Friday, September 30, 2016

బతుకమ్మ

బతుకమ్మ

పువ్వులమ్మ బతుకమ్మ సంబరాల గురించి ముచ్చట్లు చెప్పుకుందాం! ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈరోజు బతుకమ్మ సంబురాలకు పల్లెలు, పట్నాల నుంచి మహా నగరాల దాకా పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహపూరితంగా ఉన్న ఈ శుభవేళ! బాగా ప్రాచుర్యంలో ఉన్న కధ! ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం "బతుకమ్మా !" అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదనీ, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు. ఇంకొక వృత్తాంతములో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానము లేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఈయన భార్య గర్భవతియై లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కినది కావున ఈమె తల్లితండ్రులు బతుకమ్మా అని నామకరణము చేసినారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆన్వాయితీ అయ్యిందని ఈ కథ చెబుతున్నది.
మరో కధ!.ఓ ముద్దుల చెల్లి, ఆమెకు ఏడుగురు అన్నదమ్ములు. అంతా వీరాధివీరులే. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అన్నలకు చెల్లెలంటే పంచప్రాణాలు. కానీ వదినలకు మాత్రం అసూయ! ఆ బంగారుబొమ్మని బాధపెట్టేవారు. ఓరోజు వేటకెళ్లిన అన్నలు, ఎంతకాలమైనా తిరిగిరాలేదు. అదే అదను అనుకుని వదినలు సూటిపోటి మాటలతో వేధించారు. యాతన తట్టుకోలేక ఆ చెల్లి ఇల్లొదిలి వెళ్లిపోయింది. ఆతర్వాత అన్నలొచ్చారు. ముద్దుల చెల్లి ఎక్కడని.భార్యల్ని నిలదీశారు. విషయం అర్థమైంది. తిండీతిప్పల్లేవు, నిద్రాహారాల్లేవు. చెల్లి కోసం వెదకని పల్లెలేదు, ఎక్కని గుట్టలేదు. ఓ వూరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా ... పెద్ద తామరపూవొకటి కనబడింది. వాళ్లను చూడగానే నీళ్లలో తేలుతూ వచ్చేసింది. ఆతర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్నేలే రాజు వచ్చాడు. ఆ పూవును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశాడు. కొలనుచుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు. పువ్వులకు బతుకుదెర్వు చూపింది కాబట్టి బతుకమ్మ అయ్యింది! ఇదో జానపద గాథ. మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారికి, మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరో ఐతిహ్యం. ఆత్మత్యాగంతో తెలంగాణలోని ఓ పల్లెను వరద బారినుంచి కాపాడిన త్యాగమూర్తే బతుకమ్మ అనేవారూ ఉన్నారు....
......../\........

అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు

అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు.ఈరోజు నుండి శరన్నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు పాడ్యమి నాడు అమ్మవారు  శైలపుత్రి అవతారంలో దర్శనం ఇస్తారు.
వందేశాంఛిత లాభాయ చంద్రార్థాకృత శేఖరామ్‌|
వృషారూఢాంశూలాధరం శైలపుత్రీ యశస్వనామ్‌||
దుర్గామాత మొదటి స్వరూపం శైలపుత్రి. పర్వతరాజయిన హిమవంతుడి ఇంట పుత్రికగా అవతరించినందువల్ల శైలపుత్రి అయింది. వృషభ వాహనారూఢి అయిన ఈ తల్లి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలాన్ని ధరిస్తుంది. ఈ తల్లి మహిమలు, శక్తులు అనంతం. మొదటి రోజున ఉపాసనద్వారా తమ మనసులను మూలాధార చక్రంలో స్థిరపరుస్తారు. యోగసాధనను ఆరంభిస్తారు. నైవేద్యంగా కట్టె పొంగలిని సమర్పించాలి. 
శైలపుత్రీం నమోస్తుతే!!!




ఆశ్వీయుజ మాసం
(శనివారం, 01.10.2016 to ఆదివారం, 30.10.2016)
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దేవేరులైన సరస్వతి, మహాలక్శ్మి, పార్వతీదేవిలకు అత్యంత ప్రీతికరమైన, వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ’ఆశ్వీయుజ మాసం’. చాంద్రమానం ప్రకారం ఆశ్వీయుజ మాసం ఏడవ మాసం. శరదృతువు ఈ మాసంతో ప్రారంభమవుతుంది. ఈ నెలలోని పూర్ణిమనాడు చంద్రుడు ’అశ్వని నక్షత్రం’ సమీపంలో సంచరిస్తూ ఉండడంవల్ల ఈ మాసానికి ’ఆశ్వీయుజ మాసం’ అనే పేరు ఏర్పడింది. మనకు వున్న ఇరవై ఏడు నక్షత్రాలలో అశ్వనీ నక్షత్రం మొదటి నక్షత్రం. అలా నక్షత్రాల ప్రకారంగా తీసుకుంటే ఆశ్వీయుజ మాసం తొలి మాసం అవుతుంది.
జగన్మాత అయిన పార్వతీదేవి దుష్టశిక్షణ, శిష్టరక్షణార్ధం తొమ్మిది అవతారాలను ధరించిన, ఆయుర్వేద దేవుడైన ’ధన్వంతరి’ , త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త అయిన మధ్వాచార్యులవారు జన్మించిన, దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడితే ప్రజలందరూ ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసం ఆశ్వీయుజ మాసం. ఈ మాసంలోని తొలి తొమ్మిదిరోజులు అంటే శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని నవమి వరకు శక్తి ఆరాధనకు విశేషమైన రోజులు. ఈ తొమ్మిది రోజులకు ’దేవీ నవరాత్రులు’ అని పేరు. దేవీ ఆరాధనకు ప్రధానమైన రోజులు కనుక వీటికి ’దేవీ నవరాత్రులు అని, శరత్కాలంలో వచ్చే రాత్రులు కనుక ’శరన్నవరాత్రులు’ అనే పేరు ఏర్పడింది.
ఈ తొమ్మిది రోజులు నవదుర్గలను రోజుకొకరి చొప్పున ఆరాధిస్తారు.
నవదుర్గలు….
1. శైలపుత్రి
2. బ్రహ్మచారిణి
3. చంద్రఘంట
4. కూష్మాండ
5. స్కందమాత
6. కాత్యాయిని
7. మహాగౌరి
8. సిద్ధిధాత్రి
దేవీ నవరాత్రులలో సప్తమిరోజు అంటే మూలా నక్షత్రంనాడు విధ్యాదేవత అయిన శ్రీ సరస్వతిదేవిని పూజించవలెను. అట్లే దుర్గాష్టమినాడు దుర్గాదేవిని పూజించి కూష్మాండ(గుమ్మడికాయ) బలిని ఇవ్వడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ నెలలోని బహుళ పక్షంలో చతుర్దశి, అమావాస్య తిథులలో దీపాలను దేవాలయం, మఠం ప్రాకారాల్లోగాని, వీధులు, ఇంటియందు సాయంత్రం సమయంలో వెలిగించవలెను. అందువల్ల పితృదేవతలు సంతృప్తి పడతారు. శరన్నవరాత్రులలో తిరుమల క్షేత్రములో కొలువై యున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఆశ్వీయుజ మాసంలో స్త్రీలు చేసే వ్రతాలు…
కోజాగరీ వ్రతం.
ఈ వ్రతంను ఆశ్వీయుజ పూర్ణిమనాడు ఆచరించవలెను. ఈ వ్రతం శ్రీమన్నారాయణుడికి, అతని దేవేరి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. రాత్రి శ్రీమహాలక్ష్మిని పూజించి, బియ్యం, పాలు,పంచదార, కుంకుమపువ్వు వేసి చక్రపొంగలి చేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ దినం రాత్రి శ్రీమహాలక్ష్మి భూలోకమంతా తిరుగుతూ ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి చూస్తుందిట. ఎవరైతే మేలుకుని ఉంటారో వారికి సకల సంపదలను ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
గొంతెమ్మ పండుగ
దీనిని కూడా అశ్వీయుజ పూర్ణిమనాడే జరుపుకొనవలెను. ఈ దినం కుంతీ మహేశ్వరీదేవిని పూజించి అరిసెలు, అప్పములు, అన్నము మొదలైన నైవేద్యములు సమర్పించవలెను. ఈ విధంగా పూజించడంవల్ల మహిళల కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి.
చంద్రోదయ గౌరీవ్రతం
ఈ వ్రతమును ఆశ్వీయుజ బహుళ పక్ష తదియనాడు ఆచరించవలెను దీనికే ’చంద్రోదయోమావ్రతం’ అని, అట్లతద్ది వ్రతం అని కూడా పేర్లు ఉన్నాయి. అట్లతద్దినాడు తెల్లవారుఝామునే నిద్రలేచి తలస్నానం చేసి, గౌరీదేవిని, గణపతిని పూజించవలెను పగలంతా అంటే రాత్రి చంద్రుడు ఉదయించేవరకు ఉపవాసం ఉండి అనంతరం అట్లు చేసి గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించవలెను. ఆ అట్లతో భోజనం చేయవలెను.
ఆశ్వీయుజ మాసంలో పండుగలు..
ఆశ్వీయుజ శుక్లపక్ష దశమి : విజయదశమి
పాడ్యమి మొదలుకుని దశమివరకు ఉన్న పదిరోజులకు ’దసరా’ అని పేరు. ’దశహర్’ అనే పదం నుండి ’దసరా’ అనేది ఏర్పడింది. అంటే పది పాపములను హరించునది అని అర్ధం. మొదటి తొమ్మిదిరోజులు దేవీ నవరాత్రులు. విజయదశమికే ’అపరాజిత దశమి’ అని కూడా పేరు. అనగా అపజయం లేని రోజు. ఈ దినం ఆయుధపూజ చేసి దేవిని పూజించడంతోపాటు సాయంత్రం శమీవృక్షం వద్దకు వెళ్ళి దర్శించి పూజించవలెను.
శుక్లదశమి : శ్రీమధ్వాచార్య జయంతి
త్రిమతాచార్యులలో ఒకరు, ద్వైతమత స్థాపకుడు అయిన శ్రీమధ్వాచార్యులవారు ఈ దినం జన్మించినట్లు చారిత్రక కథనం.
శుక్ల ఏకాదశి : పాశాంకుశ ఏకాదశి
ఈ ఏకాదశి వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించి ఉపవాస వ్రతమును అనుసరించడంవల్ల పితృదేవతల ఆత్మలు శాంతిస్తాయి అని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
కృష్ణపక్ష ఏకాదశి : ఇందిరా ఏకాదశి
ఈ ఏకాదశి వ్రతం పాటించడంవల్ల ఇహలోకంలోని వారికి సౌఖ్యం లభించడమే కాకుండా యమలోకంలో బాధలు అనుభవిస్తూ ఉన్న పితృదేవతలకు విముక్తి లబించి వైకుంఠానికి వెళ్తారని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
కృష్ణపక్ష ద్వాదశి : గోవత్స ద్వాదశి
గోవును శ్రీమహాలక్ష్మి స్వరూపంగా ఆరాధించడం మన ఆచారం.ఈ దినం సాయంత్రం గోవును దూడతో సహా అలంకరించి పూజించవలెను. గోసంబంధమైన అంటే పాలు, పెరుగు, నెయ్యి వంటివాటిని భుజించరాదు. మినుములతో వండిన వంటకము భుజించడం మంచిది.
కృష్ణపక్ష త్రయోదాశి : శ్రీ ధన్వంతరి జయంతి
ఈ రోజు ఆయుర్వేద వైద్యుడైన ధన్వంతరిని, శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఇలా పూజించడంవల్ల సకల వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని శాస్త్ర వచనం.
కృష్ణపక్ష చతుర్దశి : నరక చతుర్దశి
దీనికే ’ప్రేత చతుర్దశి’ అని పేరు. ఈ రోజు తెల్లవారుఝూమునే నిద్రలేచి నువ్వులనూనెతో తలంటుకుని స్నానం చేయవలెను. స్నానానంతరం నువ్వులతో యముడికి తర్పణం వదలవలెను. సాయంత్రం దీపములను వెలిగించవలెను.
కృష్ణపక్ష అమావాస్య : దీపావళి
ఈ దినం సూర్యోదయపూర్వమే స్నానమాచరించవలెను. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి లక్ష్మీదేవిని పూజించవలెను. సాయంత్రం నువ్వులనూనెతో ఇంటి ద్వారం, ధాన్యం కొట్టు, బావి, రావిచెట్టు, వంట ఇంటిలో దీపాలను వెలిగించవలెను. ఈ దినం యముడు దక్షిణ దిశగా ఉంటాడని, మహాలయ పక్షాల్లో భూమిమీదకు పితృదేవతలు తిరిగి వెళ్ళేందుకే మగవారు దక్షిణ దిక్కుగా నిలబడి దివిటీలు వెలిగించవలెను. అనంతరం ఇంటిలోనికి వచ్చి తీపి పదార్థాన్ని భుజించి బాణాసంచా వెలిగించవలెను.
ఈ విధంగా ఎన్నో విశిష్టతలను స్వంతం చేసుకున్న మాసం ’ఆశ్వీయుజ మాసం’ . ఈ మాసంలో చేసే పూజలు, విధుల ఆచరణవల్ల అనంతమైన ఫలితాలు కలుగుతాయి.
శుభోదయం!

పంకజనాభ నిన్ను మదిభావనచేసి నుతింతు నెప్పుడు నా 
వంకకు జూడవేల విధివర్తనమో మరిభక్తిలోపమో 
వంకరాలున్న చెరకుగడ వాటముగా రుచినందచేయదా 
శంకనుమాని నీ చరణసన్నిధి నిల్వశరణ్య మీయవే !!





