Monday, May 30, 2016

పిడికెడు ఉప్పు(ఒక నీతి కథ).
ఒక యువకుడి తన గురువు దగ్గరికెళ్ళి ఇలా చెప్పాడు..!!
.
"స్వామీజీ...నా జీవితమంతా కష్టాలే..!!
ఈ జీవితాన్ని భరించలేకపోతున్నాను..!!
దయచేసి నా కష్టాలు తీరే మార్గo చెప్పండి."
.
అప్పుడు గురువు ఆ యువకుడి వైపు చూశాడు..!!
.
ఒక గ్లాసు నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేయమన్నాడు..!!
యువకుడు అలాగే చేశాడు...!!
ఇప్పుడు ఆ నీటిని "తాగు" అన్నాడు గురువు..!!
.
యువకుడు గ్లాసు పైకెత్తాడు..ఆ నీటిని తాగాడు...!!
వెంటనే ఉమ్మేశాడు...!!
"అబ్బ... భరిoచలేని ఉప్పు...."
.
ఇంకో పిడికెడు ఉప్పు తీసుకుని...
ఆ యువకుడిని చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు గురువు..!!
.
"ఈ ఉప్పు ఈ చెరువులో వేసి ఈ నీళ్ళని తాగు అని చెప్పాడు గురువు..!!
.
ఆ యువకుడు చెరువు నీటిని గడగడా తాగేశాడు..!!
.
"ఎలా ఉన్నాయి ఈ నీళ్ళు..??" అడిగాడు గురువు..!!
"నీరు తీయగా ఉంది" చెప్పాడు ఆ యువకుడు..!!
.
"అదే పిడికెడు ఉప్పు, అప్పుడెందుకు భరించలేకపోయావు..??
ఇప్పుడెలా భరించావు..?? అడిగాడు గురువు..!!
.
అప్పడు ఆ యువకుడు ఇలా చెప్పాడు..!!
.
అది తక్కువ నీరు...
గ్లాసుడు నీరు...
అందుకే ఉప్పగా ఉంది.
ఇది చెరువు..!!
అంటే ఎక్కువ నీరు..!!
అందుకే ఉప్పదనం లేదు...!! " అన్నాడు యువకుడు..!!
.
అప్పుడు ఆ గురువు ఇలా చెప్పాడు..!!
.
"నాయనా...!!
సమస్యలు పిడికెడు ఉప్పు లాంటివి...!!
అది గ్లాసులోనూ పిడికెడే...!!
చెరువులోనూ పిడికెడే...!!
.
కానీ నీ జీవితం గ్లాసులా ఉండాలా...!!
చెరువులా ఉండాలా అన్నది మాత్రం నువ్వే నిర్ణయించుకోవాలి...!!
.
నీ ఆలోచనా శక్తి, సహన శక్తి పరిధి పెరిగితే పిడికెడు ఉప్పు తక్కువవుతుంది...!!
ఆ పరిధి సంకుచితమైతే పిడికెడు ఉప్పు భరించలేనంత అవుతుంది" అన్నారు గురువు. పరిస్థితి అవగాహన చేసుకొని జీవితాన్ని నందనవనం చేసుకున్నాడా యువకుడు.
హనుమజ్జయంతి.

వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం నాడు వైధృతి యోగం కర్క ాటక లగ్నమునందు శనివారం మధ్యాహ్నకాలమున కౌండిన్య గోత్రమున ఆంజనేయావతారం జరిగినది.
"ఆంజనేయః పూజిస్తశ్చేత్ పూజితాస్సర్వ దేవతాః"
ఆంజనేయుని పూజిస్తే సకల దేవతలనూ పూజించినట్లేనని శాస్త్రోక్తి. ఆంజనేయస్వామి ఆరాధన సర్వ గ్రహదోషాలను తొలగించి అభీష్టసిద్ధిని కలుగజేస్తుంది.
ఈ రోజున హనుమంతుని అర్చించిన వారికి సర్వకామనలు తీరుతాయి.

హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిక్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.

శుభోదయం ../\..

మిత్రులందరికీ శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 

హనుమానంజనా సునో వాయుపుత్రో మహాబలః 
రామేష్ట : ఫల్గుణ సఖః - పింగాక్షో అమిత విక్రమః 
ఉదధిక్రమణశ్చైవ - సీతా శోక వినాశక : 
లక్ష్మణ ప్రాణ దాతా చ - దశగ్రీవస్య దర్పహా ||
ద్వాదశైతాని నామాని -కపింద్రస్య మహాత్మన : 
స్వాపకాలే  పఠేన్నిత్యం యాత్రా కాలే విశేషిత : 
తస్య మృత్యు భయం నాస్తి - సర్వత్రా విజయీ భవేత్ ||



Sunday, May 29, 2016

అసలు కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుండి మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? మీ శరీరానికి ఎలాంటి హాని తలబెడుతుందో తెలుసా?                    కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాలకు:
కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో చెక్కర తింటే వాంతులు అవుతాయి. కాని కూల్ డ్రింక్ లో ఉండేటువంటి ఫాస్ఫోరిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది.
కూల్ డ్రింక్ తాగిన 20 నిమిషాలకు:
కూల్ డ్రింక్ లో ఉన్న షుగర్ ను మన లివర్ రక్తంలోకి పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. దీని ద్వారా ఈ షుగర్ కొవ్వు గా మారి బరువు పెరుగుతారు.
కూల్ డ్రింక్ తాగిన 40 నిమిషాలకు:
రక్తంలోకి షుగర్ ను పంపియడం కొనసాగుతుంది. కోల్ డ్రింక్ లో ఉండే కెఫిన్ మెల్లమెల్లగా మీ శరీరంలో నిండుతుంది. దీనితో మీ రక్త పోటు పెరిగి, మీ కంటి పాపలు చిన్నగవుతాయి. కెఫిన్ పెద్దవారికి ఎక్కువ హాని చేయదు, అలా అని ఎక్కువ మోతాదులో దీనిని సేవించినా ప్రమాదమే. అందుకే చిన్న పిల్లలను కూల్ డ్రింకులకు ఎంత దూరం పెడితే అంత మంచిది.
కూల్ డ్రింక్ తాగిన 45 నిమిషాలకు:
ఇప్పుడు మీ శరీరం డోపమైన్ అనే ఓ కెమికల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చిన్న మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్టే.
కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాలకు:
గంట తరువాత, మీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ మీ చిన్న పేగులలో చేరడంతో, అక్కడ ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డు కట్ట వేస్తుంది. దీనితో తరచుగా మూత్రవిసర్జన జరడంతోపాటు, డీహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి.
మన శరీరానికి ఇంతలా హాని తలబెట్టే కూల్ డ్రింక్ తాగడం మనకు మన పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు. వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండడమే మంచిది.
ఈ విలువైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఒకరికి సహాయపడిన వారిగా గొప్ప అనుభూతిని పొందండి.
ఒకొక్క గుడికి  ఒక్కో ప్రత్యేకత.
మన పూర్వీకులు గొప్ప సివిల్ ఇంజనీర్ లు.

పూర్వకాలంలో దేవాలయాలు ( కోవెలలు,గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు.

అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండేది.
ఉదాహరణకు కొన్ని చూద్దాం.

1.ఉత్సవవిగ్రహం లేకుండా మూలవిగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజస్వామి.

2.కుంబకోణంలో ఐరావతేశ్వరస్వామి గుడి తారాశురం అనే గ్రామంలో వుంది.అక్కడశిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది.
ఒక స్తంభము నుంచి చూస్తె వాలిసుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది ,కొంచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడివుంది.ఇందులో గొప్ప ఏమిటి అంటే మోదటి స్థంబము నుంచి చూస్తె శ్రీరాముడు కనపడడు కాని రెండవ స్తంబము నుంచి చూస్తె వాలిసుగ్రీవుల యుద్దము చాల బాగా తెలుస్తుంది.

3.ధర్మపురి(తమిళనాడు)
మల్లికార్జునస్వామీ కోవెలలోన వంగామంటపం అంటే తొమ్మిదిస్తంభముల మంటపం అన్నమాట.ఇందులో రెండు స్థంబములు భూమిపై ఆనకుండా గాలిలో వేలాడుతున్నట్టుగా ఉంటాయి .

4.కరూర్(కోయంబత్తూర్)
సమీపంలోని కుళిత్తలై అనే ఊరిలో
కదంబ వననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒకే మండపములో ప్రతిష్ట గావించబడి వున్నాయి.

5.గరుడుడు నాలుగుకరములతో( చేతులతో) అందులో రెంటిలో శంఖచక్రములతో దర్శనము ఇచ్చేది కుంబకోణం ప్రక్కన వేల్లియంగుడి అనే గ్రామ దెవాలయంలోమాత్రమే.

6.కుంభకోణంలో నాచ్చియార్కోవిల్ అనే స్థలంలో విష్ణుగుడి వుంది.అక్కడ గరుడవాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో ఉంది అది నలుగురు మోసే బరువు వుంటుంది.
కాని క్రమంగా ఒక్కొక్క ప్రాకారందాటి బయటకు వస్తుంటే రానురాను 8,16,32 అలా బయటవీదిలోకి వచ్చేటప్పటికి 64 మంది మోసే అంత బరువు అయిపోతుంది
మరి స్వామీగుడిలోనికి పోతున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది ఇక బయటవీధికి వచ్చేటప్పటికి గరుడవిగ్రహమునకు చెమటపట్టడం కూడా ఒకవిచిత్రమే.

7.చెన్నైసమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల వారి గుడి వుంది అక్కడ మూలస్థానంలో విగ్రహం రాతిది కాదు
పంచలోహవిగ్రహము కాదు కేవలం
కుంకుమపువ్వు పచ్చకర్పూరం మూలికలతో చేసినది.
ఆశ్చర్యం కదా.

8.తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథస్వామి దేవాలయంలో ఒకబిల్వచెట్టు స్థలవృక్షం గా వుంది.ఆ చెట్టులో కాచే బిల్వకాయలు లింగాకారంలో వుంటాయి.

9.కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదువర్ణములుగా మారుతూ వుంటుంది అందుకే ఆ కోవేలని పంచవర్నేశ్వరుడు కోవెల అని పిలుస్తారు.

10.విరుదునగర్ ప్రక్కనా ధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు.

11.ఆంధ్రప్రదేశ్
సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒకపెద్ద ఆంజనేయ విగ్రహం వుంది.దీని ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీరామసన్నిధిలో శ్రీరాముని పాదములు ఒకే ఎత్తులో వుండడం.

12.వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒకస్థంభములో అర్ధచంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు,ఆరునుండి పంన్నెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది .
పైన వుండే పల్లము నుండి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.
గడియారం చూసుకొఖ్ఖర లేదు.

