పిల్లలు.... పెద్దలు..ఇది మన కోసమే !
మీరు పుట్టగానే మొదటి స్పర్శ అమ్మదే అని మీకు తెలుసు కదూ అయితే ఇది మీరు తప్పక చదవాల్సిందే మరి !
అమ్మ నిజంగా ఎంత అందమైన పదమో కదూ ,పదమే అందమైనది అనుకుంటే పొరపాటే అమ్మ చేసిన ప్రతి పని కూడా అందంగానే ఉంటుంది ,అమ్మ మాట అందం ,చిరునవ్వు అందం అమ్మ పిలుపుకూడా అందమైనదే అందుకే అమ్మ అన్న పిలుపులోనే అమృతం నిండినట్లు ఉంటుంది కదూ .
మొట్టమొదటి సారి మీరు గర్భాలయములో ప్రవేశించగానే ప్రపంచంలోని ఆనందమంతా తన సొంతం అయినట్లు మురిసిపోతుంది “అమ్మ అవుతున్న ఆడది.” కాని మిమ్మల్ని మోసే తొమ్మిది నెలలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటుంది అమ్మ .వేవిళ్ళ పేరుతో కలిగే వికారాన్ని భరిస్తూ వాంతులను చేసుకొంటూ ప్రతి క్షణం ఎంతో ఆయాస పడుతూ తొమ్మిది నెలలను గడుపుతుంది.
అమ్మ ......మీరు ఈ రంగుల ప్రపంచానికి వచ్చే ముందు ప్రసవ వేధనతో ప్రాణాలతో పోరాడి మనల్ని కంటుంది అమ్మ ,కొన్ని సార్లు కొంతమంది తల్లులు ప్రాణాలే వదిలేస్తారు .
మీ పెంపకంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మీ అధరాలపై ధరహాసం కోసమై వాళ్ళ మనసులో బాధను కళ్ళలో కన్నీటిని మీకు కానరానీయకుండా దాచేసుకునే అమృతమూర్తులే “మీ అమ్మా నాన్నలు”.మీ ఉన్నతిని కోరుకునే వాళ్ళు మీ నుంచి వినరాని మాటలు విన్నా “చిన్నపిల్లలు “అని సరిపెట్టుకుంటారు కాని మిమ్మల్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే తట్టుకునే శక్తి తల్లితండ్రులకు ఉండదు .అలాంటి అమ్మా నాన్నలను ఎన్నో మరెన్నో విధాలుగా మీకు తెలిసో తెలియకో నొప్పించే ఉంటారు . వాళ్ళు మీ కోసం మీ ఉన్నతి కోసం ఎంత ఆరాట పడుతున్నారో ఆలోచించి అలాంటి అమ్మా నాన్నల పెరిగిన పరిస్థితికి మిమ్మల్ని వాళ్ళు పెంచుతున్న రీతికి తేడా తెలుసుకొని మథర్స్ డే ఫాదర్స్ డే రోజునే కాకుండా ప్రతి రోజు ఒక్క సారైనా వాళ్ళు పడుతున్న ఆరాటాన్ని అర్ధం చేసుకొని మీరు చేస్తున్న పొరపాట్లను సరిదిద్దుకుంటారు కదూ !
అమ్మ నాన్నలు తన పిల్లల ఆలనా పాలనే కాదు ప్రపంచంలో సంతోషమంతా తనపిల్లలకే దక్కాలి అనుకొనే స్వార్ధపరులు కూడా అమ్మానాన్నలు ,అందరి పిల్లల్లో తనపిల్లలే అందమైన వారు తెలివైన వారు అని పొంగి పోతారు .ఏ వస్తువు చూసినా ,ఏ బట్టలు చూసినా ఇవి నా పిల్లలకు సొంతమైతే బాగున్ను అని ఆరాటపడతారు .మీ ఆశయసాధనలో నిరంతరం వెన్నంటి ఉంటూ వాళ్లకు తెలిసిన సాయం చేస్తూనే ఉంటారు అమ్మానాన్నలు .కష్టాల కన్నీళ్లను వాళ్ళు దాచుకొని చిరునవ్వుల జీవితాన్ని మీకు పంచడానికి అహర్నిశలు శ్రమించేవారే అమ్మానాన్నలు .
అమ్మా నాన్న చదువుకునే రోజుల్లో ఒక రూపాయి వాళ్ళ చేతిలో ఉందంటే అంటే ఎంతో గొప్ప విషయం కాలికి చెప్పులు కూడా లేకుండా నడిచే స్కూల్ కి వెళ్ళేవాళ్ళు .కాని మీకు అలా కాదు కదా !
