Monday, May 2, 2016

'పీవి' యనగనతడు ప్రియ 'భరత' సుతుడు !...డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ


ఆటవెలది : డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ
'పీవి' యనగనతడు ప్రియ 'భరత' సుతుడు !
'దేశ'దిశను మార్చె దివ్యముగను !
అపర 'తిమ్మరసుగ' 'ఐస్వర్య' బాటేసె
స్వార్ధ మసలులేని సాధు జీవి !
...
కాంగి రేసు వారి కంగారు పనులకు ,
తొంద రొద్ద నుచును తోడు వుండి !
పథక రచన చేసి పాలన సరిజేసి ,
వెనుక యుండి కాసె వెన్ను లాగు !

జాతిరత్న మయిన చాణుక్యుడతనేను !
కుటిల రాజకీయ కూటమందు ,
జటిల చిక్కులెన్నొ సరిజేసి మురిపించి
మట్టి యంట నట్టి మాన్య జీవి !


ఆటవెలది : ఆధునిక భారత గతిని అమోఘమైన రీతిలో తీర్చి దిద్ది , రాబోయే తరాలకు బంగారు బాట వేసి ' చాణక్యుని అర్ధ శాస్త్రాన్ని ఆచరించి చూపిన అపర తిమ్మరుసు మన 'పీవీ నరసింహారావు గారు .. వారి ఋణం ఈ జాతి ఎన్నటికీ తీర్చుకోలేదు .
దారిద్ర్యాంధకారం లో మ్రగ్గుతోన్న దేశానికి దిశను మార్చి' బంగారు ' భవిష్యత్తును ప్రసాదించిన , మాన్యులు శ్రీ పీవీ నరసింహా రావు గారి కి , వారు ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణలకు ' 25' సంవత్సరాలు పూర్తైన సందర్భంలో పాదాభివందన ములతో ....డా. కృష్ణ సుబ్బారావు పొన్నాడ

No comments:

Post a Comment

Total Pageviews