నమస్కారములు, 
తెలుగువారి వంటకాలు చాలా గొప్పవి. అన్ని విటమిన్‌లు చాలా సమృద్ధిగా లభించేవి. మీకు నచ్చితే సరదాగా పిల్లలకు చెప్పండి.
పానీపూరి వద్దు
పరమాన్నము ముద్దు.
దమ్ బిర్యాని వద్దు
దద్దోజనం ముద్దు
నూడిల్స్ వద్దు
నువ్వుండలు ముద్దు
కూల్ డ్రింక్స్‌ వద్దు
కొబ్బరిబొండాలు ముద్దు
కుర్ కురేలెందుకు దండగ
కమ్మనైన పులిహొరుండగ
బర్గర్ లు వద్దు
బూరెలు ముద్దు.
పిజ్జాలు వద్దు
పిండొడియం ముద్దు.
తెల్లదనం వద్దు
తెలుగుదనం ముద్దు.
నవ్వండి, నవ్వుతూ విద్యార్థులను జంగ్ ఫుడ్స్ నుండి దూరం చేయండి.
వాట్స్ అప్ లో వచ్చింది.
ఈ కాలం బఫె భోజనాలగురించి వ్యంగ్యగా వ్రాశారు.డా.పొన్నాడ కృష్ణసుబ్బారావు   గారు.

రుచులవి జాతివి మారెను/
పచనపు కళ మారిపోయి పడమటి వంటల్ /
కిచెనుల దూరెను మెల్లగ/
శుచియగు మన భావములను శూన్యము చేయన్

గుత్తి వంకాయ కూరా లేదు ,
గుమ్మడికాయ పులుసూ లేదు !
అరటికాయ వేపుడు లేదు ,
అదిరే కొబ్బరి చట్నీ లేదు !
కొత్తావకాయ ఊసే లేదు ,
కొత్తిమీర చారూలేదు !
కందా బచ్చలి మరిచారయ్యా !
గుమ్మడి వడియం విడిచారయ్యా !

పలావు వుందని వడ్డించారు !
ఉల్లీరైతా ఉందన్నారు !
రుచిపచి తెలీని 'కూరే' సారు !
మిక్సుడు పికిల్ కూరేసారు !
బూరీ గారీ నోదిలేసారు !
బూందీ లడ్డూ మార్చేశారు !

గులాబు జామూన్ ఉందన్నారు
లైనులో జనాలు ముందున్నారు !

అయిసు క్రీముకేసడిగేసాకా ,
అయిపోయుంటుందన్నారొకరు !
ప్లేటుని చేతిలో పట్టుకుని ,
ఓ చేతిని జేబులొ పెట్టుకుని ,
బఫే లైనులో నుంచుంటే ,
బఫూన్ లా భలేగా వుంది !

కుర్చీ బల్లా తీసేశారు !
కుదురుగ నిలుచుని తినమన్నారు !
తల్లీ పిల్లా తల్లడిల్లినా ,
ముసలీ ముతకా ముక్కి చూసినా !
బఫే తీరులో బలముందన్నారు !
గొర్రె మూక విని తలవంచారు !

పెద్దా చిన్నా పరుగులె పరుగులు !
ముద్ద కోసమొక యుద్దపు తలపులు !
సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి

సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహా లక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె దృష్టి మన  మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలూ చేస్తూ ఉంటాము. కానీ శ్రీ లక్ష్మి దేవి యొక్క నివాస స్థానాలు, ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలి అనేది మనం సూక్ష్మంగ తెలుసుకొందాము. పూజలు, వ్రతాలూ చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వార లక్ష్మి అనుగ్రహాన్ని  పొందవచ్చు.

1. సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పడే యకూడదు. గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మిద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమ తో అలంకరించాలి.

2. ప్రధాన ద్వారం తలుపు మిద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసిన మంచిదే.

3. శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు లక్ష్మి దేవికి ఆలవాలం. కనుక, ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి.

4. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి, వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు.

5. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మిదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఉడ్చి ముగ్గులు వేసుకోవాలి.

6. ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు.

7. ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవెశించదు.

8. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించే వారు, బద్దకస్తులు ఎక్కడ ఉంటారో, అక్కడ లక్ష్మి దేవి ఉండదు.

9. ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.

10. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే.

11. సత్యవాదులు, ధార్మిక , నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మి దేవి ప్రసన్నురాలై ఉంటుంది.

12. వెండి, బంగారు వంటి లోహల్లో, రత్నాలు, ముత్యాలు లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.

13. అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జుదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట లక్ష్మి దేవి ఉండలేదు.

14. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి, ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి, లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు.

15. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు.                         
 అతి శీతల గిడ్డంగిలో పని చేస్తున్న ఓ వ్యక్తి కథ!

    ఆ రోజు పొద్దుపోయి... చీకట్లు ముసురువేళ.. ఎవరికి వాళ్లు పని ముగించికొని ఇళ్లకు వెళ్లే హడావిడిలో ఉన్నారు!
అతను మాత్రం సమయం చూడకుండా ఆ శీతల యంత్రంలో వచ్చిన సాంకేతిక సమస్యను సరిజేస్తూ లోపలే ఉండిపోయాడు! దినచర్యలో భాగంగా మిగిలిన సిబ్బంది డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసేసారు!
గాలి చొరబడని శీతలగిడ్డంగిలో తాను అనుకోకుండా బంధీనైనాని గ్రహించాడు!
గంటలు గడుస్తున్నాయి! బయటపడే మార్గం లేక తానిక ఐస్ గడ్డల్లో సజీవ సమాధి కాబోతున్నాననుకుంటున్న సమయంలో....

.......

....

ఎవరో డోర్ ఓపెన్ చేసిన అలికిడి...

ఆశ్చర్యం...

టార్చ్ లైట్ తో సెక్యూరిటీ గార్డ్ వచ్చి తనను రక్షించాడు!

 బయటకు వచ్చేటపుడు ఈ అధ్భుత ఘటన నుండి తేరుకుంటూనే
"నేను లోపలే ఉన్నానని నీకు ఎలా తెలుసు? నీకు సమాచారం ఎవరిచ్ఛారు?"
అడిగాడు గార్డ్ ని!

"ఎవ్వరూ చెప్పలేదు సార్!

ఈ సంస్థలో 50 మందికి పైనే పని చేస్తున్నారు... కానీ ప్రతిరోజూ విధి నిర్వహణకు వస్తూ ఉదయం 'హలో' అని.. సాయింత్రం ఇంటికి వెళ్తూ 'బై' అని చెప్పి పలకరించేది మీరొక్కరే సర్!

ఈరోజు ఉదయం 'హలో' అని పలకరించిన మీరు.. సాయింత్రం 'బై' చెప్పలేదు.. దాంతో నాకు అనుమానం వచ్చి తనిఖీకి వచ్చాను అంతే సార్!"

అతనూహించలేదు..
అతనికి ముందుగా తెలియదు! భేషజం గాని బాస్'ఇజం' గాని లేకుండా  ప్రతిరోజూ ఇలా తాను చేసే ఒక చిన్న పలకరింపుపూర్వక "సంజ్ఞ" కారణంగా తన ప్రాణాలు కాపాడబడ్తాయి అని!

మనకు తెలియకపోవచ్చు అటువంటి అధ్భుతాలు మన జీవితంలోనూ తారసపడవచ్చని!

నిజ జీవితంలో పరస్పరం   ఉపయోగించే భావజాలం, ప్రవర్తన, చర్యలను బట్టే ఎదుటి వారి వైఖరి ఉంటుంది! అందుకు ఎవరికీ ఏ విద్యార్హతలు ప్రామాణికం కాదు!                                                            ఇది మంచి పోస్ట్!
చాలామంది దీనిని ఫార్వర్డ్ చేశారు, చేస్తున్నారు, చేస్తారు కూడా!
కానీ ఎంత మంది పాటిస్తున్నారు?  ఎంతసేపూ ఎదుటివారే పలుకరించాలనే అహమే ఎక్కువగా కనిపిస్తుంది.
నిజంగా ఈ పోస్ట్ లోలాగా  పలుకరించేవారుంటే వారందరికీ నమస్కారం! నిజంగా "అహం" లేకుండా పాటిస్తూ ఫార్వర్డ్  చేసేవారికి శతాధిక నమస్సులు!

Thursday, September 29, 2016


శుభోదయం../\..
తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!
పూర్వం గణపతి సరస్వతి శ్లోకాలు, సుమతి వేమన మొదలైన పద్యాలు చదవకుండా చదువులు ప్రారంభించేవారు కాదు. సరస్వతి అనుగ్రహం వుంటే చదువులు బాగా వస్తాయని నమ్మే వారు. మరి ఇప్పుడు ఒకటి.... ఒకటి.... రెండు... రెండు... మూడు... మూడు అంటూ పరిక్షా ఫలితాల ప్రకటనల్లో గొంతు చించుకునే ఒకటి రెండు కాలేజీల్లో చేర్పిస్తే చాలు ఎల్ కే జీ నుంచే ఐ ఐ టి కోచింగ్ ట అంటూ వేలంవెర్రిగా అక్షరాలు నేర్పించేందుకు కూడా అక్షరాలా లక్షలు పోసి చదువు 'కొంటున్నాం' ఒక్కసారి ఆలోచిద్దాం!! చదువులమ్మను మనసారా కొన్ని పద్యాలతో అయినా నిత్యం పూజిస్తే చల్లని చదువులతల్లి అనుగ్రహిస్తుంది! మనం నేర్చుకుందాం పిల్లలకి నేర్పిద్దాం!! ర్యాంకులు సాధిద్దాం!
శారదా, శారదాంబోజ వదనా, వదనాంబుజే
సర్వదా, సర్వదాస్మాకం సన్నిధి, సన్నిధిం క్రియాత్
తాత్పర్యము: ఓ శారదా దేవీ! (శారదాంభోజ వదనా) తెల్లటి కలువలాంటి ముఖంకలదాన! (వదనాంబుజే) ముఖమే పద్మముగా కలదానా; (సర్వదా) అన్నిటినీ అనగా అన్ని విద్యలనీ ఇచ్చేదానా, (సర్వదాస్మాకం సన్నిధి) ఎల్లప్పుడూ మాయొక్క సన్నిధిలో అనగా మాకు తోడుగా ఉండి, (సన్నిధిం క్రియాత్) మంచినిధిని అనగా మంచిని చేయుగాక!





Think Diferently



"I slept on benches and everyday borrowed 20Rs/- from friend to travel to film city"
- Sharukh khan
"I failed in 8th standard"
-SACHIN TENDULKAR
"During my secondary school, I was dropped from school basketball
team"
-MICHAEL JORDAN
"I was rejected for the job in ALL INDIA RADIO bcoz of my heavy voice"
- AMITABH BACCHAN
"I used to work in petrol pump"
- DHIRUBHAI AMBANI
"I was rejected in d interview of PILOT"
- ABDUL KALAM
"I didn't even complete my university education"
- Bill Gates !!
"I was a dyslexic kid"
- TOM CRUIZE
"I was raped at the age of 9 "
- Oprah Winfrey
"I used to serve tea at a shop to support my football training"
- Lionel Messi
"I used to sleep on the floor in friends'rooms,returning Coke bottles for food, money, and getting weekly free meals at a local temple"
-Steve Jobs !!
"My teachers used to call me a failure"
- Tony Blair
"I was in prison for 27 years"
- Late President Nelson Mandela
and here comes d "THALIVA"
"At d age of 30, I was a bus conductor"
-RAJNI KANT
"Friends, there are many such people who struggled..
Life is not about what you couldn't do so far,
it's about what you can still do.
Wait and don't ever give up..
Miracles happen every day....!! Latest miracle will be : A chaiwala becoming prime minister of India.
Rs.20 Seems Too Much To Give A Beggar But It Seems Okay When Its Given As Tip At A Fancy Restaurant.
After A Whole Day Of Work, Hours At The Gym Seem Alright But Helping Your Mother Out At Home Seems Like A Burden.
Praying To God For 3 Min Takes Too Much Time But Watching A Movie For 3 Hours Doesn't.
We Wait A Whole Year For Valentine's Day But We Always Forget Mother's Day.
Two Poor Starving Kids Sitting On The Pavement Weren't Given Even A Slice Of Bread But A Painting Of Them Sold For Lakhs Of Rupees.
We Don't Think Twice About Forwarding Jokes But We Will Rethink About Sending This Message On.
Think About It..Make A Change..

ఈ కథ ఇప్పటి తల్లిదండ్రులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది.

పిల్లల పై అతిమోహం వద్దు ..
వారిని స్వశక్తితో ఎదిగేందుకు
సహకరిద్దాం ...
ప్రతీ తల్లిదండ్రులు చదవాల్సినది .

శూరసేనుడనే మహారాజు
చాలా గొప్పవాడు.
అతడు తన రాజ్యంలోని ప్రజలందరినీ
కన్నబిడ్డలా చూసుకునేవాడు.

ఇతని పరిపాలనలో రాజ్యం
చాలా సుభిక్షంగా ఉండేది.
ప్రజలు ఎవరి వృత్తులను వారు
సక్రమంగా చేసుకునేవారు.

అలా పరిపాలిస్తున్న మహారాజుకు ఓక కోరిక కలిగింది.
గొంగళి పురుగు సీతాకోకచిలుక ఎలా అవుతుందో చూడాలి అనుకున్నాడు.

తన ఉద్యానవనంలో కొన్ని చెట్లకి గొంగళి పురుగులు ఉండడం చూసి పంట పండింది అనుకోని రోజు వచ్చి చూస్తూ ఉండేవాడు. ఒకరోజు గూడు కట్టుకొని ఉండేవి. మరలా వచ్చి చూసేసరికి సీతాకోకచిలుకలై ఎగిరిపోతూ ఉండేవి.
ఇలా చాలారోజులు ప్రయత్నించాడు.
కాని ఎప్పుడు సీతాకోక చిలుక పుట్టుక మాత్రం చూడలేకపోయేవాడు.

