Monday, September 5, 2016

గురుపుజోత్సవం అంటూ చాలా మంది చాలా పోస్టింగ్స్ చేస్తూనే ఉన్నాం .కాని పిల్లలకు మొట్టమొదటి గురువులమైన తల్లితండ్రులం కొన్ని విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొని రాబోయే తరానికి కాబోయే ఉపాధ్యాయులకు ,డాక్టర్ లకు ,ఇంజనీర్ లకు ,పోలీష్ లకు ,ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉద్యోగాలలో చేరే వాళ్లకు మనం ఇచ్చే అమూల్యమైన కానుక డబ్బు ,ధనం కానే కాదు.చాలా మంది తల్లితండ్రులు అనుకుంటారు మంచి స్కూల్ లో చదివిస్తున్నాం అని ,అన్ని సౌకర్యాలను అందిస్తున్నాం అని .
తెలిసీ తెలియక మాట్లాడే వాళ్ళలాగే మనం కూడా పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం ఆ పేదింటి అమ్మాయిని చూడు ,ఆ అబ్బాయిని చూడు కనీశం వాళ్ళ అమ్మా నాన్నకు అక్షరాలు కూడా రావు అయినా సరే మంచి మార్కులు తెచ్చుకొని రాంక్ లు సాధిస్తున్నారు కాని నీకోసం ఎంత ఖర్చు చేస్తున్నామో నీవు ఎప్పుడైనా ఆలోచించావా అని అనడమే కాకుండా మనమేదో దేశాన్ని ఉద్దరించినట్లు మేము చదువుకునేటప్పుడు అసలు ఎలాంటి సదుపాయాలూ ఉండక పోయినా బాగా చదువుకునేవాళ్ళం తెలుసా అంటూ నసపెడుతుంటాం .
కాని వాళ్ళు పడుతున్న మానసిక సంఘర్షణను మనం అర్ధం చేసుకోం ఒక్క సారి మీరే కొన్ని విషయాలు ఆలోచించండి
1.ఆ రోజుల్లో విషపూరితమైన ఆలోచనలు కలిగివుండే మనుషులే తక్కువ అందులో చిన్నపిల్లలు యుక్తవయస్కులలో ఇంకా తక్కువనే చెప్పాలి స్నేహానికి ప్రాణం పెట్టేవారు ఉండేవారు కాని ఇప్పుడు ఎవరితో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో ఎవరు ఎవరిని ఎలా ఎందుకు మోసం చేస్తారో అన్న ఆలోచన ఒకవైపు .
2.ఉపాధ్యాయుల మాటకి వస్తే ఎక్కాల నుంచి గుణింతాల వరకు మనకు వచ్చేవరకు చిరు చిరు దండనలు దండించి అయినా మనకు వంటబట్టించేవారు . కాలేజి చదువులు చదువు మొదలయినా మనమీద ఎన్నో కళ్ళు దండయాత్రలు చేసి మనం చేసిన ఏ చిన్న తప్పుకో శిక్షలు విధించి సక్రమమైన మార్గాన్ని తెలియచేప్పేవారు . మరి ఈ రోజుల్లో అంతటి ఓపికా సహనాలు ఉపాధ్యాయులకు ఉన్నాయా.చదువుకోవాలి తెలుసుకోవాలి అన్న ఆలోచన ఉన్నా వాటిని చెప్పే నాధుడు లేక తల్లడిల్లిపోయే చిన్నారులు కూడా ఉండనేవున్నారు