13.చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సునుంచి నడుమువరకు మానవఆకారం నడుమునుంచి పాదములవరకు మత్స్యఆకారంలో వుంటుంది.

14,ధర్మపురి(తమిళనాడు)పక్కన పదుహారు అంటే పదిమైళ్ళదూరంలో అభీష్టవరదస్వామీ అనే విష్ణుగుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటారు.
ఇలా మనకు తెలియని , తెలిసినా పట్టించు కోకుండా గొప్పగా చెప్పుకోనివి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమవిధానంగా కట్టిన దేవాలయాలు వున్నాయి.
(( నక్షత్ర గాయత్రి ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి))

1.అశ్విని
ఓం శ్వేతవర్ణై విద్మహే
సుధాకరాయై ధిమహి
తన్నో అశ్వినేన ప్రచోదయాత్

2.భరణి
ఓం కృష్ణవర్ణై విద్మహే
దండధరాయై ధిమహి
తన్నో భరణి:ప్రచోదయాత్

3.కృత్తికా
ఓం వణ్ణిదేహాయై విద్మహే
మహాతపాయై ధీమహి
తన్నో కృత్తికా ప్రచోదయాత్

4.రోహిణి
ప్రజావిరుధ్ధై చ విద్మహే
విశ్వరూపాయై ధీమహి
తన్నో రోహిణి ప్రచోదయాత్

5.మృగశిరా
ఓం శశిశేఖరాయ విద్మహే
మహారాజాయ ధిమహి
తన్నో మృగశిర:ప్రచోదయాత్

6.ఆర్ద్రా
ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే
పశుం తనాయ ధిమహి
తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్

7.పునర్వసు
ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే
అదితి పుత్రాయ ధిమహి
తన్నో పునర్వసు ప్రచోదయాత్

8.పుష్య
ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే
మహాదిశాయాయ ధిమహి
తన్నో పుష్య:ప్రచోదయాత్

9.ఆశ్లేష
ఓం సర్పరాజాయ విద్మహే
మహారోచకాయ ధిమహి
తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్

10.మఖ
ఓం మహా అనగాయ విద్మహే
పిత్రియాదేవాయ ధిమహి
తన్నో మఖ: ప్రచోదయాత్

11.పుబ్బ
ఓం అరియంనాయ విద్మహే
పశుదేహాయ ధిమహి
తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్

12.ఉత్తరా
మహాబకాయై విద్మహే
మహాశ్రేష్ఠాయై ధీమహి
తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్

 13.హస్త
ఓం ప్రయచ్చతాయై విద్మహే
ప్రకృప్రణీతాయై ధీమహి
తన్నో హస్తా ప్రచోదయాత్

14.చిత్తా
ఓం మహాదృష్టాయై విద్మహే
ప్రజారపాయై ధీమహి
తన్నో చైత్రా:ప్రచోదయాత్

15.స్వాతి
ఓం కామసారాయై విద్మహే
మహాని ష్ఠాయై ధీమహి
తన్నో స్వాతి ప్రచోదయాత్

16.విశాఖ
ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే
మహాశ్రేష్ఠాయై చ ధీమహీ
తన్నో విశాఖ ప్రచోదయాత్

17 అనూరాధ
ఓం మిత్రదేయాయై విద్మహే
మహామిత్రాయ ధీమహి
తన్నో అనూరాధా ప్రచోదయాత్

18.జ్యేష్ఠా
ఓం జ్యేష్ఠాయై విద్మహే
మహాజ్యేష్ఠాయై ధీమహి
తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్

19.మూల
ఓం ప్రజాధిపాయై విద్మహే
మహాప్రజాధిపాయై ధీమహి
తన్నో మూలా ప్రచోదయాత్

20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై వి
ఓం ప్రజాధిపాయై విద్మహే
మహాప్రజాధిపాయై ధీమహి
తన్నో మూలా ప్రచోదయాత్

20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై విద్మహే
మహాబీజితాయై ధిమహి
తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్

21.ఉత్తరాషాఢ
ఓం విశ్వేదేవాయ విద్మహే
మహాషాఢాయ ధిమహి
తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్

22. శ్రవణ
ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే
పుణ్యశ్లోకాయ ధీమహి
తన్నో శ్రవణ ప్రచోదయాత్

23.ధనిష్ఠా
ఓం అగ్రనాథాయ విద్మహే
వసూప్రితాయ ధీమహి
తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్

24.శతభిషం
ఓం భేషజాయ విద్మహే
వరుణదేహాయ ధీమహి
తన్నో శతభిషా ప్రచోదయాత్

25.పూర్వాభాద్ర
ఓం తేజస్కరాయ విద్మహే
అజరక పాదాయ ధీమహి
తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్

26.ఉత్తరాభాద్ర
ఓం అహిరబుధ్నాయ విద్మహే
ప్రతిష్ఠాపనాయ ధీమహి
తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్

27.రేవతి
ఓం విశ్వరూపాయ విద్మహే
పూష్ణ దేహాయ ధీమహి
తన్నో రేవతి ప్రచోదయాత్ 
పెద్దలమాట చద్దిమూట!!!



శుభోదయం../\..


Thursday, May 26, 2016

శ్రీ ఆదిశంకరాచార్యులవారు అధిరోహించిన సర్వజ్ఞపీఠం ఇది. పాక్ ఆక్రమిత్ర కాశ్మీర్‌లో ఉంది. ఇక్కడే అష్టాదశశక్తి పీఠాల్లో ఒకటైన సరస్వతీ శక్తిపీఠం ఉంది. ముష్కరుల దాడి వలన ఇప్పుడు ఇలా శిధిలావస్థలో ఉంది.
జయ జయ శంకర హర హర శంకర
నీలం (క్రిషన్ గంగా) నది ఒడ్డున, రెండు కొండల మధ్య, ప్రకృతి రమణీయమైన శారద అనే గ్రామములో ఉంది ఈ సర్వజ్ఞ పీఠం. ఇక్కడే శారద మాత ఆలయం ఉంది. ఇది దాదాపు అతి తక్కువ జనాభా గల చిన్ని గ్రామం. అంతే కాదు ఇది ఒంటరి గ్రామం. చుట్టు ప్రక్కల ఎక్కడా జన సంచారము లేని గ్రామం. దక్షిణం నుంచి (బహుశః భారత దేశం నుంచి) అక్కడికి చేరిన మొదటి ఆచార్యులు శ్రీ అది శంకరులు. అక్కడి వారందరిని వాదనలో గెలిచి, అద్యక్ష పీఠానికి ఎన్నికయిన భారత దేశపు మొదటి ఆచార్యులు శ్రీ అది శంకరులు. అక్కడి అధ్యక్షోపన్యాసమే అత్మబోదగా ప్రచారములోకి వచ్చిందని విన్నాను.-
-



చక్కని ఎద్దు... కధ..
‘‘‘‘‘‘‘‘’‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘’‘‘‘‘‘’’’’’‘’’’’’’’’’’’’’‘’’’’’’’’’
అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది... అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది.
గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు.
ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ "నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది- కావాలంటే వెయ్యి నాణేలు పందెం" అనేశాడు. కొందరు ఆ మాటను వినీ విననట్టు ఊరుకున్నారు కానీ, గోపన్న అంటే సరిపోనివాళ్ళు కొందరు జట్టు కట్టి, "పందెం అంటే పందెం" అన్నారు.
పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లనూ వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక, అట్లా ఊరికే నిలబడిందది. అందరూ 'లాగు లాగు' అన్నారు. కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది.
గోపయ్యకు తల తీసేసినట్లయింది. 'ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు?' అని చికాకు మొదలైంది- ఆ చికాకులో 'తను దానికి లాగమని చెప్పనేలేదు' అని అతనికి గుర్తుకే రాలేదు. పైపెచ్చు, అది 'నా పరువు తీస్తోంది' అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది: "వెయ్యి నాణేలు... పోగొట్టకు! వెయ్యి నాణేలు!! ఎప్పుడైనా చూశావా? అంత తిండి తినేది ఎందుకట, ఈ మాత్రం లాగలేవా?!" అని తిడుతూ, అందరు రైతుల లాగానే తనూ దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టటం మొదలు పెట్టాడు అతను.
గోపయ్య అంతకు ముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు. ఏనాడూ దాన్ని తిట్టలేదు; ఒక్క దెబ్బకూడా వెయ్యలేదు! మరి ఇప్పుడు అతను అంత కోపంగా అరవటం, పైపెచ్చు చర్నాకోలతో కొట్టటం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో అది పూర్తిగా మొండికేసింది- ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టీ కొట్టీ అలసిపోయిన గోపయ్య పదిమందిలోనూ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. డబ్బుతోబాటు పరువునూ పోగొట్టుకొని, తలవంచుకొని ఇల్లు చేరుకున్నాడతను.
"గతంలో అవసరం ఉన్నప్పుడు చాలా సార్లు ఈ ఎద్దే వంద బండ్లను అలవోకగా లాగేసింది గదా, మరి ఇవాళ్ల ఎందుకు లాగలేదు?!" అన్న ఆలోచన రాలేదు, కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు. అయితే ఆరోజు సాయంత్రం చూసేసరికి, ఎద్దు మేత మేయకుండా- స్తబ్దుగా నిలబడి ఉన్నది. దాని ఒంటినిండా చర్నాకోల వాతలు- ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు. గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తున్నది!
దాన్ని చూసే సరికి గోపయ్య హృదయం ద్రవించింది. దాని గాయాలకు మలాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు: 'ఈ మూగ జంతువుకూ హృదయం ఉంది. తన మాట నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా, కౄరంగా శిక్షించాడు. సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు!'
గోపయ్య కళ్ల నీళ్ళతో దానికి క్షమాపణ చెప్పుకొని, నిమిరి, ముద్దుచేసి, దగ్గర చేసుకున్నాడు. అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుటపడ్డది.
తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాతి రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు. 'ఈసారి పందెం రెండు వేల నాణేలు' అన్నారు గ్రామస్తులు. ఈసారి గోపయ్య ఎద్దుని కొట్టలేదు సరికదా, కనీసం అదిలించను కూడా లేదు. ప్రేమగా వీపు నిమిరి, 'లాగురా!' అనేసరికి, ఎద్దు వంద బండ్లనూ లాక్కొని ముందుకు ఉరికింది!
గోపయ్య పందెం నెగ్గటమే కాదు; జీవితాంతం‌ ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు- 'ఎంత తొందర, ఎంత చికాకు ఉన్నా సరే, మనసుల్ని మటుకు గాయపరచకూడదు' అని.
చక్కని ఈ కథని మళ్ళీ ఓసారి చదవగలరని కోరుతూ...
జాగ్రత్తగా చూస్తే, పసి పిల్లలలో కూడా అనంతమైన శక్తి దాగి ఉన్నది.
ప్రేమ, ఆప్యాయతలు వాళ్ళు తమ ఈ శక్తిని వాస్తవీకరించుకునేందుకు సహాయపడతాయి. మంచి ఉపాధ్యాయులు అందరూ పిల్లల హృదయాల్ని అర్థం చేసుకొని సున్నితమైన మనసులతోటి సున్నితంగానే ప్రవర్తించాలి.
ప్రతి ఒక్కరూ షేర్ చెయ్యండి.. సమాజంలో మార్పుకోసం కృషి చేయండి..🙏
శుభోదయం../i\..
క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికి దోయజాతభవ చిత్త వశీకరనైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.
భావం:- నెలకు నెన్నుదురు సోకునట్లు సాగిలపడి మ్రొక్కి సైకత శ్రోణి, చదువుల వాణీ, అలివేణి అయిన వాణిని సన్నుతిస్తాను. ఆ చల్లని తల్లి ఒక చేతిలో అక్షరామాలనూ, మరొక చేతిలో రాచిలుకనూ, ఇంకొక చేతిలో తామర పువ్వునూ, వేరొక చేతిలో పుస్తకాన్ని ముచ్చటగా ధరిస్తుంది. సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షిస్తుంది.తన కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరిస్తుంది.


