Friday, September 30, 2016

ఈ కాలం బఫె భోజనాలగురించి వ్యంగ్యగా వ్రాశారు.డా.పొన్నాడ కృష్ణసుబ్బారావు   గారు.

రుచులవి జాతివి మారెను/
పచనపు కళ మారిపోయి పడమటి వంటల్ /
కిచెనుల దూరెను మెల్లగ/
శుచియగు మన భావములను శూన్యము చేయన్

గుత్తి వంకాయ కూరా లేదు ,
గుమ్మడికాయ పులుసూ లేదు !
అరటికాయ వేపుడు లేదు ,
అదిరే కొబ్బరి చట్నీ లేదు !
కొత్తావకాయ ఊసే లేదు ,
కొత్తిమీర చారూలేదు !
కందా బచ్చలి మరిచారయ్యా !
గుమ్మడి వడియం విడిచారయ్యా !

పలావు వుందని వడ్డించారు !
ఉల్లీరైతా ఉందన్నారు !
రుచిపచి తెలీని 'కూరే' సారు !
మిక్సుడు పికిల్ కూరేసారు !
బూరీ గారీ నోదిలేసారు !
బూందీ లడ్డూ మార్చేశారు !

గులాబు జామూన్ ఉందన్నారు
లైనులో జనాలు ముందున్నారు !

అయిసు క్రీముకేసడిగేసాకా ,
అయిపోయుంటుందన్నారొకరు !
ప్లేటుని చేతిలో పట్టుకుని ,
ఓ చేతిని జేబులొ పెట్టుకుని ,
బఫే లైనులో నుంచుంటే ,
బఫూన్ లా భలేగా వుంది !

కుర్చీ బల్లా తీసేశారు !
కుదురుగ నిలుచుని తినమన్నారు !
తల్లీ పిల్లా తల్లడిల్లినా ,
ముసలీ ముతకా ముక్కి చూసినా !
బఫే తీరులో బలముందన్నారు !
గొర్రె మూక విని తలవంచారు !

పెద్దా చిన్నా పరుగులె పరుగులు !
ముద్ద కోసమొక యుద్దపు తలపులు !

No comments:

Post a Comment

Total Pageviews