Thursday, October 8, 2015

శ్రీ లలితా సహస్రనామం....మహా మహిమాన్వితమైనది

శ్రీ లలితా సహస్రనామం అత్యంత శక్తిమంతమైనదిగా ... మహా మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. 'బ్రహ్మాండపురాణం' లో ఉత్తరభాగంలో లలితా సహస్రనామావళి విశిష్టత కనిపిస్తుంది. దీనిని మొదటిసారిగా హయగ్రీవ స్వామి ... అగస్త్య మహర్షికి బోధించాడు. ఆనాటి నుంచి కూడా లలితా సహస్రనామం తనని విశ్వసించిన వారిని ఒక రక్షణ కవచంలా కాపాడుతూ వస్తోంది. అందువల్లనే చాలామంది నిత్యం అమ్మవారి లలితా సహస్రనామావళిని చదువుతూ వుంటారు.చాలామంది లలితను చదవడం వలన ఒకే విధమైన ఫలితం ఉంటుందని అనుకుంటారు. కానీ ఇందులోని ప్రతి పంక్తి ఒక్కో దోషాన్ని నశింపజేసి ... ఒక్కో పుణ్య ఫలాన్ని అందిస్తుంది. ఆరోగ్యం .. సంపద .. సంతానం .. ఇలా ఏది కావాలనుకుంటే అది పొందడానికి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ఆ పద్ధతులను పాటిస్తూ లలిత చదవడం వలన ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. లలితాదేవిని నిత్యం సహస్ర నామాలతో ఆరాధిస్తూ .. అర్చిస్తూ వుండటం వలన ఆ తల్లి అనుక్షణం కాపాడుతూ వుంటుంది .. కరుణిస్తూ వుంటుంది.  ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః!!



No comments:

Post a Comment

Total Pageviews