Tuesday, May 24, 2016

😆 “శరీర భాగాలు – ఉపయోగాలు”

తల – తాకట్టు పెట్టుకోవదానికి

గడ్డం – పట్టుకుని బతిమాలాడడానికి

ముక్కు – పిండి వసూలుచేయడానికి

వీపు – విమానం మోత మోగించడానికి

కాలు – బలపం కట్టుకుతిరగడానికి

కాళ్లు – పట్టుకుని బతిమాలాడడానికి

అరికాలు – దానిమంట తలకెక్కించుకోడానికి

కన్ను – కొట్టడానికి

కళ్ళు – నిప్పులు పోసుకోవడానికి

భుజాలు – గుమ్మడి కాయ దొంగెవరంటే తడుముకోవడానికి

చెంప – చెల్లుమనిపించడానికి

వేలు – ఎత్తి చూడడానికి

చేతులు – జోడించి నమస్కరించడానికి

అరచేయి – వైకుంఠం చూపించడానికి

పొట్ట – తిప్పలకోసం

నడుము – వంచి పనిచేయడానికి

నొసలు – చిట్లించడానికి

టోటల్ గా దేహం – తనువు చాలించటానికి…

ఒక మిత్రులు వాట్స్ అప్ లో పెట్టినది సరదాగా మీ అందరితో పంచుకోవాలని...
కనువిప్పు కలిగించే కధ!!

నీ విలువ ఎంత?

నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి తన పేదరికానికి చాలా చింతిస్తుండేవాడు. ఏ పనీ చేయకుండా ఇతరులతో పోల్చుతూ తన పేదరికానికి కారణమైనారని తల్లితండృలని, దేవుడినీ తిడుతూ ఉండేవాడు.

అలా ఒకసారి దేవుడిని తిడుతూ ఉండగా దేవుడు ప్రత్యక్షమై "నాయనా ఏమిటి నీ బాధ?" అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి "స్వామీ, నీవు ఎంతోమందిని ధనికులుగా పుట్టించావు. మరి నన్ను ఎందుకు పేదరికంలో పుట్టించావు?" అని అడిగాడు.

దానికి దేవుడు "నాకు ఎవరిమీదా ప్రత్యేకమైన ఆసక్తి కానీ శతృత్వము కానీ లేవు. వారి వారి ఆలోచనలను, వారు చేసే కర్మను బట్టి మాత్రమే వారు పేదవారా లేక ధనికులా అన్నది వారే నిర్ణయించుకోవాలి. కొంతమంది పుట్టుకతో పేదలైనా వారి స్వశక్తితో ధనికులుగా మారారు. మరికొందరు పుట్టుకతో ధనికులైనా సరైన మార్గంలో పయనించక కటిక దరిద్రం అనుభవిస్తున్నారు. ఎవరు ఏ విధంగా పుట్టినా అందరికీ ఎదగడానికి కావలసిన వసతులు కల్పించడమే నా విధి" అన్నాడు.

కానీ ఆ వ్యక్తి ఒప్పుకోకుండా అలాగే వాదిస్తూ "అందరికీ వసతులు కల్పించడమే నీ విధి అన్నావు. మరి నాకేమీ వసతులు కల్పించలేదే" అన్నాడు. ఆ తరువాత వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది.

దేవుడు: నీకోసం నేను ఎన్నో పనులు చేసుకునే అవకాశం కల్పించాను. కానీ నీవు పని చేయకుండా కేవలం ధనికులను చూస్తూ వారిలా పుట్టలేదే అని అలోచిస్తూ కాలం వెళ్ళబుచ్చి నీఅంతట నీవే అవకాశాలను కోల్పోయావు. అయినా నీవు ధనవంతుడవు కావు అని నీవెందుకు అనుకొంటున్నావు?

వ్యక్తి: నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. తినడానికి కనీసం తిండి లేదు. నేను ధనికుడనెలా అవుతాను.

దేవుడు: సరే. నేను నీకొక లక్ష రూపాయలు ఇస్తాను ఒక వేలు కోసిస్తావా?

వ్యక్తి: అమ్మో లేదు.

దేవుడు: అలా ఐతే ఐదు లక్షలిస్తాను, ఒక చేయి ఇస్తావా?

వ్యక్తి: చేయి లేకుండా జీవితాంతం అడుక్కుతినాలా?. లేదు

దేవుడు: పోనీ పది లక్షలిస్తాను ఒక మూత్ర పిండం ఇస్తావా?

వ్యక్తి: ఉన్న ఒక్కటీ పాడైపోతే నాకు ఇచ్చేవాడు ఎక్కడ దొరకాలి? ఇవ్వను.

దేవుడు: 20 లక్షలకి నీ కన్నులు ఇస్తావా?

వ్యక్తి: జీవితాంతం కటిక చీకటిలో బ్రతకడంకంటే దుర్భరమైనది ఇంకొకటి లేదు.
కాబట్టి ఇవ్వను.

దేవుడు: 50 లక్షలిస్తాను నీ గుండెను ఇస్తావా?

వ్యక్తి: లేదు

దేవుడు: 1 కోటి రూపాయలు ఇస్తాను. నీ మెదడు ఇస్తావా?

వ్యక్తి: గుండె, మెదడు లేకుండా నేనెలా బ్రతుకుతాను? ఇన్ని రోజులూ ఇంత పేదరికంలోనైనా బ్రతుకుతున్నది ఇలా చావడానికేనా?

దేవుడు: చూసావా నాయనా. కొన్ని లక్షల విలువైన శరీరాన్నీ, కొట్ల విలువచేసే మెదడునూ నీకిచ్చాను. ఉన్న వాటిని వాడుకోకుండా అనవసరంగా సమయం వృధా చేసుకొని జీవితాన్ని దుర్భరం చేసుకొంటున్నావు.

ఈ రోజుల్లో మనుషులు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు.

కానీ నేను నీకు ఇంతటి ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చాను. దాని విలువ తెలుసుకొని బ్రతుకు అన్నాడు.



సర్వేజనా సుఖినోభవంతు!!!
శుభోదయం ../I\..


Monday, May 23, 2016

ఆకుపచ్చని ఈకలతో, ఎర్రనిముక్కుతో రామచిలుకలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.ఇవి సాధారణంగా ఒక గుంపుగా ఎగురుతూ,తిరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక రామచిలుకల గుంపు ఎగురుతూ వచ్చి వాలే దృశ్యాన్ని హాలుడి గాధాసప్తసతిలో ఎంత బాగా వర్ణించారో చదవండి..
" రామచిలుకల దండు ఆకాశంనుండి
క్రిందకు వచ్చి వాలుతుంటే,
వైకుంఠంలోని లక్ష్మీదేవి యొక్క
పచ్చలు కెంపులు పొదిగిన నగలేవో
నేలకు జారిపడినట్లనిపిస్తోంది. "
బాగుంది కదూ ఈ వర్ణన? ఇంతకి మించిన ఎన్నో గొప్ప వర్ణనలు ఉన్నాయి ఈ పుస్తకంలో...
సాహితీ ప్రియులు తప్పకుండా చదవాల్సిన పుస్తకము ఈ గాధాసప్తసతి.

Friday, May 20, 2016

సిరివెన్నెల సినిమాలో.. చందమామ రావే పాట.. చరణం... కొన్ని కారణాల వల్ల ఇది ఉపయోగించలేదు...

 జన్మదిన శుభాకాంక్షలు....
సిరివెన్నెల సినిమాలో.. చందమామ రావే పాట.. మీనా పాత్ర వెన్నెల్లో బృందావనం చూడాలన్న సందర్భంలో వచ్చేది...
వెన్నెలకి బృందావనానికి ఏంటి సంబంధం అని గురువు గారు రాసిన చరణం...
కొన్ని కారణాల వల్ల ఇది ఉపయోగించలేదు...
ఈ చరణం ఇప్పటికీ తనకి ప్రాణప్రదమైనదని 
సిరివెన్నెల  చెప్తారు...


పాటల ‘సిరి’ – పలుకుల ‘వెన్నెల’
('సిరివెన్నెల సీతారామ శాస్త్రి' గారికి జన్మదిన శుభాకాంక్షలతో....)
-------------------------------------------------------------------
సరిగమలకు సరసతనిడు కలమే- ‘సిరివెన్నెల’..!
చతురత గల చెణుకులనిడు గళమే – ‘సిరివెన్నెల..!’
చిత్రసీమ చేసుకొన్న పున్నెము – ‘సిరివెన్నెల’..!
తెలుగు నేల అందుకున్న పెన్నిధి – ‘సిరివెన్నెల’!

వెచ్చని ఊహల ఊసులు పలుకు వేణుగానమై,
పచ్చని పాటల గాలులు మోయు వాయులీనమై,
సంస్కృతి గుండెల సవ్వడినిడు మృదంగ నాదమై...
పదముల జడివాన కురియు – మేఘమె సిరివెన్నెల!

పలుకులమ్మనడిగి తెచ్చి ‘పాట’ – ఆదిభిక్షువై,
కులుకులన్ని పంచి శ్రోతలకు – అంత:చక్షువై,
ఒలికి మధుర భావములను రుచులు పంచు ఇక్షువై,
తెలుగు హృదయముల దోచిన – గేయమె సిరివెన్నెల!

యువత, నవత మెచ్చు నవ్య కవితకాలవాలమై,
నిదుర లేపి, నిగ్గదీయు ఆశయ కరవాలమై,
భవిత పైన ఆశ నింపు భానుకిరణజాలమై
సాహితీ సుగంధమొలుకు – సుమమే ‘సిరివెన్నెల’!

