జోహార్! రవీంద్రనాధా! జయహో! విజయహో! అమర్ నాధా!!
ప్రకృతి గురించి ప్రకృతి ఒడిలో పాఠాలా?
ఇంతకాలానికి బడులు ఎలావుండాలో,
ఎలాంటి బడులలో
ఎలాంటి చదువులు నేర్పించాలో
అందరికీ తెలిపే గుణపాఠాలా?
ఓహ్! ఇవి మామూలు బడులలో
మామూలు గురువులు నేర్పే పాఠాలు కావు సుమా
కాదు సుమా కల కాదు సుమా!
అవి రవీంద్రనాధుని కలల శాంతినికేతన గీతాలు
మా అమర్ నాధుని పలకబడి పలుకుబడి
తెలిపే పురాతన నవజీవన పాఠాలు!
జయోస్తు! గురువులకు!
దిగ్విజయోస్తు! నిర్వాహకులకు
జోహార్! రవీంద్రనాధా! జయహో! విజయహో! అమర్ నాధా!!
No comments:
Post a Comment