పెళ్ళికావలసిన young పురోహితులను పెళ్ళిచేసుకోవడాన్కి ఆడపిల్లలు ఇష్టపడడంలేదని చాలామందిబాధపడుచున్నారు.ఇది చాలా శోచనీయం.దీనికి ముఖ్యకారణం ఒక పురోహితుని భార్య సిగ్గు పడుతూనే వివరించింది.తన భర్త పూజలుచేస్తే అభ్యంతరం లేదు,వారు గౌరవంగా సమర్పించుకున్న దక్షిణ తాంబూలాలు స్వీకరించి,హుందాగా వస్తే,ఆయనగుఱించి అందరూ మంచిగామాట్లాడుతుంటే బాగానేవుంటుంది.వారు కూడ నేర్చుకున్నంతవరకు చక్కగా నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ ధర్మబద్ధమైన,జీవితం గడుపుచూ,వారు చేయించిన పూజలలో అనవసరమైనవి కొనిపించి,ఆవస్తువులను పూజానంతరం మూటకట్టుకొని ఇంటికి తీసుకెళ్ళడంవంటి కక్కూర్తి బుద్ధులు లేకుండా Royalగా వుంటే అందరూ తప్పక గౌరవిస్తారు.అసలు ఏదోవిధంగా భగవంతుని స్మరించని మతం వుందా? వేదంచదువుకోవడం అంటే మామూలువిషయం కాదు.పరీక్షలో కాపీ కొట్టి పాసయేంత సులభంకాదు.నిష్ఠగా గురువుగారి దగ్గరభక్తిపూర్వకంగా వినయంగా నేర్చుకుంటేగాని ఒంటబట్టదు. యువ పురోహితులు కూడ కేవలం ఉదరపోషణనిమిత్తమే కాకుండా ఆధ్యాత్మికతను కూడ దృష్టిలో వుంచుకొని పవిత్రఆశయము కలిగి ,మంచి నడవడిక కలిగి ,మితాహార నియమాలతో ఆరోగ్యంగావుంటే,అన్నీకలసివచ్చి,ఏరికోరి పెళ్ళిచేసుకుంటారు.ఇప్పటి పరిస్థితిమారి, కావాలని వేదం చదువుకుని సంపాదనలో వున్నవారిని కోరుకొనేరోజులు వస్తాయి.ఎవరూ నిరాశపడవద్దు.ఈనాటిsoftware లే మిమ్మల్ని వెతుక్కుని వస్తారు. ఇది నిజం.వేదాన్ని నమ్ముకున్నవాడు చెడిపోవడం జరగదు.
No comments:
Post a Comment