పల్లవించు పలుకుల పూదోట – తోటమాలియై
పల్లవి, చరణాల నడక నెరిగిన – నటశీలియై
జగమంత ప్రశంసలందు నిజ ప్రతిభాశాలియై,
యుగమంత వసించు ‘వెలుగు చంద్రిక’ – సిరివెన్నెల!

--:O:--
నూజిళ్ళ శ్రీనివాస్, ఇంగ్లీష్ లెక్చరర్, ప్రభుత్వ కళాశాల, రాజమండ్రి
సెల్: 94408 36041

Thursday, May 19, 2016

ఒక చక్కటి కథ ...
సముద్రంలో  పెద్ద తుఫాన్ !
ఓడ  బద్దలయిపోయింది ...
ఇద్దరే ఇద్దరు బ్రతికి ఒడ్డుకు చేరారు ...
అదొక దీవి ఎడారిలా ఉంది.  ఏమి చెయ్యాలో తోచ లేదు వారి ఇద్దరికీ.  భగవంతుడిని  ప్రార్ధన చెయ్యడం తప్ప ఏమీ చెయ్యడానికి లేదు అనుకున్నారు ఇద్దరూ.
అయితే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు.  ఎవరి ప్రార్ధనలు ఫలిస్తాయో తెలుసుకోవాలంటే ఆ దీవిని రెండు భాగాలు చేసి ఒకరు ఒక వైపు రెండో వారు రెండో వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు.
మొదటివాడు రాము. రెండో వాడు సోము.
ఆ రోజు రాము భగవంతుడా నాకు ఆహారాన్ని  ఇయ్యి అని వేడుకున్నాడు.  మర్నాడు ఉదయం అతడు చూస్తే అతడికి ఒక అరటిచెట్టు  ముగ్గిన పళ్ళతో కనిపించింది.  పాపం సోముకి ఏమీ కనిపించలేదు ...
ఇలా ఒక వారం  గడిచింది.
రాముకి ఒంటరితనం చికాకు అనిపించి నాకు ఒక భార్యను ఇవ్వు అని దేముడిని ప్రార్ధించాడు.  మర్నాడు ఒక ఓడ తమ ఓడలాగే బద్దలయ్యి ఒకే ఒక్క అమ్మాయి  ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చింది.  ఇద్దరూ హాయిగా కాపురం చేసుకుంటూ ఉన్నారు.  
పాపం సోము పరిస్థితి అలాగే ఉంది.
రామూ ఒక ఇల్లు, బట్టలు ,ఇంకా ఆహారం ఇమ్మని దేముడిని ప్రార్దిస్తూనే ఉన్నాడు.  దేముడు అడిగిన వన్నీ రామూకు సమకూరుస్తూనే ఉన్నాడు.
పాపం సోముకు ఏమీ లేదు ...
ఆఖరుగా రాము దేముడా నేనూ నా భార్య మా ఊరు వెళ్ళడానికి ఒక ఓడ పంపించవా అని ప్రార్ధించాడు.  ఆశ్చర్యం ఓడ మర్నాడు వచ్చింది.  సోమూ ప్రార్ధన ఒక్కటీ దేముడు వినలేదు కనుక సోమూని తీసుకు వెళ్ళడం అనవసరం అనుకున్నాడు రాము.  అవును వాళ్ళిద్దరూ బయలుదేరారు.  సామాను సర్దుకుని ఓడ ఎక్కుతున్నారు ...
ఆకాశం లోనుండి దేముడు అడిగాడు ...
సోమూని తీసుకు వెళ్ళవా? అతడిని అలాగే వదిలేస్తున్నావేమి?
రాము " నాకు నువ్వు ఇచ్చిన ఆశీస్సులు నావే కదా ! అతడి ప్రార్ధనలు నువ్వు వినలేదు కనుక అతడిని నేను తీసుకు వెళ్ళడం లేదు " అన్నాడు
" అక్కడే నువ్వు తప్పు చేశావు . అతడు ఒకే ఒక్క ప్రార్ధన చేశాడు . అతడి ప్రార్ధన వినే నేను నీకు ఇవన్నీ ఇచ్చాను.
అతడు " నా స్నేహితుని ప్రార్ధనలు ఫలించాలి అలా చెయ్యి దేముడా ! " అని ప్రార్ధించాడు ... అందుకే నీకు ఇవన్నీ సమకూరాయి " అన్నాడు దేముడు.  రాము పశ్చాత్తాపం చెంది, సోముకి కృతజ్ఞతలు చెప్పి, సుఖంగా ఇళ్లకు చేరుకున్నారు.
మనకు లభించేవి అన్నీ మన ప్రార్ధనల వలన మాత్రమె మనకు లభించడం లేదు ... మన స్నేహితుల, సన్నిహితుల,  సహృదయుల ప్రార్ధనల, దీవెనల వలన మనం దేముని దయను పొందుతున్నాం ...
మన ఆత్మీయుల కోసం కూడా మనం ప్రార్ధిద్దాం!!
బెల్లం తింటే మనకి కలిగే లాబాలు అని ఇన్ని కాదు బెల్లం మనకి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది.పాత రోజులలో  బెల్లంను  చక్కర బదులుగా వాడేవాళ్ళు.బెల్లం ని కూరలలోను పాలలోను వాడే వాళ్ళు. ఇంకా మనకి ఎన్నో మనకి తెలియని బెల్లం మనకి చేసే మేలును తెలుసుకుందామా.....

ప్రతి రోజు మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం చేసిన తరువాత బెల్లం కొంచెం తినడం వలన జీర్ణ శక్తి బాగా పెరుగుతుంది.
బెల్లం తినడం వలన శ్వాశ నాళాలు శుద్ధి పడ్డమే కాక ఉపిరితిత్తులు కూడా క్లీన్ అయ్యి రక్తం శుద్ధి పడుతుంది .
వేసవి కాలంలో బెల్లంను  నీటిలో కలుపుకొని తాగడం వలన శరీరం లో వేడి తగ్గుతుంది.
సహజ సిద్దమయిన బెల్లం తినడం వలన శరీర శక్తి కూడా పెరుగుతుంది.
రక్త హీనత విషయం లో బెల్లం బాగా పనికొస్తుంది.
బెల్లం ని ముఖ్యం గా గర్బవతులు మరియు అమ్మాయిలు తినడం వలన రక్త హీనత నుండి భయతపడవచ్చు. 
బెల్లం మన చర్మాని కూడా చాలా  కాంతివంతం గా చేస్తుంది
మనకి జలుబు దగ్గుగా ఉన్నపుడు బెల్లం బాగా పనిచేస్తుంది .
బెల్లం అప్పటికి అప్పుడే మనకి ఎనర్జీ ని అందచేస్తుంది
జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పడేవారికి బెల్ల్లం బాగా ఉపయోగపడుతుంది.
మహిళలు పీరియడ్ టైమ్స్ లో బెల్లం బాగా ఉపయోగ పడుతుంది
బెల్లం మనకి సహజ సిద్దం గా దొరికే వస్తువు కాని ఈ మధ్య కాలంలో బెల్లం వాడకం పూర్తి గా తగ్గిపోయింది.బెల్లంను  ఎవ్వరు సరిగా వాడకపోవడం వలెనే మనం రోజు జీవితం లో చాల ప్రొబ్లెమ్స్ ని ఫేస్ చేస్తున్నాం. ఇప్పటి నుండి అయినా  బెల్లం విలువ తెలుసుకొని మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్న బెల్లం వాడకం  మొదలుపెడదాం ఏమంటారు?


Tuesday, May 17, 2016

అంతఃశ్శుద్ధి

అనగనగా ఒక ఊరిలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఒక గురుకులం విద్యార్థులతో నిండి వుంది. అక్కడ విద్యార్థులు గురుబోధనలు వింటూ, విన్న బోధనలను తమ ఆచరణలోకి తెచ్చుకుంటూ, తమ విద్యాభ్యాసాన్నికొనసాగిస్తూ వుంటారు. ఆ గురుకులంలో విద్యార్థులంతా రోజు వారీ వంతుల ప్రకారం గురువుగారి పనులు, ఆశ్రమ పనులు, భిక్ష, గోవులను కాయుట, వాటికి గ్రాసము సమకూర్చుట వంటి పనులను పంచుకుంటూ.... గురు శుశ్రూష చేస్తూ గురువుగారి వద్ద విద్యను అభ్యసిస్తూ వుంటారు.

ఆ గురుకులానికి ఒక రోజు నిర్మలుడు అనే పేరుగల బాలుడు వచ్చాడు. చూడడానికి బాలుని వలె వున్నా ఆ బాలుడిలో దివ్య తేజస్సు తాండవిస్తుంది. ఆ విద్యార్థిని చూసిన గురువుగారు, వీనికి మిగితా విద్యార్థుల మాదిరి బోధన చేయక, అనుష్ఠాన పద్దతిలో బోధించాలనే భావన కలిగింది. ఆనాటి నుంచి ఆ బాలునికి రకరకాలైన చిన్న చిన్న పనులను అప్పజెప్తూ, ఆ పనిద్వారా అతను ఏమి గ్రహించాడో పని పూర్తి అయ్యాక తిరిగి వచ్చి గురువుగారికి చెప్పవలెననెడి నియమము పెట్టారు. ఆ నిర్మలుడు గురువుగారు చెప్పిన నియమాన్ని ఎక్కడా ఉల్లంఘించకుండా, చేస్తున్న పనిని మరింత శ్రద్ధతో చేస్తూ, ఈ పని నాకేమి బోధిస్తున్నది? దీనిలో నేను గ్రహించవలసినది ఏమిటి? అనే విచారణ చేయుచు, తన రోజు వారి పనులను చేస్తూ, వేదాభ్యాసం చేసేవాడు.


కొంతకాలం గడిచాక, ఒక రోజు వంటపాత్రలను శ్రద్ధగా కడుగుతున్న నిర్మలుని చూచిన గురువుగారు, ఆతని వద్దకు వచ్చి నాయనా! ఆశ్రమ వాతావరణం ఎలా వున్నది? నీ విద్యాభ్యాసం నీకు సంతృప్తిని ఇస్తున్నదా? అని అడిగారు. తన పాటికి తాను శ్రద్ధగా పనిలో నిమగ్నమై అంట్లు తోముతున్న నిర్మలుడు గురువుగారిని చూసి, లేచి నమస్కరించి, అయ్యా! మీ సాంగత్యము వలన నాకు మహదానందముగా వున్నది. మీరు చెప్పిన విధంగా, ఏ పనైనా చేసేముందు... ఈ పని ద్వారా నేను తెలుసుకోవలసిన తత్వమేమి? అనే ప్రశ్నతో పనిని ప్రారంభిస్తున్నాను, పని పూర్తయ్యే సరికి, పనితో పాటు, నా యందలి విచారణ కూడా పూర్తి అయ్యి, ఆ పని నాకొక జ్ఞానవాక్యాన్ని అందిస్తున్నదని వినయంగా చెబుతాడు.

