Tuesday, September 27, 2016

శుభోదయం
ఓం గం గణపతయే నమః ఓం నమ:శివాయ
అర్ధం చేసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!
గణేశ శ్లోకం:- అగజానన పద్మార్కం గజాననమహర్నిశం| అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే||
అ =లేనిది,
గ=చలనము ( అంటే చలనము లేలిది=పర్వతము=హిమాలయము=దానికిరాజైన హిమవంతుని )
జ= కుమార్తె (అనగా పార్వతీదేవి)
ఆనన= ముఖమను
పద్మ= పద్మమునకు
అర్కం= సూర్యుడైనట్టి( సూర్యుని చూస్తే తామరలు అనగా పద్మములు వికసిస్తాయి. అంటే ఆ కొడుకును చూస్తే ఆ తల్లికంత ప్రేమ. ఆమె జగన్మాత కనుక మనతల్లులకి ఆదర్శం పిల్లలని చూస్తే తల్లుల ముఖం వికసిస్తుంది. మరి మనమో తల్లి తండ్రులను వృద్ధా శ్రమాల్లో చేర్పిస్తున్నాము. మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లి తండ్రులకు ప్రదక్షిణం చేసిన గణపతి కుమారస్వామికి ముల్లోకాల లోని నదుల్లో ముందుగా స్నానమాచరించి ఎదురుగా వస్తూ కనబడ్డాడు. తల్లి తండ్రులను పూజించాలని ఆ మహా గణపతి మనకి ఆదర్శంగా చేసి చూపించాడు. మనం ఆచరించాలి అప్పుడే మన పూజలు స్వీకరిస్తాడు.
గజ +అనననం =ఏనుగు ముఖము కల్గిన (నిన్ను)
అహర్+నిశం = పగలూ రాత్రి అంటే రోజంతా
అనేకదం= ఎంచ వీలు లేనంత
తం =తమరి, మీయొక్క
భక్తానాం = భక్తులలో
ఎకదం= ఒకడు
తం= తమరిని
ఉపాస్మహే= ప్రార్థించుచున్నాడు
ఈ శ్లోకములో అనేకదంతం అని ఏకదంతం అని చదువరాదు. అనేకదం తంభక్తానాం అని ఎకదం తంఉపాస్మహే అని చదువవలెను. పెద్దలు ఈ విషయంలో అందరూ సరిగ్గా ఉచ్చరించేలా (పలికేలా) చూడాలి. 
శుభం భూయాత్!! 
మణిసాయి విస్సా ఫౌండేషన్.

No comments:

Post a Comment

Total Pageviews