ఒకనాడు మంత్రిగారిని పిలిచి తన
మనస్సులో కోరికను వెల్లడించాడు.
మంత్రి విని వెంటనే ఆ గొంగళి
పురుగులు ఉన్న చెట్టు దగ్గర
భటులను నియమించి
''సీతాకోకచిలుక పుట్టే సమయాన్ని
మాకు తెలియజేయండి"
అని ఆదేశించాడు.
భటులు అలాగే అని గొంగళిపురుగులు ఉన్న
చెట్టు దగ్గర కాపలా కాచి సీతాకోకచిలుక పుట్టే
సమయాన్ని మంత్రిగారికి తెలియజేయగా,
హుటాహుటిన రాజుగారిని
వెంటబెట్టుకొని ఉద్యానవనానికి వెళ్ళాడు.
సరిగ్గా అదే సమయానికి గూడులో
నుండి సీతాకోక చిలుక బయటికి
రావడం మొదలైంది.

రాజుగారు ఎంతో ఆసక్తిగా చూడడం
మొదలుపెట్టాడు.
గూడులో నుండి మెల్లమెల్లగా
బయటికి రావడం మహారాజు
చూసి,
అయ్యో! ఎంత కష్టపడుతుందో!
పాపం అనుకోని దగ్గరికి వెళ్లి
ఆ గూడుని తన దగ్గర ఉన్న చాకుతో చిన్నగా,
సీతకోకచిలుకకి ఏమి కాకుండా కోశాడు.
అది బయటికి వచ్చి క్రింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంది.

అది చూసి అయ్యయ్యో ఇది ఎగరలేకపోతుంది
అని తన చేతుల్లోకి తీసుకొని పైకి ఎగరేశాడు.
అయినా అది ఎగరలేక క్రిందపడిపోయి ఎగరడానికి ప్రయత్నిస్తుంది. కాని రెక్కలు విచ్చుకోకపోవడంతో అలా తన్నుకొని తన్నుకొని చనిపోయింది. అది చూసిన మహారాజు
దుఃఖించాడు.

మంత్రివర్యా!
ఏమిటి ఇలా జరిగింది.
ఎందుకలా చనిపోయింది? అని అడిగాడు.
అప్పుడు మంత్రిగారు ఇలా అన్నారు.

మహరాజా! సృష్టిలో ప్రతీదీ తనకుతానుగా
ఎదగడానికి ప్రయత్నించాలి.
అప్పుడే తన సామర్ధ్యం ఏమిటో తెలుస్తుంది.
ఒక విద్యార్థి విద్య నేర్చుకునేటప్పుడు గురువు శిక్షిస్తాడు.
అలాగని గురువుకి శిష్యుడి మీద కోపం ఉంటుంది అనుకోకూడదు.
తనను మంచి మార్గంలో పెడుతున్నాడు.
శిక్షించకపోతేనే ప్రమాదం.
విచ్చలవిడితనం పెరుగుతుంది.
సర్వనాశనం అవుతాడు.
అలాగే ప్రకృతికి లోబడి జీవులు బ్రతకాలి.
మీరు ఏదో సహాయం చేద్దాం అనుకున్నారు.
అది కష్టపడుతుంది అనుకుని మీరు సాయం చేయబోయారు. చివరికి చనిపోయింది.
ఇదిగో దీన్ని చూడండి అని మరొక సీతాకోకచిలుక బయటికి రావడం చూపించాడు.
రాజు గారు మళ్ళి దానిని బయటికి తీయడానికి వెళ్లబోతుంటే మంత్రి ఆపి,
మహారాజా!
ఎం జరుగుతుందో చూడండి అని అక్కడే నిలబెట్టేశాడు.

సీతాకోకచిలుక తన చుట్టూ ఉన్న వలయాన్ని చీల్చుకువచ్చి రివ్వున ఆకాశానికి ఎగిరింది.
అప్పుడు
మహారాజా! చూశారా!
ఇది ప్రకృతి సహజంగా తనకు తానుగా పోరాడి బయటికి రావడం వలన తన ఇంద్రియాలలో బలం పెరిగింది.
దానివలన దాని రెక్కలు పటిష్ఠమై ఎగరడానికి సహాయపడ్డాయి.
ఇందాక మీరు అది ఎక్కడ కష్టపడుతుందో అని, కష్టపడకుండా సుఖపెట్టాలని వలయాన్ని చీల్చేసారు.
దానివలన సీతకోకచిలుకకి కష్టపడాల్సిన పనిలేక బలం సరిపోక రెక్కలలో బలం చాలక ఎగరలేక చనిపోయింది.

అర్థమైందా మహారాజా! ప్రతిజీవికి పరమాత్మ
స్వయం శక్తిని ఇచ్చాడు.
దానిని ఎవరివారిని తెలుసుకోనివ్వాలి.

అలాకాకుండా ఎక్కడ కష్టపడతారో అని ఆ జీవి కష్టం కూడా మనమే పడితే ఇదిగో అనవసరంగా నాశనం చేసినవారం అవుతాము. అని చెప్పగా మంత్రిగారికి కృతజ్ఞతలు తెలియజేసి సన్మానించి బహుమతులు ఇచ్చాడు.
దీనిని ఆదర్శంగా తీసుకొని ఇంకొంత పరిపాలనకు వాడుకున్నాడు.

ఈ కథ ఇప్పటి తల్లిదండ్రులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది.
ఇలా పిల్లలపై ప్రేమ పిల్లల నాశనానికే తప్ప వికాసానికి దారితీయదు.
40 ఏళ్ళ కొడుకు,  డెబ్బై ఏళ్ళ తన తండ్రి చేయి పట్టుకొని , మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళ్ళి , హోటల్ లో ఓ టేబుల్ దగ్గర తన పక్కనే కూర్చోబెట్టుకొని , ఇద్దరికీ ఇడ్లీ , సాంబార్ తెమ్మని ఆర్డర్ ఇచ్చాడు కొడుకు.

ఆ ఇడ్లీలు తినేటప్పుడు  తండ్రి నోటిలో నుండి సాంబార్ కొంత జారి అతని చొక్కా మీద పడింది.

వయసు మీద పడటం వల్ల చేతులు మెల్లగా వణకడం , నోట్లో పళ్ళు సరిగా లేకపోవడంతో రెండు మూడు చోట్ల అలా చోక్కాపై మరకలు పడ్డాయి.

వాళ్ళ టేబుల్ చుట్టు ప్రక్కల తింటూ కూర్చొన్న కొందరు యువకులు తన తండ్రిని , అతని చొక్కాపై పడిన ఆ మరకలను చూసి అసహ్యించుకుంటూ, ముఖాలను ప్రక్కకు తిప్పుకొని ఏదో ఎగతాళిగా మాట్లాడుకున్నారు.

 వాళ్ళందరి ప్రవర్తనను చూసినా కూడా , వాళ్ళను ఏమీ పట్టించుకోకుండా తిన్న తర్వాత తన తండ్రిని వాష్ బేసిన్ వద్దకు తీసుకెళ్ళాడు.

తన దగ్గరున్న కర్చీప్ ను నీటితో తడిపి , తన తండ్రి చొక్కా మీద పడ్డ మరకను తుడవడంతో పాటు , అతని పెదవుల ప్రక్కన కొద్దిగా అంటుకొని ఉన్న ఇడ్లీ ముక్కలను కూడా నీట్ గా తుడిచాడు.

తర్వాత కౌంటర్ వద్దకు వెళ్ళి బిల్లును కట్టేసి , తన తండ్రితో పాటు రెండడుగులు ముందుకు వేయగానీ, వెనుక నుంచి ఎవరో పిలిచినట్లుగా అనిపించి వెనుకకు తిరిగి చూసాడు.

అక్కడే ఓ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న ఓ పెద్దాయన " బాబూ........! ఇక్కడ నువ్వు కొన్ని వదిలి వెళుతున్నావు " అని అన్నాడు.

లేదండీ........, నా బ్యాగ్ నాతోనే ఉంది, నేనేమీ ఇక్కడ వదల్లేదండీ.........! అని అన్నాడు  ఆ పెద్దాయనతో......

అప్పుడు ఆ పెద్దాయన  , " బాబూ........! నేననేది నీ బ్యాగ్ గురించి కాదు.

ఇక్కడున్న కొడుకులందరికీ కన్నవారిని ఎలా ఓపికగా, ప్రేమగా చూసుకోవాలో అనే ఓ జీవిత పాఠం వదిలి వెళుతున్నావు.......,

అలాగే ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రీ ఇలాంటి కొడుకు మాకు కూడా ఒకడుంటే ......బాగుండునే......అనే ఒక మధురానుభూతిని , ఓ తీయని జ్ఞాపకాన్ని వదిలి వెళుతున్నావు" అంటూ........

నెమ్మదిగా లేచి వచ్చి  భుజాన్ని తడుతూ ఇలాంటి ప్రేమాభిమానాలున్న కొడుకు ప్రతి కుటుంబానికీ ఉండాలి అని అన్నాడు.

ఆ పెద్దాయన మాటలు విన్న హోటల్ లోని వారంతా నిశ్శబ్దంగా కొడుకు వైపే అలాగే చూస్తూ ఉండిపోయారు...

Love u r parents..

ఇ విషయాలు మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చెయ్యండి
ఒక పత్రికా విలేఖరి ఒక రైతును ఇంటర్ వ్యూ
చేస్తున్నాడు.
విలేఖరి: మీ మేకలకు మీరు ఏం పెడతారు..?
రైతు : నల్లమేకకా.., తెల్లమేకకా..?
వి : నల్లమేకకు..
రై : గడ్డి..
వి : మరి తెల్లమేకకు..?
రై : గడ్డి..
వి : మీరు మీ మేకలను ఎక్కడ కట్టేస్తారు..?
రై : నల్లమేకనా.., తెల్లమేకనా..?
వి : నల్లమేకను..
రై : బయటి వసారాలో..!!
వి : మరి తెల్లమేకను..?
రై : దాన్ని కూడా బయటి వసారాలో..!!
వి : వీటికి స్నానం ఎలా చేయిస్తారు..?
రై : నల్లమేకకా.., తెల్లమేకకా..?
వి : నల్లమేకకు..
రై : నీటితో..
వి : మరి తెల్లమేకకు..?
రై : దానికి కూడా నీటితో..!!
వి : నీకసలు బుధ్ధి వుందా..? రెండిటికీ ఒకేలా
చేస్తున్నప్పుడు అస్తమానూ నల్లమేకకా..,
తెల్లమేకకా అని ఎందుకడుగుతున్నావు..?
రై : ఎందుకంటే నల్లమేక నాది.
వి: మరి తెల్లమేక..?
.
.
.
.
.
.
.
రై : అదికూడా నాదే..!!
.
విలేఖరి తల గోడకేసి కొట్టుకున్నాడు.
రైతు నవ్వుతూ అన్నాడు..
ఇప్పుడర్థమైందా.. మీరు టివిలో ఒకే వార్త తిప్పి
తిప్పి గంటలు గంటలు చూపిస్తూంటే మా
ప్రేక్షకులకి ఎలా వుంటుందో..?
Feeling Silly...............
నచ్చితే షేర్ చేయడం మరువద్దు.....