అప్పుడు గురువుగారు, నిర్మలుడుతో... "మంచిది నాయనా! సరే, ఇంతకు ఈ పాత్రలను శుభ్రం చేస్తున్నావు కదా, ఈ పని ద్వారా నీకు ఏమి గ్రహించావో వివరించు" అంటారు.

అంతట ఆ నిర్మలుడు, గురువర్యా! "పాత్రలు బయిట శుభ్రంగా వుండడం కంటే, లోపల శుభ్రంగా వుండడం ఎంతో ముఖ్యం" అని గ్రహించాను తండ్రీ! అని బదులిస్తాడు.

నిర్మలుని సమాధానంతో సంతుష్ఠులైన గురువుగారు, ఆనాటి నుంచీ అతనికి సకల వేదవేదాంగాలను బోధించసాగారు.

వంట పాత్రలు లోపల శుద్ధం లేకపోతే... ఆ గిన్నెలలో పాలు వంటివి కాచినప్పుడు అవి విరగిపోతాయి, పాకం (కూర) చెడుతుంది. అలానే మానవుడు తన అంతరంగాన్ని శుద్ధపరుచుకోకుండా ఎంత జ్ఞానబోధలు విన్నప్పటికీ అవి సరైన ఫలితాన్ని ఇవ్వలేవు.

అంచేత బాహ్యంగా శుచిత్వం కలిగివుండడంతో పాటు, అంతరంగంలో కూడా శుచిత్వాన్ని కలిగివుండడమనేది జ్ఞానార్థికి ఆవశ్యకమై వున్నది.
కూర్మ జయంతి సందర్భంగా

శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానంశ్రీకాకుళంనుండి 15 కి.మీ. దూరానగల శ్రీకూర్మంగ్రామంలో ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారంరూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటుశ్రీరామానుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు.


*స్థలపురాణము*

*శ్రీకూర్మం లోని ఆలయ ముఖద్వారము*

శ్రీకాకుళం , గార మండలం లో ఉన్న ఆలయం 2 వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలా మంది నమ్ముతారు. నిజానికి ఆలయము నిర్మించిన వారు ఇప్పటికీ తెలియదు. అయితే, ఈ ఆలయం చోళ మరియు కళింగ రాజా రాజవంశం సమయంలో అభివృద్ధి చేశారు.7 వ శతాబ్దం నుండి ఈ ఆలయం ప్రాముఖ్యత తెలుసునని ఉంది.తరువాత ఈ ప్రాంతాన్నిపాలించిన వివిధ రాజవంశాలు వివిధ దశలలో అభివృద్ధి చేశారు. ఎక్కువగా కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశం పాలనలో చేశారు. దేవాలయ మొత్తం నిర్మాణంలో గాంధర్వ శిల్ప సంపాద అని పిలవబడే స్తంభాలు ఈ రాజవంశాల పేరు మరియు కీర్తిని చాటి చెప్తాయి. గంగరాజ రాజవంశం యొక్క వారసుడు అనంగభీముడు ఆలయం చుట్టూ నేల మరియు పైభాగాన్ని నిర్మించారు.

దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను. అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండబెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామీ! అటు నా భర్తను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధముల వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేసెను. ఆ గంగ మహా ఉదృతంగా రాజు వేపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతము మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా, ఆతను రాజుకు విషయమంతా వివరించెను.

అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపమునకు ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడుఅటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను. ఈ గంగా ప్రవాహమువంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను. రాజు వంశధారలో స్నానమాచరించి, అక్కడే వెలసి ఉన్న జ్ఞానేశ్వరుని మరియు సోమేశ్వరుని పూజించి, ఘోర తపస్సు చేసినా, మహానిష్ణువు కరుణించలేదు. అప్పుడు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజుకు దర్శనమివ్వవలసిందిగా కోరగా శ్రీమహావిష్ణువు, కూర్మావతారంలో చక్రతీర్థగుండము నుండి వెలువడి, శ్వేతమహారాజుకు దర్శనమిచ్చెను. స్వామి నాలుగు చేతులతో, శంఖము, చక్రము, గద మరియు పద్మములు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడి అక్కడ కొలువై ఉండుమని ప్రార్ధింపగా శ్రీమహావిష్ణువు కొలువై ఉండేందుకు తనకు తగిన మంచి స్థానమునకై రాజు మరియు నారదునితో కలసి ఒక వటవృక్షము వద్దకు వచ్చి, ఆవృక్షముపై చక్ర ప్రయోగము చేసెను. అక్కడ క్షీర సమానమైన జలము ఉద్భవించెను. ఈ గుండమునే కూర్మగుండము లేక శ్వేత గుండము అంటారు. చక్రము వెళ్ళిన మార్గము నుండిశ్రీమహాలక్ష్మి ప్రత్యక్షమై, స్వామివారి వామభాగము నందు వసించెను. అంత శ్రీకూర్మనాధుడు లక్ష్మీ సమేతుడై అక్కడనే నిత్యనివాసమేర్పరుచుకొనెను.

ఒకనాడు అటుగా వచ్చిన ఒక కిరాత స్త్రీ కూర్మగుండములో దాహముతీర్చుకొని, శ్రీకూర్మనాథుని దర్శించుకొని, తన భర్త అయిన భిల్లురాజుకు ఈ విషయము తెలుపగా, ఆతను వచ్చి చూడగా ఆ గుండముపైన చక్రాకారములో తేజము కనుపించెను. ఆ వెలుగు క్రమముగా కూర్మనాథుని ఆకృతిని దాల్చెను. భిల్లురాజు ఆశ్చర్యముగా ఆ స్వామిని చూస్తూ,మహాపురుషుడా లేక ఏదైనా విచిత్ర జలచరమా అని ఆలోచిస్తుండగా, అక్కడకు వచ్చిన శ్వేతమహారాజు, నీ పూర్వపుణ్యమున శ్రీమన్నారాయణుడు, కూర్మరూపములో నీకు సులభముగానే దర్శనమిచ్చాడు అని చెప్పెను. అంత భిల్లురాజు సంతోషముతో స్వామిని పూజించెను. స్వామి సంతోషించి, భిల్లురాజును కూర్మగుండమునకు కట్టడము, సోపానములు కట్టించవలసిందిగానూ , శ్వేతమహారాజును దేవాలయ నిర్మాణము గావించవలసిందిగానూ ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. భిల్లురాజును, స్వామి, పశ్చిమదిక్కుగా సదంగ మహాముని ఆశ్రమ సమీపములో నివాసమేర్పరుచుకోమని ఆజ్ఞాపించెను. అంతట భిల్లురాజు, తనవైపు ఎల్లప్పుడూ కరుణాదృష్టితో చూస్తూ ఉండమని స్వామిని వేడుకొనెను. శ్రీకూర్మనాథుడు అట్లే ఆభిల్లురాజుకు వరమిచ్చెను. అప్పటినుండి స్వామి పశ్చిమాభిముఖుడుగా తిరిగెను.

ఒకనాడు నారదుడు కూర్మనాథుని సేవించుటకు రాగా, శ్వేతమహారాజు, స్వామిని అర్చారూపమున ఆరధించుటకు ఏ మంత్రముతో ప్రతిష్ఠించవలెనని అడిగెను. అంతట నారదుడు, బ్రహ్మదేవుని కోరగా బ్రహ్మదేవుడే శ్రీకూర్మనాథుని, సుదర్శన మంత్రముతో ప్రతిష్ఠించెను. అప్పుడు స్వామి అగ్నిజ్వాలలచే భయంకరముగా ప్రకాశిస్తున్న శ్రీకూర్మనాథుని చూసి దేవతలందరూ భయకంపితులైరి. అప్పుడు శ్వేతమహారాజు ,స్వామిని, గోపాలమంత్రంతో ప్రతిష్ఠించవలసిందిగాబ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు అట్లే శ్రీకూర్మనాథుని గోపాలమంత్రంతో పునహ ప్రతిష్ఠచేసెను. అప్పుడు స్వామి శాంతరూపములో దర్శనమిచ్చి, తనకు నారాయణ మంత్రముతో అభిషేకము, సంకర్షణ మంత్రముతో వస్త్ర సమర్పణ, వాసుదేవ మంత్రముతో ఏక హారతి, అనంత మంత్రముతో ధూపము, పద్మనాభ మంత్రముతో పంచహారతి సమర్పించవలెనని బ్రహ్మకు చెప్పగా, బ్రహ్మ స్వామిని అట్లే ఆరాధించెను. శ్రీకూర్మనాథుడే ప్రాకారాది దేవతా స్థాపనకు ఆజ్ఞనిస్తూ, తూర్పున పార్వతీ సమేతంగా శివుని, ఆగ్నేయమున నరశింహుని, దక్షణమున గోపాలమూర్తిని, నైరుతి దిక్కున వైకుంఠనాథుని, వాయువ్యమున వైష్ణవీ దుర్గను, ఆమెకు ముందు భాగమున విశ్వక్షేసులను, తరువాత అనంతుని స్థాపించమనగా, బ్రహ్మ అట్లే చేసెను.

తిలోత్తమ స్వర్గము నుండి శ్రీకూర్మనాథుని పూజించుటకు వచ్చి అక్కడనే ఉండిపోయింది. బ్రహ్మ, స్వామికి నివేదించిన ప్రసాదము ఆమెకు లభించకపోవుటచే దుఖితురాలై, వక్రాంగ మహామునిని ఆశ్రయించగా, ఆయన, తిలోత్తమకు నారశింహమంత్రమును ఉపదేశించెను. ఆమె ఆమంత్రముతో తపమాచరించగా, ఆమె కాలిబొటనవ్రేలు దగ్గర ఒక గుండమేర్పడింది. అందుండి, శ్రీకూర్మనాథుడు, నరశింహరూపమున ఉద్భవించి, ఆమెకు దర్శనమిచ్చెను. తిలోత్తమ ఆనందంతో స్వామిని అక్కడ అట్లే వెలయవలసిందిగా కోరగా స్వామి అక్కడ అలాగే వెలసెను. ఆకుండము, నరసింహతీర్థమని, అక్కడ వెలసిన స్వామి, పాతాళ నరసింహుడని అందురని స్వామి చెప్పెను. అంత తిలోత్తమ తనకు ప్రసాదము లభించలేదని వివరించగా స్వామి ఆమె భక్తికు మెచ్చి, తన ప్రసాదముపై శాశ్వత ఆధిపత్యమును ఆమెకు ప్రసాదించెను. అప్పటినుండి స్వామివారి ప్రసాదమును తిలోత్తమే అందరికీ పంచేదట.

