Sunday, August 30, 2020

బ్రాహ్మణ వధూవరుల పరిచయ

 ఉచిత ఆంధ్రా - తెలంగాణ బ్రాహ్మణ వధూవరుల పరిచయ ప్రసారాలు 1 సెప్టెంబర్ 2020 నుండి 15 సెప్టెంబర్ 2020 వరకు ఉచిత పరిచయ ప్రసారాలను ప్రారంభిస్తున్నాం

రిజిస్ట్రేషన్ ఫీజు: 0  (ఉచితం)

రిజిస్ట్రేషన్ ప్రారంభం: 25 సెప్టెంబర్ 2020 దీనికి సంబంధించిన నియమ నిబంధనలు వాటి వివరాలు

1. మీరు వివాహ ఛానెల్ కు ఏ ప్రాంతం నుంచి పంపిస్తున్నారో మొదట స్పష్టంగా తెలియజేయాలి.

2. వివాహ ఛానల్ కి పంపేవారు వారి శాఖ / ఉప శాఖని ఖచ్చితంగా తెలియజేయాలి.

3. అబ్బాయి పూర్తి పేరు:

4. తల్లిదండ్రుల పేర్లు : 

5. పుట్టిన తేదీ :

6. పుట్టిన సమయం :

7. పుట్టిన ప్రదేశం :

8. ప్రస్తుత వివాహ వయస్సు : 

9. నక్షత్రం(పాదంతో) :

10. రాశి :

11. గోత్రం :

12. చదువు :

13. ఉద్యోగ ప్రదేశం :

14. ఉద్యోగం :

15. కోరుకునే భాగస్వామి వివరణ :

16. వయసు వ్యత్యాసం :

17. ఎత్తు వ్యత్యాసం :

18. కోరుకునే ప్రదేశం :

19. శాఖ పట్టింపు :

20. ఫోన్ నెంబర్స్ (1).

                            (2).

21. ఈ-మెయిల్ ఐడి :

22. ఏదైన ఐడి ప్రూఫ్ :

వివరాలను పూర్తిచేసి వివాహ ఛానెల్ ఆఫీసు నెంబర్స్ రెండు ఫోటోలను జతచేస్తూ 8686840074 & 7702694408 వాట్స్అప్ కి పంపండి.

ప్రతి ఫోన్ నెంబరు మేమే మీకు కాల్ చేసి వెరిఫికేషన్ చేసుకుంటాం.

ముఖ్య గమనిక :

వివాహ ఛానల్ హైదరాబాదు మరియు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట లోనే బ్రాంచీలను కలిగి ఉంది.

మరి ఎక్కడ బ్రాంచీలను కలిగి లేదు.

మాకు సంబంధం లేని ఫోన్ నెంబర్ల నుండి మీకు కాల్ వచ్చినా మీరు వారికి డబ్బులు ఇచ్చిన మాకు సంబంధం లేదు.

ఈ ప్రసారాలు అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడతాయి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాం భయపడవలసిన పనిలేదు.

ప్రతి వివాహ సమాచారం కూడా ఉచితంగానే మీరు పొందవచ్చును.

అందు నిమిత్తం మేము ఎటువంటి రుసుము కోరటం లేదు సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుండి పదిహేను రోజుల పాటు ఈ సమాచారం పోస్ట్ చేయబడుతుంది ఈ సమాచారాన్ని మీకు తెలిసిన ప్రతి బ్రాహ్మణ కమ్యూనిటీ గ్రూపులకు చేర వేయండి నియమ నిబంధనలు అతి త్వరలో తెలియజేస్తాం

Monday, August 24, 2020

నార్మన్ కసిన్స్ ."అనాటమీ ఆఫ్ ఏన్ ఇల్ నెస్"..మంచి ఆలోచనా విధానం అపారమైన శక్తి

 💃💃Power of positive THINKING(మంచి ఆలోచనా విధానం అపారమైన శక్తి వంతమైనది) 😌😌

....
ఆ కుర్రవాడికి పది సంవత్సరాలు ! 
పీలగా బలహీనంగా ఉండేవాడు .🥴🥴

పరీక్షలో క్షయవ్యాధి 🙄🤤
అని డాక్టర్లు  తేల్చారు శానిటోరియంకు పంపారు !

 కానీ ! 
మరల పరీక్ష చేసి జరిగినపొరపాటు గుర్తించి క్షయలేదని ఇంటికి పంపారు ! 
🙂🙂🙂

...అప్పటినుండి అతను సరి అయిన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ 
17 సంవత్సరాలకల్లా  బలిష్టంగా తయారయ్యాడు .
🏃‍♂️🏃‍♂️🏃‍♂️🏃‍♂️
కాలం గడుస్తున్నది!  వివాహమయ్యింది !

వయస్సు 35 ! 

ఇన్స్యూరెన్స్ కోసమని వైద్యపరీక్షలకు వెళితే గుండెధమనులు పూడుకుపోయాయి అనిచెప్పి ఇన్స్యూరెన్స్ ఇవ్వము పొమ్మన్నారు .😥😥😰😰

పైగా ఒక సలహా ఇచ్చారు నీవు పనులన్నీ ఆపి విశ్రాంతి తీసుకొనకపోతే నేడో రేపో పోవడం ఖాయం అన్నారు .
.
మరణంకోసం ఎదురు చూడటమా జీవనరణం సాగించడమా ? ఏదో ఒకటి తేల్చుకోవలసిన పరిస్థితి ! 
.😱😱😱😱😱
మరల ఎందుకైనా మంచిదని ఇంకొక చోట వైద్యపరీక్షలు చేయించుకున్నాడు . 
నిజమే ! గుండెధమనులు పూడుకుపొయ్యాయి !
.
ఏదో చెకప్ కని వెళితే అలా తేలిందికానీ తాను అన్నిపనులు అంతకు ముందు చేసుకుంటూనే ఉన్నాడు కదా ! 
.
అంతే!! ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు ,విషయం తెలియకముందు ఎలా బ్రతికాడో అలాగే కొనసాగించాడు.
.☺️😃😀😊🥰🙂
 వ్యాయామం ,కుటుంబంతో ఆనందంగా గడపడటం ! ... ! 
.
మూడేళ్ళ తరువాత ఒక ప్రఖ్యాతవైద్యుడు అతనిని పరీక్షించి ఒకమాటన్నాడు ! 
.
Yes your decision was right ! Your heart is alright !!
.🥰🥰🥰🥰🥰☺️☺️
అప్పుడే కధ అయిపోలేదు !
.
 అది 1964 వ సంవత్సరం ! 
ఆ జబ్బు తగులుకుంటే నాలుగువందలతొంభయితొమ్మిదిమంది ప్రాణాలు గాలిలో కలిసినట్లే ! 

ఒక్కడికి మాత్రమే బ్రతికే అవకాశం ! 1:500 ......మందులు అప్పటికింకా కనిపెట్టని కొల్లాజిన్ వ్యాధి ! 

ఆ వ్యాధి సంక్రమించింది మన కధానాయకుడికి 
🤕🤒😷🤐.
గుండెదిటవు చేసుకున్నాడు !

 డాక్టర్ సలహాతో  జీవనగమనం నిర్దేశించుకున్నాడు .

