పెళ్ళినాటి ప్రమాణాలు
మాంగల్యధారణ సమయంలో వరుడు చేసే ప్రమాణం.
* మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా
కంఠే బధ్నామిసుభగె త్వం జీవశరదస్సతం *
అనే మంత్రానికి అర్ధం " ఓ మాంగల్యమా! నా జీవనానికి కారణభూతురాలైన
ఈ సౌభాగ్యవతి కంఠ మునకు నిన్ను అలంకరిస్తున్నాను. నీవు నూరు
సంవత్సరాలు ఈమె కంఠము నందే వుందువుగాక " అని
చెప్పి
మాంగల్యాన్ని వధువు మెడలో మూడుముళ్ళు వేసికడతాడు. ఈ
మూడే ముళ్ళు ఎందుకు వేయిస్తారంటే త్రిమాతలైన లక్ష్మి, పార్వతి,
సరస్వతీ దేవతలకు అంకితంగా మూడు ముళ్ళు వరుడు వేస్తాడు.
No comments:
Post a Comment