3.ఇక సదుపాయాల విషయానికి వస్తే హాస్టల్ జీవితాన్ని గడిపే విద్యార్దుల్లో అభద్రతా బావంతో పాటు సమయానికి భోజనం చెయ్యాలన్నా కష్టమే ,కొన్ని స్కూల్ ,కాలేజి ,హాస్టల్ లలో బాత్రూమ్ కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది .కొన్ని సార్లు స్నానానికి కూడా నీరు కరువైన సందర్బాలు కూడా చాలా ఉన్నాయి .అలాంటి పరిస్తితిలో పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఆలోచించం .
4.ఇక విజ్ఞానం పెంచుకునే దిశగా నెట్ ఇంట్లో అడుగు పెట్టి అవసరమైన సమాచారాన్ని వెదకాలని ప్రయత్నించే విద్యార్దులకు ముందుగా కళ్ళముందుకు వచ్చేవి అశ్లీల దృశ్యాలతో నిండిన వీడియోలు అలాంటి పరిస్తితిలో పిల్లల మనసు ఏ దిశగా అడుగులు పడతాయి ?
5.ఇక కుటుంబపరంగా ఆలోచిస్తే కనీశం పిల్లలతో గడిపే సమయం కూడా లేని వాళ్ళం అయిపోయాం కుటుంబంలో అమ్మా నాన్న ఉంటే ఓ చెల్లి ,తమ్ముడో లేదా ఆ ఒక్కరే మరి ఆ ఒంటరితనం వాళ్ళను ఎంతలా క్రుంగదీస్తుందో మనం గుర్తించే సాహసం చెయ్యం అలా ఆలోచిస్తే ఎక్కడ వాళ్ళ చిన్న చిన్న సరదాలు తీర్చాల్సి వస్తుందో అని ఇక్కడ డబ్బు కాదు ముఖ్యం వాళ్ళ మనోభావాలను పంచుకునే నా అనే వాళ్ళ ఆప్యాయాతానురాగాలు ముఖ్యం .ఉమ్మడి కుటుంబాలు మాయమయ్యాక కలిగిన అసౌకర్యం తాతయ్య నానమ్మ ,పిన్ని ,చిన్నాన్న ,అత్తయ్య మామయ్యా అంటే ఏమిటో తెలియని పిల్లలు కూడా ఉండనే ఉన్నారు .
6.ఇక సినిమాలు గురించి అంటే చెప్పనే చెప్పలేము తల్లితండ్రులు పిల్లలు కలిసి చూసే సినిమాలే కరువయ్యాయి .
7.యుక్తవయసులో శారీరక,మానసికమార్పులతో పాటు,ధూమ,మద్యపానాలకు అలవడి చెడు వ్యవహారాలలో ఉండే విద్యార్దుల మద్య ఓ విద్యార్ది ఇంకా మంచిగా ఉన్నాడు అంటే బహుశా అది వాళ్ళ మానసిక ద్రుడత్వమే అని చెప్పాలి .
8.పోటీ ప్రపంచంలో పరుగులు పెట్టే చిన్నారుల బుజాలపై ఎంతటి భారం పడుతుందో ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది .
9.చదువుకునే వాళ్లకు అసలైన న్యాయం కరువై బాధపడే పిల్లలు కూడా చాలా మందే ఉన్నారు .చదువుకుంటాం అనుకునే చదువు దక్కక “చదువుకొని” చదువుకోవాలి అన్న ఆశక్తి లేని పిల్లల మద్య చదువుకొనే పిల్లల మానసిక యాతన ఆలోచిస్తే అర్ధం అవుతుంది వాళ్ళ మానసిక ఆందోళన .
10.వాళ్లకు అన్నీ ఇస్తున్నాం అని సంబర పడుతున్నాం కాని వాళ్ళ మనసుని చదివే ప్రయత్నం చేసి వాళ్లకు మనమే బరోశా ఇవ్వాలి అన్న ఆలోచన కోల్పోతున్నాం. చిరాకు, కోపం, ఇతర పిల్లలతో పోలిక చేస్తూ వాళ్ళ సున్నితమైన మనసు పై విష బీజాలను మనకు తెలియకుండా మనమే నాటుతున్నాం అన్న సంగతి కొంతమంది తల్లితండ్రులు ఉపాధ్యాయులు అయినా అలోచిస్తారనే ఆశతో........

No comments:

Post a Comment

Total Pageviews