ఉల్లాసంగా ఉండటానికి హాస్యరసప్రధానమైన చిత్రాలు చూడటం అలవాటు చేసుకున్నాడు . 😃😄😁
క్రమేణా వ్యాధిని జయించాడు !
.
మరల 1980 లో ఇంట్లో ఉండగా గుండెపోటు !గుండెకండరంలో ఒక భాగం పూర్తిగా దెబ్బతిన్నది !ఈసారికూడా జీవనశైలి,ఆహారం మార్చాడు!
 సరి అయిన వ్యాయామం మొదలెట్టాడు .
.
ఆ తరువాత 20 సంవత్సరాలు జీవించాడు ...
.🧎‍♂️🧎‍♂️
ఆయన పుట్టిన సంవత్సరం 1915 ... 

ఆయన పేరు 
నార్మన్ కసిన్స్ ..
దేశం అమెరికా
.
 ఆయన స్వీయ అనుభవాలతో ఒక పుస్తకం వ్రాశారు 
అది
 "అనాటమీ ఆఫ్  ఏన్ ఇల్ నెస్"... అమెజాన్ లో అందుబాటులో ఉంది. !
.
It is the mind
 that makes 
or
 brakes !
.
ఊరికే కరోనా వార్తలు చూడకుండా 
తీసుకొనవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ ! 
💃🕺🏽💃👯‍♀️👯🏻‍♂️💃🤳👩‍❤️‍👨👩‍❤️‍👩👨‍👩‍👧‍👦👩‍👩‍👦
ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి !
😀😃😄😁😆
 నూరుసంవత్సరాలు జీవించడం ఖాయం !
😊😊😊😊😊😊

50 years నిండిన మేము రెండు తరాలకు సాక్షులం

 50  years    నిండిన   మేము  రెండు   తరాలకు    సాక్షులం 

         

స్వచ్చమైన     గాలి  నీళ్ళు,.      పచ్చటి  పొలాలు.     🌾🌴

పరిశుభ్రమైన.    వాతావరణం  లో  పుట్టి.    పెరిగిన   వాళ్ళం... 

👦తలపై   నుండి.    చెంపల   మీదకు     కారిపోయేలా    నూనె రాసుకుని...


📚  చేతికి     పుస్తకాల.   సంచి తగిలించుకుని...,

ఒక్కడిగా.    బయలుదేరి    దారిలో స్నేహితులను

ఒక్కొక్కళ్లను.      కలుస్తూ పెద్దగుంపుగా.  👦. 👦 👩. 👧 కిలోమీటర్ల    దూరంలో     ఉన్న  బడికి     కాళ్లకు    చెప్పులు    లేకుండా    నడచి   వెళ్ళిన     తరం వాళ్ళం, 🚶🏃


జారిపోయే    నిక్కరు    మీదకు   మొలతాడు.   లాక్కుంటు ..., చిరుగు.    బొక్కలకు    గుడ్డ ముక్కలు    అతుకులేయించుకున్న వాళ్ళం  🕺


10 వ తరగతి    అయ్యే  వరకు    నిక్కరు.   వేసుకున్న.  ,  తరం మాదే...🌲


🤸🤹

గోలీలు,     బొంగరాలు,

కర్రా బిళ్ళ, 

నేలా బండ,.    ఉప్పాట,

ఏడు పెంకులాట.....

🥎   బంతి పుచ్చుకుని.   నేరుగా కొట్టేసుకుంటే    బంతి    లాగ  వంటి మీద    ముద్ర   పడే      ముద్రబాల్.   లాంటి    ఆటలాడిన తరం...,


🚴🏊🤽

బడికి    వేసవి కాలం.   , సెలవులు రాగానే   తాటి చెట్లూ,. ..  సీమ తుమ్మ చెట్లూ    ఈతచెట్లు    ఎక్కి కాయలు.   కోసుకొని    తిన్న వాళ్ళం,   చెరువులు,     కాలవల్లో స్నానాలు     చేసిన   వాళ్ళం.   , తాటి   బుర్రలు     బండితో ఆడినోళ్లం...


🪔🪔🪔

దీపావళి  కి.    తాటి    బొగ్గుల రవ్వల   దివిటీ    కోసం   వళ్ళంతా మసి   పూసుకొని     మరీ     తయారు చేసుకనే    వాళ్ళం.


5 ps     ఐస్   తిన్నది   మేమె. ,,  .  పది    పైసలతో   బళ్ళో.  మ్యాజిక్   షో.   చూసింది    మేమే.... 


🌦️ వర్షం   వస్తె   తాటాకు.  గొడుగూ,    యూరియా   సంచులు, కప్పుకుని   బడికి  వెళ్ళిన    వాళ్ళం..


📖 second    hand   text  books     కోసం     పరీక్షలు 

అయినప్పటి    నుండి   ముందు తరగతి   వాళ్ళని    బతిమాలిన తరం.


🚴సెకెండ్   హ్యాండ్    సైకిల్  తొ  పక్క.   తొక్కుడుతో      సైకిల్ నేర్చుకున్నోల్లo     మేమే...


✉️ఉత్తరాలు.., రాసుకున్న..   ,అందుకున్న తరంవాళ్ళం... 🌴


పండగ    సెలవులు,

వేసవి   సెలవులు. , ,దసరా,  సంక్రాంతి   సెలవులు

ఎన్ని సెలవులు.   వొచ్చినా   ఐదు పైసలు   ఖర్చులేకుండా    ఆనందాన్ని.  🤼  🏃🏻 ⚽ 🏸 🪁🏹  🤸  ⛹️. 🏊   అనుభవించిన    తరంవోళ్ళం...,


 👨👩👧👦 పెద్దలు.  /పిల్లలూ అందరం    వీధి    అరుగుల మీద కూర్చుని   ఎన్నో     సాయంత్రాలు/రాత్రులు   ఆనందంగా    కబుర్లు చెప్పుకుని.   పొట్ట    చెక్కలయ్యేలా

నవ్వుకున్నదీ మేమే.... ☘️


 ఊర్లో,.  ఎవరి   ఇంట్లో    ఏ వేడుక  జరిగినా,.   మన   ఇంట్లో  జరిగినట్లు,.    అంతా మాదే. ,

అంతామేమే.  అన్నట్లుగా    భావించి    స్వచ్చందంగా. / నిస్వార్థంగా    పాలుపంచుకున్న    తరం   మాదే...🍁


🕵🏻ఉర్లో   ఒక    ఇంట్లో   దొంగలు  పడ్డారని ,.  పిల్లలు.    అందరం  కలిసి    ఊరు  చుట్టూ    తెల్లవార్లూ   ఎన్నో రాత్రులు

🔦టార్చిలైట్స్,    కర్రలు  పట్టుకుని  కాపలా కాసిన    వాళ్ళం  మేమే.