పద్మపురాణము నందలి శ్వేతగిరి మహత్యమను ముపయ్యేవ అధ్యాయము లో చెప్పబడిన విశేషముల ప్రకారము

శ్రీకూర్మక్షేత్రమునకు వంశధారానదీ తీరములో శ్రీకూర్మశైలమను పర్వతము ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాడ్రూపమని నమ్మకము. క్షేత్రమునకు దక్షిణమున ప్రేతశిల అను పర్వతముంది. ఇక్కడ కౌటిల్యతీర్థముంది. ఈ తీర్థములో స్నానమాచరించి, ప్రేతశిల యందున్న విష్ణుపాదాలపై పిండప్రదానము చేసి కౌటిల్య తీర్థములో పితృతర్పణము చేసిన గయలో శ్రాద్ధము వలన కలుగు ఫలమే లభంచును.ఇక్కడ ఉన్న అష్టతీర్థములందు స్నానముచేసి, శ్రీకూర్మనాథుని కొలుచుట ఒక ఆచారముగా వస్తున్నది. ఇక్క డ ఉన్న చక్రతీర్థము, నారదతీర్థము, కౌటిల్యతీర్థము, మాధవతీర్థము, నరసింహతీర్థము, కూర్మతీర్థము, వంశధార నది, లాంగలీనది మరియు సముద్రము లో మూడురోజులుగానీ, ఎనిమిదిరోజులు గానీ ఈ క్షేత్రములో ఉండి, స్నానములాచరిస్తూ, స్వామిని కొలుచుట ఒక ఆచారము.

ఈ శ్రీకూర్మక్షేత్రము పంచలింగారాధ్యక్షేత్రము (ఐదుగురు శివులు క్షేత్రపాలకులుగా ఉన్న క్షేత్రము)తూర్పున వంశధారాసాగర సంగమ ప్రదేశములో కళింగ పట్టణములో కర్పూరేశ్వరుడు, ఉత్తరమునసింధూర పర్వతమున (సింగుపురపుకొండ) హటకేశ్వరుడు, పశ్చిమమున నాగావళీ తీరమున శ్రీకాకుళ పట్టణములో కోటీశ్వరుడు, ఉత్తరమున (పిప్పల) ఇప్పిలి గ్రామమున సుందరేశ్వరుడు, శ్రీకూర్మక్షేత్రమున సుధాకుండతీరమున సిద్ధేశ్వరుడు వేంచేసి ఉన్నారు. శ్రీకూర్మక్షేత్ర ముఖద్వారమున భైరవుడు, మరియు ఆలయ ప్రాకారమునఅష్టదిక్పాలురును క్షేత్రపాలకులై స్వామిని సేవిస్తున్నారు.

*ఆలయ విశిష్టత*

ఈ ఆలయం యొక్క పెద్ద ప్రాకారా నికి వెలుపల ‘శ్వేత పుష్కరిణి’ ఉంది. క్రీస్తు శకం నాలుగో శతాబ్ది నాటికే ఈ ఆలయం ఇక్కడ ఉందని చారిత్రిక ఆధారాలు స్పష్టం చేస్తు న్నాయి. ఈ ఆలయంలోని ప్రతీ శిల్పం ఒక అపూరూప కళాఖండంగా చెప్పవచ్చు. ఎంతో మంది రాజులు వేసిన శిలాశాసనాలు శిథిలమై పోకుండా ఇప్పటికీ లభిస్తాయి. ఇవి కళింగాంధ్ర చరిత్రకు అమూల్యా ధారాలుగా నిలుస్తాయి. అత్యద్భుతమైన వాస్తు కళతో ఆలయం అలరా రుతూ ఉంటుంది. ఈ ఆలయ మండపంలోని 108 రాతి స్తంభాలు అన్నీ ఏకశిలతో రూపు దిద్దుకున్నవే. ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటిని శిల్పులు అత్యంత రమ ణీయంగా మలిచారు.

ప్రతీ ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలవిరాట్‌ ఉంటే ఈ ఆలయంలో మాత్రం గర్భ గుడిలో ఎడమవైపు గోడ మూలగా శ్రీకూర్మనాధుని ఆవతారంలో శ్రీమహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరి స్తారు. భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు, ఐదడు గుల పొడవు, నాలుగడుగులు వెడల్పు కొలతలు గల రాతిపీఠం పై కూర్మనాథస్వామి దర్శనమిస్తారు. రెండున్నర అడుగుల పొడవు, అడుగు ఎత్తులో మొదట తల మధ్యలో శరీరం చివరిగా పశ్చిమా భిముఖంగా తోకతో మూడు భాగాలుగా శ్రీకూర్మం కన్పిస్తుంది. మధ్య తక్కు వ ఎత్తులో శిరస్సుకలిపి ఒకటిగా కన్పిస్తా యి. చివర తాటిపండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది. విగ్రహమంతా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరి స్తారు. గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైనా ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామిని దర్శించుకోవచ్చు.


*బలరాముని శాపం*

ఆలయంలో శ్రీకూర్మనాథుని విగ్రహం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తూ ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమారుద్రకోటేశ్వర లింగ ప్రతిష్ట చేసిన బలరాముడు శ్రీకూర్మం వచ్చాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతనిని అడ్డగిం చాడు. దాంతో అతడు భైరవుని పై ఆగ్రహంతో ఆతనిని గిరగిరా తిప్పి విసిరేశాడు. ఇది తెలిసిన కూర్మనాధ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. ఆయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో ఆగ్రహాగ్ని చల్లారని బలరాముడు ‘కూర్మావతారం’లో ఆలయం భూమి పై మరెక్కడా ఉండకూడదని శపించాడు. అందువల్లే ప్రపంచంలోనే ఇది ఏకైక కూర్మనాధస్వామి ఆలయంగా విరాజిల్లుతోంది. ఈఆలయా నికి రెండు ధ్వజ స్తంభాలు ఉండడం మరో ప్రత్యేకత. శ్రీకూర్మంలోని పుష్కరిణి అడుగుభాగం నీరుతో కలిసిన మట్టి తెల్లగా తళతళలాడుతూ ఉండడం విశేషం. ఒక మహర్షికి శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణీలో జలక్రీడలాడుతూ కన్పించాడట. అందు వల్లే ఆ పుష్క రిణిలోని మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనిని ‘గోపీ చందనం’ అని కూడా అంటారు.

*పుణ్యక్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణలు*

కూర్మ, విష్ణు, పద్మ, బ్రహ్మాండ పురాణాల లో మూలాలు.మహావిష్ణువు కూర్మావతారము రూపంలో పూజ్యమైన ప్రపంచంలో ఏకైక స్వయంభు ఆలయం (తాబేలు) అవతారం.విష్ణు ప్రముఖ దశావతారాలలో 2 వ అవతారం.విగ్రహం పశ్చిమ ముఖంగా ఉంది, రెండు ద్వజస్థంబాల తో ప్రపంచంలో ఉన్న కొన్ని దేవాలయాలులో ఒకటి.రోజువారీ అభిషేకం నిర్వహించే ప్రపంచంలో కొన్ని విష్ణు దేవాలయాలులో ఒకటి.అజంతా ఎల్లోరా గుహలు మాదిరిగా శతాబ్దాల అరుదైన కుడ్య చిత్రాలు తో ఉన్న దేవాలయాలులో ఒకటి.దుర్గా మాత వైష్ణోదేవి రూపం లో ఉన్న ప్రపంచ రెండవ ఆలయం., ఇతర వైష్ణోదేవి ఆలయం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లో ఉంది.దీని శిఖరం రాతి శిల్పం - గాంధార శిల్పకళా అని అంటారు., ఇతర స్థంభాలతో పోలిక లేకుండా కొన్ని స్థంభాలు క్రింద వృథాగా లేకుండా పైకప్పు నిర్మాణానికి వేలాడుతూ అద్భుతంగా చెక్కిన 108 రాతి స్థంభాలు ఉన్నాయి.వారణాసి (కాశి) వెల్లడానికి సొర్ంగ మార్గం ఉంది ,ప్రస్థుతం దీన్ని మూసివేసారు.వారణాసి / పూరీ (ఒడిషా) ల వలె , మరణించినవారి అంతిమ కర్మలు ,మోక్ష స్థానం ఇక్కడ నిర్వహిస్తారు .ఆది శంకరాచార్య, రామానుజాచార్య, నరహరి తీర్థ, చైతన్య మహా ప్రభు అనేక గొప్ప రాజులు మరియు సెయింట్స్ ఋషులు దేవాలయాన్ని సందర్శించారు

ప్రయాణ సదుపాయం

శ్రీకాకుళం పట్టణం పాత బస్ స్టాండు నుండి ప్రతి 15 నిమిషాలకు అరసవిల్లి మీదుగా ఆర్టిసి వారి బస్సులు కలవు.ఉదయం 6.00గంటలనుండి,రాత్రి 8.00గంటల వరకు నడుస్తాయి.అంతేకాక ఆటోలు,టాక్సిలు వున్నాయి.వసతి మాత్రం శ్రీకాకుళం పట్టణం లోనే..

 💐💐💐💐💐💐💐💐💐
అతడు  ఎడారిలో  దారి  తప్పిపోయాడు  .  కూడా  తెచ్చుకున్న  నీళ్ళు   రెండు  రోజులపాటు  కాపాడాయి  .  నడుస్తున్నాడు
.
.
 నీరు   ఎక్కడా   కనబడటం  లేదు  .   ఎండమావులు  తప్ప  ఎక్కడా  నీటి  జాడ  కనబడటం  లేదు  .  తన  జీవితపు  ఆఖరు  దశకు  చేరాను  అని   అతడికి  తెలిసిపోతోంది  . ఈ   రాత్రి  గడవదు   . రేపు  ఉదయం  చూడను   అని  అనుకుంటున్నా  దశలో   ప్రయత్నం  చెయ్యడమా  ?  అలాగే  నిరాశతో  కూలబడి పోవడమా   ఎటూనిశ్చయించుకోలేకపోతున్నాడు .
.
దూరంగా   ఒక  గుడిసె   లాంటిది   కనబడింది  .  అది   నిజమా  ?  తన  భ్రమా   ?  
.

