ప్లాన్ చేసుకుంటారు. ఒక 10 % కన్నా తక్కువ తల్లితండ్రులు తమకి నార్మల్ బిడ్డ పుట్టాడు ఏమో అని భావిస్తారు.
అంగవైకల్యంతో పుట్టిన బిడ్డ తల్లితండ్రులు ముఖ్యంగా కొన్ని ఎమోషన్స్ కి గురి అవుతారు disbelief , guilt , రిజెక్షన్, షేమ్, డినేయల్, నిస్సహాయత భావన. ఈ తల్లితండ్రులకి డిప్రెషన్, ఆందోళన symptoms ఎక్కువుగా ఉంటాయి. తండ్రులు కన్నా ఎక్కువుగా తల్లులు ఎక్కువ స్ట్రెస్ కి గురి అవుతారు కారణం ఎక్కువ సమయం తల్లులు ఆ పిల్లలతో గడపడం. కొన్ని పరిశోధనలు తల్లులకు నెగటివ్ ఎమోషనల్ స్టేట్ కూడా ఉంటుంది అంటాయి .. చాలా సందర్భాలలో తండ్రి ఈ సిట్యుయేషన్స్ నుండి తప్పించుకుంటాడు . పూర్తి ప్రేమ ఉంటుంది కానీ పెంపకం విషయంలో కొంచెం దూరంగా ఉంటాడు వేరే ఎదో avocation ఏర్పర్చుకుంటాడు.ఎక్కడో ఏదో ఒక guilty ఫీలింగ్ ఉన్న తండ్రులు కూడా మనకి కనపడతారు . ..అందరూనా అంటే కాకపోవచ్చు కొంతమంది పెంపకం భాద్యత కూడా బాగా తీసుకుంటారు
1996లో సత్య నాదెళ్ల భార్య అను ప్రెగ్నెట్ అయ్యాక 36 వారంలో తన గర్భం లో ఎటువంటి కదలిక జరగడం లేదు అని గ్రహించింది ..హాస్పిటల్ లో ఎక్సమ్ చేయగా ఎమర్జెన్సీ cesarean చేశారు. కొడుకు పుట్టాడు కానీ utero asphyxiation ( బ్రెయిన్ కి ఆక్సిజన్ అందకపోవడం )వలన ఆతను వీల్ చైర్ మీద జీవితం గడపాల్సి వచ్చింది దీనికి తోడు పుట్టినప్పుడు cerebral palsy కూడా వచ్చింది
సత్య నాదెళ్ల empahty తన భార్య నుండి నేర్చుకున్న అంటారు ఈ empahty వలెనే తన ఉన్న సిట్యుయేషన్ లో మరింత పటిష్టమైన వ్యక్తిగా ఎదగాలు అనుకున్నారు.ఈ empahty అనేది సత్య నాదెళ్ల గారికి ఒక మంత్రంలా అయిపోయింది.Disabled people యొక్క లైఫ్ జర్నీపై ప్రత్యేక దృష్టికోణం చూపారు..ప్రతీ రోజు కొడుకు Zain తో గడపడం వ్యాయామం చేయించడం, అతని నుండి విషయాలు నేర్చుకోవడం, విలువలు నేర్పడం నేర్చుకోవడం ... సత్య నాదెళ్ల దినచర్యలో భాగం అయిపోయాయి
ఆ మార్గంలోనే మైక్రోసాఫ్టు కి CEO కూడా అయ్యారు మైక్రోసాఫ్టు నుండి వికలాంగులకు ఉపయోగ పడే ప్రొడక్ట్స్ ఎక్కువ తయారు చెయ్యాలని అనుకున్నారు. Narrator app, Hearing AI Seeing AI, లాంటి ప్రొడక్ట్స్ వచ్చాయి మైక్రోసాఫ్ట్ నుండి
Zain కి ఇప్పుడు 21 ఏళ్ళు "My charming and handsome 21-year-old son loves spending time with his family. He has a discerning passion for music " అని గర్వంగా అంటారు సత్య నాదెళ్ల..
పెద్దయ్యాక ఏమౌతావు అంటే సత్య నాదెళ్ల లా మైక్రోసాఫ్ట్ కి సీఈఓ అవుతాను అనే కన్నా సత్య నాదెళ్ల లా గొప్ప తండ్రిని అవుతా అనడం నేర్పిద్దాం పిల్లలకి ..
post copied....

No comments:

Post a Comment

Total Pageviews