🕉️  🚩 🛕 

ప్రతీ పండగను ,పండగల్లోని సంతోషాలను ,సంబరాలను ఆస్వాదించింది మేమే...🌽🌽🍬🍬


👨👩👧👧చుట్టాలు    వస్తేనే అమ్మ     కోడి కూర.   , వండి పెట్టిన  తరం....🍁

అత్తయ్యా,

మామయ్య,.  ,పిన్ని,,    బాబాయ్,   అక్కా   ,బావ       అంటూ ఆప్యాయంగా    పిలుచుకున్న  తరం,

స్కూలు    మాష్టారు    కనపడితే భయంతో    పక్కనున్న     సందుల్లోకి    పారిపోయిన   తరం... ,🌺


పుల్లల    పొయ్యి    మీద   అన్నం/కూర     ఉడుకుతున్నప్పడు   వచ్చే అద్బుతమైన    పరిమళాన్ని ఆస్వాదించిన   తరం.   వాళ్ళం..,🌱

పొయ్య     మీదనుంచి.   నేరుగా    పళ్ళెం   లోకి    వచ్చిన   వేడి  వేడి అన్నంలో   ఆవకాయ,    వెన్నపూస వేసుకుని    పొయ్యి   దగ్గరే  

తాతయ్యలు.    అమ్మమ్మ/నాయనమ్మ, ,   అమ్మా    నాన్నా, పెదనాన్న. ,, ,పెద్దమ్మ,, . పిన్ని బాబాయ్,.    అత్తయ్య    మామయ్య,   అక్కలు    చెల్లెళ్లు    అన్నయ్యలు   తమ్ముళ్లు   అందరం    ఒకే.   దగ్గర   చేరి    మధురమై.      అనుభూతితో  కూర్చుని   అన్నం.  తిన్న    తరం ..,..🦋


అమ్మమ్మలు. / నాయమ్మల   చేత గోరుముద్దలు   తిన్నది,.   అనగనగా ఒక రాజు....      కథలు   విన్నది  ,🌵


నూనె పిండితో    నలుగు పెట్టించుకుని     కుంకుడు  కాయ పులుసుతో      తలంటు   స్నానం చేయించు కున్న      తరం...,🍀


📻రేడియో,

దూరదర్శన్📺

టూరింగ్ టాకీస్📽️.   కాలం చూచిన వాళ్ళం... .🍁


🎥 40 పైసల.   నేల   టిక్కెట్  తో నేల   మీద   కూర్చుని, 

1. .20. రూపాయల    chair   టిక్కెట్ తో  ,,rs 2    ticket    బాల్కనీ లో కూర్చుని    సినిమా  చూచిందీ    మేమే...🌵


 స్కూల్   , కాలేజీ   రోజుల్లోనే ఎలక్షన్లు   చూచిన    వాళ్ళం.. .🍂


అమ్మా   నాన్నా    తో     సంవత్సరానికి   ఒక సారి,   పరీక్ష పాస్     అయ్యావా.. ..    అని మాత్రమే    అడిగించు కున్న   తరం వాళ్ళం...🌹


📲🖥️🖨️

ప్రస్తుత0   ఉన్న    Whatsapp Fb skype లు   మీతో   పాటు సమానంగా     వాడేస్తున్న మాతరం...,

మేమే    ఆ  తరానికి    ఈ  తరానికి మధ్యవర్తులం...

 మేమే-- -💐


 అవును.......రెండు   తరాల   మద్యలో    జరిగిన   అనూహ్యమైన    మార్పులకు   మేమే  సాక్షులం  🌸


   మన ముందుతరం 

తల్లిదండ్రుల పై భయభక్తులు ...ఉన్న వాళ్లు... మన తరువాత తరం వాళ్లు వాళ్ల పిల్లలకు భయపడుతుంటారు..

మనం మాత్రం అటు తలిదండ్రులకు ఇటు పిల్లలకు భయపడే..అనిశ్చిత తరం😀😀😀😀

గోదారియాసే నాశ్వాస మీ ఇవివి..

 ఆయ్ అన్నది మాగోదారోల్లకి ఆయువు పట్టండి,

అండి అన్నది లేకుండా మాటాడితో వట్టండి,
యవసాయవంటే మాకు సేనా ఇట్టవండే,
యెటకారవంటే దానికన్నా కూతెక్కువ ఇట్టవండి,
మా పల్లెటూల్లన్నా,పంటపొలాలన్న సేనా బెవండి,
ఏరేరు తల్లులకడుపున పుట్టినా మాఅందరికీ అమ్మ మాగోదారమ్మేండి,
ఆతల్లి దయవల్లేండి ఇలాగున్నాం,
మాకు మనుసులంటే అభిమానవండి,
చుట్టాలెవరైనా వత్తే కాల్లుకడుక్కోటానాకి నీల్లిచ్చి..,దావానికి మజ్జిగిచ్చి.,
పదినిమషాల్లో వండి వడ్డించే అన్నపుార్ణమ్మలండి మా గోదారాడపడుచులు,
కొట్టుకాడ ఏవన్నా కొనుక్కున్నాక కొసరెట్టమని అడిగీవోల్లుం మేవేండి,
ఎవరన్నా ఇంటికొత్తే కొసరికొసరి వడ్డించేవోల్లుం కూడా మేవేండి,
మావూల్లంటా లంకంత కొంపలున్నా రావణాసురులు మాత్రం లేరండే,
ఐనా మాకు గొడవలంటే భయవండే.,!
పుసుక్కున మాలో మేవు గొడవపడ్డాగాని మావూరి మునసీబుగారో,కరణంగారో వచ్చి ఎల్లండెదవల్లారా.,
మనలో మనకి గొడవలేటిరా అంటే ఎల్లిపోయే వాళ్ళమండి, అంతటి మొత్తనోల్లవండి,
అన్నాటిలికి తగుదునమ్మా అంటూ ఎల్లవండి,
ఒకేల ఎల్లావంటే ఎనక్కిసూసే సమస్యే లేదండి ఆయ్
వుప్పుడిప్పుడే సేలా మార్పులు వచ్చేత్తన్నాయేమోనని....
సందాలమాటు అన్నం తినేహేక యీదలోరి మండువా అరుగుమీద కూకుని కిందసేలో రేపు కలుపుతీయించాలరా.,
ఒరేయ్ మాయాకుమడికి పిండెట్టేయమంటావా? అంటా ఒకలకొకలం సలహాలిచ్చుకున్నా రోజులకన్నా ఇయ్యేవన్నా గొప్పగావున్నాయేటి బా?
మనపిల్లలింక మారాపోయినా కనీసం మనవైనా మునుపటి బతుకుల్లోకెలిపోదాం బా.,
పిల్లల సదువులనే వంకతో సేనామంది యవసాయంచేసేటోల్లు పట్నాలమీద అడతున్నారండి,
రెండుపంటలూ పండే పచ్చటిపొలాలన్నీ రియలెస్టేటులంటూ బీల్లు సేసేత్తానరండి,
వూల్లంట వున్న ఆస్తులమ్మి పట్నాల్లో ఆస్తులు కొనగలం కానీండి,
కేవలం మనూల్లలోనే దొరికే ఆప్యాయతల మాటేటండి మరి?
కోరుకున్న కూర కొసరికొసరి వడ్డించే మనుష్యల మధ్యనుంచి,
ఆడిదగ్గరున్న కూరేదో పొట్లంలో కూరతుంటే కొంచెం
కూరెయ్యమ్మా మరీతక్కువ కట్టేవు అనేకాడకొచ్చావండే,
అమ్మగారు అన్నవుంది కాతకూరో,పచ్చడో ఎయ్యండమ్మా అనే బిచ్చగాడికి మనూల్లో మనింట్లో కూరే ఏత్తావండి, మరి మనవేటండి పదిరుాపాయల కూరకట్టమ్మా అనీకాడికెల్లిపోయాం.,?
ఉద్యోగరీత్యా ఎల్లినోల్లకన్నా, పిల్లలసదువులనో,
హాస్పటల్ దగ్గరగా వుందనో వంకతోటి.,
యవసాయం సేసేటోల్లంతా తిరిగి మనూల్లకెల్లిపోతే బోంటదండి.,
మీరిక్కడేసుకునే పేంటు,చొక్కాలకన్నా
మనూల్లో వున్నప్పుడు ఏసుకున్న కాటను సొక్కా,శంఖుమార్కు గల్ల లుంగీల్లోనే మీరందంగా ఆపడతున్నారు,
ఎల్లండి ఎల్లి ఈతపాలకిచ్చిన
పెద్దకొమ్ములగేదీని,
కర్రావుని తోలుకొచ్చి మన మకాంలో కట్టేయండి,
అంతరించిపోతున్న మనబాస,యాసలతోపాటు
మన సంస్కృతి సాంప్రదాయాలను బతికించండి బాబూ, మీకో కోటి🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏
గోదారియాసే నాశ్వాస మీ ఇవివి... (#rptd)

Saturday, August 22, 2020

సాహితీ నందనం: ఏల ప్రేమింతును?