Tuesday, September 27, 2016

ఒక కారు రోడ్ మీద ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫిన్ ఉంది కానీ తనకు
వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం
ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కతే ఉంది . తోడు ఎవరూ లేరు .
చీకటి పడితే ఎలా?
దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు
( సిగ్నల్స్ లేవు ).
ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది ..
అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటం తో ఆమె సహజంగా భయపడుతుంది.....ఎవరతను ?ఎందుకు వస్తున్నాడు ?
ఏమి చేస్తాడు .?
ఆందోళన !.
అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు ?
టైర్ లో గాలి లేదని చూశాడు . ఆమె బెదిరిపోతోందని
గ్రహించాడు ." భయపడకండి . నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను . బాగా చలిగా ఉంది కదా ! మీరు కారులో కూర్చోండి . నేను స్టేఫిన్ మారుస్తాను" అన్నాడు
ఆమె భయపడుతూనే ఉంది .
" నా పేరు రాము. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను " అన్నాడు .అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు . తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు . సామాను తిరిగి
కారులో పెట్టాడు ..
ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు ." మీరు కాదనకండి . మీరు ఈ సహాయం చెయ్యక పోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది" అంది.
" నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు . మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి " అని వెళ్లి పోయాడు...
మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది . అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది . తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది . ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి ...
అదొక చిన్న హోటల్ .
కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది . ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది . డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది . బరువుగా నడుస్తోంది . అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్లికావలసిన ఆర్డర్ తీసుకోవడం , సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని చిల్లర ఇవ్వడం అన్నీ
తనే చేస్తోంది . ఆమె ముఖంలో ప్రశాంత మైన చిరునవ్వు. ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది . చిరు నవ్వుతో ఏమి కావాలండి ? అని అడిగింది . అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరు నవ్వు ఆమె ముఖం లో ఎలా ఉందొ అని ఆశ్చర్యం వేసింది తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది . భోజనం చేసి ఆమెకు 1000నోటు ఇచ్చింది . ఆమె చిల్లర
తేవడానికి వెళ్ళింది .
తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు ..
ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి . ఆ కాగితం చదివిన గర్భిణీ మహిళ కి కన్నీళ్లు ఆగలేదు .అందులో ఇలా ఉంది .." చిరు నవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది . నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది . నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ నేను నీకు సహాయ పడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు
సహాయపడు . " అని రాసి ఉంది..
ఇంటికి వచ్చింది. రోజంతా మెకానిక్ షాప్ లో పని చేసి అప్పుడే ఇంటికి వచ్చి అలసి పోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది. గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది . అతడి పక్కన మంచం మీదకు చేరుతూ మనం దిగులుపడుతున్నాం కదా డెలివరీకి డబ్బులెలాగా అని....
ఇక ఆ బెంగ తీరిపోయిందిలే
భగవంతుడే మనకు సహాయం చేశాడు . ఆయనకి కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా..
నీతి: మంచి మనుషులకు దేవుడు ఎదొ ఒక రూపంలో సాయపడుతూనే ఉంటాడు..
సుభాషితాలు
.
* కోపం మనశ్శాంతిని దూరం చేస్తుంది.
* మన వ్యక్తిత్వం మనం చేసే పనుల్లో కనిపిస్తుంది.
* మనుషుల్లో వైరానికి అయిదు కారణాలుంటాయి -
స్త్రీలు, ఆస్తిపాస్తులు, వాక్కులు,కులమత ద్వేషాలు, ఎప్పుడో
తెలిసో తెలియకో చేసిన అపరాధాలు.
* సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే, ఇక మనిషి జీవితంలో
కోరికల ప్రవాహానికి అడ్డూ, ఆపూ ఉండవు.
* తల్లితండ్రులు తమ సంతానానికి అందించినవాటికి ప్రతిఫలం యీ
సృష్టి లోనే లేదు.
* విజ్ఞానం లేని జీవితం , నూనే లేని దివ్వెలాంటిది.
అయిదేళ్ళ వయసులో ఒక కుర్రవాడు హిమాలయ పర్వత శిఖరాగ్రాల మీద ఉండే బౌద్ధారామాలకి విద్యాభ్యాసం కోసం పంపబడ్డాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంవత్సరాల తరబడి సిద్ధాంత మూలసార జ్ఞానాన్ని సముపార్జించుకున్న తరువాత, ఆ జ్ఞానాన్ని ప్రజలకు పంచమన్న గురువు ఆదేశంతో, ఆ భిక్షువు పర్వతశ్రేణుల మధ్య నుంచి దిగి మొట్ట మొదటిసారి నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టాడు. 
అప్పటి వరకూ ఆశ్రమం దాటి బయటకురాని ఆ పద్దెనిమిదేళ్ళ యువకుడికి అంతా కొత్తగా ఉంది. బౌద్ధసాధువులకు సాంప్రదాయకమైన భిక్షాటన నాశ్రయించి, ఒక ఇంటి ముందు నిలబడి మధుకరము అర్థించాడు. ఇంటి యజమాని యువ సాధువు కాళ్ళు కడిగి సగౌరవంగా లోపలికి ఆహ్వానిoచి, భిక్ష వేయమని కూతుర్ని ఆదేశించాడు. ఒక పదహారేళ్ళమ్మాయి లోపల్నుంచి ఏడు రోజులకి సరిపడా బియ్యాన్ని తీసుకొచ్చి అతడి జోలెలో నింపింది.
ఆమెని చూసి యువకుడు చకితుడయ్యాడు. అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ని చూడలేదతడు. ఆమె గుండెల కేసి చూపించి తామిద్దరి మధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకి తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మనుష్యుల మధ్యకి తొలిసారి వచ్చిన సన్యాసి అని తెలుసు.
స్త్రీ పురుషుల తేడా గురించి చెపుతూ, ‘వివాహం జరిగి తల్లి అయిన తరువాత క్షీరమునిచ్చి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత స్త్రీకి ఉన్నది కాబట్టి ప్రకృతి ఆమెకు ఆ విధమైన అవయవాలను సమకూర్చింది’ అని వివరణ ఇచ్చాడు.
సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆ రోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజుల దినుసులు వెనక్కి ఇచ్చి తిరిగి తన గురువు దగ్గరకు చేరుకున్నాడు.
అలా ఎందుకు చేశావని అడిగాడు గురువు. “తర్వాతెప్పుడో దశాబ్ద కాలం తరువాత ప్రపంచంలోకి అడుగిడబోయే బిడ్డ కోసం తగు ఏర్పాట్లన్నీ ప్రకృతి ముందే సమకూర్చినప్పుడు, రేపటి ఆహారం గురించి ఈ రోజు తాపత్రయపడటం ఎంత నిష్ప్రయోజనమో నాకు అర్థమయింది స్వామీ..!” అన్నాడా భిక్షువు.
“బౌద్ధం గురించీ, బంధం గురించీ సంపూర్ణమయిన జ్ఞానం నీకు లభించింది నాయనా" అంటూ శిష్యుణ్ణి కౌగిలించుకొని అభినందించాడు ఆచార్యుడు.
               పెద్దలమాట చద్దిమూట !!

కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని
సముద్రాన్నిచులకన చేయడం ఎంత తప్పో
మంచితనాన్ని తక్కువగా 
అంచనా వేయడం అంతే తప్పు.
శుభోదయం
ఓం గం గణపతయే నమః ఓం నమ:శివాయ
అర్ధం చేసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!
గణేశ శ్లోకం:- అగజానన పద్మార్కం గజాననమహర్నిశం| అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే||
అ =లేనిది,
గ=చలనము ( అంటే చలనము లేలిది=పర్వతము=హిమాలయము=దానికిరాజైన హిమవంతుని )
జ= కుమార్తె (అనగా పార్వతీదేవి)
ఆనన= ముఖమను
పద్మ= పద్మమునకు
అర్కం= సూర్యుడైనట్టి( సూర్యుని చూస్తే తామరలు అనగా పద్మములు వికసిస్తాయి. అంటే ఆ కొడుకును చూస్తే ఆ తల్లికంత ప్రేమ. ఆమె జగన్మాత కనుక మనతల్లులకి ఆదర్శం పిల్లలని చూస్తే తల్లుల ముఖం వికసిస్తుంది. మరి మనమో తల్లి తండ్రులను వృద్ధా శ్రమాల్లో చేర్పిస్తున్నాము. మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లి తండ్రులకు ప్రదక్షిణం చేసిన గణపతి కుమారస్వామికి ముల్లోకాల లోని నదుల్లో ముందుగా స్నానమాచరించి ఎదురుగా వస్తూ కనబడ్డాడు. తల్లి తండ్రులను పూజించాలని ఆ మహా గణపతి మనకి ఆదర్శంగా చేసి చూపించాడు. మనం ఆచరించాలి అప్పుడే మన పూజలు స్వీకరిస్తాడు.
గజ +అనననం =ఏనుగు ముఖము కల్గిన (నిన్ను)
అహర్+నిశం = పగలూ రాత్రి అంటే రోజంతా
అనేకదం= ఎంచ వీలు లేనంత
తం =తమరి, మీయొక్క
భక్తానాం = భక్తులలో
ఎకదం= ఒకడు
తం= తమరిని
ఉపాస్మహే= ప్రార్థించుచున్నాడు
ఈ శ్లోకములో అనేకదంతం అని ఏకదంతం అని చదువరాదు. అనేకదం తంభక్తానాం అని ఎకదం తంఉపాస్మహే అని చదువవలెను. పెద్దలు ఈ విషయంలో అందరూ సరిగ్గా ఉచ్చరించేలా (పలికేలా) చూడాలి. 
శుభం భూయాత్!! 
మణిసాయి విస్సా ఫౌండేషన్.
మీ ఓర్పే మీమల్ని గెలిపిస్తుంది
అబ్రహాం లింకన్ జీవితంలో ఒకానొకసారి ఒక అవమానకర సంఘటన జరిగింది. ఆయన అమెరికా అధ్యక్షుడయిన కొత్తల్లో దేశంలో పెట్టుబడుల్ని పెంచడానికి ధనవంతుల్ని, పారిశ్రామికవేత్తలను సమావేశపరచి అధ్యక్షోపన్యాసం చేయబోతున్నాడు. అసూయ అనే దిక్కుమాలిన గుణం కొందరిలో ఉంటుంది. వారు వృద్ధిలోకి రాలేరు, తెలిసినవారు వస్తే చూసి ఓర్వలేరు. వీలయినప్పుడల్లా వారిని బాధపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అబ్రహాం లింకన్ దేశాధ్యక్షుడయ్యాడని ఓర్వలేని ఓ ఐశ్వర్యవంతుడు ఆయన్ని ఇరకాటంలో పెట్టాలనుకుని లేచి కాలికున్న బూటుతీసి ఎత్తిపట్టుకుని ‘‘లింకన్! నువ్వు చాలా గొప్పవాడిననుకుంటున్నావ్, దేశాధ్యక్షుడినని అనుకుంటున్నావ్. మీ తండ్రి మా ఇంట్లో అందరికీ బూట్లుకుట్టాడు. ఇదిగో ఈ బూటు కూడా మీ నాన్న కుట్టిందే. నాకే కాదు, ఈ సభలో ఉన్న చాలామంది ఐశ్వర్యవంతుల బూట్లు కూడా ఆయనే కుట్టాడు. నువ్వు చెప్పులు కుట్టేవాడి కొడుకువి. అది గుర్తుపెట్టుకో. అదృష్టం కలిసొచ్చి ఆధ్యక్షుడివయ్యావ్. ఈ వేళ మమ్మల్నే ఉద్దేశించి ప్రసంగిస్తున్నావ్’’ అన్నాడు.
లింకన్ ఒక్క క్షణం నిర్లిప్తుడయిపోయాడు. నిజానికి ఆయన ఉన్న పరిస్థితిలో వెంటనే పోలీసుల్ని పిలిచి తనను అవమానించిన వ్యక్తిని అరెస్ట్ చేయించి ఉండవచ్చు. కానీ అదీ సంస్కారం అంటే.. అదీ సంక్షోభంలో తట్టుకుని నిలబడడమంటే... అదీ తుఫాన్ అలను చాకచక్యంగా తప్పించుకోవడమంటే... లింకన్ వెంటనే తేరుకుని ఆ వ్యక్తికి శాల్యూట్ చేస్తూ ‘‘ఇంత పవిత్రమైన సభలో నా తండ్రిని గుర్తుచేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
నిజమే, నా తండ్రి బూట్లు కుట్టిన మాట వాస్తవమే. మీవి, మీ ఇంట్లోవారి బూట్లను కూడా కుట్టాడు. అలాగే ఈ సభలో కూడా ఎందరివో కుట్టాడు. నా తండ్రి వృత్తిని దైవంగా స్వీకరించి చేసినవాడు. అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నా. మా తండ్రి బూట్లు కుడితే అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి తప్ప పాదం సైజుకన్నా ఎక్కువ తక్కువలు ఉండవు. ఒకవేళ మా తండ్రి కుట్టిన బూట్లలో ఏమైనా తేడా ఉంటే నాకు చెప్పండి. నా తండ్రి నాకు కూడా బూట్లుకుట్టడం నేర్పాడు. నా తండ్రికి అప్రతిష్ఠ రాకూడదు. అందువల్ల నేను మీ ఇంటికొచ్చి ఆ బూట్లు సరిచేసి వెడతాను.
ఈ సభలో మా నాన్నగారిని గుర్తుచేసినందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఆనందబాష్పాలతో నా ప్రసంగం మొదలుపెడుతున్నా’’ అన్నాడు. అంతే! ఆయన్ని నలుగురిలో నవ్వులపాలు చేద్దామనుకున్న వాళ్ళు సిగ్గుతో తలవంచుకున్నారు. ఇదీ ధైర్యంగా జీవితాన్ని కొనసాగించడమంటే. ఇదీ.. మనల్ని ముంచడానికి వచ్చిన అలమీద స్వారీ చేయడమంటే. ఇవీ జీవితంలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన మెళకువలు.
*ఈ రోజు ఒక మంచి విషయము తెలుసుకున్నాను*
ద్రాక్ష పండ్లను కొంటానికి మార్కెట్కు వెళ్ళాను ।
నేను: బాబు కిలో ఎంత...?
అతను : *"కిలో 80 సర్।"*
పక్కనే విడి విడిగా పడి ఉన్న ద్రాక్ష పండ్లను చూసాను.... ।
నేను అడిగాను: *" మరి వీటి ఖరీదెంత?"*
పండ్లతను : *"30 రూపాయలకు కిలో సర్"*
నేను అడిగా : "ఇంత తక్కువన..?
పండ్లతను : "సర్, అవి కూడా మంచివే..!!
*కాని అవి గుత్తి నుండి విడి పోయాయి ...అందుకే అంత తక్కువ రేటు।"*
అప్పుడు నాకు అర్థమైంది... *సమాజము...కలసి జీవించటం*మరియు *కుటుంబము*నుండి వీడి పోతే .....మన జీవితము కూడా సగానికన్న తక్కువ పడిపోతుంది।
దయ చేసి మీ *కుటుంబము* మరియు *మిత్రులతో*ఎప్పుడూ టచ్ లో ఉండండి......సర్వేజన సుఖినోభవంతు.।
పెళ్ళికావలసిన young పురోహితులను పెళ్ళిచేసుకోవడాన్కి ఆడపిల్లలు ఇష్టపడడంలేదని చాలామందిబాధపడుచున్నారు.ఇది చాలా శోచనీయం.దీనికి ముఖ్యకారణం ఒక పురోహితుని భార్య సిగ్గు పడుతూనే వివరించింది.తన భర్త పూజలుచేస్తే అభ్యంతరం లేదు,వారు గౌరవంగా సమర్పించుకున్న దక్షిణ తాంబూలాలు స్వీకరించి,హుందాగా వస్తే,ఆయనగుఱించి అందరూ మంచిగామాట్లాడుతుంటే బాగానేవుంటుంది.వారు కూడ నేర్చుకున్నంతవరకు చక్కగా నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ ధర్మబద్ధమైన,జీవితం గడుపుచూ,వారు చేయించిన పూజలలో అనవసరమైనవి కొనిపించి,ఆవస్తువులను పూజానంతరం మూటకట్టుకొని ఇంటికి తీసుకెళ్ళడంవంటి కక్కూర్తి బుద్ధులు లేకుండా Royalగా వుంటే అందరూ తప్పక గౌరవిస్తారు.అసలు ఏదోవిధంగా భగవంతుని స్మరించని మతం వుందా? వేదంచదువుకోవడం అంటే మామూలువిషయం కాదు.పరీక్షలో కాపీ కొట్టి పాసయేంత సులభంకాదు.నిష్ఠగా గురువుగారి దగ్గరభక్తిపూర్వకంగా వినయంగా నేర్చుకుంటేగాని ఒంటబట్టదు. యువ పురోహితులు కూడ కేవలం ఉదరపోషణనిమిత్తమే కాకుండా ఆధ్యాత్మికతను కూడ దృష్టిలో వుంచుకొని పవిత్రఆశయము కలిగి ,మంచి నడవడిక కలిగి ,మితాహార నియమాలతో ఆరోగ్యంగావుంటే,అన్నీకలసివచ్చి,ఏరికోరి పెళ్ళిచేసుకుంటారు.ఇప్పటి పరిస్థితిమారి, కావాలని వేదం చదువుకుని సంపాదనలో వున్నవారిని కోరుకొనేరోజులు వస్తాయి.ఎవరూ నిరాశపడవద్దు.ఈనాటిsoftware లే మిమ్మల్ని వెతుక్కుని వస్తారు. ఇది నిజం.వేదాన్ని నమ్ముకున్నవాడు చెడిపోవడం జరగదు.