ఏమో  !  నిజమేమో  !  అక్కడ  తనకు   నీరు  దొరకవచ్చేమో  ! చనిపోయేముందు   ఆఖరు  ప్రయత్నం చెయ్యాలి  అని  అనుకున్నాడు
శక్తిని  కూడదీసుకున్నాడు .  తడబదిపోతున్న  అడుగులతో   ముందుకు  నడుస్తున్నాడు  .  ఎదురుగ అతడు  అనుకున్నట్టుగానే  ఒక  గుడిసె   కనబడుతోంది  .   దానిని  సమీపించాడు    .  అక్కడ  ఎవరూ  లేరు  .  బహుశా  దానిని  వదిలిపెట్టి  ఉంటారు  .   లోపలికి  వెళ్ళాడు
.
.
.  అక్కడ  ఒక   నీటి  పంపు  కనబడింది   .  దానిని  చూడగానే   ప్రాణం  లేచి వచ్చినట్టు  అయ్యింది  .   దాని  దగ్గరకి  వెళ్లి  దానిని   కొట్టాడు   .  నీరు   రావడం  లేదు   .  శక్తి  అంతా  ఉపయోగించి   దానిని   కొట్టాడు    .  ప్రయోజనం  లేదు   .  నిరాశ నిస్పృహ  ఆవరించాయి   .  ఒంట్లో    ఉన్న  కొద్ది  నీరూ   అయిపొయింది  .  కళ్ళు  మూసుకుపోతున్నాయి
.
.
 .  ఒక  మూలగా  ఒక  సీసా  కనబడింది  .  దానిలో  నీరు   ఉంది  . మూత  గట్టిగా  బిగించి  ఉంది .  మూత  విప్పి   దాన్ని  ఎత్తిపెట్టి  తాగుదామని  పైకి  ఎత్తాడు  .  దానికి  ఒక  కాగితం  కట్టబడి  ఉంది   .  దానిమీద  ఇలా  రాసి  ఉంది  .
.
.
.
“ ఈ   బోటిల్   లో  నీరు   పంపులో పొయ్యండి   .  పంపు  కొట్టండి  నీరు  వస్తుంది  .  మీరు   మళ్ళీ   ఈ  బాటిల్  నింపి  పెట్టండి  “
.
.

.
అతడికి  సందేహం  కలిగింది  .  ఈ   నీరు  తాగెయ్యడమా  ? పంపులో  పోయ్యడమా   ?  ఎంత కొట్టినా  రాని  నీరు  ఈ   బాటిల్  లో   నీరు   పోస్తే   వస్తుందా  ?  ఉన్న  ఈ   నీరు  కాస్తా  పోసేస్తే  తర్వాత   రాకపోతే  తన  గతి  ఏమి  కాను  ?   చేతిలో  ఉన్న  నీరు   తాగితే   కనీసం  ఇంకో రెండు  రోజులు  బ్రతక  వచ్చు  .  అందులో  పోసేస్తే  తన  మరణం ఖాయం  .  ఏమి  చెయ్యాలి   ? ఎంతకూ  ఆలోచనలు  తెగడం  లేదు  .
.

.
ఒక  నిశ్చయానికి   వచ్చాడు   .  అ  నీళ్ళను   పంపులో  పోశాడు  .  పంపు  కొట్టడం  మొదలు  పెట్టాడు  .   ఆశ్చర్యం  .   పాతాల  గంగ  పైకి   తన్నుకు   వచ్చింది   .   భగవంతుడికి  కృతజ్ఞతలు  చెప్పుకున్నాడు .  మళ్ళీ  బోటిల్  నింపాడు   .  మూలన   పెట్టాడు  .  తన  కూడా  తెచ్చుకున్న   నీటి  బాటిల్   నింపుకున్నాడు  . ఆ  గుడిసె  లో  ఎడారి   మెప్   కనబడింది  .  తను  ఎటు  వెళ్ళాలో   చూసుకున్నాడు   .   బయలుదేరాడు  .
.
.
.
.

మిత్రులారా  !
.
ఈ  కద    మన  జీవితాలను  ప్రతిబింబిస్తోంది  కదూ  !
.
.
ఏదైనా   పొందాలి  అంటే   ఇవ్వడం  నేర్చుకోవాలి  .
.
అలా  ఇవ్వడం  వలన   మనం   పొందగలం  అనే  నమ్మకాన్ని కలిగి  ఉండాలి
.
ఫలితం మీద   ఆశ  పెట్టుకోకుండా   ప్రయత్నించాలి
.
ఈ  కధలో   నీరు  మంచి   విషయాలు .

 (  మీకు  ఆనందం  కలిగించేవి   ) అది  కుటుంబం  , వ్యాపారం  ,  ఆర్ధికం ,  మానసికం  ఏదైనా  కావచ్చు
.
.
కృషి  చెయ్యకుండా   ఫలితం  ఆశించకూడదు  .
.
   నువ్వు  ఇవ్వకుండా  దేనినీ   పొందలేవు..
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

Friday, May 13, 2016

దీపారాధన ఎలా..? ఎన్ని వత్తులు.. ఏ నూనె మంచిది..?
.......................................................
దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, కాంతి వుంది. ఇంతటి విశిష్ట దీపాన్ని నేరుగా అగ్నిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.
* ఐదు వత్తులు :
దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధికి అని చెప్తారు. దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా వుండాలి.
ఏ నూనె మంచిది : ఓ పక్క ఆవునేతితో, మరో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం. ఆవునెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవునెయ్యిలో నువ్వులనూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.
వేప నూనె రెండు చుక్కలు ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది.
నూవ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇవ్వగలదు. నువ్వుల నూనె విష్ణ్వాంశమూర్త
ులకు అత్యంత ప్రీతికరం. వేరుశెనగ నూనెను దీపారాధనకు అస్సలు వాడరాదు.
* దీపం సకల దేవతాస్వరూపం
దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇళ్ళు కళావిహీనమై, అలక్ష్మీస్థానం అవుతాయని చెప్పారు. దీపారాధన లేకుండా దేవతారాధన చేయరు. దీపం సకల దేవతా స్వరూపం.
దీపం వెలిగించే కుంది కింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు, కుందిలో వేసే వత్తి వెలుగు సరస్వతి, విస్ఫలింగం లక్ష్మీ దేవి. దీపారాధనలో వెండి కుందులు విశిష్టమైనవి. పంచలోహ కుందులు, మట్టికుందులది తర్వాతి స్థానం. దీపారాధన స్టీలు కుందిలో చేయకూడదు. కుంది కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి.
దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా ఉండాలి. దీపారాధనకు ఉద్ధేశించిన దీపాల నుంచి నేరుగా అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతులు వెలిగించకూడదని పండితులు అంటున్నారు.
ఈ మెసేజ్ Save చేసుకోండి.. దీనిలోని ప్రతి లైన్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది.!
🍥దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్‌ చెయ్యాలన్నారు.అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.
🚿సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.
🌐ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.
🔑తాళం తో పాటే తాళం చెవి
కూడా తయారు చేయబడుతుంది.
ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు.
అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు
🍥తూట కంటే శక్తివంతమైనది మాట!
ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు,
ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు
🍥మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి,
కత్తెర లాగ కాదు.
సూది పని ఎప్పుడూ జోడించడమే,
కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,
అందరిని కలుపుకుంటూ బ్రతకాలి.
కత్తెర లాగా విడదీస్తూ కాదు..
👍🏼నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు,
కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.
💪🏼నీవు సంతోషంగా ఉన్నావంటే
నీకు సమష్యల్లేవని కాదు,
వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం
నీకున్నాయని…
🎀స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను,
యోధుడిని యుద్ధంలోను,
భార్యను పేదరికంలోను,
గొప్పవ్యక్తిని అతని వినయంలోను
పరీక్షించాలి.
👏🏼చేసిన తప్పుకు క్షమాపణ
అడిగినవాడు ధైర్యవంతుడు.
ఎదుటి వారి తప్పును
క్షమించగలిగిన వాడు బలవంతుడు.
💞కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే,
సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.
🍥ఓటమి లేనివాడికి అనుభవం రాదు,
అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు,
ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.
ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.
ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు
ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,
గెలుస్తావు.
⏰ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే,
గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు.
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు.
అదే తేడా…
✊🏼గెలవాలన్న తపన,
గెలవగలను అన్న నమ్మకం,
నిరంతర సాధన.
ఈ మూడే నిన్ను గెలుపుకు
దగ్గర చేసే సాధనాలు...

Thursday, May 12, 2016


శుభోదయం../\..

పద్మా సనే పద్మకరే సర్వ లోకైక పూజితా

నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా

క్షీరో దార్ణ వసంభూతే కమలే కమలాలయే

సుస్థి రాభ వమే గేహే సురాసుర నమస్క్రతే!!

తా|| పద్మాసన మందు కూర్చున్నదానవు, చేత పద్మ పుష్పములను పట్టు కొనియున్న దానవు సర్వజనులచేత ప్రశంసంప బడుచున్న దానవు అయిన ఓనారాయణప్రియే! దేవీ ఎల్ల ప్పుడు నా పైదయ కలిగి ఉండుము. పాలసముద్ర మందు పుట్టిన నీవెల్లప్పుడును మాగృహమందు శాశ్వతముగా ఉండుము.