సాహితీ నందనం: ఏల ప్రేమింతును?: ఏల ప్రేమింతును? సాహితీమిత్రులారా! దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు "కృష్ణపక్షము"లో ప్రేమ గురించి రాస్తూ .......... ఎందుకు ప్...

సాహితీ నందనం: యతో భావః తతో రసః

సాహితీ నందనం: యతో భావః తతో రసః: యతో భావః తతో రసః సాహితీమిత్రులారా! రసం ఎలా పుడుతుందంటే ఈ శ్లోకం చూడాల్సిందే ఇది అభినయ దర్పణంలోనిది- యతో హస్త స్తతో దృష్టిః ...

సాహితీ నందనం: యతో భావః తతో రసః

సాహితీ నందనం: యతో భావః తతో రసః: యతో భావః తతో రసః సాహితీమిత్రులారా! రసం ఎలా పుడుతుందంటే ఈ శ్లోకం చూడాల్సిందే ఇది అభినయ దర్పణంలోనిది- యతో హస్త స్తతో దృష్టిః ...

Wednesday, August 19, 2020

అచ్చ తెలుగులో పిలుచుకుందాం బంధాలను నిలబెట్టుకుందాం.

 చక్కని మెసేజ్. 

అమ్మ అనే పిలుపులో ఆప్యాయత ఉంది.

నాన్న అనే పిలుపులో నమ్మకం ఉంది.

తాత అనే పిలుపులో తన్మయత్వం ఉంది.

అమ్మమ్మ అనే పిలుపులు అభిమానం ఉంది.

నానమ్మ అనే పిలుపులో నవ్వు ముఖం ఉంది.

అత్త అనే పిలుపులో ఆదరణ ఉంది.

మామ అనే పిలుపులో మమకారం ఉంది.

బాబాయ్ అనే పిలుపులో బంధుత్వం ఉంది.

చిన్నమ్మ అనే పిలుపులో చనువు ఉంది.

అన్నా అనే పిలుపులో అభయం ఉంది.

చెల్లి అనే పిలుపులో చేయూత ఉంది.

తమ్ముడు అనే పిలుపులో తీయదనం ఉంది.

అక్క అనే పిలుపులో అనురాగం ఉంది.

బావా అనే పిలుపులో బాంధవ్యం ఉంది.

వదినా అనే పిలుపులో ఓర్పు ఉంది.

మరదలు అనే పిలుపులో మర్యాద ఉంది.

మరిది అనే పిలుపులో మానవత్వం ఉంది.

గురువు అనే పిలుపులో గౌరవం ఉంది.


మిత్రులారా! 

నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి అన్ని పరాయి పోకడలను అనుసరిస్తున్నాయి.

కనీసం పిలుపులో నయినా  మన అచ్చ తెలుగులో పిలుచుకుందాం బంధాలను నిలబెట్టుకుందాం.....!

బతుకుల్లో లేనిది ఏముంది శాస్త్రాల్లో ..

 (ఎవరు రాశారో తెలియదు గాని అద్భుతం గా వుంది..ఆ రచయితకు వందనాలు.. సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న అజ్ఞాత రచయిత రచన మీ కోసం  పట్టుకొచ్చా.. చదవండి).

అమ్మ చేసిన రొట్టె వృత్తము

సగానికి మడిచిన దోసె అర్ధ వృత్తము

మనం కూర్చునే స్టూల్ చతురస్త్రం

పడుకునే మంచం దీర్ఘ చతురస్త్రం

మనకిష్టమైన లడ్డూఒక  గోళము

సగం మన మిత్రునికిస్తే అర్ధ గోళము

మన తరగతి గది ఒక ఘనం

మనం కూర్చునే బెంచీ ఒక దీర్ఘ ఘనం

మన జెండా కర్ర ఒక స్థూపం

కొడవలి మలుపు ఒక చాపం

ధాన్యపు రాశి ఒక శంఖువు

రూపాయి రూపాయి కలిపితె కూడిక

కొనడానికి కొంత తీస్తే తీసివేత

తలా పది పంచితే భాగహారం

హెచ్చిస్తే గుణకారం

కూర్చుంటే జడత్వం

కదిలితే చలనం

పరిగెత్తితే వేగం

ఆగి ఆగి పరుగు తీస్తే త్వరణం

పడిపోతే ఆకర్షణ

విడిపోతే వికర్షణ

తన చుట్టూ తాను తిరిగితే భ్రమణం

గుడి చుట్టూ తిరిగితే పరిభ్రమణం

మాట్లాడడానికి శక్తి

పనిచేయడానికి బలం

గంటకు ఎంతపని చేస్తావో అది సామర్థ్యం

వింటున్నా మంటే శబ్దం

చూస్తున్నామంటే వెలుగు

రంగులన్ని వర్ణ పటం

ఆహారం అరగడం జీవక్రియ

అరిగిన ఆహారం శక్తిగా మారడం రసాయన క్రియ

ఉచ్వాస నిశ్వాస శ్వాస క్రియ

నేను చూశాను భూతకాలం

నేను చూస్తున్న వర్ధమాన కాలం

నేను చూడ బోతున్న భవిష్యత్ కాలం

నాకు తొంభై ఏళ్ళు ఇక పోయే కాలం

బతుకుల్లో లేనిది ఏముంది శాస్త్రాల్లో ..

సరిగా అర్థం చేసుకుంటే మన బతుకే ఒక శాస్త్రం...

మనిషిని, ఇతర ప్రాణుల్ని , ప్రకృతిని 

గురించి తెలుసుకోవడం తప్ప..

భయమెందుకు నీకు ...

నీకంటే ప్రపంచంలో ఎవరు గొప్ప...

తెలుసుకో పదిలంగా

నేర్చుకో సులభంగా...!   అదే మన తెలుగు భాష గొప్ప.  భలే ఉంది కదా🤩✨🦋

Monday, August 17, 2020

శ్రీ మాత్రై నమ: మా అమ్మ పూజలు!

 శ్రీ మాత్రై నమ:     
ఆవిడ పూజలు అందరికీ శ్రీరామ రక్ష! సర్వజగద్రక్ష!! 
https://www.youtube.com/playlist?list=PLkR7dgb_wqADd3M0U0PiT16o-x9ju2mlH

దేవాలయాలు మూతబడిన వేళ! 