అందరికీ ముందస్తుగా దసరా శరన్నవరాత్రి శుభాకంక్షలతో


ఆశ్వీయుజ మాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది దసరా పండుగ. అమ్మవారిని తొమ్మిదిరోజులు చక్కని అందమైన అలంకరణలతో ఏంటో భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజిస్తాము.మరి ఆ విశేషాలు తెలుసుకుందామా?
నవదుర్గ అవతార విశిష్టత.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు సంప్రదాయ పద్ధతి ఆచరించే ఈ నవరాత్రులను దసరా అంటారు.
ఈ రోజుల్లోనే అమ్మవారిని వివిధ అలంకారాలతో పూజించి నైవేద్యాలుసమర్పించడం పరిపాటి. వీటితోపాటు ఆదిపరాశక్తి తన అంశలతో భిన్న రూపాలను స్పృశించింది. అవి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సర్వసిద్ధిధాత్రి అనే నవ రూపాలు. వీటినే నవదుర్గలుగా కొలుస్తాం.
నవదుర్గా స్తుతి
ప్రథమా శైలపుత్రీచ, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయా చంద్రఘండేతి కూష్మాండేతి చతుర్దశీ
పంచమస్కంధమాతేతీ, షష్ట్యా కాత్యాయనేతి చ. సప్తమా కాలరాత్రిశ్చ, అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చేతి, నవదుర్గాః ప్రకీర్తితాః||

1.   పాడ్యమి - శైలపుత్రి
వందేశాంఛిత లాభాయ చంద్రార్థాకృత శేఖరామ్‌|
వృషారూఢాంశూలాధరం శైలపుత్రీ యశస్వనామ్‌||
దుర్గామాత మొదటి స్వరూపం శైలపుత్రి. పర్వతరాజయిన హిమవంతుడి ఇంట పుత్రికగా అవతరించినందువల్ల శైలపుత్రి అయింది. వృషభ వాహనారూఢి అయిన ఈ తల్లి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలాన్ని ధరిస్తుంది. ఈ తల్లి మహిమలు, శక్తులు అనంతం. మొదటి రోజున ఉపాసనద్వారా తమ మనసులను మూలాధార చక్రంలో స్థిరపరుస్తారు. యోగసాధనను ఆరంభిస్తారు. నైవేద్యంగా కట్టె పొంగలిని సమర్పించాలి.

2. విదియ - బ్రహ్మచారిణి
ధధానాకర పద్మాఖ్యామక్షమాలా కమండలా|
దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యముత్తమా||
దుర్గామాత రెండవ స్వరూపం బ్రహ్మచారిణి. బ్రహ్మ అంటే తపస్సు. బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించేది అని అర్థం. 'వేదస్తత్వం తపోబ్రహ్మ'. బ్రహ్మ అనగా వేదం, తత్త్వం, తపస్సు. ఈ తల్లి తన కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరిస్తుంది. ఈ తల్లిని పూజించిన సర్వత్రా సిద్ధి, విజయం, సాధకుడికి మనస్సు స్వాధిష్టాన చక్రంలో స్థిరమవుతుంది. కఠిన ఆహార నియమాలు ఆచరించి అపర్ణ అయింది. నైవేద్యంగా పులిహోరను సమర్పించాలి.

3.తదియ - చంద్రఘంట
పిండజ ప్రవరారూఢా- చండకోపాస్త్ర కైర్యుతా|
ప్రసాదం తనుతేమహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా||
దుర్గామాత మూడవ స్వరూపం చంద్రఘంట. ఈ తల్లి తన శిరసున అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంవల్ల ఈ పేరు సార్థకమైనది. ఈమె తన పది చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనుస్సు, కమలం, జపమాల, కమండలం, అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది. ఈమె ఘంట నుంచి వెలువడిన థ్వని భయంకరంగా ఉండికౄరులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది. ఈ తల్లిని ఆశ్రయించిన సమస్త సంసారిక కష్టముల నుంచి విముక్తులు అవుతారు. ఇహలోకంలోనేకాక పరలోకంలో కూడా సద్గతి లభిస్తుంది. నైవేద్యం కొబ్బరి అన్నం.

4. చవితి - కూష్మాండ
దుర్గామాత నాల్గవ స్వరూపం కూష్మాండం. దరహాసం చేస్తూ బ్రహ్మాండాన్ని అవలీలగా సృష్టిస్తుంది. కాబట్టి ఈ పేరు వచ్చింది. ఈమె సర్వమండలాంతర్వర్తిని. రవి మండలంలో నివశించే శక్తి సామర్థ్యాలు ఈ తల్లికే ఉన్నాయి. ఈమె ఎనిమిది భుజాలతో ఉంటుంది. తన ఏడు చేతుల్లోనూ కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద ధరిస్తుంది. ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాలను ధరిస్తుంది. ఈమె సింహవాహనం అధిష్టిస్తుంది. సంస్కృతంలో కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఈమెకు గుమ్మడికాయ అంటే ఎంతో ఇష్టం. ఈ దేవిని ఉపాసిస్తే మనసు అనాహతచక్రంలో స్థిరంగా ఉంటుంది. ఉపాసకులకు ఆయురారో గ్యాలను ప్రసాదించటమేగాక, వారి కష్టాలను కూడా పోగొడుతుంది. నైవేద్యంగా చిల్లులేని అల్లం గారెలను సమర్పించాలి.

5.పంచమి - స్కంధ మాత
సింహాసనాగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా|
శుభదాస్తు సదాదేవి స్కంధమాతా యశస్వినీ||
దుర్గామాత ఐదవ స్వరూపం స్కంధమాత. స్కంధుడనగా కుమారస్వామి. శక్తిధరుడు. దేవసేనల అధిపతి. నెమలి వాహనుడు. ఈయనకు తల్లి కాబట్టి ఈమెకు 'స్కంధమాత' అనే పేరు వచ్చింది. ఈ తల్లి నాలుగు చేతులతో ఉంటుంది. స్కంధుడిని పట్టుకొని పద్మం ధరించి, ఎడమచేతిలో అభయముద్రను, కమలాన్ని ధరిస్తుంది. కమలవాసిని. శ్వేతవర్ణం కలిగి ఉంటుంది. సింహవాహనాన్ని అధిష్టిస్తుంది. ఈమెను ఉపాసించిన విశుద్ధచక్రంలో మనసు స్థిరమవుతుంది, భవసాగరాలనుంచి విముక్తులై మోక్షాన్ని సులభంగా పొందవచ్చును. నైవేద్యంగా పెరుగు అన్నం సమర్పించాలి.

6.షష్టి - కాత్యాయని

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా|
కాత్యాయనీ శుభం దద్వాద్దేవీ దానవఘాతినీ||
పూర్వం 'కతి' అనే పేరుగల ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్య గోత్రీకుడే కాత్యాయన మహర్షి. ఇతడు ఈ దేవి తనకు కుమార్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు. తపస్సు ఫలించింది. మహిషాసురుడిని సంహరించటంకోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో దేవిని సృష్టించారు. మొదట కాత్యాయని మహర్షి తల్లిని పూజించాడు. కాబట్టే 'కాత్యాయని' అనే పేరు వచ్చింది. కాత్యాయని మహర్షి ఇంటిలో పుట్టింది. కాబట్టి కాత్యాయని అయింది అనే కథకూడా ఉంది. ఈమె చతుర్భుజి. ఎడమచేతిలో ఖడ్గం, పద్మాన్ని ధరిస్తుంది. కుడిచేయి అభయముద్రను, వరముద్రను కలిగి ఉంటుంది. ఉపాసించిన సాధకుడి మనసు ఆజ్ఞాచక్రంలో స్థిరమవుతుంది. తన సర్వస్వమునూ ఈ తల్లి చరణాలలో పరిపూర్ణంగా సమర్పించాలి. అప్పుడు ఆమె అనుగ్రహించి రోగాలనూ, శోకాలనూ, భయాలనూ పోగొడుతుంది. ధర్మార్థకామమోక్షాలను ప్రసాదిస్తుంది. నైవేద్యంగా రవ్వ కేసరిని సమర్పించాలి.

7.సప్తమి - కాళరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా
లంబోష్టి కర్ణికాకర్ణితైలాభ్యక్త శరీరిణి|
వామపాదోల్ల సల్లోహ లతాకంటకభూషణా
వరమూర్థధ్వజాకృష్టా కాళరాత్రీర్భయంకరీ||
ఈ తల్లి శరీర వర్ణం గాఢాంధకారంవలె నల్లనిది. తలపై కేశాలు విరబోసుకొని, మెడలో హారం విద్యుత్‌కాంతితో వెలుగుతుంది. ఈమె నాసిక నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడుతుంటాయి. ఈమె వాహనం గాడిద. కుడిచేతిలో అభయముద్ర, వరముద్ర కలిగి ఉంటుంది. ఎడమచేతిలో ముళ్ళ ఇనుప ఆయుధం, ఖడ్గం ధరిస్తుంది. చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ భక్తులపాలిటి కల్పతరువు. ఈ తల్లిని గనక ఉపాసిస్తే మనస్సు సహస్రార చక్రంలో స్థిరంగా ఉంటుంది. సమస్త పాపాలు, విఘ్నాలు తొలగుతాయి. గ్రహబాధలు ఉండవు. అగ్ని, జల, జంతు, శత్రు, రాత్రి భయాలు ఉండవు. నైవేద్యంగా కూరగాయలతో అన్నాన్ని సమర్పించాలి.

8. అష్టమి - మహాగౌరి
శ్వేతేవృషే సమారూఢా శ్వేతాంబరధరాశుచిః|
మహాగౌరిశుభం దద్వాత్‌, మహాదేవ ప్రమోధరా||
ఈమె ధరించే వస్త్రాలు, ఆభరణాలు తెల్లని కాంతులతో మెరుస్తుంటాయి. ఈమె వృషభ వాహనంపై ఉంటుంది. చతుర్భుజి. కుడిచేతుల్లో అభయముద్రను, త్రిశూలాన్ని ధరిస్తుంది. ఎడమచేతుల్లో ఢమరుకాన్ని, వరముద్రనూ కలిగి ఉంటుంది. శివుడిని పరిణయమాడాలని కఠోరంగా తపస్సు చేసింది. అందువల్ల ఈమె శరీరం నల్లగా అయిపోయింది. ఆమె తపస్సుకు సంతోషపడిన శివుడు ప్రసన్నుడై ఈమె శరీరాన్ని గంగాజలంతో పరిశుద్దంచేశాడు. ఆ కారణంగా ఈమె శ్వేతవర్ణశోభిత అయింది. మహాగౌరిగా విలసిల్లింది. ఈ మాతను ఉపాసిస్తే కల్మషాలన్నీ పోతాయి. సంచితపాపం నశిస్తుంది. భవిష్యత్తులో పాపాలు, ధైన్యాలు దరిచేరవు. ఈ తల్లిని ధ్యానించి, స్మరించి, పూజించి ఆరాధించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి. నైవేద్యంగా చక్కెర పొంగలి (గుడాన్నం) సమర్పించాలి.

9. నవమి - సర్వసిద్ధి ధాత్రి
సిద్ధం గంథర్వయక్షాద్వైః అసురైరమరైరపి|
సేవ్యమానా సదా భూయాత్‌ సిద్ధిదా సిద్ధిదాయినీ||
మార్కండేయ పురాణంలో అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈశిత్వ, వశిత్వ, సర్వకామావసాయిత, సర్వజ్ఞత, దూరశ్రవణ, పరకాయ ప్రవేశ, వాక్సిద్ధి, కల్పవృక్షత్వ, సృష్టిసంహరీకరణ, అమరత్వం, సర్వనాయకత్వం, భావసిద్ధి అని అష్టసిద్ధులు చెప్పబడ్డాయి.
ఈ తల్లి పరమశివుడితో కలసి అర్థనారీశ్వరుడిగా అవతరించింది. చతుర్భుజి. సింహవాహనాన్ని అధిరోహించింది. కమలవాసిని. కుడిచేతుల్లో గదను, చక్రాన్ని, ఎడమచేతుల్లో శంఖాన్ని, కమలాన్ని ధరించింది. ఈ మాతను ఉపాసించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. లౌకిక, పారలౌకిక మనోరథాలునెరవేరతాయి.నైవేద్యంగా పాయసాన్నం సమర్పించాలి.

