నిత్యజీవితంలో పాటించవలసిన కొన్ని నియమాలు
• తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
• గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
• బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
• దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.
• పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
• రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
• ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
• అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
• స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.
• నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
• పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.
• ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.
• తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.
• శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.
• ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.
• అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.
• సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.
• ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు.
• సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు.
• ఉమ్మితో వేళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.
• వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.
• విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.
• ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి.
• సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు.
• చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.
• నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు.
• నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.
• దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
• చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.
• శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.
• నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి నామస్మరణ చేయాలి.
• తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.
• అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.
• నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు.
• తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.
• ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
• పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు దుఃఖాలు పొందుతారు.
• తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.
• చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ దోషాలే.
• దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు.
• కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.
• దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.

No comments:
Post a Comment