నింగీ, నేల, నీరు, నిప్పూ, గాలి, 

గుళ్ళు, గోపురాలు, నదులు, సముద్రాలు  

చెట్టు, చేమ, పుట్ట, గుట్ట, రాయి, రప్ప, సకల జీవాల్లొ 

సర్వే సర్వత్రా నిండివున్న ఆ సర్వేస్వరుణ్ణి ప్రార్ధించేందుకు 

వయస్సు వాతావరణం అడ్డంకి కాదు ఆవిడకి  

నోములూ, పూజలు, వ్రతాలు, పండుగలు, పబ్బాలు  

తెల్లవారు ఝామున చన్నీటి స్నానాలు, ఉపవాసాలు  

మధు మేహం వున్నా దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినదు

అవిడ మరెవరో కాదు మా అమ్మ ఆ తరం చేతిలో 

రుబ్బురోలు కూడా శివ లింగం అయిపొతుంది. 

ఇంటిలోను, పెరట్లో తులసికోటకు పూజలు అయినాక 

రుబ్బురోలు కూడా శివ లింగం అయిపొతుంది. 

ఆ సంకల్పం మాకు రాదేం భక్తి లోపమా? శక్తి హీనమా? ఆసక్తి శూన్యమా? 

మా అందరి తరఫునా ముక్కోటి దేవతల్లారా ఆవిడ చేత 

అలా నిండు నూరేళ్ళు హాయిగా నిత్యనీరాజనల పూజలందుకోండి.  

అందరికీ శ్రీరామ రక్ష! సర్వజగద్రక్ష!! 

Wednesday, August 12, 2020

పేరెంటింగ్ సూత్రం 2 Ramadevi Telugu one

 పేరెంటింగ్ సూత్రం 2

నేర్పాల్సిన విషయం లో పిల్లల మీద జాలి పడద్దు. కొన్ని పాఠాలు గుర్తు ఉండాలి అంటే కొంత కష్టం నష్టం ఏమి కాదు.
నాన్న నాకు ఎన్నో విషయాలని ప్రాక్టికల్ గా నేర్పించారు.అందులో ఒకటి నోరువిప్పి అడుగు తెలియక పోతే. ఆ విషయాన్నీ నేర్పటానికి ఏమి చేసారో చెబుతున్నాఈ రోజు.
నేను ఏడు చదువుతుండగా మేము శ్రీహరిపురం లో ఉండేవాళ్ళం. ఒక రోజు నాన్న బ్యాంకు కి వెళ్లి డబ్బులు డ్రా చేయటాని కి ఫారం తీసుకురమ్మని చెప్పారు. మా ఇంటి నుంచి ఒకటే రోడ్. తిన్నగా బ్యాంకు కి వెళ్లి రావటానికి ఒక ఇరవై నిముషాలు పడుతుంది. నాన్న చెప్పగానే ఉషారుగా బయలుదేరాను. నాన్న పని చెప్పటం అంటే మనల్ని పెద్ద అయినట్టు గుర్తించటం అని అనిపిస్తుంది కదా.
బ్యాంకు కి వెళితే అక్కడ ఒక పింక్ స్లిప్ ,వైట్ ,యెల్లో స్లిప్స్ వున్నాయి.పింక్ స్లిప్ తీసుకుని బయలుదేరా ఇంటికి. నాన్న భోజనం చేస్తున్నారు. తీసుకు వెళ్లి చేతిలో పెట్టి మెచ్చుకుంటారని చూస్తున్నా. ఇది కాదు,దీన్ని డబ్బులు వేయటాని కి వాడతారు,డబ్బులు తీసేది పట్రా అన్నారు. మళ్ళి బయలు దేరా.
వేసవి కాలం,మధ్యాహ్నం ఎర్రటి ఎండలో చమటలు కక్కుతూ బ్యాంకు లో కి వెళ్లి ఎల్లో స్లిప్ తీసుకుని బయలు దేరా.ఇంటికి వెళ్లి నాన్న కి ఇచ్చాను. ఇది డిడి తీయటానికి వాడతారు. పనికి రాదు అన్నారు.అంటే ఇంక మిగిలింది వైట్ స్లిప్, అది తేవాలి వెళ్లి.
అప్పటి కి రెండు సార్లు వెళ్లానేమో ఓపిక అయిపొయింది, మొదటిసారి వున్న ఉషారు స్థానం లో ఏడుపు వస్తోంది. నాన్న మొహం లోకి చూస్తే అదేమీ పట్టనట్టు కిళ్ళీ కట్టుకుంటున్నారు. ఈసురోమని బయలుదేరా.వెళ్లి వైట్ స్లిప్ తెచ్చాను.
ఎందుకన్నా మంచిది అని రెండు తెచ్చాను. వెళ్లి నాన్న కి ఇస్తే చూసి, వెళ్లి ఆ బీరువాలో బాక్స్ వుంది అందులో పెట్టు అన్నారు.బాక్స్ తీస్తే అందులో ఒక నాలుగు వైట్ స్లిప్స్ వున్నాయి.
నాన్నా ఇందులో వైట్ స్లిప్స్ వున్నాయి అన్నాను.తెలుసు. ఇవి కూడా అందులో పెట్టు అన్నారు. అదేంటి అర్జెంటు గా కావాలి అన్నారు అన్నాను ఎండవేడి తో వచ్చిన కోపం చూబిస్తూ.
నాన్న ఇట్రా అని పిలిచి,నువ్వు నాతో చాలాసార్లు బ్యాంకు కి వచ్చావు కదా! నేను ఏ స్లిప్ రాసి ఇస్తున్నానో గమనించలేదా అన్నారు .
నాన్న సైకిల్ తీయగానే పరుగున వెళ్లి నేనూ వస్తాను అని తమ్ముడితో పోటీ పడి వెళ్లేదాన్ని.మా చెల్లి అమ్మ కూచి.ఎప్పటి కీ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతుండేది.అందుకని అది నాన్న తో సైకిల్ షికారుకు పోటీ పడేది కాదు.మా తమ్ముడు బజారు కి అయితే నన్ను తోసి మరీ నాన్న తో వెళ్ళేవాడు,ఏ బాలో,చాకలేట్ ఓ కొనిపించుకోవచ్చని. మన కి అవేమి అక్కరలేద్దు.నాన్న ఎక్కడకి వెళ్లినా నాన్నతో వెళ్ళటమే .
అందుకే బ్యాంకు కి ఎక్కువగా నాన్న తో నేనే వెళ్లే దాన్ని.వెళ్లినా మన ద్యాస నాన్న చేసే పనిమీద ఎందుకు ఉంటుంది,వచ్చే పోయే జనాలు,అక్కడ కుర్చీలో కూర్చుని చకచకా పని చేసే వాళ్ళని చూస్తూ నేను ఇలా ఉండాలి అనుకోవటం లో ఉండేదాన్ని.
ఈ రోజు నువ్వు చేసిన మూడు తప్పులు చెప్పు అన్నారు.నేనేం చేశాను. మీరు చెప్పగానే వెళ్లి తెచ్చాను కదా అన్నాను.
"ఎందుకు మూడుసార్లు వెళ్లాల్సి వచ్చింది?నాకు తెలియదు కదా నాన్నా ఏది వాడతారో డబ్బులు తీయటానికి ? దేవుడు నోరెందుకు ఇచ్చాడు? నీకు తెలియనప్పుడు పక్కవాళ్ళని అడిగి తెలుసుకోవాలి కదా ?
మొదటిసారే అక్కడ వున్న వాళ్ళని అడిగితే ఇన్నిసార్లు తిరిగేదానివి కాదుకదా?
ఏదన్నా తెలియక పోవటం తప్పు కాదు,అడిగి తెలుసుకోక పోవటం తప్పు.
ఇప్పడు ఎండలో మూడుసార్లు నడిచాక ఈ విషయం నువ్వు ఎప్పటికి మర్చిపోవు. ఈసారి పని చెబితే వివరం గా అడిగి తెలుసుకో. నువ్వు నన్ను అడుగుతావేమో చెబుదాం వైట్ స్లిప్ తే అని అనుకున్నా. నువ్వు అతి నమ్మకం తో బయలుదేరావు.
ఎప్పుడయినా ఏదన్నా తెలియక పోతే పక్కవాళ్ళని అడిగి తెలుసుకోవటానికి సిగ్గు పడకు "
అదిగో ఆ పాఠం నాకు నేర్పించటానికి ఆ రోజు బ్యాంకు కి అలా ఎండలో మూడుసార్లు తిప్పించారు నాన్న. అవసరం లేక పోయినా బ్యాంకు స్లిప్ కావాలి అని.
అలా నేర్పించాకా ఆ పాఠాన్ని మర్చిపోగలనా? మొహమాటం లేకుండా నాకు రాదు,తెలియదు అని చెప్పటం అడిగి తెలుసుకోవటం,నేర్చుకోవటం అలవాటు అయ్యింది.
ఆ తర్వాత నుంచి నాన్న బ్యాంకు పనులు నాకే చెప్పేవారు.పర్ఫెక్ట్ గా చేసేదాన్ని.క్లియర్ గా ముందే అన్ని అడిగి తెలుసుకుని.తెలియక పోతే బ్యాంకు వాళ్ళ ని అడిగి.
అలాగే నాన్నతో ఎక్కడకి వెళ్లినా నాన్న ఏం చేస్తున్నారు,ఎలా చేస్తున్నారూ అన్నది గమనించటం మొదలు పెట్టా. అలా నాన్న చెప్పకుండా,నాన్న ని చూసి నేర్చుకున్నవి ఎన్ని ఉన్నాయో. ఇది నాన్న నాకు నేర్పిన మరో పాఠం.
9
3 comments
Like
Comment
Share