10.దశమి రోజున అమ్మవారు చిద్విలాసిని రాజరాజేశ్వరి.

ఈ పండుగను పదిరోజులు చేసినా రాత్రులు మాత్రం తొమ్మిదే. దశమి రోజున అమ్మవారు రాజేశ్వరి అవతారంలో రాక్షససంహారం చేసింది. ఎంతో ప్రశాంతతతో, చిరునవ్వుతో సకల విజయాలు ప్రసాదిస్తుంది. నైవేద్యంగా చిత్రాన్నం, లడ్డూలు సమర్పించాలి.
అలాగే సువాసినీ పూజ. ప్రతిరోజూ ఒక మల్లెపూవును అమ్మవారిగా భావనచేసి ఆమెకు సర్వ ఉపచారాలు చేసి, వస్త్రం, ఫలం సమర్పించాలి. ఈ పది రోజులూ పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు పంచిపెడితే సౌభాగ్యం లభిస్తుంది. దేవీభాగవత పారాయణం, శ్రీదేవీ సప్తశతీ నిత్యపారాయణం శ్రేష్ఠం. దుర్గా ద్వాత్రింశమాలాస్తోత్రం 108సార్లు పారాయణం చేస్తే అఖండ ఫలితాలు లభిస్తాయి, అలాగే కుమారీపూజను ఆచరించి మంచి ఫలితాలను పొందవచ్చు. రోజుకొక బాలికను పూజించాలి. వివిధ వయస్సులవాళ్ళు ఉంటే మంచిది. కేవలం 10 ఏళ్లలోపు బాలికలు మాత్రమే ఉండాలి. భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లి కరుణను కోరితే తప్పక ఆమె కరుణిస్తుంది.

అందరికీ నవదుర్గల అనుగ్రహం అమ్మలగన్న అమ్మ శ్రీ రాజరాజేశ్వరి అనుగ్రహం కలిగి సుఖసంతోషాలతో ఉండాలని కోరుకొంటూ సమస్తలోకా సుఖినోభవంతు.
శుభసాయంత్రం!!
మనకు కోపం వచ్చే ఒక్కక్షణాన్ని
అదుపులో ఉంచుకోగలిగితే
బాధపడే వేలాదిక్షణాలను తప్పించుకోవచ్చు.!!!


Monday, September 26, 2016

నక్షత్ర గాయత్రి ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి

( నక్షత్ర గాయత్రి ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి))
1.అశ్విని
ఓం శ్వేతవర్ణై విద్మహే
సుధాకరాయై ధిమహి
తన్నో అశ్వినేన ప్రచోదయాత్

2.భరణి
ఓం కృష్ణవర్ణై విద్మహే
దండధరాయై ధిమహి
తన్నో భరణి:ప్రచోదయాత్
3.కృత్తికా
ఓం వణ్ణిదేహాయై విద్మహే
మహాతపాయై ధీమహి
తన్నో కృత్తికా ప్రచోదయాత్
4.రోహిణి
ప్రజావిరుధ్ధై చ విద్మహే
విశ్వరూపాయై ధీమహి
తన్నో రోహిణి ప్రచోదయాత్
5.మృగశిరా
ఓం శశిశేఖరాయ విద్మహే
మహారాజాయ ధిమహి
తన్నో మృగశిర:ప్రచోదయాత్
6.ఆర్ద్రా
ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే
పశుం తనాయ ధిమహి
తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్
7.పునర్వసు
ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే
అదితి పుత్రాయ ధిమహి
తన్నో పునర్వసు ప్రచోదయాత్
8.పుష్య
ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే
మహాదిశాయాయ ధిమహి
తన్నో పుష్య:ప్రచోదయాత్
9.ఆశ్లేష
ఓం సర్పరాజాయ విద్మహే
మహారోచకాయ ధిమహి
తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్
10.మఖ
ఓం మహా అనగాయ విద్మహే
పిత్రియాదేవాయ ధిమహి
తన్నో మఖ: ప్రచోదయాత్
11.పుబ్బ
ఓం అరియంనాయ విద్మహే
పశుదేహాయ ధిమహి
తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్
12.ఉత్తరా
మహాబకాయై విద్మహే
మహాశ్రేష్ఠాయై ధీమహి
తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్
13.హస్త
ఓం ప్రయచ్చతాయై విద్మహే
ప్రకృప్రణీతాయై ధీమహి
తన్నో హస్తా ప్రచోదయాత్
14.చిత్తా
ఓం మహాదృష్టాయై విద్మహే
ప్రజారపాయై ధీమహి
తన్నో చైత్రా:ప్రచోదయాత్
15.స్వాతి
ఓం కామసారాయై విద్మహే
మహాని ష్ఠాయై ధీమహి
తన్నో స్వాతి ప్రచోదయాత్
16.విశాఖ
ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే
మహాశ్రేష్ఠాయై చ ధీమహీ
తన్నో విశాఖ ప్రచోదయాత్
17 అనూరాధ
ఓం మిత్రదేయాయై విద్మహే
మహామిత్రాయ ధీమహి
తన్నో అనూరాధా ప్రచోదయాత్
18.జ్యేష్ఠా
ఓం జ్యేష్ఠాయై విద్మహే
మహాజ్యేష్ఠాయై ధీమహి
తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్
19.మూల
ఓం ప్రజాధిపాయై విద్మహే
మహాప్రజాధిపాయై ధీమహి
తన్నో మూలా ప్రచోదయాత్
20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై వి
ఓం ప్రజాధిపాయై విద్మహే
మహాప్రజాధిపాయై ధీమహి
తన్నో మూలా ప్రచోదయాత్
20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై విద్మహే
మహాబీజితాయై ధిమహి
తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్
21.ఉత్తరాషాఢ
ఓం విశ్వేదేవాయ విద్మహే
మహాషాఢాయ ధిమహి
తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్
22. శ్రవణ
ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే
పుణ్యశ్లోకాయ ధీమహి
తన్నో శ్రవణ ప్రచోదయాత్
23.ధనిష్ఠా
ఓం అగ్రనాథాయ విద్మహే
వసూప్రితాయ ధీమహి
తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్
24.శతభిషం
ఓం భేషజాయ విద్మహే
వరుణదేహాయ ధీమహి
తన్నో శతభిషా ప్రచోదయాత్
25.పూర్వాభాద్ర
ఓం తేజస్కరాయ విద్మహే
అజరక పాదాయ ధీమహి
తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్
26.ఉత్తరాభాద్ర
ఓం అహిరబుధ్నాయ విద్మహే
ప్రతిష్ఠాపనాయ ధీమహి
తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్
27.రేవతి
ఓం విశ్వరూపాయ విద్మహే
పూష్ణ దేహాయ ధీమహి
తన్నో రేవతి ప్రచోదయాత్ .....

Saturday, September 24, 2016

కొంత మందికి అయినా కనువిప్పు కలుగుతుంది ఈ ఈ కథ చదివితే!!!
ఆమెకి అత్తగారితో అస్సలు పడటం లేదు.
ఆమెతో నిత్యం వాదులాటే... రోజూ మాటలయుద్ధమే.
ఇక ఉండలేననుకుంది.
తండ్రి దగ్గరకి వచ్చి "నాన్నా.... ఈ అత్తని అంతం చేసెయ్యాలి... అది బతికున్నంతకాలం నాకు శాంతి లేదు. కాసింత విషం ఇవ్వు నాన్నా
.....ఆ ముసలి దాన్ని చంపేస్తాను.
పీడ విరగడౌతుంది." అంది.
తండ్రి "సరేనమ్మా... అయితే ఆమె ఉన్నట్టుండి చనిపోతే అందరికీ నీ మీదే అనుమానం వస్తుంది. కాబట్టి నెమ్మదినెమ్మదిగా పనిచేసే విష మూలికలు ఇస్తాను.
అన్నంలో కలిపి ఇవ్వు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆమెతో ప్రేమ నటించు. ఆమె చెప్పినట్టుచెయ్యి.
ఆమెకి కూడా నువ్వు విషo ఇస్తున్నట్టు అనుమానం రాకూడదు. నీ భర్తకూ అనుమానం రాకూడదు." అన్నాడు.
ఆయన విషం ఇచ్చాడు.
కూతురు తెచ్చుకుంది.
రోజుకింత అన్నంలో కలిపి అత్తకు పెట్టడం మొదలుపెట్టింది.
ఆమె పట్ల ప్రేమగా వ్యవహరించేది. అత్తా అత్తా అంటూ ఆమె చుట్టూ తిరిగేది.
అత్త మాటలన్నా పట్టించుకునేది కాదు. సేవలు చేస్తూనే ఉండేది.
అటు అత్తలోనూ క్రమీపీ మార్పు రావడం మొదలైంది.
"నా కోడలు బంగారం" అంటూ పదిమందికీ చెప్పుకోవడం మొదలుపెట్టింది.
కూతురు పట్ల ఎంత ప్రేమ చూపేదో కోడలు పట్లా అంతే ప్రేమ చూపించేది.
ఇంకొన్నాళ్లకి కోడలు మనసులో పశ్చాత్తాపం మొదలైంది.
"అయ్యో ఇంత మంచి అత్తను చంపుకుంటున్నానా... నా' చేజేతులా విషం పెడుతున్నానా?" అని బాధ పడసాగింది.
ఉండబట్టలేక తండ్రి దగ్గరికి పరుగుపరుగున వెళ్లింది.
"నాన్నా ... విషానికి విరుగుడు ఇవ్వు నాన్నా... అంత మంచి ఆమెను చంపుకోలేను. ఆమె నాకు అమ్మ తరువాత అమ్మ లాంటిది." అంటూ కన్నీరు పెట్టుకుంది.
తండ్రి నవ్వాడు.
"అమ్మా... నేనిచ్చిన దానిలో విషం లేదు. అవి బలం మూలికలు మాత్రమే... వాటిలో విషం లేదు...
విషం నీ మనసులో ఉండేది... ఇప్పుడు అది కూడా విరుగుడైపోయింది." అన్నాడు.
సర్వేజనా సుఖినోభవంతు.
చాలా చక్కగా వ్రాసారెవరో :-

అమృతాన్ని వర్షించు అమ్మయను మాట మరచి,
మృతశరీరాన్ని స్ఫురింపజేసే మమ్మీయను మాట నేర్చిరి!

నాన్నాయనగ, ప్రేమమీరగ విశ్వమంతను చూపే తండ్రిని,
డ్యాడ్ అంటూ బ్యాడ్ గా డమ్మీని చేసిరి!

అమ్మా నాన్నల ప్రేమ కలగలపిన అన్నను,
బ్రోదర్ అంటూ బరువూ భాద్యత లేనివానిగ మార్చిరి!

తమ్ముడూ అను మురిపాల పిలుపునకు కూడా,
ఒకటే పదం అంటూ సెలవిచ్చిరి!

అక్కాయనగ, అవ్యాజానురాగమైన ప్రేమను అనంతంగా కురిపించు
అమృతమూర్తిని, సిస్ టర్ అంటూ మిస్ చేసిరి!

చెల్లీయనగా,  కష్టాల్లో నాకంటూ తోడుగా నా అన్న వున్నాడంటూ
భ్రమించే చెల్లికి కూడా, ఒకటే పదమంటూ సొద పెట్టిరి!

సంస్కారాన్ని తెలిపే నమస్కారాన్ని,
హెలో, హాయ్ అంటూ జాయ్‌గా ఎంజాయ్‌గా మార్చిరి !

యుగానికే ఆది తెలుగు వుగాది, సంస్కృతీ సంబరాలను మరచి, తల్లుల రోజు, తండ్రులరోజు, ప్రేమికుల రోజు,ఆంగ్ల సంవస్తరాది విందుల మత్తులో మునిగితేలిరి?

సుమతి లోపించి, వేమనను మరచి, తెలుగున సంభాషించు వాడిని చిన్నచూపు జూచి,
ఆంగ్లము అరకొరగా, అస్తవ్యస్తముగా పలికినా, చిలక పలుకులని భ్రమించసాగిరి?

వేయి మాటలేల, అత్తకు పిన్నమ్మకు, మామకు పెద్దయ్యకు,
బోడిగుండుకు మోకాలికి ముడి వేసినట్లుగా, ఒక్కటే పదమనిరి

అక్షరాలు తక్కువై, ఇఛ్ఛానుసారం పదాలను పొందుజేసి,
పెంపొందింపజేసిన ఎంగిలిభాష, విశ్వభాష యెట్లయ్యనో?

సుధామధురిమలొలుకు పరిపూర్ణ అమృతఘటము వంటి
తేట తెనుగు, విశ్వము నుండి కనుమరుగు యెట్లు కాజొచ్చొనో?
యెంత ఆలోచించినను, అవగతం కాకుండె వినర తెనుగు రాయుడా!!?

 తెలుగుభాషాభిమానులైన మాన్యులందరకీ వందనం, శుభాభినందనం

Friday, September 23, 2016

మహాలయ పక్షం.

మహాలయ పక్షం.
మన సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుందాం ..ఆచరిద్దాం ...తరిద్దాం!!!మహాలయ పక్షం అంటే ఏమిటి? మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది?
మహాలయ పక్షం సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమై అక్టోబర్ నాలుగో తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి, వారికి నమస్కారము చేస్తూ, ” నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి’ అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.

భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.

తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య (అక్టోబర్ 4) నైనా చేసి తీరాలి.

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.

ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.

కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.

ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

Thursday, September 15, 2016

చమత్కార పద్యం

చమత్కార పద్యం
అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
నక్షరంబు జిహ్వకిక్షురసము
అక్షరంబు తన్ను రక్షించుగావున
నక్షరంబు లోకరక్షితంబు
మానవులకు చదువు కావాలి. చదువుకు నాలుకకు చెరుకు రసం వంటిది. చదువు మనల్ని రక్షిస్తుంది.కాబట్టి మనం చదువును రక్షించాలి.

*అనంత పద్మనాభ చతుర్దశి శుభాకాంక్షలు*

జై శ్రీమన్నారాయణ 
అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం :
*అనంత పద్మనాభ చతుర్దశి శుభాకాంక్షలు* 
శ్లో..||
అనంతానంత దేవేశ అనంత ఫలదాయక|
అనంత దుఃఖ నాశస్య అనంతాయ నమో నమః||
అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు జరుపు కొనే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం. ఇది హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది.
ఎంతో పూర్వ కాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండటం విశేషం. పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయమని చెప్పాడట.
అనంతుడన్నా, అనంత పద్మనాభ స్వామి అన్నా సాక్షాత్తూ కాలమే అన్నాడు. యుగ, సంవత్సర, మాస తదితర కాలం అంతా తన స్వరూపమన్నాడు. అనంత పద్మనాభుడంటే కాల స్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే శ్రీకృష్ణుడు. పాల కడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు నుండి వచ్చిన పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల-కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి
ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది. వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంతపద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో ఏడు పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది. దర్భలతో చేసిన పామును మూతపెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూప భావన కనిపిస్తుంది. వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకొన్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు, ఒక పోకచెక్క, ఓ వెండి నాణెం వేస్తుంటారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు. అనంత పద్మనాభ స్వామి పూజలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. పద్నాలుగు లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం, పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్ల కొకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలచుకోవటం కోసమే.
ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముంటుంటారు.
వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించినవారు జన్మజన్మలకూ కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని, ఇంటికి వెళ్లి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరకు వెళ్లి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకొంటుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్న అని భావించింది. తన లేగదూడకు కడుపునిండా పాలుపట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి దర్శ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలచుకుంటారు.

Tuesday, September 13, 2016

*ధర్మో రక్షతి రక్షితః*

*ధర్మో రక్షతి రక్షితః*
యజ్ఞం జరుగుతోంది.
యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది.
ఆయన ఆశ్చర్యపోయాడు. 
అప్పుడు భార్య చెప్పింది. "నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది."
ఇంటి యజమాని పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు.
మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.
ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
"యజ్ఞం పవిత్రమైనది.
యజ్ఞ కుండం పవిత్రమైనది.
యజ్ఞం చేయడం నా ధర్మం.
నా కర్తవ్యం.
బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు" అన్నాడాయన.
ఊరు ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
ఆయన భార్యకు ఇది నచ్చలేదు. "మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం" అని నచ్చచెప్పింది.
అర్కసోమయాజి ససేమిరా అన్నాడు.
చివరికి ఆమె కోపంతో పుట్టింటికి పయనమైంది.
ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు.
ఊరి పొలిమేర దాటాడో లేదో... ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నై. మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.
అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.
అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు.
"ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసంచేశాను." అన్నాడు కలిపురుషుడు.

అన్నదాత సుఖీభవ!!!

"అన్నం పరబ్రహ్మస్వరూపం" అని ఎందుకు అంటారు?
ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఎప్పుడన్నా అన్నం వదిలేస్తే పెద్దవాళ్ళు అన్నం అలా పారవేయకూడదు, "అన్నం పరబ్రహ్మస్వరూపం" అని అంటారు. అలా ఎందుకు అంటారు అని ఎప్పుడన్నా పెద్దవాళ్ళను అడిగినా చిన్నపిల్లలు 100శాతం నమ్మేలా కారణం చెప్పరు. నిజానికి ప్రతి జీవి పుట్టకముందే ఆ జీవికి కావలసిన ఆహారపదార్ధాలు ఈ భూమి మీద పుట్టిస్తాడు ఆ భగవంతుడు.అందుకే ఏ జీవి ఈ నేల మీద పడ్డా నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దవాళ్ళు అంటారు. అంటే మనము ఈ భూమి మీద పడకమునుపే మనకు ఇంత ఆహారం అనీ, ఇన్ని నీళ్ళు అని ఆ భగవంతుడు మన పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల లెక్కలు వేసి ఆహారాన్ని, నీళ్ళను, మనము ఎవరికి పుట్టాలో కూడా నిర్ణయించి ఈ భూమి మీదకు పంపుతాడు. ఎప్పుడైతే ఒక జీవికి ఆయన ప్రసాదించిన నీళ్ళు, ఆహారం అయిపొతాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లి ఆ జీవికి ఆయువు పూర్తి అయిపోతుంది.
అందుకే మీకు పెట్టిన ఆహారం కానీ నీళ్ళు కానీ వృధా చేయకుండా నీకు అక్కరలేదు అనిపించినప్పుడు ఎవరికన్న దానం ఇవ్వడం వలన నీకు పుణ్యఫలం పెరిగి నీకు ఇచ్చిన ఆహారం కానీ నీళ్ళు కానీ మరి కొంచం పెరిగి ఆయుష్మంతుడవు అవుతావు.లేదా నీకు అని ఆ దేవదేవుడు ఇచ్చిన ఆహారాన్ని నేలపాలు చేస్తే నీకు లెక్కగా ఇచ్చిన ఆహారం తరిగి నీ ఆయువు తరిగిపోతుంది. ఏ తల్లి అయినా చూస్తూ చూస్తూ బిడ్డ ఆయువు తరిగిపోవడం చూడలేక అన్నం పారవేయకు అని పదిసార్లు చెబుతుంది, అవసరమైతే దండిస్తుంది. ఇదంతా మీకు వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మస్వరూపం పారవేయవద్దు అని మాత్రమే చెబుతారు.
అందుకే అన్ని దానాలలోకి అన్నందానం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ భూమి మీద ఉన్న ఏ జీవికైనా ఆహారం పెడితే కడుపునిండా తిని నిండు మనస్సుతో పెట్టినవారిని ఆశీర్వదిస్తారు.
అన్నదాత సుఖీభవ!!!

                                                             శుభోదయం../\..


కనిపించని దేవుడికన్నా
మనల్ని కనిపెంచిన అమ్మానాన్నలే మిన్న
మన దగ్గర అష్టైశ్వర్యాలు ఎన్ని ఉన్నా 
కన్న తల్లితండ్రులను ప్రేమించలేని
జీవితం సున్నా



Friday, September 9, 2016

పిల్లలు.... పెద్దలు..ఇది మన కోసమే !

పిల్లలు.... పెద్దలు..ఇది మన కోసమే !

మీరు పుట్టగానే మొదటి స్పర్శ అమ్మదే అని మీకు తెలుసు కదూ అయితే ఇది మీరు తప్పక చదవాల్సిందే మరి !

అమ్మ నిజంగా ఎంత అందమైన పదమో కదూ ,పదమే అందమైనది అనుకుంటే పొరపాటే అమ్మ చేసిన ప్రతి పని కూడా అందంగానే ఉంటుంది ,అమ్మ మాట అందం ,చిరునవ్వు అందం అమ్మ పిలుపుకూడా అందమైనదే అందుకే అమ్మ అన్న పిలుపులోనే అమృతం నిండినట్లు ఉంటుంది కదూ .

మొట్టమొదటి సారి మీరు గర్భాలయములో ప్రవేశించగానే ప్రపంచంలోని ఆనందమంతా తన సొంతం అయినట్లు మురిసిపోతుంది “అమ్మ అవుతున్న ఆడది.” కాని మిమ్మల్ని మోసే తొమ్మిది నెలలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటుంది అమ్మ .వేవిళ్ళ పేరుతో కలిగే వికారాన్ని భరిస్తూ వాంతులను చేసుకొంటూ ప్రతి క్షణం ఎంతో ఆయాస పడుతూ తొమ్మిది నెలలను గడుపుతుంది.

అమ్మ ......మీరు ఈ రంగుల ప్రపంచానికి వచ్చే ముందు ప్రసవ వేధనతో ప్రాణాలతో పోరాడి మనల్ని కంటుంది అమ్మ ,కొన్ని సార్లు కొంతమంది తల్లులు ప్రాణాలే వదిలేస్తారు .
మీ పెంపకంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మీ అధరాలపై ధరహాసం కోసమై వాళ్ళ మనసులో బాధను కళ్ళలో కన్నీటిని మీకు కానరానీయకుండా దాచేసుకునే అమృతమూర్తులే “మీ అమ్మా నాన్నలు”.మీ ఉన్నతిని కోరుకునే వాళ్ళు మీ నుంచి వినరాని మాటలు విన్నా “చిన్నపిల్లలు “అని సరిపెట్టుకుంటారు కాని మిమ్మల్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే తట్టుకునే శక్తి తల్లితండ్రులకు ఉండదు .అలాంటి అమ్మా నాన్నలను ఎన్నో మరెన్నో విధాలుగా మీకు తెలిసో తెలియకో నొప్పించే ఉంటారు . వాళ్ళు మీ కోసం మీ ఉన్నతి కోసం ఎంత ఆరాట పడుతున్నారో ఆలోచించి అలాంటి అమ్మా నాన్నల పెరిగిన పరిస్థితికి మిమ్మల్ని వాళ్ళు పెంచుతున్న రీతికి తేడా తెలుసుకొని మథర్స్ డే ఫాదర్స్ డే రోజునే కాకుండా ప్రతి రోజు ఒక్క సారైనా వాళ్ళు పడుతున్న ఆరాటాన్ని అర్ధం చేసుకొని మీరు చేస్తున్న పొరపాట్లను సరిదిద్దుకుంటారు కదూ !

అమ్మ నాన్నలు తన పిల్లల ఆలనా పాలనే కాదు ప్రపంచంలో సంతోషమంతా తనపిల్లలకే దక్కాలి అనుకొనే స్వార్ధపరులు కూడా అమ్మానాన్నలు ,అందరి పిల్లల్లో తనపిల్లలే అందమైన వారు తెలివైన వారు అని పొంగి పోతారు .ఏ వస్తువు చూసినా ,ఏ బట్టలు చూసినా ఇవి నా పిల్లలకు సొంతమైతే బాగున్ను అని ఆరాటపడతారు .మీ ఆశయసాధనలో నిరంతరం వెన్నంటి ఉంటూ వాళ్లకు తెలిసిన సాయం చేస్తూనే ఉంటారు అమ్మానాన్నలు .కష్టాల కన్నీళ్లను వాళ్ళు దాచుకొని చిరునవ్వుల జీవితాన్ని మీకు పంచడానికి అహర్నిశలు శ్రమించేవారే అమ్మానాన్నలు .

అమ్మా నాన్న చదువుకునే రోజుల్లో ఒక రూపాయి వాళ్ళ చేతిలో ఉందంటే అంటే ఎంతో గొప్ప విషయం కాలికి చెప్పులు కూడా లేకుండా నడిచే స్కూల్ కి వెళ్ళేవాళ్ళు .కాని మీకు అలా కాదు కదా !

రోజు ఉదయాన్నే ఇడ్లీ ,దోశా ,పెసరట్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో పేరుతో టిఫిన్ మీరు తింటున్నారు కాని వాటిలో ఏ వస్తువు తినాలి అన్నా అదేదో పెద్ద పండగ రోజు అయివుండాలి .రోజు ఉదయాన్నే రాత్రి మిగిలిన అన్నాన్నే నీళ్ళు వేసుకొని తినేవారు చాలా మంది .మరి మీ ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు ఏమి తింటుంటారో ఓ సారి గమనించండి .

చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా చదివించే స్తోమత లేని తల్లితండ్రులు, చీకటి పడితే ఇంట్లో వెలుతురు ఉండాలంటే ఏ కిరోషిన్ లాంతరో వెలిగించుకునే వారు .ఇప్పుడు మీ చుట్టూ మిరుమిట్లు గొలిపే కాంతి ఉన్నా మీ మనసు మీ ఆలోచనలు చీకటి వైపు పయనిస్తుంది .
చదువుకోవాలన్న ఆసక్తి నుంచి చదువు కొనే స్థాయికి వచ్చేసాం మేము .

చదువు కొనే అలవాటు నుంచి చదువుకోవాలన్న ఆసక్తి పెంచుకుంటే “ప్రతి ఒక్క విద్యార్ది ఓ మహోన్నతమైన వ్యక్తిగా చరిత్రలో మీకంటూ ఓ పేజిని సృష్టించుకుంటారు”
అమ్మాయి అయినా అబ్బాయి అయినా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కలలు కనే ప్రతి అమ్మా నాన్నల మనసులో మాటలే ఇవి చదవండి మరి ........

నీ లక్ష్య సాధన కోసమై నా నుంచి ఎంతో దూరంగా వెళ్లావు .నీ ఎడబాటు నన్ను బాధిస్తున్నా .నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందాలనే ఆరాటంలో నా బాధను మరిచి .నీకు ప్రతినిత్యం కళ్ళముందు కదలాలనే ఆలోచన అప్పుడప్పుడూ అక్షర రూపం దాలుస్తుంది.బహుశ ఇది ఉత్సాహాన్ని ఇచ్చి సరికొత్త ఆలోచనలకు ఊపిరి పోయవచ్చు .

కాని ఈ రోజుల్లో యువత ప్రవర్తన చూస్తుంటే అప్పుడప్పుడు నన్ను బయపడేలా చేస్తుంది .మళ్ళీ అంతలోనే నా పెంపకంలో నిజాయితీ నా చిట్టితల్లిపై ఉన్న నమ్మకం జ్ఞప్తికి వచ్చి మళ్ళీ నీ ముందుకు వచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాయి నా మదిలో మెదిలే ఆలోచనలు .