రోజు ఉదయాన్నే ఇడ్లీ ,దోశా ,పెసరట్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో పేరుతో టిఫిన్ మీరు తింటున్నారు కాని వాటిలో ఏ వస్తువు తినాలి అన్నా అదేదో పెద్ద పండగ రోజు అయివుండాలి .రోజు ఉదయాన్నే రాత్రి మిగిలిన అన్నాన్నే నీళ్ళు వేసుకొని తినేవారు చాలా మంది .మరి మీ ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు ఏమి తింటుంటారో ఓ సారి గమనించండి .
చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా చదివించే స్తోమత లేని తల్లితండ్రులు, చీకటి పడితే ఇంట్లో వెలుతురు ఉండాలంటే ఏ కిరోషిన్ లాంతరో వెలిగించుకునే వారు .ఇప్పుడు మీ చుట్టూ మిరుమిట్లు గొలిపే కాంతి ఉన్నా మీ మనసు మీ ఆలోచనలు చీకటి వైపు పయనిస్తుంది .
చదువుకోవాలన్న ఆసక్తి నుంచి చదువు కొనే స్థాయికి వచ్చేసాం మేము .
చదువు కొనే అలవాటు నుంచి చదువుకోవాలన్న ఆసక్తి పెంచుకుంటే “ప్రతి ఒక్క విద్యార్ది ఓ మహోన్నతమైన వ్యక్తిగా చరిత్రలో మీకంటూ ఓ పేజిని సృష్టించుకుంటారు”
అమ్మాయి అయినా అబ్బాయి అయినా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కలలు కనే ప్రతి అమ్మా నాన్నల మనసులో మాటలే ఇవి చదవండి మరి ........
నీ లక్ష్య సాధన కోసమై నా నుంచి ఎంతో దూరంగా వెళ్లావు .నీ ఎడబాటు నన్ను బాధిస్తున్నా .నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందాలనే ఆరాటంలో నా బాధను మరిచి .నీకు ప్రతినిత్యం కళ్ళముందు కదలాలనే ఆలోచన అప్పుడప్పుడూ అక్షర రూపం దాలుస్తుంది.బహుశ ఇది ఉత్సాహాన్ని ఇచ్చి సరికొత్త ఆలోచనలకు ఊపిరి పోయవచ్చు .
కాని ఈ రోజుల్లో యువత ప్రవర్తన చూస్తుంటే అప్పుడప్పుడు నన్ను బయపడేలా చేస్తుంది .మళ్ళీ అంతలోనే నా పెంపకంలో నిజాయితీ నా చిట్టితల్లిపై ఉన్న నమ్మకం జ్ఞప్తికి వచ్చి మళ్ళీ నీ ముందుకు వచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాయి నా మదిలో మెదిలే ఆలోచనలు .
నీవు చెప్పినట్లు పిల్లలు లేని తల్లితండ్రులు ఉండవచ్చేమో కాని తల్లితండ్రులు లేని పిల్లలు ఎక్కడా పుట్టరు.పుట్టేది ఒకేలా ఐనా పెరగడంలో చాలా తేడాలు ఉంటాయి.నీ లాంటి ఆణిముత్యం మా ఇంట పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం .ఎలాంటి పరిస్తితిలోనూ మా ఆ అభిప్రాయాన్ని మారనీయకుండా చూసుకోవాల్సిన భాద్యత నీదే .
నీలో దాగి ఉన్న అంతర్గత శక్తిని ప్రతిభను వెలికి తీసుకునేందుకు నీకు ఇదే సరైన అవకాశం.ఆ అవకాశాన్ని అన్ని విధాలా నీకు అనుకూలంగా మలచుకునేందుకు పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడంలో ఎన్నడు వెనకడుగు వేయవద్దు .నీ జీవితంలో ప్రాధాన్యతను బట్టి వాటికి కావలసిన ప్రణాళికలు వేసుకోవాలి.నీ బలహీనతలే నీ బంగారు భవితకు అవరోధాలనేది అక్షర సత్యం .
స్నేహం చేయడంలో తప్పులేదు కాని స్నేహం ముసుగులో మోసపూరితమైన ఆలోచనలు చేసే వాళ్ళను గమనించడం కూడా చాలా అవసరం .అలాగే సమస్యని బట్టి సాటి మనిషిగా నీ స్నేహితులకు సహాయపడటం కూడా ఓ మంచి సుగుణం .ప్రతి రోజులో ప్రతి సెకను చాలా అమూల్యమైనది ఆ సమయాన్ని దుర్వినియోగం చేసి తరువాత బాధ పడటంలో అర్ధమే ఉండదు.సమయం సాగిపోతూనే ఉంటుంది .ఆ సమయంతో పోటీ పడి పరుగులు తీస్తూ నలుగురికి ఉపయోగపడే నాణ్యమైన జీవితాన్ని అందుకోవాలని కోరుకునే .........మీ అమ్మ ...

No comments:
Post a Comment