పెరింటింగ్ సూత్రం నెంబర్ 1 Ramadevi Telugu one

 పెరింటింగ్ సూత్రం నెంబర్ 1

" పిల్లల ల కి ఎలాంటి షరతులు లేకుండా తోడుగా నిలబడాలి. వాళ్ళు ఏమి నేర్చుకోవాలో చెప్పటం కాదు అనుభవం లోకి వచ్చేలా చేయండి."
నాన్న,అమ్మ ఈ విషయాన్ని ఎలా పాటించారో చెప్పే రెండు సంఘటనలు ఈ రోజు పంచుకుంటున్నా.
పేరెంటింగ్ గురించి,పిల్లలకి మంచి చెడు నేర్పించటం గురించి ఎవరన్నా చెబుతుంటే వెంటనే అమ్మా,నాన్న గుర్తువస్తారు. వాళ్ళ తో పాటు పెదనాన్నలు, మేనత్తలు,పిన్నులు ,ఎందుకంటే ఇలా మన రక్తసంబంధీకులు ఎందరో మనల్ని,మన ఆలోచనల్ని ఎంతో ప్రభావితం చేస్తారు.ఈ రోజు మనం ఏంటి అని ఒకసారి చూసుకుంటే అందులో ఎందరో కనిపిస్తారు. వాళ్ళని చూసి మనం ఆకళింపు చేసుకున్న ఎన్నో విషయాలు ని పోలికలుగా చెబుతారు అనిపిస్తుంది నాకు. మా పిల్లలు కి నా చిన్న తనం గురించి, మా వాళ్ళ గురించి కథలుగా వినటం ఇష్టం.అలా వాళ్ళకి చెబుతూ ఆ చిన్నతనం లోకి ఎన్నో సార్లు వెళ్లి వచ్చాను. అలా చిన్నతనాన్ని చూసుకున్నప్పుడల్లా ఒక నలభయ్యేళ్ళ క్రితం ఒక జీవితాన్ని రూపుదిద్దటాని కి ఎంత మంది శిల్పులు ప్రయత్నించారో కదా అనిపిస్తుంది. అప్పుడు నా బాధ్యత ఏంటో కూడా తెలుస్తోంది.
ఒక్కసారిగా అమ్మమ్మ,బామ్మ ,పెద్దనాన్న,పెద్దత్త,చిన్నత్త ఇలా అందరూ నా కళ్ళముందుకు వచ్చేస్తున్నారు రాయటం మొదలు పెట్టగానే.అందరికంటే ముందు నాన్న గురించి చెప్పాలి.ఎందుకంటే ఈ రోజు నేను ఏంటి అన్నదానికి నాన్న విత్తనం నాటి నీళ్లు పోసి జాగర్తగా పెంచి పెద్దచేశారు.అమ్మ అందుకే అంటుంది ఎంతయినా నువ్వు నాన్న కూతురువి అని.అమ్మ ఎంత నమ్మినా,సపోర్ట్ చేసినా,అసలు అమ్మ ఏం చేసినా అమ్మేకదా చేయాలి, ఇంక అమ్మ గురించి చెప్పేది ఏముంటుంది చెప్పండి.
నాకు బాగా గుర్తువుండి,నన్ను ఎంతో ప్రభావితం చేసిన కొన్ని సంఘటనలు చెబుతాను.
వాటన్నిటి కంటే ముందు ఈ రోజు నాకు అత్యంత ఇష్టమయిన జ్ఞాపకం,ఎప్పుడు తలచుకున్నా కళ్ళలో నీళ్లు వచ్చి,గర్వం గా అనిపించే ఒక సంఘటన చెబుతాను.పని ని ఎంత ప్రేమించాలో నాన్న చెప్పకుండా చెప్పారు ఆ ఒక్క సంఘటన తో.
మాది సింహాచలం. అమ్మాయి పదవతరగతి కూడా పూర్తి చేయకుండానే పెళ్లి చేసే అలవాటు వున్న కుటుంబం లో LAW చదవటం అనేది ఎలా జరిగిందో ఇంకోసారి చెబుతాను. అలాంటిది అమ్మాయి ఉద్యోగం అన్న విషయం లో ఎన్ని కట్టుబాట్లు ఉండాలి ?
నేను ALL INDIA RADIO లో యువవాణి కార్యక్రమాన్ని నిర్వహించేదాన్ని. అనౌన్సర్ గా. ఆ కార్యక్రమం సాయంత్రం 5.30 నుంచి ఒక గంట ఉండేది. నెల మొదట్లో నే మాకు కాంట్రాక్ట్ ఫార్మ్స్ పంపుతారు ఆ నెలలో మా డ్యూటీ ఎప్పుడెప్పుడు అన్న తేదీ వివరాల తో . మేము సంతకం పెట్టి ఇచ్చాకా ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు టైం కి వెళ్లి షో చేయాలి. అలా ఒకసారి నా డ్యూటీ దీపావళి రోజు పడింది. నేను సంతకం పెట్టేటప్పుడు దీపావళి రోజు డ్యూటీ అని చూసుకోకుండా పెట్టేసాను. దీపావళి రోజు సింహాచలం నుంచి విశాఖపట్నం లో వున్న రేడియో స్టేషన్ కి వెళ్ళాలి, అదీ సాయంత్రం అందరూ దీపాలు పెట్టి, టపాసులు కాల్చే టైం లో. బస్సు దిగి రేడియో స్టేషన్ కి ఒక పావుగంట నడవాలి. ఇంటి నుంచి బస్టేషన్ కి కూడా పావుగంట నడక.
నాన్న కి మధ్యాహ్నం డ్యూటీ. కంపెనీ కి వెళ్లిపోతున్నారు.నేను ఎలా వెళ్లాలా అని తర్జన భర్జన పడుతున్నా, నాన్న వెళుతూ పెద్దనాన్న గారి కి చెప్పాను, నీకు తోడు వస్తారు, ఆటో కి చెప్పాను వస్తుంది, నీ షో అయ్యేదాకా ఉండి తీసుకువస్తాడు అన్నారు. నాకు ఎంత ఆశ్చర్యం అంటే , ఒక్కమాట అనలేదు నాన్న చూసుకోవద్దా సంతకం పెట్టే ముందు,?ఎలా వెళతావు అని?కామ్ గా అన్ని అరెంజ్ చేసేసారు. ఆటో లో పంపించటం ఏంటి అంత గొప్పవిషయం అంటారా? నేను డ్యూటీ చేస్తే వ చ్చేది 150/- లు, ఆటో కి అటూ,ఇటూ అంత సేపు వెయిట్ చేయటానికి అంత కంటే ఎక్కువే తీసుకున్నాడు.
అదీ ఒక 27 ఏళ్ళ క్రితం ఆటో ఎక్కటం అనేది చాలా , చాలా అపురూపం అయిన రోజుల్లో. ఇవన్నీ కాదు కానీ పెద్ద పెద్దనాన్న గారు డెబ్బయి ఏళ్ల వయసులో నాకోసం ఆటో లో నాకు తోడుగా వచ్చి, నేను లోపల కార్యక్రమం చేస్తున్నంత సేపు బయట వెయిటింగ్ హాల్ లో కూర్చోవటం. నా పని కి నాన్న, పెద్దనాన్న ఎంత విలువ ఇచ్చారో తెలిసాక ఇంక నేను చేసే పనిని ప్రేమించకుండా ఎలా ఉండగలను.
తిరిగి వస్తుంటే ఇళ్ల ముందు వెలుగుతున్న దీపాలు, ఆకాశం లో విరుస్తున్న వెలుగులు ని మించి నా లోపల వెలుగు కు విరిశాయి. పెద్ద నాన్న తో ఇబ్బంది అయ్యిందా అంటే "మా ఇంటి సరస్వతి దేవి వి ,..నువ్వు ఏమి చేసినా గర్వమ్ గా ఉంటుంది. రేడియో లో నీ గొంతు ఎంత మంది విని వుంటారో కదా! అన్నారు.
నాన్న ఆ తర్వాత ఒక్కసారన్నా ఆ విషయం గురించి మాట్లాడలేదు. ''పని లో డబ్బు ఎంత వస్తుంది అని కాదు, నువ్వు దానిని ఎంత భక్తి తో చేస్తావు, ఎంత ఆనందాన్ని పొందుతావు అన్నది ముఖ్యం ' ' నాన్న ఎప్పుడూ చెప్పే మాట ఇదే. పని నుంచి ఆనందాన్ని పొందాలంటే దాన్ని ఇష్టం గా చేయాలి. అది ఎంత కష్టం గా వున్నా. నాన్న ఈ సూత్రాన్ని నాకు అలా నేర్పించారు.
పెద్దనాన్న ఇప్పటికీ ఎక్కడినుంచో నన్ను చూస్తూనే వుంటారు, నా విజయాల కి ఆనందపడుతూనే వుంటారు.రేడియో అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికి ,అందుకు ఈ సంఘటన కూడా ఒక కారణం. నాన్న, అమ్మా నా రేడియో కార్యక్రమాలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో చెప్పటానికి ఇంకో ఉదాహరణ వుంది .
ఒకసారి అనుకోకుండా పెళ్లి చూపులకి అని ఎవరో వస్తే ఒక అరగంట తర్వాత అమ్మ వాళ్ళ తో నేరుగా చెప్పేసింది. మీరు వస్తారని ముందుగా తెలియదు కదా, అమ్మాయి రేడియో లో చేస్తోంది. ఇప్పుడు వెళ్ళాలి ఏమి అనుకోకండి అని. పెద్దత్త కూడా వత్తాసు పలికింది. అంతే పెళ్ళివాళ్ళు కాఫీ లు తాగుతుండగా నేను పట్టుచీరతో బస్సు స్టాండ్ కి బయలు దేరా. వాళ్ళ మొహాల్లో కనిపించిన ఆశ్చర్యం, మా వాళ్ళందరి మొహాల్లో కనిపించిన ఆనందం అస్సలు మర్చి పోలేను ఎప్పటికి. ఇలా రోజు కి ఒక జ్ఞాపకం. కథలు మన జీవితాల్లోనే ఎన్ని వుంటాయో చూసుకోవాలి గాని .