నీవు చెప్పినట్లు పిల్లలు లేని తల్లితండ్రులు ఉండవచ్చేమో కాని తల్లితండ్రులు లేని పిల్లలు ఎక్కడా పుట్టరు.పుట్టేది ఒకేలా ఐనా పెరగడంలో చాలా తేడాలు ఉంటాయి.నీ లాంటి ఆణిముత్యం మా ఇంట పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం .ఎలాంటి పరిస్తితిలోనూ మా ఆ అభిప్రాయాన్ని మారనీయకుండా చూసుకోవాల్సిన భాద్యత నీదే .

నీలో దాగి ఉన్న అంతర్గత శక్తిని ప్రతిభను వెలికి తీసుకునేందుకు నీకు ఇదే సరైన అవకాశం.ఆ అవకాశాన్ని అన్ని విధాలా నీకు అనుకూలంగా మలచుకునేందుకు పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడంలో ఎన్నడు వెనకడుగు వేయవద్దు .నీ జీవితంలో ప్రాధాన్యతను బట్టి వాటికి కావలసిన ప్రణాళికలు వేసుకోవాలి.నీ బలహీనతలే నీ బంగారు భవితకు అవరోధాలనేది అక్షర సత్యం .

స్నేహం చేయడంలో తప్పులేదు కాని స్నేహం ముసుగులో మోసపూరితమైన ఆలోచనలు చేసే వాళ్ళను గమనించడం కూడా చాలా అవసరం .అలాగే సమస్యని బట్టి సాటి మనిషిగా నీ స్నేహితులకు సహాయపడటం కూడా ఓ మంచి సుగుణం .ప్రతి రోజులో ప్రతి సెకను చాలా అమూల్యమైనది ఆ సమయాన్ని దుర్వినియోగం చేసి తరువాత బాధ పడటంలో అర్ధమే ఉండదు.సమయం సాగిపోతూనే ఉంటుంది .ఆ సమయంతో పోటీ పడి పరుగులు తీస్తూ నలుగురికి ఉపయోగపడే నాణ్యమైన జీవితాన్ని అందుకోవాలని కోరుకునే .........మీ అమ్మ ...

శుభోదయం


సమాజానికి బ్రాహ్మణుల సేవ

సమాజానికి బ్రాహ్మణుల సేవ

*******సమాజానికి బ్రాహ్మణుల సేవ*****
బ్రాహ్మణులేం చేశారో గమనిద్దాం.
పాణిని సంస్కృత వ్యాకరణం వ్రాశాడు.
ఆయన వ్రాసిన పద్ధతిలో కొన్ని భాషలకు వ్యాకరణాలు వ్రాశారని తెలుస్తోంది.
కణాద మహర్షి వైశేషిక తర్కశాస్త్రం రచించాడు.
దానిలో ప్రపంచం పరమాణువులతో నిర్మింపబడిందని తెలిపాడు.
గౌతముడు వ్యవసాయం చేసి కరవుతో బాధపడే వారికి అన్నం పెట్టాడు.
ఆయన కార్యకారణ భావాన్ని, పదార్థ లక్షణాలను తెలిపే న్యాయశాస్త్రం రచించాడు
. పతంజలి యోగసూత్రాలు వ్రాసి ఆరోగ్యం పొందడానికి దారిచూపాడు.
చరకుడు ఆయుర్వేదం ద్వారా జనం ఆరోగ్య రక్షణకు బాట ఏర్పరచాడు.
సుశ్రూతుడు శస్తచ్రికిత్స ద్వారా ఆరోగ్య రక్షణకు ప్రయత్నించాడు.
ధన్వంతరి ఆయుర్వేద మూల పురుషుడు,
అగ్నివేశుడు వైద్య గ్రంథకర్త,
అష్టాంగ హృదయకర్త వాగ్భటుడు.
అత్రి, భరద్వాజుడు, ఆత్రేయుడు, గౌతముడు మొదలైనవారు ఆయుర్వేద ప్రవర్తకులు.
ఆంగ్లేయ వైద్యము భారతదేశంలో ప్రవేశించడానికి పూర్వం ఈ ఆయుర్వేదమే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడింది గదా!
అత్రిముని ‘అందరు సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంతో ఉండాలి, అందరూ శుభం పొందాలి. ఒక్క రు కూడా దుఃఖం పొందకూడదు అని బోధించాడు.
దానికనుగుణంగా ఆయన భార్య అనసూయ కరవుకాలంలో పంట పండించి అందరికీ అన్నదానం చేసింది.
యాస్కు డు పదాల వ్యుత్పత్తిని తెలిపే నిరుక్తం రచించాడు.
ఆర్యభటుడు ఖగోళానికి చెందిన అనేక విషయా లు తెలిపాడు. భూమి తిరుగుతుందని చెప్పిన శాస్తవ్రేత్త ఆయన. భాస్కరుడు
లీలావతీ గణిత శాస్త్రాన్ని రచించారు.
చాణక్యుడు అర్థశాస్త్రం రచించాడు. ఆ జ్ఞానంతో వౌర్య చంద్రగుప్తుని ప్రభువుగా చేశాడు.
మహామంత్రి తిమ్మరుసు విజయనగర సామ్రాజ్యానికి చేసిన సేవలు ప్రసిద్ధాలు
ఇక లోకానికి ఆనందాన్ని కల్గించే కావ్యాలు, నాటకాలు, కృతులు రచించిన మహానుభావులు సంస్కృతంలోను, దేశ భాషలలోను వందల సంఖ్యలో ఉన్నారు.
ధ్వని మా ర్గాన్ని కనుగొన్న ఆనందవర్ధనుడు......
ఔచిత్య విచార చర్చ చేసిన క్షేమేంద్రుడు.....
అభిజ్ఞాన శాకుంతలం రచించిన కాళిదాసు....
నాట్యశాస్త్రాన్ని రచించిన భరతుడు,
నీతి శాస్త్రం రచించిన శుక్రుడు,
కామశాస్త్రాన్ని రచించిన వాత్స్యాయనుడు,
పంచతంత్రం ద్వారా నీతి బోధ చేసిన విష్ణుశర్మ వీరందరూ బ్రాహ్మణులే కదా!
కృషి పద్ధతిని రచించినవాడు పరాశరుడు....
సుధన్వోపాధ్యాయుడు ధనుర్వేద గురువులలో ఒకడు....
కృష్ణమాచార్యుడు ధనుర్విద్యా విలాసమునకు రచయిత.
సంగీత రత్నాకరాన్ని రచించినవాడు శార్జ్ధర దేవుడు.
రుద్రభట్టు స్వర నిర్ణయం రచించాడు.
శిల్ప శాస్త్రం గర్గపరాశరులవలన విశ్వకర్మకు లభించింది.
నీలకంఠ భట్టు, విశ్వనాథ దేవుడు, నరహరి భట్టు, విశ్వనాథ ద్వివేది శిల్పశాస్త్ర గ్రంథాలను వ్రాశారు.
మానసార ముని రచించినది మానసారం. ఇది గృహ నిర్మాణ విషయాలనేకం తెల్పింది.
ఇక తెలుగులో ......
నన్నయభట్టు మొదలయిన కవుల గురించి తెలిపితే అదో పెద్ద గ్రంథమవుతుంది. ఇవన్నీ సమాజానికి మేలు కలిగించేవి కావా?
రూపాయి చేతితో తాకకుండా సాధన చేసి ఏ మతం ద్వారానైనా పరతత్త్వాన్ని పొందుతారని నిరూపించి, విశ్వమత ప్రవక్త వివేకానందుని తయారుచేసిన రామకృష్ణ పరమహంస,
అమెరికాలో యోగమార్గం ప్రచారం చేసిన పరమహంస యోగానంద, భారతదేశంలో యోగ గంగను ప్రవహింపజేసిన రామ్‌లాల్ ప్ర భూజీ బ్రాహ్మణులే.
గడచిన శతాబ్దాలలో.....
సంఘ సంస్కర్త, మహారచయిత, కవి కందుకూరి వీరేశలింగం పంతులు...
తన సర్వస్వం దేశంకోసం సమర్పించిన టంగుటూరి ప్రకాశం పంతులు, వావిలాల గోపాలకృష్ణయ్య,
శాస్తవ్రిజ్ఞాన ప్రచారకులు కొమర్రాజు లక్ష్మణరావు పంతులు, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప ఇంజనీరు మోక్షగుండం విశే్వశ్వరయ్య, గొప్ప ఆయుర్వేద వైద్యులు, బహుగ్రంథకర్త, పండిత గోపాలాచార్యులు ఇలా ఎందరి పేర్లయినా చెప్పవచ్చు. ప్రతి రంగంలో వారి కృషి తరువాతి వారికి మార్గదర్శకంగా ఉండేలా చేసిన వారెందరో!
ఆధునికులలో గేయ కవులలో గురజాడ, శ్రీశ్రీ, ఆరు ద్ర, సాంప్రదాయక కవులలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్య ఇలా ఎందరినో పేర్కొనవచ్చు.
భారతదేశంలో ఏ పార్టీకి మెజార్టీరాని పరిస్థితిలో ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి అయిదు సంవత్సరాలు మధ్యలో ఎన్నికలు రాకుండా నెట్టుకుని వచ్చిన పి.వి.నరసింహారావు, ఇలా ప్రతి రంగంలోనూ సమాజానికి మేలుచేసిన బ్రాహ్మణులనెందరినైనా చెప్పవచ్చు.
పత్రికా రంగంలో ముట్నూరి కృష్ణారావు, నీలంరాజు వెంకట శేషయ్య, భావరాజు నరసింహారావు మొదలైనవారు అంకితభావంతో పనిచేసినవారే. మచిలీపట్నంలో ముట్నూరి కృష్ణారావు, డాక్టర్ పట్ట్భా సీతారామయ్య, కోపల్లె హనుమంతరావు ఆంధ్ర జాతీయ విద్యాపరిషత్తు నెలకొల్పి, ఒకప్రక్క స్వాతంత్య్రోద్యమ కృషి కొనసాగిస్తూ జాతీయ విద్యావ్యాప్తికి కృషిచేశారు. ఆ ఊరిలో రాంజీ పంతులు హరిజనులలో విద్యావ్యాప్తికి అంకితమయ్యారు. ఆయన స్థాపించిన పాఠశాల ఇప్పటికీ నడుస్తున్నది.
ఇంతెందుకు? లోకమాన్య బాలగంగాధర తిలక్, మో తీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ ఆశయాలకు అంకితమయిన భూదానోద్యమం నిర్వహించిన తపస్వి వినోభాభావే, ఆ కాలంలోనే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నెలకొల్పిన మదనమోహన మాలవ్యా బ్రాహ్మణులే గదా! వీరందరు సమాజానికి చేసిన మేలు చాలదంటారా? ఇంతకంటే ఈ విమర్శకుల వర్గం సమాజానికి చేసిన అధికమైన మేలు ఏమిటి?
పూర్వం చేశారు కాని ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించవచ్చు. ఇపుడు బ్రాహ్మణులు జీవన పోరాటంలో ఉన్నారు. కాబట్టి ఎల్లాగో శ్రమపడి ఏదో దేశానికి వెళ్ళి తన చాకచక్యం, కృషి పట్టుదలతో జీవిస్తున్నాడు. అలా వెళ్ళలేనివారు బ్రతుకుబండి భారంగా ఈడుస్తున్నారు. మేధావి, సంపన్నుడు ఎలాగో జీవిస్తాడు. సామాన్యుని మాటేమిటి? పూర్వం ధర్మం, నీతి, దయ, అహింస వంటి సుగుణాలను అలవరచిన కాలంలో స్వాతంత్య్ర సంపాదనమో, సామ్యవాదమో పరమధర్మమని భావించి ఎందరో యువకులు తమ సర్వస్వం వెచ్చించి దానికి అంకితమయ్యారు. సంపన్నులు కొందరయినా తమ డబ్బు గుడికో, బడికో ఇచ్చి చెరువోనుయ్యో తవ్వించి జన్మధన్యమయిందనుకునేవారు. తమ డబ్బుతో పేదలకు సాయం చెయ్యడంవల్ల పేదలకు వారిపై గౌరవం ఉండేది. దాతలకు పుణ్యం, భగవదనుగ్రహం లభిస్తాయనే తృప్తిఉండేది. ఇపుడు పాప పుణ్య విశ్వాసాలు తొలగిపోతున్నాయి. గుడులకు వెళ్ళినా కోరికలు తీరడానికి తప్ప, భగవదనుగ్రహంకోసం అనే పద్ధతి తగ్గింది.
ఇప్పుడు అకారణంగా బ్రాహ్మణులు సోమరులని, వీరి కులం ఉత్పత్తికి సంబంధించినది కాదని, వారు పేద వారైనా సహకరించవద్దని ప్రచారం చేస్తే బాధ, ద్వేషం కలగడం తప్ప దానివల్ల సమసమాజం రాదు. పూర్వం గురుస్థానాల్లో ఉన్న వర్గం ధర్మం చెబితే సమాజం పాటిం చేది. ఇప్పుడు తల్లిదండ్రులనే అనాధాశ్రమాల్లో చేర్పిస్తు న్నారు. రామా యణ, భారతాలు చదివితే మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, శౌచం, ఓరిమి, జ్ఞానం, సత్యం పల కం, పరిశుద్ధత, అహింస, దయ, దొంగతనం చేయక పోవడం ఇలాంటి సుగుణాలు అవలర్చుకోవాలని తెలుస్తాయ. అందువల్ల జనహితం కోరేవారు విశాల హృదయంతో సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలి. అంతేకాని ఒక కులాన్నో, వర్గాన్నో నిందిస్తే జరిగే పనా ఇది.

Total Pageviews