Tuesday, May 10, 2016

7). మాంగల్య ధారణ-తలంబ్రాలు
వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. మంగళ సూత్రం అనే శబ్దం సంసృతం నుండి పుట్టింది. సంసృతంలో 'మంగళ' అంటే శోభాయమానం అని, శుభప్రదం అనీ అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు ఆధారమైందని అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతో (లేదా ఎవరెవరి ఆచారం ప్రకారం వారి పద్ధతిలో) తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ గారు పెట్టిన "మధు పర్కం చీరె" ను, వధువుతో ధరింపచేస్తారు. వధూవరులు ఇద్దరూ మధుపర్క ధారణతో మంగళ సూత్ర ధారణ కార్య క్రమానికి సిద్ధమవడం ఆచారం. సమస్త శుభాలకు, మంగళ ప్రదమైన కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. దీన్నే "శత మానములు" అని కూడా అంటారు. బంగారంతో చేయబడ్తాయివి. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడు ""మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం !!"" అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతారు, పురోహితుడు మూడు ముళ్లు వేయమంటారు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతం. చదివిన మంత్రానికీ అర్థముంది-"ఓ సుందరీ ! ఈ మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని. మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించుతారు. "శతమానం భవతి, శతాయుః పురుష !" అనే మంత్రాన్నీ చదువుతారు. అందుకే, వీటికి "శత మానములు" అని పేరొచ్చింది. పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవ మర్యాదలు-పరువు ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి. పుట్టింట్లో పెరిగి, అత్తగారింటికి చేరి, బరువు-బాధ్యతలు స్వీకరించిన స్త్రీకి పుట్టిల్లు-అత్త గారిల్లు రెండు కళ్ల లాంటివి. ఉభయ వంశాలకు మంచి కీర్తిని చేకూర్చి పెట్టగలను అని తెలియ చేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారని హిందువుల నమ్మకం. భర్త సుఖ దుఃఖాలు తనవేనని, పుట్టింటి-అత్తింటి వారి మంచి-చెడులు తనవేనని, ధర్మ మోక్షాలు-అర్థ కామాలు తన సంబంధం ద్వారా భర్తకు లభింప చేయనున్నానని, సంపదకు-సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకం. మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది-'అక్షత' అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం. "తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు. కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. ఈ తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు.
స్థాళీపాకం-సప్తపది-నాగవల్లి-సదశ్యం
తలంబ్రాల కార్య క్రమం, బ్రహ్మ ముడి వేయడంతో ఇక వధూవరులను వివాహ వేదిక పైనుంచి కిందికి దింపుతారు. సాధారణంగా గౌరీ పూజ జరిపించిన చోటనో, లేకుంటే మరో అనువైన స్థలంలోనో, హోమం ఏర్పాటు చేసి స్థాళీపాకం వేడుక జరిపిస్తాడు పురోహితుడు. ఇందులో భాగంగా హోమం దగ్గర అన్నం వండించే పని, ఆ తర్వాత సప్తపది వుంటుంది. వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం. పరమ పావన మూర్తి అగ్నిహోత్రుడి సాక్షిగా, అగ్నిహోత్రుడి చుట్టూ, పాణి గ్రహణం తర్వాత వధూవరులిద్దరు, వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి, ఏడు అడుగులు వేయిస్తారు. దీనిని సప్తపది అని అంటారు. వధువుతో కలిసి ఏడడుగులు వేస్తూ వరుడు, ఏడు కోరికలను వివరిస్తాడు. అనంతరం వధువు తన అంగీకారాన్ని తెలియ పరుస్తుంది. ఇది గృహస్థా శ్రమ స్వీకారానికి పరమావధి. సప్తపది పూర్తైన తర్వాతనే, వధువు గోత్రం-ప్రవర-ఇంటి పేరు, వరుడి గోత్రం-ప్రవర-ఇంటి పేరు గా మారుతుంది. వధూవరులు కలిసి అడుగులు వేస్తున్నప్పుడు, భారతీయ-హిందూ సాంప్రదాయ వివాహ విధానాన్ని, అందులోని గొప్పదనాన్ని విశదపరిచే మంత్రాన్ని చదువుతారు. అందులో, "ఓ చిన్నదానా ! నీవు నన్ను అనుసరించి నడువు. నీవు నడిచేటప్పుడు శ్రీ మహా విష్ణువు, మొదటి అడుగులో అన్నాన్ని-ఐశ్వర్యాన్ని, రెండవ అడుగులో శారీరక-మానసిక బలాన్ని, మూడవ అడుగులో మంచి పనులు చేయాలన్న సంకల్పాన్ని-ఉత్తమ కర్మనూ-శ్రద్ధనూ, నాలుగవ అడుగులో కర్మ ఫలాన్నీ-సుఖాన్నీ-ఆనందాన్నీ, ఐదవ అడుగులో పశు సమృద్ధినీ-ధన ధాన్యాలనూ, ఆరవ అడుగులో మంచి సంతానాన్నీ, ఏడవ అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు తగు రక్షణను మనకు కలిగించుగాక" అన్న అర్థం స్ఫురిస్తుంది. వధువును అగ్నికి తూర్పునకుగానీ, ఉత్తరం నకుగానీ, ఏడు మంత్రాలతో, ఏడు అడుగులు నడిపించుతున్న వరుడితో జపం-హోమం చేయించుతారు. ఇక్కడే చెప్పిన మరో మంత్రంద్వారా వధూవరులిద్దరు, ఇకనుంచి స్నేహితులం అన్న అర్థం కూడా వుంటుంది. "మన ఇద్దరం స్నేహితులం. నీవు నాతో ఏడడుగులు నడవడంతో మన ఉభయులకు మైత్రి కలిగింది. నీ చేతిని నేనెప్పుడూ విడవను-నన్ను నీవు కూడా విడవవద్దు. మంచి మనస్సుతో అన్నోదకాలను స్వీకరించి ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని అనుభవించుదాం. పరస్పరం చర్చించుకొని కుటుంబ పనులను నెరవేరుద్దాం. అనుకూల దంపతులమై సంసార యాత్ర కొనసాగించుదాం. నువ్వు భూమివి-నేను ఆకాశాన్ని. నువ్వు వాక్కువు-నేను మనస్సును. నేను చేసే ధర్మ కార్యాలకు నీ సహకారం కావాలి. యోగ్యమైన సంతానాన్ని-సంపదను మనం ఇద్దరం కలిసి అనుభవించుదాం" అని దానర్థం. " రాత్రి గాని, పగలు గాని, ఎల్ల వేళలా సుఖ సంతోషాలతో నువ్వుండాలి నీకు ఎటువంటి ఇబ్బందీ కలగరాదు. సుమంగళివై-సత్ సంతానంతో గృహలక్ష్మివై, అభివృద్ధి చెందాలి" అని రక రకాలుగా అనునయించే మాటలివి. సప్తపది తర్వాత మరో ముఖ్యమైన వివాహ వేడుకలు, నాగవల్లి-సదశ్యం. ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం. సదశ్యంలో బ్రాహ్మణులకు కానుకలు, వధూవరులకు బట్టలు పెట్టే కార్యక్రమం వుంటుంది. నాగవల్లిలో పెళ్లి కూతురుకు భర్తతో కాలి మెట్టెలు తొడిగించే కార్యక్రమం, గుచ్చిన నల్లపూసల తాడును వధువు మెడలో కట్టించే కార్యక్రమం జరిపించుతారు. నల్ల పూసలతాడును కూడా మూడు ముళ్లు వేయించుతారు. ఇక వధూవరులతో కలిసి సమీప బంధుమితృల కోలాహలం మధ్య "భుజం బంతి భోజనాల" హడావిడి వుంటుంది. వధూవరులిద్దరిని పక్క-పక్కన కూచోబెట్టి, వెండి కంచాలలో ఇరువురికీ భోజనాలు వడ్డించి, వరుసకు బావా-మరదళ్లలాంటి వారి వేళా-కోళాల మధ్య భోజన చేయడం ఆరంభించుతారు అందరూ. మధ్యలో పాటలు, వధూవరులు ఒకరి కంచంలోది మరొకరి కంచంలో వుంచడం, పక్క వారందరూ తినమని బలవంతం చేయడం అక్కడ జరిగే వేడుక. ఉంగరాలు తీయడమనే "ప్రధానాంగుళీయకం" వేడుకలో మూత కురుచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోసి, దానిలో మెట్టెలు, ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నించే తంతుంటుంది. వుంగరం దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. ఇక్కడా బంధుమితృల కోలాహలం చోటుచేసుకుంటుంది. ఆ కాసేపు అది ఇరు పక్షాల వారి మధ్య ఒక నిజమైన పోటీలా జరుగుతుంది.
అప్పగింతలు-గృహ ప్రవేశం
కన్యా దాత ఇంట్లో జరిగే వేడుకల్లో "అప్పగింతలు" కార్యక్రమం అన్నింటిలోకి చివరిది-ఉద్వేగ భరితమైంది. సాధారణంగా పెళ్లి జరిగిన రోజున అర్థరాత్రి దాటింతర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది కార్యక్రమం. అయితే ఇటీవలి కాలంలో, వసతి గృహాల్లో పెళ్ళిళ్లు జరుపుకోవాల్సిన పరిస్థితుల్లో, వాళ్లిచ్చిన వేళకు మించి అక్కడ వుండడం కుదరనందున, అన్నీ ఆ టైంలోపల జరిపిస్తున్నారు. వధూవరులకు చూపాల్సిన "అరుంధతి" నక్షత్రాన్ని కూడా పట్ట పగలు చూపించి "కనబడిందా?" అని అడుగుతున్నాడు పురోహితుడు. కనబడిందని జవాబిస్తున్నారు వధూవరులు. భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది. అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతుంటుంది. వధువు రెండు చేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి. అప్పగించుతూ: "అష్టవర్షాభవేత్ కన్యా, పుత్రవత్ పాలితా మయా, ఇదానీం తవ దాస్యామి, దత్తా స్నేహేన పాలయా" అంటాడు కన్యా దాత. అంటే, "పుత్రుడితో సమానంగా పెంచిన ఎనిమిది సంవత్సరాల వయసున్న ఈ కన్యను నీకిస్తున్నాను. నీవు ఈమెను ప్రేమాభిమానాలతో కాపాడు." అని దాని అర్థం. అదే మంత్రం చదువుతుంటే, అదే అర్థం వచ్చేలా, అత్తమామలు వరుడి ప్రక్కన కూర్చుని వుంటే, వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో ముంచి వారి చేతులో అద్ది, "మీ పుత్రిక వలె కాపాడాలి" అని అప్పగిస్తారు. బహుశా అప్పగింతల ద్వారా, పెళ్లికూతురును అత్తవారింటి వైపు బంధువులందరికీ పరిచయం చేయడం కొరకు, ఈ వేడుకను జరిపిస్తుండవచ్చు. అప్పగింతల ముందర "వడి కట్టు" వధువుకు కట్టు తారు. వడి కట్టులో శేరుంబావు బియ్యం, వెండి గిన్నె, కొబ్బరి చిప్ప వుంచుతారు. అప్పగింతల కార్యక్రమంలో వధువును అప్పగించే ముందర, "బొమ్మ"ను అప్పగించడమనే, చిన్న వేడుక జరిపారు. ఒక మంచం మీద జంఫఖానా పరిచి, జాకెట్ గుడ్డతో ఊయలలాగా చేసి, అందులో ఈ చెక్క బొమ్మను నిదురిస్తున్న భంగిమలో వుంచుతారు. వధూవరుల కొంగులను కలిపి, అందులో ఎర్ర నీరు ఊయలలోంచి పడే విధంగా పోస్తారు. వధువుతో వరుడికి ఆ బొమ్మనిప్పించి, తాను పనిమీద వున్నాననీ, బొమ్మ రూపంలో వున్న వాళ్ల పాప-బాబును జాగ్రత్తగా చూస్తుండమనీ అనిపిస్తారు. అలా మూడు సార్లనిపించిన తర్వాత, ఆడబిడ్డకు ఆ పనిని అప్పగించుతారు. ఆడ బిడ్డకు బొట్టు పెట్టి, చీరె ఇచ్చి, బొమ్మను చేతిలో వుంచుతారు. ఇదయిన పిదప, అయిదుగురు దంపతులకు వధూవరులతో, (దంపత) తాంబూలాలు ఇప్పించుతారు. పెద్దలందరికీ వీరిరువురితో దండాలు పెట్టిస్తారు. ఈ అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇన్నాళ్లుగా పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్త వారింటికి వెళుతుందని ఆమెను వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం. అప్పగింతల కార్యక్రమం అనంతరం, పెళ్ళికూతురును లోపటికి తీసుకునిపోయి, పెరుగు అన్నం పెట్టి, దేవుడికి దండం పెట్టించి, బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి, గడపకు చేతులతో కొట్టించుతారు. ఇవన్నీఅయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు. ఇక అంతటితో కన్యా దాత ఇంటినుంచి ముందు జరగాల్సిన వేడుక, విడిదికి-అక్కడినుంచి పెళ్లికొడుకు ఇంటికి మారుతుంది. హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.















Total Pageviews