108 ప్రశ్నలు –జవాబులతో.💐💐 రామాయణం

 108 ప్రశ్నలు –జవాబులతో.💐💐


రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి...

🙏✍💐🏹


1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?

= వాల్మీకి.


2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?

= నారదుడు.


3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?

= తమసా నది.


4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?

=24,000.


5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?

=కుశలవులు.


6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?

=సరయూ నది.


7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?

=కోసల రాజ్యం.


8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?

=సుమంత్రుడు.


9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?

=కౌసల్య, సుమిత్ర, కైకేయి.


10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?

=పుత్రకామేష్ఠి.


11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?

= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.


12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?

=జాంబవంతుడు.


13. వాలి ఎవరి అంశతో జన్మించెను?

= దేవేంద్రుడు.


14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?

=హనుమంతుడు.


15. కౌసల్య కుమారుని పేరేమిటి?

=శ్రీరాముడు.


16. భరతుని తల్లి పేరేమిటి?

=కైకేయి.


17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?

=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.


18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?

=వసిష్ఠుడు.


19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?

=12 సంవత్సరములు.


20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?

=మారీచ, సుబాహులు.


21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?

=బల-అతిబల.


22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?

=సిద్ధాశ్రమం.


23. తాటక భర్త పేరేమిటి?

=సుందుడు.


24. తాటకను శపించిన మహర్షి ఎవరు?

=అగస్త్యుడు.


25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?

=భగీరథుడు.


26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?

=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.


27. అహల్య భర్త ఎవరు?

=గౌతమ మహర్షి.


28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?

=శతానందుడు.


29. సీత ఎవరికి జన్మించెను?

=నాగటి చాలున జనకునికి దొరికెను.


30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?

=దేవరాతుడు.


31. శివధనుస్సును తయారు చేసినదెవరు?

=విశ్వకర్మ.


32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?

=మాండవి, శృతకీర్తి.


33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?

=జనకుడు.


34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?

=కుశధ్వజుడు.


35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?

=వైష్ణవ ధనుస్సు.


36. భరతుని మేనమామ పేరు ఏమిటి?

=యధాజిత్తు.


37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?

=మంధర.


38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?

=గిరివ్రజపురం, మేనమామ యింట.


39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?

=శృంగిబేరపురం.


40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?

=గారచెట్టు.


41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?

=భారద్వాజ ముని.


42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?

=మాల్యవతీ.


43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?

=తైలద్రోణములో.


44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?

=జాబాలి.


45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?

