Friday, May 20, 2016

సిరివెన్నెల సినిమాలో.. చందమామ రావే పాట.. చరణం... కొన్ని కారణాల వల్ల ఇది ఉపయోగించలేదు...

 జన్మదిన శుభాకాంక్షలు....
సిరివెన్నెల సినిమాలో.. చందమామ రావే పాట.. మీనా పాత్ర వెన్నెల్లో బృందావనం చూడాలన్న సందర్భంలో వచ్చేది...
వెన్నెలకి బృందావనానికి ఏంటి సంబంధం అని గురువు గారు రాసిన చరణం...
కొన్ని కారణాల వల్ల ఇది ఉపయోగించలేదు...
ఈ చరణం ఇప్పటికీ తనకి ప్రాణప్రదమైనదని 
సిరివెన్నెల  చెప్తారు...


పాటల ‘సిరి’ – పలుకుల ‘వెన్నెల’
('సిరివెన్నెల సీతారామ శాస్త్రి' గారికి జన్మదిన శుభాకాంక్షలతో....)
-------------------------------------------------------------------
సరిగమలకు సరసతనిడు కలమే- ‘సిరివెన్నెల’..!
చతురత గల చెణుకులనిడు గళమే – ‘సిరివెన్నెల..!’
చిత్రసీమ చేసుకొన్న పున్నెము – ‘సిరివెన్నెల’..!
తెలుగు నేల అందుకున్న పెన్నిధి – ‘సిరివెన్నెల’!

వెచ్చని ఊహల ఊసులు పలుకు వేణుగానమై,
పచ్చని పాటల గాలులు మోయు వాయులీనమై,
సంస్కృతి గుండెల సవ్వడినిడు మృదంగ నాదమై...
పదముల జడివాన కురియు – మేఘమె సిరివెన్నెల!

పలుకులమ్మనడిగి తెచ్చి ‘పాట’ – ఆదిభిక్షువై,
కులుకులన్ని పంచి శ్రోతలకు – అంత:చక్షువై,
ఒలికి మధుర భావములను రుచులు పంచు ఇక్షువై,
తెలుగు హృదయముల దోచిన – గేయమె సిరివెన్నెల!

యువత, నవత మెచ్చు నవ్య కవితకాలవాలమై,
నిదుర లేపి, నిగ్గదీయు ఆశయ కరవాలమై,
భవిత పైన ఆశ నింపు భానుకిరణజాలమై
సాహితీ సుగంధమొలుకు – సుమమే ‘సిరివెన్నెల’!

పల్లవించు పలుకుల పూదోట – తోటమాలియై
పల్లవి, చరణాల నడక నెరిగిన – నటశీలియై
జగమంత ప్రశంసలందు నిజ ప్రతిభాశాలియై,
యుగమంత వసించు ‘వెలుగు చంద్రిక’ – సిరివెన్నెల!

--:O:--
నూజిళ్ళ శ్రీనివాస్, ఇంగ్లీష్ లెక్చరర్, ప్రభుత్వ కళాశాల, రాజమండ్రి
సెల్: 94408 36041

No comments:

Post a Comment

Total Pageviews