=నందిగ్రామము.


46. అత్రిమహాముని భార్య ఎవరు?

=అనసూయ.


47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?

=విరాధుడు.


48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?

=అగస్త్యుడు.


49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?

=గోదావరి.


50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?

=శూర్ఫణఖ.


51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?

=జనస్థానము.


52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?

=మారీచుడు.


53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?

=బంగారులేడి.


54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?

=జటాయువు.


55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?

=దక్షిణపు దిక్కు.


56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?

=కబంధుని.


57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?

=మతంగ వనం, పంపానదీ.


58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?

=ఋష్యమూక పర్వతం.


59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?

=హనుమంతుడు.


60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?

=అగ్ని సాక్షిగా.


61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?

=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.


62. సుగ్రీవుని భార్య పేరు?

=రుమ.


63. వాలి భార్యపేరు?

=తార.


64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?

=కిష్కింధ.


65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?

=మాయావి.


66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?

=దుందుభి.


67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?

=మతంగముని.


68. వాలి కుమారుని పేరేమిటి?

=అంగదుడు.


69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?

=ఏడు.


70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?

=ప్రసవణగిరి.


71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=వినతుడు.


72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=అంగదుడు.


73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?

=మామగారు, తార తండ్రి.


74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=శతబలుడు.


75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?

=మాసం (ఒక నెల).


76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?

=దక్షిణ దిక్కు.


77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?

=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.


78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?

=స్వయంప్రభ.


79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?

=సంపాతి.


80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?

=పుంజికస్థల.


81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?

=మహేంద్రపర్వతము.


82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?

=మైనాకుడు.


83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?

=సురస.


84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?

=సింహిక.


85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?

=నూరు యోజనములు.


86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?

=లంబ పర్వతం.


87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?

=అశోక వనం.


88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?

=రెండు.


89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?

=త్రిజట.


90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?

=రామ కథ.


91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?

=చూడామణి.


92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?

=ఎనభై వేలమంది.


93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?

=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.


94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?

=విభీషణుడు.


95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?

=మధువనం.


96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?

=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.


97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?

=ఆలింగన సౌభాగ్యం.


98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?

=నీలుడు.


99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?

=నికుంభిల.


100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?

=అగస్త్యుడు.


101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?

=ఇంద్రుడు.


102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?

=మాతలి.


103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?

=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!


104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?

=హనుమంతుడు.


105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?

=శత్రుంజయం.


106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?

=స్వయంగా తన భవనమునే యిచ్చెను.


107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?

=బ్రహ్మ.


108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?

=తన మెడలోని ముత్యాలహారం.


శ్రీ రామ జయం!

🙏👍✍🏹 🙏🙏 మీ శ్రీరామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌹🙏🌹

Tuesday, August 11, 2020

ఎన్నాళ్ళయిందో..కరోనా ఎంత పని చేసావే..

 ఎన్నాళ్ళయిందో..


ఇంటికి పెళ్లి కార్డు వచ్చి..

సినిమాకెళ్ళి..

బంతి భోజనం తిని..

అమ్మలతో కలిసి భుజాన బస్తా బాగులతో బడికెళ్తున్న 

పిల్లల్ని చూసి..

కిటకిటలాడే బస్సుల్లో 

ఫుట్ బోర్డు పట్టుకు వేలాడే కుర్రకారును తిట్టి..

వీధి చివర బడి

గంట విని..

రైల్వేస్టేషన్లలో అనౌన్స్మెంట్ ఆలకించి..

కవి సమ్మేళనంలో 

మంచి కవిత వినిపించి..

పేరంటానికెళ్తున్న అమ్మలక్కల

అలంకారాలు గని..

టివిలో క్రికెట్ మాచ్ తిలకించి..

మంచి కబురు విని పులకించి..

మిత్రుడు కనిపిస్తే 

మనసారా కౌగలించుకుని..

రాత్రి పొద్దుపోయే దాకా 

జంక్షన్లో అసుక్కొట్టి..

హోటల్ కెళ్ళి విందారగించి.

పార్కుకు పోయి..

బహిరంగ సభ కవర్ చేసి..

షేక్ హాండిచ్చి..

రైల్లో కంపుకొట్టే టాయిలెట్ కు 

ముక్కు మూసుకుని 

వెళ్లి వచ్చి..

ఆకశాన రివ్వున ఎగిరెళ్లే విమానాన్ని చూసి అబ్బురపడి..

ఊరేగింపు కనబడి..

నినాదాలు వినపడి..

రోడ్ల మీద వేషాలు తిరిగి..

గ్రూప్ ఫోటో దిగి..

బడ్డికొట్లో టీ తాగి..

అంతెందుకు తనివితీరా తుమ్మి

బాధ తీరేలా దగ్గి..

ఎన్నాళ్ళయిందో..


అప్పుడెప్పుడో నాన్న పోయారు

రక్తం పంచుకుని పుట్టినోళ్ళం

ఒకరినొకరం గట్టిగా పట్టుకుని

మనస్ఫూర్తిగా ఏడ్చాం..

కష్టమే అయినా పంచుకున్నాం

గుండె బరువు దింపుకున్నాం..

మొన్న అమ్మెళ్ళిపోయింది

కొందరు రాలేకపోయారు

ఉన్నోళ్ళం భయం భయంగా

దూరం దూరంగా

భారం భారంగా..

ఖచ్చితంగా చెప్పాలంటే

ఘోరం ఘోరంగా..

ఓదార్చే స్పర్శ..

కన్నీరు తుడిచే చేయి లేవు..

పంటి బిగువున బాధ..

గుండె పట్టేసింది..

భోరున ఏడ్చే 

పరిస్థితి లేని దుస్థితి..

కష్టం చూసి కాష్టానికి

వచ్చినోళ్లే లేరు..

ఆ నలుగురూ 

దొరకడమే దుర్లభం..

ఏమి ప్రారబ్ధం..

భరించలేని నిశ్శబ్దం..


కరోనా ఎంత పని చేసావే..

సంఘజీవిని ఒంటరిని చేసి

లొంగదీసావ్..

ఆపై కృంగదీశావ్..

గత అయిదు నెలలుగా 

ఎక్కడ విన్నా 

నీ మాటే..

నీ కాటే..

పాజిటివ్..నెగిటివ్..

టెస్టులు..రెస్టులు..

క్వారెంటైన్లు..ఐసొలేషన్లు..

ఆంబులెన్సు మోతలు..

పోలీసు లాఠీల వాతలు..

లెక్కల కోతలు..

సమ సమాజం..శ్రమ సమాజం

భ్రమ సమాజమై..

చావు అసహజమై..

భయం నిజమై..

బ్రతుకు బరువై..

మనశ్శాంతి కరువై..

గుండె చెరువై..

మృత్యువు చేరువై..

సామాజిక దూరం..

వెంటరానితనం..

అలవాటై..

జీవితమే గ్రహపాటై..

సాటి మనిషిని 

కలవడమే పొరపాటై..

ఇల్లే ఖైదై..

బ్రతుకు చేదై..


సరేలే..

ఎన్నాళ్లులే నీ విలయం..

ఈ జగమే దేవాలయం..

గంట మోగదా..

పంట పండదా..

మంట రేగదా..

నీ ఆయువు మూడదా..

జగతిన మళ్లీ 

తొలి పొద్దు పొడవదా..

మానవజాతి మరో విజయగీతిక ఆలపించదా..!

Total Pageviews